యాప్ లేదు, ఛార్జ్ లేదు: ఫ్రీ కాల్స్.. | BSNL launches VoWiFi Service Nationwide Know The Details | Sakshi
Sakshi News home page

BSNL: యాప్ లేదు, ఛార్జ్ లేదు: ఫ్రీ కాల్స్..

Jan 2 2026 11:00 AM | Updated on Jan 2 2026 11:06 AM

BSNL launches VoWiFi Service Nationwide Know The Details

భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL).. నూతన సంవత్సరం సందర్భంగా.. భారతదేశంలోని అన్ని టెలికాం సర్కిల్‌లలో వాయిస్ ఓవర్ వైఫై (VoWiFi) లేదా వై-ఫై కాలింగ్‌ సర్వీస్ ప్రారంభించింది. మొబైల్ సిగ్నల్ తక్కువగా ఉన్న ప్రాంతాలలో కూడా BSNL కస్టమర్‌లు Wi-Fi కనెక్షన్‌ను ఉపయోగించి కాల్స్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది.  

థర్డ్ పార్టీ యాప్స్ అవసరం లేకుండా.. మొబైల్ నంబర్‌ను ఉపయోగించి నేరుగా కాల్స్ చేసుకోవచ్చు. ఇది గ్రామీణ & మారుమూల ప్రాంతాలలోని వినియోగదారులకు ప్రయోజనం చేకూరుస్తుందని భావిస్తున్నారు. మొబైల్ నెట్‌వర్క్‌లలో రద్దీని తగ్గించడానికి కూడా ఈ సేవ సహాయపడుతుందని అధికారులు చెబుతున్నారు.

బీఎస్ఎన్ఎల్ కస్టమర్లు వై-ఫై కాలింగ్‌ కోసం అదనపు ఖర్చు చేయాల్సిన అవసరంలేదు . కంపెనీ తన నెట్‌వర్క్‌ను దేశవ్యాప్తంగా విస్తరించడంతో పాటు.. వినియోగదారులకు మెరుగైన అందించాలనే లక్ష్యంతో ఈ వై-ఫై కాలింగ్‌ ఫీచర్ తీసుకొచ్చింది.

VoWiFi అనేది IP మల్టీమీడియా సబ్‌సిస్టమ్ (IMS) ఆధారిత సేవ. ఇది Wi-Fi 7 మొబైల్ నెట్‌వర్క్‌ల మధ్య సజావుగా హ్యాండ్‌ఓవర్‌లకు సపోర్ట్ చేస్తుంది. కాబట్టి దీనికోసం ఎలాంటి థర్డ్ పార్టీ యాప్స్ అవసరం లేదు. కాబట్టి ఇది యూజర్లకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement