మోజ్తాబా ఖమేనీని ఖతం చేస్తాం.. నెతన్యాహూ సంచలన వ్యాఖ్యలు | Israel stronger than ever in first speech since Iran war says Netanyahu | Sakshi
Sakshi News home page

మోజ్తాబా ఖమేనీని ఖతం చేస్తాం.. నెతన్యాహూ సంచలన వ్యాఖ్యలు

Mar 13 2026 1:49 PM | Updated on Mar 13 2026 2:06 PM

Israel stronger than ever in first speech since Iran war says Netanyahu

ఫిబ్రవరి 28న అమెరికాతో కలిసి ఇరాన్‌పై  యుద్దాన్ని  మొదలు పెట్టిన తరువాత  ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు స్పందించారు. తమ దేశం "ఎప్పటికన్నా బలంగా మారుతోంది" అని గురువారం ఒక వార్తా సమావేశంలో నెతన్యాహు పేర్కొన్నారు. అలాగే తాము ఇరాన్, దాని ప్రాక్సీలపై బలవంతంగా దాడి చేస్తున్నామంటూ ఆయన ఎక్స్‌లో ఒక పోస్ట్‌ పెట్టారు.

యుద్ధం ప్రారంభమైన తర్వాత తొలిసారి విలేకరుల సమావేశం నిర్వహించిన నెతన్యాహు ఇరాన్ కొత్త సుప్రీం నాయకుడు మోజ్తాబా ఖమేనీని చంపేస్తామని ఒక రహస్య బెదిరింపు జారీ చేశారు. కొత్త ప్రభుత్వం కుప్ప కూలుతుందని అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము  చోద్యం చూడటం లేదనీ, పూర్తి బలంతో దాడి చేస్తున్నామన్నారు.   "ధైర్యవంతులు గెలుస్తారు" అనే సూత్రంతో, మధ్యప్రాచ్య ముఖచిత్రాన్ని మార్చేస్తామని, శత్రువులను వెంటాడి మరీ దాడి చేస్తామని పేర్కొన్నారు. 

 (ఇరాన్‌ వార్‌ : ట్రంప్‌ సరికొత్త వార్నింగ్‌)

 

ఇరాన్ తన అణు, బాలిస్టిక్ ప్రాజెక్టులను భూగర్భంలోకి తరలించకుండా తమ దళాలు  నిరోధించాయనీ, ఇరాన్ ఇకపై అదే ఇరాన్ కాదు, పేర్కొన్నారు. అంతేకాదు తాము ఇరానియన్ అణు శాస్త్రవేత్తలను చంపాయని, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC), బాసిజ్ దళాలకు తీవ్ర నష్టం కలిగించాయని నెతన్యాహు అన్నారు.

ఇదీ చదవండి: లవ్‌ జిహాద్‌ కాదు, ఆమె ఇష్టమే నా ఇష్టం!

Advertisement
 
Advertisement
Advertisement