జీతం, పని పరిస్థితులు, సామాజిక భద్రత లేకపోవడాన్ని నిరసిస్తూ డిసెంబర్ 31న గిగ్ వర్కర్లు సమ్మె నిర్వహించారు. ఆ తరువాత ప్రోత్సాహాలు అందిస్తున్నట్లు ప్రకటనలు వచ్చాయి. ఇప్పుడు 10 నిమిషాల డెలివరీపై జొమాటో సీఈఓ.. దీపిందర్ గోయల్ స్పందించారు. దీనికి సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
10 నిమిషాల డెలివరీ సర్వీస్.. డెలివరీ ఏజెంట్స్ లేదా రైడర్లపై ఒత్తడి తెస్తుందని విమర్శలు వెల్లువెత్తుతున్న సమయంలో, దీపిందర్ గోయల్ స్పందిస్తూ..ఇళ్ల చుట్టుపక్కల్లో దుకాణాలు ఎక్కువ కావడం వల్లనే 10 నిమిషాల డెలివరీ అనేది తీసుకొచ్చాము. దీని ఉద్దేశ్యం డెలివరీ ఏజెంట్ వేగంగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లాలని కాదని అన్నారు. అంతే కాకుండా డెలివరీ కోసం కస్టమర్లకు ఇచ్చిన టైమర్.. డెలివరీ ఏజెంట్లకు కనిపించదని వెల్లడించారు.
బ్లింకిట్‌లో ఆర్డర్ వచ్చిన తరువాత.. దానిని 2.5 నిమిషాల్లో ప్యాక్ చేస్తారు. ఆ తరువాత రైడర్ 8 నిమిషాలకు 2 కిలోమీటర్ల చొప్పున రైడ్ చేసినా.. గంటకు సగటున 15 కిలోమీటర్ల వేగంతో వెళ్లగలడు. ఈ విధానం అర్థం చేసుకోకపోవడం వల్లనే.. దీనిని రిస్క్ అని భావిస్తున్నారు. కాబట్టి దీనిని గిగ్ వర్కర్లు తప్పకుండా అర్థం చేసుకోవాలి. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని పూర్తిగా నమ్మవద్దని గోయల్ పేర్కొన్నారు.
ఇక కార్మికుల భద్రత గురించి వివరిస్తూ.. డెలివరీ భాగస్వాములకు వైద్య, జీవిత బీమా ఉందని గోయల్ అన్నారు. ఆలస్యానికి జరిమానాల విషయాన్ని గురించి ప్రస్తావిస్తూ.. డెలివరీ ఏజెంట్స్.. సమయానికి అందించకపోతే ఏమీ జరగదు. కొన్నిసార్లు అనుకోకుండా ఆలస్యాలు జరుగుతాయని గోయల్ వెల్లడించారు
One more thing. Our 10 minute delivery promise is enabled by the density of stores around your homes. It’s not enabled by asking delivery partners to drive fast. Delivery partners don’t even have a timer on their app to indicate what was the original time promised to the…
— Deepinder Goyal (@deepigoyal) January 1, 2026


