రూ.25 లక్షల ఇసుజు కారు: దీని గురించి తెలుసా? | 2026 Isuzu D Max V Cross Launched | Sakshi
Sakshi News home page

రూ.25 లక్షల ఇసుజు కారు: దీని గురించి తెలుసా?

Feb 23 2026 6:04 PM | Updated on Feb 23 2026 6:19 PM

2026 Isuzu D Max V Cross Launched

2026 ఇసుజు డీ-మ్యాక్స్ వీ-క్రాస్ భారతదేశంలో లాంచ్ అయింది. దీని ధరలు రూ. 25.50 లక్షల నుంచి రూ. 30.28 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉన్నాయి.

ఇసుజు డీ-మ్యాక్స్ వీ-క్రాస్ 4x2 ఆప్షన్ నిలిపివేయడంతో.. ఈ పికప్ ట్రక్ 4x4 ఎంపికలో మాత్రమే లభిస్తుంది. టయోటా హైలక్స్ ప్రత్యర్థిగా నిలిచే ఈ కారు 1.9-లీటర్ డీజిల్ ఇంజిన్ ద్వారా 161 bhp & 360 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

పరిమాణంలో పెద్దగా ఉండే ఈ పికప్ ట్రక్ డిజైన్ గంభీరంగా ఉంటుంది. ముందు భాగంలో బ్లాక్ గ్రిల్ ఉంది. 18 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ ఇందులో ఉండటం చూడవచ్చు. అయితే ఇందులో బ్లాక్ వీల్ ఆర్చ్ & సైడ్ క్లాడింగ్ లేదు. లోపలి భాగంలో 9 ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్ స్థానంలో పెద్ద 10.3 అంగుళాల టచ్‌స్క్రీన్ ఉంది. ఇది వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్‌ప్లేకు సపోర్ట్ చేస్తుంది. రూఫ్-మౌంటెడ్ 8 స్పీకర్ ఆడియో సిస్టమ్‌ కూడా ఉన్నాయి.

360-డిగ్రీల కెమెరా సెటప్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి సేఫ్టీ ఫీచర్స్ కలిగిన ఇసుజు వీ-క్రాస్ మొత్తం మూడు వేరియంట్లలో లభిస్తుంది. అవి వీ-క్రాస్ 4 డబ్ల్యుడీ ఏంటీ జెడ్, వీ-క్రాస్ 4 డబ్ల్యుడీ ఏంటీ జెడ్ ప్రెస్టీజ్, వీ-క్రాస్ 4 డబ్ల్యుడీ ఏటీ జెడ్ ప్రెస్టీజ్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement