Tata Motor
-
జూన్‌లో లాంచ్ అయ్యే కార్లు: లగ్జరీ నుంచి ఈవీ వరకు..
2026 మే నెలలో భారత ఆటోమొబైల్ మార్కెట్లో అనేక కొత్త కార్లు లాంచ్ అయ్యాయి. ఇందులో టాటా టియాగో ICE, టియాగో ఈవీ, హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్, ఎంజీ మెజెస్టర్, బీఎండబ్ల్యూ ఎం440ఐ కన్వర్టిబుల్, మెర్సిడెస్ జీఎల్ఈ, జీఎల్ఎస్ స్పెషల్ ఎడిషన్స్, మినీ కూపర్ ఎస్ వంటి మోడళ్లు ఉన్నాయి. ఇక 2026 జూన్ నెలలో కూడా లాంచ్ కావడానికి కొన్ని కార్లు సిద్ధంగా ఉన్నాయి.మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ ఫేస్లిఫ్ట్మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ ఫేస్‌లిఫ్ట్ జూన్ 15న భారతదేశంలో లాంచ్ కావడానికి సిద్ధమైంది. ఇది మొదటిసారి ప్లగ్-ఇన్ హైబ్రిడ్ (PHEV) వెర్షన్‌గా వస్తోంది. ఇందులో 3.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్.. ఎలక్ట్రిక్ మోటార్ కలిపి 435 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 0-100 కి.మీ వేగాన్ని కేవలం 5.7 సెకన్లలో చేరుతుంది. కొత్త డిజైన్‌లో భాగంగా పెద్ద గ్రిల్, కొత్త హెడ్లైట్లు, ఎల్ఈడీ టెయిల్ లైట్లు, లేటెస్ట్ ఎంబీయూఎక్స్ సూపర్‌స్క్రీన్ వంటి ఫీచర్లు ఉన్నాయి.బీఎండబ్ల్యూ ఎక్స్6 ఎం60ఐబీఎండబ్ల్యూ ఎక్స్6 ఎం60ఐ కూడా జూన్ నెలలోనే లాంచ్ కానుంది. ఇది 4.4 లీటర్ ట్విన్ టర్బో V8 ఇంజిన్‌తో 523 హార్స్ పవర్ ఉత్పత్తి చేస్తుంది. కూపే SUV డిజైన్‌తో స్పోర్టీ లుక్ కలిగిన ఈ కారు కేవలం 4.3 సెకన్లలో 0-100 కి.మీ వరకు వేగవంతం అవుతుంది.హోండా జెడ్ఆర్-వీహోండా కంపెనీ తన జెడ్ఆర్-వీ ధరలను ఈ నెలలో (జూన్) ప్రకటించే అవకాశం ఉంది. ఇది హైబ్రిడ్ ఎస్‌యూవీగా 184 హార్స్ పవర్ అందిస్తుంది. లెవల్-2 ADAS సేఫ్టీ ఫీచర్లు, బోస్ సౌండ్ సిస్టమ్ వంటి ఆధునిక సౌకర్యాలు ఇందులో ఉన్నాయి.స్కోడా కొడియాక్ ఆర్ఎస్స్కోడా కోడియాక్ ఆర్ఎస్ కూడా స్పోర్టీ SUVగా రానుంది. ఇది శక్తివంతమైన ఇంజిన్‌తో పాటు స్పోర్ట్స్ డిజైన్, లగ్జరీ ఇంటీరియర్ కలిగి ఉంటుంది. ఇది 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ పొందనుంది. కాబట్టి సాధారణ కోడియాక్ కంటే 60 హార్స్ పవర్, 80 ఎన్ఎమ్ టార్క్ ఎక్కువ ఉత్పత్తి చేస్తుంది. ఇది 7-స్పీడ్ DCT గేర్‌బాక్స్ పొందుతుంది.టాటా సియెర్రా ఈవీఇండియన్ మార్కెట్లో మంచి అమ్మకాలతో ముందుకు దూసుకెళ్తున్న టాటా సియెర్రా ఈవీ రూపంలో కూడా దేశీయ విఫణిలో లాంచ్ కానుంది. ఇది ఈ నెలలో లాంచ్ కానున్న అత్యంత ఆసక్తికరమైన మోడళ్లలో ఒకటి. ఈ కారు సింగిల్ ఛార్జ్‌పై 500 కి.మీకి పైగా రేంజ్ ఇవ్వగలదని అంచనా. ఇది రియర్ వీల్ డ్రైవ్, ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్లతో రానుంది.ఇదీ చదవండి: విన్‌ఫాస్ట్ హవా.. భారత్‌లో 10వేల యూనిట్లు! -
2026 టియాగో ఈవీ లాంచ్: ధర రూ.4.70 లక్షలు!
దేశీయ వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్.. తమ ప్రసిద్ధ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ అయిన 'టియాగో ఈవీ'ను కొత్త హంగులతో ఫేస్‌లిఫ్ట్ (టాటా టియాగో ఈవీ ఫేస్‌లిఫ్ట్) రూపంలో లాంచ్ చేసింది. ఈ లేటెస్ట్ మోడల్ ప్రారంభ ధర రూ. 6.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). అయితే దీనిని బాస్ (BaaS) స్కీమ్ కింద రూ.4.69 లక్షల ప్రారంభ ధర వద్ద కొనుగోలు చేయవచ్చు.2026 టాటా టియాగో కొత్త డిజైన్, లేటెస్ట్ ఫీచర్లు, మెరుగైన ఇంటీరియర్‌తో మధ్యతరగతి కుటుంబాలు, యువతను ఆకర్షించేలా తయారైంది.డిజైన్ విషయానికి వస్తే.. ఇది సాధారణ మోడల్ కంటే కూడా మరింత స్టైలిష్‌గా కనిపిస్తుంది. కొత్త ఫ్రంట్, రియర్ బంపర్లు కారుకు స్పోర్టీ లుక్ ఇస్తాయి. ముందుభాగంలో బ్లాంక్డ్ ఆఫ్ గ్రిల్ ఉండటం వల్ల ఇది ఈవీ అని స్పష్టంగా అర్థమవుతోంది. బ్లాక్ కలర్ ఓఆర్వీఎంలు, విండో లైన్, కొత్త వీల్ డిజైన్ కూడా ఇందులో చూడవచ్చు. ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, ఎల్ఈడీ టెయిల్‌ల్యాంప్స్ వల్ల రాత్రివేళల్లో మంచి విజిబిలిటీ లభిస్తుంది. టెయిల్‌గేట్‌పై టియాగో ఈవీ అని ఉండటం కూడా గమనించవచ్చు.ఈ కారు లోపల 10.25 ఇంచెస్ ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఉంటుంది. ఫ్రీ-స్టాండింగ్ కలర్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, రీడిజైన్ చేసిన సెంటర్ కన్సోల్, టూ-స్పోక్ స్టీరింగ్ వీల్ కార్కు ప్రీమియం ఫీల్ అందిస్తాయి. వెనుక సీట్లలో ఉండే ప్రయాణికుల కోసం రియర్ ఏసీ వెంట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.పవర్ట్రైన్ విషయంలో ఎలాంటి మార్పు ఉండదు. కాబట్టి కొత్త టియాగో ఈవీ కూడా.. స్టాండర్డ్ మోడల్లో మాదిరిగానే రెండు బ్యాటరీ ప్యాక్ (19.2 కిలోవాట్, 24 కిలోవాట్) ఎంపికలను పొందుతుంది. పనితీరు, రేంజ్ (పరిధి) అన్నీ కూడా పాత మోడల్ మాదిరిగానే ఉంటాయి.బాస్ (BaaS) స్కీమ్ గురించిబాస్ (Battery as a Service) అనేది ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలును మరింత చవకగా, సులభంగా చేయడానికి తీసుకొచ్చిన ప్రత్యేక పద్ధతి. ఈ స్కీమ్‌లో కారు, బ్యాటరీని వేర్వేరుగా పరిగణిస్తారు. సాధారణంగా ఎలక్ట్రిక్ కారులో అత్యంత ఖరీదైన భాగం బ్యాటరీ కావడంతో.. దాని ధర మొత్తం కార్ ధరను పెంచుతుంది. కానీ బాస్ విధానంలో వినియోగదారు కారును తక్కువ ప్రారంభ ధరకు కొనుగోలు చేసి, బ్యాటరీ కోసం ప్రత్యేకంగా నెలవారీ లేదా వినియోగానికి అనుగుణంగా చెల్లింపులు చేస్తారు.ఉదాహరణకు, టాటా టియాగో ఈవీ బాస్ స్కీమ్ కింద రూ. 4.69 లక్షల ప్రారంభ ధరతో అందుబాటులో ఉండటం వల్ల, సాధారణ కొనుగోలుతో పోలిస్తే.. మొదట్లో తక్కువ మొత్తంతోనే కారును సొంతం చేసుకోవచ్చు. ఈ విధానం వల్ల ఎలక్ట్రిక్ కార్లను కొనాలనుకునే మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భారం తగ్గుతుంది. అదనంగా.. బ్యాటరీ పనితీరు లేదా మార్పిడి వంటి విషయాల్లో కంపెనీ సపోర్ట్ లభించే అవకాశం ఉంటుంది. అందువల్ల, BaaS స్కీమ్ ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తోంది.ఇదీ చదవండి: ఫాస్ట్‌ట్యాగ్ పనిచేయడం లేదా?: NHAI సూచనలివే.. -
టాటా కర్వ్ ఈవీ కొత్త మోడల్ లాంచ్
టాటా మోటార్స్ తన ఎలక్ట్రిక్ వాహనాల పోర్ట్‌ఫోలియోను మరింత బలోపేతం చేస్తూ, తన కర్వ్ ఈవీలో సరికొత్తగా ‘సిరీస్ ఎక్స్’ శ్రేణిని మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ మోడల్ ప్రారంభ ధరను రూ.16.99 లక్షలుగా (ఎక్స్ షోరూమ్ వద్ద) కంపెనీ నిర్ణయించింది.ఈ సిరీస్‌లో అకంప్లిష్డ్ ఎక్స్ 55, ఎంపవర్డ్ ఎక్స్ 55 అనే రెండు వేరియంట్లను పరిచయం చేసింది. వీటిలోని 55 కిలోవాట్ సామర్థ్యం కలిగిన బ్యాటరీ ఏకంగా 502 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. రియల్ వరల్డ్ కండిషన్స్ లో ఈ బ్యాటరీ సుమారు 400 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది.లెవెల్-2 ఏడీఏఎస్, 360-డిగ్రీ కెమెరా, పానోరామిక్ సన్‌రూఫ్, హర్మాన్ సినిమాటిక్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వంటి ప్రీమియం ఫీచర్లు ఇందులో ఉన్నాయి. వినియోగదారుల నమ్మకాన్ని పెంచేందుకు బ్యాటరీపై 15 ఏళ్ల (లైఫ్–టైమ్) హెచ్వీ బ్యాటరీ వారంటీని టాటా మోటార్స్ అందిస్తోంది.మిడ్-ఎస్యూవీ విభాగంలో ఎలక్ట్రిక్ మొబిలిటీని మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ‘సిరీస్ ఎక్స్’ శ్రేణి విడుదల చేసినట్లు టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ సీసీఓ వివేక్ శ్రీవత్స తెలిపారు. ఈ కారు ఐదు ఆకర్షణీయమైన రంగులతో పాటు ఐకానిక్ ‘డార్క్’ ఎడిషన్‌లోనూ లభించనుంది. -
468 కిమీ రేంజ్ అందించే టాటా కొత్త కారు: ధర ఎంతంటే?
టాటా మోటార్స్ కొత్త పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్‌ను అధికారికంగా లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధరలు రూ. 9.69 లక్షల (ఎక్స్-షోరూమ్, ముంబై) నుంచి ప్రారంభమవుతాయి.టాటా పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్‌లో ఒకే ఎలక్ట్రిక్ మోటారుతో జత చేసిన 40 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది ఒక ఫుల్ ఛార్జితో 468 కిమీ రేంజ్ అందిస్తుందని ఏఆర్ఏఐ సర్టిఫైడ్ చేసింది. అయితే రియల్ వరల్డ్ రేంజ్ 355 కిమీ వరకు ఉంటుందని సమాచారం. ఈ కారు 65 కిలోవాట్ ఫాస్ట్ ఛార్జర్ ద్వారా 26 నిమిషాల్లో 20 శాతం నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేసుకోగలదు.టాటా పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఇల్యూమినేటెడ్ ఛార్జింగ్ స్టేటస్ ఇండికేటర్, మూడు డ్రైవ్ మోడ్లు (ఎకో, సిటీ, స్పోర్ట్), డ్యూయల్ టోన్ డ్యాష్‌బోర్డ్, కొత్త విండో కంట్రోల్ బటన్లు, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వాయిస్ అసిస్టెడ్ సన్‌రూఫ్, వైర్లెస్ ఆపిల్ కార్ప్లే & ఆండ్రాయిడ్ ఆటో మొదలైనవి ఉన్నాయి.ఇదీ చదవండి: కారు లైఫ్ టైమ్ పెరగాలంటే.. ఇదిగో 5 జాగ్రత్తలుడిజైన్ పరంగా, రిఫ్రెష్డ్ ఫాసియా, చుట్టూ బూడిద రంగు బాడీ క్లాడింగ్, కొత్త ఎల్ఈడీ టెయిల్ లైట్స్, వెనుక భాగంలో ఎల్ఈడీ లైట్ బార్ ఉన్నాయి. మిగిలిన డిజైన్ దాదాపు సాధారణ ఏవీ పంచ్ మాదిరిగానే ఉంటుంది. -
మొన్న హ్యుందాయ్.. నేడు టాటా: పెరగనున్న కార్ల ధరలు
మారుతి సుజుకి, టయోటా కంపెనీలు తమ కార్ల ధరలు పెంచిన తరువాత.. దేశీయ దిగ్గజం టాటా మోటార్స్ కూడా తన కార్ల రేట్లను పెంచనున్నట్లు ప్రకటించింది. పెరుగుతున్న వస్తువుల ధరలు, ఖర్చులు కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ వెల్లడించింది. అయితే కొత్త ధరలు ఎప్పటి నుంచి అమలులోకి వస్తాయనే విషయాన్ని కంపెనీ వెల్లడించలేదు.కంపెనీ దాదాపు ఒక సంవత్సరం నుంచి అధిక ఇన్పుట్ ఖర్చులను ఎదుర్కొంటోంది. ఈ ప్రభావం ఇప్పుడు ధర సవరణకు కారణమైందని టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ లిమిటెడ్ (TMPVL) యోచిస్తోందని దాని మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓ శైలేష్ చంద్ర పేర్కొన్నారు.టాటా మోటార్స్ ఏ కారు ధరలను ఎంత శాతం పెంచనుంది అనే విషయాలను అధికారికంగా వెల్లడించలేదు. కొత్త ధరలను బహుశా త్వరలోనే వెల్లడించే అవకాశం ఉందని సమాచారం. ధరల పెరుగుదల అమ్మకాలపై ప్రభావం చూపుతుందా.. లేదా అనేది తెలియాల్సి ఉంది. కాగా హ్యుందాయ్ మోటార్ ఇండియా ఇప్పటికే తమ కార్ల ధరలను జనవరిలో పెంచింది. -
లక్ష బుకింగ్స్.. ఈ కారుకు ఫుల్ డిమాండ్!
టాటా మోటార్స్ ఇటీవల ప్రారంభించిన సియెర్రా.. ఏకంగా లక్ష కంటే ఎక్కువ బుకింగ్స్ సొంతం చేసుకుంది. దీంతో సంస్థ డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తిని, సరఫరాను పెంచడంపై ప్రత్యేక దృష్టి సారించింది.టాటా సియెర్రా కోసం బుకింగ్స్ ప్రారంభమైన మొదటి రోజే 70వేల బుకింగ్స్ లభించాయి. ఆ తరువాత కూడా బుకింగ్స్ పెరుగుతూ లక్ష దాటేసిందని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓ శైలేష్ చంద్ర పేర్కొన్నారు. బుక్ చేసుకున్నవారికి తొందరగా డెలివరీలు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.మార్కెట్లో లాంచ్ అయిన టాటా సియెర్రా ప్రారంభ ధర రూ. 11.49 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది నాలుగు వేరియంట్లు, మూడు పవర్ ట్రెయిన్ ఆప్షన్లు, ఆరు కలర్ స్కీంలలో లభిస్తుంది. వాహన కొనుగోలు కోసం డిసెంబర్ 16 నుంచి బుకింగ్స్ ప్రారంభమ్యాయి.సియెర్రా క్యాబిన్ కర్వ్వి మాదిరిగానే ఉంటున్నప్పటికీ.. టాటా డిజైన్ లాంగ్వేజ్‌కు ట్రిపుల్-స్క్రీన్ లేఅవుట్, సౌండ్ బార్‌తో 12-స్పీకర్ జేబీఎల్ సౌండ్ సిస్టమ్, హెచ్యూడీ, సెంటర్ కన్సోల్ వంటి వాటిలో కొత్తదనాన్ని జోడిస్తుంది. డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, లెవల్ 2 ADAS, 360-డిగ్రీల కెమెరా, పవర్డ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు ఉన్నాయి. ఐకానిక్ ఆల్పైన్ పైకప్పును ఆధునిక కాలానికి అనుగుణంగా మార్పు చేశారు. సన్ రూఫ్ కాస్త విశాలంగా ఇచ్చారు.టాటా సియెర్రా అన్ని వెర్షన్లలో ఆరు ఎయిర్ బ్యాగులు, ఏబీఎస్ విత్ ఈబీడీ, స్టెబిలిటీ ప్రోగ్రామ్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంటింగ్ పాయింట్లు ఉన్నాయి. ఇది 4.6 మీటర్ల వీల్ బేస్ తో 2.7 మీటర్ల వీల్ బేస్ ను కలిగి ఉంటుంది. టాటా సియెర్రా ఆరు ఎక్స్టీరియర్, మూడు ఇంటీరియర్ కలర్ స్కీమ్‌లలో వస్తోంది. -
వస్తున్నాయ్ కొత్త కార్లు.. ఈ నెలలో లాంచ్ అయ్యే మోడల్స్ ఇవే!
సాధారణంగా ఎవరైనా కొత్త కార్లు కొనాలంటే.. జనవరి ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తారు. అయితే ఈసారి జనవరి కంటే ఫిబ్రవరిలో లాంచ్ అయ్యే కొత్త కార్ల సంఖ్య ఎక్కువగా ఉంది.నిస్సాన్ టెక్టెన్: నిస్సాన్ కంపెనీ తన ఫ్లాగ్షిప్ మోడళ్లలో ఒకటైన టెక్టెన్‌ను ఈ నెల 4న (ఫిబ్రవరి 4) ఆవిష్కరించింది. మిడ్-సైజ్ ఎస్యూవీ విభాగానికి చెందిన ఈ కారు.. అమ్మకాల్లో హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ వంటి వాటితో పోటీ పడుతుంది. ఇది రెండు ఇంజిన్ ఎంపికలతో లభిస్తుంది. ఒకటి 100 బీహెచ్పీ పవర్ అందించే.. 1.0 లీటర్ త్రీ లీటర్ టర్బో పెట్రోల్. ఇది 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ DCTతో లభిస్తుంది. మరొకటి 163 బీహెచ్పీ పవర్ ప్రొడ్యూస్ చేసే 1.3 లీటర్ ఫోర్ సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్. ఇది 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే అందుబాటులో ఉంటుంది.ఎంజీ మెజెస్టర్: భారత మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన.. ఎంజీ మోటార్ ఇండియా కూడా ఈ నెల 12 (ఫిబ్రవరి 12) మెజెస్టర్ కారును ఆవిష్కరించనుంది. కంపెనీ ఈ కారును మొదటిసారి 2025 ఆటోఎక్స్పోలో ప్రదర్శించింది. దీని డిజైన్, ఫీచర్స్ అన్నీ కూడా.. ఇప్పటికే మార్కెట్లో అమ్మకానికి ఉన్న గ్లోస్టర్ మాదిరిగా ఉన్నప్పటికీ, కొన్ని తేడాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఇంజిన్‌లో కూడా ఎటువంటి మార్పు లేదు. గ్లోస్టర్ కారులోని అదే 2.0-లీటర్ డీజిల్ ట్విన్-టర్బో ఇంజిన్ ఉంటుంది. ఇది 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది. రియర్ వీల్ డ్రైవ్, ఆల్-వీల్ డ్రైవ్ ఫెసిలిటీలు ఉన్నాయి.బీఎండబ్ల్యూ ఎక్స్-3 30 ఎక్స్‌డ్రైవ్ ఎం స్పోర్ట్స్ ప్రో: బీఎండబ్ల్యూ కూడా ఈ నెల 16న.. ఎక్స్-3 విభాగంలో 30 ఎక్స్‌డ్రైవ్ ఎం స్పోర్ట్స్ ప్రో లాంచ్ చేయనుంది. ఇది సాధారణ స్పోర్ట్స్ వేరియంట్ మాదిరిగానే.. 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. అయితే ఈ వేరియంట్లో 48V మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్‌ను కొనసాగించారు. 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ ఉంటుంది. 6.3 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అయ్యే ఈ కారు.. 14.61 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది.మారుతి సుజుకి ఈ-విటారా: మిడ్-సైజ్ ఎస్యూవీ విభాగంలో మారుతి సుజుకి.. ఎలక్ట్రిక్ కారు ఈ విటారా, ఈ నెలలోనే లాంచ్ అవుతుంది. ఇది మహీంద్రా బీఈ6, హ్యుందాయ్ క్రెటా ఈవీ, ఎంజీ జెడ్ఎస్ ఈవీ, విన్‌ఫాస్ట్ వీఎఫ్6 వంటి మొదళ్లకు ప్రత్యర్థిగా నిలుస్తుంది. ఈ కారు ఒక ఫుల్ ఛార్జితో 543 కిమీ రేంజ్ అందిస్తుందని కంపెనీ వెల్లడించింది. రియల్ వరల్డ్ రేంజ్ అనేది కొంత తగ్గుతుంది.ఫోక్స్‌వ్యాగన్ టైరోన్: ఫోక్స్‌వ్యాగన్ టైరోన్ కూడా ఈ నెలలోనే విడుదలవుతుంది. ఇది 204 బీహెచ్పీ పవర్ అందించే 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది. 7 స్పీడ్ డీసీటీ ట్రాన్స్మిషన్ ఉంటుంది. ఆల్ వీల్ డ్రైవ్ సిస్టం ఉంటుంది. ఇందులో 15 ఇంచెస్ సెంట్రల్ టచ్‌స్క్రీన్, 10.25 ఇంచెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 3-జోన్ క్లైమేట్ కంట్రోల్, మెమరీ, హీటింగ్, వెంటిలేషన్ అండ్ మసాజ్ ఫంక్షన్లతో కూడిన పవర్డ్ ఫ్రంట్ సీట్లు, హెడ్-అప్ డిస్ప్లే, యాంబియంట్ లైటింగ్, పవర్డ్ టెయిల్‌గేట్ మొదలైన ఫీచర్స్ ఉన్నాయి.టాటా సియెర్రా ఈవీ: ఇప్పటికే పెట్రోల్ ఇంజిన్ ఎంపికలో అందుబాటులో ఉన్న టాటా సియెర్రా.. ఈ నెలలో ఎలక్ట్రిక్ రూపంలో లాంచ్ అవుతుంది. దీని డిజైన్.. సాధారణ కారు కంటే కొంత భిన్నంగా ఉంటుంది. ప్రధానంగా ఫ్రంట్ గ్రిల్ డిజైన్ కొంత ప్రత్యేకంగా ఉంటుంది. హారియర్ ఈవీ ప్లాట్‌ఫామ్‌పై నిర్మితమైన ఈ కారు.. ఆల్ వీల్ డ్రైవ్, రియర్ వీల్ డ్రైవ్ ఎంపికలలో అందుబాటులో ఉంటుంది. -
తొలిరోజే 70వేల బుకింగ్స్: ఈ కారుకు ఫుల్ డిమాండ్!
సరికొత్తగా ప్రవేశపెడుతున్న ప్రీమియం మిడ్ ఎస్యూవి ‘సియెరా’కి గణనీయంగా ఆదరణ లభిస్తున్నట్లు టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ వివేక్ శ్రీవత్స తెలిపారు. అధికారికంగా బుకింగ్స్ ప్రారంభించిన తొలి రోజునే 24 గంటల్లో ఏకంగా 70,000 పైగా ఆర్డర్లు వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. అదనంగా 1.35 లక్షల మంది కస్టమర్లు బుకింగ్ ప్రక్రియలో భాగంగా తమకు నచ్చిన కాన్ఫిగరేషన్ వివరాలను అందించినట్లు వివరించారు. మరింత విశాలంగా, విలాసవంతంగా, సౌకర్యవంతంగా లేటెస్ట్ సియెరాను తీర్చిదిద్దినట్లు ఆయన తెలిపారు.మార్కెట్లో లాంచ్ అయిన టాటా సియెర్రా ప్రారంభ ధర రూ. 11.49 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది నాలుగు వేరియంట్లు, మూడు పవర్ ట్రెయిన్ ఆప్షన్లు, ఆరు కలర్ స్కీంలలో లభిస్తుంది. వాహన కొనుగోలు కోసం డిసెంబర్ 16 నుంచి బుకింగ్స్ ప్రారంభమ్యాయి. కొత్త ఏడాది జనవరి 15 నుంచి డెలివరీలు ప్రారంభమవుతాయి.సియెర్రా క్యాబిన్ కర్వ్వి మాదిరిగానే ఉంటున్నప్పటికీ టాటా డిజైన్ లాంగ్వేజ్‌కు ట్రిపుల్-స్క్రీన్ లేఅవుట్, సౌండ్ బార్‌తో 12-స్పీకర్ జేబీఎల్ సౌండ్ సిస్టమ్, హెచ్యూడీ, సెంటర్ కన్సోల్ వంటి వాటిలో కొత్తదనాన్ని జోడిస్తుంది. డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, లెవల్ 2 ADAS, 360-డిగ్రీల కెమెరా, పవర్డ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు ఉన్నాయి. ఐకానిక్ ఆల్పైన్ పైకప్పును ఆధునిక కాలానికి అనుగుణంగా మార్పు చేశారు. సన్ రూఫ్ కాస్త విశాలంగా ఇచ్చారు.ఇదీ చదవండి: సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా?: ఇవి తెలుసుకోండివాహనం అన్ని వెర్షన్లలో ఆరు ఎయిర్ బ్యాగులు, ఏబీఎస్ విత్ ఈబీడీ, స్టెబిలిటీ ప్రోగ్రామ్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంటింగ్ పాయింట్లు ఉన్నాయి. ఇది 4.6 మీటర్ల వీల్ బేస్ తో 2.7 మీటర్ల వీల్ బేస్ ను కలిగి ఉంటుంది. టాటా సియెర్రా ఆరు ఎక్స్టీరియర్, మూడు ఇంటీరియర్ కలర్ స్కీమ్‌లలో వస్తోంది. -
మే నెలలో భారీగా తగ్గిన వాహన విక్రయాలు
ముంబై: రెండో దశ కోవిడ్ ప్రభావం దేశీయ వాహన విక్రయాలపై తీవ్ర ప్రతికూలతను చూపింది. వైరస్ కట్టడికి పలు రాష్ట్రాలు విధించిన లాక్డౌన్లతో ఉత్పత్తి, పంపిణీలకు అంతరాయం కలిగింది. వ్యాధి వ్యాప్తి కట్టడికి ఆటో కంపెనీలు కొన్నిరోజుల పాటు తమ యూనిట్లను తాత్కాలికంగా మూసివేశాయి. దీంతో ఈ ఏడాది ఏప్రిల్‌తో పోలిస్తే ఈ మే నెలలో మారుతీ సుజుకీ, హ్యుందాయ్, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్, టయోటాతో సహా అన్ని కంపెనీల అమ్మకాలు క్షీణత నమోదు చేశాయి. దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ మే నెలలో 35,293 యూనిట్లు మాత్రమే అమ్మింది. ఈ ఏప్రిల్ నెలలో అమ్మిన 1.42 లక్షల యూనిట్లతో పోలిస్తే విక్రయాలు 75 శాతం క్షీణించాయి. మే 1 నుంచి 16 వరకు కంపెనీ ప్లాంట్లను ఆక్సిజన్ తయారీకి వినియోగించడంతో ఉత్పత్తి నిలిచిపోయినట్లు కంపెనీ తెలిపింది. హ్యుందాయ్ మోటార్స్ మే నెలలో 25,001 యూనిట్లను విక్రయించింది. ఏప్రిల్ నెలలో అమ్మిన 49,002 యూనిట్లతో పోలిస్తే 49 శాతం తక్కువ. ఇదే మే నెలలో టాటా మోటార్స్ వాహన అమ్మకాలు 40 క్షీణించాయి. ఏప్రిల్‌లో 25,091 యూనిట్లను విక్రయించిన ఈ కంపెనీ మే నెలలో 15,181 వాహనాలను మాత్రమే విక్రయించింది. కియా మోటార్స్ ఏప్రిల్‌లో 16,111 యూనిట్లు విక్రయించింది. మేనెలలో 11,050 యూనిట్లకు పరిమితమైన అమ్మకాల్లో 31 శాతం క్షీణతను నమోదు చేసింది. చదవండి: భారీగా తగ్గిన యమహా ఎఫ్‌జెడ్ 25 సిరీస్ బైక్ ధరలు -
టాటా మోటార్స్ మాజీ ఎండీ ఆత్మహత్య
ముంబై: టాటా మోటార్స్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ ఆత్మహత్య కలకలం రేపింది. ప్రశాంత్ సిబ్బల్ (43) ముంబై, పరేల్‌లోని ఆయన నివాస భవనం 15 వ అంతస్తుపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు శుక్రవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో ఆయన కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. కలాచౌకీ పోలీసులు అధికారి దిలీప్ ఉగాలే అందించిన ప్రకారం ఈ సంఘటన తరువాత కల్పతరు హా బిటెంట్ భవన సొసైటీ సభ్యుడినుంచి కాల్ వచ్చింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సిబాల్నున ఆసుపత్రికి తీసుకెళ్లారు, అయితే అప్పటికే ఆయన చనిపోయినట్లుగా వైద్యులు ప్రకటించారు. అలాగే మృతిని బెడ్ రూమ్ లో ఆత్మహత్య నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన దర్యాప్తు మొదలుపెట్టారు. ఏప్రిల్ 2017 లో సిబాల్‌ను టాటా మోటార్స్ తొలగించింది. అప్పటినుంచి ఆయన తీవ్ర మానసిక ఒత్తిడితో బాధపడుతున్నారని పోలీసుల కథనం. ఈ నేపథ్యంలో ఆయన చికిత్స కూడా తీసుకుంటున్నారని సిబాల్ భార్య ధృవీకరించారని పోలీసులు తెలిపారు. ప్రమాదవశాత్తు మరణించిన కేసు నమోదు చేశామని తదుపరి దర్యాప్తు కొనసాగుతుందని జోన్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ ఎన్.ఆర్కికా చెప్పారు. అలాగే మరింత తెలుసుకోవడానికి టాటా మోటార్స్ ఉద్యోగులు కూడా ప్రశ్నించనున్నామని చెప్పారు. అయితే ప్రశాంత్ ఆత్మహత్యపై టాటా మోటార్స్ స్పందించింది. ఆయన మృతిపట్ల సంతాపం తెలిపిన సంస్థ, బాధిత కుటుంబానికి అండగా ఉంటామని ప్రకటించింది. ఏప్రిల్ లో ఆయన స్వచ్ఛంద విరమణ పథకం ఎంచుకున్నారని వివరించింది. ఈ విషయంలో దర్యాప్తు అధికారులతో పూర్తిగా సహకరిస్తున్నామని టాటా మోటార్స్ అధికార ప్రతినిధి తెలిపారు.


