కుంభమేళా సోషల్‌మీడియా సంచలనం మోనాలీసా భోంస్లే (Monalisa Bhosle)కు చేదు అనుభవం ఎదురైంది. ఆమె ప్రేమ వివాహం చట్టవిరుద్దమని విశ్వహిందూ పరిషత్ ఫిర్యాదు చేసింది. ఆమెది బాల్య వివాహమని వీహెచ్‌పీ ఆరోపించింది. దీంతో ఈ పెళ్లి నెట్టింట చర్చకు దారితీసింది.
ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన 2025 మహా కుంభమేళా సందర్భంగా విశేష గుర్తింపు పొందిన మోనాలిసా భోంస్లే ఇటీవల (మార్చి 11, 2026న ) తన ప్రియుడు మహమ్మద్ ఫర్మాన్ ఖాన్ (Mohammed Farman Khan)ను పెళ్లాడింది. కేరళలోని అరుణ్మనూర్‌లోని శ్రీ నారాయణ గురు ఆలయంలో హిందూ సంప్రదాయాల ప్రకారీ వీరు పెళ్లి చేసుకున్నారు. అయితే మోనాలీసా మైనర్‌శ్రీ అనీ, ఈ వివాహం చెల్లదంటూ విశ్వహిందూ పరిషత్ (VHP) కేరళ విభాగం గురువారం నాడు డీజీపీతో పాటు పూవార్ పోలీస్ స్టేషన్‌లోనూ ఫిర్యాదు చేసింది.
ఈ మతాంతర వివాహం చట్టవిరుద్ధమని, ఎందుకంటే వధువు మైనర్ అని (18 ఏళ్లలోపు) విహెచ్‌పీ తన ఫిర్యాదులో ఆరోపించింది. బాల్య వివాహాల నిరోధక చట్టం, పిల్లలపై లైంగిక నేరాల నిరోధక చట్టం-2012 కింద విచారణ జరపాలని,అలాగే వివాహాన్ని నిర్వహించిన వారిపైనా, అందులో పాల్గొన్న వారిపైనా చర్యలు తీసుకోవాలని అభ్యర్థిస్తూ విహెచ్‌పీ కేరళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనిల్ విలయిల్ కేరళ డీజీపికి, పూవార్ SHOకు ఫిర్యాదు చేశారు.
#WATCH | Thiruvananthapuram, Kerala: Monalisa Bhosle, the viral 'Rudraksha Girl' of the 2025 Maha Kumbh Mela, has married her boyfriend Furman Khan
Furman Khan says, "This is not love jihad. Both of us follow our own religions, but we also respect all religions. We are both… pic.twitter.com/GrQyafT9J5— ANI (@ANI) March 12, 2026
ఈ ఫిర్యాదు ప్రకారం.. తమ వాదనకు ఆధారంగా, జనవరి 21, 2025న జరిగిన మోనాలిసా 16వ పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన సోషల్ మీడియా వీడియో దృశ్యాలను వీహెచ్‌పీ ప్రస్తావించింది. కనుక 18 ఏళ్ల లోపే జరిగిన మోనాలిసా భోంస్లే వివాహం చెల్లదని, ఆ జంటపైనా, ఆలయ అధికారులపైనా, అలాగే వారికి అండగా నిలిచిన రాజకీయ పోషకులపైనా చర్యలు తీసుకోవాలని ఆ సంస్థ డిమాండ్ చేసింది.
ఇదీ చదవండి: మోజ్తాబా ఖమేనీని ఖతం చేస్తాం.. నెతన్యాహూ సంచలన వ్యాఖ్యలు
మెనాలీసా క్లారిటీ
తమ వివాహం చట్టబద్దమైందనీ, లవ్ జిహాద్ కాదనీ కొత్త జంట తమపై వస్తున్న ఆరోపణలను ఖండించారు. మోనాలిసాకు 18 ఏళ్లు నిండాయని స్పష్టం చేశారు. ఇద్దరమూ ఇష్టప్రకారమే పెళ్లి చేసుకున్నామని వివరించారు. అలాగే జనవరి 1, 2008న జన్మించిందంటూ, మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జారీ చేయబడిన జనన ధృవీకరణ పత్రాన్ని కూడా వారు సమర్పించారు. అయితే మెనాలీసా కుటుంబం ఈ పెళ్లికి అంగీకరించకపోవడంతో రక్షణ కోరుతూ తంపనూర్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు. 18 సంవత్సరాలు నిండాక, చట్టబద్ధంగా నచ్చిన భాగస్వామితో జీవించడానికి స్వేచ్ఛ ఉందని పోలీసు అధికారులు వివరించారు. దీంతో వివాహం ప్రక్రియను ముగించారు.
ఇదీ చదవండి : లవ్ జిహాద్ కాదు, ఆమె ఇష్టమే నా ఇష్టం!
కాగా మెనాలీసా-ఫర్మాన్ ఖాన్ వివాహానికి కేరళ విద్యాశాఖ మంత్రి వి. శివన్‌కుట్టి, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) రాజ్యసభ సభ్యుడు ఎఎ రహీం, పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎంవి గోవిందన్‌తో సహా పలువురు రాజకీయ నాయకులు హాజరైనారు.


