మొన్న బజాజ్.. ఇప్పుడు హీరో మోటోకార్ప్ | ⁠Hero HF 100 Deluxe Passion Plus Become Pricier Know The Details | Sakshi
Sakshi News home page

మొన్న బజాజ్.. ఇప్పుడు హీరో మోటోకార్ప్

Jan 24 2026 2:58 PM | Updated on Jan 24 2026 3:15 PM

⁠Hero HF 100 Deluxe Passion Plus Become Pricier Know The Details

భారతదేశంలోని అతి పెద్ద టూ వీలర్ తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ తన కమ్యూటర్ మోటార్ సైకిల్ ధరలు పెంచింది. వేరియంట్‌ను బట్టి ధరలు రూ. 250 నుంచి రూ. 750 వరకు పెరిగాయి. ఇందులో హీరో HF 100 , హీరో HF డీలక్స్ & హీరో ప్యాషన్ ప్లస్ మొదలైనవి ఉన్నాయి. ఇప్పటికే బజాజ్ ఆటో కూడా తన బైక్ ధరలను పెంచింది.

ముడి సరుకుల ధరలు, ఇన్‌పుట్ ఖర్చులు పెరగడం వల్ల బైక్ ధరలను పెంచినట్లు హీరో మోటోకార్ప్ వెల్లడించింది. పెరిగిన ధరలు వెంటనే అమల్లోకి వస్తాయి. ధరల పెరుగుదల తరువాత హీరో HF100 రేటు రూ. 58,739 నుంచి 59,489 రూపాయల (ఎక్స్-షోరూమ్) వద్దకు చేరింది. హీరో HF డీలక్స్ ధరలు 56,742 రూపాయల నుంచి రూ. 69,235 (ఎక్స్-షోరూమ్) మధ్య ఉన్నాయి.

ఇండియన్ మార్కెట్లో అత్యధిక ప్రజాదరణ పొందిన హీరో మోటోకార్ప్.. భారతదేశంలో హీరో HF 100, హీరో HF డీలక్స్, హీరో ప్యాషన్ ప్లస్, హీరో స్ప్లెండర్ ప్లస్ మొదలైన మోడల్స్ విక్రయిస్తోంది. ఇవి మంచి డిజైన్, ఫీచర్స్ కలిగిస్తో ఉండటంతో పాటు.. మంచి మైలేజ్ కూడా అందిస్తున్నాయి. ఈ కారణంగానే వీటి అమ్మకాలు గణనీయంగా పెరుగుతున్నాయి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement