జూన్‌లో లాంచ్ అయ్యే కార్లు: లగ్జరీ నుంచి ఈవీ వరకు.. | Upcoming Car Launches in India June 2026 | Sakshi
Sakshi News home page

జూన్‌లో లాంచ్ అయ్యే కార్లు: లగ్జరీ నుంచి ఈవీ వరకు..

Jun 1 2026 8:23 PM | Updated on Jun 1 2026 8:45 PM

Upcoming Car Launches in India June 2026

2026 మే నెలలో భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో అనేక కొత్త కార్లు లాంచ్ అయ్యాయి. ఇందులో టాటా టియాగో ICE, టియాగో ఈవీ, హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్, ఎంజీ మెజెస్టర్, బీఎండబ్ల్యూ ఎం440ఐ కన్వర్టిబుల్, మెర్సిడెస్ జీఎల్ఈ, జీఎల్ఎస్ స్పెషల్ ఎడిషన్స్, మినీ కూపర్ ఎస్ వంటి మోడళ్లు ఉన్నాయి. ఇక 2026 జూన్ నెలలో కూడా లాంచ్ కావడానికి కొన్ని కార్లు సిద్ధంగా ఉన్నాయి.

మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ ఫేస్‌లిఫ్ట్
మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ ఫేస్‌లిఫ్ట్ జూన్ 15న భారతదేశంలో లాంచ్ కావడానికి సిద్ధమైంది. ఇది మొదటిసారి ప్లగ్-ఇన్ హైబ్రిడ్ (PHEV) వెర్షన్‌గా వస్తోంది. ఇందులో 3.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌.. ఎలక్ట్రిక్ మోటార్ కలిపి 435 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 0-100 కి.మీ వేగాన్ని కేవలం 5.7 సెకన్లలో చేరుతుంది. కొత్త డిజైన్‌లో భాగంగా పెద్ద గ్రిల్, కొత్త హెడ్‌లైట్లు, ఎల్ఈడీ టెయిల్ లైట్లు, లేటెస్ట్ ఎంబీయూఎక్స్ సూపర్‌స్క్రీన్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

బీఎండబ్ల్యూ ఎక్స్6 ఎం60ఐ
బీఎండబ్ల్యూ ఎక్స్6 ఎం60ఐ కూడా జూన్ నెలలోనే లాంచ్ కానుంది. ఇది 4.4 లీటర్ ట్విన్ టర్బో V8 ఇంజిన్‌తో 523 హార్స్ పవర్ ఉత్పత్తి చేస్తుంది. కూపే SUV డిజైన్‌తో స్పోర్టీ లుక్ కలిగిన ఈ కారు కేవలం 4.3 సెకన్లలో 0-100 కి.మీ వరకు వేగవంతం అవుతుంది.

హోండా జెడ్ఆర్-వీ
హోండా కంపెనీ తన జెడ్ఆర్-వీ ధరలను ఈ నెలలో (జూన్) ప్రకటించే అవకాశం ఉంది. ఇది హైబ్రిడ్ ఎస్యూవీగా 184 హార్స్ పవర్ అందిస్తుంది. లెవల్-2 ADAS సేఫ్టీ ఫీచర్లు, బోస్ సౌండ్ సిస్టమ్ వంటి ఆధునిక సౌకర్యాలు ఇందులో ఉన్నాయి.

స్కోడా కొడియాక్ ఆర్ఎస్
స్కోడా కోడియాక్ ఆర్ఎస్ కూడా స్పోర్టీ SUVగా రానుంది. ఇది శక్తివంతమైన ఇంజిన్‌తో పాటు స్పోర్ట్స్ డిజైన్, లగ్జరీ ఇంటీరియర్ కలిగి ఉంటుంది. ఇది 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌ పొందనుంది. కాబట్టి సాధారణ కోడియాక్ కంటే 60 హార్స్ పవర్, 80 ఎన్ఎమ్ టార్క్ ఎక్కువ ఉత్పత్తి చేస్తుంది. ఇది 7-స్పీడ్ DCT గేర్‌బాక్స్‌ పొందుతుంది.

టాటా సియెర్రా ఈవీ
ఇండియన్ మార్కెట్లో మంచి అమ్మకాలతో ముందుకు దూసుకెళ్తున్న టాటా సియెర్రా ఈవీ రూపంలో కూడా దేశీయ విఫణిలో లాంచ్ కానుంది. ఇది ఈ నెలలో లాంచ్ కానున్న అత్యంత ఆసక్తికరమైన మోడళ్లలో ఒకటి. ఈ కారు సింగిల్ ఛార్జ్‌పై 500 కి.మీకి పైగా రేంజ్ ఇవ్వగలదని అంచనా. ఇది రియర్ వీల్ డ్రైవ్, ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్లతో రానుంది.

ఇదీ చదవండి: విన్‌ఫాస్ట్ హవా.. భారత్‌లో 10వేల యూనిట్లు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement