రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్-ఐడియా వంటి టెలికామ్ కంపెనీలు ఎప్పటికప్పుడు తమ కస్టమర్ల కోసం లేటెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ ప్రవేశపెడుతున్న సమయంలో.. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) ఉన్న రీఛార్జ్ ప్లాన్లకు ఎక్కువ డేటా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించిన ఒక ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బీఎస్ఎన్ఎల్.. తన రూ. 2399, రూ. 485, రూ. 347, రూ. 225 రీఛార్జ్ ప్లాన్ల మీద 0.5 జీబీ అదనపు డేటా అందిస్తుంది. గతంలో ప్యాక్ రీఛార్జ్ ద్వారా 2.5 జీబీ డేటా లభిస్తే.. ఇప్పుడు అదే ప్యాక్ రీఛార్జ్ చేసుకుంటే 3.0 జీబీ డేటా లభిస్తుంది. ఈ ఆఫర్ 2026 జనవరి 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
BSNL enhances prepaid plans with extra daily data!
Enjoy a data boost on ₹2399, ₹485, ₹347 & ₹225 at no extra cost. Stay connected longer on Bharat’s trusted network.
Offer valid till 31 Jan 2026
Recharge smart via #BReX 👉 https://t.co/41wNbHpQ5c
#BSNL… pic.twitter.com/iQvAesldmr— BSNL India (@BSNLCorporate) January 9, 2026


