ఢిల్లీ: ఒక చిన్న పొరపాటు తీవ్ర ఘర్షణకు దారితీసింది. శనివారం రాత్రి గ్రేటర్ నోయిడాలోని బీటా-2 ప్రాంతంలోన నింబస్ సొసైటీలో ఈ ఘటనకు సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రాత్రి 10 గంటల సమయంలో ఒక డెలివరీ బాయ్ పొరపాటున వేరే ఫ్లాట్ కాలింగ్ బెల్ కొట్టాడు.. దీంతో ఆగ్రహంతో సదరు ఫ్లాట్ యజమాని సెక్యూరిటీ గార్డులను పిలిచాడు.
సెక్యూరిటీ గార్డులకు, డెలివరీ ఏజెంట్‌కు మధ్య వాగ్వాదం మొదలై చివరకు అది దాడికి దారితీసింది. డెలివరీ బాయ్ తన స్నేహితులకు ఫోన్ చేయడంతో, 12 మందికి పైగా యువకులు బైక్‌లపై కర్రలు, రాడ్లతో సొసైటీ మెయిన్ గేట్ వద్దకు చేరుకున్నారు. ఇరువర్గాలు కర్రలు, రాడ్లు, పిడిగుద్దులతో పరస్పరం దాడులకు దిగారు.
‘‘పొరపాటున బెల్ కొట్టినందుకు సెక్యూరిటీ గార్డులు డెలీవరి బాయ్‌పై దాడి చేశారు. ఆగ్రహించిన డెలీవరి బాయ్ తన తోటి మిత్రులను పిలవడంతో గొడవ తీవ్రరూపం దాల్చింది" అంటూ ఓ సంస్థ ఈ వీడియో ట్వీట్ చేసింది. గొడవ జరిగిన తర్వాత పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పోలీసులను చూడగానే బైక్‌లపై వచ్చిన వారు పారిపోయారు. కొందరైతే తమ వాహనాలను అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు. ఈ ఘటనలో ఇప్పటివరకు నలుగురిని అరెస్ట్ చేశారు. వీరిలో బెల్ కొట్టిన డెలివరీ ఏజెంట్‌తో పాటు గొడవకు దిగిన ముగ్గురు సెక్యూరిటీ గార్డులు ఉన్నారు. బైక్‌లపై వచ్చి దాడిలో పాల్గొన్న మిగిలిన యువకులు కోసం పోలీసులు గాలిస్తున్నారు.
IITL Nimbus Express Parkview 2, Greater Noida
Delivery boy rang doorbell of the wrong flat by mistake. Flat owner called the society security guards who assaulted the Rider. Angry Rider also called his fellow riders and after that it was free for all.pic.twitter.com/egTQ51xwxp— NCMIndia Council For Men Affairs (@NCMIndiaa) January 25, 2026


