breaking news
Benjamin Netanyahu
-
మోజ్తాబా ఖమేనీని ఖతం చేస్తాం.. నెతన్యాహూ సంచలన వ్యాఖ్యలు
ఫిబ్రవరి 28న అమెరికాతో కలిసి ఇరాన్‌పై యుద్దాన్ని మొదలు పెట్టిన తరువాత ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు స్పందించారు. తమ దేశం "ఎప్పటికన్నా బలంగా మారుతోంది" అని గురువారం ఒక వార్తా సమావేశంలో నెతన్యాహు పేర్కొన్నారు. అలాగే తాము ఇరాన్, దాని ప్రాక్సీలపై బలవంతంగా దాడి చేస్తున్నామంటూ ఆయన ఎక్స్‌లో ఒక పోస్ట్ పెట్టారు.యుద్ధం ప్రారంభమైన తర్వాత తొలిసారి విలేకరుల సమావేశం నిర్వహించిన నెతన్యాహు ఇరాన్ కొత్త సుప్రీం నాయకుడు మోజ్తాబా ఖమేనీని చంపేస్తామని ఒక రహస్య బెదిరింపు జారీ చేశారు. కొత్త ప్రభుత్వం కుప్ప కూలుతుందని అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము చోద్యం చూడటం లేదనీ, పూర్తి బలంతో దాడి చేస్తున్నామన్నారు. "ధైర్యవంతులు గెలుస్తారు" అనే సూత్రంతో, మధ్యప్రాచ్య ముఖచిత్రాన్ని మార్చేస్తామని, శత్రువులను వెంటాడి మరీ దాడి చేస్తామని పేర్కొన్నారు. אתמול במסיבת העיתונאים עמדתי על היעדים הברורים של המערכה: פגיעה במשטר הטרור באיראן, המשך המאבק מול שלוחותיו, והבטחת ביטחונה ועתידה של ישראל.אנחנו לא מחכים. אנחנו יוזמים, אנחנו תוקפים ואנחנו עושים זאת בעוצמה.צפו בדברים המלאים >> pic.twitter.com/hubJWVdiKQ— Benjamin Netanyahu - בנימין נתניהו (@netanyahu) March 13, 2026 (ఇరాన్ వార్ : ట్రంప్ సరికొత్త వార్నింగ్) ఇరాన్ తన అణు, బాలిస్టిక్ ప్రాజెక్టులను భూగర్భంలోకి తరలించకుండా తమ దళాలు నిరోధించాయనీ, ఇరాన్ ఇకపై అదే ఇరాన్ కాదు, పేర్కొన్నారు. అంతేకాదు తాము ఇరానియన్ అణు శాస్త్రవేత్తలను చంపాయని, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC), బాసిజ్ దళాలకు తీవ్ర నష్టం కలిగించాయని నెతన్యాహు అన్నారు.ఇదీ చదవండి: లవ్ జిహాద్ కాదు, ఆమె ఇష్టమే నా ఇష్టం! -
ఇరాన్‌తో యుద్ధం.. ఐక్యరాజ్యసమితి హెచ్చరిక ఇదే..
పశ్చిమాసియాలో భీకర యుద్ధం కొనసాగుతోంది.. -
ఇరాన్ యుద్ధం వేళ.. ట్రంప్‌నకు బిగ్ ఝలక్!
ఇరాన్ టార్గెట్‌గా ఇజ్రాయెల్, అమెరికా దాడులు కొనసాగుతున్నాయి. యూఎస్ డ్రోన్లు, క్షిపణులు.. ఇరాన్‌పై విరుచుకుపడుతున్నాయి. మరోవైపు.. సుప్రీం లీడర్ అలీ ఖమేనీ హత్యకు, దాడులకు ప్రతీకారంగా ఇరాన్ సైతం ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలపై మెరుపు దాడులు చేస్తోంది. పరస్పర దాడుల కారణంగా ఇప్పటికే వేల సంఖ్యలో పౌరులు మృతి చెందగా.. భారీ నష్టం వాటిల్లింది. ఇరాన్ దాడులతో కొన్ని గల్ఫ్ దేశాలు ఆందోళనకు గురవుతున్నాయి. ఈ క్రమంలో అమెరికా, ఇజ్రాయెల్‌పై కొన్ని గల్ఫ్ దేశాలు అసహనం వ్యక్తం చేస్తున్నాయి.ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు ప్రారంభించిన తర్వాత.. ఇరాన్ ప్రతి దాడులకు దిగింది. ఇజ్రాయెల్ సహా ఐదు గల్ఫ్ దేశాలను టార్గెట్ చేసి డ్రోన్లు, క్షిపణి దాడులు జరిపింది. బహ్రెయిన్, కువైట్, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (దుబాయ్, అబుదాబి), అలాగే సౌదీ అరేబియా లక్ష్యంగా మారాయి. ఈ దాడులు అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త వైమానిక దాడులకు ప్రతీకారంగా జరిగాయి. గల్ఫ్ దేశాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్.. కనీసం 380 క్షిపణులు, 1,480 కంటే ఎక్కువ డ్రోన్లను ప్రయోగించింది. ఆ దేశాలలో కనీసం 13 మంది మరణించారని అధికారిక ప్రకటనల ప్రకారం తెలిసింది. ఆదివారం కువైట్‌లో ఇరాన్ డ్రోన్ దాడి ప్రధాన ఆర్మీ స్థావరం నుండి 10 మైళ్ల కంటే ఎక్కువ దూరంలో ఉన్న ఒక పౌర ఓడరేవులోని ఆపరేషన్ సెంటర్‌ను తాకింది. ఈ దాడిలో ఆరుగురు అమెరికా సైనికులు మరణించారు.మరోవైపు.. ఇరాన్ దాడులు గల్ప్ ప్రాంతాన్ని అస్థిరం చేస్తున్నాయి. అమెరికా సైనిక స్థావరాలు ఉన్న దేశాలు నేరుగా లక్ష్యంగా మారాయి. ఇది చమురు సరఫరా, అంతర్జాతీయ భద్రతపై తీవ్రమైన ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్, అమెరికాపై గల్ఫ్ దేశాలు అసహనం వ్యక్తం చేస్తున్నాయి. ఇరాన్‌పై దాడులకు సంబంధించి తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని మండిపడుతున్నాయి. దాడులపై తమకు ముందుగానే సమాచారం ఇచ్చి ఉంటే ఇంత నష్టం జరిగి ఉండేది కాదని అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. యుద్ధ సన్నద్ధతకు తమకు తగినంత సమయం అమెరికా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. యుద్ధం, దాడుల విషయంలో ఇజ్రాయెల్ ప్లాన్ ప్రకారం ఎంతో భద్రతతో ఉందని ఆరోపిస్తున్నాయి. అమెరికా సైన్యం కూడా తమకు రక్షణ ఇవ్వలేదని చెబుతున్నాయి.కాగా, గల్ఫ్ దేశాల అసహనంపై తాజాగా వైట్ హౌస్ ప్రతినిధి అన్నా కెల్లీ స్పందించారు. ఈ సందర్బంగా కెల్లీ..‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ ఆయుధాలను ప్రయోగించే లేదా ఉత్పత్తి దేశాలను అణచివేస్తుంది. ఈ కార్యక్రమం వల్లే ఇరాన్ ప్రతీకార బాలిస్టిక్ క్షిపణి దాడులు 90 శాతం తగ్గాయి. అధ్యక్షుడు ట్రంప్ మా ప్రాంతీయ భాగస్వాములందరితో సన్నిహిత సంబంధంలో ఉన్నారు. ఉగ్రవాద ఇరాన్ పాలన, పొరుగు దేశాలపై చేసిన దాడులను అధ్యక్షుడు ట్రంప్ పర్యవేక్షిస్తున్నారు. మా మిత్రదేశాలకు ఈ ముప్పును తొలగించడం ఎంత అవసరమో అని చర్యలు తీసుకుంటున్నారు’ అని క్లారిటీ ఇచ్చారు. -
ఖమేనీ హత్యకు ఇలా ప్లాన్.. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి
టెలీ అవీవ్: ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు కొనసాగుతున్నాయి. మరోవైపు.. ఇరాన్ సైతం ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలను టార్గెట్ చేసి బాంబుల వర్షం కురిపిస్తోంది. ఇలాంటి తరుణంలో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీకి హత్య ప్లాన్‌కు సంబంధించిన కీలక వివరాలను ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ వెల్లడించారు. ఖమేనీని హతమార్చే లక్ష్యాన్ని గత ఏడాది నవంబర్లోనే నిర్ణయించినట్లు చెప్పుకొచ్చారు. దీంతో, ఆయన వ్యాఖ్యలపై చర్చ నడుస్తోంది.ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్ తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని హతమార్చే లక్ష్యాన్ని గత ఏడాది నవంబర్లోనే నిర్ణయించుకున్నాం. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూతో కలిసి జరిగిన అత్యంత రహస్య భద్రతా సమావేశంలో ఆ లక్ష్యాన్ని నిర్ణయించాము. మొదట ఆ ఆపరేషన్‌ను 2026 మధ్యలో అమలు చేయాలని భావించినప్పటికీ, ఇరాన్లో నెలకొన్న అంతర్గత అస్థిరత కారణంగా దాడి సమయాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ వ్యూహాన్ని అమెరికాకు కూడా వెల్లడించాం’ అని తెలిపారు.అలాగే.. ఇరాన్లో మతపెద్దల పాలనపై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో వారు ఇజ్రాయెల్, అమెరికా లక్ష్యాలపై దాడులకు దిగే అవకాశముందని భావించి ముందస్తు చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. ఇజ్రాయెల్ చేపట్టిన ఆపరేషన్ రోరింగ్ లయన్, ఎపిక్ ఫ్యూరీ ప్రారంభ దశలోనే ఈ లక్ష్యాన్ని అమలు చేసినట్లు సమాచారం. ఒక సార్వభౌమ దేశ అత్యున్నత నాయకుడిని వైమానిక దాడి ద్వారా హతమార్చడం ఇదే మొదటిసారి అని అంతర్జాతీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇజ్రాయెల్ మాత్రం ఈ చర్యను సమర్థించుకుంటోంది. ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమం, అణు కార్యక్రమం తమ దేశానికి అస్తిత్వ ముప్పుగా మారిందని చెబుతోంది. అందుకే ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని పూర్తిగా బలహీనపరచడమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొంది. -
ఒమన్ పోర్టుపై ఇరాన్ దాడి.. ఇద్దరు భారతీయులు మృతి
కొనసాగుతున్న అమెరికా,ఇజ్రాయెల్ యుద్ధంయుద్ధం దృష్ట్యా ఖమేనీ అంత్యక్రియలు వాయిదా వేస్తున్నట్లు ఇరాన్ ప్రకటన -
ఇరాన్‌పై ఇజ్రాయెల్ యుద్ధం.. పాకిస్తాన్‌కు కొత్త భయం!
ఇస్లామాబాద్: ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు కొనసాగిస్తున్న వేళ దాయాది దేశం పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఆవేదన వ్యక్తం చేశారు. పాక్ మిత్ర దేశం ఇరాన్‌పై అమెరికా దాడులు చేయడాన్ని పరోక్షంగా వ్యతిరేకిస్తూ.. ఇజ్రాయెల్ పట్ల తమకున్న భయాన్ని వెళ్లగక్కారు. ఇదే సమయంలో భారత్‌ను టార్గెట్ చేసి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చివరగా.. పాక్‌ను సామంత దేశంగా మార్చేందుకు ఇజ్రాయెల్ కుట్ర చేస్తోందంటూ బాంబు పేల్చారు.ఇరాన్‌పై దాడుల జరుగుతున్న నేపథ్యంలో పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తాజాగా స్పందించారు. ఈ సందర్బంగా ఆసిఫ్ మాట్లాడుతూ.. ‘అణు ఒప్పందంపై ఇరాన్ చర్చలకు సిద్ధంగా ఉన్నప్పటికీ అమెరికా-ఇజ్రాయెల్ టెహ్రాన్‌పై యుద్ధం చేయడానికే సిద్దమయ్యాయి. వ్యూహత్మకంగా దాడులు చేసి సుప్రీం లీడర్ అలీ ఖమేనీని హత మార్చారు. ఇదంతా ఇజ్రాయెల్ ప్లాన్‌లో భాగంగానే జరిగింది. 1948లో ఇజ్రాయెల్ ఏర్పడినప్పటి నుంచి ఇస్లామిక్ ప్రపంచాన్ని ప్రభావితం చేసే అన్ని సంఘర్షణలలో జియోనిజం (యూదు భావజాలం) ప్రత్యక్ష లేదా పరోక్ష పాత్ర పోషించింది. ప్రతీ యుద్ధం, ప్రతీ ఘర్షణలో ఇజ్రాయెల్ భాగంగానే ఉంటోంది. దశాబ్దాలుగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను జియోనిస్టులే నిర్ధేశిస్తున్నారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.నెతన్యాహు, మోదీ స్నేహంపై.. ఇదే సమయంలో భారత్, ఇజ్రాయెల్ మధ్య ఉన్న బంధంపై సరికొత్త కుట్రకు తెరలేపారు. ఇజ్రాయెల్‌ను టార్గెట్ చేసి.. ఇరాన్‌పై యుద్ధం వల్ల పాకిస్థాన్ కూడా ప్రభావితం అయ్యే అవకాశం ఉందన్నారు. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ విజయం సాధిస్తే భారత్, ఆప్ఘనిస్తాన్ ఏకమై.. పాక్‌ను టార్గెట్ చేసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. తమ సరిహద్దుల వద్ద ప్రమాదకర పరిస్థితులను సృష్టిస్తున్నారని ఆరోపించారు. అన్ని వైపుల నుంచి శత్రువులు తమను చుట్టుముట్టడం వల్ల పాక్ సామంత దేశంగా మారే ప్రమాదం ఉందన్నారు. పాక్‌ను సామంత దేశంగా మార్చేందుకు ఇజ్రాయెల్ కుట్ర పన్నుతోందని.. ఈ కుట్రలో భారత్ భాగస్వామిగా ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇరాన్‌తో పాక్ సరిహద్దు ఇలా.. ఇదిలా ఉండగా.. పాకిస్తాన్–ఇరాన్ మధ్య సరిహద్దు మొత్తం పొడవు 909 కిలోమీటర్లు (565 మైళ్లు) ఉంటుంది. ఈ సరిహద్దు ఇరాన్‌లోని సిస్తాన్ అండ్ బలూచిస్తాన్ ప్రావిన్స్, పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌తో కలుస్తుంది. ఇది ఉత్తరాన ఆఫ్ఘానిస్తాన్ త్రైజంక్షన్ వద్ద ప్రారంభమై, దక్షిణాన గల్ఫ్ ఆఫ్ ఒమాన్ వరకు కొనసాగుతుంది. సరిహద్దు భూభాగం ఎక్కువగా ఎడారి, పర్వత ప్రాంతాలతో నిండి ఉంటుంది. అందువల్ల రవాణా, మౌలిక సదుపాయాల అభివృద్ధి కష్టతరంగా మారింది. దక్షిణ చివర గల్ఫ్ ఆఫ్ ఒమాన్.. ఇది సముద్ర వాణిజ్యానికి వ్యూహాత్మకంగా ముఖ్యమైనది. ఇరాన్–పాకిస్తాన్ మధ్య గ్యాస్ పైప్‌లైన్ ప్రాజెక్టులు, ఇంధన వాణిజ్యం ముఖ్యమైనవిగా ఉన్నాయి. అధికారిక వాణిజ్యంతో పాటు అనధికారిక స్మగ్లింగ్ కూడా విస్తృతంగా జరుగుతుంది. ఇరాన్–పాకిస్తాన్ సంబంధాలు సరిహద్దు భద్రత, వాణిజ్యం, మరియు ప్రాంతీయ రాజకీయాలపై ఆధారపడి ఉంటాయి. మొత్తంగా, ఈ సరిహద్దు ప్రాంతం రెండు దేశాల మధ్య సాంస్కృతిక అనుబంధంను బలపరుస్తూ, వాణిజ్య మార్గంగా పనిచేస్తూ, అదే సమయంలో భద్రతా సవాళ్లును కూడా సృష్టిస్తోంది. -
ఇరాన్ నౌకను కూల్చింది మేమే: అమెరికా
ఇరాన్, ఇజ్రాయెల్ -అమెరికా మధ్య భీకర యుద్ధం నడుస్తోంది.. -
ఇజ్రాయెల్ ప్రధాని మృతి? ఇరాన్ కీలక ప్రకటన
-
యుద్ధంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
ఇరాన్ టార్గెట్‌గా అమెరికా, ఇజ్రాయెల్ దళాల దాడులు కొనసాగుతున్నాయి.. -
సీసీఎస్ అత్యవసర సమావేశం.. నెతన్యాహుకు మోదీ ఫోన్
ఢిల్లీ: ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు కొనసాగుతున్న వేళ భారత ప్రధాని నరేంద్ర మోదీ.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహుతో మాట్లాడినట్టు చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ప్రస్తుత దాడులపై ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే, శాంతి దిశగా చర్యలు తీసుకోవాలని మోదీ.. నెతన్యాహుకు సూచించినట్టు చెప్పుకొచ్చారు.ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా నెతన్యాహు, యూఏఈ అధ్యక్షుడితోనూ మాట్లాడినట్టు ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఈ సందర్బంగా మోదీ.. ఇరాన్‌తో యుద్ధం, తాజా పరిణామాలపై భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోందన్నారు. పౌరుల భద్రతే ప్రాధాన్యమని స్పష్టం చేశారు. శాంతి దిశగా చర్యలు చేపట్టాని నెతన్యాహుకు సూచించినట్టు తెలిపారు. అలాగే, యూఏఈపై దాడులను మోదీ తీవ్రంగా ఖండించారు. ఇరాన్ దాడుల్లో మృతి చెందిన వారికి సంతాపం తెలిపారు. యూఏఈకి భారత్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఉద్రిక్తతలను తగ్గించడం, ప్రాంతీయ శాంతి, భద్రత, స్థిరత్వాన్ని సమర్థిస్తామని.. శత్రుత్వాలను త్వరగా నిలిపివేయాల్సిన అవసరాన్ని భారత్ పునరుద్ఘాటిస్తుందని మోదీ చెప్పుకొచ్చారు.Had a telephone call with PM Benjamin Netanyahu to discuss the current regional situation. Conveyed India's concerns over recent developments and emphasised the safety of civilians as a priority. India reiterates the need for an early cessation of hostilities.@netanyahu— Narendra Modi (@narendramodi) March 1, 2026సీసీఎస్ అత్యవసర సమావేశం.. అయితే.. భద్రత, వ్యూహాత్మక వ్యవహారాలపై భారతదేశ అత్యున్నత నిర్ణయాధికార సంస్థ భద్రతా కేబినెట్ కమిటీ (CCS) సమావేశానికి ప్రధాని మోదీ అధ్యక్షత వహించిన కొన్ని గంటల తర్వాత ఈ సమాచారం వచ్చింది. రాజస్థాన్, గుజరాత్, తమిళనాడు, పుదుచ్చేరిలలో రెండు రోజుల పర్యటన నుండి ఆయన న్యూఢిల్లీకి తిరిగి వచ్చిన కొద్దిసేపటికే ఈ సమావేశం జరిగింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ సమావేశానికి హాజరయ్యారు. భారత చమురు దిగుమతులకు కీలకమైన షిప్పింగ్ మార్గమైన హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడం వల్ల కలిగే ప్రభావాన్ని కూడా CCS అంచనా వేసినట్టు తెలుస్తోంది.మధ్యప్రాచ్యంలోని భారతీయ పౌరుల భద్రత, వివాదం మరింత తీవ్రమైతే అత్యవసర ప్రణాళికలపై ఈ సమావేశంలో చర్చించినట్టు తెలుస్తోంది. దాదాపు 10,000 మంది భారతీయులు ఇరాన్లో, 40,000 మందికి పైగా ఇజ్రాయెల్‌లో, పశ్చిమాసియా మరియు గల్ఫ్‌లో సుమారు తొమ్మిది మిలియన్ల మంది భారతీయులు నివసిస్తున్నట్టు సమాచారం. తాజా దాడుల నేపథ్యంలో వారి భద్రతపై ఆందోళన నెలకొంది. -
అమెరికా సైన్యం తొమ్మిది ఇరానియన్ నౌకలను ముంచేసింది: ట్రంప్
ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు కొనసాగుతున్నాయి. దాడులకు సంబంధించిన... -
ఇండియాతో బంధం ఎంతో ప్రత్యేకం.. నెతన్యాహూ
ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయోల్ పర్యటన ముగిసింది. ఆ దేశంలో ఘనంగా అతిథ్యం స్వీకరించడంతో పాటు రెండు దేశాలు కీలకమైన పలు ఒప్పందాలు చేసుకున్నాయి. ఇదిలా ఉండగా ఆ దేశ ప్రధాన మంత్రి బెంజిమిన్ నెతన్యాహు ఒక ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. భారత్‌తో తనకు వ్యక్తిగతంగా ఎంతో కనెక్టివీటి ఉందని తెలిపారు. తన వైఫ్ సారా నెతన్యాహుని మెుదటి సారి కలిసింది ఇండియన్ రెస్టారెంట్లోనే అని తెలిపారు.భారత్ -ఇజ్రాయెల్ మైత్రి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ద్వైపాక్షిక సంబంధాల పరంగా కాకుండా వ్యక్తిగతంగానూ భారత్ అంటే ఇజ్రాయెల్‌కు ఎంతో అభిమానం. ప్రపంచంలో చాలా దేశాలు యూదులపై దాడులు చేస్తున్న సమయంలో ఇండియా వారికి అండగా నిలిచింది. అందుకు భారత్‌తో ఇజ్రాయిలీలకు ఆత్మీయ అనుబంధం. ఇదిలా ఉండగా ఆ దేశ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహుకు వ్యక్తిగతంగానూ భారత్ తనకు ఎంతో ప్రత్యేకమని తెలిపారు.ఆయన మాట్లాడుతూ" నాకు వ్యక్తిగతంగా భారత్ ఎంతో ప్రత్యేకం. నా మెదటి,లేదా రెండవ సారి నా వైప్ సారాను ఇండియన్ రెస్టారెంట్లోనూ కలిసాను. ఆఫుడ్ మాత్రమే కాదు. ఆ డేట్ ఎంతో అద్భుతంగా సాగింది." అన్నారు. ఆ రెస్టారెంట్‌ను రీనా పుష్కర్నా అనే భారతీయురాలు నడిపిస్తుంది. ఆమె కర్రీ క్వీన్‌గా ఎంతో ఫేమస్ అన్నారు. భారతీయ వంటకాలను ఇజ్రాయెల్‌కు పరిచయం చేసిన ఘనత తనకే దక్కుతుందన్నారు.భారత్-ఇజ్రాయెల్ మధ్య సాంస్కృతిక రాయభారిగా తను పనిచేస్తుందన్నారు. గతంలో భారత ప్రధాని మోదీ ఇజ్రాయెల్ వచ్చినప్పుడు ఆ రెస్టారెంట్లోనూ విందు ఇచ్చామని భోజనం అద్భుతమని మోదీ ప్రశంసించారని తెలిపారు. ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లిన మోదీకి ఇజ్రాయెల్‌లో ఘన స్వాగతం లభించింది. -
భారత్-ఇజ్రాయెల్ మధ్య కీలక ఒప్పందాలు
జెరూసలేం: ఇజ్రాయెల్‌తో భారత్ పలు కీలక ఒప్పందాలు చేసుకుంది. పలు ఒప్పందాలపై నరేంద్ర మోదీ-నెతన్యాహు సంతకాలు చేసుకున్నారు. ఇజ్రాయెల్ ప్రధానితో నరేంద్ర మోదీ కీలక సమావేశం నిర్వహించారు. ద్వైపాక్షిక చర్చలు జరిపారు. భారత్‌లో పర్యటించాలని నెతన్యాహును ప్రధాని మోదీ ఆహ్వానించారు. రక్షణ, వ్యాపార, వాణిజ్య రంగాల్లో ఇరుదేశాల మధ్య కీలక ఒప్పందాలు జరిగాయి.విద్య, వ్యవసాయం, వాణిజ్యం, సైబర్ సెక్యూరిటీ, సర్వీస్ సెక్టార్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆవిష్కరణల రంగంలో అవగాహన ఒప్పందం కుదిరింది. ఇజ్రాయెల్‌లో యూపీఐ వాడకంపైనా భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. రక్షణ రంగంలో పరస్పర సహకారానికి భారత్-ఇజ్రాయెల్ నిర్ణయించాయి.#WATCH | Jerusalem | Addressing a joint press briefing with Israel PM Benjamin Netanyahu, PM Modi says," India’s vision is clear that humanity must never become a victim of conflict. The Gaza Peace Plan has opened a route to peace. India has supported such efforts. In future too,… pic.twitter.com/p5iXfkLrzX— ANI (@ANI) February 26, 2026వ్యవసాయం నుంచి ఏఐ వరుకు పలు ఎంవోయూలపై ఇరుదేశాలు సంతకాలు చేశాయి. 16 ఎంవోయూలపై భారత్-ఇజ్రాయెల్ సంతకాలు చేసుకున్నాయి. 11 కీలక ప్రకటనలు చేశాయి. టెక్నాలజీ కేంద్రంగా భవిష్యత్ సంబంధాలు ఉంటాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్‌కు త్వరలోనే తుదిరూపు ఇస్తామన్నారు. పశ్చిమమాసియాలో శాంతిస్థాపనకు మోదీ పిలుపునిచ్చారు. సంఘర్షణల్లో మానవత్వం బాధితురాలు కాకూడదన్నారు. -
మోదీ నా సోదరుడు: నెతన్యాహు
టెలీఅవీవ్: ధాని మోదీకి ఇజ్రాయెల్‌లో అరుదైన గౌరవం లభించింది. ఆ దేశ పార్లమెంటు మోదీకి ఘన స్వాగతం పలికింది. కాగా ఈ రోజు ప్రధాని మోదీ రెండురోజుల పర్యటనకు ఇజ్రాయెల్ వెళ్లారు. ఈ సందర్భంగా ఆ దేశ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు, ఆయన సతీమణి సారా నెతన్యాహుతో కలిసి ప్రధాని మోదీకి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం మోదీ ఇజ్రాయెల్ పార్లమెంటులో ప్రసంగించారు. ఇజ్రాయెల్ పార్లమెంటులో మోదీ మాట్లాడుతూ "ఇజ్రాయెల్ భారత్‌కు నిజమైన స్నేహితుడు, కష్టకాలంలో భారత్‌కు అండగా నిలిచారు. ఉగ్రవాదంపై పోరులో ఇజ్రాయెల్ మాకు భాగస్వామి. ఇక్కడ పర్యటించడం సంతోషంగా ఉంది. ఇజ్రాయెల్- భారత్ ప్రాచీన నాగరికత ఉన్న దేశాలు. రెండు దేశాలు తీవ్రవాదం కారణంగా కష్టాలు పడుతున్నాయి. ఇక్కడి పార్లమెంటులో ప్రసంగించడం గౌరవంగా భావిస్తున్నా", అని అన్నారు. అనంతరం ఆ దేశ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు మాట్లాడుతూ "ప్రపంచ దేశాల్లో మోదీ గొప్ప నాయకుడు. మోదీ ఇజ్రాయోల్ పర్యటన ఎంతో సంతోషదాయకం. మోదీ నాకు స్నేహితుడి కంటే ఎక్కువ నా సోదరుడి లాంటి వాడు." అని నెతన్యాహు అన్నారు. భారత్‌ని మోదీ వేగవంతంగా అభివృద్ధి చేస్తున్నారని ఆయన కాలంలో వాణిజ్య ఒప్పందాలు రెట్టింపు అయ్యాయన్నారు. భారత ప్రధాని 2 రోజుల పాటు ఇజ్రాయెల్‌లో పర్యటించనున్నారు. ఇరు దేశాలు రక్షణకు సంబంధించిన పలు కీలక ఒప్పందాలు చేసుకోనున్నట్లు సమాచారం.ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేయడమే లక్ష్యంగా భారత ప్రధాని మోదీ బుధవారం నుంచి రెండ్రోజులపాటు ఇజ్రాయెల్‌లో పర్యటించనున్నారు.‘‘ పరస్పర ప్రజాస్వామ్య దేశాల మధ్య బలమైన భాగస్వామ్యం, సమష్టి దార్శనికతల సుసాధ్యమే లక్ష్యంగా, ఉమ్మడి సవాళ్ల పరిష్కారమే ధ్యేయంగా, ఇరుదేశాలు సుదృఢ, సుదీర్ఘకాల వ్యూహాత్మక సంబంధాలను సమున్నత స్థాయికి తీసుకుపోయే ఉద్దేశంతో మోదీ, నెతన్యాహూలు చర్చలు జరుపుతారు’’ అని భారత విదేశాంగ శాఖ ఇదివరకే ప్రకటన విడుదల చేసింది. అనంతరం రణక్షేత్రంగా మారిన గాజా అంశం సైతం ఇరు దేశాధినేతలు చర్చించనున్నట్లు తెలుస్తోంది. పర్యటనలో భాగంగా మోదీ అక్కడి పార్లమెంట్లో ప్రసంగించనున్నారు. మరోవైపు ఇరాన్- అమెరికా ఉద్రిక్తల వేళ పశ్చిమాసియాలో మోదీ పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ రోజు (బుధవారం) రాత్రి మోదీకి, నెతన్యాహూ ప్రత్యేక ప్రైవేట్ విందు ఇవ్వనున్నారు. ప్రధానిగా మోదీ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఇజ్రాయిల్‌లో పర్యటించడం ఇది రెండోసారి. #WATCH | Tel Aviv: PM Narendra Modi arrives in Israel. Israeli Prime Minister Benjamin Netanyahu, along with his wife Sara Netanyahu, receive him at the airport (Source: Reuters) pic.twitter.com/BStw87lujA— ANI (@ANI) February 25, 2026 -
భారత్ సహా ఆరు దేశాల కొత్త కూటమి.. నెతన్యాహు సంచలన ప్రకటన
భారత ప్రధాని నరేంద్ర మోదీ.. ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్తున్నారు. మోదీ ఇజ్రాయెల్ పర్యటన వేళ బెంజమిన్ నెతన్యాహు నుంచి ఒక కొత్త భౌగోళిక రాజకీయ కూటమిపై ప్రకటన వెలువడింది. ప్రపంచ రాజకీయాలను శాసించే ఆరు దేశాల కూటమి ‘హెక్సాగన్’ కూటమిని ప్రకటిస్తూ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భారత్‌ను ప్రధాన భాగస్వామిగా పేర్కొన్నారు. కూటమిలో భారత్ అత్యంత కీలక పాత్ర పోషించబోతోందని చెప్పారు. ఈ నేపథ్యంలో హెక్సాగన్ కూటమి వల్ల భారత్‌కు కలిగే లాభాలేంటి?.. అలాగే భారత్ ముందున్న సవాళ్లు ఏంటనే చర్చ మొదలైంది.ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇటీవల భారత్‌పై ప్రశంసల కురిపించారు. భారత్‌ను ‘గ్లోబల్ పవర్'గా అభివర్ణించిన ఆయన, రానున్న రోజుల్లో మధ్యప్రాచ్యం, ప్రపంచ రాజకీయాలను శాసించే ఆరు దేశాల కూటమి ‘హెక్సాగన్’ కూటమిలో భారత్ అత్యంత కీలక పాత్ర పోషిస్తుందన్నారు. పశ్చిమాసియాలో ‘రాడికల్ పరిస్థితుల’ను ఎదుర్కోవడమే లక్ష్యంగా నెతన్యాహు ఈ కూటమిని ప్రతిపాదించారు. ఇందులో ఇజ్రాయెల్, గ్రీస్, సైప్రస్‌లతో పాటు భారత్ ప్రధాన భాగస్వామిగా పేర్కొన్నారు.‘హెక్సాగన్’ కూటమి ఏంటి?ఈ క్రమంలో నెతన్యాహు కూటమిపై కీలక వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రాచ్యం చుట్టూ ఆరు శక్తులతో ఒక కూటమిని ప్రతిపాదించారు. దీనిని ఆయన ‘హెక్సాగన్’ (షడ్భుజి)గా అభివర్ణించారు. ఈ కూటమిలోని దేశాలు భారత్, అరబ్ దేశాలు, ఆఫ్రికా దేశాలు, మధ్యధరా దేశాలు, ఆసియాలోని ఇతర దేశాలు, ఇజ్రాయెల్ భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయని అన్నారు. ఇది కేవలం ఒక వాణిజ్య కూటమి మాత్రమే కాదు. తీవ్రవాద భావజాలం కలిగిన రాడికల్ షియా, సున్నీ వర్గాల నుంచి ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కోవడానికి ఏర్పడిన కూటమిగా ఇజ్రాయెల్ భావిస్తోందని చెప్పుకొచ్చారు. మరోవైపు.. ఈ కూటమిలో అరబ్, ఆఫ్రికన్, ఆసియా దేశాలు కూడా భాగస్వాములుగా ఉంటాయని ఇజ్రాయెల్ విదేశాంగ శాఖ వెల్లడించింది.భారత్ ఐఎంఈసీకి బలం.. ఇక, అంతకుముందు.. జీ-20 వేదికగా భారత్ ఐఎంఈసీ(ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ ఎకనామిక్ కారిడార్)ను ప్రకటించింది. నెతన్యాహు ప్రతిపాదించిన ‘హెక్సాగన్’ వ్యూహం ఐఎంఈసీకు మరింత బలాన్ని చేకూర్చనుంది. కేవలం రైల్వే లైన్లు, ఓడరేవుల అనుసంధానం మాత్రమే కాకుండా, ఈ దేశాల మధ్య బలమైన రాజకీయ, సైనిక బంధాన్ని ఏర్పరచడమే ‘హెక్సాగన్’ ఉద్దేశంగా ఇజ్రాయెల్ వ్యూహరచన చేస్తోంది. గతంలో ఇజ్రాయెల్ కేవలం అమెరికా, ఐరోపా దేశాలపైనే ఆధారపడేది. కానీ మారుతున్న కాలంలో భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న ఆర్థిక శక్తితో జతకట్టడం ద్వారా ఇజ్రాయెల్ తన భద్రత, ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది.కాగా, ఈ కూటమి ప్రధానంగా భద్రతా, భౌగోళిక రాజకీయ ప్రయోజనాల కోసం రూపొందించబడిన ఆరు దేశాల సమూహం. భద్రతా పరంగా ఉగ్రవాదం, ప్రాంతీయ అస్థిరతను ఎదుర్కోవడానికి ఒక సమిష్టి వేదిక కానుంది. ఆర్థిక పరంగా ఇంధన, టెక్నాలజీ, రక్షణ రంగాల్లో సహకారం, రక్షణ ఒప్పందాల కోసం ఉపయోగపడనుంది. రాజకీయ పరంగా భారత్‌కి మధ్యప్రాచ్యం, యూరప్‌లో మరింత ప్రభావం పెంచే అవకాశం ఉంది.భారత్‌కు కలిగే లాభాలు.. భద్రతా సహకారం: ఉగ్రవాదం, సముద్ర భద్రత, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో భాగస్వామ్యం. ఆర్థిక అవకాశాలు: ఇంధన (గ్యాస్, ఆయిల్), రక్షణ టెక్నాలజీ, స్టార్టప్‌లు, ఇన్నోవేషన్ రంగాల్లో కొత్త పెట్టుబడులు.రాజకీయ ప్రభావం: మధ్యప్రాచ్యం, యూరప్, ఆఫ్రికా ప్రాంతాల్లో భారత్‌కి మరింత ప్రాధాన్యం.భౌగోళిక సమతుల్యం: మధ్యప్రాచ్యంలో ఇరాన్ ప్రభావాన్ని ఎదుర్కోవడానికి వ్యూహాత్మక మిత్రులు.సాంస్కృతిక సంబంధాలు: గ్రీస్, సైప్రస్ వంటి దేశాలతో పర్యాటక, విద్యా రంగాల్లో కొత్త అవకాశాలు.భారత్ ముందున్న సవాళ్లుఇరాన్తో సంబంధాలు: భారత్‌కి ఇంధన అవసరాల కోసం ఇరాన్‌తో సంబంధాలు ఉన్నాయి. ఈ కూటమి వల్ల ఆ సంబంధాలు దెబ్బతినే అవకాశం.అరబ్ దేశాల ప్రతిస్పందన: కొన్ని అరబ్ దేశాలు ఈ కూటమిని ఇజ్రాయెల్ ఆధిపత్యంగా చూసే అవకాశం ఉంది.ప్రాంతీయ అస్థిరత: మధ్యప్రాచ్యంలో జరిగే ఘర్షణలు భారత్‌కి ప్రత్యక్ష ప్రభావం చూపవచ్చుమోదీ రికార్డు.. ఇదిలా ఉండగా.. ఇజ్రాయెల్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ కొన్ని చారిత్రక ప్రదేశాలను సందర్శించనున్నారు. ప్రపంచ యుద్ధ కాలంలో యూదుల మారణ హోమానికి గుర్తుగా నిర్మించిన స్మారక చిహ్నాన్ని మోదీ సందర్శిస్తారు. జెరూసలెంలో ప్రధాని మోదీతో కలిసి ఒక భారీ ఇన్నోవేషన్ కార్యక్రమంలో నెతన్యాహు పాల్గొననున్నారు. ఇక, ప్రధాని మోదీని తన వ్యక్తిగత స్నేహితుడుగా నెతన్యాహు అభివర్ణించారు. 2017లో మోదీ పర్యటన సందర్భంగా ఇద్దరు నేతలు సముద్ర తీరంలో చెప్పులు లేకుండా నడిచిన దృశ్యాలను ఆయన గుర్తు చేసుకున్నారు. ‘మేము నిరంతరం ఫోన్లో మాట్లాడుకుంటూనే ఉంటాము. ఒకరి దేశాన్ని మరొకరం సందర్శించుకున్నాం. గత కొన్నేళ్లుగా ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధం మరింత దృఢంగా మారింది’ అని ఆయన అన్నారు. మరోవైపు.. రెండోసారి ఇజ్రాయెల్‌లో పర్యటిస్తున్న భారత ప్రధానిగా మోదీ.. రికార్డుల్లోకి ఎక్కారు. -
పాక్ రక్షణ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు.. వెనెజువెలా అధ్యక్షుడి తరహాలోనే..!
పాకిస్తాన్ రక్షణశాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఈ సారి ఏకంగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూను కిడ్నాప్ చేయాలని కోరారు. ఇటీవల వెనెజువెలా అధ్యక్షుడిని ఎత్తుకెళ్లిన తరహాలోనే నెతన్యాహును కూడా అపహరించాలని ట్రంప్‌కు విజ్ఞప్తి చేశారు. అమెరికాతో పాటు టర్కీ కూడా ఈ పని చేయగలదని ఇజ్రాయెల్‌ను రెచ్చగొట్టేలా ఖవాజా ఆసిఫ్ మాట్లాడారు. మానవత్వానికి పెద్ద నేరస్తుడిగా నెతన్యాహూను అభివర్ణించాడు.తాజా ఇంటర్వ్యూలో ఆసిఫ్ మాట్లాడుతూ.. చరిత్రలో ఎక్కడా జరగని దురాగతాలు గాజాలో పాలస్తీనియన్లపై జరిగాయన్నారు. గాజాలో పాలస్తీనియన్లపై జరిగిన దారుణాలకు చరిత్రలో ఏ దురాగతాలు సరిపోలడం లేదని పేర్కొన్నారు. గత 4-5 వేల సంవత్సరాల్లో పాలస్తీనియన్లకు నెతన్యాహు చేసినంత నష్టం ఎవరూ చేయలేదని.. మానవత్వంలో అతిపెద్ద నేరస్తుడని అన్నారు. ప్రపంచంలో ఇంతకుమించిన పెద్ద నేరస్తుడిని ఎక్కడా చూడలేదన్నారు.అయితే మరోవైపు గాజాలో ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్స్‌లో భాగంగా పాక్ సైనికులు గాజాకు వెళ్తున్నారనే వార్తలు వస్తున్నాయి. దీనిపై భారత్‌లోని ఇజ్రాయిల్ రాయబారి రూవెన్ అజార్ మాట్లాడారు. పాకిస్తాన్ సైన్యం గాజాలో ఉండటంపై ఇజ్రాయెల్ సంతోషంగా లేదని అన్నారు. హమాస్, లష్కరేతోయిబా మధ్య సంబంధాలు పెరగడంపై ఆందోళన వ్యక్తం చేశారు. -
ఆ చర్చల వెనుక అంతరార్థం ఏమిటి?
కొన్ని రోజుల నుంచి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. భారత ప్రధాని నరేంద్ర మోదీ ‘జపం’ చేస్తున్నారు. మోదీ మంచి వ్యక్తి అని అంటూనే భారత్ తనను సంతృప్తి పరచడానికి యత్నిస్తుందని తనలోని అసంతృప్తి ఇంకా మిగిలే ఉందనే విషయాన్ని చెప్పకనే చెప్పేశారు. ట్రంప్‌ను ఇంకా ఇంకా భారత్ సంతోష పెట్టాల్సిన విషయం ఏమైనా ఉందంటే అది.. రష్యా చమురు కొనుగోళ్లను పూర్తిగా నిలిపివేయడమే. రష్యాతో కుదిరిన వాణిజ్య ఒప్పందంలో భాగంగా భారత్ చమురు కొనుగోలు చేస్తుంది.. ఇప్పడు ట్రంప్‌ను సంతోష పరచడానికి ఆ కొనుగోలును ఎలా నిలిపివేస్తందనేది సామాన్యుడికి మెదిలే ప్రశ్న. ట్రంప్ మాటే నెతన్యాహూకు శిరోధార్యంఇదిలా ఉంచితే, నిన్న(బుధవారం, జనవరి 7 వ తేదీ) ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహూ.. భారత్ ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేశారు. వారిద్దరూ పరస్పరం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఇరుదేశాల ప్రజలు శాంతి, సౌభాగ్యాలతో వర్థిల్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా గాజా శాంతి ప్రణాళిక అమలు గురించి మోదీకి నెతన్యాహు సవివరంగా తెలియజేశారు. ఇదంతా ఒకటైతే.. ఇక్కడ మరొక విషయం చర్చకు దారి తీసింది. అదే ట్రంప్ వ్యూహం. నెతన్యాహూ.. ట్రంప్‌కు అత్యంత సన్నిహితుడు. ట్రంప్ ఏం చెబితే అది నెతన్యాహూకు శిరోధార్యం. అది ఇరాన్తోయుద్ధంతో రుజువైంది. ఇరాన్‌తో యుద్ధం చేయమంటే చేశారు.. ఆపేయమంటే ఆపేశారు నెతన్యాహూ.ట్రంప్‌తో భేటీ తర్వాత వార్నింగ్‌ల పరంపరంఇటీవల అమెరికా పర్యటనకు వెళ్లారు నెతన్యాహూ. ట్రంప్‌తో కలవడానికి వెళ్లే ముందు ఇజ్రాయిల్ ఆర్మీకి కొన్ని ఆదేశాలు జారీ చేశారు. ఎటువంటి సైనిక చర్యలొద్దు అంటూ ఆదేశాల్లో పేర్కొన్నారు. ట్రంప్‌ను కలిసొచ్చిన తర్వాత చూద్దాం అని కూడా చెప్పారు. ఆ తరువాత అంటే ట్రంప్‌తో భేటీ ముగించుకుని ఇజ్రాయిల్‌కు వచ్చిన గంటల వ్యవధిలోనే లెబనాన్‌పై దాడులు చేసింది ఇజ్రాయిల్ వైమానిక దళం. దక్షిణ లెబనాన్‌లోని కొన్ని స్థావరాలపై దాడులు చేశారు. అక్కడ హెజ్బుల్లా ఆనవాళ్ల ఉన్నాయని అందుకే అక్కడ దాడులు చేశామని పేర్కొన్నాయి. ఇరుదేశాల మధ్య ఉన్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి మరీ దాడులకు పాల్పడ్డాయి. దీనిపై లెబనాన్ తీవ్రంగా మండిపడింది. ఇజ్రాయిల్ దుశ్చర్యకు తెరలేపిందంటూ ధ్వజమెత్తింది.ఇదిలా ఉంచితే,. ట్రంప్‌తో భేటీ తర్వాత ఇరాన్‌ను పరోక్షంగా హెచ్చరించింది ఇజ్రాయిల్. వెనెజువెలాలో ఏం జరిగిందో చూశారుగా అంటూ ఇరాన్‌ను హెచ్చరించింది. మీరు దారికి రాకపోతే వెనెజువెలాలో ఏం జరిగిందో అదే జరుగుతుంది అని ఇజ్రాయిల్ నేత ఒకరు వ్యాఖ్యానింఆరు. ఇదంతా అమెరికా అండగా చూసుకునే ఇజ్రాయిల్ ఇలా చేస్తుందనేది కాదనలేని సత్యం. మోదీకి నెతన్యాహూ ఫోన్.. దేనికి సంకేతం?మోదీకి సైతం నెతన్యాహూ ఫోన్ చేసి మాట్లాడారు. ద్వైపాక్షిక అంశాల గురించి, గాజాలో శాంతి గురించి, ఉగ్రవాదంపై పోరు గురించి మోదీతో నెతన్యాహూ ఫోన్లో చర్చించారనేది ప్రధాన సారాంశం. ఇరు దేశాల ప్రధానుల మధ్య చర్చ జరిగినా దేశ భవిష్యత్‌కు సంబంధించి కార్యాచరణ చర్చలే ఉంటాయి. ఇక్కడ కూడా అదే అనుకోవచ్చు. కానీ కొన్ని రోజులుగా భారత్, మోదీ అంటూ ప్రస్తావిస్తూ వస్తున్నారు ట్రంప్. తనను పూర్తిగా భారత్ సంతృప్తి పరచలేదంటూ వ్యాఖ్యానించారు కూడా. అయితే మోదీకి నెతన్యాహూ ఫోన్ అనేది ట్రంప్ వ్యూహంలో భాగం కాదనే విషయం కొట్టిపారేయలేం అని అంటున్నారు పలువురు విశ్లేషకులు. భారత్-అమెరికాల మధ్య పూర్తిగా సఖ్యత చెడిపోకపోయినప్పటికీ, కొన్ని నెలలుగా ఇరు దేశాల మధ్య గ్యాప్ ఏర్పడింది. ఆపరేషన్ సిందూర్ దగ్గర్నుంచి, సుంకాల పెంపు వరకూ ఇరు దేశాలు కాస్త దూరం పాటిస్తూ వస్తున్నాయి. అయితే భారత్‌తో శత్రుత్వం అంత మంచిది కాదని అమెరికా ప్రముఖలే వ్యాఖ్యానించిన నేపథ్యంలో ట్రంప్ ఈ రకంగా పావులు కదుపుతున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భారత్ పర్యటనకు ఓకేనా?ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహూ ఎప్పుడో భారత్ పర్యటనకు రావాలి. భారత్ పర్యటనకు వస్తానని గతంలో ఆయనే స్వయంగా ప్రకటించిన తరువాత.. ఆ పర్యటన నవంబర్ నుంచి డిసెంబర్‌లోపు ఉంటుందని భావించారు. కానీ అది జరగలేదు. ఇప్పుడు జనవరి వచ్చేసింది. అయితే నెతన్యాహూ అమెరికా పర్యటనకు వెళ్లారు కానీ భారత్ పర్యటనపై ఎటవంటి ప్రకటన చేయలేదు. అయితే భారత్ పర్యటనకు రావడానికే ముందుగా మోదీకి ఫోన్ చేసి టచ్‌లోకి వచ్చారంటున్నారు పలువురు విశ్లేషకలు. ఇదంతా కూడా ట్రంప్‌తో నెతన్యాహూ భేటీ తర్వాతే జరిగింది. అంటే నెతన్యాహూ భారత్‌లో పర్యటించడానికి కూడా ట్రంప్‌ను అడిగి ఉండొవచ్చనేది ఒక వాదనగా ఉంది. భారత్ పర్యటనకు నెతన్యాహూ చేపట్టడానికి ట్రంప్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చి ఉంటారని, అందుకే ముందస్తుగా ఇలా ఫోన్లతో మాటామంతీ కలుపుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదీ చదవండి:ట్రంప్ అసంతృప్తి లోగుట్టు! -
మోదీకి నెతన్యాహు ఫోన్
న్యూఢిల్లీ: ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు బుధవారం భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్లో మాట్లాడారు. వారిద్దరూ పరస్పరం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఇరుదేశాల ప్రజలు శాంతి, సౌభాగ్యాలతో వరి్ధల్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా గాజా శాంతి ప్రణాళిక అమలు గురించి మోదీకి నెతన్యాహు సవివరంగా తెలియజేశారు. భారత్, ఇజ్రాయెల్ ద్వైపాక్షిక సంబంధాలపై ఇద్దరు నేతలు చర్చించారు. రెండు దేశాల బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని నిర్ణయించారు. మానవాళికి పెనుముప్పుగా మారిన ఉగ్రవాదాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ సహించడానికి వీల్లేదని తేలి్చచెప్పారు. ఉమ్మడి ప్రయోజనాలతో ముడిపడి ఉన్న ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై ఇరువురు నేతలు అభిప్రాయాలు పంచుకున్నారు. -
ఇరాన్ బాలిస్టిక్ మిసైల్ ప్రయోగం.. ఉలిక్కిపడ్డ అమెరికా,ఇజ్రాయెల్
జెరుసలేం: మధ్యప్రాచ్యంలో మళ్లీ ఉద్రికత్తలు నెలకొన్నాయి. ఇరాన్ తన బాలిస్టిక్ మిసైల్ సామర్థ్యాన్ని విస్తరించుకుంటోందన్న ఆందోళనలతో అమెరికా, ఇజ్రాయెల్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో వచ్చేవారం (డిసెంబర్29) కీలక సమావేశానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో ఇరాన్ బాలిస్టిక్ మిసైల్ ప్రోగ్రామ్‌పై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన కోరనున్నట్లు రాజకీయ వర్గాలు వెల్లడించాయి.ఇరాన్ గత కొన్నేళ్లుగా తన బాలిస్టిక్ మిసైల్ ప్రోగ్రామ్‌పై దృష్టిసారించింది. ఇటీవల 10,000 కిలోమీటర్ల పరిధి కలిగిన కొత్త మిసైల్‌ను ఆవిష్కరించింది. ఇది అమెరికా ప్రధాన భూభాగాన్ని చేరగలదని ఇరాన్ ప్రకటించడం అంతర్జాతీయ వర్గాల్లో ఆందోళన కలిగించింది. ఈ పరిణామంపై ఇజ్రాయెల్ కూడా తీవ్రంగా స్పందిస్తూ, ఇరాన్ తీరును ప్రపంచ దేశాల ఎదుట తీర్పారబట్టే ప్రయత్నాలు చేస్తోంది.ఇజ్రాయెల్ ఆందోళనఇరాన్ మిసైల్ శ్రేణి ఇజ్రాయెల్ నగరాలను లక్ష్యంగా చేసుకునే స్థాయికి చేరుకుందని, ఇది మధ్యప్రాచ్య భద్రతకు తీవ్రమైన ముప్పు అని నెతన్యాహు అభిప్రాయపడుతున్నారు. దీనిపై అమెరికా తక్షణ చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. ట్రంప్ ఇరాన్‌పై కఠిన వైఖరిని కొనసాగిస్తున్న నేపథ్యంలో, నెతన్యాహు ఈ సమావేశాన్ని ఒక అవకాశంగా చూస్తున్నారు. ఇరాన్ మిసైల్ ప్రోగ్రామ్‌పై యూరోపియన్ యూనియన్ సహా అనేక దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ, ఇజ్రాయెల్ మాత్రం మరింత కఠిన చర్యలు అవసరమని పట్టుబడుతోంది.భవిష్యత్ ప్రభావంఈ సమావేశం ద్వారా అమెరికా–ఇజ్రాయెల్ సంబంధాలు మరింత బలపడే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. మధ్యప్రాచ్యంలో ఇరాన్ ప్రభావాన్ని తగ్గించేందుకు రెండు దేశాలు కలిసి వ్యూహాత్మక చర్యలు చేపట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇరాన్ బాలిస్టిక్ మిసైల్ ప్రోగ్రామ్ భవిష్యత్తులో మధ్యప్రాచ్య శాంతి, భద్రతకు కీలక సవాలు అవుతుందని ఇజ్రాయెల్ హెచ్చరిస్తోంది. ఈ తరుణంలో నెతన్యాహు–ట్రంప్ సమావేశం అంతర్జాతీయ రాజకీయాల్లో ప్రాధాన్యం సంతరించుకోనుంది. -
హైడ్రామా: గాజా ప్లాన్‌కు భద్రతా మండలి ఆమోదం
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన గాజా శాంతి ప్రణాళికకు మండలి మద్దతు తెలిపింది. మొత్తం 20 అంశాలుగా రూపొందించిన ఈ ప్రణాళికలో అంతర్జాతీయ బలగాల నియోగం, యుద్ధ విరామం, పునర్నిర్మాణం, పాలనకు మార్గదర్శకాలు ఉన్నాయి.స్థానిక కాలమానం ప్రకారం.. సోమవారం జరిగిన ఓటింగ్‌లో అమెరికా, యూకే, ఫ్రాన్స్, సోమాలియా సహా మొత్తం 13 దేశాలు మద్దతు తెలిపాయి. వీటో అధికారం ఉన్న రష్యా, చైనా తటస్థంగా నిలిచాయి. గత నెలలో యుద్ధ విరామం, బందీల విడుదల ఒప్పందంతో ప్రణాళిక మొదటి దశను అమలు చేసిన సంగతి తెలిసిందే. బోర్డ్ ఆఫ్ పీస్ అనే తాత్కాలిక సంస్థను ఏర్పాటు చేసి.. గాజా పునర్నిర్మాణాన్ని పర్యవేక్షించాలన్నది గాజా ప్లాన్ ఉద్దేశం. అంతేకాదు.. అంతర్జాతీయ స్థిరీకరణ బలగాలు.. అంటే ఐక్యరాజ్యసమితి లేదంటే అంతర్జాతీయ సమాజం ఆధ్వర్యంలో ఏర్పడే బలగాలు మోహరిస్తారు. గాజాలో శాంతి స్థాపన, భద్రత కల్పన, యుద్ధ విరామం అమలు, పునర్నిర్మాణానికి ఈ బలగాల సహకారం అందించనున్నాయి. హమాస్ ఖండనఅయితే.. ఈ తీర్మానాన్ని హమాస్ ఖండించింది. ఇది గాజా ప్రజల స్వతంత్రతను హరించడమేనని అంటోంది. పాలస్తీనా ప్రజల హక్కులను ఈ ప్రణాళిక విస్మరించిందని, గాజాపై అంతర్జాతీయ పాలనను రుద్దే ప్రయత్నమని ఆరోపించింది. ‘‘ఈ తీర్మానం పాలస్తీనా ప్రజల స్వాతంత్ర్యం, స్వయంపాలన హక్కులను గౌరవించడంలేదు. ఇక్కడి ప్రజల రాజకీయ ఆకాంక్షలను పక్కన పెట్టి తాత్కాలిక పాలనా సంస్థ పేరిట ఇతర దేశాల నిర్ణయాలను రుద్దే ప్రయత్నంగా కనిపిస్తోంది. గాజా భవిష్యత్తును గాజా ప్రజలే నిర్ణయించాలి. విదేశీ బలగాలు, పాలనా సంస్థలు తమ అభిప్రాయాలను రుద్దకూడదు’’ అని ఒక ప్రకటనలో అభిప్రాయపడింది.ట్రంప్ స్పందనట్రంప్ ఈ తీర్మానాన్ని "ఐక్యరాజ్యసమితి చరిత్రలో గొప్ప ఆమోదం"గా అభివర్ణించారు. "బోర్డ్ ఆఫ్ పీస్"కు తాను అధ్యక్షత వహిస్తానని, ప్రపంచంలోని శక్తివంతమైన నాయకులు ఇందులో భాగమవుతారని తెలిపారు. తద్వారా.. ట్రంప్ గాజా శాంతి ఒప్పందాన్ని తన నాయకత్వ విజయంగా పునరుద్ఘాటిస్తూనే.. అమెరికా ఆధ్వర్యంలోనే గాజా భవిష్యత్తును మలిచే ప్రణాళిక ఉండబోతోందని తెలియజేశారు.నెతన్యాహు తిరస్కరణఇదిలా ఉంటే.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పాలస్తీనా స్థాపన ప్రతిపాదనను తిరస్కరిస్తున్నారు. ఇది హమాస్‌కు బహుమతిలాంటిదేనని, తద్వారా ఇజ్రాయెల్ సరిహద్దులో మరింత ప్రమాదం ఏర్పడుతుందని అంటున్నారాయన. హమాస్ ఆయుధాలను వీడాల్సిందేనని.. తమదైన శైలిలో అయినా సరే ఆ లక్ష్యాన్ని సాధిస్తామని హెచ్చరించారు. -
నెతన్యాహును క్షమించండి.. ట్రంప్ లేఖ
జెరూసలేం: ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహును క్షమించాలంటూ ఆ దేశ అధ్యక్షుడు ఇసాక్ హెర్జోగ్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. నెతన్యాహుపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వచ్చాయి. కోర్టుల్లో విచారణ జరుగుతోంది. దోషిగా తేలితే పదవి నుంచి తప్పుకోవాల్సిందే.ఈ నేపథ్యంలో నెతన్యాహుకు మద్దతుగా ట్రంప్ లేఖ రాయడం గమనార్హం. నెతన్యాహుపై ఆరోపణలన్నీ రాజకీయ ప్రేరేపితమని ట్రంప్ పేర్కొన్నారు. ఆయనను విచారించడం న్యాయ సమ్మతం కాదని అభిప్రాయపడ్డారు. ఇజ్రాయెల్‌ను శాంతి మార్గంలో నడిపిస్తున్నారంటూ నెతన్యాహును ప్రశంసించారు. మరోవైపు ఇజ్రాయెల్ అంతర్గత వ్యవహారాల్లో ట్రంప్ పెత్తనం పెరిగిపోతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ట్రంప్ గత నెలలో ఇజ్రాయెల్ పార్లమెంట్లో ప్రసంగించారు. అప్పుడు కూడా నెతన్యాహును వెనకేసుకొచ్చారు. ఆయనను పెద్ద మనసుతో క్షమించాలని అన్నారు. -
ఇజ్రాయెల్‌ను మేమే రక్షించుకుంటాం.. అమెరికాపై ఆధారపడం: నెతన్యాహు
జెరూసలేం: ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ దేశం(ఇజ్రాయెల్) అమెరికా రక్షిత ప్రాంతం కాదని, ఎలాంటి ముప్పు ఎదురైనా ఇజ్రాయెల్ స్వయంగా ఎదుర్కుంటుందని ఆయన స్పష్టంగా తెలిపారు. ఇజ్రాయెల్ భద్రతను కాపాడేది ఇజ్రాయెల్ మాత్రమే. మేము ఇతర దేశాలపై ఆధారపడలేం అంటూ వ్యాఖ్యలు చేశారు.గాజా కాల్పుల విరమణ ఒప్పందం పురోగతిపై చర్చించేందుకు బుధవారం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో నెతన్యాహు సమావేశమయ్యారు. వాన్స్–నెతన్యాహు సమావేశంలో గాజా పరిస్థితి, హమాస్ కార్యకలాపాలు, యుద్ధానంతర పునరావాసం, అంతర్జాతీయ సాయంపై విస్తృతంగా చర్చించినట్లు సమాచారం. ఈ క్రమంలో నెతన్యాహు మాట్లాడారు. గాజాలో అంతర్జాతీయ దళాలను మోహరిస్తే భవిష్యత్తులో ఆ ప్రాంతం నుంచి ఉద్భవించే భద్రతా ముప్పులకు ఇజ్రాయెల్ సమాధానం చెప్పే అవకాశాలు తగ్గిపోతాయని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ భద్రతను కాపాడేది ఇజ్రాయెల్ మాత్రమే. మేము ఇతర దేశాలపై ఆధారపడలేం అని స్పష్టం చేశారు. గాజా యుద్ధం తరువాత భవిష్యత్తు పరిపాలనపై అంతర్జాతీయ వర్గాలు వివిధ ప్రతిపాదనలు చేస్తుండగా నెతన్యాహు వ్యాఖ్యలు కీలకంగా మారాయి.అంతకుముందు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, నెతన్యాహు కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేడీ వాన్స్ మాట్లాడుతూ.. ఇజ్రాయెల్, అమెరికా ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. హమాస్‌ను నిరాయుధీకరణ చేయడం, ఆ సంస్థ ఇకపై ఇజ్రాయెల్‌కు ముప్పుగా మారకుండా చూసుకోవడం, గాజాను పునర్నిర్మించడం వంటి అంశాలు సులభం కావు. కానీ మేము ఆశావహ దృక్పథంతో ముందుకు వెళ్తున్నాం’ అని చెప్పుకొచ్చారు.సమగ్ర పరిష్కారమే అవసరంగాజా సంక్షోభం తగ్గించాలంటే రాజకీయ స్థాయిలో సమగ్ర పరిష్కారం అవసరమని నిపుణులు పేర్కొంటున్నారు. హమాస్ నిరాయుధీకరణతో పాటు పౌరుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వకపోతే మళ్లీ ఉద్రిక్తతలు చెలరేగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. నెతన్యాహు, వాన్స్ సమావేశం అనంతరం ఇరుదేశాల ప్రతినిధులు విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో..ఇజ్రాయెల్ భద్రతా హక్కును అమెరికా గౌరవిస్తుంది. గాజాలో మానవతా సాయం అందించడంలో ఇరుదేశాలు కలిసి పని చేస్తాయని పేర్కొన్నారు. గాజా యుద్ధం తగ్గుముఖం పట్టినా, రాజకీయ స్థాయిలో ఒప్పందాలు సాఫీగా సాగకపోవడం అంతర్జాతీయ వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ పరిస్థితుల్లో నెతన్యాహు చేసిన వ్యాఖ్యలు గాజా భవిష్యత్తుపై కొత్త చర్చలకు దారితీశాయి. -
Gaza Truce: స్వరం మార్చిన అమెరికా అధ్యక్షుడు
గాజా శాంతి ఒప్పందానికి ఇజ్రాయెల్, హమాస్‌లు తూట్లు పొడుస్తున్నాయి. పరస్పర ఆరోపణలతో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ దాడులకు పాల్పడుతున్నాయి. తాజాగా ఈ పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా స్పందించాడు. మంచిగా ఉండకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారాయన. హమాస్ సంస్థకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గట్టి హెచ్చరికలు జారీ చేశారు. మంచిగా ఉండాలని.. లేకుంటే అంతం తప్పదని అన్నారు. సోమవారం మీడియాతో ట్రంప్ ఇలా మాట్లాడారు.. ‘‘మంచిగా ఉండాలనే హమాస్‌తో ఒప్పందం కుదిర్చాం. కానీ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తామంటే ఊరుకోం. హమాస్ మళ్లీ రక్తపాతం కోరుకుంటే మాత్రం వాళ్లకు అంతం తప్పదు’’ అని పేర్కొన్నారు... కాల్పుల విరమణకు కొంత అవకాశం ఇస్తాం. హింస తగ్గుతుందని ఆశిస్తున్నాం. కానీ దాడులు కొనసాగితే ప్రతిస్పందన తప్పదు. వాళ్లు కొనసాగిస్తే మేమే రంగంలోకి దిగుతాం. ఆ పరిష్కారం చాలా వేగంగా.. తీవ్రంగా ఉంటుంది. అలాగని మా సైనికులను అక్కడికి పంపించబోం. శాంతి ఒప్పందంలో సంతకాలు చేసిన ఇతర దేశాలే ఆ సంగతి చూసుకుంటాయి. ఇజ్రాయెల్‌ను కోరితే కేవలం రెండు నిమిషాల్లో అక్కడ వాలిపోతారు. వెళ్లి వాళ్ల అంతు చూడండి అంటే.. చూసేస్తారు. కానీ, ఇప్పటివరకు నేను అలా చెప్పలేదు. అందుకే హమాస్‌కు మరో అవకాశం ఇస్తున్నా’’ అని ట్రంప్ అన్నారు.2023 అక్టోబర్ 7వ తేదీన మొదలైన గాజా యుద్ధం.. రెండేళ్ల తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ప్రణాళికతో ఆగింది. హమాస్, ఇజ్రాయెల కాల్పుల విరమణకు అంగీకరించడంతో పాటు పలు షరతులకు అంగీకరించడంతో అక్టోబర్ 13వ తేదీ నుంచి గాజా శాంతి ఒప్పందం అమల్లోకి వచ్చింది. అయితే.. అక్టోబర్ 19వ తేదీన దక్షిణ గాజా రఫాలో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్(Israel Defense Forces) ఇంజనీరింగ్ వాహనంపై ఓ ఆంటీ-ట్యాంక్ మిస్సైల్ దూసుకొచ్చింది. ఈ దాడిలో ఇద్దరు ఇజ్రాయెల్ సైనికులు మరణించారు. ఈ ఘటనను ఇజ్రాయెల్ తీవ్రంగా పరిగణించి వైమానిక దాడులు జరపడంతో 19 మంది పాలస్తీనీయులు మరణించారు. తొలుత ఇజ్రాయెల్ బలగాలే దాడులు జరిపాయని హమాస్, హమాసే దాడి చేసిందని ఇజ్రాయెల్ పరస్పరం ఆరోపించుకున్నాయి.ఈ నేపథ్యంలో.. శాంతి ఒప్పందానికి వచ్చిన ఢోకా ఏం లేదని, తాజా దాడితో హమాస్ నాయకత్వంతో సంబంధాలు ఉండకపోవచ్చని, అది పూర్తిగా హమాస్ రెబల్స్ పని అయ్యిండొచ్చని ట్రంప్ మొన్న అభిప్రాయపడ్డారు. అయితే.. ఇరు వర్గాల దాడుల నేపథ్యంలో.. శాంతి ప్రణాళిక అమల్లో సంగ్దిగ్దత నెలకొంది. ఈ క్రమంలో ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా. అమెరికా ప్రతినిధులు జెరెడ్ కుష్నర్, స్టీవ్ విట్కాఫ్ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూతో భేటీ కానున్నారు. సరిగ్గా.. ఈ సమయంలో ట్రంప్ మరోసారి స్వరం మార్చేసి హమాస్‌కు తీవ్ర హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం.ట్రంప్ మొన్న.. గాజా శాంతి ఒప్పందానికి వచ్చిన ఢోకా ఏం లేదు. కాల్పుల విరమణ ఇంకా అమలులో ఉంది. హమాస్ నాయకత్వానికి ఈ దాడులతో సంబంధం లేకపోయి ఉండొచ్చు. రెబల్స్ గ్రూప్స్ ఈ దాడులకు పాల్పడి ఉండొచ్చు. ట్రంప్ తాజాగా.. హమాస్ మంచిగా ఉండాలి. లేకుంటే వాళ్లకు అంతు తప్పదు. ఇజ్రాయెల్‌కు ఒక్కమాట చెబితే.. పరిస్థితి తీవ్రంగా ఉంటుంది. కానీ, మరో అవకాశం ఇస్తున్నా. -
భారత్ పర్యటనకు నెతన్యాహు.. అమెరికాకు షాక్!
జెరూసలేం: భారత్-ఇజ్రాయెల్ మధ్య దౌత్య సంబంధాల్లో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. ఈ ఏడాది చివరిలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు భారత్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటనతో రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలపడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.అమెరికా ఒత్తిడిని పక్కనపెట్టి భారత్ వైపు అడుగులుచైనా, భారత్, రష్యా వంటి దేశాలపై టారిఫ్‌ల పేరుతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరింపులకు దిగుతున్నారు. హమాస్‌తో యుద్ధాన్ని ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఇజ్రాయెల్‌కు హెచ్చరించారు. ఆ హెచ్చరికలకు తలొగ్గి కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ ముందుకు వచ్చింది. అయినప్పటికీ హమాస్‌తో కాల్పుల విరమణ ఒప్పందం ఉన్నప్పటికీ.. ఆ సంస్థ పూర్తిగా ఆయుధాలు విడిచిపెట్టి లొంగిపోయే వరకు గాజాలో యుద్ధం ముగియదని ఆయన స్పష్టం చేశారు. ఈ పరిస్థితుల్లో, అమెరికా ఒత్తిడిని పక్కనపెట్టి భారత్‌తో సత్సంబంధాలను మెరుగుపరచేందుకు ఇజ్రాయెల్ ప్రధాని భారత్‌లో పర్యటించనున్నారంటూ పలు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. వ్యూహాత్మక రంగాల్లో సహకారంనెతన్యాహు పర్యటన సందర్భంగా ఇరు దేశాలు శాస్త్ర సాంకేతిక రంగం, అంతరిక్ష పరిశోధనలు, రక్షణ, వాణిజ్యం, వ్యవసాయం, నీటి నిర్వహణ వంటి కీలక రంగాల్లో భారత్‌తో ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశముంది. ఇప్పటికే ఇజ్రాయెల్, భారత్ మధ్య రక్షణ రంగంలో అనేక ఒప్పందాలు కొనసాగుతున్నాయి. ఈ పర్యటన ద్వారా వాటిని మరింత విస్తరించే అవకాశం ఉంది.అంతర్జాతీయ రాజకీయాల్లో భారత్ పాత్రఈ పరిణామం ద్వారా భారత్ అంతర్జాతీయ రాజకీయాల్లో తన ప్రాధాన్యతను మరోసారి నిరూపించుకుంటోంది. అమెరికా, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతల సమయంలో భారత్‌తో ఇజ్రాయెల్ సత్సంబంధాలను మెరుపరచడం, భారత్‌కు ఉన్న వ్యూహాత్మక ప్రాధాన్యతను సూచిస్తుంది.ప్రపంచ వేదికపై భారత్ తన దౌత్య నైపుణ్యాన్ని సమర్థంగా ప్రదర్శిస్తోంది. అమెరికా టారిఫ్ బెదిరింపులకు వెనక్కి తగ్గకుండా, ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశాలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ..అంతర్జాతీయ స్థాయిలో తన స్థానాన్ని మరింత బలపరుస్తోంది. ఇప్పటికే ఆప్తమిత్రుడిగా ఉన్న రష్యాతో చమురు కొనుగోలు ద్వారా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలపరుచుకుంది. ఓ వైపు యుద్ధం వల్ల తీవ్రంగా నష్టపోయిన గాజా ప్రజలకు మానవతా సహాయం అందిస్తూ, మరోవైపు ఇజ్రాయెల్‌తో సైనిక పరమైన ఒప్పందాలు కుదుర్చుకుంటూ, సమతుల్యమైన దౌత్యాన్ని కొనసాగిస్తోంది. ఈ విధంగా, భారత్ తన అంతర్జాతీయ సంబంధాలను వ్యూహాత్మకంగా విస్తరించుకుంటూ, ప్రపంచ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తోంది. -
గాజా యుద్ధం మళ్లీ మొదటికి! ట్రంప్ ఏమన్నారంటే..
గాజా సంక్షోభం మళ్లీ మొదటికి వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాల్పుల విమరణ ఒప్పందం కుదిరినప్పటి నుంచి ఇప్పటిదాకా జరిగిన దాడుల్లో.. ఇద్దరు ఇజ్రాయెల్ సైనికులు, 97 మంది పాలస్తీనీయులు మరణించారు. శాంతి ఒప్పందం ఉల్లంఘనపై ఇరు దేశాలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఈ తరుణంలో.. తాజా పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఆదివారం రాత్రి మార్-ఎ-లాగో నుంచి వాషింగ్టన్కు తిరుగు ప్రయాణం అవుతుండగా.. ఓ రిపోర్టర్ గాజా తాజా పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ప్రశ్నించారు. గాజా కాల్పుల విరమణ ఒప్పందం ఇంకా అమల్లో ఉందని భావిస్తున్నారా? అనే అడగ్గా.. ఆయన ‘అవును’ అనే సమాధానం ఇవ్వడం కొసమెరుపు. ‘‘గాజా శాంతి ఒప్పందానికి వచ్చిన ఢోకా ఏం లేదు. మేము హమాస్‌తో పరిస్థితి చాలా శాంతియుతంగా ఉండేలా చూసుకోవాలనుకుంటున్నాం. కానీ, మీకు తెలుసు కదా.. వాళ్లు కొంచెం అతి చేస్తున్నారు. కొన్ని చోట్ల కాల్పులకు దిగుతున్నారు. అయితే.. ఆ దాడులకు హమాస్ నాయకత్వానికి సంబంధం లేదేమో అనిపిస్తోంది. బహుశా రెబల్స్ ఈ తరహా ఘటనలకు పాల్పడుతున్నారేమో. అయినా సరే.. ఈ వ్యవహారాన్ని పరిష్కరిస్తాం. అందుకోసం కఠినంగా అయినా వ్యవహరిస్తాం’’ అని ట్రంప్ సున్నితంగా హెచ్చరికలు జారీ చేశారు.ఏం జరిగిందంటే.. దక్షిణ గాజాలోని రఫా (Rafah) వద్ద ఇజ్రాయెల్ రక్షణ బలగాలపై హమాస్ దాడి జరిపింది. ఈ దాడిలో ఇద్దరు సైనికులు చనిపోయారు. ప్రతిగా ఇజ్రాయెల్ బలగాలు జరిపిన వైమానిక దాడుల్లో 19 మంది పాలస్తీనీయులు మరణించారు.ఇజ్రాయెల్ యాక్షన్.. అక్టోబర్ 19వ తేదీన ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్(Israel Defense Forces) ఇంజనీరింగ్ వాహనంపై ఓ ఆంటీ-ట్యాంక్ మిస్సైల్ దూసుకొచ్చింది. ఈ దాడిలో ఇద్దరు ఇజ్రాయెల్ సైనికులు మరణించారు. ఈ ఘటనను ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తీవ్రంగా పరిగణించారు. ఇది హమాస్ పనేనని, కాల్పుల విరమణ ఒప్పందానికి స్పష్టమైన ఉల్లంఘనగా పేర్కొంటూ.. గాజాకు మానవతా సాయం ఆపేశారు. అంతేకాదు.. ప్రతిదాడులతో ప్రతీకారం తీర్చుకోవాలని సైన్యాన్ని ఆదేశించారు.దీంతో.. గాజాలోని రఫా నగరంపై ఇజ్రాయెల్ బలగాలు దాడులు జరిపాయి. ఈ తాజా దాడుల్లో 19 మంది పాలస్తీనయులు మరణించారు. హమాస్ ఏమందంటే.. ఇదిలా ఉంటే రఫా దాడికి హమాస్.. రక్షణాత్మక చర్యలుగా చెబుతోంది. ఇజ్రాయెల్ బలగాలే తమపై ముందుగా దాడులు చేశాయని, ప్రతిగానే తామూ దాడులు చేయాల్సి వచ్చిందని చెబుతోంది. దీంతో ఇరు దేశాలు శాంతి ఒప్పందానికి తూట్లు పొడిచినట్లైంది. ఈ పరస్పర ఆరోపణలు.. గాజాలో శాంతి స్థితిని మరింత సంక్లిష్టంగా మార్చేసే పరిస్థితి నెలకొంది. అయితే.. ఈ దాడులతో గాజా శాంతి ఒప్పందానికి వచ్చిన నష్టమేమీ లేదని ట్రంప్ అంటున్నారు. ఇదీ చదవండి: నువ్వేం రాజువి కాదయ్యా బాబూ! -
ఇజ్రాయెల్‌లో సంబరాలు.. హమాస్ నుంచి బందీల విడుదల
జెరూసలేం: దాదాపు రెండేళ్లుగా హమాస్ చెరలో బందీలుగా ఉన్న వారికి విముక్తి లభించింది. గాజాలో బందీల విడుదల మొదలైంది. తొలివిడతలో తాజాగా ఏడుగురు ఇజ్రాయెల్ బందీలను హమాస్.. రెడ్ క్రాస్‌కు అప్పగించింది. ఆ తర్వాత కొద్ది సేపటికి మిగిలిన వారిని విడుదల చేసినట్టు తెలుస్తోంది. దీంతో, ఇప్పటికే రెడ్‌క్రాస్ వాహనశ్రేణి ఖాన్ యూనిస్‌కు చేరుకుంది.ఈ క్రమంలో ప్రధాని నెతన్యాహు, ఆయన సతీమణి బందీలకు స్వాగతం పలుకుతూ సందేశం విడుదల చేశారు. ఈ మేరకు టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ వెల్లడించింది. మరోవైపు.. బందీల కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు.. తమ వారి కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు బయటకు వచ్చాయి. బందీలు హమాస్ నుంచి విడుదల అవుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్‌లో సంబురాలు చేసుకుంటున్నారు. హమాస్‌పై యుద్ధంలో తాము విజయం సాధించినట్టు సంబురాలు జరుపుకుంటున్నారు. Prime Minister Netanyahu is receiving real-time updates on the ongoing release of the hostages and is in continuous contact with hostage affairs coordinator Gal Hirsch. pic.twitter.com/JRAnwOXTK9— Cheryl E 🇮🇱🎗️ (@CherylWroteIt) October 13, 2025 Fantastisch nieuws.Eerste gijzelaars vrijgelaten.Uit de handen van de islamitische terreurbeweging Hamas.Na twee lange jaren weer vrij.Terug naar hun geliefden en familie in Israël!❤️#HostageRelease #Israel pic.twitter.com/VT7EXuFekX— Geert Wilders (@geertwilderspvv) October 13, 2025ఇదిలా ఉండగా.. 2023 అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై దాడి చేసి 1200 మందిని హత్య చేసి, 251 మందిని హమాస్ అపహరించిన విషయం తెలిసిందే. వారిలో కొంత మందిని గతంలో విడుదల చేసింది. కొందరిని ఇజ్రాయెల్ సైన్యం రక్షించింది. మరికొంత మంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించిన 20 సూత్రాల శాంతి ప్రణాళిక తొలి దశలో భాగంగా ఇజ్రాయెల్, హమాస్ ఇటీవల కాల్పుల విరమణకు అంగీకరించాయి. శుక్రవారం నుంచి ఈ ఒప్పందం అమల్లోకి వచ్చింది.#BREAKING: First Israeli hostages to be released by Hamas at the Re'im base are Alon Ohel, Matan Angrest, brothers Gali and Ziv Berman, Eitan Mor and Omri Miren. #HostageRelease #Israel #Gaza pic.twitter.com/JCci4e7rJQ— OSINT Spectator (@osint1117) October 13, 2025ఇందులో భాగంగా తమ వద్ద ఉన్న 48 మంది బందీలను హమాస్ విడిచిపెట్టనుంది. ఇందులో 20 మంది సజీవంగా ఉన్నారు. ఇందుకు ప్రతిగా 2వేల మందికి పైగా పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేయనుంది. వీరంతా సోమవారం సాయంత్రం జైళ్ల నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది. ఈ విడుదల కార్యక్రమం ముగిసిన తర్వాత ట్రంప్ శాంతి ప్రణాళికలో రెండో దశపై చర్చలు ప్రారంభమవుతాయి. ఇందులో హమాస్ ఆయుధాలను త్యజించడం.. గాజా నుంచి ఇజ్రాయెల్ దళాల ఉపసంహరణ ప్రధాన అంశాలు. ఈ చర్చలకు అమెరికా, ఈజిప్టు, ఖతార్ మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ⚡️BREAKING:Seven Israeli hostages have been handed over to the Red Cross as part of the ongoing peace agreement between Israel and Hamas.#BreakingNews #HostageRelease #Gaza #RedCross #PeaceDeal pic.twitter.com/BiJrOUOBmn— Tabish Rahman (@Tabishtabi11) October 13, 2025In Israel tens of thousands are already out in the streets to experience the return of the hostages, together. pic.twitter.com/Dc36YuGmzO— Israel News Pulse (@israelnewspulse) October 13, 2025 -
పశ్చిమాసియాకు ట్రంప్.. భారత్ తరఫున కీర్తివర్దన్‌సింగ్
గాజా యుద్ధాన్ని ముగించానన్న జోష్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) నేడు పశ్చిమాసియాలో పర్యటించనున్నారు. తొలుత ఇజ్రాయెల్‌లో పర్యటించి.. అక్కడి నుంచి ఈజిప్ట్‌లో జరగబోయే అత్యున్నతస్థాయి శాంతి సదస్సులో పాల్గొంటారు. కాల్పుల విరమణ తర్వాత ట్రంప్ పర్యటన కావడం సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. పర్యటనకు బయల్దేరే ముందు ట్రంప్ ఎయిర్‌పోర్టులో రాయిటర్స్‌తో మాట్లాడారు. గాజా యుద్ధం ముగిసిందని ప్రకటించిన ఆయన.. విషయం అర్థమై ఉంటుందని వ్యాఖ్యానించారు. అతిత్వరలో సాధారణ పరిస్థితులు నెలకొనబోతున్నాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్ పర్యటనలో భాగంగా.. తొలుత ఇజ్రాయెల్ పార్లమెంట్ క్నెసెట్(Trump In Israel Parliament)లో ప్రసంగిస్తారు. ఈ పర్యటనలో ఆ దేశంలో పర్యటించిన నాలుగో అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ నిలవనున్నారు. అటు నుంచి ఆయన ఈజిప్ట్‌కు వెళ్లి.. శర్మ్ ఎల్-షేక్ నగరంలో అత్యున్నత స్థాయి శాంతి సదస్సులో పాల్గొంటారు. కాల్పుల విరమణలో ఖతార్ దేశ మధ్యవర్తిత్వాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. అలాగే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చక్కగా పని చేశారని ప్రశంసించారు. బంధీల విడుదల కూడా ఊహించిన దానికంటే ముందే జరగొచ్చని, ధ్వంసమైన గాజాను బోర్డ్ ఆఫ్ పీస్ ద్వారా పునర్విర్మిస్తామని అన్నారాయన. యూదులు, ముస్లింలు, అరబ్ దేశాలు.. అంతా సంతోషంగా ఉన్నారని అన్నారాయన. గాజా శాంతి సదస్సుఇదిలా ఉంటే.. ఇవాళ శర్మ్ ఎల్-షేక్ నగరం(Sharm El-Sheikh Summit)లో జరగనున్న సదస్సుకి 20కి పైగా ప్రపంచ దేశాల నేతలు, ప్రతినిధులు పాల్గొననున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఈజిప్ట్ అధ్యక్షుడు అల్-సిసి సంయుక్త అధ్యక్షతన ఈ సదస్సు జరగనుంది. శాంతి ఒప్పందానికి రూపకల్పన చేయడం, గాజా పునర్నిర్మాణం ప్రధాన లక్ష్యాలుగా ఈ సదస్సు జరగనుంది. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి గుటెరస్, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా కూడా హాజరుకానున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఆహ్వానం అందించింది. అయితే ఆయన తరఫున విదేశీ వ్యవహారాల శాఖ సహాయక మంత్రి కీర్తివర్దన్‌సింగ్ హాజరు కానున్నారు. బందీల విడుదల.. నేడేదాదాపు రెండేళ్లుగా హమాస్ చెరలో బందీలుగా ఉన్న వారికి సోమవారం తెల్లవారుజామున విముక్తి కలగనుంది. గాజాలో మూడు ప్రాంతాల్లో వారిని హమాస్ విడుదల చేయనుంది. ఇజ్రాయెల్ బలగాలు, హమాస్ మధ్య ఆదివారం వరకు కాల్పుల విరమణ కొనసాగింది. సోమవారం ఉదయం 20 మంది బంధీలు విడుదలవుతారని ఇజ్రాయెల్ అధికార ప్రతినిధి షోష్ బెడ్రోసియన్ ప్రకటించారు. ఒప్పందం ప్రకారం.. హమాస్ మొత్తం బంధీలను మధ్యాహ్నం 12 గంటలలోగా విడుదల చేయాల్సి ఉంటుంది. అలాగే ఇజ్రాయెల్ 250 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేయనుంది. అయితే హమాస్ సీనియర్ కమాండర్లను మాత్రం విడుదల చేయడం లేదని తెలుస్తోంది. అయితే.. గాజా యుద్ధం మొదలైనప్పటి నుంచి బంధించిన మరో 1,700 పాలస్తీనా పౌరుల్ని(ఇందులో 22 మైనర్లు, 360 మిలిటెంట్ల మృతదేహాలు కూడా ఉన్నాయి) విడుదల చేయనున్నటలు ఇజ్రాయెల్ ధృవీకరించింది.తాజా పరిణామాలపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పందించారు. హమాస్‌పై విజయం సాధించాం అని ప్రకటించారాయన. అయితే.. భద్రతా సవాళ్లు ఇంకా మిగిలే ఉన్నాయని వ్యాఖ్యానించడం గమనార్హం. ఇక బందీల విడుదల నేపథ్యంలో ఇజ్రాయెల్ బలగాలు ‘ఆపరేషన్ రిటర్నింగ్ హోంOperation Returning Home’ చేపట్టాయి. 2023 అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి చేయడంతో 1,200 మంది మరణించారు. ఆపై 251 మందిని హమాస్ అపహరించిన సంగతి తెలిసిందే. వారిలో కొంత మందిని గతంలో విడుదల చేసింది. కొందరిని ఇజ్రాయెల్ సైన్యం రక్షించింది. మరికొంత మంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించిన 20 సూత్రాల శాంతి ప్రణాళిక తొలి దశలో భాగంగా ఇజ్రాయెల్, హమాస్ ఇటీవల కాల్పుల విరమణకు అంగీకరించడంతో గాజా సంక్షోభానికి ఎండ్ కార్డ్ పడింది. ఇదీ చదవండి: సైనిక తిరుగుబాటుతో అట్టుడికిన మడగాస్కర్! -
గాజాలో అమల్లోకి కాల్పుల విరమణ
గాజా/ కైరో: హమాస్ అంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్ రెండేళ్ల క్రితం గాజాలో ప్రారంభించిన విధ్వంసక యుద్ధం ముగిసిన జాడలు కనిపిస్తు న్నాయి. శుక్రవారం మధ్యాహ్నం నుంచి గాజాలో ప్రశాంత వాతావరణం నెలకొంది. పాలస్తీని యన్లపై కాల్పులు, వైమానిక దాడులు నిలిచిపోయాయి. ఆ ప్రాంతంలో కాల్పుల విరమణ ఒప్పందం మధ్యాహ్నం నుంచి అమల్లోకి వచ్చినట్లు ఇజ్రాయెల్ సైన్యం సైతం ధ్రువీకరించింది. యుద్ధానికి విరామం ఇవ్వడానికి, మిగిలిన బందీలను పాలస్తీనా ఖైదీలతో మార్పిడి చేయడానికి సంబంధించిన ఒప్పందాన్ని ఇజ్రాయెల్ మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు ప్రధాని నెతన్యాహూ ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఆర్మీ ఈ మేరకు ప్రకటించడం గమనార్హం. దీంతో, సెంట్రల్ గాజాలోని వాడి గాజాలో గుమికూడిన వేలాది మంది పాలస్తీనియన్లు ఉత్తర ప్రాంతంలోని తమ సొంత నివాసాల దిశగా నడక సాగించారు. 24 గంటల్లో 11 మంది మృతిగురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు గాజా వ్యాప్తంగా ఇజ్రాయెల్ ఆర్మీ భారీగా కాల్పులు జరిపిందని స్థానికులు తెలిపారు. ఆర్మీ ప్రకటన తర్వాత కాల్పుల శబ్దాలు వినిపించలేదన్నారు. సైనిక విమానాలు తక్కువ ఎత్తులో ఎగురుతూ కనిపించాయని చెప్పారు. ఇలా ఉండగా, 24 గంటల వ్యవధిలో గాజా వ్యాప్తంగా ఇజ్రాయెల్ ఆర్మీ చేపట్టిన దాడుల్లో 11 మంది పాలస్తీనియన్లు చనిపోగా మరో 49 గాయపడ్డారని గాజా ఆరోగ్య విభాగం తెలిపింది. తమ బలగాలకు ప్రమాదకరమనిపించిన లక్ష్యాలపైనే దాడులు జరిపినట్లు ఇజ్రాయెల్ పేర్కొంది. దీనిపై హమాస్ మండిపడింది. విడుదలవనున్న మర్వాన్ బర్ఘౌటిఒప్పందం ప్రకారం...గాజా నుంచి ఇజ్రాయెల్ బలగాలను ఉపసంహరించుకున్న అనంతరం హమాస్ తమ వద్ద బందీలుగా ఉన్న 48 మందిని విడుదల చేయాల్సి ఉంటుంది. వీరిలో కనీసం 20 మంది మాత్రమే సజీవంగా ఉన్నట్లు భావిస్తున్నారు. ఇందుకు బదులుగా 2 వేల మంది పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడిచిపెడుతుంది. వీరి జాబితాను శుక్రవారం అధికారులు విడుదల చేశారు. ఇందులో పాలస్తీనా అత్యధిక ప్రజాదరణ కలిగిన నేత మర్వాన్ బర్ఘౌటి కూడా ఉన్నారు. బందీలు, ఖైదీల విడుదల ఆదివారం రాత్రి లేదా సోమవారం మొదలవుతుందని మధ్యవర్తులుగా వ్యవహరించిన ఈజిప్టు అధికారులు తెలిపారు. సిద్ధంగా మానవతా సాయంగాజాలో నెలకొన్న తీవ్ర కరువు పరిస్థితుల నేపథ్యంలో మానవతా సాయం తీసుకువచ్చిన ట్రక్కులు సాధ్యమైనంత త్వరగా చేరుకునేందుకు ఈజిప్టు, గాజా మధ్యనున్న రఫా సహా ఐదు సరిహద్దులను తెరిచి ఉంచనున్నారు. సుమారు 1.70 లక్షల టన్నుల మందులు, ఆహారం, ఇతర అత్యవసరా లను గాజాలోకి తరలించేందుకు సిద్ధంగా ఉన్నామని ఐరాస మానవతా సాయం చీఫ్ టామ్ ఫ్లెచర్ తెలిపారు. సానుకూల సంకేతాలు అందిన వెంటనే రంగంలోకి దిగుతామని చెప్పారు. ఇజ్రాయెల్‌తో కుదిరిన డీల్ ప్రకారం కాల్పుల విరమణ ఒప్పందం అమలును పర్యవేక్షించేందుకు 200 మంది సైనికులను గాజాకు పంపుతామని అమెరికా అధికారులు చెప్పారు.కత్తి మెడపైనే ఉంది: నెతన్యాహూఅమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెరపైకి తెచ్చిన కాల్పుల విరమణ ప్రణాళికలో పేర్కొన్న హమాస్ నిరాయుధీకరణ, గాజా భవిష్యత్తు పాలన వంటి అంశాలపై ఎటువంటి స్పష్టత లేదు. ‘ట్రంప్ ప్రకటనలో తర్వాతి భాగం హమాస్ నిరాయుధీకరణే. ఇది సులువుగా జరిగితే సరేసరి. లేదంటే బలవంతంగానైనా సాధిస్తాం. మెడపై కత్తి ఉందని తెలిసే హమాస్ ఒప్పందానికి వచ్చింది. ఇప్పటికీ కత్తి మెడపైనే ఉంది’అని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ పేర్కొనడం గమనార్హం. కాగా, శుక్రవారం మధ్యాహ్నం అధికారికంగా కాల్పుల విరమణ ప్రారంభమవడానికి కొద్ది గంటల ముందుగానే బలగాల ఉపసంహరణ పూర్తయిందని ఇజ్రాయెల్ బ్రిగేడియర్ జనరల్ ఎఫ్పీ డెఫ్రిన్ చెప్పారు. ఉపసంహరణ అంశం సున్నితత్వం దృష్ట్యా గాజాలోని ఇటీవల స్వాధీనం చేసుకున్న 50 శాతం ప్రాంతంలో బలగాలు కొనసాగుతాయని ఓ సైనికాధికారి పేర్కొనడం విశేషం. -
ట్రంప్, నెతన్యాహుకు మోదీ ఫోన్.. ఎందుకంటే?
ఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో(Donald Trump) పాటు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకి(Benjamin Netanyahu) ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఫోన్ చేశారు. ఈ సందర్భంగా చారిత్రాత్మక గాజా శాంతి ప్రణాళిక విజయంపై ట్రంప్‌నకు మోదీ అభినందనలు తెలిపారు. బందీల విడుదల, గాజా ప్రజలకు మెరుగైన మానవతా సహాయంపై ఒప్పందాన్ని స్వాగతిస్తున్నట్లు నెతన్యాహుకు చెప్పారు. ఈ మేరకు సోషల్ మీడియాలో మోదీ వెల్లడించారు.ఇక, అంతకంటే ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో కూడా ప్రధాని మోదీ ఫోన్లో మాట్లాడారు. చరిత్రాత్మక గాజా(Gaza Peace) శాంతి ప్రణాళిక విజయవంతం కావడానికి కృషి చేసినందుకు ట్రంప్‌నకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వాణిజ్య చర్చల గురించి కూడా తాము సంభాషించుకున్నామని మోదీ వెల్లడించారు. రానున్న రోజుల్లో సన్నిహిత సంబంధాలు కొనసాగించేందుకు పరస్పరం అంగీకరించినట్లు పేర్కొన్నారు. ఈ విషయాలను ట్విట్టర్ వేదికగా మోదీ చెప్పుకొచ్చారు.ఇదిలా ఉండగా.. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు (Benjamin Netanyahu) ప్రధాని మోదీ (PM Modi) ఫోన్లో మాట్లాడుకున్నారు. ఈ క్రమంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. తన స్నేహితుడు మోదీతో మాట్లాడేందుకు కీలక సమావేశాన్ని కూడా నెతన్యాహు తాత్కాలికంగా ఆపేసుకున్నారు. హమాస్‌తో ఒప్పందానికి సంబంధించి చర్చించేందుకు ఇజ్రాయెల్ భద్రతా కేబినెట్ భేటీ అయ్యింది. ఇందులో నెతన్యాహుతో సహా పలు కీలక అధికారులు పాల్గొన్నారు. ఈ క్రమంలోనే భారత ప్రధాని మోదీ నుంచి ఫోన్ వచ్చింది. దీంతో నెతన్యాహు వెంటనే సమావేశాన్ని తాత్కాలికంగా ఆపి మరీ మోదీతో మాట్లాడారు. బందీల విడుదలకు కుదిరిన ఒప్పందంపై నెతన్యాహును మోదీ అభినందించారని ఇజ్రాయెల్ ప్రధాన కార్యాలయం తెలిపింది. -
గాజా@2: యుద్ధం ముగిసేది ఎప్పుడంటే.. నెతన్యాహు ఆసక్తికర వ్యాఖ్యలు
గాజాలో ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం(Gaza War) రెండో ఏడాదిలోకి అడుగుపెట్టింది. ఇప్పటివరకు సుమారు 67 వేలమంది పౌరులు(సగం మహిళలు, చిన్నారులే), దాదాపు 2 వేల మంది ఇజ్రాయెల్ తరఫున మరణించారు. ఈ తరుణంలో యుద్ధం ముగింపు ఎప్పుడనే దానిపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. మేము యుద్ధం ముగింపు దశకు చేరుకున్నాం. కానీ ఇంకా పూర్తిగా ముగించలేదు. గాజాలో ప్రారంభమైనది గాజాలోనే ముగుస్తుంది. మిగిలిన మా 46 బందీల విడుదలతో, హమాస్ పాలన అంతమయ్యే వరకు ఇది కొనసాగుతుంది అని ఓ ఇంటర్వ్యూలో తాజాగా వ్యాఖ్యానించారాయన. బెన్ షాపిరోకు ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో నెతన్యాహు(Netanyahu On gaza War) మాట్లాడుతూ.. ఈ యుద్ధంతో ఇజ్రాయెల్ మరింత బలంగా ఎదిగింది. ఇరాన్ మద్దతు సంస్థల కూటమి(హమాస్, హెజ్బొల్లా, హౌతీలు ఉంటాయి)ని ఎదురించి మరీ నిలిచాం. ఇక మిగిలింది హమాస్ అంతమే అని అన్నారు. ‘‘మేం హమాస్‌ను ఇంకా పూర్తిగా నాశనం చేయలేదు. కానీ, కచ్చితంగా అక్కడిదాకా చేరతాం. యుద్ధం ముగిసింది అంటే.. మా బంధీలు విడుదల కావాలి. అలాగే.. హమాస్ పాలన అంతం అవ్వాలి అని అన్నారాయన. ట్రంప్‌తో సంబంధాల గురించి.. ఇటీవల కొన్ని అభిప్రాయ బేధాలు తలెత్తినప్పటికీ.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో తన సంబంధం బాగానే ఉందని నెతన్యాహు(Trump Netanyahu Relation) చెప్పుకొచ్చారు. హమాస్‌పై పోరాటంలో అమెరికా-ఇజ్రాయెల్ కలిసి ప్రపంచానికి నిజాన్ని చూపించాయని అన్నారాయన. అయితే.. America First" అంటే అమెరికా ఒక్కటే కాదని, ఇజ్రాయెల్ వంటి మిత్ర దేశాలు అవసరమని నెతన్యాహూ ట్రంప్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అదే సమయంలో.. ఇరాన్ 11,000 కిలోమీటర్ల పరిధి ఉన్న అంతర్జాతీయ క్షిపణులు అభివృద్ధి చేస్తోందని.. ఇది అమెరికా తూర్పు తీరాన్ని చేరగలవని హెచ్చరించారాయన. అలా మొదలైన యుద్ధం..2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్ సరిహద్దులో హమాస్ సంస్థ జరిపిన మెరుపు దాడిలో 1,200 మంది మరణించారు. మరో 251 మంది బంధీలుగా తీసుకెళ్లారు. పాలస్తీనియన్ భూభాగాల్లో ఇజ్రాయెల్ సెటిల్మెంట్ల విస్తరణ.. వాళ్ల చేతుల్లో పాలస్తీనా పౌరులు హింసకు గురి కావడం, అల్-అక్సా మసీదు వద్ద ఘర్షణలు, జెనిన్ శరణార్థి శిబిరంపై దాడులు.. ఈ వరుస పరిణామాలు హమాస్ దాడికి కారణాలు. ఈ భారీ దాడికి ప్రతిగా.. ఇజ్రాయెల్ గాజాపై ఆపరేషన్ ఐరన్ స్వోర్డ్స్ చేపట్టింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా జరిపిన దాడుల్లో 67, 000 మందికి పైగా మరణించారు. మృతుల్లో మహిళలు, చిన్నారులే అధికంగా ఉన్నారు. విధ్వంసంతో పాటు గాజాను దిగ్భంధించి.. మానవతా సాయాన్ని అందకుండా ఇజ్రాయెల్ బలగాలు చేశాయి. విద్యుత్ కొరత, తిండి, నీరు లేక అక్కడి ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రస్తుత పరిస్థితి.. గాజా యుద్ధం రెండో వార్షికోత్సవం (అక్టోబర్ 7, 2025)లో అడుగుపెట్టిన వేళనే.. ఇజ్రాయెల్-హమాస్ మధ్య శాంతి చర్చలు ప్రారంభమయ్యాయి. ఈజిప్ట్ రాజధాని కైరో వేదికగా.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన 20-పాయింట్ల శాంతి ప్రణాళికపై చర్చలు జరుగుతున్నాయి. ఇదే చివరి అవకాశమని, ఆలస్యం వద్దని, త్వరపడకపోతే భారీ రక్తపాతం తప్పదని ట్రంప్ హెచ్చరిక జారీ చేశారు కూడా.ఇదీ చదవండి: భారత్ సమాధి కాక తప్పదు! -
సమయం లేదు.. భారీ రక్తపాతం ఎదురు చూస్తోంది
గాజా శాంతి చర్చల వేళ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గాజా శాంతి ప్రణాళిక అమలుకు ఎంతో సమయం లేదని.. త్వరగా ముందుకు కదలాలంటూ ఇజ్రాయెల్, హమాస్లకు సూచించారాయన. ఈ క్రమంలో చర్చలు ఆలస్యమైనా.. అటు ఇటు అయినా.. దారుణమైన పరిణామాలు తప్పవంటూ హెచ్చరికలు జారీ చేశారు.ఇది శతాబ్దాల నాటి ఘర్షణ. స్వయంగా ఈ చర్చలను నేనే పర్యవేక్షిస్తుంటా(Trump Gaza Plan). సమయం ఎంతో కీలకం. ఆలస్యం చేస్తే అత్యంత భారీ రక్తపాతం జరుగుతుంది. అలాంటిదాన్ని ఎవ్వరూ చూడాలనుకోరు.. అని ట్రంప్ తన ట్రూత్ సోషల్ పోస్ట్ ద్వారా హెచ్చరించారు. ‘‘ఈ వారం చివర్లో గాజా యుద్ధాన్ని ముగించేందుకు.. బందీలను విడుదల చేయడానికి.. అన్నింటికంటే ముఖ్యంగా ఆ ప్రాంతంలో ఎప్పటి నుంచో కోరుకుంటున్న శాంతిని నెలకొల్పేందుకు సానుకూల చర్చలే జరుగుతున్నాయి’’ ట్రంప్ అని ఆ పోస్టు ద్వారా వెల్లడించారు. ప్రస్తుతానికి ఈ చర్చలు కీలక దశలోనే ఉన్నాయంటూ పేర్కొన్నారాయన. ట్రంప్ గాజా ప్లాన్‌పై ఇజ్రాయెల్, హమాస్(Israel Hamas Deal) రెండూ ఒప్పందానికి సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు ఇచ్చినప్పటికీ.. చర్చలు మాత్రం నెమ్మదిగా సాగుతున్నాయి. ఈ తరుణంలో.. ఇవాళ(సోమవారం) ఈజిప్ట్‌లో ట్రంప్ గాజా ప్లాన్‌పై చర్చలు జరగనున్న నేపథ్యంలోనే ట్రంప్ వ్యాఖ్యలు ఇటు ఇజ్రాయెల్, అటు హమాస్‌పై ఒత్తిడిని పెంచేందుకేనని స్పష్టంగా తెలుస్తోంది. కైరో(Cairo)లో ఇవాళ జరుగనున్న ఈ చర్చల్లో హమాస్, ఇజ్రాయెల్, అమెరికా, ఈజిప్ట్ ప్రతినిధులు పాల్గొంటున్నారు. గాజా పట్టణంలో కొనసాగుతున్న యుద్ధం.. మానవీయ సంక్షోభ నేపథ్యంలో కాల్పుల విరమణ, హమాస్ చెరలో ఉన్న బందీల విడుదల, గాజాకు మానవతా సహాయం అందించడం వంటి ప్రధాన అంశాలపై చర్చలు జరగనున్నాయి. అలాగే హమాస్ విముక్త గాజా అంశమూ కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది. 2023 అక్టోబర్ 7న హమాస్, ఇజ్రాయెల్ సరిహద్దులో జరిపిన దాడితో ఈ యుద్ధం మొదలైంది. అప్పటి నుంచి గాజాపై ఇజ్రాయెల్ సైన్యం చేస్తున్న దాడులతో.. ఇప్పటిదాకా వేల మంది పౌరులు మృతి చెందారు. తీవ్ర ఆహార సంక్షోభం నెలకొందక్కడ. ఈ పరిణామాలపై పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ తరుణంలో శాంతి ఒప్పందం త్వరగా కుదరాలని అంతర్జాతీయ సమాజం కోరుకుంటోంది. గాజా శాంతి ఒప్పందంలో(Gaza Peace Deal) భాగంగా ట్రంప్ సూచించిన 20 అంశాల శాంతి ప్రణాళికకు హమాస్ అంగీకారం తెలిపింది. ఇజ్రాయెల్ సైతం అంగీకారం తెలిపినప్పటికీ.. హమాస్ లక్ష్యంగా గాజా నుంచి పూర్తిగా తమ బలగాలను ఉపసంహరించుకునేందుకు మాత్రం ఒప్పుకోవడం లేదు. ఈ తరుణంలో.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ Truth Social వేదికగా చేసిన తాజా పోస్టులో.. గాజా శాంతి ఒప్పందం మొదటి దశ ఈ వారం పూర్తవుతుందని చెబుతుండడం గమనార్హం. ఇదీ చదవండి: భారత్‌పై నోరు పారేసుకున్న పాక్ మంత్రి -
ట్రంప్ మాటను లెక్కచేయకుండా!! గాజాలో మళ్లీ..
ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ఒప్పందానికి హమాస్ సిద్ధంగా ఉందని.. బందీల విడుదలకు అంగీకరించిందిని.. గాజాలో దాడులు ఆపాలని.. అమెరికా అధ్యక్షుడు ఇజ్రాయెల్‌కు పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ మాటను లెక్కచేయకుండా మళ్లీ దాడులు కొనసాగిస్తోంది. శనివారం గాజాలో ఇజ్రాయెల్ బలగాలు జరిగిపిన దాడుల్లో ఆరుగురు మరణించారు. బందీల విడుదలతో పాటు ట్రంప్ ప్రతిపాదనలో పలు అంశాలకు హమాస్ అంగీకరించిందని.. అమెరికా ఈ యుద్ధాన్ని ముగించే దిశగా ముందుకు వెళ్తోందని ట్రంప్ స్వయంగా ప్రకటించారు. అటుపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు సైతం ‘ట్రంప్ గాజా ప్లాన్’(Trump Gaza Plan) తొలి దశ తక్షణమే అమలు కాబోతోందని అన్నారు. ఆ వెంటనే ఇజ్రాయెల్ ఆర్మీ చీఫ్ సైతం దీనిని ధృవీకరించారు. దీంతో పలు దేశాల అధినేతలూ ట్రంప్ కృషికి అభినందనలు తెలియజేశారు కూడా. అయితే.. అనూహ్యాంగా.. ఈ ప్రకటనలు వెలువడిన గంటల వ్యవధిలోనే గాజాపై ఇజ్రాయెల్ బలగాలు(Israel Attacks Gaza Agian) విరుచుకుపడ్డాయి. గాజా సిటీలో జరిపిన దాడుల్లో నలుగురు పౌరులు మృతి చెందగా.. దక్షిణ భాగంలోని ఖాన్ యూనిస్ వద్ద మరో ఇద్దరు చనిపోయినట్లు అక్కడి అధికారులు ధృవీకరించారు. అయితే తాజా దాడులపై ఇజ్రాయెల్, అమెరికా, హమాస్ వైపుల నుంచి స్పందన రావాల్సి ఉంది. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్ సరిహద్దులో హమాస్ సంస్థ జరిపిన మెరుపు దాడిలో 1,200 మంది మరణించారు. మరో 251 మంది బంధీలుగా తీసుకెళ్లారు. పాలస్తీనియన్ భూభాగాల్లో ఇజ్రాయెల్ సెటిల్మెంట్ల విస్తరణ.. వాళ్ల చేతుల్లో పాలస్తీనా పౌరులు హింసకు గురి కావడం, అల్-అక్సా మసీదు వద్ద ఘర్షణలు, జెనిన్ శరణార్థి శిబిరంపై దాడులు.. ఈ వరుస పరిణామాలు హమాస్ దాడికి కారణాలు. ఈ భారీ దాడికి ప్రతిగా.. ఇజ్రాయెల్ గాజాపై ఆపరేషన్ ఐరన్ స్వోర్డ్స్ చేపట్టింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా జరిపిన దాడుల్లో 66, 000 మందికి పైగా మరణించారు. మృతుల్లో మహిళలు, చిన్నారులే అధికంగా ఉన్నారు. విధ్వంసంతో పాటు గాజాను దిగ్భంధించి.. మానవతా సాయాన్ని అందకుండా ఇజ్రాయెల్ బలగాలు చేశాయి. విద్యుత్ కొరత, తిండి, నీరు లేక అక్కడి ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అయితే తాము హమాస్‌ను మాత్రమే లక్ష్యంగా చేసుకుని దాడులు జరుపుతున్నామని, పౌరులను రక్షణ కవచంలా వాళ్లు ఉపయోగించుకుంటున్నారంటూ ఇజ్రాయెల్ చెబుతూ వస్తోంది. ఈ క్రమంలో ట్రంప్ ఎంట్రీతో పరిస్థితి మారింది. అదే సమయంలో బంధీల విడుదల కోసం ఇజ్రాయెల్‌పై ఒత్తిడి పెరుగుతూ వస్తోంది.. ఈ తరుణంలో.. ట్రంప్ ప్రతిపాదించిన 20-పాయింట్ల శాంతి ఒప్పందానికి హమాస్ అంగీకారం తెలిపింది. ప్రస్తుతం 48 మంది బంధీలు ఉన్నారని, వారిలో 20 మంది జీవించి ఉన్నారని తెలుస్తోంది. తొలి దశలో భాగంగా.. బంధీల విడుదలకు సిద్ధంగా ఉందని తెలిపింది. -
ట్రంప్ శాంతి మంత్రం
వాషింగ్టన్: కల్లోలిత గాజాలో సంక్షోభానికి, విధ్వంసానికి తెరదించి, శాంతిని నెలకొల్పడమే లక్ష్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలకమైన ప్రతిపాదన చేశారు. ‘20 సూత్రాల శాంతి ప్రణాళిక’ను తెరపైకి తెచ్చారు. సోమవారం వైట్‌హౌస్‌లో ట్రంప్‌తో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సమావేశమయ్యారు. గాజా పరిణామాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఇజ్రాయెల్–హమాస్ యుద్ధాన్ని ముగించడమే ధ్యేయంగా ట్రంప్ ప్లాన్‌ను వైట్‌హౌస్ విడుదల చేసింది. ఈ ప్రణాళిక తమకు ఆమోదయోగ్యమేనని నెతన్యాహు ప్రకటించారు. ట్రంప్ ప్రయత్నాలకు మద్దతు ఇస్తున్నామని చెప్పారు. ఇక హమాస్ సైతం అంగీకరిస్తే గాజాలో యుద్ధం వెంటనే ఆగిపోతుందని ట్రంప్ స్పష్టంచేశారు. హమాస్ స్పందన కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు. అంతా అనుకున్నట్లుగా జరిగితే పాలస్తీనాను స్వతంత్ర దేశంగా అధికారికంగా గుర్తించే అవకాశం లేకపోలేదని అమెరికా అధ్యక్షుడు సంకేతాలిచ్చారు. శాంతి ప్రతిపాదనపై 3 నుంచి 4 రోజుల్లోగా స్పందించాలని హమాస్‌కు డెడ్‌లైన్ విధించారు. లేకపోతే ‘విషాదకరమైన ముగింపు’ ఉంటుందని తేల్చిచెప్పారు. స్వాగతించిన ఇస్లామిక్ దేశాలు గాజా విషయంలో ట్రంప్ ప్లాన్‌ను ఈజిప్టు, జోర్డాన్, ఇండోనేషియా, పాకిస్తాన్, తుర్కియే, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్(యూఏఈ) తదితర ఇస్లామిక్ దేశాలు స్వాగతించారు. ఈమేరకు మంగళవారం ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. గాజాలో శాంతి కోసం అమెరికాతో కలిసి పనిచేస్తామని ప్రకటించాయి. చైనా, రష్యా, భారత్‌తోపాటు పలు యూరప్ దేశాలు సైతం స్వాగతించాయి. ప్రధాని నరేంద్ర మోదీ హర్షం ట్రంప్ 20 సూత్రాల శాంతి ప్రణాళిక పట్ల భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తంచేశారు. పాలస్తీనాతోపాటు ఇజ్రాయెల్ ప్రజల భద్రత, అభివృద్ధికి, శాశ్వత శాంతికి ఒక మార్గం ఏర్పడినట్లేనని, మొత్తం పశి్చమాసియాకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ‘ఎక్స్’లో పోస్టుచేశారు. హమాస్‌కు మరణ శాసనమే! గాజాలో శాంతి సాధన దిశగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించిన ప్రణాళికపై చర్చ మొదలైంది. దీనికి ఇజ్రాయెల్ వెంటనే అంగీకరించడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు హమాస్ మాత్రం వేచిచూసే ధోరణితో ముందుకెళ్తోంది. ట్రంప్ ప్లాన్‌ను క్షుణ్నంగా అధ్యయనం చేయాల్సి ఉందని, ఇప్పుడే ఏమీ చెప్పలేమని అంటోంది. నిజానికి ట్రంప్ ప్లాన్ హమాస్‌కు మరణ శాసనమేనని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు.ప్రణాళికలో కీలక అంశాలు → ట్రంప్ ప్లాన్‌ను ఇజ్రాయెల్, హమాస్ అంగీకరిస్తే గాజాలో దాడులు వెంటనే ఆగిపోతాయి. తమ చెరలో ఉన్న ఇజ్రాయెల్ బందీలందరినీ 72 గంటల్లోగా హమాస్ మిలిటెంట్లు విడుదల చేయాలి. ఒకవేళ బందీల్లో ఎవరైనా మృతిచెంది ఉంటే వారి మృతదేహాలను ఇజ్రాయెల్‌కు అప్పగించాలి. → బందీలకు విముక్తి లభించిన తర్వాత ఇజ్రాయెల్ జైళ్లలో జీవిత ఖైదు అనుభవిస్తున్న 250 మంది పాలస్తీనియన్లను ఇజ్రాయెల్ ప్రభుత్వం విడుదల చేయాలి. 2023 అక్టోబర్ 7 తర్వాత ఇజ్రాయెల్ సైన్యం బంధించిన 1,700 మంది పాలస్తీనా పౌరులను సైతం విడుదల చేయాలి. గాజా నుంచి ఒక బందీ విడుదలైతే, అందుకు ప్రతిగా 15 మంది పాలస్తీనా పౌరులను ఇజ్రాయెల్ విడుదల చేయాల్సి ఉంటుంది. → ట్రంప్ ప్రతిపాదనకు ఆమోదం లభించగానే ఇజ్రాయెల్ సేనలు దాడులు ఆపేసి గాజా నుంచి వెనక్కి వెళ్లిపోతాయి. గాజాలో ఇజ్రాయెల్ దళాలు ఖాళీ చేసిన స్థానంలోకి ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్స్(ఐఎస్ఎఫ్) చేరుతుంది. పాలస్తీనా ప్రజలకు భద్రత కల్పిస్తుంది, పాలస్తీనా పోలీసులకు శిక్షణ ఇస్తుంది. → బందీలు క్షేమంగా ఇజ్రాయెల్‌కు చేరుకున్న తర్వాత హమాస్ మిలిటెంట్లు ఆయుధాలు విడిచిపెట్టి లొంగిపోవాలి. వారికి క్షమాభిక్ష ప్రసాదిస్తారు. ఒకవేళ మిలిటెంట్లు గాజాను వదిలేసి ఎక్కడికైనా వెళ్లిపోవాలని భావిస్తే అందుకు వారికి సహకారం లభిస్తుంది. అభ్యంతరం లేకపోతే గాజాలోనే ఉండిపోవచ్చు. → అమెరికా అధ్యక్షుడు ట్రంప్, బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ నేతృత్వంలోని ‘బోర్డ్ ఆఫ్ పీస్’ గాజాలో పరిపాలన, పునరి్నర్మాణాన్ని పర్యవేక్షిస్తుంది. గాజాను ఒక రియల్ ఎస్టేట్ వెంచర్‌గా అభివృద్ధి చేస్తారు. → పునరి్నర్మాణం తర్వాత గాజా పరిపాలన బాధ్యతలను పాలస్తీనియన్ అథారిటీకి అప్పగిస్తారు. ఈలోగా పాలస్తీనియన్ అథారిటీలో సంస్కరణలు చేపట్టాల్సి ఉంటుంది. -
ట్రంప్-నెతన్యాహు గాజా గేమ్.. ఇదే లాస్ట్ ఛాన్స్!
గాజా సంక్షోభానికి తెర దించే క్రమంలో.. శాంతి ప్రణాళిక(Gaza Peace Plan) ఓ కొలిక్కి వచ్చింది. అమెరికా ప్రతిపాదనకు ఇజ్రాయెల్ ఎట్టకేలకు అంగీకారం తెలిపింది. వైట్‌హౌజ్ వేదికగా.. ఇజ్రాయెల్ అద్యక్షుడు బెంజిమన్ నెతన్యాహు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంయుక్తంగా ఈ ప్రకటన చేశారు. అయితే ఈ ప్రతిపాదనకు హమాస్ గ్రూప్ అంగీకరిస్తుందో లేదో అనే అనుమానాన్ని ఇద్దరూ వ్యక్తం చేయడం గమనార్హం. అమెరికా ప్రతిపాదించిన ఈ 20 సూత్రాల శాంతి ఫార్ములాను హమాస్ గనుక ఒప్పుకుంటే.. 72 గంటల్లో వాళ్ల చేతుల్లో ఉన్న బందీలందరినీ విడుదల చేయాల్సి ఉంటుంది. యుద్ధ విరమణ తక్షణమే అమల్లోకి వచ్చింది. హింసను వదిలిన హమాస్ సభ్యులకు క్షమాభిక్ష దక్కడంతో పాటు భద్రత నడుమ ఇతర దేశాలకు వెళ్లే అవకాశం కల్పిస్తారు. హమాస్ ఆయుధాలు వదిలి పాలన నుంచి తప్పుకుంటుంది కాబట్టి తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటునకు గాజాలో Board of Peace ఏర్పాటు చేస్తారు. గాజా పునర్నిర్మాణం కోసం అంతర్జాతీయ సహాయానికి గేట్లు తెరుస్తారు. ఇలా మిగిలిన అంశాలు ఉన్నాయి. అయితే.. ఒకవైపు శాంతి అంటూనే మరోవైపు హమాస్(Hamas)కు మరోసారి ఈ ఇద్దరు నేతలు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. తాము ప్రతిపాదించిన శాంతి ఒప్పందాన్ని హమాస్ అంగీకరించాల్సిందేనన్న ధోరణితో ట్రంప్, నెతన్యాహులు మాట్లాడారు. ‘‘హమాస్ గనుక ఈ డీల్‌కు ఒప్పుకోకపోతే.. వారిని తుదముట్టించేందుకు ఇజ్రాయెల్‌కు నా పూర్తి మద్దతు ఉంటుంది. ఇది నా తుది హెచ్చరిక.. మరొకటి ఉండదు’’ అని ట్రంప్ ప్రకటించారు. మరోవైపు.. ఈ ఒప్పందం అమలు సులభ మార్గంలో అయినా.. కఠిన మార్గంలో అయినా అమలు అయ్యి తీరుతుంది అంటూ హమాస్‌కు ఇండైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు. ఇదిలా ఉంటే.. ట్రంప్-నెతన్యాహు(Trump-Netanyahu) ప్రకటించిన శాంతి ఒప్పందానికి సౌదీ అరేబియా, ఈజిప్ట్ సహా 8 ముస్లిం దేశాలు హర్షం వ్యక్తం చేశాయి. యూరప్ దేశాధినేతలు మాక్రాన్, స్టార్మర్ ఈ ప్రణాళికకు మద్దతు ప్రకటించారు. హమాస్ ఇంతదాకా అధికారికంగా ప్రకటన చేయనప్పటికీ.. పక్షపాతంగా ఉందనే ‘గాజాలో యుద్ధాన్ని ముగించడమే కాదు. పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పేందుకు ఏర్పాట్లు జరగాలని కోరుకుంటున్నా. శాంతి కోసం మీ ప్రణాళికకు మద్దతు తెలుపుతున్నా. అయితే హమాస్ నుంచి మళ్లీ ఇజ్రాయెల్‌కు ముప్పు ఉండకూడదు. ఒప్పందంలో తొలి ఘట్టంగా.. గాజా నుంచి బలగాల దశలవారీ ఉపసంహరణ ఉంటుంది. వెంటనే 72 గంటల్లో బందీలను విడుదల చేయాలి. ఆ తరువాత అంతర్జాతీయ పాలకవర్గం ఏర్పాటు కావాలి. హమాస్ ఆయుధాలను వదిలేయాలి. గాజాను నిరాయుధీకరణ చేయాలి. అంతర్జాతీయ పాలకవర్గం విజయవంతమైతే యుద్ధాన్ని శాశ్వతంగా ముగిస్తాం. హమాస్ నిరాయుధీకరణకు అనుగుణంగా ఇజ్రాయెల్ గాజా నుంచి వైదొలగుతుంది. కానీ భవిష్యత్తు భద్రత దృష్ట్యా చుట్టుపక్కల మోహరించి ఉంటాం’ అని నెతన్యాహు వివరించారు. గాజా శాంతి ప్రణాళిక.. ముఖ్యాంశాలుగాజా నగరాన్ని ఉగ్రవాదం లేని ప్రాంతంగా మార్చడం.హమాస్‌కు పాలనా హక్కు లేకుండా, తాత్కాలిక పాలనను ఏర్పాటు చేయడం.ఇజ్రాయెల్ బంధీలను 72 గంటల్లో విడుదల చేయడం.ఇజ్రాయెల్ 250 జీవిత ఖైదీలు, మరియు 1,700 గాజా ఖైదీలను విడుదల చేయడం.ప్రతి ఇజ్రాయెల్ బంధీ మృతదేహానికి, 15 మంది గాజా మృతదేహాలను తిరిగి ఇవ్వడం.హమాస్ సభ్యులు ఆయుధాలు వదిలి శాంతిగా జీవించాలనుకుంటే, వారికి క్షమాభిక్ష ఇవ్వడం.హమాస్ సభ్యులు గాజా విడిచి వెళ్లాలనుకుంటే, భద్రతతో కూడిన మార్గం కల్పించడం.యుద్ధం ఆగిన వెంటనే, పూర్తి మానవతా సహాయం ప్రారంభించడం.జల, విద్యుత్, ఆసుపత్రులు, రోడ్లు వంటి మౌలిక సదుపాయాల పునర్నిర్మాణం.రఫా సరిహద్దు రెండు దిశలలో తెరవడం.బోర్డ్ ఆఫ్ పీస్ (Board of Peace) అనే అంతర్జాతీయ సంస్థ ద్వారా గాజా పాలన.ట్రంప్ అధ్యక్షతన, ఈ బోర్డు పునర్నిర్మాణం, నిధుల పంపిణీ నిర్వహిస్తుంది.బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ సహా పలువురు అంతర్జాతీయ నాయకులకు ఈ బోర్డులో భాగం.పాలనా కమిటీ apolitical, technocratic Palestinians తో ఏర్పాటవుతుంది.పాలస్తీనా అథారిటీ పునరుద్ధరణ తర్వాతే గాజా పాలన చేపట్టాలి.ఇజ్రాయెల్ పూర్తిగా ఉపసంహరించడానికి, దశలవారీగా ప్రణాళిక.అంతర్జాతీయ మానిటర్లు ద్వారా గాజా లోని ఆయుధాల నిర్మూలన.ఆర్థిక అభివృద్ధి ప్రణాళిక ద్వారా “New Gaza” నిర్మాణం.ప్రత్యేక ఆర్థిక మండలం (Special Economic Zone) ఏర్పాటు.గాజా ప్రజలు అక్కడే ఉండేందుకు ప్రోత్సాహం, బలవంతంగా తరలింపు ఉండదు. -
గాజాలో పని పూర్తిచేసే తీరుతాం
ఐక్యరాజ్య సమితి: గాజాలో హమాస్‌కు వ్యతిరేకంగా తాము చేపట్టిన యుద్ధం మధ్యలో ఆపే ప్రసక్తే లేదని, పని పూర్తిచేసి తీరుతామని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ స్పష్టంచేశారు. గాజా యుద్ధం, పాలస్తీనా విషయంలో అంతర్జాతీయ ఒత్తిళ్లకు పశ్చిమదేశాలు తలొగ్గవచ్చేమో కానీ.. ఇజ్రాయెల్ మాత్రం వెనక్కు తగ్గదని తేల్చి చెప్పారు. ఐరాస సర్వప్రతినిధి సభను ఉద్దేశించి శుక్రవారం ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. కొన్ని దేశాలు నెతన్యాహూ ప్రసంగాన్ని బహిష్కరించాయి. కొన్ని దేశాల ప్రతినిధులు సభలోనే ఉండి నెతన్యాహూ ప్రసంగిస్తున్నప్పుడు ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రతిగా మరికొన్ని దేశాల ప్రతినిధులు ఇజ్రాయెల్‌కు మద్దతుగా నినాదాలు చేశారు. ఆమెరికా మాత్రం ఎప్పటిలాగే ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలిచింది. చాలావరకు ముఖ్య దేశాలన్నీ ఈ సమావేశానికి జూనియర్ అధికారులను పంపి తమ నిరసనను తెలిపాయి. గాజాపై దాడులను ఆపాలని అంతర్జాతీయంగా ఎంతగా ఒత్తిళ్లు వస్తున్నా.. నెతన్యాహూ పట్టించుకోకపోవటంతో ఇటీవలే ఆస్ట్రేలియా, బ్రిటన్, ఫ్రాన్స్ వంటి దేశాలు పాలస్తీనా దేశాన్ని గుర్తిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. క్రమంగా అంతర్జాతీయంగా ఒంటరిగా మారుతున్నా నెతన్యాహూ వెనక్కి తగ్గేదే లేదు అని ప్రకటించారు. పాలస్తీనాను గుర్తించిన దేశాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘పశ్చిమదేశాల నేతలు ఒత్తిళ్లకు తలొగ్గవచ్చు. కానీ, మీకు నేను ఒక హామీ ఇస్తున్నా.. ఇజ్రాయెల్ ఎప్పటికీ తలొగ్గదు. మీ అవమానకరమైన నిర్ణయం (పాలస్తీనాను దేశంగా గుర్తించటం) యూదులు, అమాయక పౌరులకు వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంది. యూదు వ్యతిరేక భావజాలం ఎప్పటికీ అంతమవదేమో.. కానీ, అది దారుణంగా చావాలి’అని పేర్కొన్నారు. ప్రసంగం సందర్భంగా నెతన్యాహూ, ఆయన బృందం ఇజ్రాయెల్‌పై హమాస్ దాడిచేసి పౌరులను బందీలుగా తీసుకెళ్లిన ఘటనను చూపించే క్యూఆర్ కోడ్‌ను ధరించారు. ‘ది కర్స్’పేరుతో రూపొందించిన ఓ మ్యాప్‌ను కూడా ప్రదర్శించారు. -
అరెస్టు భయంతో నెతన్యాహు ఏం చేశారంటే..!
ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు(Benjamin Netanyahu) చేసిన పని ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారి తీసింది. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ(UNGA) సమావేశాలకు హాజరయ్యేందుకు ఆయన న్యూయార్క్ వెళ్లారు. అయితే ప్రయాణంలో ఆయన యూరప్ గగనగలం కాకుండా.. సుదీర్ఘ మార్గంలో ప్రయాణించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. గాజా యుద్ధ నేపథ్యంతో.. అంతర్జాతీయ న్యాయస్థానం(International Court Of Justice) నెతన్యాహుపై అరెస్ట్ వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. యుద్ధ నేరాలకు పాల్పడ్డ ఆయన్ను అవకాశం దొరికితే అరెస్ట్ చేయొచ్చని అందులో సభ్యత్వం ఉన్న 125 దేశాలకు ఇంటర్నేషనల్ కోర్టు సూచించింది. దీంతో ఐక్యరాజ్య సమితి సమావేశాలకు హాజరు కావాల్సిన ఆయన యూరప్ దేశాల మీదుగా కాకుండా.. మరో మార్గంలో వెళ్లారనే చర్చ నడుస్తోంది. ఫ్లైట్ ట్రాకింగ్ డాటా ప్రకారం.. ఆయన అధికారిక విమానం ‘వింగ్స్ ఆఫ్ జియాన్’ మధ్యధరా సముద్రం, జిబ్రాల్టార్ ద్వారం.. అట్లాంటిక్ మీదుగా న్యూయార్క్‌కు చేరుకుంది. ఈ క్రమంలో.. ఫ్రాన్స్, ఇటలీ, గ్రీస్ ఎయిర్‌స్పేస్‌ను తప్పించుకున్నట్లైంది. అయితే ఈ రూట్లో వెళ్లడం ద్వారా ఆయన అదనంగా 600 కిలోమీటర్లు ప్రయాణించారని సమాచారం. ఇదిలా ఉంటే కిందటి ఏడాది కూడా ఆయన ఐక్యరాజ్య సమితి సాధారణ అసెంబ్లీకి హాజరయ్యారు. అయితే అప్పటికి నెతన్యాహుపై వారెంట్ జారీ కాలేదు. కానీ, ఆయన ప్రసంగిస్తున్న సమయంలో పలు దేశాల ప్రతినిధులు లేచి వెళ్లిపోవడం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఇక అంతర్జాతీయ న్యాయస్థానం కిందటి ఏడాది నవంబర్‌లో నెతన్యాహు, మాజీ రక్షణ మంత్రి యోవ్ గాలంట్లను యుద్ధనేరస్తులుగా పేర్కొంటూ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అయితే ఈ అభియోగాలను ఇజ్రాయెల్ తీవ్రంగా ఖండించింది. ఇదీ చదవండి: ఎవరు బతకాలో ఆయుధాలే నిర్ణయిస్తాయి! -
అల్బనీస్ బలహీనమైన నాయకుడు
జెరూసలేం: ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంతోనీ అల్బనీస్ ఇజ్రాయెల్‌కు ద్రోహం చేశారని ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆరోపించారు. ఆ్రస్టేలియాలోని యూదు సమాజాన్ని ఆ దేశం వదిలేసిందన్నారు. బలహీనమైన రాజకీయ నాయకుడిగా ఆయనను చరిత్ర గుర్తుంచుకుంటుందని విమర్శించారు. ఆ్రస్టేలియన్ యూదు సంఘం (ఏజేఏ) నిర్వహించిన కార్యక్రమానికి హాజరవ్వాలన్సిన ఇజ్రాయెల్ నేత సిమ్చా రోత్మన్ వీసాను ఆస్ట్రేలియా రద్దు చేసింది.విభజన రాజకీయాలు చేస్తున్నవారిపై తమ ప్రభుత్వం కఠినమైన వైఖరి తీసుకుంటుందని ఆ దేశ ఇమ్మిగ్రేషన్ మంత్రి టోనీ బర్క్ ప్రకటించారు. ‘మీరు ద్వేషం, విభజన సందేశాన్ని వ్యాప్తి చేయడానికి ఆస్ట్రేలియాకు వస్తున్నట్లయితే.. మీరు ఇక్కడికి రావడం మాకు ఇష్టం లేదు’అని బర్క్ స్పష్టం చేశారు. దీంతో రోత్మన్ సమావేశంలో వర్చువల్‌గా పాల్గొని, ప్రసంగిస్తారని ఏజేఏ తెలిపింది. యూదు సమాజం టోనీ బర్క్‌కు, విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్‌కు తలవంచదని ప్రకటించింది. ఈ పరిణామాల పట్ల నెతన్యాహు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యక్తిగతంగా తీసుకోనుఅయితే.. నెతన్యాహు వ్యాఖ్యలపై బర్క్ బుధవారం స్పందించారు. పాలస్తీనాను దేశంగా గుర్తిస్తున్నట్లు ఆ్రస్టేలియా ప్రకటించినందుకే ఆయనకు ఆగ్రహం వస్తోందన్నారు. ఇక.. బలమైన నాయకుడంటే.. ఇతర దేశాలపై దాడులు చేసేవారు, ఇతర దేశాల్లో ప్రజలను ఆకలితో చంపేవారు కాదని, దాడులు, హత్యలతో ఒక దేశాధ్యక్షుడి బలాన్ని అంచనా వేయలేమని ఎద్దేవా చేశారు. నెతన్యాహు వ్యాఖ్యలపై ప్రధాని అల్బనీస్ సైతం స్పందించారు. వాటిని వ్యక్తిగతంగా తీసుకోనన్నారు. తాను ఇతర దేశాల నాయకులను గౌరవంగా చూస్తానని, దౌత్యపరంగా వారితో సంభాíÙస్తానని హుందాగా చెప్పుకొచ్చారు. అయితే ఇజ్రాయెల్ మితవాద నేతల వీసాలను ఆ్రస్టేలియా రద్దు చేయడం ఇదే మొదటిసారి కాదు. 2022లో పార్లమెంటును విడిచిపెట్టిన నాయకురాలు, ఇజ్రాయెల్ మాజీ న్యాయ మంత్రి అయెలెట్ షేక్డ్కు కూడా వీసా నిరాకరించారు. నెతన్యాహుతో ఘర్షణ పడేవారే అసలైన నాయకుడు నెతన్యాహు వ్యాఖ్యలను ఇజ్రాయెల్ ప్రతిపక్ష నాయకుడు యైర్ లాపిడ్ విమర్శించారు. అంతేకాదు.. ఆయన వ్యాఖ్యలను ఆ్రస్టేలియా నాయకునికి బహుమతిగా అభివరి్ణంచారు. ‘రాజకీయంగా అత్యంత విషపూరిత నాయకుడైన నెతన్యాహుతో ఘర్షణ పడేవారే ప్రస్తుతం ప్రజాస్వామ్య ప్రపంచంలో అసలైన నాయకుడు. ఆ్రస్టేలియా ప్రధానమంత్రికి ఈ బహుమతిని ఇచ్చారు’అని ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు.పాలస్తీనాకు మద్దతు ఇవ్వడంతో.. పాలస్తీనా దేశాన్ని యూఎన్‌లో ఉన్న 193 సభ్య దేశాల్లో 147 దేశాలు గుర్తించాయి. యూకే, ఫ్రాన్స్, కెనడాలు కూడా ఆ దేశాల జాబితాలో చేరాయి. ఆ తర్వాత ఆ్రస్టేలియా సైతం పాలస్తీనాకు మద్దతు ఇచి్చంది. ఆ సమయంలో ప్రధాని అల్బనీస్ మాట్లాడుతూ ‘అమాయక ప్రజలపై యుద్ధ చూపుతున్న ప్రభావాన్ని నెతన్యాహు పట్టించుకోవడం లేదు. సహాయ పంపిణీ కేంద్రాల చుట్టూ ప్రజలు ఆహారం, నీటి కోసం క్యూలో నిలబడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇది ఆమోదయోగ్యం కాదు’అన్నారు. అప్పటినుంచి ఆయా దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు మొదలయ్యాయి. ప్రతిస్పందనగా, నెతన్యాహు మూడు దేశాల నాయకులపై దాడిని ప్రారంభించారు. కెయిర్ స్టార్మర్, ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, మార్క్ కారీ్నలు.. సామూహిక హంతకులు, రేపిస్టులు, శిశువుల హంతకులు, కిడ్నాపర్ల పక్షాన నిలుస్తున్నారని ఆరోపించారు. -
ఇవే ప్రశ్నలు వీళ్లిద్దరినీ కాకుండా.. ఆయన్ని అడిగే దమ్ముందా?
ఏదో అనుకుంటే.. ఇంకేదో జరిగింది. శాంతి చర్చల్లో ముందడుగు పడకపోతే కఠినంగా వ్యవహరిస్తానంటూ రష్యాపై రంకెలు వేసిన ట్రంప్.. అలస్కా చర్చల తర్వాత కాస్త మెత్తబడ్డాడు. ఉక్రెయిన్ శాంతి చర్చలు అర్ధరహితంగా ముగిసినట్లు వాళ్ల ప్రకటనలను బట్టి స్పష్టమవుతోంది. ఈ క్రమంలో.. ట్రంప్ ఇంకా అలస్కాలో ఉండగానే పుతిన్ అక్కడి నుంచి నిష్క్రమించడం తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే..అలస్కాలో జర్నలిస్టులు సంధించిన ప్రశ్నలను ఇరు దేశాల అధినేతలు స్వీకరించలేదు. తాము చెప్పాలనుకున్నది చెప్పి.. తలోదారి వెళ్లిపోయారు. యాంకరేజ్ విమానాశ్రయంలో, అలాగే చర్చలు ప్రారంభం కావడానికి ముందు పీస్ రూమ్‌లోనూ ఇరు దేశాధినేతలు మీడియా ముందు ఆసీనులయ్యారు. ఆ సమయంలో ఉక్రెయిన్ కాల్పుల విరమణ, యుద్ధంలో సాధారణ పౌరులు మరణించడం లాంటి ప్రశ్నలు పుతిన్‌కు ఎదురయ్యాయి. ‘‘సాధారణ పౌరుల్ని చంపడం ఇంకెప్పుడు ఆపుతారు?’’ అంటూ ఓ జర్నలిస్ట్ ప్రశ్నించగా.. దానికి పుతిన్ తనకేమీ వినబడడం లేదన్నట్లు సైగ చేసి చూపించారు. అదే సమయంలో ‘‘ట్రంప్ మిమ్మల్ని మాత్రమే ఎందుకు నమ్ముతున్నారు?’’ అని మరో విలేఖరి ప్రశ్నించగా.. జర్నలిస్టుల గోలతో పుతిన్ ఇచ్చిన వివరణ వినిపించనట్లే కనిపించింది. పుతిన్‌పై అంతర్జాతీయ నేరస్థుల కోర్టు కేసు ఉన్నప్పటికీ.. అమెరికా భూభాగంలోకి ఎందుకు ఆహ్వానించారు?. ఉక్రెయిన్ను నేరుగా భాగం కానీయకుండా కాల్పులవిరమణ డీల్ కుదర్చాలని ట్రంప్ భావిస్తున్నారా?. పుతిన్ ఎలాంటి రాయితీలు ఇవ్వవచ్చు? ట్రంప్ ఏమి అంగీకరించవచ్చు? ఇది యుద్ధ విరామానికి దారి తీస్తుందా? లేదంటే రాజకీయ నాటకం మాత్రమేనా? అని ప్రశ్నలు గుప్పించారు. అయితే వీటిలో వేటికి సమాధానాలు రాలేదు. దీంతో.. సోషల్ మీడియా సదరు జర్నలిస్టుల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతోంది. ఇవే ప్రశ్నలను గాజాపై యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహును అడిగే దమ్ముందా? అని నిలదీస్తోంది. ‘‘2023 అక్టోబర్ 7వ తేదీన గాజా యుద్ధం మొదలైంది. ఇజ్రాయెల్ దాడులతో ఇప్పటిదాకా 60 వేలమందికిపైనే మరణించారు. అందులో 70 శాతం మహిళలు, చిన్నారులే ఉన్నారని నివేదికలు గణాంకాలతో సహా చెబుతున్నాయి. అయితే ఈ మరణాలపై నెతన్యాహు ఏనాడూ స్పందించగా పోగా.. కనీసం విచారం కూడా వ్యక్తం చేసింది లేదు. పైగా ఎంతసేపు హమాస్ అంతమే శాంతికి మార్గం అంటూ చెబుతూ వస్తున్నారు. దీనికి తోడు మానవతా సాయం అందకుండా చేశారనే ఆరోపణలు ఆయపై ఉన్నాయి. ఈ క్రమంలో యుద్ధ నేరాల కింద అంతర్జాతీయ న్యాయస్థానం నెతన్యాహుపై వారెంట్ సైతం జారీ చేసింది.ఈ పరిణామాలపై ఇటు ఇజ్రాయెల్.. అటు అమెరికా జర్నలిస్టులెవరూ ఆయన్ని ప్రశ్నించే సాహసం చేయలేకపోయారు. మరోవైపు.. రెండుసార్లు నెతన్యాహు అమెరికా పర్యటనకు వచ్చారు. ఆ సమయంలోనూ జర్నలిస్టులెవరూ.. గాజా పౌరుల మరణాల గురించి ఎందుకు నిలదీయలేదు?’’ అని సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఇదిలా ఉంటే.. 2022 ఫిబ్రవరిలో మొదలైన ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో లక్షల మంది మరణించారు. మూడున్నరేళ్ల యుద్ధానికి పుల్‌స్టాప్ పెట్టే ఉద్దేశంలో పర్సూయింగ్ పీస్ పేరిట అలస్కా చర్చల్లో పాల్గొన్నారు. ట్రంప్-పుతిన్‌లు ఐదారుగంటలు అలస్కాలోనే గడపగా.. రెండున్నర గంటలపాటు చర్చలు జరిగాయి. అయితే.. ఉక్రెయిన్ కాల్పుల విరమణకు అమెరికా అధ్యక్షుడు పట్టుబట్టగా.. అందుకు రష్యా అధినేత ఏమాత్రం సానుకూలంగా స్పందించలేదని తెలుస్తోంది. Vladimir Putin’s reaction was nothing short of remarkable—reporters shouted, but his expression told its own story. pic.twitter.com/07vkASuJIc— Tarique Hussain (@Tarique18386095) August 15, 2025భేటీకి ముందు జర్నలిస్టుల ప్రశ్నలకు స్పందించని ఇరువురు నేతలు.. సంయుక్తంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లోనూ మీడియా ప్రతినిధులను ప్రశ్నలకు అనుమతించలేదు. మరోవైపు.. అలస్కా చర్చల సారాంశం కోసం రష్యా అధికారుల బృందాన్ని పలువురు జర్నలిస్టులు కలిసే ప్రయత్నమూ విఫలమైంది. అదే సమయంలో.. ట్రంప్ తన అనుకూల రిపోర్టర్లతో పుతిన్‌పై ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసే ప్రయత్నం చేశారని, దాని నుంచి పుతిన్ భలేగా తప్పించుకున్నారనే వాదన నెట్టింట నడుస్తోంది... అలస్కాలో ట్రంప్ దౌత్యం విఫలమేనని కొన్ని అమెరికన్ మీడియా చానెల్స్ ప్రముఖంగా చర్చిస్తున్నాయి. కానీ, ట్రంప్ మాత్రం ఎంతో కొంత పురోగతి సాధించాం అని చెబుతుండడం గమనార్హం. ‘‘పుతిన్ చాలా టఫ్, స్ట్రాంగ్ ఫెల్లో. ఇక దారికి రావాల్సింది జెలెన్స్కీనే’ అన్నట్లు ఫ్యాక్స్ ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడారు. ఇంకోవైపు.. అలస్కాలో ట్రంప్-పుతిన్ భేటీలో రష్యా అనుకూల ఏకపక్ష డీల్ కుదరనందుకు సంతోషమంటూ ఉక్రెయిన్ ఎద్దేవా ప్రకటన విడుదల చేసింది. -
మానవత్వాన్ని మింగే ప్రపంచ స్వార్థం
‘కళ్ల ముందు హింస జరుగుతుంటే, దానిని చూస్తూ మౌనంగా ఉండటం కూడా హింసలో భాగమే’ అన్నారు మహాత్మా గాంధీ. ప్రపంచానికి అహింసా సిద్ధాంతాన్ని అందించి ప్రపంచ మానవాళి సుఖసంతోషాలతో ఉండాలంటే అదొక్కటే ఏకైక మార్గమని ఆయన నిరూపించారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు యుద్ధోన్మాదానికి రక్తపుటేరులై పారుతున్న ‘గాజా’ను చూస్తూ కూడా ప్రపంచంలోని అత్యధిక బలమైన దేశాలు నోళ్లు కుట్టేసుకున్నట్లు ప్రవర్తించడమే నెతన్యాహు హింస కంటే బీభత్సంగా గోచరిస్తోంది. ‘గాజా’ మొత్తం ఛిద్రం అయింది. 75,000 మంది ఇప్పటివరకు మట్టిలో కలిసిపోయారన్నది అధికారిక లెక్క. అంతకు మించిన సంఖ్యలో అక్కడి ప్రజలు, సైనికులు హతం అయ్యారన్నది అనధికార అంచనా. అంకెలను బట్టి చూస్తే, గతంలో హిట్లర్, ముస్సోలినీ నెలకొల్పిన రికార్డులన్నింటినీ నెతన్యాహు తిరగరాసినట్లే ఉంది.మొదటి ప్రపంచ యుద్ధం సమయంలోగానీ, రెండవ ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు గానీ బాధితులకు, క్షతగాత్రులకు రెడ్‌క్రాస్ వంటి స్వచ్ఛంద సంస్థలు అందించిన సాయాన్ని అడ్డుకొన్న దాఖలాలు లేవు. కానీ, నేడు అంతర్జాతీయ సమాజం అందిస్తున్న సాయంపై ఇజ్రాయెల్ సైనికులు ఆంక్షలు పెట్టారు. ఇంతటి అమానవీయం కనివిని ఎరుగం. 22 నెలలు గడిచినా ‘గాజా’లో సాధారణ పరిస్థితులు నెలకొనడానికి ఏ దేశమూ చొరవ చూపడం లేదు. ఆ ఒక్క యుద్ధం సరిపోదన్నట్లుగా... ఇరాన్లో అణ్వస్త్రాయుధాలు, శుద్ధి చేసిన యురేనియం నిక్షేపాలు ఉన్నాయనే మిషతో ఆ దేశంపై కూడా విరుచుకుపడి పశ్చిమాసియాలో కల్లోల పరిస్థితులు సృష్టించి ఏ ఒక్కరికీ కంటి మీద కునుకు లేకుండా చేశారు నెతన్యాహు. వియన్నా డిక్లరేషన్‌ను అనుసరించి యుద్ధంలో పాల్గొనే దేశాలు... సామాన్య పౌరులను చంపకూడదు. జన సామాన్యం, నివాస ప్రాంతాలపై దాడులు చేయరాదు. ఈ నిబంధనను ఇజ్రాయెల్ అటకెక్కించింది. అలాంటి నాయకులేరీ?‘వసుధైక కుటుంబం’ అన్నది భారతదేశం ప్రవచించిన మహత్తరమైన భావన. దానిని భావనగానే ఉంచకుండా ఆచరణలోకి తేవడానికి చిత్తశుద్ధితో కృషి చేసింది కూడా భారతదేశ నాయకత్వమే. గాంధీజీ, నెహ్రూ, అంబేడ్కర్, లోహియా, వినోబాభావే మొదలైన నాయకులతో పాటు, ఆ తర్వాత తరానికి చెందిన ఇందిరాగాంధీ, అటల్ బిహారీ వాజ్‌పేయి, అబ్దుల్ కలాం వంటివారు ప్రపంచ శాంతికి, ప్రపంచ దేశాల ఆర్థిక సామాజిక పురోగతికి కృషి చేశారు. కెన్నెడీ, చౌ ఎన్ లై, మార్షల్ టిటో, నాజర్ మొదలైన వివిధ దేశాల నాయకులు సైతం ప్రపంచశాంతికి కృషి చేశారు. మానవజాతి వినాశనానికి దారితీసే యుద్ధాల నివారణకు ఎందరో నేతలు గతంలో తాపత్రయ పడ్డారు. వివిధ దేశాల నడుమ ఘర్షణలు చెలరేగినప్పుడు ఆ ఉద్రిక్తతలను తగ్గించడంలో, సంప్రదింపుల ద్వారా, ఒడంబడికల ద్వారా యుద్ధాలను నివారించడాన్ని అనుభవంలో చూశాం. కానీ ఇప్పుడా చొరవ ఒక్క నాయకుడూ చేయడం లేదు. ‘నేను– నా పొట్ట’ అనే రీతిలో, ‘నేను– నా దేశం’ అనే విధంగా మాట్లాడటం తమ దేశీయ ప్రయోజనాలను పరిరక్షించుకోవడం గానూ, తమ దేశాభి వృద్ధిని కాంక్షించే జాతీయ విధానంగానూ భావిస్తున్నారు తప్ప... అటువంటి విధానం వల్ల దేశాల మధ్య పరస్పర సహకారం, సహజీవనం, శాంతి సౌభాగ్యాలకు విఘాతం కలుగుతుందని ఆలోచించడం లేదు.అప్పుల కోసం, ఆయుధాల కోసం నేడు అనేక దేశాలు... ఆగ్రదేశాల ముందు సాగిలపడుతున్నాయి. బదులుగా అగ్రదేశాలు ఏం చేసినా... ‘తానా అంటే తందాన’ అంటున్నాయి. ఈ ధోరణి ఇప్పటికిప్పుడు అలవాటు చేసుకొన్నది కాదు. దాదాపు 3 దశాబ్దాలుగా కొనసాగుతున్నదే. ఇప్పుడది పరాకాష్ఠకు చేరింది. ఐక్యరాజ్యసమితి కోరల్ని ఎప్పుడో పీకేయడంతో ఆ సంస్థ అస్తిత్వం నామమాత్రంగా మారి యుద్ధాలను నివారించడంలో ఎటువంటి పాత్రనూ పోషించలేకపోతోంది. ఈ నేపథ్యంలో ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలను ఆపగల చొరవ ఎవరు తీసుకొంటారు? ఆ శక్తి ఎవరికి లేకపోవడం అటుంచి... అలాంటి ప్రయత్నం చేయాలన్న తపన కొరవడటమే అత్యంత బాధాకరం.ద్వంద్వ ప్రమాణాలుయుద్ధోన్మాదులు దేశాధినేతలైతే, ఆ దేశ ప్రజల భవిష్యత్తే కాదు... యావత్ ప్రపంచ భవిష్యత్ తారుమారవుతుందని గత అనుభవాలు తెలియజేస్తున్నాయి. ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులు చేసిన కొన్ని గంటల్లోనే అంతర్జాతీయ చమురు ధరలు అమాంతం పెరిగిపోయాయి. రష్యా, ఉక్రెయిన్ల మధ్య జరుగుతున్న సుదీర్ఘ యుద్ధం కారణంగా వాతావరణంలోకి ప్రవేశించిన ప్రమాదకర ‘ధూళి’ యూరప్‌తో సహా పొరుగునున్న పలు దేశాలలో ప్రతికూల ఫలితాలు చూపిస్తోందన్న వార్తలు వెలువడుతున్నాయి. దేశాల మధ్య ఏర్పడుతున్న ఉద్రిక్తతల కారణంగా తమ తమ గగనతలాలను మూసివేయడం, నౌకాయాన మార్గాలను దిగ్బంధనం చేయడం వంటి దుందుడుకు చర్యల ఫలితంగా మానవాళికి జరుగుతున్న నష్టం, కాలహరణం ఊహాతీతమైనది.ప్రపంచంలో మూడు బలమైన దేశాలు అమెరికా, రష్యా, చైనా ప్రత్యక్షంగా, పరోక్షంగా యుద్ధాల్లో పాల్గొనడం లేదా మిత్రదేశాలకు యుద్ధాల్లో సాయపడటం విరమించుకోనంత వరకు ప్రపంచంలో శాంతి స్థాపన జరగడం కష్టం. నిజానికి ఈ దేశాల ప్రజలకూ, ఆ మాటకొస్తే ఉత్తరకొరియా ప్రజలకు సైతం యుద్ధం అభిలషణీయం కాదు. ప్రజలెప్పుడూ అభివృద్ధిని ఆశిస్తారు. సుఖశాంతులను కోరుకుంటారు. కయ్యానికి కాలు దువ్వే మనస్తత్వం మెజారిటీ ప్రజలకు ఉండదు.ప్రజల ఆశలు, ఆకాంక్షలకు భిన్నంగా, తమ ప్రతిష్ఠను పెంచుకోవడానికీ, తమ దేశ ప్రజల ప్రయోజనాలే తమకు ముఖ్యమని చాటుకొని అధికారాన్ని సుస్థిరం చేసుకోవడానికీ కొందరు ప్రపంచ నేతలు హ్రస్వదృష్టితో అనుసరిస్తున్న విధానాల వల్లనే... యుద్ధాలు ముగింపు లేకుండా కొనసాగుతున్నాయి. యుద్ధం పేరుతో బలహీనులపై అన్ని రకాల దారుణాలూ జరుగుతున్నాయి.స్వార్థమే యుద్ధకారణంకళింగ యుద్ధంలో గెలిచిన తర్వాత అశోక చక్రవర్తిలో పశ్చాత్తాపం కలుగుతుంది. ప్రత్యర్థులకు కలిగిన నష్టం కంటే మన నష్టం కొంచెం తక్కువ... అంతే... ఇది విజయం కాదు... పరాజయం... మానవత్వానికి తీరని మచ్చ అని మథన పడతాడు. యుద్ధాలకు స్వస్తి పలికి శాంతి కాముకుడిగా మారి శాంతిని విశ్వజనీనం చేయడానికి తన జీవితాన్ని ధారపోస్తాడు. ప్రపంచాన్ని జయించాలనుకున్న అలెగ్జాండర్ కథ కూడా చివర్లో విషాదంగానే ముగిసింది. ఈ ఉదంతాల నుంచి గుణపాఠాలు నేర్చుకొనే విశాల దృక్పథం నేడు నాయకుల్లో కరువైంది. వారి స్వార్థం నుంచే యుద్ధాలు మొదలవుతున్నాయి. అవి అంతిమంగా మానవత్వాన్ని మింగేస్తున్నాయి. ఉక్రెయిన్‌లో కావొచ్చు, గాజాలో కావొచ్చు... జరుగుతున్న పరిణామాల పట్ల ప్రపంచ దేశాలు నిర్లిప్తంగా, ఉదాసీనంగా, శిలాసదృశంగా మారిపోయాయి. వీటి ప్రతికూల పరిణామాలు ఊహిస్తేనే భయంగా ఉంటుంది. డా‘‘ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, ఏపీ శాసన పరిషత్ సభ్యులు -
గాజాపై పూర్తి నియంత్రణ.. నెతన్యాహు సంచలన నిర్ణయం
టెల్అవీవ్: గాజాను పూర్తిగా ఆక్రమించుకోవాలన్న వివాదాస్పద నిర్ణయాన్ని ఇజ్రాయెల్ కేబినెట్ ఆమోదించింది. శుక్రవారం జరిగిన రక్షణ కేబినెట్ సమావేశంలో ఈ అంశంపై సుమారు 10 గంటలపాటు సుదీర్ఘ చర్చ జరిగింది. గాజాపై పూర్తి స్థాయి నియంత్రణ సాధించడమే తన లక్ష్యమని ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ తెలిపారు. ఆయన కార్యాలయం ఇందుకు సంబంధించి విడుదల చేసిన ప్రకటనలో ఆక్రమణ అనే మాటను వాడనప్పటికీ, వాస్తవానికి ఈ ప్రణాళిక ఉద్దేశం అదేనని తెలుస్తోంది.ఒక వైపు హమాస్ చెరలోని బందీల భద్రతపై బాధిత కుటుంబాలు, మరో వైపు మరింత మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయే ప్రమాదముందని అంతర్జాతీయంగా ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ నెతన్యాహూ ప్రభుత్వం ఈ ప్రణాళికను ముందుకు తెచ్చింది. గాజాలో మూడొంతుల ప్రాంతం ఇప్పటికే ఇజ్రాయెల్ ఆర్మీ నియంత్రణలో ఉంది. అయితే, తాజా ప్రణాళిక ఇజ్రాయెల్‌ను అంతర్జాతీయంగా ఏకాకిగా మార్చే ప్రమాదముందని విశ్లేషకులు భావిస్తున్నారు.గాజాను పూర్తిగా ఆధీనంలోకి తెచ్చేందుకు కొన్ని నెలలపాటు పట్టే ఈ కార్యక్రమం ఎప్పుడు మొదలవుతుందనే విషయంలో స్పష్టత లేదు. అయితే, అక్టోబర్ 7వ తేదీ నాటికి గాజా సిటీని ఖాళీ చేయించాలని డెడ్‌లైన్ పెట్టుకుంది. నగరంలో ఆహార పంపిణీ నిలిపివేయడం, అక్కడి వారిని బలవంతంగా ఖాళీ చేయిండం ఈ ప్రణాళికలో భాగాలు. ఇందుకోసం వేలాది మంది అదనపు బలగాలను రంగంలోకి దింపాల్సి ఉంటుంది. ఇప్పటికే గాజాలో కరవు కాటకాలు, ఆకలి చావులకు కారణమవుతోందంటూ ఇజ్రాయెల్‌పై ఆగ్రహంతో ఉన్న పలు దేశాలు తాజా ప్రయత్నాలను తీవ్రంగా ఖండిస్తున్నాయి.పలు దేశాల ఖండన..ఇజ్రాయెల్‌ది తప్పుడు నిర్ణయమని యూకే ప్రధాని స్టార్మర్ పేర్కొన్నారు. ఇజ్రాయెల్ సైనిక అవసరాలు తీర్చే రెండో అతిపెద్ద సరఫరాదారు జర్మనీ కూడా..మిలటరీ పరికరాలను ఇకపై విక్రయించబోమని స్పష్టం చేసింది. నెతన్యాహూ మాత్రం ఈ విషయంలో మనస్సు మార్చుకునే ఉద్దేశంతో లేరు. ఇజ్రాయెలీలు సైతం హమాస్‌తో ఒప్పందం కుదుర్చుకుని బందీలను త్వరగా బయటకు తీసుకురావాలనే కోరుకుంటున్నారు. అయితే, షరతులు పెట్టకుండా హమాస్‌పై ఒత్తిడి తెచ్చి, బందీలను విడుదల చేయించడమే లక్ష్యంగా నెతన్యాహూ గాజా పూర్తి నియంత్రణ అనే బెదిరింపునకు దిగారని భావిస్తున్నారు. దీనిని ట్రంప్ యంత్రాంగం సైతం వ్యతిరేకించలేదు.అతివాద పార్టీలతో ప్రభుత్వాన్ని నెట్టుకొస్తున్న నెతన్యాహూ అధికారంలో కొనసాగేందుకే ఈ సంక్షోభాన్ని వాడుకుంటున్నారన్న విశ్లేషణలూ ఉన్నాయి. ఇప్పటికే గాజాలోని 8 లక్షల మంది పాలస్తీనియన్లను బలవంతంగా ఉత్తరం నుంచి దక్షిణానికి, తిరిగి ఉత్తరాదికి ఖాళీ చేయిస్తూ, క్షేత్రస్థాయిలో దాడులు, వైమానిక నిఘాలతో ఆర్మీ అసహనంతో ఉంది. గాజాను నియంత్రణలోకి తెచ్చుకోవడమంటే మరింత ఊబిలోకి దిగడమేనని ఆర్మీ వర్గాలు అంటున్నాయి. -
మోదీ దెబ్బ.. ఇది ట్రంప్ రాయబారమా?
అమెరికా విషయంలో ఏదైతే అది అయ్యిందనే నిర్ణయానికొచ్చింది భారత్. ఇప్పటిరకూ అమెరికాతో సంబంధాలపై ఆచితూచి అడుగులేసిన భారత్.. ఇప్పుడు ఒక అడుగు ముందుకేసి రష్యాతో వాణిజ్య ఒప్పందానికే ఓకే చెప్పింది. గత కొంతకాలంగా ట్రంప్ విధించే సుంకాలపై సహనంగా ఉన్న భారత్.. అమెరికా ఆయుధాల కొనుగోలుకు తాత్కాలికంగా ఫుల్స్టాప్ పెట్టింది. ‘రోజూ భయపడుతూ కూర్చుంటే ట్రంప్ ఏదొక నిర్ణయంతో ఇరకాటంలో పెడుతూనే ఉంటారని నిర్ణయానికి ముగింపు పలకాలనే ఉద్దేశంతో భారత్.. ఎట్టకేలకు స్పందించింది. ఎంత సుంకాన్ని అయినా భరిస్తామని, అయితే రష్యాతో వాణిజ్య ఒప్పందం విషయంలో రాజీ పడేది లేదనే సంకేతాలు పంపింది. ఇప్పటివరకూ అమెరికాను మిత్రదేశంగా భావించిన భారత్.. ఉపయోగం లేని మిత్రత్వం అవసరం లేదనే విషయాన్ని యూఎస్‌కు అర్థమయ్యేలా చెప్పేసింది. తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నా. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరింపులకు తాము లొంగమనే విషయాన్ని తేటతెల్లం చేసింది. నెతాన్యాహూ భారత్ పర్యటన..?అమెరికా-భారత్‌ల మిత్రత్వం దాదాపు చెడిందనే సంకేతాల నడుమ ఇజ్రాయిల్ రంగంలోకి దిగింది. ఇజ్రాయిల్ ప్రధాని నెతాన్యాహూ భారత్ పర్యటనకు రాబోతున్నట్లు తెలుస్తోంది. భారత పర్యటనలో నెతాన్యాహూ మోదీని కలిసి ఓ సలహా ఇవ్వనున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరి ఆ సలహా ఏమిటనేది పక్కన పెడితే.. డొనాల్డ్ ట్రంప్‌కు అత్యంత సన్నిహితుడైన నెతాన్యాహూ భారత్‌కు ఎందుకు రానున్నారనే చర్చ నడుస్తోంది. ఇది అమెరికా ఆడుతున్న డ్రామాగా ఉంందని మరొక వాదన వినిపిస్తోంది. అమెరికాతో వాణిజ్య సంబంధాలను తాత్కాలికంగా పక్కన పెట్టిన భారత్‌ను ఒప్పించేందుకు నెతాన్యాహూను ట్రంప్ రాయబారిగా పంపడానికి సిద్ధమయ్యారనే వాదన తెరపైకి వచ్చింది. ప్రత్యేకంగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఫోన్ చేసి మోదీ మాట్లాడటం, అమెరికా ఆయుధాలను, వైమానిక క్షిపణులకు కొనుగోలుపై భారత్ విముఖత వ్యక్తం చేసిన తరుణంలో నెతాన్యాహూ ఆ దిశగానే మోదీతో మాట్లాడేందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. అమెరికా అనేది భారత్‌కు అతిపెద్ద మార్కెట్ అనే అంశం అందరికి తెలిసిందే. ఆటువంటి తరుణంలో కూడా భారత్.. అమెరికాతో రాజీ పడేందుకు సిద్ధంగా లేకపోవడంతో నెతాన్యాహూను ట్రంప్ రంగంలోకి దింపే ఆలోచన కూడా చేసి ఉండొచ్చు. ట్రంప్ అందితే జుట్టు, అందకపోతే కాళ్లు పట్టుకుంటారనే విమర్శ కూడా ఆయనపై ఉంది. అగ్రరాజ్యం అమెరికా అనేది మినహాయిస్తే ఇక్కడ ట్రంప్ గొప్పతనం ఏమీ లేదు. తాము చెప్పినట్లు ‘ఆడాలని’ ట్రంప్ అనుకుంటూ ఉంటారని, అది అన్ని దేశాలతో కుదరదనే విషయం భారత్ చెప్పకనే చెప్పేసింది.. ఇప్పుడు భారత్, రష్యా, చైనాల మైత్రితో అమెరికాకు గుండెల్లో రాయి పడినట్లే ఉంది.మూడు అగ్రదేశాలు ఏకం అవుతున్న తరుణంలో డొనాల్డ్ ట్రంప్‌ను కాస్త ఇరకాటంలో పడేసినట్లే ఉంది. ఎప్పుడూ భారత్‌కు వ్యతిరేకంగా ఉండే చైనా కూడా, ఇప్పుడు ట్రంప్ బెదిరింపులను తట్టుకోలేకపోతోంది. మన మంచిని కోరలేని శత్రువుకు అంగుళం చోటిస్తే మొత్తం ఆక్రమిస్తారంటూ ట్రంప్ వైఖరిని తీవ్రంగా తప్పుపట్టింది. ఈ అన్ని అంశాలను బేరీజు వేసుకున్న ట్రంప్.. నెతాన్యాహూను అనధికార రాయబారిగా పంపుతున్నారా? అనేది ఇప్పుడు చర్చకు దారి తీసింది. ఒకవేళ నెతాన్యాహూ భారత్ పర్యటనకు వస్తే మాత్రం, కచ్చితంగా అమెరికాతో భారత్ సంబంధాలపై మాట్లాడి రాజీ కుదిర్చే అవకాశాల్ని కూడా కొట్టిపారేయలేం. ఇంకా భారత్-అమరికాల బంధం చాలా బలంగా ఉందని స్వయంగా నెతాన్యాహూ చెప్పిన తరుణంలో.. ఆ దిశగానే పావులు కదిపే అవకాశం ఉంది. -
గాజా ఆక్రమణకు నెతన్యాహూ చర్యలు
జెరూసలేం: గాజా ప్రాంతం మొత్తాన్ని ఆక్రమించుకునేందుకే ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ మొగ్గుచూపుతున్నారు. ఇప్పటికే గాజాలోని మూడొంతుల ప్రాంతం ఇజ్రాయెల్ ఆర్మీ నియంత్రణలోనే ఉంది. తాజాగా, బందీల విడుదలపై హమాస్ సానుకూలంగా లేకపోవడం కారణంగా నెతన్యాహూ తీసుకున్న నిర్ణయం ఫలితంగా మిలటరీ ఆపరేషన్ ఈ ప్రాంతంలో మరింతగా విస్తరించనుంది. హమాస్ బందీలను దాచి ఉంచిన ప్రాంతం కూడా ఇందులో ఉందని మీడియా అంటోంది.గాజా పూర్తి స్థాయి ఆక్రమణ ప్రయత్నాలపై నెతన్యాహూ కార్యాలయం స్పందించలేదు. సైనిక చర్యపై ఇజ్రాయెల్ ప్రభుత్వం ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు ఇజ్రాయెల్ సీని యర్ అధికారిని ఉటంకిస్తూ ‘చానెల్ 12’ పేర్కొంది. ‘హమాస్ పూర్తిగా లొంగిపోకుండా మిగతా బందీలను విడుదల చేయదు. మేం కూడా లొంగిపోము. ఇప్పుడు ఎలాంటి చర్యా తీసుకోకుంటే బందీలు ఆకలితో చనిపోతారు, గాజా హమాస్ నియంత్రణలోనే ఉంటుంది’అని ఆ అధికారి చెప్పినట్లు వెల్లడించింది. ఇజ్రాయెల్ ప్రణాళికలపై పాలస్తీనా విదేశాంగ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. -
మాక్రాన్‌పై ఇటు ఇజ్రాయెల్, అటు అమెరికా ఆగ్రహం
పాలస్తీనాను దేశంగా గుర్తించాలన్న ఫ్రాన్స్ నిర్ణయాన్ని అమెరికా, ఇజ్రాయెల్ తీవ్రంగా తప్పుబట్టాయి. ఇప్పటికే ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఇప్పటికే ఈ నిర్ణయం తీసేసుకోగా.. సెప్టెంబర్‌లో ఐక్యరాజ్య సమితి వేదికగా ప్రకటన వెలువడాల్సి ఉంది. అయితే..మాక్రోన్ నిర్ణయాన్ని ఇటు ఇజ్రాయెల్, అటు అమెరికా ఖండించాయి. ఇది అక్టోబర్ 7వ తేదీ నాటి బాధితులకు ద్రోహం చేయడంలాంటిదేనని అమెరికా విదేశాంగ కార్యదర్శి మాక్రో రుబియో అన్నారు. మాక్రోన్ నిర్ణయాన్ని సిగ్గుచేటుగా పేర్కొన్న రుబియో.. ఇది హమాస్‌కు అనుకూలంగా ఉందంటూ మండిపడ్డారు.ఐరాస సాధారణ అసెంబ్లీలో పాలస్తీనాకు దేశం గుర్తింపు కోసం ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ చేస్తున్న ప్రయత్నాలు ఖండించదగ్గవి. 2023 అక్టోబవర్ 7వ తేదీన ఇస్లామిక్ గ్రూప్ హమాస్ దాడులతోనే గాజాకు ఈ పరిస్థితి వచ్చింది. అలాంటి సంస్థకు మద్దతుగా ఫ్రాన్స్ నిర్ణయం ఉంది. ఇది సిగ్గుచేటు అని రుబియో ట్వీట్ చేశారు.The United States strongly rejects @EmmanuelMacron’s plan to recognize a Palestinian state at the @UN general assembly. This reckless decision only serves Hamas propaganda and sets back peace. It is a slap in the face to the victims of October 7th.— Secretary Marco Rubio (@SecRubio) July 25, 2025మరోవైపు.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పందిస్తూ పాలస్తీనాకు దేశం గుర్తింపు ఇవ్వడమంటే.. అది ఉగ్రవాదానికి బహుమతి ఇచ్చినట్లేనని అన్నారు. పైగా ఇది ఇజ్రాయెల్‌కు ముప్పు కలిగించే అంశమేనని అభిప్రాయపడ్డారాయన.ప్రపంచవ్యాప్తంగా ఇప్పటిదాకా 142 దేశాలు పాలస్తీనాకు దేశం గుర్తింపు ఇవ్వాలని కోరుతున్నాయి. అయితే యూరప్ దేశం నుంచి ఈ డిమాండ్ చేస్తున్న పవర్ఫుల్ దేశంగా ఇప్పుడు ఫ్రాన్స్ ఈ జాబితాలో నిలిచింది.పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇజ్రాయెల్ దాడులతో గాజాలో పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. తీవ్ర మానవ సంక్షోభం తలెత్తడంపై ఇప్పటికే పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఒకవైపు దాడులు.. మరోవైపు సాయం అందకుండా ఈ పరిస్థితికి ఇజ్రాయెల్ కారణమైందన్న విమర్శ బలంగా వినిపిస్తోంది(ఫ్రాన్స్ కూడా ఇదే గళం వినిపిస్తోంది). అయితే ఇజ్రాయెల్ మాత్రం ఆ వాదనను తోసిపుచ్చుతోంది. ఈ తరుణంలో ఫ్రాన్స్ నిర్ణయం ఆసక్తికర పరిణామాలకు దారి తీసే అవకాశం లేకపోలేదు. -
ఇజ్రాయెల్ దాడులు.. ఇరాన్ అధ్యక్షుడికి గాయాలు
టెహ్రాన్: ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులపై సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్‌ను అంతమొందించేందుకు గత నెలలో ఇజ్రాయెల్ ప్రయత్నించిందని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (ఐఆర్జీసీ) నివేదిక వెల్లడించింది. ఈ క్రమంలో ఆయన స్వల్ప గాయాలతో బయపడ్డట్లు వివరించింది.వివరాల ప్రకారం.. జూన్ 15వ తేదీన పార్లమెంటు స్పీకర్ మహమ్మద్ ఘాలీబా, న్యాయ వ్యవస్థ చీఫ్ మొహసేనీ ఇజేయ్తోపాటు ఇతర సీనియర్ అధికారులు టెహ్రాన్‌లో సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సమావేశంలో ఉండగా ఇజ్రాయెల్ దాడి చేసిందని ఐఆర్జీసీ అనుబంధ ఫార్స్ న్యూస్ ఆదివారం తెలిపింది. ఇజ్రాయెల్ దాడుల్లో అధ్యక్షుడు మసౌద్.. స్వల్ప గాయాలతో బయపడ్డట్లు వివరించింది. ఇక, తనపై దాడిని అధ్యక్షుడు పెజెష్కియాన్ ఇటీవలే ధ్రువీకరించారు. ‘వారు ప్రయత్నించారు. కానీ విఫలమయ్యారు’ అని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.మరోవైపు.. ఫార్స్ న్యూస్ వివరాల ప్రకారం.. ఇజ్రాయెల్ జరిపిన క్షిపణి దాడిలో పెజెష్కియాన్ కాలికి గాయమైంది. టెహ్రాన్ పశ్చిమ ప్రాంతంలోని ఓ భవనంపై ఈ దాడి జరిగింది. భవనం కింది భాగంలో ఇరాన్ అధికారులు ఉన్నారు. పేలుడు సంభవించగానే విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. అత్యవసర వ్యవస్థలను ముందుగానే సిద్ధం చేసుకోవడంతో భవనంలోని వారంతా సురక్షితంగా బయటపడ్డారు. -
హమాస్‌కు ఇది హానీమూన్ పీరియడ్.. నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్
టెలీ అవీవ్: ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పులు విరమణ ఒప్పందం విషయమై ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు చేశారు. 60 రోజుల పాటు తాత్కాలిక కాల్పుల విరమణలో భాగంగా బందీల విడుదల సక్రమంగా జరగని పక్షంలో హమాస్‌ను సమూలంగా నాశనం చేస్తామని నెతన్యాహు హెచ్చరించారు.ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తాజాగా హమాస్ చెరలో ఉన్న బందీల కుటుంబ సభ్యులను కలిశారు. అనంతరం, నెతన్యాహు మాట్లాడుతూ.. హమాస్ చెరలో ఉన్న బందీలను కచ్చితంగా తిరిగి తీసుకువస్తాం. తాత్కాలిక కాల్పుల విరమణ సమయంలో సాధ్యమైనంత వరకు బందీలను విడిపిస్తాం. హమాస్‌పై ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం ఇంకా ముగియలేదు. తాత్కాలిక కాల్పుల విరమణ మా ప్రభుత్వ అంతిమ లక్ష్యాన్ని సాధించకుండా నిరోధించింది. ఇరాన్‌పై చారిత్రాత్మక విజయం తర్వాత హమాస్ విషయమై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాతో చర్చలు జరిపారు. అందులో భాగంగానే ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు అంగీకరించింది. చర్చల తర్వాత 60 రోజుల కాల్పుల విరమణకు సిద్ధంగా ఉన్నామని తెలిపాం.గాజాలో పూర్తి నిరాయుధీకరణ, సైనికీకరణను తొలగించడం, బంధీలను విడుదల చేయడం వంటి అంశాలు ఇందులో ఉన్నాయి. 60 రోజుల సమయంలో ఇవన్నీ జరిగితే ఇజ్రాయెల్ మళ్లీ దాడులు చేయదు. ఒకవేళ హమాస్ కనుక మళ్లీ కాల్పులు విరమణను ఉల్లంఘిస్తే.. ఈసారి ఇజ్రాయెల్ దాడులు మరింత బలంగా ఉంటాయి. హమాస్‌ను లేకుండా చేసి ఇజ్రాయెల్ భద్రతను పునరుద్ధరించే వరకు మేము ఆగము’ అని హెచ్చరించారు.ఉగ్రవాదంపై పోరాటంలో ఇజ్రాయెల్‌కు చాలా గొప్ప విజయాలు ఉన్నాయి. ఇజ్రాయెల్ యోధుల ధైర్యసాహసాలకు ధన్యవాదాలు. మేము హమాస్ సైనిక సామర్థ్యాలను చాలావరకు నిర్వీర్యం చేశాం. హమాస్ విషయంలో మేము దౌత్యం, సైనిక శక్తి కలయిక ద్వారా పనిచేయాలనుకుంటున్నాము. దౌత్యం పని చేయకపోతే సైనిక శక్తి తమ పని తాము చూసుకుంటుందని హెచ్చరించారు. ఏదో ఒక విధంగా ఇజ్రాయెల్ అనుకున్న లక్ష్యాన్ని చేరుతుందని స్పష్టం చేశారు. Benjamin Netanyahu:"The war ends only if Hamas surrenders, Gaza is demilitarized, and if it can be done in negotiations, good. If not, it will be done with force by our great Israeli army. Hamas will be gone from Gaza at the end of the war either way."pic.twitter.com/RkMANr0ilV— Vivid.🇮🇱 (@VividProwess) July 10, 2025 -
‘నోబెల్‌కు ట్రంప్ అర్హతలివే..’: నెతన్యాహు
వాషింగ్టన్ డీసీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు నోబెల్ శాంతి బహుమతిని ఇవ్వాలంటూ ఆయన మద్దతుదారులు, నమ్మకస్తులైన చట్టసభ సభ్యులు చాలాకాలంగా కోరుతూ వస్తున్నారు. ఇందుకు అనుగుణంగా వారు తమ నామినేషన్లను కూడా సమర్పించారు. ఇదే సమయంలో ట్రంప్ తనకు ఈ ప్రతిష్టాత్మ అవార్డు అందకపోవడంపై విచారం వ్యక్తం చేస్తున్నారంటూ పలు వార్తలు కూడా వినిపించాయి.తాజాగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు నోబెల్ బహుమతి కమిటీకి అధ్యక్షుడు ట్రంప్‌ను నామినేట్ చేస్తూ ఒక లేఖ రాశారు. శాంతిని నెలకొల్పడంలో ట్రంప్ తన పాత్రను సమర్థవంతంగా నిర్వహించినందుకు ఆయనను నామినేట్ చేస్తున్నట్లు నెతన్యాహు ఆ లేఖలో పేర్కొన్నారు. సోమవారం వైట్ హౌస్‌లో జరిగిన విందు కార్యక్రమంలో నెతన్యాహు తాను బహుమతి కమిటీకి పంపిన నామినేషన్ లేఖ కాపీని కూడా మీడియాకు అందజేశారు.‘అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే ఎన్నో ఘనమైన పురస్కారాలను, అవార్డులను అందుకున్నారు. ఇరు దేశాల మధ్య ఆయన శాంతిని నెలకొల్పారు. అందుకే నోబెల్ బహుమతి కమిటీకి ఆయనను నామినేట్ చేస్తూ లేఖ పంపాను. దీనిలో ఈ పురస్కారానికి అధ్యక్షుడు ట్రంప్ అర్హుడని తెలియజేశాను’ అని నెతన్యాహు పేర్కొన్నారు. మిడిల్ ఈస్ట్‌లో శాంతిభద్రతలు నెలకొల్పేందుకు ట్రంప్ చేసిన ప్రయత్నాలను నెతన్యాహు ఆ లేఖలో ప్రశంసించారు. ట్రంప్ నాయకత్వం, న్యాయమైన లక్ష్యం కోసం చేస్తున్న ప్రయత్నాలు ఎంతో గొప్పవి. మధ్యప్రాచ్యంలో ఆయన శాంతిభద్రతలకు చేస్తున్న ప్రయత్నాలను ఇజ్రాయెలీయులకే కాకుండా పలువురు అభినందిస్తున్నారన్నారని నెతన్యాహు పేర్కొన్నారు.చాలా కాలంగా తనను తాను శాంతి దూతగా అభివర్ణించుకుంటున్న ట్రంప్ తాజాగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు నామినేషన్ చూసి సంబరపడ్డారు. ఈ సందర్భంగా నెతన్యాహుకు కృతజ్ఞతలు చెబుతూ, ఇది చాలా అర్థవంతమైనదని పేర్కొన్నారు. కాగా ఇప్పటివరకూ ముగ్గురు అమెరికా అధ్యక్షులు నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నారు. 1906లో థియోడర్ రూజ్వెల్ట్, 1919లో వుడ్రో విల్సన్, 2009లో బరాక్ ఒబామా ఈ పురస్కారాన్ని స్వీకరించారు. ఇది కూడా చదవండి: Maharashtra: బాల్ థాక్రే పాత వీడియో వైరల్.. ‘హిందీ’పై ఏమన్నారు? -
ట్రంప్, నెతన్యాహులపై ఇరాన్ ఫత్వా.. ప్రపంచవ్యాప్త పిలుపు
టెహ్రాన్: ఇరాన్‌లోని అణుకేంద్రాలపై ఇజ్రాయెల్, అమెరికా దాడుల దరిమిలా ఆ దేశాలపై ఇరాన్ గుర్రుగా ఉంది. ఈ నేపధ్యంలో తాజాగా ఇరాన్‌కు చెందిన షియా మత పెద్ద గ్రాండ్ అయతోల్లా నాసర్ మకరెం షిరాజీ... అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహులపై ‘ఫత్వా’ జారీచేశారు. వారిని దేవుని శత్రువులుగా అభివర్ణించారు. ఇస్లామిక్ రిపబ్లిక్ నాయకత్వంపై బెదిరింపులకు దిగుతున్న అమెరికన్, ఇజ్రాయెల్ నేతల సామ్రాజ్యాలను కూలదోయాలని మకరెం షిరాజీ ఒక ఉత్తర్వులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలకు పిలుపునిచ్చారు. BREAKING: Iranian Grand Ayatollah Issues FATWA Against President Trump, Seen as Call for Global TerrorIran’s top Shiite cleric, Grand Ayatollah Naser Makarem Shirazi, has just issued a religious fatwa against President Donald Trump and Israeli Prime Minister Benjamin Netanyahu,… pic.twitter.com/Ud6BWKvL9a— Simon Ateba (@simonateba) June 30, 2025ఇరాన్ నేతలను బెదిరించే ఏ వ్యక్తి నైనా యుద్ధ నేతగా పరిగణిస్తారని మకరెం తన తీర్పులో పేర్కొన్నట్లు మెహర్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. మొహరేబ్ అంటే దేవునికి వ్యతిరేకంగా యుద్ధం చేసే వ్యక్తి. ఇరానియన్ చట్టం ప్రకారం, మొహరేబ్గా గుర్తించినవారికి ఉరిశిక్ష, శిలువ వేయడం, అవయవాలను విచ్ఛేదనం చేయడం లేదా బహిష్కరించడం లాంటివి చేస్తారని ఫాక్స్ న్యూస్ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలంతా.. ఈ శత్రువులు మాట్లాడిన మాటలు, చేసిన తప్పులకు పశ్చాత్తాపపడేలా చేయడం అవసరమని ఆ ఫత్వాలో పేర్కొన్నారు. జూన్ 13న ఇరాన్లో ఇజ్రాయెల్ బాంబు దాడులను ప్రారంభించింది. 12 రోజులపాటు సాగిన ఈ యుద్ధం అనంతరం ఈ మతపరమైన ఆదేశం వెలువడింది. ఇరాన్‌లోని మూడు అణు కేంద్రాలపై దాడి చేసేందుకు అమెరికా.. ఇజ్రాయెల్ దళాలతో చేరిన దరిమిలా ఈ యుద్ధం ముగిసింది.ఇది కూడా చదవండి: ‘అచ్చం వెన్నలా..’.. ‘ఫోర్డో’దాడులపై ట్రంప్.. -
‘రోజంతా కోర్టులో కూర్చోబెడతారా’: నెతన్యాహు కేసుపై ట్రంప్ ఆగ్రహం
వాషింగ్టన్: ఇరాన్‌పై దాడుల అనంతరం అమెరికా ఇజ్రాయెల్ మధ్య మరింత సాన్నిహిత్యం ఏర్పడింది. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోమారు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు మద్దతుగా నిలిచారు. అతనిపై వచ్చిన అవినీతి అరోపణలపై జరుగుతున్న విచారణ అర్థంలేనిదన్నారు. ట్రంప్ తన ట్రూత్ సోషల్‌లో చేసిన ఒక పోస్ట్ లో ఇజ్రాయెల్ ప్రధానిపై చేస్తున్న ఆరోపణలు భయంకరమైనవిగా పేర్కొన్నారు.2019లో ఇజ్రాయెల్‌లో లంచం, మోసం, నమ్మక ద్రోహం ఆరోపణలతో తనపై మోపిన పలు అభియోగాలను ప్రధాని నెతన్యాహు ఖండించారు. ఈ అభియోగాలపై 2020లో విచారణ ప్రారంభమైంది. వీటిలో మూడు క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయి. కాగా ఈ అవినీతి కేసులో తాను సాక్ష్యం చెప్పడాన్ని వాయిదా వేయాలని నెతన్యాహు కోరగా, కోర్టు దానిని తిరస్కరించింది. ‘ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు వ్యతిరేకంగా జరుగుతున్న చర్య చాలా దారుణం. ఆయన ఒక యుద్ధ వీరుడు, ఇరాన్ నుంచి పొంచివున్న అణు ముప్పును తొలగించడంలో అమెరికాతో కలిసి పనిచేసిన ప్రధాని అని’ ట్రంప్ పేర్కొన్నారు.నెతన్యాహు ప్రస్తుతం హమాస్‌తో ఒప్పందంపై చర్చలు జరుపుతున్నారని, బందీలను తిరిగి తీసుకురావడంపై కూడా చర్చిస్తున్నారని ట్రంప్ పేర్కొన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆయనను రోజంతా కోర్టు గదిలో కూర్చోబెట్టడం ఎలా సాధ్యమవుతుంది? అని ట్రంప్ ప్రశ్నించారు. ట్రంప్ దీనిని రాజకీయ వేటగా పేర్కొన్నారు. ఇది న్యాయం పేరుతో జరుగున్న అపహాస్యమని అన్నారు. ప్రధాని నెతన్యాహు నాయకత్వంలో తాము గొప్ప విజయాన్ని సాధించామని పేర్కొన్నారు. నెతన్యాహును 2024లో నటి స్టార్మీ డేనియల్స్‌కు డబ్బు చెల్లింపులకు సంబంధించిన కేసులో దోషిగా నిర్ధారించారు. వ్యాపార రికార్డులను తప్పుగా చూపించారనే ఆరోపణలను నెతన్యాహు ఎదుర్కొంటున్నారు.ఇది కూడా చదవండి: Shefali Death: యాంటీ ఏజింగ్ ఇంజెక్షన్ తీసుకున్నాక.. -
ఇజ్రాయెల్ ప్రధానికి భారత్ అంటే ఇంత ఇష్టమా..! ఇక్కడ ఫుడ్ తోపాటు అమితాబ్‌తో..
గత కొద్దిరోజులుగా ఇరాన్, ఇజ్రాయెల్ దేశాలు యుద్ధజ్వాలలతో భగ్గుమంటున్న సంగతి తెలిసిందే. అమెరికా అధ్యక్షుడి జోక్యంతో ప్రస్తుతం ఇరుదేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. యుద్ధం ఆగిపోయినట్లేనా కాదా..? అనేది స్పష్టం కాకపోయినా..ఇరు దేశాలు ఈ యుద్ధం కారణంగా వార్తల్లో హైలెట్‌గా నిలిచాయి. అదీగాక శత్రుదేశాన్ని పలు రకాలుగా దెబ్బ కొట్టి..ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ భారీ స్థాయిలో పాపులారిటీని, ప్రజాదరణను పెంచుకున్నారు. ముఖ్యంగా ఈ యుద్ధంలో తనకు తోడుగా అగ్రరాజ్యం కలిసివచ్చేలా ట్రంప్‌ను ఒప్పించడంలోనూ నెతన్యాహూ పూర్తి స్థాయిలో విజయం సాధించారు. ఈ నేపథ్యంలో నెతాన్యాహూకి భారత్‌తో ఉన సత్సంబంధాలు..ఆయన మన దేశం అంటే ఎందుకంత ఇష్టం తదితరాల గురించి తెలుసుకుందామా..!.ఇజ్రాయెల్‌లో అత్యంత సుదీర్ఘకాలం ప్రధానిగా ఉన్న బెంజమిన్ నెతన్యాహూ తన దేశాన్ని, విదేశాంగ విధానాలను ఎలా ప్రభావితం చేయగలరనే దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నిజానికి రాజకీయాలకు అతీతంగా వ్యక్తిగతంగా ఆయన ఎలా ఉంటారనేది కూడా ఎవ్వరికీ పెద్దగా తెలియదు. ఆయనకు భారతదేశం, అక్కడి ప్రజలు, వంటకాలంటే మహా ఇష్టం. మన ప్రధాని మోదీ ఇజ్రాయెల్ సందర్శనకు వచ్చినప్పుడూ..ఈ రోజు కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్నానంటూ ఆలింగనం చేసుకున్నారు. పైగా భారత్ పట్ల తనకున్న అభిమానాన్నికూడా చాటుకున్నారు. ఇక ఇరు దేశాల మధ్య చారిత్రక సైద్ధాంతిక వ్యత్యాసం ఉన్నప్పటికీ..భారత్ ఇజ్రాయెల మధ్య మంచి స్నేహబాంధవ్యాలు ఉన్నాయనే చెప్పొచ్చని చెబుతున్నారు విశ్లేషకులు.'బీబీ'గా పిలిచే బెంజమిన్ నెతన్యాహు ఎవరంటే..బెంజమిన్ నెతన్యాహు 1949లో టెల్ అవీవ్‌లో ఒక జియోనిస్ట్ కుటుంబంలో జన్మించారు. యూదు రాజ్యాధికారాన్నిఎంతో విలువైనదిగా భావిస్తారు. ఆయన తాత నాథన్ ఒక రబ్బీ(యూదు మత నాయకుడు). ఆయన అమెరికా, యూరప్‌లలో పర్యటించి జియోనిజానికి మద్దతు ఇచ్చేలా ప్రసంగాలు చేశారు. 1920లలో తన కుటుంబాన్ని పాలస్తీనాకు తరలించాడు. అక్కడ తన కుటుంబం పేరుని నెతన్యాహుగా మార్చాడు. అంటే దీని అర్థం "దేవుడు ఇచ్చినది". ఇక ఆయన కుమారుడు, ప్రధాని నెతన్యాహు తండ్రి బెంజియన్ నెతన్యాహూ 1971 నుంచి 1975 వరకు కార్నెల్లో బోధించిన జుడాయిక్ అధ్యయనాల ప్రొఫెసర్. ఆయన 102 ఏళ్ల వయసులో మరణించాడు. దీన్ని బట్టి ఇజ్రాయెల్ ప్రధాని నెతాన్యాహూకి యూదు జాతి పట్ల ఎంత లోతేన సంబంధ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే వీటన్నింట్లకి అతీతంగా మన భారతీయ సంస్కృతికి నెతన్యాహు అమితంగా ఆకర్షింపబడటం మరింత విశేషం. ఇష్టపడే భారతీయ వంటకాలు..నెతన్యాహూకి ఇక్కడి ఆహారం, సంస్కృతి అంటే మహా ఇష్టం. నివేదికల ప్రకారం..టెల్ అవీవ్‌లోని ఒక భారతీయ రెస్టారెంట్ అయిన తందూరి టెల్ అవీవ్‌లో నెతన్యాహు ఆయన కాబోయే భార్య సారాను మొదటి డేట్లో కలిశారట. ఆ రెస్టారెంట్ యజమాని రీనా పుష్కర్ణ దాన్ని ధృవకరిస్తూ..వారి మొదటి డేట్ టేబుల్ నెంబర్ 8లో సమావేశమయ్యారని అని చెప్పారు. అంతేగాదు ఆయనకు భారతీయ ఆహారం అంటే మహా ఇష్టమని, వారంలో కనీసం రెండుసార్లు మన భారతీయ వంటకాలను ఆర్డర్ చేస్తారని చెప్పుకొచ్చారు. నెతన్యాహూకి బటర్ చికెన్ , కరాహి చికెన్ అంటే చాలా ఇష్టమట. ఈ రెండు దేశాలను ఏకం చేయడంలో ఈ ఆహారం కూడా ఒక రకంగా ముఖ్యపాత్ర పోషించిందని అంటోంది రెస్టారెంట్ యజమాని రీనా.నెట్టింట తెగ వైరల్‌గా ఆ ఫోటో..2018లో, నెతన్యాహూ, అతని భార్య భారతదేశాన్ని సందర్శించి ఐకానిక్ తాజ్‌మహల్‌ని సందర్శించారు. భారతదేశం అంటే ఎంతో ఇష్టం అందుకు గుర్తుగానే ఇక్కడి ప్రేమాలయంలో ఉన్నాం అని ఆ దంపతులు చెప్పడం విశేషం. అలాగే నెతన్యాహూ భారత పర్యటన సందర్భంగా 'షాలోమ్ బాలీవుడ్' అనే కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. అక్కడ హిందీ చిత్ర పరిశ్రమలోని ప్రముఖ వ్యక్తులను కలిశారు. "ఇన్నాళ్లు తానే గొప్ప వ్యక్తిని అని అనుకునేవాడిని కానీ నటుడు అమితాబ్ బచ్చన్ నాకంటే గొప్పవాడినని తర్వాతే తెలిసింది. ఎందుకంటే ఆయనకు 30 మిలియన్ల మంది ట్విట్టర్ ఫాలోవర్లు ఉన్నారంటూ నవ్వేశారు" నెతన్యాహు. అలాగే ఆయన మితాబ్ బచ్చన్‌తో సెల్ఫీ కూడా దిగారు. పైగా ఇది ఆస్కార్ అవార్డుల సమయంలో తెగ వైరల్ అయిన ఫోటోగా వార్తల్లో నిలిచింది. చివరగా నెతన్యాహూ కూడా పహల్ఘామ్ దాడిని ఖండించారు. ఆ సంఘటనను "అనాగరికం" అని అభివర్ణించారు. పైగా ఇజ్రాయెల్ భారతదేశానికి పూర్తిగా మద్దతిస్తుందని, దాని సంస్కృతి తోపాటు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటంలో కూడా తోడుగా ఉంటుందని స్పష్టం చేసి ప్రపంచ దేశాలనే విస్తుపోయేలా చేశారు.(చదవండి: కుగ్రామం నుంచి 'కుబేర' వరకూ..! సత్తా చాటుతున్న తెలంగాణ కుర్రాడు) -
ఇంతకీ గెలిచిందెవరు?
పన్నెండు రోజులపాటు భీకరంగా సాగి కాల్పుల విరమణ ఒప్పందం దిశగా పయనించిన ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంలో తామే విజయం సాధించామని ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా ఎవరికి వారు ప్రకటించుకున్నారు. తన వల్లే యుద్ధం ఆగిందని ట్రంప్ ఇప్పటికే ప్రకటించుకోగా, తమ ప్రయత్నం కారణంగానే సమరం సమసిపోయిందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ, ఇరాన్ సుప్రీంనేత అయతొల్లా అలీ ఖమేనీ ప్రకటించారు.దీంతో ఈ ఘర్షణలో నిజంగా గెలుపు జెండా ఎవరు ఎగరేశారనే అంశంపై చర్చ మొదలైంది. అయితే ప్రతి ఒక్కరూ ఎంతో కొంత విజయం సాధించారనే వాదనా వినిపిస్తోంది. అణుక్షేత్రాలను కుప్పకూల్చి ఇరాన్ కోలుకోలేని దెబ్బతీశానని అమెరికా ప్రకటించుకుంది. సైన్యాధికారులు, అణుశాస్త్రవేత్తలుసహా వైమానిక స్థావరాలు, క్షిపణి లాంచర్లను నాశనంచేసి ఇరాన్‌కు బుద్ధి చెప్పానని ఇజ్రాయెల్ గొప్పలు పోయింది. అమెరికాను సైతం ఎదిరించి పోరాడి తమ సత్తా చూపామని ఇరాన్ ప్రకటించుకుంది. ఈ నేపథ్యంలో యుద్ధాగ్ని నుంచి ఎవరు ఏ ప్రయోజనాలు పొందారనేది ఆసక్తికరంగా మారింది.ట్రంప్‌కు శాంతిదూతగా మార్కులుఇజ్రాయెల్– హమాస్ యుద్ధం, ఉక్రెయి న్–రష్యా యుద్ధంలో జోక్యం చేసుకుని శాంతిస్థాపనకు శతథా ప్రయత్నించానని ట్రంప్ చెప్పుకున్నారు. అయితే అక్కడ విఫలమైనా ఇజ్రాయెల్–ఇరాన్ యుద్ధాన్ని ఆపి సఫలీకృతుడిని అయ్యానని ట్రంప్ చెబుతున్నారు. శాంతిని కోరుకుంటూనే ఫోర్డో అణుకేంద్రంపై బాంబులేయడమేంటని అమెరికాలోనూ ట్రంప్‌కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు జరిగాయి.దోహాలోని తమ స్థావరంపై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించినా ట్రంప్ సంయమనం కోల్పోలేదు. ఈ విషయంలో ట్రంప్‌కు మంచి మార్కులు పడ్డాయి. శాంతికాముకులు ట్రంప్ నిర్ణయాన్ని మెచ్చుకున్నారు. శాంతి నోబెల్ కోసం ఎదురుచూస్తున్న ట్రంప్ ఆశలు ఈ కాల్పుల విరమణతో చిగురించినట్లే భావించాలి.గగనతలంపై ఇజ్రాయెల్ విజయంక్షిపణి లాంచర్లను నాశనం చేయడం ద్వారా ఇరాన్ గగనతలంపై తాము పూర్తి పట్టుసాధించామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ ప్రకటించారు. ఇది తన ఘన విజయమని చెప్పారు. ఇరాన్లో ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ ఉన్నతాధి కారులు, అణు శాస్త్రవేత్తలను అంతంమొందించారు. సైనిక, వైమానిక స్థావరాలను ధ్వంసంచేశారు. అణుకేంద్రాలు, మౌలిక వసతు లను కోలు కోనంతగా దెబ్బ తీశారు.ఇవన్నీ తన విజ యాలేనని నెతన్యా హూ సొంత డబ్బా భజా యించారు. శత్రుదేశాన్ని పలు రకాలుగా దెబ్బ కొట్టడం ద్వారా ఒక రకంగా నెతన్యా హూ భారీ స్థాయిలో పాపులారిటీ, ప్రజాదరణను పెంచుకున్నారు. వచ్చే ఏడాది తమ దేశంలో జరగబోయే ఎన్నికల్లో ఈ యుద్ధపర్వం నెతన్యాహూ పార్టీ విజయావకాశాలు అమాంతం పెంచింది. యుద్ధంలో తనకు తోడుగా అగ్రరాజ్యం కలిసివచ్చేలా ట్రంప్‌ను ఒప్పించడంలోనూ నెతన్యాహూ విజయం సాధించారు.అగ్రరాజ్యాన్నీ ఢీకొట్టగలనని ఇరాన్ సంకేతంతమ ఉనికే ప్రశ్నార్థకమైతే అగ్రరాజ్యం అమెరికాను సైతం ఢీకొట్టగలమని దోహా యూఎస్ స్థావరంపై క్షిపణి దాడులతో ఇరాన్ నిరూపించింది. ఘర్షణ మరింతగా విస్తరించకుండా గౌరవప్రదంగా యుద్ధక్షేత్రం నుంచి ఎలా నిష్క్రమించాలో తమకూ తెలుసునని ఇరాన్ రుజువు చేసింది. పశ్చిమాసి యాలో ఎ న్నో దేశాల్లో అమెరికా స్థావరా లున్నా తమకు మిత్రదే శమైన ఖతార్‌లోని స్థావ రం మీదనే ఇరాన్ వ్యూహా త్మకంగా క్షిపణుల్ని ప్రయోగించింది.అమెరికా, ఇరాన్ కయ్యా నికి తమ భూభాగం రణక్షే త్రంగా మారొద్దని ఖతార్ సైతం మధ్యవర్తిత్వానికి ముందుకు రావాలనే వ్యూహంతో ఇరాన్ కేవలం అల్ ఉదేయిద్ బేస్‌పైనే దాడులు చేసింది. వందల కేజీల యురేనియంను దాచిపెట్టి మధ్యవర్తి త్వానికి తన వైపు కొన్ని అస్త్రాలున్నాయని ప్రపంచానికి చాటిచెప్పింది.కొసమెరుపుఇప్పటికే హమాస్– ఇజ్రాయెల్ పోరు, ఉక్రెయిన్–రష్యా రణం, హౌతీ తిరుగుబాటుదారులు చమురునౌకలపై దాడులతో అధిక పెట్రో ధరల కత్తి గుచ్చుకుంటుందన్న భయాలతో ప్రపంచదేశాలు అల్లాడుతున్న వేళ 12 రోజులకే ఇజ్రాయెల్, ఇరాన్ వార్ కంచికి చేరడం అందరికీ పెద్ద ఊరట. అయితే అంతెత్తున ఎగసిన యుద్ధజ్వాలలు పూర్తిగా ఆరిపోతాయో లేదోనన్న అనుమానాలూ ప్రపంచదేశాలను పట్టిపీడిస్తున్నాయి.ఈ దేశాలు నివురుగప్పిన నిప్పులా ఉన్న విద్వేషాలను మళ్లీ రాజేసుకుని పశ్చిమాసియా ప్రశాంతతకు గండి కొడతాయేమోనని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ దాడులతో పాఠం నేర్చుకున్న ఇరాన్ మళ్లీ అత్యంత రహస్యంగా యురేనియంను వేరే చోట శుద్ధిచేస్తే పరిస్థితి ఏంటి? అనే ప్రశ్నకు ఎవరూ సమాధానం చెప్పలేని పరిస్థితీ ఉంది. అందుకే వీలైనంత త్వరగా శాంతిచర్చలు మొదలెట్టి దీనికి శాశ్వత పరిష్కారం కనుక్కోవడం అత్యావశ్యకం. -
ఇరాన్ అణు ముప్పును తొలగించాం: నెతన్యాహు
కాల్పుల విరమణపై ఇజ్రాయెల్ అధికారికంగా స్పందించింది. అమెరికా ప్రతిపాదించిన ఈ ఒప్పందానికి అంగీకరిస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు మంగళవారం మీడియా సమావేశంలో ప్రకటించారు. అదే సమయంలో ఇరాన్ అణు-క్షిపణి ముప్పును తొలగించడంలో విజయం సాధించాం అని పేర్కొన్నారాయన. ఇరాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందంపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పందిస్తూ.. ‘‘ఇరాన్ అణు, బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమాలను నిర్వీర్యం చేయడంలో విజయం సాధించాం. తద్వారా ముప్పును తొలగించగలిగాం. ఈ విషయంలో సహకరించడంతో పాటు రక్షణ సహకారం అందించిన ట్రంప్‌నకు కృతజ్ఞతలు. ఈ విజయానికి ప్రతిగా.. ట్రంప్‌నకు పూర్తి సహకారం అందిస్తాం. ఆయన ప్రతిపాదించిన పరస్పర కాల్పుల విరమణ ఒప్పందాన్ని అంగీకరిస్తున్నాం.’’ అని నెతన్యూహు పేర్కొన్నారు. అయితే.. ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే గనుక ఇజ్రాయెల్ ధీటుగానే స్పందిస్తుందని ఇరాన్‌ను హెచ్చరించారాయన. అయితే నెతన్యాహు అణు ముప్పు తొలగిందన్న వ్యాఖ్యలకు ఇరాన్ స్పందించాల్సి ఉంది.12 రోజుల యుద్ధం ముగిసిందని, ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అయితే తొలుత ఇరాన్ ఈ ప్రకటనను తోసిపుచ్చుతూ.. భిన్నమైన ప్రకటనలు చేసింది. ఈలోపు మంగళవారం ఉదయం ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణులను ప్రయోగించడంతో యుద్ధం కొనసాగుతోందని అంతా భావించారు. ఈ దాడుల్లో నలుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది. అయితే కాసేపటికే కాల్పుల విరమణ మొదలైందని టెహ్రాన్ వర్గాలు అధికారికంగా ప్రకటించగా.. కాసేపటికే ఇజ్రాయెల్ కూడా ఆ విషయాన్ని అధికారికంగా ధృవీకరించింది. ట్రంప్ ప్రతిపాదన ప్రకారం.. 24 గంటల్లో తొలి 12 గంటలు ఇరాన్ కాల్పుల విరమణ పాటించాలి. ఆ తర్వాత 12 గంటలు ఇజ్రాయెల్ ఒప్పందాన్ని పాటిస్తుంది. దీంతో కాల్పుల విమరణ ఒప్పందం సంపూర్ణంగా అమలు అయినట్లే. అయితే ఇది శాశ్వత పరిష్కారమా? కాదా? అనేదానిపై మరికొన్ని గంటల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
ఇరాన్ జెండాలతో వైట్‌హౌజ్ ఆవరణలో ప్రదర్శనలు
ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతల నడుమ.. అమెరికా రణరంగంలోకి దిగడంతో పశ్చిమాసియా ఒక్కసారిగా భగ్గుమంది. ఈ ఉద్రిక్తతల వేళ.. అమెరికా ప్రధాన నగరాల్లో ఇరాన్ మద్దతు ప్రదర్శనలు జరుగుతుండడం తీవ చర్చనీయాంశంగా మారింది. ఏకంగా అమెరికా అధ్యక్ష భవనం ఆవరణలోనే ట్రంప్ వ్యతిరేక నినాదాలతో ఓ ప్రదర్శన జరగడం గమనార్హం. ఇరాన్‌పై యుద్ధం వద్దు.. ఇజ్రాయెల్‌కు మద్దతు ఇవ్వడం ఆపండి.. గాజాలో నరమేధం ఆగిపోవాల్సిందే అంటూ అధ్యక్షుడు ట్రంప్‌ను ఉద్దేశించి పలువురు నినాదాలు చేశారు. మరికొందరు ఇరాన్‌కు మద్దతుగా పాటలు పాడుతూ తమ నిరసన గళం విప్పారు. ప్రస్తుతం యుద్ధ వ్యతిరేకత నినాదాలతో అమెరికా ప్రధాన నగరాలు మారుమ్రోగుతున్నాయి.బోస్టన్, చికాగోతో పాటు న్యూయార్క్ టైమ్ స్క్వేర్ వద్ద హ్యాండ్స్ ఆఫ్ ఇరాన్ స్లోగన్లు ఉన్న బ్యానర్లు ప్రదర్శిస్తూ కొందరు ఈ ప్రదర్శనలు చేపట్టారు. వైట్‌హౌజ్ వద్ద జరిగిన నిరసనల్లో పశ్చిమాసియా ఉద్రిక్తతల్లో అమెరికా జోక్యం చేసుకోవద్దంటూ నినాదాలు చేశారు.HAPPENING NOW 🚨: Anti-war protest in Boston following US strikes in Iran. pic.twitter.com/LRP6wELFtB— Ron Smith (@Ronxyz00) June 22, 2025ఇరాన్‌పై అమెరికా యుద్ధ విమానాలు దాడులు జరిపి.. తిరిగి ఈ ఉదయం వెనక్కి వచ్చాయి. ఆపరేషన్ మిడ్నైట్ హామర్ పేరుతో కేవలం 25 నిమిషాల్లోనే ఇరాన్ అణుశుద్ధి కేంద్రాలను (ఫోర్దో, ఇస్ఫాహాన్, నటాంజ్) దాడులు జరిపినట్లు అమెరికా సైన్యం ప్రకటించుకుంది. ఈ నేపథ్యంలో.. యుద్ధ వ్యతిరేక నిరసనలు తీవ్రతరం అయ్యాయి. మరోవైపు.. నిరసనల నేపథ్యంలో అక్కడి భద్రతా బలగాలు అప్రమత్తం అయ్యాయి. దౌత్య కార్యాలయాలతో పాటు మతపరమైన కేంద్రాల వద్ద భద్రత కట్టుదిట్టం చేసినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. ఇప్పటికే పలువురు నిరసనకారుల్ని అధికారులు అదుపులోకి తీసుకున్నారు.Happening now: Anti-war protesters have started to rally in front of the White House, calling for no war with Iran and an end to U.S. support to Israel. pic.twitter.com/mmenVH1wOG— BreakThrough News (@BTnewsroom) June 18, 2025అయితే అమెరికా సైన్యం జరిపిన దాడుల్లో ఇరాన్‌కు భారీ నష్టమే వాటిల్లిందని స్వయంగా ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ యుద్ధంలో జోక్యంతో అమెరికా ఘోర తప్పిదం చేసిందంటూ ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమనీ మండిపడగా.. ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ పేరుతో తాము చేపట్టిన యుద్ధం సుదీర్ఘంగా కొనసాగబోదని.. దాడుల్లో తాము లక్ష్యానికి చేరువైనట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహూ తాజాగా ఓ ప్రకటన చేశారు. వెల్లడించారు.ఇరాన్‌పై అమెరికా బాంబు దాడుల చేసిన తర్వాత.. యుద్ధాన్ని ఆపేది అప్పుడే: నెతన్యాహుఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని ఫోర్డో అణుకేంద్రాన్ని అమెరికా (USA) తీవ్రంగా ధ్వంసం చేసింది. అణ్వాయుధ కార్యక్రమంలో ఇరాన్‌ను వెనక్కి నెట్టాం. ముప్పును తొలగించుకున్నాం. లక్ష్యాలను సాధించడానికి అవసరానికి మించి మా చర్యలను కొనసాగించబోం. మా టార్గెట్‌ను చేరుకుంటే ఆపరేషన్ పూర్తయినట్లే. అప్పుడు యుద్ధం కూడా ఆగుతుంది. ప్రస్తుత ఇరాన్ పాలకులు మమ్మల్ని తుడిచిపెట్టాలని చూశారు. అందుకే ఈ ఆపరేషన్ చేపట్టాల్సి వచ్చింది. ఇందులో ప్రధానంగా మా అస్థిత్వానికి పొంచి ఉన్న రెండు ముప్పులను తొలగించాలనుకున్నాం. ఒకటి అణ్వాయుధాలు.. రెండు బాలిస్టిక్ క్షిపణులు. ఈ లక్ష్యాలను సాధించే దిశగా మేం ఒక్కో అడుగు వేస్తూ ముందుకుసాగుతున్నాం. వాటికి మేం చేరువయ్యాం. టెహ్రాన్‌తో సుదీర్ఘకాలం యుద్ధం కొనసాగించబోం. అయితే, అనుకున్న ఫలితం రాకముందే పోరాటం నుంచి నిష్క్రమించేది లేదు. ఐరాస స్పందన.. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసర సమావేశం నిర్వహించింది. అందులో ఐరాసలో ఇరాన్ రాయబారి అమీర్ సయీద్ ఇరవానీ మాట్లాడుతూ.. ‘‘అమెరికా విదేశాంగ విధానాన్ని హైజాక్ చేసి.. నెతన్యాహు అగ్రరాజ్యాన్ని ఈ యుద్ధంలోకి లాగారు. అమెరికా చరిత్రలో ఇది మాయని మచ్చగా మిగిలిపోనుంది. దౌత్యాన్ని నాశనం చేయడానికి అగ్రరాజ్యం కంకణం కట్టుకుంది. దీనికి సరైన సమయంలో దీటుగా బదులిస్తాం’’ అని హెచ్చరించారు.ఖమేనీ ఏమన్నారంటే.. యూదు శత్రువులు ఘోర తప్పిదం చేశారు. తీవ్ర నేరానికి పాల్పడ్డారు. దీనికి శిక్ష తప్పదు. తక్షణమే శిక్షించాల్సిన అవసరం ఉంది అని అమెరికా పేరును ప్రస్తావించకుండానే సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ ఏమన్నారంటే.. తాజా దాడులకు అగ్రరాజ్యం మూల్యం చెల్లించుకోవాల్సిందే. అమెరికాకు దీటుగా బదులిస్తాం అని అన్నారు. -
ట్రంప్ చరిత్రను తిరగరాశారు: నెతన్యాహు
టెల్ అవీవ్: ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ద యుద్ధం కొనసాగుతోంది. తాజాగా అమెరికా దళాలు మూడు ఇరానియన్ అణు కేంద్రాలపై విజయవంతంగా దాడి చేశాయి. ఈ నేపధ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు.. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ప్రశంసించారు. ట్రంప్ తీసుకున్న ధైర్యమైన నిర్ణయం చరిత్రను మారుస్తుందంటూ వ్యాఖ్యానించారు.అధ్యక్షుడు ట్రంప్, తాను తరచూ బలప్రయోగం ద్వారా శాంతి స్థాపన జరుగుతుందని చెబుతుంటామని, మొదట బలప్రయోగం జరిగితే, తరువాత శాంతి ఉద్భవిస్తుందన్నారు. డోనాల్డ్ ట్రంప్, యునైటెడ్ స్టేట్స్ తమ శక్తిని పూర్తిస్థాయిలో ప్రదర్శించాయని నెతన్యాహు అన్నారు. కాగా ఫోర్డోపై ఆరు బంకర్-బస్టర్ బాంబులను వేశామని, ఇతర అణు కేంద్రాలపై 30 టోమాహాక్ క్షిపణులను ప్రయోగించామని ట్రంప్ ‘ఫాక్స్ న్యూస్’కు తెలిపారు. యుద్ధంలో ట్రంప్ సహకారంపై స్పందిస్తూ, ఇరాన్ అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకోవాలనే మీ సాహసోపేతమైన నిర్ణయం చరిత్రను మారుస్తుందని ఇజ్రాయెల్ ప్రధాని పేర్కొన్నారు.ఆపరేషన్ రైజింగ్ లైన్లో ఇజ్రాయెల్ తన శక్తియుక్తులను ప్రదర్శించింది. అయితే గత రాత్రి ఇరాన్ అణు కేంద్రాలపై.. అమెరికా ఏ ఇతర దేశం చేయలేని రీతిలో దాడులు చేసింది. అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్‌లోని అత్యంత ప్రమాదకరమైన పాలనను, ప్రమాదకరమైన ఆయుధాల వినియోగాన్ని తిరస్కరించే విధంగా వ్యవహరించారని చరిత్రలో నమోదవుతుందని నెతన్యాహు పేర్కొన్నారు. దేముడు అమెరికాను, ఇజ్రాయెల్‌ను దీవించాలని, మన బలిష్టమైన కూటమిని, అచంచలమైన విశ్వాసాన్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నానని నెతన్యాహు అన్నారు.ఇది కూడా చదవండి: భయంతో బంకర్లో ఇరాన్ ఖమేనీ... వారసుల రేసులో ముగ్గురు? -
ప్రధాని నెతన్యాహుకు బిగ్ షాక్.. ఇజ్రాయెల్ ప్రజల కౌంటర్
టెలీ అవీవ్: ఇరాన్‌తో అమీతుమీ యుద్ధం జరుగుతున్న వేళ ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహుకు బిగ్ షాక్ తగిలింది. నెతన్యాహు తీరుపై ఇజ్రాయెల్ ప్రజలు మండిపడుతున్నారు. తన కుమారుడి పెళ్లి వాయిదాను కుటుంబ ‘త్యాగం’ అని నెతన్యాహు చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీరు ఒక్కరే త్యాగం చేయడం లేదు.. దేశ ప్రజలందరూ భయాందోళనలతో ప్రాణాలను అరచేతిలో పట్టుకుని జీవిస్తున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడులు కారణంగా ప్రభావిత ప్రాంతాలను ప్రధాని నెతన్యాహు పరిశీలించారు. ఈ సందర్బంగా నెతన్యాహు మాట్లాడుతూ.. ఇరాన్ దాడుల కారణంగా అమాయక ప్రజలు చనిపోతున్నారు. ఇజ్రాయెల్‌కు నష్టం జరుగుతోంది. దాడుల్లో చనిపోయిన వారి కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు. తమ ప్రియమైన వారు దూరమై ఎన్నో కుటుంబాలు వేదన అనుభవిస్తున్నాయి. మనలో ప్రతీ ఒక్కరికీ వ్యక్తిగత నష్టం జరిగింది. అందరం త్యాగాలు చేయాల్సి వస్తోంది. నా కుటుంబం కూడా అందుకు మినహాయింపు ఏమీ కాదు. యుద్ధం కారణంగా నా కుమారుడు అవ్నర్ పెళ్లిని రెండోసారి వాయిదా వేయాల్సి వచ్చింది. ఇది అవ్నర్ వివాహం చేసుకోబోయే అమ్మాయి, నా భార్య సారాపై తీవ్ర మానసిక ప్రభావం చూపిస్తోంది. ఈ ప్రతికూల పరిస్థితిని తట్టుకుంటున్న ఆమె ఓ ‘హీరో’. పెళ్లి వాయిదా కుటుంబ ‘త్యాగం’ అంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి.ప్రధాని నెతన్యాహు వ్యాఖ్యలపై ఇజ్రాయెల్ ప్రజలు సోషల్ మీడియాలో స్పందిస్తూ.. మీ కుటుంబాన్ని ఒక త్యాగమేనా?. యుద్ధం కారణంగా ఎందరో ప్రాణాలు కోల్పోయారు. యుద్ధం సమయంలో ఎంతోమంది వైద్యులు నిరంతరం పనిచేస్తున్నారు. రాత్రి షిఫ్టుల్లో కూడా పనిచేస్తున్నారు. వారు నిజమైన హీరోలు. ఈ ఉద్రిక్తతల కారణంగా మేమంతా నరకం అనుభవిస్తుంటే.. మీరు పెళ్లి వాయిదా వేయడాన్ని త్యాగంగా భావిస్తున్నారా? అంటూ విరుచుకుపడుతున్నారు.గాజాపై ఇజ్రాయెల్ దాడులు చేస్తున్న నాటి నుంచే నెతన్యాహు కుమారుడి వివాహ అంశం వివాదాస్పదంగా మారింది. గాజాతో యుద్ధం సమయంలో వివాహం జరగాల్సి ఉండగా.. అప్పుడు యుద్ధం కారణంగా మొదటిసారి వాయిదా పడింది. ఇక, రెండో సారి ఇరాన్‌తో యుద్ధం కారణంగా వాయిదా పడింది. -
ఇరాన్ దెబ్బ అదుర్స్.. ఇజ్రాయెల్‌కు భారీ ఎదురుదెబ్బ
టెహ్రాన్/టెవీ అవీవ్: ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం నడుస్తోంది. రెండు వైపుల నుంచి బాంబు దాడులు పీక్ స్టేజ్ చేరుకున్నాయి. ఇజ్రాయెల్పూ ఇరాన్ దళాలు విరుచుకుపడుతున్నాయి. ఇరాన్ ప్రయోగిస్తున్న బాలిస్టిక్ క్షిపణుల కారణంగా ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ ధ్వంసమైంది. ఇజ్రాయెల్‌లోని ఆసుపత్రులు, స్కూల్స్, నివాస ప్రాంతాల్లోకి ఇరాన్ క్షిపణులు దూసుకెళ్లాయి. దీంతో, భారీగా ప్రాణ నష్టం జరిగినట్టు తెలుస్తోంది.తాజాగా ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులు ఇజ్రాయెల్‌లోని పలు నగరాల్లో బీభత్సం సృష్టించాయి. టెలీ అవీవ్, రామత్‌గాన్, హోలోన్, బెర్జీబా నగరాలపై ఇరాన్ విరుచుకుపడింది. దీంతో, భయానక వాతావరణం నెలకొంది. బీర్షెబాలోని సోరోకా ఆసుప్రతిపై ఇరాన్ దాడి చేయడంతో భవనం పూర్తిగా దెబ్బతింది. అనంతరం, ఆసుపత్రిలో ఉన్న పేషంట్స్, వైద్యులు ప్రాణ భయంతో పరుగులు తీశారు. ఈ దాడిలో పలువురు గాయపడ్డారు. అత్యవసర బృందాలు స్పందించడంతో వారంతా ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలు వైరల్‌గా మారాయి.మరోవైపు.. ఇజ్రాయెల్‌లోని హోలోన్ ప్రాంతంలో నివాసాలపై ఇరాన్ దాడులకు తెగబడింది. ఈ క్రమంలో పలువురు పౌరులు తీవ్రంగా గాయపడ్డారని టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ నివేదించింది. దక్షిణ ఇజ్రాయెల్‌లోని ప్రధాన, అతిపెద్ద ఆసుపత్రిపై ఇరాన్ దాడులు చేయడంతో భారీ నష్టం జరిగిందని చెప్పుకొచ్చింది. ఇజ్రాయోల్ రాజధాని టెలి అవీవ్‌లోని బహుళ అంతస్తు భవనాలపై క్షిపణి దాడులు జరగడంతో అవి పూర్తిగా దెబ్బతిన్నాయి. 🚨 🚨 🚨 SOROKA HOSPITAL IN ISRAEL HIT BY IRANIAN BALLISTIC MISSILE pic.twitter.com/xK2HBPSeeV— Breaking911 (@Breaking911) June 19, 2025అంతకుముందు.. ఇరాన్ సైనిక సామర్థ్యం అణ్వస్త్ర స్థాయికి చేరకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా దాడులతో దండయాత్ర చేస్తున్న ఇజ్రాయెల్ బుధవారం తన బాంబుల కుంభవృష్టిని కురిపించింది. ఇరాన్‌లోని 40 కీలక ప్రాంతాలపై క్షిపణులతో విరుచుకుపడింది. యురేనియం శుద్ధి ప్రక్రియలో కీలకమైన సెంట్రీఫ్యూజ్‌లను తయారుచేసే కర్మాగారంపై భీకరస్థాయిలో మిస్సైళ్లను ప్రయోగించింది. ఇరాన్ సాయుధశక్తిని నిర్వీర్యం చేసేందుకు క్షిపణుల ఉత్పత్తి ఆయుధ ప్లాంట్లపైనా ఇజ్రాయెల్ వందల కొద్దీ డ్రోన్లను ఎక్కుపెట్టింది.🚨The recent rocket barrage by the Iranian regime hit a hospital in Southern Israel By the order of Khamenei, who specifically instructed to aim for civilian populations and hospitals.And you still ask why we don’t want them to have nuclear weapons…👇 pic.twitter.com/m2CuAxeFcn— Voice From The East (@EasternVoices) June 19, 2025ఇరాన్ అంతర్గత భద్రత శాఖ ప్రధాన కార్యాలయంపైనా యుద్ధవిమానాలు దాడులు చేశాయి. ప్రతిగా ఇరాన్ సైతం ఇజ్రాయెల్ భూభాగాలపై క్షిపణులను పేలుస్తూ విధ్వంసం సృష్టిస్తోంది. ఇరాన్ జరిపిన ప్రతిదాడుల్లో ఇప్పటిదాకా 24 మంది చనిపోయారు. బుధవారం తమవైపు దూసుకొచ్చిన 10 క్షిపణులను నేలకూల్చామని ఇజ్రాయెల్ పేర్కొంది. జవాదాబాద్‌లో అత్యాధునిక ఎఫ్–35 యుద్ధవిమానాన్ని ఇరాన్ సేనలు పేల్చేశాయి. దాదాపు రూ.140 కోట్ల విలువైన హెర్మెస్ డ్రోన్‌నూ నేలకూల్చాయి. అత్యంత శక్తివంతమైన ఫతాహ్ హైపర్సోనిక్ క్షిపణిని ప్రయోగించామని ఇరాన్ ప్రకటించింది. అయితే తమదేశంలో శుక్రవారం నుంచి ఇప్పటిదాకా 15,871 చోట్ల నిర్మాణాలు, దాదాపు 1,300 వాహనాలు, 1,633 ఆస్తులు నాశనమయ్యాయని ఇజ్రాయెల్ బుధవారం ఒప్పుకుంది.ఇరాన్లో భయానక నిశ్శబ్దం ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థ చాలా వరకు ధ్వంసంకావడంతో ఎప్పుడు ఎటు నుంచి ఇజ్రాయెల్ క్షిపణులు మీదొచ్చి పడతాయోనన్న భయాలు ఇరాన్ ప్రజల్లో కనిపించాయి. చాలా నగరాలు, పట్టణాల్లో దుకాణాలు, ఆఫీస్‌లు, స్కూళ్లు, కాలేజీలు మూతబడ్డాయి. సురక్షిత ప్రాంతాలకు నిత్యావసర సామగ్రితో వలసవెళ్లేవాళ్లు తప్పితే రోడ్లపై ఇంకెవరూ కనిపించట్లేదు. ఇజ్రాయెల్‌లో కాస్తంత భిన్నమైన వాతావరణం కని్పంచింది. ఇరాన్‌ను సుదూరంగా ఉన్న ఇజ్రాయెల్ పట్టణాల్లో పౌరసంచారాన్ని స్థానిక యంత్రాంగం అనుమతించింది. ‘‘ మా ఆర్థికవ్యవస్థ మళ్లీ పుంజుకోవడమే ఇరాన్‌పై విజయానికి ప్రబల నిదర్శనం’’ అని ఇజ్రాయెల్ రక్షణమంత్రి ‘ఇజ్రాయెల్ కట్జ్’ అన్నారు. ఆపరేషన్ రైజింగ్ లయన్ లక్ష్యంగా నెరవేరేదాకా ఇరాన్‌తో ఎలాంటి చర్చలు జరపబోమని స్పష్టం చేశారు. -
ఇరాన్ టార్గెట్ ట్రంప్.. హత్యకు ప్లాన్: నెతన్యాహు
జెరూసలేం: ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. పరస్పర దాడుల కారణంగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇలాంటి క్రమంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహు సంచలన ఆరోపణలు చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను ఇరాన్ చంపాలని చూస్తోందని చెప్పుకొచ్చారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.తాజాగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మాట్లాడుతూ..‘ఇరాన్‌కు నంబర్ వన్ శత్రువు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఇరాన్‌తో జరిగిన నకిలీ అణు ఒప్పందాన్ని ట్రంప్ రద్దుచేశారు. ఇందులో ట్రంప్ నిర్ణయాత్మక నాయకుడు. తమ అణు కార్యక్రమానికి ముప్పుగా ట్రంప్‌ను ఇరాన్ గుర్తించింది. అందుకే ట్రంప్ లేకుండా చేయాలని ఇరాన్ భావిస్తోంది. ఇప్పటికే రెండు సార్లు ట్రంప్‌ను హత్య చేసేందుకు ప్లాన్ చేసింది. ఇరాన్ దగ్గర అణ్వాయుధం ఉండకూడదు. ఇజ్రాయెల్ తననే కాకుండా ప్రపంచాన్ని కూడా రక్షిస్తోంది. ఇజ్రాయెల్ దాడులు ఇరాన్ అణు కార్యక్రమాన్ని చాలా వరకు వెనక్కి నెట్టాయి’ అని చెప్పుకొచ్చారు.Netanyahu claims that Iran tried to assassinate Trump twice, strongly implying that Iran was behind the two assassination attempts in 2024 -- with virtually no pushback from Bret Baier. He then goes on to thank Trump for the extensive US involvement in the current operation pic.twitter.com/savpcfxMMX— Michael Tracey (@mtracey) June 15, 2025ఇదిలా ఉండగా.. ఇజ్రాయెల్, ఇరాన్ వరుసగా మూడో రోజూ పరస్పరం భీకర దాడులు చేసుకున్నాయి. ఇరాన్ రక్షణ శాఖ ప్రధాన కార్యాలయంతో పాటు గ్యాస్, చమురు శుద్ధి కర్మాగారాలపై ఇజ్రాయెల్ భారీగా దాడులు చేసింది. క్షిపణి దాడులతో టెహ్రాన్ దద్దరిల్లిపోయింది. ఇరాన్ క్షిపణులు ఇజ్రాయెల్‌లో భారీ విధ్వంసం సృష్టిస్తున్నాయి. పశ్చిమాసియాలోని అమెరికా సైనిక, వైమానిక స్థావరాలు తదితరాల జోలికి రావొద్దని ఇరాన్‌ను ట్రంప్ తీవ్రంగా హెచ్చరించారు. వాటిపై దాడులు చేస్తే కనీవినీ ఎరగని రీతిలో సైనిక శక్తిని ప్రయోగించి ఇరాన్‌ను తుడిచిపెట్టేస్తామని హెచ్చరించారు. తక్షణం దిగొచ్చి తమతో అణు ఒప్పందం చేసుకుంటేనే దాడులు తగ్గుముఖం పడతాయని పునరుద్ఘాటించారు.క్షిపణులతో హోరెత్తించిన ఇరాన్ఇరాన్ కూడా ఇజ్రాయెల్‌పై విరుచుకుపడింది. యుద్ధవిమానాల ఇంధన తయారీ కేంద్రాలపై మిసైళ్లు ప్రయోగించింది. హైఫా సిటీలో చమురుశుద్ది కర్మాగారంపై దాడులు చేయడంతో పైప్, ట్రాన్స్మిషన్ లైన్లు దెబ్బతిన్నాయి. దాడుల్లో ఇప్పటిదాకా 14 మంది చనిపోయినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. 390 మందికి పైగా గాయపడ్డట్టు పేర్కొంది. టెల్అవీవ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని వరుసగా మూడోరోజు మూసేశారు. టెల్అవీవ్ వీధుల్లో కుప్పకూలిన భవనాలు, కాలిపోయిన కార్లు, బద్దలైన కిటికీలు, తలుపులూ దర్శనమిస్తున్నాయని అసోసియేటెట్ ప్రెస్ రిపోర్టర్ తెలిపారు.టెల్ అవీవ్‌కు దక్షిణాన బాట్‌యామ్ ప్రాంతంలోని 8 అంతస్తుల అపార్ట్మెంట్ క్షిపణి దాడుల్లో ధ్వంసమైంది. ఈ ఘటనలో ఏడుగురు చనిపోగా 35 మంది జాడ గల్లంతైంది. పలువురిని రెస్క్యూ బృందాలు శిథిలాల నుంచి కాపాడాయి. ఘటనాస్థలిని ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ సందర్శించారు. ఇరాన్ కావాలనే జనావాసాలపైనే దాడులు చేస్తోందని మండిపడ్డారు.మీరు ఆపితే మేమూ ఆపుతాందాడుల వేళ ఇరాన్ కీలక ప్రకటన చేసింది. ఇజ్రాయెల్ దాడులను ఆపితే తామూ దాడులను నిలిపేస్తామని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ స్పష్టం చేశారు. ‘‘మాకు యుద్ధ విస్తరణ కాంక్ష లేదు. కానీ ఇజ్రాయెల్ ఈ యుద్ధాన్ని పశ్చిమాసియాలో మరింత విస్తరించాలని తహతహలాడుతోంది. అందుకే బుషెహర్ ప్రావిన్సులో ఖతార్‌తో కలిసి ఇరాన్ నిర్వహిస్తున్న అసాలుయే ఆయిల్ రిఫైనరీపై దాడి చేసింది’’ అంటూ మండిపడ్డారు. తమ ఆర్థికమూలాలను దెబ్బతీయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తోందని దుయ్య బట్టారు. ఒమన్ మధ్యవర్తిత్వంలో అమెరికా, ఇరాన్ మధ్య ఆదివారం జరగాల్సిన ఆరో విడత కీలక అణు చర్చలు రద్దయ్యాయి. ఇజ్రాయెల్‌ను తమపైకి ఎగదోస్తున్న అమెరికా చర్చలు అర్ధరహితమని ఇరాన్ ప్రకటించింది. చర్చలకు సాయపడేందుకు బ్రిటన్, ఫ్రాన్స్‌తో పాటు తామూ సిద్ధమని జర్మనీ పేర్కొంది. -
ఇరాన్‌కు టెన్షన్.. ఖమేనీ టార్గెట్‌గా విరుచుకుపడిన ఇజ్రాయెల్
టెహ్రాన్: ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య జరుగుతున్న భీకర యుద్ధంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. మిలిటరీ స్థావరాలే లక్ష్యంగా రెండు దేశాలు పరస్పర దాడులు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇది కేవలం ఆరంభం మాత్రమే అంటూ ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు ప్రకటించారు. మరోవైపు.. ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడులు పెంచింది. డ్రోన్లతో విరుచుకుపడుతోంది. దాడుల కారణంగా ఇప్పటికే 78 మంది ఇరాన్ పౌరులు మృతి చెందగా.. 329 మంది గాయపడ్డారు. ఇక, ఇజ్రాయెల్‌లో ఒకరు మృతి చెందగా.. 39 మంది గాయపడినట్టు తెలుస్తోంది.ఇదిలా ఉండగా.. ఇరాన్ టాప్ లీడర్లే టార్గెట్‌గా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. ఇందులో భాగంగానే ఇరాన్ (Iran) సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ (Ayatollah Ali Khamenei) నివాస సమీపంలోనూ వైమానిక దాడులు జరిగినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. టెహ్రాన్‌లోని మోనిరియాలో ఈ వైమానిక దాడులు జరిగాయి. అక్కడే ఖమేనీ నివాసంతో పాటు ఇరాన్ అధ్యక్ష కార్యాలయం ఉంది. ఈ క్రమంలోనే అక్కడ దాడులు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. స్థానిక మీడియా దీనికి సంబంధించిన వీడియోను విడుదల చేసింది.మరోవైపు.. ఇరాన్ మిలిటరీ చీఫ్‌గా అమీర్ హతామీని నియమించినట్లు ఖమేనీ పేర్కొన్నారు. ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో ఇరాన్ మిలిటరీ చీఫ్ మహమ్మద్ బాఘేరి మృతిచెందిన విషయం తెలిసిందే. 2013 నుంచి 2023 వరకు హతామీ దేశ రక్షణ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఆపరేషన్ ‘రైజింగ్ లయన్’ పేరుతో ఇరాన్‌పై ఇజ్రాయెల్ పెద్దఎత్తున దాడులకు దిగింది. ఇరాన్‌లోని అణు, సైనిక స్థావరాలు, సైనిక ఉన్నతాధికారులే లక్ష్యంగా వందల క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడిలో టెహ్రాన్ పలు కీలకమైన మిలిటరీ అధికారులను, అణుశాస్ర్తవేత్తలను కోల్పోయింది. దీనికి టెహ్రాన్ ప్రతిదాడులను కూడా చేసింది.ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం వేళ ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్ స్పందించారు. గుటెర్రస్ ట్విట్టర్ వేదికగా.. ఇరు దేశాలు ఉద్రిక్తతలను ఆపాలని పిలుపునిచ్చారు. శాంతి, దౌత్య మార్గంలో చర్చలు జరపాలన్నారు. దాడులు ఆపాల్సిన సమయం ఆసన్నమైంది’ అని అన్నారు. -
ఇజ్రాయెల్ మరో యుద్ధం.. ఇరాన్‌పై వైమానిక దాడులు..
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరాన్ రాజధాని ట్రెహాన్ టార్గెట్‌గా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. ఇరాన్‌కు చెందిన అణు కర్మాగారం, సైనిక స్థావరాలే లక్ష్యంగా ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి. మరోవైపు.. ఇజ్రాయెల్‌లో అత్యవసర పరిస్థితి విధిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.ఇరాన్‌పై యుద్ధం విషయంలో అమెరికా మాటను వినేందుకూ ఇజ్రాయెల్ సిద్ధంగా లేకపోవడం గమనార్హం. మరోవైపు దీనిని తిప్పికొట్టేందుకు ఇరాన్ అదే స్థాయిలో ఏర్పాట్లు చేసుకుంటోంది. వందల బాలిస్టిక్ క్షిపణులను సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో యుద్ధం ఎటు దారితీస్తుందోనన్న భయాందోళనలు ప్రపంచమంతటా వ్యక్తమవుతున్నాయి. Iran had no idea we were coming. They were completely blind. The Israeli strike caught ALL the Iranian commanders in bed. Not a single warning signal was activated. pic.twitter.com/oLLyt1JhDs— Cheryl E 🇮🇱🎗️ (@CherylWroteIt) June 13, 2025ఇజ్రాయెల్ దాడులపై నెతన్యాహు ప్రకటన..ఇరాన్‌పై ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ ప్రారంభించామని నెతన్యాహు ప్రకటనఇరాన్ అణ్వాయుధీకరణ కార్యక్రమం, అణు కేంద్రాలను టార్గెట్ చేసినట్టు చెప్పుకొచ్చారు.ఇరాన్‌పై ఆపరేషన్ రైజింగ్ లయన్ ప్రారంభమైంది.ఎన్ని రోజులైన ఆపరేషన్ కొనసాగుతుంది. ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ పారామిలిటరీ రివల్యూషనరీ గార్డ్ అధిపతి మృతి!Benjamin Netanyahu full statement on Iran's attack:"We struck at the heart of Iran's nuclear enrichment program, Iran's nuclear weaponization program, Iran's main enrichment facilities, leading nuclear scientists, and ballistic missile programs."pic.twitter.com/EBGMLi23Aj— Vivid.🇮🇱 (@VividProwess) June 13, 2025ఇరాన్ (Iran)పై ఇజ్రాయెల్ ముందస్తు వైమానిక దాడులు చేసింది. టెహ్రాన్‌లోని ఓ ప్రాంతంలో శుక్రవారం భారీగా పేలుడు శబ్ధాలు వినిపించాయి. ఈ మేరకు ఇరాన్‌లోని ఓ వార్తా సంస్థ ఈ విషయాన్ని ధ్రువీకరించింది. ఇరాన్‌కు చెందిన అణు కేంద్రాలు, సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది. డజన్ల కొద్దీ దాడులు జరిగాయని సమాచారం. వీటి తర్వాత టెహ్రాన్ అంతర్జాతీయ విమానాశ్రయం అన్ని విమానాలను నిలిపివేసింది.మరోవైపు.. ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్‌కు భారీ నష్టం జరిగినట్టు తెలుస్తోంది. ఇరాన్ ఆర్మీ చీఫ్ సహా సైనికులను టార్గెట్ చేసి ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసినట్టు సమాచారం. 🚨 JUST IN: The Israeli military has KlLLED Iran’s Military Chief of Staff in a targeted strike, per FoxNetanyahu says Iran has enriched enough Uranium for nine atomic bombs. pic.twitter.com/VSU5t87iGZ— Nick Sortor (@nicksortor) June 13, 2025ఇజ్రాయెల్‌లో ఎమర్జెన్సీ.. మరోవైపు ఇజ్రాయెల్‌లో ప్రత్యేక అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఆ దేశ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ దేశంలో దాడులు జరగవచ్చని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఇరాన్ లో తాము దాడులు నిర్వహించామని.. దీని కారణంగా ఇజ్రాయెల్‌లో కూడా క్షిపణి లేదా డ్రోన్ దాడులు జరగవచ్చని ఆయన అన్నారు. ఇక ఇరాన్‌పై దాడులు చేయడంలో ఇజ్రాయెల్ ఏకపక్షంగా వ్యవహరించిందని, ఈ ఆపరేషన్‌లో అమెరికా ప్రమేయం లేదని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో స్పష్టం చేసారు. ఈ ప్రాంతంలోని అమెరికన్ దళాలను రక్షించడం తమ పరిపాలన యొక్క అగ్ర ప్రాధాన్యత అని ఆయన అన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే తాము చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఇరాన్ అమెరికా ప్రయోజనాలను లేదా సిబ్బందిని లక్ష్యంగా చేసుకోకూడదని మార్క్ అన్నారు. Iran is the enemy but this is not our fightThey chant "death to America" all the time but two things can be true at once. This is not our fight If you're screaming for Trump to send our troops to die in an Israel-Iran war, grab a gun and go fight it yourself! Drag your own… pic.twitter.com/ZnCkqZHu2q— Terrence K. Williams (@w_terrence) June 13, 2025 అమెరికా స్పందన..ఇరాన్‌పై ఇజ్రాయెల్ చేస్తున్న వైమానిక దాడులతో తమ దేశానికి ఎలాంటి సంబంధం లేదని అమెరికా విదేశాంగశాఖ మంత్రి మార్కో రూబియో ప్రకటించారు. టెహ్రాన్ దాడికి రావొద్దని, తమ దేశానికి చెందిన వ్యక్తులను లక్ష్యంగా చేసుకోవద్దని సూచించారు. అమెరికా బలగాలను కాపాడుకోవడమే తమ తొలి ప్రాధాన్యత అని పేర్కొన్నారు.Here we go. Israel has just struck Tehran, Iran.The United States should NOT get involved in this!No more wars!pic.twitter.com/ngTAn1AEKs— Steve 🇺🇸 (@SteveLovesAmmo) June 13, 2025 -
హమాస్ నేత సిన్వార్ హతం
డెయిర్ అల్ బాలాహ్ (గాజా స్ట్రిప్): గాజాలో హమాస్‌కు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. హమాస్ సాయుధ సంస్థ సీనియర్ నాయకుడు మొహమ్మద్ సిన్వార్ ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో హతమయ్యారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ బుధవారం పార్లమెంట్లో ఈ మేరకు ప్రకటించారు. హమాస్‌కు గతంలో అత్యంత కీలక నేతగా నిలిచిన యాహ్యా సిన్వార్ తమ్ముడే మొహమ్మద్. యాహ్యా గతేడాది ఇజ్రాయెల్ వైమానిక దాడిలో మరణించారు. 🚨 | JUST IN: Israeli PM Benjamin Netanyahu CONFIRMS the elimination of 3 top Hamas leaders -- Mohammed Deif, Yahya Sinwar, and Mohammed Sinwar.Terrorism isn't managed it’s erased.This is what real leadership looks like when evil shows its face. 🇮🇱🔥 pic.twitter.com/h1PsuLBarY— Hank™ (@HANKonX) May 28, 20252023 అక్టోబర్ ఏడున ఇజ్రాయెల్ శివారు గ్రామాలపై హమాస్ మెరుపుదాడి ఘటన సూత్రధారుల్లో యాహ్యా ఒకరని ఇజ్రాయెల్ ఆరోపించడం తెల్సిందే. యాహ్యా అనంతరం ఆయన బాధ్యతలను మొహమ్మదే చూసుకుంటున్నారు. సిన్వార్ సొంతపట్టణమైన ఖాన్ యూనిస్‌పై మే 13న ఇజ్రాయెల్ భారీగా బాంబు దాడులు చేసింది. ‘‘వాటి ధాటికి స్థానిక యూరోపియన్ ఆస్పత్రి భూగర్భంలోని హమాస్ కమాండ్ సెంటర్ నాశనమైంది. అందులో ఉన్న సిన్వార్ చనిపోయాడు’’ అని సైన్యం చెబుతోంది. సిన్వార్ మరణాన్ని హమాస్ ధ్రువీకరించలేదు. అయితే మే 13 నాటి దాడిలో ఆరుగురు చనిపోయారని, 40 మంది గాయపడ్డారని గాజా ప్రభుత్వం అప్పుడే ప్రకటించింది. -
‘మీరు ఒక్క క్షిపణి దాడి చేశారు.. ఇక మేమేంటో చూపిస్తాం’
టెల్ అవీవ్: తమ దేశంపై హౌతీ రెబల్స్ చేసిన క్షిపణ దాడికి అంతకుమించి ప్రతీకారం తీర్చుకుంటామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతాన్యాహూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇక తాము ఏంటో చూపిస్తామంటూ హౌతీ తిరుగుబాటుదారులను ఉద్దేశించి ‘ఎక్స్’ వేదికగా హెచ్చరించారు. ‘ మీరు ఒక క్షిపణి దాడిని మాపై ప్రయోగించారు. దానికి ప్రతీకారం ఎలా ఉంటుందో ఇక నుంచి చూస్తారు. మీరు చేసిన దాడుల కంటే ఏడు రెట్లు అధికంగా మా దాడి ఉంటుంది. గాజాలో ఉన్న పాలస్తీయుల పట్ల సానుభూతి నాటకంతో డ్రామాలు చేస్తున్నారు. మేము గతంలో మీపై యుద్ధం చేశాం. భవిష్యత్ లో కూడా చేస్తూనే ఉంటాం. మీలాగ ఒక్క దాడి కాదు. క్షిపణుల వర్షం కురిపిస్తాం. యూఎస్ తో సమన్వయం చేసకుంటూ ముందుకెళ్తాం. మేము, యూఎస్ కలిసి మిమ్మల్ని అంతమొందిస్తాం’ అని మాట్లాడిన వీడియో ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు ఇజ్రాయిల్ ప్రధాని.צפו בעדכון חשוב ממני אליכם >> pic.twitter.com/hLLodqVnPz— Benjamin Netanyahu - בנימין נתניהו (@netanyahu) May 4, 2025 కాగా, హౌతీ తిరుగుబాటు దారుటు ఇజ్రాయిల్‌పై బాలిస్టిక్ మిస్సైల్‌తో విరుచుకుపడ్డారు. ఆదివారం. ఇజ్రాయిల్‌లో అతిపెద్ద విమానాశ్రయమైన టెల్ అవీవ్‌లోని బెన్ గురియన్ ఎయిర్‌పోర్ట్‌పైకి క్షిపణితో ఎటాక్ చేశారు. దీంతో ఒక్కసారిగా ఇజ్రాయిల్ ప్రజల్లో భయాందోళనలకు గురయ్యారు. ఎయిర్పోర్ట్ టెర్మినల్ 3 నుంచి కేవలం 75 మీటర్ల దూరంలోనే క్షిపణి పడింది. మిస్సైల్ ధాటికి 25 మీటర్ల లోతైన భారీ గొయ్యి ఏర్పడింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇజ్రాయిల్‌కి ఉన్న శక్తివంతమైన నాలుగు అంచెల ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను దాటుకుని క్షిపణి దాడి జరగడం సంచలనం కలిగిస్తోంది. క్షిపణి విమానాశ్రయం సమీపంలో పడకుండా అడ్డగించిన అనేక ప్రయత్నాలు విఫలమయ్యాయని ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) తెలిపింది. ఒక్కసారిగా మిస్సైల్ దాడి జరగడంతో ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. ఈ దాడిలో 8 మంది గాయపడినట్లు ఇజ్రాయిల్ అధికారులు వెల్లడించారు. -
అమెరికాపై సుంకాలు ఎత్తేసిన ఇజ్రాయెల్
జెరూసలేం: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాల హెచ్చరికలు పని చేస్తున్నాయి. అమెరికా దిగుమతులపై అన్ని సుంకాలను ఇజ్రాయెల్ ఎత్తేసింది. ప్రధాని బెంజమిన్ నెతన్యాహు బుధవారం ఈ మేరకు ప్రకటించారు. ‘‘అమెరికా వస్తువులపై కస్టమ్స్ సుంకాలను రద్దు చేయడమంటే మార్కెట్‌ను ఒక దశాబ్దం పాటు పోటీకి తెరవడం. ఆర్థిక వ్యవస్థకు వైవిధ్యాన్ని పరిచయం చేయడం. జీవన వ్యయాన్ని తగ్గించడానికి మా ప్రభుత్వం ఎంచుకున్న విధానాల్లో ఇది అదనపు దశ. మార్కెట్‌కు, ఇజ్రాయెల్ పౌరులకు ప్రయోజనం చేకూర్చేది. ఇజ్రాయెల్, అమెరికాల సంబంధాలను ఈ చర్య మరింత బలోపేతం చేస్తుంది’’ అని ‘ఎక్స్’లో నెతన్యాహు ప్రకటించారు.40 ఏళ్ల స్వేచ్ఛా వాణిజ్యంఇజ్రాయెల్, అమెరికా మధ్య 40 ఏళ్లుగా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమల్లో ఉంది. 99 శాతం అమెరికా దిగుమతులను ఇజ్రాయెల్ ఇప్పటికే సుంకాల నుంచి మినహాయించింది. ఈ నేపథ్యంలో తాజా చర్యను ఆర్థిక చర్యగా కంటే దౌత్య, రాజకీయ చర్యగా భావిస్తున్నారు. ప్రస్తుతం అమెరికా వ్యవసాయోత్పత్తులపై ఇజ్రాయెల్ ఏటా 42 మిలియన్ షెకెల్స్ (సుమారు 1.15 కోట్ల డాలర్ల) సుంకాలు వసూలు చేస్తోంది. ఇజ్రాయెల్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ డేటా ప్రకారం 2024లో ఆ దేశం మొత్తం ఎగుమతుల విలువ 172 కోట్ల డాలర్లు. అమెరికా నుంచి దిగుమతుల విలువ 92 కోట్ల డాలర్లు. -
విడుదల చేయకుంటే నరకమే
జెరూసలెం: గాజాలో బందీలుగా ఉన్న వారందరినీ హమాస్ విడుదల చేయకపోతే నరక ద్వారాలు తెరుస్తామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు హెచ్చరించారు. ‘‘గాజా విషయంలో ఇజ్రాయెల్, అమెరికాలకు ఉమ్మడి వ్యూహం ఉంది. ఈ వ్యూహం వివరాలను ప్రజలతో పంచుకోలేం. హమాస్ సైనిక, రాజకీయ ఉనికిని నిర్మూలించడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. నరకం గేట్లు ఎప్పుడు తెరుచుకుంటాయో వివరాలను తాము చెప్పలేం. బందీలందరినీ విడుదల చేయకపోతే మాత్రం అవి ఖచ్చితంగా తెరుచుకుంటాయి. గాజాలో హమాస్ సైనిక సామర్థ్యాన్ని, దాని రాజకీయ పాలనను అంతమొందిస్తాం. బందీలందరినీ స్వదేశానికి తీసుకొస్తాం. గాజా నుంచి మరోసారి ఇజ్రాయెల్‌కు ముప్పు వాటిల్లకుండా చూస్తాం’’అని నెతన్యాహూ వ్యాఖ్యానించారు. పశ్చిమాసియా పర్యటనలో ఉన్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఆదివారం జెరూసలెం నగరానికి చేరుకుని అక్కడ నెతన్యాహుతో సమావేశమయ్యారు. అధ్యక్షుడు ట్రంప్ గాజా స్వా«దీన ప్రతిపాదనపై అరబ్ నేతల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఆయన పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతు కొనసాగుతుందని రూబియో పునరుద్ఘాటించారు. ‘‘హమాస్ సైనిక లేదా ప్రభుత్వ శక్తిగా కొనసాగదు. హమాస్ అధికారంలో ఉన్నంత కాలం శాంతి అసాధ్యం. దానిని నిర్మూలించలేదు’’అని ఆయన ఉద్ఘాటించారు. రూబియో గానీ, నెతన్యాహు గానీ గాజా కాల్పుల విరమణ నిబంధనలను ప్రస్తావించలేదు. ఇరాన్‌పై ప్రత్యేక దృష్టి.. గాజా పరిస్థితితోపాటు ఇరాన్ గురించి నెతన్యాహు, రూబియో ప్రత్యేకంగా చర్చించారు. పశ్చిమాసియా మొత్తం సంక్షోభానికి ఇరాన్ కారణమని రూబియో, నెతన్యాహు ఆరోపించారు. టెహ్రాన్ అణ్వాయుధాలను అభివృద్ధి చేయకుండా ఆపాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. పశ్చిమాసియాలోని ప్రతి ఉగ్రవాద సంస్థ వెనుక, ప్రతి హింసాత్మక చర్య వెనుక, ఈ ప్రాంతంలో లక్షలాదిమంది ప్రజల శాంతి, సుస్థిరతకు ముప్పు కలిగించే ప్రతి ఘటన వెనుక ఇరాన్ ఉంది’’అని రూబియో వ్యాఖ్యానించారు. ‘‘ఇప్పటికే ఇరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ట్రంప్ మద్దతుతో మిగిలిన పనిని పూర్తి చేస్తాం’’అని నెతన్యాహు అన్నారు. ఇజ్రాయెల్ దాడి బందీల మార్పిడి కొనసాగుతుండగా ఆదివారం ఈజిప్టు సరిహద్దులోని రఫా సమీపంలో ఇజ్రాయెల్ వైమానిక దాడి జరిపింది. దాడిలో ముగ్గురు హమాస్ సాయుధులు మరణించారు. ఈ దాడి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని, ఒప్పందాన్ని విచ్చిన్నం చేసేందుకు నెతన్యాహు ప్రయత్నిస్తున్నారని హమాస్ ఆరోపించింది. కాల్పుల విరమణ మొదటి దశ మరో రెండు వారాల్లో ముగియనుంది. రెండవ దశ కోసం చర్చలు ప్రారంభం కావాల్సి ఉంది.త్వరలో పాలస్తీనియన్ల తరలింపు: ఇజ్రాయెల్ ట్రంప్ ప్రతిపాదించిన గాజా నుంచి పాలస్తీనియన్ల సామూహిక తరలింపు త్వరలో ప్రారంభమవుతుందని తాను ఆశిస్తున్నట్లు ఇజ్రాయెల్ అతివాద ఆర్థిక మంత్రి బెజాలెల్ స్మోట్రిచ్ శనివారం రాత్రి చెప్పారు. రాబోయే వారాల్లో ఇది ప్రారంభమవుతుందని ఆశిస్తున్నానన్నారు. ‘‘వచ్చే 10 నుంచి 15 ఏళ్ల వరకు గాజాలో పాలస్తీనియన్లకు ఏమీ ఉండదు. హమాస్ తిరిగి యుద్ధానికి ప్రయతి్నస్తే గాజా అంతా జబాలియా లాగా మరుభూమిగా మారడం ఖాయం’’అని మంత్రి బజాలెల వ్యాఖ్యానించారు. గాజా నుంచి పాలస్తీనియన్లను ఉద్దేశపూర్వకంగా తరలించడం మానవాళికి వ్యతిరేకంగా జరిగే నేరమని పలు అంతర్జాతీయ సంస్థలు పేర్కొన్నాయి. ఇజ్రాయెల్‌పై మారణహోమం ఆరోపణలను అంతర్జాతీయ న్యాయస్థానం ఇప్పటికే పరిశీలిస్తోంది. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు గాజాలో యుద్ధ నేరాలు, మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు నెతన్యాహు, మాజీ రక్షణ మంత్రి యోవ్ గాలెంట్పై అరెస్టు వారెంట్లు జారీ చేసింది. కాగా, రెండు అంతర్జాతీయ ట్రిబ్యునళ్లను నెతన్యాహు తప్పుబట్టారు. అంతర్జాతీయ న్యాయస్థానంపై ఆంక్షలు విధించినందుకు ట్రంప్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన ఆయన అంతర్జాతీయ న్యాయ సంస్థలపై మరిన్ని సంయుక్త చర్యలు తీసుకోవాలని సూచించారు. -
డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం.. ఈ సారి ఏకంగా!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ఐసీసీ)పై ఆంక్షలు విధించారు. ఐసీసీ అధికారులు, ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులతో పాటు కోర్టు దర్యాప్తులకు సహకరించారని తేలితే వారి ఆస్తుల్ని స్తంభింప చేయడంతో పాటు వారి ప్రయాణాలపై నిషేధం విధించారు. అమెరికా, తన మిత్రదేశమైన ఇజ్రాయెల్ లక్ష్యంగా ఐసీసీ నిరాధారమైన దర్యాప్తులు చేస్తున్నందుకు గాను ట్రంప్ చర్యలకు ఉపక్రమించారు. ఇందులో భాగంగా గురువారం ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకం చేశారని వైట్ హౌస్ వర్గాలు తెలిపాయి. ట్రంప్‌తో నెతన్యాహు భేటీమంగళవారం ట్రంప్‌తో ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు భేటీ అయ్యారు. ఈ భేటీ తర్వాత ట్రంప్ ఎగ్జిక్యూటీవ్ ఆర్డర్ జారీ చేశారు. ఆ ఎగ్జిక్యూటీవ్ ఆర్డర్లో నెదర్లాండ్‌లోని హేగ్‌లో ఉన్న అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. అందుకే చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆఫ్ఘనిస్తాన్‌లో అమెరికా సర్వీస్ సభ్యులపై, గాజాలో ఇజ్రాయెల్ దళాలు చేసిన యుద్ధ నేరాలపై ఐసీసీ దర్యాప్తుల్ని ప్రస్తావించారు. మాపై, మా మిత్రదేశం ఇజ్రాయెల్‌పై ఐసీసీ చట్టవిరుద్ధమైన, నిరాధారమైన చర్యలకు పాల్పడిందని ఆ ఉత్తర్వుల్లో వెల్లడించారు.నెతన్యాహుపై ఐసీసీ అరెస్టు వారెంట్లు జారీ నెతన్యాహుపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) గతేడాది అరెస్టు వారెంట్లు జారీ చేసింది. అలాగే ఇజ్రాయెల్ రక్షణ శాఖ మాజీ మంత్రి యోవ్ గల్లాంట్‌తోపాటు పలువురు హమాస్ నేతలపైనా వారెంట్లు జారీ చేసింది. బెంజమిన్, గల్లాంట్ గాజాలో మారణహోమం సాగించారని, మానవత్వంతో దాడి చేశారని ఐసీసీ ఆక్షేపించింది. హత్యలు చేయడం, సాధారణ ప్రజలను వేధించడం వంటి అమానవీయ చర్యలకు పాల్పడ్డారని ఆరోపించింది.గాజాలో ప్రజలకు ఆహారం, నీరు, ఔషధాలు, విద్యుత్, ఇంధనం, ఇతర నిత్యావసరాలు అందకుండా ఆంక్షలు విధించారని, అమాయకుల మరణానికి కారకులయ్యారని మండిపడింది. నెతన్యాహు, గల్లాంట్ చర్యల వల్ల ఎంతోమంది మహిళలు, చిన్నారులు బలయ్యారని ఉద్ఘాటించింది. పౌష్టికాహారం, నీరు అందక, డీహైడ్రేషన్‌తో పసిబిడ్డలు మరణించారని పేర్కొంది.నెతన్యాహు, గల్లాంట్ ఉద్దేశపూర్వకంగానే సామాన్య ప్రజలపై వైమానిక దాడులు చేసినట్లు చెప్పడానికి సహేతుకమైన ఆధారాలను గుర్తించామని వివరించింది. గాజాలో నెలకొన్న మానవతా సంక్షోభానికి నెతన్యాహు, గల్లాంట్ బాధ్యత వహించాలని తేల్చిచెప్పింది. యుద్ధ నేరాల్లో నెతన్యాహు నిందితుడని స్పష్టం చేసింది. -
గాజాపై ట్రంప్ కన్ను
వాషింగ్టన్: సంచలనాల ట్రంప్ మరో అంతర్జాతీయ సమాజంపై మరో బాంబు విసిరారు. గాజాను అమెరికా పూర్తిగా స్వా«దీనం చేసుకుంటుందని ప్రకటించారు. ‘‘ఇజ్రాయెల్‌తో యుద్ధంలో శ్మశానసదృశంగా మారిన గాజాను అత్యంత సుందర పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతాం. ఆర్థికాభివృద్ధి కార్యకలాపాలు చేపడతాం. భారీగా ఆవాస, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం’’ అని అమెరికా అధ్యక్షుడు చెప్పుకొచ్చారు. గాజాలో ఉంటున్న దాదాపు 20 లక్షల మంది పాలస్తీనావాసులు ఆ ప్రాంతాన్ని వీడాల్సిందేనని స్పష్టం చేశారు. వారిని గాజా నుంచి శాశ్వతంగా తరలించి పునరావాసం కల్పిస్తామన్నారు. అయితే, పశ్చిమాసియాలోని పొరుగు దేశాలే వారిని అక్కున చేర్చుకోవాలని తేల్చేశారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ సమక్షంలోనే ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రకటన చేయడం విశేషం. పాలస్తీనావాసులను గాజా నుంచి తరలించేందుకు, ఆ ప్రాంతాన్ని స్వా«దీనం చేసుకునేందుకు అమెరికాకు ఏం అధికారముందని ప్రశ్నించగా తన చర్య గాజా, ఇజ్రాయెల్‌తో పాటు పశ్చిమాసియా అంతటికీ గొప్ప స్థిరత్వాన్ని తెస్తుందని ఆయన బదులిచ్చారు. గాజా స్వా«దీనానికి సైన్యాన్ని రంగంలోకి దించుతారా అని ప్రశ్నించగా, అన్ని అవకాశాలనూ పరిశీలిస్తామని బదులిచ్చారు. ఈ సందర్భంగా నెతన్యాహూ పదేపదే చిరునవ్వులు చిందిస్తూ కన్పించారు. ట్రంప్ ప్రకటనకు పూర్తి మద్దతు తెలిపారు. ‘‘ఈ నిర్ణయం చరిత్రను మార్చేస్తుంది. గాజాకు అద్భుతమైన భవిష్యత్తు అందిస్తుంది. ఇజ్రాయెల్‌కు ముప్పును శాశ్వతంగా తొలగిస్తుంది’’ అని ప్రకటించారు. ట్రంప్ ప్రకటన అంతర్జాతీయంగా పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. పశ్చిమాసియా భౌగోళిక, రాజకీయ పరిస్థితులను అల్లకల్లోలం చేసేలా కనిపిస్తున్న ఈ ప్రతిపాదనను అక్కడి దేశాలన్నీ వ్యతిరేకిస్తున్నాయి. పాలస్తీనా, సౌదీ అరేబియా, ఈజిప్‌్ట, తుర్కియేతో పాటు చైనా, ఆ్రస్టేలియా, న్యూజిలాండ్ కూడా దీన్ని ఖండించాయి. అమెరికాలో విపక్ష నేతలు కూడా ట్రంప్ ప్రకటనను దుయ్యబడుతున్నారు. గాజావాసులకు తమ దేశంలో ఆశ్రయం కల్పించాలన్న ట్రంప్ ప్రతిపాదనను ఈజిప్‌్ట, జోర్డాన్, తుర్కియే తదితర అమెరికా మిత్ర దేశాలన్నీ ఇప్పటికే ముక్త కంఠంతో తిరస్కరించడం తెలిసిందే. గ్రీన్‌లాండ్‌ను, పనామా కాల్వను స్వా«దీనం చేసుకుంటానని, కెనడాను అమెరికాలో కలిపేస్తానని ట్రంప్ ఇప్పటికే పలు వివాదాస్పద ప్రకటనలు చేశారు. అంతర్జాతీయ ప్రాంతంగా గాజా అమెరికా పర్యటనలో ఉన్న నెతన్యాహూతో ట్రంప్ మంగళవారం భేటీ అయ్యారు. అనంతరం సంయుక్త మీడియా సమావేశంలో ఆకస్మికంగా గాజా స్వా«దీన ప్రకటన చేశారు. దీన్ని పశ్చిమాసియా గర్వించదగ్గ విషయంగా అభివరి్ణంచారు. ‘‘పశ్చిమాసియా నమ్మశక్యం కానంత గొప్ప ప్రదేశం. అద్భుతమైన తీర ప్రాంతం. గొప్ప వ్యక్తులతో నిండిన అందమైన ప్రదేశాల్లో ఒకటి. గాజాలో త్వరలో పర్యటిస్తా. ఇజ్రాయెల్ అంటే నాకిష్టం. అక్కడ, సౌదీ అరేబియాలో, పశ్చిమాసియా అంతటా పర్యటిస్తా. గాజాలో ఇప్పుడేమీ మిగల్లేదు. ఆ ప్రాంతమంతా మృత్యువుకు, విధ్వంసానికి చిరునామాగా, నరకకూపంగా మారింది. ప్రతి భవనమూ నేలమట్టమైంది. చిరకాలంగా శప్తభూమిగా ఉన్న గాజాను పూర్తిగా పునరి్నరి్మస్తాం. పేలని బాంబులు, ఆయుధాలను తొలగిస్తాం. ధ్వంసమైన భవనాలను తొలగించి ఆ ప్రాంతాన్నంతా చదును చేస్తాం. అక్కడ అపరిమితమైన ఉద్యోగాలందించేలా అద్భుతమైన ఆర్థిక వ్యవస్థను సృష్టిస్తాం. గాజావాసుల జీవన స్థితిగతులను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తాం. ఏ ఒక్క సమూహానికో కాకుండా అందరికీ అద్భుతమైన ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. పాలస్తీనావాసులతో పాటు ప్రపంచం నలుమూలలకు చెందిన ప్రజలు అక్కడ నివసిస్తారు. లేదంటే ఆ ప్రాంతం వందల ఏళ్లుగా ఎలా ఉందో అలాగే ఉంటుంది. ఏదైనా డిఫరెంట్‌గా చేయాలి. చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోవాలి. అది పునరావృతం కాకుండా చూసుకోవాలి. ఏదైనా అద్భుతం చేయడానికి మాకు అవకాశముంది’’ అని చెప్పుకొచ్చారు. ‘‘ఇదేమీ అల్లాటప్పగా తీసుకున్న నిర్ణయం కాదు. దీనిపై చాలా ప్రముఖులు, ముఖ్యులతో లోతుగా చర్చించా. వారంతా నా ప్రతిపాదనను అమితంగా ఇష్టపడ్డారు. గాజాను సొంతం చేసుకుని అభివృద్ధి చేసి అపారమైన ఉపాధి అవకాశాలు సృష్టించాలన్న అమెరికా ఆలోచనలను ఇష్టపడుతున్నారు’’ అని చెప్పారు. ‘‘గాజాలో దశాబ్దాలుగా మరణమృదంగం కొనసాగుతోంది. చంపుకోవడాలు లేకుండా ఆనందంగా ఉండగలిగే అందమైన ప్రదేశంలో వారికి శాశ్వతంగా పునరావాసం కల్పించగలిగితే చాలు. మరో దారి లేకే వారు గాజాకు తిరిగి వెళ్తున్నారు. ఎప్పుడు కూలతాయో తెలియని పై కప్పుల కింద బతుకీడుస్తున్నారు. దానికి బదులుగా అందమైన ఇళ్లలో సురక్షితంగా, స్వేచ్ఛగా, శాంతియుతంగా జీవించే అవకాశం వారి ముందుంది. ఆ మేరకు చక్కని పునరావాసం పొందగలరని, ఇప్పుడు వద్దంటున్న దేశాల్లోనే వారికి ఆ సదుపాయం ఏర్పాటు చేయగలనని నమ్ముతున్నా’’ అని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో అనుసరించదగ్గ మార్గం ఇదేనని నెతన్యాహూ అభిప్రాయపడ్డారు. ‘‘హమాస్‌ను నిర్మూలించాలన్న మా లక్ష్యాలను సాధించడానికి ట్రంప్ కొత్త ఆలోచనలతో ముందుకొచ్చారు. ఇది యూదు జాతికి సాయపడుతుంది’’ అని చెప్పారు. ‘‘ఉగ్రవాదానికి కేంద్రబిందువుగా ఉన్న గాజాకు భిన్నమైన భవిష్యత్తును ట్రంప్ కాంక్షిస్తున్నారు. హంతక సంస్థ (హమాస్)ను నిర్మూలిస్తే అక్కడ శాంతి సాధ్యమే’’ అన్నారు. హమాస్‌తో కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతుందో లేదో చెప్పలేనన్నారు. బైడెన్ ప్రభుత్వం తమకు పెద్దగా సాయం చేయలేదని నెతన్యాహూ ఆక్షేపించారు. గాజాను వీడబోం: స్థానికులు ట్రంప్ ప్రతిపాదనపై గాజా పౌరులు మండిపడుతున్నారు. ‘‘ఇన్నాళ్లకు కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత సొంత గూటికి తిరిగి వెళ్తున్నాం. మా ఇళ్లను విడిచిపెట్టబోం. గౌరవప్రదమైన జీవితం కోరుకుంటున్నాం. మా నేతలను వీడాలనుకోవడం లేదు’’ అని చెబుతున్నారు. ట్రంప్ ప్రతిపాదన గాజాతో పాటు పరిసర దేశాల్లో మరింత విధ్వంసానికి, ఘర్షణకు కారణమవుతుందని వారంటున్నారు. ట్రంప్ వ్యాఖ్యలను సౌదీ అరేబియా తీవ్రంగా ఖండించింది. పాలస్తీనా దేశాన్ని ఏర్పాటు చేయకుండా ఇజ్రాయెల్‌తో ఎలాంటి సంబంధాలను కొనసాగించబోమని స్పష్టం చేసింది. గాజన్లు తమ ఇళ్లకు తిరిగి వచ్చి పునరి్నరి్మంచాలని కోరుకుంటున్నారని ఐరాసలో పాలస్తీనా రాయబారి రియాద్ మన్సూర్ అన్నారు. వారి ఆకాంక్షలను గౌరవించాలన్నారు. ట్రంప్‌ది హాస్యాస్పద, అసంబద్ధ ప్రకటన అని హమాస్ దుయ్యబట్టింది. ‘‘ఈ తరహా ఆలోచనలు పశ్చిమాసియాలో మరిన్ని ఘర్షణలకు దారితీస్తాయి. గాజావాసులకు సమీప దేశాల్లో పునరావాసం కల్పించాలన్న ట్రంప్ ప్రతిపాదన మరింత గందరగోళం, ఉద్రిక్తతలకు కారణమవుతుంది. గాజావాసులు దీనికి ఒప్పుకోరు’’ అని హమాస్ అధికారి సమీ అబు స్పష్టం చేశారు.అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధంగాట్రంప్ గాజా ప్రణాళిక గాజాను పునరి్నర్మించాలంటూ పది రోజుల క్రితమే పిలుపునిచ్చిన ట్రంప్ ఆ విషయమై ఎంత సీరియస్‌గా ఉన్నారో తాజా ప్రకటనతో ప్రపంచానికి తెలిసొచి్చంది. కానీ అంతర్జాతీయ చట్టాలకు పూర్తిగా విరుద్ధమైన ఆయన గాజా ప్రణాళిక పశ్చిమాసియాను అతలాకుతలం చేయడమే గాక ప్రపంచ శాంతికి గొడ్డలిపెట్టుగా మారేలా కనిపిస్తోంది. కాల్పుల విరమణ ఒప్పందం, ఇజ్రాయెల్–హమాస్ పరస్పర బందీల విడుదల ప్రక్రియపైనా ప్రభావం చూపేలా ఉంది. ఒక దేశ జనాభాను బలవంతంగా నిరాశ్రయులను చేయడం అంతర్జాతీయ చట్టం ప్రకారం నిషేధం. ఇజ్రాయెల్ మాత్రం పాలస్తీనియన్లను తరిమేసి గాజాను యూదు స్థావరంగా మార్చుకోవాలని ఆశపడుతోంది. ట్రంప్ ప్రకటన కార్యరూపం దాలిస్తే 20 లక్షల మంది పాలస్తీనావాసులు శాశ్వత శరణార్థులుగా మారిపోతారు. -
గాజాపై ట్రంప్ సంచలన ప్రకటన
వాషింగ్టన్: గాజాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. తాజాగా ట్రంప్.. ఇజ్రాయెల్, గాజా యుద్ధం తాజా పరిస్థితిపై చర్చించారు. అనంతరం, గాజాను స్వాధీనం చేసుకోవాలని భావిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. దీంతో, ట్రంప్ వ్యాఖ్యలు కొత్త చర్చకు దారి తీశాయి. ఇక, ఇప్పటికే ఇజ్రాయెల్ యుద్ధంపై ట్రంప్ కీలక ప్రకటన చేశారు. యుద్ధం ముగింపు దిశగా వెళ్లాలని చెప్పారు.అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా ఇజ్రాయెల్, గాజా యుద్ధం తాజా పరిస్థితిపై నెతన్యాహూతో ట్రంప్ చర్చించారు. అనంతరం ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. యుద్ధంతో దెబ్బతిన్న పాలస్తీనాలో భూభాగమైన గాజాను అమెరికా స్వాధీనం చేసుకోవాలని భావిస్తుందని తెలిపారు. అక్కడ ధ్వంసమైన భవనాలను పునరుద్ధరిస్తాం. ఆ ప్రాంతాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేస్తే.. అక్కడి ప్రజలకు అపరిమిత సంఖ్యలో ఉద్యోగాలు, ఇళ్లు కల్పించవచ్చు అని తెలిపారు. ఇదే సమయంలో భవిష్యత్తులో మిడిల్ ఈస్ట్ పర్యటన సందర్భంగా గాజా, ఇజ్రాయెల్, సౌదీ అరేబియాను సందర్శించాలని తాను భావిస్తున్నట్టు తెలిపారు.మరోవైపు.. ట్రంప్ నిర్ణయంపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పందించారు. గాజాపై ట్రంప్ ప్రకటన చరిత్రను మారస్తుందని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతో, ఇరువురి వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.Donald Trump just announced that the United States will be “taking over” Gaza and will “level” it to the ground.He said Palestinians should not live there anymore.This is GENOCIDE!!!! pic.twitter.com/dR1UcmhiTe— Morgan J. Freeman (@mjfree) February 5, 2025ఇదిలా ఉండగా.. గాజాలో ఉద్రిక్తతల కారణంగా నిరాశ్రయులుగా మారిన పాలస్తీనీయులకు అరబ్ దేశాలు ఆశ్రయం కల్పించాలని ఇటీవల ట్రంప్ ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ప్రతిపాదనను ఆయా దేశాలు తీవ్రంగా ఖండించాయి. అలా చేస్తే తమ ప్రాంతంలోని స్థిరత్వం దెబ్బతింటుందని ఈజిప్టు, జోర్డాన్, సౌదీఅరేబియా, యూఏఈ, ఖతార్, పాలస్తీనా అథారిటీ, అరబ్ లీగ్‌లు సంయుక్తంగా ప్రకటన చేశాయి. ఈక్రమంలోనే గాజాను స్వాధీనం చేసుకొని, అభివృద్ధి చేస్తామని ట్రంప్ ప్రకటించడం గమనార్హం. -
జెనిన్లో ఇజ్రాయెల్ సైన్యం ఆపరేషన్
జెనిన్: ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లోని జెనిన్లో ఇజ్రాయెల్ దళాలు జరిపిన భారీ ఆపరేషన్‌లో తొమ్మిది మంది పాలస్తీనియన్లు మరణించారు. 35 మంది గాయపడ్డారని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. సాయుధ సంస్థలకు కంచుకోటగా ఉన్న జెనిన్లో ఉగ్రవాదాన్ని తరిమికొట్టేందుకు విస్తృతమైన ఆపరేషన్‌ను ప్రారంభించినట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ప్రకటించారు. ఇజ్రాయెల్ కాల్పుల్లో గాయపడిన వారిలో ముగ్గురు వైద్యులు, ఇద్దరు నర్సులు ఉన్నారని జెనిన్ ప్రభుత్వ ఆసుపత్రి డైరెక్టర్ విస్సామ్ బకర్ తెలిపారు. మంగళవారం ఉదయం ఇజ్రాయెల్ దళాలు వెళ్లడానికి ముందే జెనిన్ శరణార్థి శిబిరం చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల నుంచి స్థానిక భద్రతా సిబ్బంది వైదొలిగారు. ఇజ్రాయెల్ దళాలు పౌరులపై కాల్పులు జరిపాయని, దీంతో పలువురు గాయపడ్డారని పాలస్తీనా భద్రతా దళాల ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ అన్వర్ రజాబ్ తెలిపారు. జెనిన్లో ఒక టీనేజర్సహా 9 మందిని ఇజ్రాయెల్ బలగాలు అన్యాయంగా పొట్టనబెట్టుకున్నాయని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం సాయంత్రం ప్రకటించింది. టియానిక్ గ్రామంలోనూ ఇజ్రాయెల్ దళాలు ఒక వ్యక్తిని కాల్చి చంపాయి. గాజాలో కాల్పుల విరమణ ప్రారంభమైన మూడు రోజుల తర్వాత, వెస్ట్‌బ్యాంక్‌లో దాడులు జరగడం గమనార్హం. ‘‘వెస్ట్ బ్యాంక్‌లో భద్రతను బలోపేతానికి, మా లక్ష్యాలను సాధించడానికి మరో ముందడుగుగా జెనిన్ ఆపరేషన్ చేపట్టాం. లెబనాన్, సిరియా, యెమెన్, వెస్ట్ బ్యాంక్‌లలో ఇరాన్ ఏ ప్రాంతంపై ప్రభావం చూపించాలనుకున్నా మేం దానిని అడ్డుకుంటాం’’ అని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వ్యాఖ్యానించారు. వెస్ట్‌బ్యాంక్‌లోని హమాస్, పాలస్తీనా ఇస్లామిక్ జిహాద్, ఇతర సాయుధ గ్రూపులకు ఇరాన్ ఆయుధాలు, నిధులను అందిస్తోందని ఆరోపించారు. ‘‘ ఈ ప్రాంతాల్లో సాయుధ బృందాల మౌలిక సదుపాయాలను విచ్ఛిన్నం చేయడం ఈ ఆపరేషన్ ముఖ్య లక్ష్యం’’ అని ఇజ్రాయెల్ మీడియా పేర్కొంది. -
అమల్లోకి కాల్పుల విరమణ
డెయిర్ అల్ బాలాహ్ (గాజా): పదిహేను నెలల భీకర యుద్ధానికి తాత్కాలికంగా తెర పడింది. శ్మశాన సదృశంగా కన్పిస్తున్న గాజా వీధుల్లో ఎట్టకేలకు శాంతిపవనాలు వీచాయి. (Israel),ఇజ్రాయెల్, (Hamas)హమాస్ మధ్య విరమణ ఒప్పందం మూడు గంటలు ఆలస్యంగా ఆదివారం ఉదయం 11.30కు అమల్లోకి వచ్చింది. విడుదల చేయబోయే తమ బందీల జాబితాను హమాస్ వెల్లడించేదాకా (ceasefire agreement)కాల్పుల విరమణ అమల్లోకి రాదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ కుండబద్దలు కొట్టడంతో తొలుత ఆందోళన నెలకొంది. జాబితా విడుదలను హమాస్ ఆలస్యం చేయడం ఉత్కంఠకు దారితీసింది. ఉదయం 11.15కు రోమీ గోనెన్ (24), ఎమిలీ దమారీ (28), డోరోన్ స్టెయిన్బ్రీచర్ (31) అనే ముగ్గురు మహిళలను హమాస్ వదిలేస్తున్నట్టు హమాస్ ప్రకటించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇజ్రాయెల్ బలగాలు వారిని సురక్షితంగా స్వదేశానికి తరలించాయి. బదులుగా ఇజ్రాయెల్ కూడా తొలి దఫాలో 90 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేయనుంది. వారిని సురక్షితంగా గాజా చేర్చేందుకు రెడ్‌క్రాస్ వాహనశ్రేణి ఇజ్రాయెల్‌లోని ఓఫెర్ కారాగానికి చేరుకుంది. ఆరువారాల్లో హమాస్ 33 మంది, ఇజ్రాయెల్ దాదాపు 2,000 మంది ఖైదీలను విడుదల చేయనున్నాయి. మరోవైపు కాల్పుల విరమణ ఒప్పందాన్ని నెతన్యాహూ ప్రభుత్వ భాగస్వామి ఓజ్మా యేహూదిత్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. ప్రభుత్వం నుంచి వైదొలగింది. ఆ పారీ్టకి చెందిన ముగ్గురు నేతలు మంత్రి పదవులకు రాజీనామా చేశారు.గాజాలో ఆనందోత్సాహాలు కాల్పుల విరమణతో గాజా స్ట్రిప్‌లో ఆనందం వెల్లివిరిసింది. వలస వెళ్లిన పాలస్తీనియన్లు భారీగా గాజాకు తిరిగొస్తున్నారు. అయితే ఆదివారం ఉదయం దాకా ఇజ్రాయెల్ సైన్యం గాజాపై దాడులు కొనసాగింది. దాంతో ఆదివారం ఒక్క రోజే 26 మంది మరణించారు. -
గాజా ఒప్పందం ఆలస్యం!.. హమాస్‌కు ఇజ్రాయెల్ వార్నింగ్!
జెరుసలేం : గాజాలో శాంతి ఒప్పందం వేళ ఇజ్రాయెల్ సైన్యం హమాస్‌కు హెచ్చరికలు జారీ చేసింది. ఇచ్చిన మాటకు కట్టుబడడం లేదని, అందుకే తాము గాజాపై దాడుల్ని కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ సందర్భంగా ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి, రియర్ అడ్మిరల్ డేనియల్ హగారి మాట్లాడుతూ..హమాస్ చెరలో బంధీలుగా ఉన్న 33 మంది బంధీల జాబితా విడుదల కాలేదు. బంధీల జాబితా మాకు చేరే వరకు కాల్పులు కొనసాగుతాయని చెప్పారు.ఆదివారం ఉదయం నాటికి కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా తన వద్ద ఉన్న బంధీల జాబితాను విడుదల చేయాలి. కానీ అలా చేయలేదు. ఒప్పందానికి విరుద్ధంగా వ్యవహరిస్తోంది. హమాస్ ఇచ్చిన మాటకు కట్టుబడే వరకు కాల్పుల విరమణ అమలులోకి రాదు అని’ హగరీ చెప్పారంటూ ఓ ఇజ్రాయెల్ సైన్య అధికారి వెల్లడించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. అంతకు ముందు, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సైతం కాల్పుల విరమణపై కీలక వ్యాఖ్యలు చేశారు. బంధీల జాబితా విడుదల చేయనంత వరకు సైనిక దాడులు కొనసాగుతాయని, ఆ తర్వాత జరిగే పరిణామాలకు తాము బాధ్యులం కాదని సూచించారు. గాజాలో శాంతిపదిహేను నెలలుగా రక్తమోడుతున్న గాజాలో శాంతి నెలకొంది. గత బుధవారం అమెరికా, ఈజిప్టు, ఖతార్ మధ్య వర్తిత్వంతో ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరింది. ఒప్పందంలో భాగంగా.. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 8.30 గంటలకు కాల్పుల విమరణ ఒప్పందం అమల్లోకి వచ్చింది. కానీ సాంకేతిక అంశాల్ని కారణంగా చూపిస్తూ బంధీల జాబితాను విడుదల చేయడంలో జాప్యం చేసింది. కాగా, కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా హమాస్ చెరలో ఉన్న 33 మంది బంధీలను విడుదల చేయాలి. ప్రతిఫలంగా ప్రస్తుతం జైళ్లలో మగ్గుతున్న దాదాపు 2,000 మంది పాలస్తీనియన్లను కూడా ఇజ్రాయెల్ విడుదల చేయనుంది. -
గాజా ఒప్పందం వేళ ట్విస్ట్!.. నెతన్యాహూ కీలక వ్యాఖ్యలు
గాజా శాంతి ఒప్పందం వేళ.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ కీలక వ్యాఖ్యలు చేశారు. సరైన ఫ్రేమ్‌వర్క్ లేకుండా ఒప్పందం ముందుకు సాగదని.. అవసరమైతే మళ్లీ యుద్ధానికి దిగుతామని సంచలన వ్యాఖ్యలు అన్నారాయన. కాల్పుల విరమణ ఒప్పందం తొలి దశ ఇవాళ్టి నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. అయితే అంతకంటే కొన్ని గంటల ముందు.. నెతన్యాహూ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం గమనార్హం.‘‘సరైన ఫ్రేమ్ వర్క్ లేకుండా ఒప్పందంలో ముందుకు వెళ్లలేం. తమ దగ్గర ఉన్న బంధీల జాబితాను హమాస్ విడుదల చేయాలి. వాళ్లలో ఎవరెవరిని ఎప్పుడెప్పుడు విడుదల చేస్తారో స్పష్టత ఇవ్వాలి. అప్పుడే మేం ఒప్పందం ప్రకారం ముందుకు వెళ్తాం. ఇందులో ఎలాంటి ఉల్లంఘనలు జరిగినా.. మేం సహించబోం. తదుపరి పరిణామాలకు హమాసే బాధ్యత వహించాల్సి ఉంటుంది’’ అని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు(Benjamin Netanyahu) తెలియజేశారు. హమాస్‌పై పూర్తిస్థాయి విజయం సాధిస్తేనే గాజా యుద్ధాన్ని(Gaza War) విరమిస్తామని.. అప్పటి వరకు పోరు ఆపే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు గతంలో అనేక సందర్భాల్లో బహిరంగంగా ప్రకటిస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు.. తాజాగా బంధీల జాబితా ఇవ్వాలంటూ ఆయన మెలిక పెట్టారు. దీంతో ఇవాళ్టి నుంచి ఒప్పందం అమలు అవుతుందా? అనే అనుమానాలు నెలకొంటున్నాయి.స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం నుంచి హమాస్, ఇజ్రాయెల్ మధ్య ఆరు వారాలపాటు కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి రావాల్సి ఉంది. ఇజ్రాయెల్ కారాగారాల్లో మగ్గిపోతున్న పాలస్తీనియన్లు, పాలస్తీనా రాజకీయ పార్టీల నేతలను ఈ 42 రోజుల్లోపు ఇజ్రాయెల్ అధికారులు విడిచిపెట్టనున్నారు. మరోవైపు 2023 అక్టోబర్ ఏడున ఇజ్రాయెల్ శివారు గ్రామాలపై దాడిచేసి కిడ్నాప్ చేసి బందీలుగా ఎత్తుకెళ్లిన వారిలో కొందరిని హమాస్ విడిచి పెట్టాల్సి ఉంది. హమాస్ చెరలోని 460 రోజులకు పైగా బందీలుగా ఉన్నారన్నమాట!.హమాస్ చెరలో ఉన్న 98 బంధీల్లో.. 33 మందిని విడిచి పెట్టడంప్రతిగా.. తమ జైళ్లలో మగ్గుతున్న 2000 మంది పాలస్తీనియన్లను ఇజ్రాయెల్ విడిచిపెట్టడంపదిహేను నెలలుగా రక్తమోడుతున్న గాజాలో బాంబుల మోత.. క్షిపణుల విధ్వంసం.. తుపాకుల అలజడి ఈ శాంతి ఒప్పందంతో ఆగనుంది. దోహా వేదికగా.. అమెరికా, ఈజిప్టు, ఖతార్ మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్హమాస్ మధ్య గత బుధవారం కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో గాజా ఊపిరి పీల్చుకుంది. వాస్తవానికి ఇజ్రాయెల్ ప్రధాని ఎన్నడూ కాల్పుల విరమణ ఒప్పందానికి అంతగా ఆసక్తి చూపలేదు. యుద్ధం కొనసాగించడానికి మొగ్గు చూపుతూ.. ఏదో కారణంతో చర్చల ప్రక్రియను పక్కదోవ పట్టించే ప్రయత్నాలే చేస్తూ వచ్చారు. అయితే.. గతేడాది మే నెలలో బైడెన్ ప్రభుత్వం కాల్పుల విరమణకు సంబంధించి కొన్ని ప్రతిపాదనలు చేసింది. వాటికి హమాస్ సానుకూలంగా స్పందించింది. దీంతో అప్పుడే గాజాలో శాంతి నెలకొంటుందని అంతా భావించారు. కానీ, నెతన్యాహు మాత్రం ఆ ప్రతిపాదనలను తీవ్రంగా వ్యతిరేకించారు. ముఖ్యంగా గాజా నుంచి ఇజ్రాయెల్ దళాలను పూర్తిగా ఉపసంహరించడానికి అంగీకరించలేదు. కానీ, ఇప్పుడు కుదిరిన ఒప్పందంలోనూ రెండో దశలో గాజా నుంచి ఇజ్రాయెల్ దళాల ఉపసంహరణ నిబంధన ఉంది. అందుకే ఒప్పందంలో తొలి దశ అమలైనా, రెండో దశకు ఇజ్రాయెల్ అంగీకారం తెలుపుతుందా? లేదా? అన్నది కీలకం కానుంది.ఇదీ చదవండి: కెనడా ప్రధాని రేసులో చంద్ర ఆర్య -
Israel-Hamas: గాజా ఒప్పందానికి ఇజ్రాయెల్ కేబినెట్ ఆమోదం
జెరూసలెం: ఇజ్రాయెల్-హమాస్(Hamas) మధ్య కాల్పుల విరమణ, బందీల విడుదల ఒప్పందానికి ఇజ్రాయెల్ కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో, గాజా(Gaza)లో శాంతి నెలకొనే అవకాశం ఉంది. ఇక, ఈ ఒప్పందం ఆదివారం నుంచి అమల్లోకి రానుంది. ఒప్పందానికి మార్గం సుగమం చేయాలని కేబినెట్‌కు ప్రభుత్వం సిఫార్సు చేసినట్లు ప్రధాని నెతన్యాహు(Benjamin Netanyahu) కార్యాలయం వెల్లడించింది. ఈ క్రమంలో కాల్పుల విరమణకు సంబంధించి ఎదురైన ఆటంకాలు తొలగిపోయాయని హమాస్ పేర్కొంది.ఇజ్రాయెల్-హమాస్(Israel) మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. అమెరికా, ఈజిప్టు, ఖతార్ మధ్యవర్తిత్వంతో బుధవారం కుదిరిన మూడు దశల కాల్పుల విరమణ, బందీల విడుదల ఒప్పందానికి ఇజ్రాయెల్ కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో, ఆదివారం నుంచి ఒప్పందం అమలులోకి రానుంది. ఈ మేరకు బందీలను విడుదల చేసే ప్రణాళికను ప్రభుత్వం ఆమోదించిందని మంత్రివర్గం ఓటింగ్ నిర్వహించిన తర్వాత నెతన్యాహు కార్యాలయం శనివారం తెల్లవారుజామున తెలిపింది.ఇదే సమయంలో అన్ని రాజకీయ, భద్రతాపరమైన, మానవతా అంశాలను సమీక్షించి, యుద్ధం లక్ష్యాలను సాధించడానికి ఇది ప్రయోజనకరమని అర్థం చేసుకున్నామని పేర్కొంది. బందీల కుటుంబాలకు ఇప్పటికే సమాచారం ఇచ్చినట్లు ప్రధాని కార్యాలయం వెల్లడించింది. ఆదివారం నుండి విడుదల చేయబోయే 95 మంది పాలస్తీనియన్ల జాబితాను న్యాయ మంత్రిత్వ శాఖ ప్రచురించింది. వారిలో 69 మంది మహిళలు, 16 మంది పురుషులు మరియు 10 మంది మైనర్లు ఉన్నారు. తర్వాత పూర్తిస్థాయిలో యుద్ధాన్ని ముగించే దిశగా చర్యలు తీసుకోనున్నారు. మరోవైపు.. కాల్పుల విరమణ ప్రారంభం కాకముందే గాజా ప్రజలు స్వదేశానికి తిరిగి రావడానికి సిద్ధమవుతున్నారు.Israel’s security cabinet has accepted the ceasefire deal with Hamas which is due to come into force on Sunday. The approval comes after an unexpected delay because pf far-right members of the Israeli government. pic.twitter.com/ZgWNmQRAKU— Channel 4 News (@Channel4News) January 17, 2025 -
హమాస్‌తో డీల్.. నెతన్యాహు వ్యాఖ్యల అర్థమేంటి?
జెరూసలేం: ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం ముగింపు దశకు చేరుకుంది. అనూహ్యంగా గాజాలో కాల్పుల విరమణ ఒప్పందం ఎట్టకేలకు కుదిరింది. 15 నెలలుగా కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలుకుతూ ఇజ్రాయెల్-హమాస్‌లు ఓ అంగీకారానికి వచ్చాయి. కాల్పుల విరమణ ప్రతిపాదనకు అంగీకరించినట్లు హమాస్ తెలిపింది.ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. కాల్పుల విరమణ ఒప్పందం తుది ముసాయిదాపై ఇంకా కసరత్తు జరుగుతోందన్నారు. ఈ సమయంలో ఏదైనా జరిగే అవకాశం ఉందన్నారు. మరోవైపు తాజా ఒడంబడికకు నెతన్యాహు క్యాబినెట్ ఆమోదం తెలపాల్సి ఉంది. కొద్ది రోజుల్లోనే ఇది పూర్తి అయ్యే అవకాశం ఉంది. ఇదే సమయంలో నెతన్యాహు.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌కు కృతజ్ఞతలు తెలిపారు. గాజాలో నిర్బంధించబడిన ఇజ్రాయెల్ బందీల విడుదలకు ఒప్పందం కుదుర్చుకోవడంలో సహాయం చేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారని ఆయన కార్యాలయం తెలిపింది.ఇదిలా ఉండగా.. కాల్పుల విరమణ ఒప్పందం నేపథ్యంలో గాజాలో నిరాశ్రయులైన వేలమంది తిరిగి కోలుకోవడానికి, ఆ ప్రాంతానికి పెద్ద ఎత్తున మానవతా సహాయం అందడానికి వీలు కలుగుతుంది. అయితే, కాల్పుల విరమణ ఒప్పందానికి ఖతార్ మధ్యవర్తిత్వం వహించింది. కొన్నినెలలుగా కాల్పుల విరమణ కోసం ఈజిప్టు, ఖతార్ ఇరు పక్షాలతో చర్చలు జరుపుతూ వచ్చాయి. ఈ ఒప్పందానికి అమెరికా మొదటి నుంచి మద్దతుగా ఉంది. ఒప్పందం ఆదివారం నుంచి అమలులోకి వస్తుందని ఖతార్ ప్రధాని షేక్ మహమ్మద్ బిన్ అబ్దుల్ రహ్మాన్ అల్‌థానీ ప్రకటించారు.ఇక, అక్టోబరు 7, 2023న సరిహద్దులు దాటి ఇజ్రాయెల్‌లో ప్రవేశించి 1200 మంది ఆ దేశ పౌరులను హతమార్చి, 250 మందిని బందీలుగా చేసుకోవడం ద్వారా యుద్ధం ప్రారంభమైంది. ఈ క్రమంలో హమాస్‌కు మద్దతుగా హెజ్బొల్లా, హూతీ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌పై దాడులకు దిగాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య పరస్పర క్షిపణి దాడులకు పాల్పడ్డాయి. 46 వేల మంది పాలస్తీనియన్లు ఇజ్రాయెల్ దాడుల్లో మృతి చెందారు. భారీగా ఆస్తి నష్టం జరిగింది. వేల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయలయ్యారు. -
ట్రంప్‌కు నెతన్యాహూ ఫోన్
జెరుసలేం: అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఫోన్లో మాట్లాడారు. హమాస్‌పై యుద్ధంలో విజయం సాధించాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. సిరియా పరిస్థితులపై తన వైఖరిని ట్రంప్‌తో పంచుకున్నారు. సంభాషణలోని కీలకాంశాలను వివరిస్తూ నెతన్యాహు ఓ వీడియో ప్రకటన షేర్ చేశారు. ‘‘శనివారం సాయంత్రం జరిగిన సంభాషణలో ఇరువురం పలు అంశాలపై చర్చించాం. సంభాషణ చాలా స్నేహపూర్వకంగా సాగింది. ఇజ్రాయెల్ విజయాన్ని పూర్తి చేయాల్సిన ఆవశ్యకత గురించి మాట్లాడుకున్నాం. బందీల విడుదలకు మేం చేస్తున్న ప్రయత్నాల గురించి సుదీర్ఘంగా చర్చించాం. బందీలతో పాటు మృతులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఇజ్రాయెల్ అహర్నిశలు కృషి చేస్తుంది’’ అని చెప్పారు. אמרתי שנשנה את המזרח התיכון וזה מה שקורה. סוריה היא לא אותה סוריה. לבנון היא לא אותה לבנון. עזה היא לא אותה עזה. איראן היא לא אותה איראן. pic.twitter.com/IFVso1czkH— Benjamin Netanyahu - בנימין נתניהו (@netanyahu) December 15, 2024సిరియాతో ఘర్షణ ఇప్పట్లో లేదుసిరియాలో అధ్యక్షుడు బషర్ అల్ అసద్ ప్రభుత్వాన్ని తిరుగుబాటు దళాలు కూలదోశాక అక్కడి పరిస్థితిని నెతన్యాహు ప్రస్తావించారు. ‘‘సిరియాతో ఘర్షణపై మా దేశానికి ఏ ఆసక్తీ లేదు. పరిస్థితులను బట్టి స్పందిస్తాం’’ అన్నారు. హెజ్బొల్లాకు సిరియా గుండా ఆయుధాల రవాణాకు అనుమతించడాన్ని ఖండించారు. -
మా ప్రధాని అరెస్టు వారెంట్‌ను రద్దు చేయండి
టెల్ అవీవ్: యుద్ధ నేరాల కేసులో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును అరెస్టు చేయాలంటూ జారీ అయిన అరెస్ట్వారెంట్పై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టును ఇజ్రాయెల్ ఆశ్రయించింది. తీర్పు వచ్చే వరకు ప్రధాని నెతన్యాహు, మాజీ రక్షణ మంత్రి గాలెంట్పై అరెస్టు వారెంట్లను నిలిపివేయాలని గురువారం న్యాయస్థానాన్ని ఇజ్రాయెల్ కోరింది. తమ అభ్యర్థనపై నిర్ణయం వెలువడేదాకా వారెంట్ అమలును నిలుపుదల చేయాలని వేడుకుంది. గాజా స్ట్రిప్‌లో యుద్ధం చేస్తూ వేలాది మంది అమాయక పాలస్తీనియన్ల మరణానికి కారణమవుతూ ఇజ్రాయెల్ యుద్ధ నేరాలకు పాల్పడుతోందని, అందుకే నెతన్యాహు, మాజీ రక్షణ మంత్రి గాలెంట్పై అరెస్ట్ వారెంట్ జారీ చేస్తున్నట్లు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు ప్రకటించడం తెల్సిందే. హమాస్ సైనిక విభాగ సారథి మొహహ్మద్ డెయిఫ్పైనా ఇదే తరహాలో అరెస్టు వారెంట్ జారీ చేసింది. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు అధికార పరిధి, అరెస్టు వారెంట్ల చట్టబద్ధతను తాము సవాలు చేసినట్లు ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ అభ్యర్థనను కోర్టు తిరస్కరిస్తే, ఇజ్రాయెల్ ప్రభుత్వం పట్ల అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు, ఐక్యరాజ్య సమితి ఎంత పక్షపాత ధోరణితో వ్యవహరిస్తుందో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇజ్రాయెల్ మిత్రదేశాలకు అర్థమవుతుందని వ్యాఖ్యానించింది. 2023 అక్టోబర్ 8 నుంచి 2024 మే 20 వరకు మానవాళికి వ్యతిరేకంగా చేసిన యుద్ధ నేరాలకు సంబంధించి బెంజమిన్ నెతన్యాహు, యోవ్ గాలెంట్లపై అరెస్టు వారెంట్లు జారీచేశారు. ఈ చర్యను నెతన్యాహు, ఇతర ఇజ్రాయెల్ రాజకీయ నాయకులు తీవ్రంగా ఖండించారు. అమెరికా, ఫ్రాన్స్‌లు నెతన్యాహుకు మద్దతు పలికాయి. వారెంట్ల జారీని తప్పుబట్టాయి. మిత్రదేశాలైన బ్రిటన్, కెనడా మాత్రం కోర్టు నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ప్రకటించడం విశేషం. ఈ నేపథ్యంలో హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానం యూదుల పట్ల వివక్ష చూపిస్తోందని నెతన్యాహు ఆరోపించారు. -
ఒకవైపు లెబనాన్‌లో సంబురాలు.. మరొకవైపు గాజాపై ఇజ్రాయిల్ దాడులు
జెరూసలేం: ఇజ్రాయెల్, హిజ్బొల్లా మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంతో లెబనాన్ ప్రశాంత వాతావరణం నెలకొంది. ఇజ్రాయెల్ బాంబు దాడులు నిలిచిపోవడంతో లెబనాన్ వాసులు తిరిగి స్వస్థలాలకు చేరుకుంటున్నారు. ఈ సందర్భంగా తమ కుటుంబ సభ్యులను కలుసుకుని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దాడుల కారణంగా దాదాపు 12 లఓల మంది తమ ఇళ్లను వదిలిపెట్టి వెళ్లినట్టు సమాచారం.అగ్ర రాజ్యం అమెరికా మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్, హిజ్బొల్లా మధ్య ఎట్టకేలకు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఈ నేపథ్యంలో లెబనాన్ రాజధాని బీరుట్ సహా పలు ప్రాంతాల్లో ప్రశాంత వాతావరణం కనపిస్తోంది. దాడులు నిలిచిపోవడంతో ప్రజలు రోడ్లపైకి వచ్చి సంబురాలు చేసుకుంటున్నారు. ఇజ్రాయెల్ దాడుల కారణంగా లెబనాన్ ను విడిచి వెళ్లిపోయిన వారంతా ఇప్పుడు స్వస్థలాలకు చేరుకుంటున్నారు. ముఖ్యంగా దఓిణ లెబనాన్ కు చెందిన వారే ఎక్కువగా ఉన్నారు.ఇదిలా ఉండగా.. దక్షిణ లెబనాన్‌లోని పలు ప్రాంతాలను ఖాళీ చేయాలంటూ తాము గతంలో జారీ చేసిన ఆదేశాలు ఇప్పటికీ అమలులోనే ఉన్నాయని ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరిస్తోంది. దీంతో, కొంత మంది భయాందోళనకు గురవుతున్నారు. మరోవైపు.. గాజాలో మాత్రం ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో 11 మంది పౌరులు చనిపోయారు. వీరిలో నలుగురు చిన్నారులు ఉన్నట్టు తెలుస్తోంది. ఓ పాఠశాలలో ఆశ్రయం పొందుతున్న వారిపై ఇజ్రాయెల్ దాడులు చేయడంతో వారు చనిపోయారు. గాజాపై 14 నెలలుగా ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్ దాడుల కారణంగా ఇప్పటి వరకు దాదాపు 44వేల మంది చనిపోయారు. -
ఇజ్రాయెల్, హెజ్బొల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం!
బీరూట్: ఇజ్రాయెల్, లెబనాన్ సరిహద్దుల వెంట కాల్పుల మోత ఆగే సూచనలు కనిపిస్తున్నాయి. హమాస్‌కు అండగా ఇజ్రాయెల్‌తో పోరు జరుపుతున్న హెజ్బొల్లా మిలిటెంట్ గ్రూప్ వెనక్కి తగ్గే వీలుంది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూతో హెజ్బొల్లాకు కుదరబోతున్న కాల్పుల విరమణ ఒప్పందమే ఇందుకు కారణమని తెలుస్తోంది. కాల్పుల విరమణకు నెతన్యాహూ సూత్రప్రాయ అంగీకారం తెలిపినట్లు వార్తలొచ్చాయి. అయితే ఇంకొన్ని కీలక అంశాలపై సంప్రదింపులు జరుగుతున్నాయని, అవి కొలిక్కి వచ్చాక అంగీకారం కుదురుతుందని తెలుస్తోందని సీఎన్ఎన్ వార్తాసంస్థ తన కథనంలో పేర్కొంది. సూత్రప్రాయ అంగీకారం త్వరలో కుదరబోతోందని ఇజ్రాయెల్ అధికార ప్రతినిధి డేవిడ్ మెన్సర్ సోమవారం చెప్పారు. -
‘ఇది సరిపోదు.. నెతన్యాహును ఉరితీయాలి’ : ఖమేనీ
టెహ్రాన్ : ఇజ్రాయెల్‌తో ఉద్రిక్తతల వేళ ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును అరెస్ట్ చేస్తే సరిపోదని ఉరితీయాలని అంతర్జాతీయ నేర న్యాయస్థానం (ఐసీసీ) సూచించారు. అలీ ఖమేనీ వ్యాఖ్యలతో ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని పశ్చిమా దేశాల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. -
ఐసీసీ నోటీసులపై నెతన్యాహు సీరియస్.. తప్పుడు సంకేతమే..
జెరూసలేం: గాజాలో యుద్ధం నేరాలు, మానవాళికి వ్యతిరేకంగా జరిగిన నేరాలపై ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) గురువారం అరెస్టు వారెంట్లు జారీ చేసింది. ఈ క్రమంలో వారెంట్‌పై నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది యూదుల వ్యతిరేక నిర్ణయం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఐసీసీ అరెస్ట్ వారెంట్‌పై నెతన్యాహు ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ..‘కోర్టు నిర్ణయం ఇజ్రాయెల్ ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇస్తుంది. నేను ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన వ్యక్తిని. నేను, మాజీ రక్షణ మంత్రి యోవ్ గాలంట్ ఉద్దేశపూర్వకంగా పౌరులను లక్ష్యంగా చేసుకున్నారని కోర్టు తప్పుడు ఆరోపణలు చేస్తోంది. ఇజ్రాయెల్ దేశ పౌరుల ప్రాణాలను కాపాడేందుకు మా శక్తి మేరకు మేము పనిచేశాం. కోర్టు తీర్పు యూదులకు వ్యతిరేకంగా ఉంది’ అంటూ విమర్శలు చేశారు.అంతకుముందు.. నెతన్యాహుపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) అరెస్టు వారెంట్లు జారీ చేసింది. అలాగే ఇజ్రాయెల్ రక్షణ శాఖ మాజీ మంత్రి యోవ్ గల్లాంట్‌తోపాటు పలువురు హమాస్ నేతలపైనా వారెంట్లు జారీ చేసింది. బెంజమిన్, గల్లాంట్ గాజాలో మారణహోమం సాగించారని, మానవత్వంతో దాడి చేశారని ఐసీసీ ఆక్షేపించింది. హత్యలు చేయడం, సాధారణ ప్రజలను వేధించడం వంటి అమానవీయ చర్యలకు పాల్పడ్డారని ఆరోపించింది. గాజాలో ప్రజలకు ఆహారం, నీరు, ఔషధాలు, విద్యుత్, ఇంధనం, ఇతర నిత్యావసరాలు అందకుండా ఆంక్షలు విధించారని, అమాయకుల మరణానికి కారకులయ్యారని మండిపడింది. నెతన్యాహు, గల్లాంట్ చర్యల వల్ల ఎంతోమంది మహిళలు, చిన్నారులు బలయ్యారని ఉద్ఘాటించింది. పౌష్టికాహారం, నీరు అందక, డీహైడ్రేషన్‌తో పసిబిడ్డలు మరణించారని పేర్కొంది.The antisemitic decision of the international court in The Hague is a modern Dreyfus trial, and it will end the same way. pic.twitter.com/e1l8PMghrB— Benjamin Netanyahu - בנימין נתניהו (@netanyahu) November 21, 2024 ఒంటరైన నెతన్యాహు? ఇజ్రాయెల్ ప్రధానమంత్రి, రక్షణ శాఖ మాజీ మంత్రిపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు అరెస్టు వారెంట్లు జారీ చేయడంతో ఇప్పుడేం జరుగుతుందన్న చర్చ మొదలైంది. ఐసీసీ అరెస్టు వారెంట్లు జారీ చేయడంతో నెతన్యాహు, గల్లాంట్ ఇప్పుడు అంతర్జాతీయంగా వాంటెడ్ నిందితులుగా మారారు. ప్రపంచ దేశాల అధినేతలు వారికి మద్దతు ఇవ్వడానికి వీల్లేదు. అదే జరిగితే అంతర్జాతీయంగా నెతన్యాహు, గల్లాంట్ ఒంటరవుతారు. చివరకు గాజాలో కాల్పుల విరమణ ప్రక్రియ ప్రారంభించే ప్రయత్నాలు మరింత సంక్లిష్టంగా మారుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
నెతన్యాహుపై అరెస్టు వారెంట్
ద హేగ్: ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) గురువారం అరెస్టు వారెంట్లు జారీ చేసింది. అలాగే ఇజ్రాయెల్ రక్షణ శాఖ మాజీ మంత్రి యోవ్ గల్లాంట్‌తోపాటు పలువురు హమాస్ నేతలపైనా వారెంట్లు జారీ చేసింది. బెంజమిన్, గల్లాంట్ గాజాలో మారణహోమం సాగించారని, మానవత్వంతో దాడి చేశారని ఐసీసీ ఆక్షేపించింది. హత్యలు చేయడం, సాధారణ ప్రజలను వేధించడం వంటి అమానవీయ చర్యలకు పాల్పడ్డారని ఆరోపించింది. గాజాలో ప్రజలకు ఆహారం, నీరు, ఔషధాలు, విద్యుత్, ఇంధనం, ఇతర నిత్యావసరాలు అందకుండా ఆంక్షలు విధించారని, అమాయకుల మరణానికి కారకులయ్యారని మండిపడింది. నెతన్యాహు, గల్లాంట్ చర్యల వల్ల ఎంతోమంది మహిళలు, చిన్నారులు బలయ్యారని ఉద్ఘాటించింది. పౌష్టికాహారం, నీరు అందక, డీహైడ్రేషన్‌తో పసిబిడ్డలు మరణించారని పేర్కొంది. నెతన్యాహు, గల్లాంట్ ఉద్దేశపూర్వకంగానే సామాన్య ప్రజలపై వైమానిక దాడులు చేసినట్లు చెప్పడానికి సహేతుకమైన ఆధారాలను గుర్తించామని వివరించింది. గాజాలో నెలకొన్న మానవతా సంక్షోభానికి నెతన్యాహు, గల్లాంట్ బాధ్యత వహించాలని తేల్చిచెప్పింది. యుద్ధ నేరాల్లో నెతన్యాహు నిందితుడని స్పష్టం చేసింది. గాజాలో 2023 అక్టోబర్ 8 నుంచి 2024 మే 20వ తేదీ దాకా నెలకొన్న పరిణామాలను పరిగణనలోకి తీసుకున్న అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు నెతన్యాహు, గల్లాంట్‌పై అరెస్టు వారెంట్లు జారీ చేసింది. అలాగే గాజాలో భీకర యుద్ధానికి, సంక్షోభానికి కారణమయ్యారంటూ హమాస్ నేతలపైనా అరెస్టు వారెంట్లు జారీ అయ్యాయి. హమాస్ అగ్రనేతలు మొహమ్మద్ డెయిఫ్, యహ్యా సిన్వర్, ఇస్మాయిల్ హనియేను అరెస్టు చేయాలని ఐసీసీ స్పష్టంచేసింది. అయితే, యహ్యా సిన్వర్, ఇస్మాయిల్ హనియే ఇప్పటికే ఇజ్రాయెల్ దాడుల్లో మృతిచెందిన సంగతి తెలిసిందే. ఇప్పుడేం జరగొచ్చు? ఇజ్రాయెల్ ప్రధానమంత్రి, రక్షణ శాఖ మాజీ మంత్రిపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు అరెస్టు వారెంట్లు జారీ చేయడంతో ఇప్పుడేం జరుగుతుందన్న చర్చ మొదలైంది. ఐసీసీ అరెస్టు వారెంట్లు జారీ చేయడంతో నెతన్యాహు, గల్లాంట్ ఇప్పుడు అంతర్జాతీయంగా వాంటెడ్ నిందితులుగా మారారు. ప్రపంచ దేశాల అధినేతలు వారికి మద్దతు ఇవ్వడానికి వీల్లేదు. అదే జరిగితే అంతర్జాతీయంగా నెతన్యాహు, గల్లాంట్ ఒంటరవుతారు. చివరకు గాజాలో కాల్పుల విరమణ ప్రక్రియ ప్రారంభించే ప్రయత్నాలు మరింత సంక్లిష్టంగా మారుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
ఇజ్రాయెల్ పీఎం నెతన్యాహు ఇంటిపై బాంబు దాడి.. సంచలన వీడియో
జెరూసలేం: గాజా, హిజ్బొల్లాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్న వేళ సంచలన ఘటన చోటుచేసుకుంది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇంటి సమీపంలో మరోసారి బాంబు దాడి జరిగింది. ఫ్లాష్ బాంబ్ దాడి కారణంగా పేలుడు ధాటికి భారీ స్థాయిలో మంటలు చెలరేగాయి. బాంబు దాడి సమయంలో నెతన్యాహు ఇంట్లో లేకపోవడంతో ప్రమాదం తప్పింది.వివరాల ప్రకారం.. ఉత్తర ఇజ్రాయెల్‌లోని సిజేరియా నగరంలో ప్రధాని నెతన్యాహు ఇంటి గార్డెన్లో ఆదివారం తెల్లవారుజామున ఫ్లాష్ బాంబు దాడి జరిగింది. బాంబు దాడి సందర్బంగా గార్డెన్లో మంటలు చెలరేగాయి. ఇక, దాడి జరిగిన సమయంలో ప్రధాని నెతన్యాహు, ఆయన కుటుంబ సభ్యులు ఇంట్లో లేకపోవడంతో ప్రమాదం తప్పింది. బాంబు దాడితో అక్కడ ఉన్న వారికి ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. కాగా, నెతన్యాహు ఇంటిపై దాడి జరగడం ఇది రెండోసారి.మరోవైపు.. ఇజ్రాయెల్ ప్రధాని ఇంటిపై బాంబు దాడిని ఆ దేశ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ త్రీవంగా ఖండించారు. నెతన్యాహు ఇంటిపై దాడికి సంబంధించి త్వరితగతిన దర్యాప్తు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. నెతన్యాహును రెచ్చగొట్టడం మంచిది కాదని హెచ్చరించారు. ఇదిలా ఉండగా.. ఈ ఘటనపై ఇజ్రాయెల్ భద్రతా మంత్రి ఇతామర్ బెన్-గ్విర్ మాట్లాడుతూ.. ప్రధాని ఇంటిపై ఫ్లాష్ బాంబ్ విసరడం వల్ల రెడ్ లైన్ క్రాస్ చేసినట్లైంది.. దానికి తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సిందేనని వార్నింగ్ ఇచ్చారు. బాంబు దాడికి పాల్పడిన వారిపై ప్రతి దాడి తప్పదని కామెంట్స్ చేశారు. Two Flares were fired earlier tonight at a Guard Shack outside the Home of Israeli Prime Minister Benjamin Netanyahu, in the Northern Town of Caesarea, the same Home that a Hezbollah Drone struck in October. Both Israeli Police and Shin Bet are Investigating. pic.twitter.com/0BfYEaN4Bq— OSINTdefender (@sentdefender) November 16, 2024 -
ఇజ్రాయెల్‌లో నిరసనలు
జెరుసలేం: ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గాలెంట్‌ను తొలగించడంతో అక్కడ నిరసనలు వెల్లువెత్తా యి. వీధుల్లోకొచ్చిన నిరసనకారులు ప్రధాని నెతన్యాహు రాజీనామా చేయాలని, కొత్త రక్షణ మంత్రి బందీ ఒప్పందానికి ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. నెతన్యాహు దేశం మొత్తాన్ని ప్రమాదంలోకి నెడుతున్నారని మండిపడ్డారు. కొందరు ఆందోళనకారులు అయలోన్ హైవేపై నిప్పు పెట్టడంతో ఇరువైపులా రాకపోకలకు అంతరాయం కలిగింది. అక్టోబర్ 7న హమాస్ బందీలుగా తీసుకున్న వ్యక్తుల కుటుంబాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక బృందం కూడా గెలాంట్ను తొలగించడాన్ని ఖండించింది. తొలగింపును.. విడుదల ఒప్పందాన్ని పక్కకుపెట్టే ప్రయత్నాలకు కొనసాగింపుగా పేర్కొంది. రాబోయే రక్షణ మంత్రి యుద్ధం ముగింపుపై స్పష్టమైన ప్రకటన చేయాలని, అపహరణకు గురైన వారందరినీ తక్షణమే తిరిగి తీసుకురావడానికి సమగ్ర ఒప్పందాన్ని అమలు చేయాలని డిమాండ్ చేసింది. రాజకీయ విభేదాలు... ప్రధాని నెతన్యాహు, మాజీ రక్షణ మంత్రి గాలెంట్ మధ్య చాలాకాలంగా విభేదాలు ఉన్నాయి. న్యాయ వ్యవస్థను సమూలంగా మార్చే వివాదాస్పద ప్రణాళికలపై విభేదాలు రావడంతో నెతన్యాహు 2023 మార్చిలో తొలిసారిగా గాలెంట్‌ను తొలగించారు. ప్రజల నుంచి పెద్ద ఎత్తున నిరసన రావడంతో తిరి గి నియమించారు. ఈ సంఘటన ‘గాలెంట్ నైట్’ గా ప్రసిద్ధి చెందింది. అయితే గాజాకు యుద్ధానంత ర ప్రణాళిక సమస్యను పరిష్కరించడంలో ప్రభు త్వం విఫలమైందని ఈ ఏడాది మేలో గాలెంట్ బ హిరంగ అసహనం వ్యక్తం చేశారు. గాజాలో పౌర, సైనిక పాలనను చేపట్టే యోచన ఇజ్రాయెల్‌కు లేదని నెతన్యాహు బహిరంగంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అంతేకాదు, ఇజ్రాయెల్ అల్ట్రా ఆర్థోడాక్స్ పౌరులను సైన్యంలో పనిచేయడం నుంచి మినహాయించే ప్రణాళికలపై గాలెంట్ అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనికి నెతన్యాహు స్పందిస్తూ ప్రత్యర్థి పాలస్తీనా గ్రూపులు హమాస్, ఫతాహ్లను ప్రస్తావిస్తూ.. హమస్తాన్ను ఫతాస్తాన్గా మార్చడానికి తాను సిద్ధంగా లేనని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఇద్దరు నేతల మధ్య విశ్వాస సంక్షోభం తొలగింపు దాకా దారితీసిందని నెతన్యాహు చెప్పారు. ఇటీవలి నెలల్లో ఆయనపై తన విశ్వాసం క్షీణించిందని, అతని స్థానంలో విదేశాంగ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ బాధ్యతలు తీసుకుంటారని వెల్లడించారు. ఇజ్రాయెల్ భద్రత నా జీవిత లక్ష్యం– గాలెంట్ కాగా, తొలగింపు అనంతరం గాలెంట్ స్పందించా రు. ఇజ్రాయెల్ భద్రత ఎప్పటికీ తన జీవిత లక్ష్యమ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మూడు అంశాలపై విభేదాల కారణంగానే తనను పదవి నుంచి తొలగించినట్లు మంగళవారం రాత్రి పూర్తి ప్రకటన విడుదల చేశారు. సైనిక సేవకు మినహాయింపులు ఉండకూడదని, పాఠాలు నేర్చుకోవాలంటే జాతీయ విచారణ అవసరమని, బందీలను వీలైనంత త్వరగా స్వదేశానికి తీసుకురావాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉండగా.. గాజాపై యుద్ధంలో ఇజ్రా యెల్‌కు ప్రధాన మద్దతుదారు అమెరికాలో అధ్యక్ష ఎన్నికల రోజునే గాలెంట్‌ను తొలగిచండం చర్చనీయాంశమైంది. నెతన్యాహు కంటే గాలెంట్కు వైట్ హౌస్‌తో మంచి సంబంధాలు ఉన్నాయి. ఇజ్రాయెల్ రక్షణకు సంబంధించిన అన్ని విషయాల్లోనూ మంత్రి గాలెంట్ కీలక భాగస్వామిగా ఉన్నారని వైట్‌హౌ స్ జాతీయ భద్రతా మండలి ప్రతినిధి ఒకరు తెలిపా రు. సన్నిహిత భాగస్వాములుగా ఇజ్రాయెల్ తదుప రి రక్షణ మంత్రితో కలిసి పనిచేస్తామని చెప్పారు. -
యుద్ధం వేళ ఇజ్రాయెల్ నెతన్యాహు సంచలన నిర్ణయం
జెరూసలేం: గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్న వేళ బెంజిమెన్ నెతన్యాహు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇజ్రాయెల్ రక్షణశాఖ మంత్రి యోవ్ గాలంట్‌ను పదవి నుంచి తొలగించడం ఆసక్తికరంగా మారింది. గాజాలో యుద్ధం మొదలు ఇద్దరి మధ్య విభేదాలు కొనసాగుతున్న కారణంగా ఆయనను విధుల నుంచి తొలగించినట్టు తెలుస్తోంది.గాజాలోని హమాస్, లెబనాన్‌లోని హెజ్బొల్లాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్న వేళ బెంజమిన్ నెతన్యాహు అనూహ్య ప్రకటన చేశారు. రక్షణశాఖ మంత్రి యోవ్ గాలంట్‌ను పదవి నుంచి తొలగించారు. ఈ సందర్భంగా ప్రధాని నెతన్యాహు మాట్లాడుతూ..‘యుద్ధం సమయంలో ప్రధానికి, రక్షణశాఖ మంత్రికి మధ్య పూర్తి నమ్మకం అవసరం. మొదట్లో అలాంటి నమ్మకమే ఉండేది. దాడుల్లో సందర్బంగా ఎన్నో సానుకూల ఫలితాలు సాధించాం. దురదృష్టవశాత్తు ప్రస్తుతం అలాంటిది జరగడం లేదు. ఇద్దరి మధ్య అంతరాలు పెరిగాయి. విశ్వాసం సన్నగిల్లింది అని చెప్పుకొచ్చారు.ఇదే సమయంలో గాలంట్ స్థానంలో తన విశ్వాసపాత్రుడు, విదేశాంగ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్‌ను నియమించనున్నారు. విదేశాంగశాఖను గిడియాన్ సార్‌కు అప్పగించారు. తన మాజీ ప్రత్యర్థి అయిన గిడియాన్‌కు నెతన్యాహు ఇటీవలే తన కేబినెట్లో చోటిచ్చారు. అయితే, గాలంట్‌పై నెతన్యాహు ఎటువంటి చర్యలు తీసుకోలేదు.ఇదిలా ఉండగా.. గత ఏడాది మార్చిలోనూ ఒకసారి గాలంట్‌ను తొలగించేందుకు యత్నించగా.. నెతన్యాహుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా విస్తృత నిరసనలు జరిగాయి. ఇజ్రాయెల్ న్యాయవ్యవస్థలో మార్పుల కోసం నెతన్యాహు ప్రవేశపెట్టిన కొత్త న్యాయ చట్టాన్ని యోవ్ గాలంట్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ కారణంగా వారి మధ్య వైరం మొదలైనట్టు సమాచారం. -
సంధి దిశగా ఇజ్రాయెల్, హమాస్.. యుద్ధానికి ముగిసినట్టేనా?
జెరూసలేం: ఇజ్రాయెల్, హమాస్ మధ్య దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా సెంట్రల్ గాజాలో పాలస్తీనియన్లకు ఆశ్రయం కల్పిస్తున్న పాఠశాలపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో 17 మంది మరణించారు. మృతిచెందిన వారిలో హమాస్ కమాండర్ ఉన్నట్టు ఇజ్రాయెల్ చెబుతోంది. గత ఏడాది అక్టోబర్ 7న జరిగిన దాడుల వెనక అతడి ప్రమేయం ఉందని ఇజ్రాయెల్ తెలిపింది. మరోవైపు.. ఇజ్రాయెల్, హమాస్ సంధి దిశగా కదులుతున్నట్టు తెలుస్తోంది.ఇజ్రాయెల్, హమాస్ సంధి దిశగా కదులుతున్నాయి. గాజా కాల్పుల విరమణ ఒప్పందంలో తమ స్పై చీఫ్ పాల్గొంటారని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. మరోవైపు.. ఒప్పందం జరిగే సూచనలు కన్పిస్తే పోరాటం ఆపేస్తామని హమాస్ వర్గాలు వెల్లడించాయి. హమాస్ అధినేత యాహ్యా సిన్వర్ మృతి ఒక ఒప్పందానికి దారి తీయగలదని అమెరికా కొద్ది రోజుల క్రితమే ఆశాభావం వ్యక్తం చేసింది.దోహాకు చెందిన ఓ అధికార ప్రతినిధి బృందం కైరోలో ఈజిప్టు అధికారులతో గాజా సంధికి సంబంధించిన ప్రతిపాదనలపై చర్చించినట్లు హమాస్‌కు చెందిన ఓ సీనియర్ అధికారి తెలిపారు. హమాస్ పోరాటాన్ని ఆపడానికి సంసిద్ధత వ్యక్తంచేసింది. అయితే, ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు కట్టుబడి ఉండాలి. యుద్ధం నేపథ్యంలో గాజా నుంచి వెళ్లిపోయిన ప్రజలను తిరిగి అనుమతించాలి. ఖైదీల మార్పిడి ఒప్పందాన్ని అంగీకరించడంతో పాటు గాజాకు అందే మానవతా సాయం అందాలి. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ఆయన వెల్లడించారు.ఇక, బంధీలను విడుదల చేయడానికి ఓ ఒప్పందాన్ని కుదుర్చుకోవడాన్ని స్వాగతిస్తున్నామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు పేర్కొన్నారు. కైరో సమావేశం అనంతరం ఇజ్రాయెల్‌కు చెందిన మొస్సాద్ గూఢాచార సంస్థ అధిపతిని అజెండాలోని ముఖ్యమైన కార్యక్రమాలను ముందుకుతీసుకెళ్లేందుకు ఖతార్‌కు వెళ్లాలని ఆదేశించినట్లు ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది.ఇదిలా ఉండగా.. గాజాపై ఇజ్రాయెల్ దాడులు పీక్ స్టేజ్‌కు చేరుకున్నాయి. పాలస్తీనా పౌరులే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులకు తెగబడుతోంది. తాజాగా ఓ పాఠశాలపై జరిగిన దాడిలో 17 మంది మృతిచెందారు. నుసిరత్ శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ దాడి చేయడంతో 11 నెలల శిశువుతో సహా ఎక్కువగా మహిళలు, పిల్లలు మరణించారని 42 మంది గాయపడ్డారని పాలస్తీనా వైద్య అధికారులు తెలిపారు. మృతుల్లో 13 మంది 18 ఏళ్లలోపు చిన్నారులు, ముగ్గురు మహిళలు ఉన్నట్టు పేర్కొంది.గాజాపై దాడుల్లో మరో హమాస్ కమాండర్‌ను హతమార్చినట్టు ఇజ్రాయెల్ తెలిపింది. గత ఏడాది అక్టోబర్ 7న జరిగిన దాడుల వెనక అతడి ప్రమేయం ఉందని ఇజ్రాయెల్ వెల్లడించింది. చనిపోయిన కమాండర్ ఐక్యరాజ్యసమితి సహాయ ఏజెన్సీ కోసం కూడా పని చేస్తున్నాడని చెప్పుకొచ్చింది. యూఎన్ ఏజెన్సీలోని సభ్యులు హమాస్, ఇతర సాయుధ బృందాల్లో పనిచేస్తున్నారని ఆరోపించింది. ఈ ఆరోపణల నేపథ్యంలో అక్టోబర్ 7 దాడుల్లో పాల్గొన్న 9 మందిని గతంలోనే యూఎన్ తొలగించింది. -
హెజ్బొల్లా పెద్ద తప్పు చేసింది: ఇజ్రాయెల్ ప్రధాని
జెరూసలేం: హెజ్బొల్లా తీరుపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఇరాన్ మద్దతు కలిన హెజ్బొల్లా తనను, తన భార్యను హత్య చేయడానికి ప్రయత్నించి ఘోరమైన తప్పు చేసిందని’ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. ఇటువటి ఘటనలు శత్రువులపై తాము సాగిస్తున్న న్యాయపరమైన యుద్ధాన్ని నిలువరించలేవని, ఈ విషయంలో ఇజ్రాయెల్‌ను ఎవరూ ఆపలేరని నెతన్యాహు పేర్కొన్నారు.నెతన్యాహు తన ట్విట్టర్ ఖాతాలో ‘ఇరాన్‌తో పాటు దాని ప్రతినిధులకు నేను ఒకటే చెబుతున్నాను.. ఎవరైనా సరే ఇజ్రాయెల్ పౌరులకు హాని కలిగించాలని ప్రయత్నిస్తే, వారు భారీ మూల్యం చెల్లించుకోవలసి వస్తుంది. మేము ఉగ్రవాదులను, వారిని పంపేవారిని అంతమొందించడాన్ని కొనసాగిస్తాం. మేము మా దేశ బందీలను గాజా నుండి స్వదేశానికి తీసుకువస్తాం. మా ఉత్తర సరిహద్దుల్లో నివసిస్తున్న మా పౌరులను సురక్షితంగా వారి ఇళ్లకు తిరిగి చేరుస్తాం. ఇజ్రాయెల్ తన యుద్ధ లక్ష్యాలన్నింటినీ సాధించడానికి, రాబోయే తరాలకు ఈ ప్రాంతంలో భద్రతను కల్పించడానికి కట్టుబడి ఉంది’ అని పేర్కొన్నారు. Israel PM Benjamin Netanyahu tweets, "The attempt by Iran’s proxy Hezbollah to assassinate me and my wife today was a grave mistake. This will not deter me or the State of Israel from continuing our just war against our enemies in order to secure our future. I say to Iran and its… pic.twitter.com/uX2MJvPcJe— ANI (@ANI) October 19, 2024హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్ మృతి తరువాత గాజాలో ఇజ్రాయెల్ తన ఆర్మీ దాడులు ముమ్మరం చేసింది. గాజాలో గత 24 గంటల్లో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 93 మంది మృతి చెందారు. గాజాలోని ఎనిమిది శరణార్థుల శిబిరాలపై ఇజ్రాయెల్ భారీ దాడి చేసింది. ఈ దాడుల్లో రోడ్లు, ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఇజ్రాయెల్- హెజ్బొల్లా మధ్య చాలా కాలంగా ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇరువర్గాల దాడుల్లో ఇప్పటి వరకు వందలమంది మృతిచెందారు. ఇది కూడా చదవండి: నోకియాలో ఉద్యోగాల కోత.. ఈ సారి ఎంతమందంటే? -
టార్గెట్ నెతన్యాహూ!
జెరూసలేం: ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ లక్ష్యంగా డ్రోన్ల దాడి జరగడం తీవ్ర కలకలం రేపింది. మధ్యధర సముద్ర తీర ప్రాంతంలోని కెసారియా పట్టణంలో ఉన్న నెతన్యాహూ ఇంటిని లక్ష్యంగా చేసుకొని శనివారం ఉదయం లెబనాన్ భూభాగం నుంచి డ్రోన్లు దూసుకొచ్చినట్టు ఇజ్రాయెల్ వెల్లడించింది. వాటిని తమ సైన్యం కూల్చేసినట్లు ప్రకటించింది. ఆ సమయంలో నెతన్యాహూ, ఆయన భార్య ఇంట్లో లేరని పేర్కొంది. లెబనాన్ సరిహద్దు నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న నెతన్యాహూ నివాసంపైకి డ్రోన్లు దూసుకొస్తుండగా ఇజ్రాయెల్‌లో సైరన్లు మోగాయి. దాంతో ప్రజలు అప్రమత్తమయ్యారు. పదుల సంఖ్యలో డ్రోన్లను కూల్చేసినట్టు సైన్యం తెలియజేసింది. డ్రోన్ల శకలాలు తగిలి 50 ఏళ్ల వ్యక్తి మరణించాడని, 13 మంది గాయపడ్డారని ఇజ్రాయెల్ మెడికల్ సరీ్వసు అధికారులు చెప్పారు. అయితే ఇజ్రాయెల్ రాడార్ వ్యవస్థకు అందకుండా అతి తక్కువ ఎత్తులో వచ్చిన ఒక డ్రోన్ నెతన్యాహూ నివాసాన్ని ఢీకొన్నట్టు తెలుస్తోంది. ఆ క్రమంలో అది ఇజ్రాయెల్ హెలికాప్టర్‌కు అతి సమీపం నుంచి దూసుకెళ్లింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఇజ్రాయెల్ దాడుల్లో ఇటీవల హెజ్బొల్లా, హమాస్ అధినేతలు మరణించడం తెలిసిందే. ఇందుకు ప్రతీకారంగా మిలిటెంట్లు నెతన్యాహూను లక్ష్యం చేసుకొని డ్రోన్ దాడులకు ప్రయతి్నంచినట్లు తెలుస్తోంది. మాది ఉనికి పోరు: నెతన్యాహు హమాస్‌తో యుద్ధాన్ని గెలిచి తీరతామని నెతన్యాహూ ప్రకటించారు. తన నివాసంపై దాడి అనంతరం ఆయన ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇజ్రాయెలీలను ఉద్దేశించి ఇంగ్లిష్, హీబ్రూ భాషల్లో మాట్లాడారు. ‘‘ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా హమాస్‌ను తుడిచిపెట్టకుండా నన్ను ఆపలేరు’’ అని తన నివాసంపై దాడులనుద్దేశించి స్పష్టం చేశారు. లక్ష్యసాధనలో ఇజ్రాయెల్ సైనిక దళాలు అద్భుత ప్రగతి కనబరుస్తున్నాయంటూ ప్రస్తుతించారు. వారిని చూసి గరి్వస్తున్నట్టు చెప్పారు. ‘‘మా వాళ్లను కిరాతకంగా పొట్టన పెట్టుకోవడం, మా మహిళలపై అత్యాచారాలకు పాల్పడటం, మా చిన్నారులను సజీవంగా బుగ్గి చేయడం వంటి దారుణ అకృత్యాల్లో యాహ్యా సిన్వర్ (హమాస్ చీఫ్)ది కీలకపాత్ర. రెండ్రోజుల క్రితమే అతన్ని మట్టుబెట్టాం. మాది ఉనికి పోరాటం. దీన్ని తుదకంటా కొనసాగిస్తాం. ఇరాన్ దన్నుతో చెలరేగుతున్న ఇతర ఉగ్ర సంస్థలపైనా రాజీలేని పోరు సాగిస్తాం’’ అని ప్రకటించారు. హెజ్బొల్లా అగ్రనేత హతం హెజ్బొల్లా మరో అగ్రనేతను కోల్పోయింది. సంస్థ డిప్యూటీ కమాండర్ నాసర్ రషీద్‌ను హతమార్చినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. దక్షిణ లెబనాన్‌లోని బింట్ బెయిల్ పట్టణంలో శనివారం జరిపిన బాంబు దాడుల్లో అతను మరణించినట్టు వెల్లడించింది.సిన్వర్ లేకపోయినా హమాస్ సజీవం ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ స్పష్టికరణ టెహ్రాన్: హమాస్ అధినేత యాహ్వా సిన్వర్ ప్రాణత్యాగం ప్రశంసనీయమని ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ పేర్కొన్నారు. సిన్వర్ భౌతికంగా లేకపోయినా హమాస్ ఎప్పటికీ ఉంటుందని తేలి్చచెప్పారు. పాలస్తీనా ప్రజల కోసం ఆ సంస్థ పోరాటం సాగిస్తూనే ఉంటుందని తెలిపారు. గాజాలో ఇజ్రాయెల్ దాడుల్లో బుధవారం సిన్వర్ మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ఖమేనీ తాజాగా స్పందించారు. ఒక ప్రకటన విడుదల చేశారు. సిన్వర్‌ను కోల్పోవడం హమాస్‌కు కొంత నష్టమే అయినప్పటికీ ఆ సంస్థ మనుగడకు ముప్పేమీ లేదని వెల్లడించారు. హమాస్ సజీవంగా ఉందని, ఇకపైనా ఉంటుందన్నారు. పోరాటంలో సిన్వర్ ఒక ధ్రువతార అని ఖమేనీ కొనియాడారు. క్రూరమైన శత్రువుపై అలుపెరుగని పోరాటం సాగించారని, అంకితభావంతో పని చేశారని చెప్పారు. పలు సందర్భాల్లో శత్రువుకు గుణపాఠం చెప్పారని వివరించారు. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై చేసిన దాడి ద్వారా సిన్వర్ చరిత్ర సృష్టించారని, ఘనమైన వారసత్వాన్ని వదిలివెళ్లారని ఉద్ఘాటించారు. -
ఇజ్రాయెల్ ప్రధాని ఇంటిపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రమాదం
ఇజ్రాయెల్, హమాస్ యుద్ధంతో పశ్చిమాసియాలో తీవ్ర ఘర్షణవాతావరణం నెలకొంది. ఇజ్రాయెల్ దళాలు తమ వరుస దాడులతో హమాస్,హెజ్బొల్లా అగ్ర నేతలను ఒక్కొక్కరిగా హతమార్చుతున్నాయి. ఈ క్రమంలో ఇటీవల హమాస్ చీఫ్, అక్టోబర్ 7 దాడుల సూత్రదారి యాహ్యా సిన్వర్ మృతిచెందిన విషయం తెలిసిందే. గాజాలోని ఓ ఇంటిపై చేసిన దాడిలో సిన్వర్ మరణించినట్లు ఇజ్రాయెల్ ప్రకటించిన రెండు రోజులకే ఓ ఆందోళనకర ఘటన చోటుచేసకుంది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇంటి సమీపంలో డ్రోన్ దాడి జరిగినట్లు వార్తా కథనాలు వెలువడుతున్నాయి.లెబనాన్ నుంచి ప్రయోగించిన ఓ డ్రోన్ శనివారం దక్షిణ హైఫాలోని సిజేరియాలోని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు నివాసం సమీపంలో పేలిపోయిందని రాయిటర్స్ నివేదించింది. ఈ డ్రోన్ దాడిలో భవనం కొంత భాగం దెబ్బతింది. అయితే ఈ దాడిలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. దాడి జరిగిన సమయంలో నెతన్యాహు, అతని భార్య అక్కడ లేరని ప్రధాని ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు.కాగా లెబనాన్ నుంచి ప్రయోగించిన మరో రెండు డ్రోన్లను ఇజ్రాయెల్ వాయు దళాలు టెల్ అవీవ్ ప్రాంతంలో కూల్చివేశాయి. అయితే మూడోది మాత్రం సిజేరియాలోని ఓ భవనాన్ని ఢీకొట్టడంతో పెద్ద శబ్దంతో పేలుడు సంభవించింది. సిజేరియాలోని భవనాన్ని ఢీకొనడానికి ముందు డ్రోన్ లెబనాన్ నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఎగిరిందని ఇజ్రాయెల్ మీడియా నివేదించింది. -
హమాస్ సిన్వర్ పోస్టుమార్టం రిపోర్టు.. తలలో బుల్లెట్, చేతి వేలు కత్తిరించి..
జెరూసలేం: ఇజ్రాయెల్ సైన్యం చేతిలో హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్ మృతిచెందాడు. ఈ క్రమంలో సిన్వర్ పోస్టుమార్టం రిపోర్టులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. సిన్వర్ తలపై బుల్లెట్ గాయం, ఎడమ చేతికి ఒక వేలును కట్ చేసినట్టు రిపోర్టులో వెల్లడించారు. బుల్లెట్ గాయంతోనే సిన్వర్ చనిపోయినట్టు నిర్ధారించారు.ఇజ్రాయెల్ దాడుల్లో సిన్వర్ మృతిచెందిన విషయం తెలిసిందే. తాజాగా హమాస్ అధినేత సిన్వర్ మృతదేహానికి డాకట్ర్ చెన్ కుగేల్ పోస్ట్‌మార్టం నిర్వహించారు. ఈ క్రమంలో తలపై బుల్లెట్ గాయం ఉందని, దాని కారణంగానే అతడు మరణించి ఉంటాడని పోస్టుమార్టం రిపోర్టులో పేర్కొన్నారు. అంతేకాకుండా సిన్వర్ ఎడమ చేతికి ఐదు వేళ్లలో ఒక వేలు లేదని తెలిపారు. దీంతో, రిపోర్టు సంచలనంగా మారింది.అయితే, దాడుల్లో చనిపోయిన వ్యక్తి సిన్వర్ అవునా.. కాదా? అని నిర్ధారించుకునేందుకే అతడి వేలిని ఇజ్రాయెల్ సైన్యం కత్తిరించినట్టు కథనాలు వెలువడ్డాయి. ఖైదీల మార్పిడి ఒప్పందంలో 2011లో విడుదలయ్యే వరకు సిన్వర్ రెండు దశాబ్దాల పాటు ఇజ్రాయెల్ జైలులో ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఆనాటి ప్రొఫైల్‌తో డీఎన్ఏ నిర్ధారణ కోసం అతని వేలును కత్తిరించినట్టు తెలుస్తోంది. మరోవైపు.. అతడి దంతాలను కూడా కత్తిరించినట్టు వార్తలు బయటకు వస్తున్నాయి. Live Updates: Autopsy Shows Hamas Leader Was Killed by a Gunshot to the HeadYahya Sinwar was earlier hit in the arm during a firefight with Israeli soldiers, according to the Israeli doctor who oversaw the autopsy.The leader of Hamas, Yahya Sinwar, was killed by a gunshot wound…— Brent Erickson (@BErickson_BIO) October 18, 2024 ఇదిలా ఉండగా.. హమాస్ చీఫ్ సిన్వర్ చనిపోవడానికి ముందు అతడు ఉన్న పరిస్థితిని ఇజ్రాయెల్ సైన్యం ఓ డ్రోన్ ద్వారా రికార్డు చేసింది. మరణానికి ముందు సిన్వర్ ఓ శిథిల భవనంలో సోఫా కుర్చీలో కూర్చొని ఉన్నాడు. అప్పటికే అతడు తీవ్రంగా గాయపడ్డాడు. గాయాల నుంచి రక్తం కారుతోంది. కూర్చున్న చోటు నుంచి లేవలేని నిస్సహాయత స్పష్టంగా కనిపిస్తోంది. శరీరమంతా దుమ్ము కప్పేసి ఉంది. అలాంటి పరిస్థితిలో.. తనవైపుగా వస్తున్న డ్రోన్‌పైకి కర్రలాంటి ఓ వస్తువును విసిరాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.🇵🇸 Incredible footage: Yahya Sinwar, covered in dust, all his comrades just killed, arm amputated and close to death, hurls a projectile at an Israeli drone in a final act of defianceIsraelis are ridiculing this as a pathetic end, but I'm not sure the world will see it that way pic.twitter.com/I0gdAQhQ0L— Keith Woods (@KeithWoodsYT) October 17, 2024 -
యుద్ధం రేపే ముగియవచ్చు.. ఇజ్రాయెల్ ప్రధాని కీలక వ్యాఖ్యలు
ఇజ్రాయెల్ సైన్యం జరిపిన దాడిలో ఉగ్రవాద సంస్ధ హమాస్ చీఫ్, అక్టోబర్ 7 దాడుల సూత్రధారి యహ్యా సిన్వార్ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. హమాస్ అగ్రనేతను ఎట్టకేలకు హతమార్చడంతో.. ఏడాది కాలంగా సదరు మిలిటెంట్ సంస్థతో పోరాడుతున్న ఇజ్రాయెల్‌కు భారీ విజయం లభించినట్లైంది..యహ్య సిన్వార్ మృతి అనంతరం గాజా ప్రజలను ఉద్ధేశించి మాట్లాడుతూ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. హమాస్ ఉగ్రవాదులు ఆయుధాలను వదిలి, బంధీలను విడిచిపెట్టినట్లైతే రేపటిలోగా యుద్ధం ముగుస్తుందని ప్రకటించారు. ఈ మేరకు ఎక్స్‌లో వీడియో విడుదల చేశారు.చదవండి: ఇజ్రాయెల్ డ్రోన్ వీడియో.. హమాస్ సిన్వర్ ఆఖరి క్షణాలు ఇలాయహ్యా సిన్వార్ మరణించాడు. ఇజ్రాయెల్ రక్షణ దళాల ధైర్య సైనికులు అన్ని రఫాలో మట్టుబెట్టారు. ఇది గాజాలో యుద్ధం ముగింపు కాదు. ఇప్పుడే ముగింపు దశ ప్రారంభమైంది. గాజా ప్రజలకు నాదొక చిన్న సందేశం.. హమాస్ తన ఆయుధాలను వదిలి ఇజ్రాయెల్ బందీలను తిరిగి అప్పగిస్తే ఈ యుద్ధం ముగియవచ్చు. మా పౌరులను వదిలిన హమాస్ తీవ్రవాదులకు బయటకు వచ్చి జీవించే అవకాశం కల్పిస్తాం. లేదంటే వేటాడి మరీ హతమరుస్తాం’ అని హెచ్చరించారు. కాగా హమాస్ మిలిటెంట్ సంస్థ అధినేత యహ్యా సిన్వర్‌ను ఐడీఎఫ్ దళాలు మట్టుబెట్టాయి. గాజాపై తాము జరిపిన దాడుల్లో ముగ్గురు మృతి చెందాని ఇజ్రాయెల్ తెలిపింది. వీరిలో ఒకరు యాహ్యా సిన్వర్ అని డీఎన్ఏ టెస్టు తర్వాత ఇజ్రాయెల్ ప్రకటించింది. Yahya Sinwar is dead.He was killed in Rafah by the brave soldiers of the Israel Defense Forces. While this is not the end of the war in Gaza, it's the beginning of the end. pic.twitter.com/C6wAaLH1YW— Benjamin Netanyahu - בנימין נתניהו (@netanyahu) October 17, 2024 గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై మారణకాండకు యహ్యా సిన్వర్నే మాస్టర్‌మైండ్. ఈ ఘటనలో 1200 మంది ఇజ్రాయెల్ వాసులు చనిపోయారు. సుమారు 250 మందిని హమాస్ మిలిటెంట్లు బందీలుగా చేసుకున్న విషయం తెలిసిందే. ఈక్రమంలో దక్షిణ గాజాలో బుధవారం ముగ్గురు హమాస్ మిలిటెంట్లను ఇజ్రాయెల్ హతమార్చింది. అందులో సిన్వర్ ఉన్నట్లు డీఎన్ఏ ద్వారా ధ్రువీకరించినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. అయితే దీనిపై హమాస్ ఎటువంటి ప్రకటనా చేయలేదు. -
ఇజ్రాయెల్ డ్రోన్ వీడియో.. హమాస్ సిన్వర్ ఆఖరి క్షణాలు ఇలా..
జెరూసలేం: ఇజ్రాయెల్ దాడుల్లో హమాస్ మిలిటెంట్ గ్రూపు అధినేత యాహ్యా సిన్వర్ మృతి చెందాడు. ఈ క్రమంలో చనిపోయే ముందు సిన్వర్ చివరి కదలికలకు సంబంధించిన సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇజ్రాయెల్ సైన్యానికి చెందిన డ్రోన్.. సిన్వర్ కదలికలను వీడియో తీసింది.ఇజ్రాయెల్ దాడులు జరుగుతున్న సమయంలో సిన్వర్ ఓ భవనంలో కూర్చుని ఉన్నాడు. బాంబు దాడుల తర్వాత భవనం పూర్తిగా శిథిలమైపోయింది. ఇజ్రాయెల్ బాంబుల దాడిలో సిన్వర్ తుదిశ్వాస విడిచే ముందు ఓ కూర్చిలో అచేతనంగా కూర్చుండిపోయాడు. సిన్వర్ కూర్చుని ఉండగా.. ఇజ్రాయెల్ డ్రోన్ అతడి వద్దకు వెళ్లింది. దాన్ని గమనించిన అతడు ఓ కర్రలాంటి వస్తువును దానిపైకి విసిరినట్లుగా వీడియోలో ఉంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఇదిలా ఉండగా.. సిన్వర్ మృతిపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా నెతన్యాహు మాట్లాడుతూ.. సిన్వర్‌ను హతమార్చి, లెక్కను సరిచేశాం. ఇది అతిపెద్ద విజయంగా నేను భావిస్తున్నా. ఇజ్రాయెల్‌కు చెందిన బంధీలను సురక్షితంగా తరలించే వరకు యుద్ధం మాత్రం ఆగదు. హమాస్ ఆయుధాలను వదిలి.. బందీలను తిరిగి పంపిస్తే ఈ యుద్ధం రేపే ముగిస్తుంది. ఇజ్రాయెల్ పౌరులను వదిలిన హమాస్ తీవ్రవాదులకు బయటకు వచ్చి జీవించే అవకాశం కల్పిస్తాం. లేదంటే వేటాడి మరీ హతమరుస్తామని హెచ్చరించారు.🇵🇸The final moments of the resistance leader Yahya Sinwar who fought bravely on the front lines, refusing to surrender even after sustaining severe injuries from heavy attacks. He continued to fight with honor until he was ultimately martyred defending his land and people. pic.twitter.com/4Bn4Jnprbo— Syria Truths (@TruthsSyria) October 18, 2024 ఇది కూడా చదవండి: హమాస్ చీఫ్ సిన్వర్ మృతి.. బైడెన్ స్పందన ఇదే.. -
హమాస్ చీఫ్ సిన్వర్ మృతి.. బైడెన్ స్పందన ఇదే..
వాషింగ్టన్: ఇజ్రాయెల్ దాడుల్లో హమాస్ మిలిటెంట్ గ్రూపు అధినేత యాహ్యా సిన్వర్ మృతి చెందాడు. ఈ క్రమంలో సిన్వర్ మృతిపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచానికి ఇది ఎంతో శుభసూచకం. సిన్వర్ అంతంతో గాజా యుద్ధం ముగింపునకు మార్గం సుగమమైంది అంటూ కామెంట్స్ చేశారు.ఇజ్రాయెల్, గాజా మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా అక్టోబరు 7 దాడుల సూత్రధారి హమాస్ మిలిటెంట్ గ్రూపు అధినేత యాహ్యా సిన్వర్‌ను ఇజ్రాయెల్ హతమార్చింది. ఈ సందర్భంగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పందిస్తూ.. సిన్వర్‌ను హతమార్చి, లెక్కను సరిచేశాం. బంధీలను సురక్షితంగా తరలించే వరకు యుద్ధం మాత్రం ఆగదు అంటూ కామెంట్స్ చేశారు. ఇదే సమయంలో విదేశాంగమంత్రి కాంట్జ్ మాట్లాడుతూ.. ఇది ఇజ్రాయెల్‌కు సైనికంగా, నైతికంగా ఘనవిజయం. ఇరాన్ నేతృత్వంలో రాడికల్ ఇస్లాం దుష్టశక్తులకు వ్యతిరేకంగా స్వేచ్ఛా ప్రపంచం సాధించిన విజయం ఇది. సిన్వర్ మృతిలో తక్షణ కాల్పుల విరమణకు, బందీల విడుదలకు మార్గం సుగమం కానుంది అని చెప్పుకొచ్చారు.Yahya Sinwar is dead.He was killed in Rafah by the brave soldiers of the Israel Defense Forces. While this is not the end of the war in Gaza, it's the beginning of the end. pic.twitter.com/C6wAaLH1YW— Benjamin Netanyahu - בנימין נתניהו (@netanyahu) October 17, 2024మరోవైపు, సిన్వర్ మృతిపై జో బైడెన్ స్పందిస్తూ.. హమాస్ అగ్రనేత సిన్వర్‌ను ఇజ్రాయెల్ దళాలు మట్టుబెట్టడం యావత్ ప్రపంచానికి శుభదినం. ఈ ఘటన హమాస్ చెరలో ఉన్న బందీల విడుదలకు, ఏడాదిగా సాగుతున్న గాజా యుద్ధం ముగింపునకు దోహదపడుతుంది అంటూ కామెంట్స్ చేశారు.ఇదిలా ఉండగా.. దక్షిణ గాజాలో బుధవారం ముగ్గురు హమాస్ మిలిటెంట్లను ఇజ్రాయెల్ సైన్యం హతమార్చింది. ఇందులో ఓ వ్యక్తికి సిన్వర్ పోలికలు ఉన్నాయని గుర్తించిన ఐడీఎఫ్, డీఎన్ఏ, దంత నమూనాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపి హమాస్ నేత మరణాన్ని ధ్రువీకరించింది. గాజా యుద్ధానికి కారణమైన అక్టోబరు 7 దాడుల సూత్రధారి సిన్వరేనని తొలి నుంచి ఇజ్రాయెల్ బలంగా నమ్ముతోంది. గతేడాది ఇజ్రాయెల్ సరిహద్దులపై హమాస్ జరిపిన దాడిలో 1200 మంది మృతి చెందారు. 250 మందిని బందీలుగా గాజాకు తీసుకువెళ్లింది. ఇంకా హమాస్ దగ్గర 100 మంది బందీలు ఉన్నారు.ఇది కూడా చదవండి: బంగ్లా మాజీ ప్రధాని షేక్ హాసీనాపై అరెస్ట్ వారెంట్ -
ఇజ్రాయెల్‌కు కొత్త టెన్షన్!.. హెజ్బొల్లా వద్ద రష్యా ఆయుధాలు
జెరూసలేం: ఇజ్రాయెల్-హెజ్బొల్లాల మధ్య భీకర యుద్ధం నడుస్తోంది. రెండు వర్గాలు దాడులతో చెలరేగిపోతున్నాయి. ఈ క్రమంలో హెజ్బొల్లా వద్ద రష్యాకు చెందిన ఆయుధాలు ఉన్నాయని ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు చెప్పడం తీవ్ర కలకలం సృష్టించింది. దీంతో, హెజ్బొల్లాకు రష్యా సహకరిస్తోందన్న అనుమానాలను నెతన్యాహు వ్యక్తం చేశారు.హెజ్బొల్లాపై యుద్ధం సందర్భంగా ఇజ్రాయెల్ దళాలు వారి సొరంగాలను కనుగొన్నారు. ఇజ్రాయెల్ బాంబు దాడులతో సొరంగాలను ధ్వంసం చేశారు. ఈ క్రమంలోనే ఆ సొరంగాల్లో రష్యాకు చెందిన ఆయుధాలను ఇజ్రాయెల్ సైన్యం గుర్తించింది. ఈ నేపథ్యంలో హెజ్బొల్లా ఆయుధాలపై నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తాజాగా మాట్లాడుతూ..‘దక్షిణ లెబనాన్‌లోని హెజ్బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ దళాలు జరిపిన సోదాల్లో రష్యాకు చెందిన అత్యాధునిక ఆయుధాలు కనుగొన్నాం. లిటాని నదికి దక్షిణాన లెబనాన్ ఆర్మీకి మాత్రమే ఆయుధాలు కలిగి ఉండే అనుమతి ఉందని 2006లో యూఎన్ భద్రతామండలి తీర్మానించింది. అయినప్పటికీ హెజ్బొల్లా ఆ ప్రాంతాల్లో వందలాది సొరంగాలను తవ్వి.. స్థావరాలుగా మార్చుకుంది. అక్కడే రష్యాకు చెందిన ఆయుధాలు లభించాయి. ఒకరిని రెచ్చగొట్టడం మా లక్ష్యం కాదు. లెబనాన్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకొనే ఉద్దేశం మాకు లేదు. లెబనాన్ సరిహద్దుల్లో నివసిస్తున్న మా పౌరులు సురక్షితంగా తమ ఇళ్లకు చేరడమే మా లక్ష్యం’ అని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా.. గత నెలలో ఇరాన్ మద్దతుతో లెబనాన్‌లోని హెజ్బొల్లాలో ఇజ్రాయెల్ దళాలు జరిపిన సోదాల్లో రష్యా, చైనాకు సంబంధించిన ఆయుధాలు కనుగొన్నట్లు వాషింగ్టన్ పోస్ట్ కథనాలు వెల్లడించింది. ఈ నేపథ్యంలో హెజ్బొల్లా వద్ద రష్యా ఆయుధాలు ఉన్నాయని నిరూపితమైంది. 🔴 Netanyahu has said that the Israeli military found "state-of-the-art" Russian weapons during a search of Hezbollah bases in Lebanon.- The Times of Israel pic.twitter.com/ohuvH48zLr— war observer (@drmubashir599) October 17, 2024 -
మీకూ గాజా గతే!
బీరుట్: లెబనాన్‌కూ గాజా గతి పట్టిస్తామని, మునుపెన్నడూ లేనంతగా పెనుదాడులకు పాల్పడతామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ హెచ్చరించారు. ఈ మేరకు మంగళవారం లెబనాన్ పౌరులనుద్దేశిస్తూ ఆయన ఒక వీడియో సందేశం వినిపించారు. ‘‘ హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లాను అంతంచేశాం. అతని స్థానంలో హెజ్బొల్లా కాబోయే చీఫ్‌ను, ఆ తర్వాతి వారసుడు, తదుపరి నేతనూ చంపేశాం.గతంలో ఎన్నడూలేనంతగా హెజ్బొల్లా ఇప్పుడు బలహీనపడింది’ అని నెతన్యాహూ అన్నారు. నెతన్యాహూ వ్యాఖ్యలపై లెబనాన్ ఇంకా స్పందించలేదు. మరోవైపు దక్షిణ లెబనాన్‌లోని కుగ్రామంలో రెసిడెన్షియల్ భవంతి భూగర్భంలో హెజ్బొల్లా స్థావరాన్ని ఇజ్రాయెల్ సైన్యం గుర్తించింది. అక్కడి భారీ స్థాయిలో ఆయుధాలను స్వా«దీనం చేసుకుంది.ఈ క్రమంలో హెజ్బొల్లా మిలిటెంట్లతో జరిగిన పరస్పర కాల్పుల్లో ఇజ్రాయెల్ సైన్యాధికారి కెప్టెన్ బెంజిన్ ఫాలక్ చనిపోయాడు. కాగా, లెబనాన్‌లోని పావువంతు భాగం ఇప్పటికే ఇజ్రాయెల్ సైన్యం అధీనంలోకి వెళ్లిపోయిందని ఐక్యరాజ్యసమితి మానవతా సంబంధాల విభాగం తెలిపింది. ఇజ్రాయెల్ దాడుల్లో లెబనాన్‌లో 1,400 మంది పౌరులు మరణించగా, 12 లక్షల మంది వలసపోయారని పేర్కొంది. -
హమాస్‌పై యుద్ధం ముగిస్తాం: నెతన్యాహు
గతేడాది అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయెల్‌పై హమాస్ చేసినటువంటి మెరుపు దాడి మళ్లీ జరగకుండా చూసేందుకు దేశంలో భద్రతను మారుస్తున్నట్లు ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు తెలిపారు. ఇజ్రాయెల్‌పై హమాస్ బలగాలు మెరుపుదాడి చేసిన ఘటనకు నేటితో ఏడాది పూర్తి అయింది. ఈ సందర్భంగా ఆనాటి దాడి జరగకుండా చూస్తామని ప్రధాని నెతన్యాహు సోమవారం కేబినెట్ ప్రసంగంలో పేర్కొన్నట్లు ప్రధాని కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.‘‘మేము మా ప్రాంతంలో భద్రతా మారుస్తున్నాం. మా పిల్లల, భవిష్యత్తు కోసం. గతేడాది అక్టోబర్ ఏడో తేదీన జరిగినవి దాడి మళ్లీ ఇంకెప్పడూ జరగకుండా చూస్తాం. అందు కోసం దేశ భద్రతలో సైతం వాస్తవ మార్పులు తీసుకువస్తాం’’ అని అన్నారు.ఇజ్రాయెల్‌పై జరిగిన దాడుల మొదటి వార్షికోత్సవం సందర్భంగా 1200 మందికిపైగా అమాయకుల మృతికి ప్రత్యేక సంతాప సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు మాట్లాడారు. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్), భద్రతా సిబ్బంది , రెగ్యులర్, రిజర్వ్, ఆర్మీ , పోలీసు, మొస్సాద్లోని సైనిక యోధుల వీరత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. మీరు నిర్వహిస్తున్న పనిని పూర్తి చేయాలని తెలిపారు. హమాస్ చేతిలో మిగిలిన బందీలను గాజా నుంచి విడిపించాలని కోరారు.‘‘మేము నిర్దేశించుకున్న అన్ని లక్ష్యాలను పూర్తి చేసినప్పుడే హమాస్‌పై యుద్ధాన్ని ముగిస్తాం. గాజా హమాస్ పాలనను పడగొడుతాం. హమాస్ చెరలో ఉన్న ఇజ్రాయెల్ బంధీలను సురక్షితంగా తీసుకువస్తాం. గాజా నుంచి ఇజ్రాయెల్‌కు భవిష్యత్తులో వచ్చే ముప్పును అడ్డుకుంటాం’’ అని అన్నారు.చదవండి: ఏడు వైపులా శత్రువులతో పోరాడుతున్నాం -
ఏడు వైపులా శత్రువులతో పోరాడుతున్నాం
జెరూసలేం: ఇజ్రాయెల్‌కు ఆయుధ సరఫరాను నిలిపివేస్తూ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్ తీసుకున్న నిర్ణయంపై ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాçహు మండిపడ్డారు. ‘‘మాక్రాన్ నిర్ణయాన్ని ఖండిస్తున్నాం. ఇరాన్ అండదండలు అందిస్తున్న అరాచకశక్తులపై ఇజ్రాయెల్ పోరాడుతోంది. ఇందుకు నాగరిక దేశాలన్నీ మద్దతు ఇవ్వాలి. కానీ ఫ్రాన్స్, ఇతర పశి్చమ దేశాలు మాకు ఆయుధాలివ్వొద్దని నిర్ణయం తీసుకుంటున్నాయి. ఇది నిజంగా సిగ్గుచేటు’’ అంటూ ఆదివారం దుయ్యబట్టారు. ‘‘మేం ఏడు దిక్కులా శత్రువులతో పోరాడుతున్నాం. గాజాలో హమాస్‌పై, లెబనాన్‌లో హెజ్»ొల్లాపై, యెమెన్‌లో హౌతీలపై, ఇరాక్, సిరియాల్లో షియా మిలిటెంట్లపై పోరాడుతున్నాం. ఇరాన్ ప్రభుత్వం మిలిటెంట్లకు ఆయుధ సరఫరా ఆపడం లేదు. మిలిటెంట్ శక్తులు కలిసికట్టుగా పనిచేస్తున్నాయి. వాటిని వ్యతిరేకిస్తున్న పశి్చమ దేశాలు ఇజ్రాయెల్‌కు ఆయుధాలివ్వడం మాత్రం నిలిపివేస్తున్నాయి’’ అని ఆక్షేపించారు. ఎవరి సహకారమున్నా, లేకపోయినా యుద్ధంలో గెలుస్తామని ధీమా వ్యక్తంచేశారు. -
మీరెన్ని చెప్పినా.. ఇరాన్‌పై మా యుద్ధం ఆగదు : ఇజ్రాయెల్ ప్రధాని
జెరూసలేం: ఎవరెన్ని ఏం చెప్పినా, ఏ దేశం తమకు మద్దతు ఇవ్వకపోయినా తాము ఇరాన్‌పై చేస్తున్న యుద్ధాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆపేది లేదని ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు. ఇరాన్‌పై చేస్తున్న యుద్ధంలో తమదే విజయం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు.దాదాపు 200 క్షిపణులతో (మిసైల్స్) ఇరాన్లో బీభత్సం సృష్టించేందుకు సిద్ధంగా ఉన్నామని, దాడుల ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు శుక్రవారం ఇజ్రాయెల్ సైన్యం(ఐడీఎఫ్)ప్రకటించింది. ఆ ప్రతిపాదనలను ప్రధాని నెతన్యాహుకి పంపినట్లు వెల్లడించింది. నెతన్యాహు నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే తమ పనిని మొదలుపెడతామని ఐడీఎఫ్ తెలిపింది.ఈ ప్రకటన అనంతరం, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానియేల్ మాక్రాన్ మాట్లాడుతూ..ఇజ్రాయెల్‌కు తాము సరఫరా చేస్తున్న అణ్వాయుధాలను నిలిపి వేస్తున్నట్లు అధికారంగా వెల్లడించారు. ఆ దిశగా ఆదేశాలు జారీ చేశారు. అయితే మాక్రాన్ నిర్ణయాన్ని నెతన్యాహు ఖండించారు. ఫాన్స్ అధ్యక్షుడి నిర్ణయాన్ని తాము అవమానకరంగా భావిస్తున్నట్లు ఓ వీడియోని విడుదల చేశారు. ఇరాన్ నేతృత్వంలోని అనాగరిక శక్తులతో ఇజ్రాయెల్ పోరాడుతున్నప్పుడు, నాగరిక దేశాలన్నీ ఇజ్రాయెల్ వైపు నిలబడాలి’ అని నెతన్యాహు కోరారు. అయినా మాక్రాన్, ఇతర పాశ్చాత్య నాయకులు ఇప్పుడు ఇజ్రాయెల్‌పై ఆయుధాల ఆంక్షలు విధించాలని పిలుపునివ్వడం సిగ్గుచేటుగా అభివర్ణించారు.గాజాలో హమాస్, లెబనాన్‌లోని హెజ్బొల్లా, యెమెన్‌లోని హౌతీలు, ఇరాక్ ,సిరియాలోని షియా మిలీషియా, వెస్ట్ బ్యాంక్‌లోని ఉగ్రవాదులతో చేస్తున్న ఇజ్రాయెల్ పోరాటాలను ఎత్తి చూపారు. ఇరాన్ తన మిత్రదేశాలకు ఆయుధాలను పరిమితం చేసిందా అని ప్రశ్నిస్తూ.. కాదు.. ఇరాన్‌ను వ్యతిరేకించే దేశాలు.. ఇప్పుడు ఇజ్రాయెల్‌కు అణ్వాయుధాల్ని పంపడాన్ని ఆపేయడం ఎంత అవమానకరం అని వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ ఒత్తిడి ఉన్నప్పటికీ, నెతన్యాహు వారి మద్దతు ఉన్నా,లేకుండానే ఇజ్రాయెల్ గెలుస్తుందని పునరుద్ఘాటించారు. కాగా,ఇజ్రాయెల్‌కు అణ్వాయుధాలు పంపడాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన ఫ్రాన్స్‌కు పలుదేశాలు మద్దతు పలుకుతున్నాయి. -
ఇరాన్ హిట్ లిస్ట్‌లో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు?
ఇజ్రాయెల్, ఇరాన్ దాడులు, ప్రతీకార దాడులతో పశ్చిమాసియాపై నానాటికీ యుద్ధమేఘాలు దట్టంగా కమ్ముకుంటున్నాయి.లెబనాన్‌ను వైమానిక దాడులతో వణికించి హెజ్బొల్లా అగ్రనేతలను వరుసబెట్టి మట్టుపెట్టిన ఇజ్రాయెల్.. ఇటు గాజాపై క్షిపణుల వర్షం కురిపిస్తూ హమాస్‌ను అంతమొందించే దిశగా దూకుడుగా వ్యవహరిస్తోంది.అటు ఇరాన్ సైతం వెనక్కి తగ్గడం లేదు. ఇజ్రాయెల్‌పై క్షిపణులు వర్షం కురిపిస్తూ ప్రతీకార దాడులుకు పాల్పడుతోంది. తాజాగా ఇజ్రాయెల్ అగ్రనేతలతో కూడిన ఇరాన్ హిట్ లిస్ట్ జాబితా ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ లిస్ట్‌లో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుతోసహా రక్షణమంత్రి యోవ్ గాలంట్, ఇజ్రాయెల్ ఆర్మీ, నేవీ, వైమానిక దళ కమాండర్లు కూడా ఉన్నట్లు రూమర్లు వెల్లువెత్తుతున్నాయి. అయితే వీటిపై అటు ఇజ్రాయెల్ కానీ ఇటు ఇరాన్ కానీ స్పందించలేదు. ఒకవేళ నెతన్యాహు ఈ జాబితాలో లేకపోయినా..సీనియర్ ఇజ్రాయెల్ నాయకులను లక్ష్యంగా చేసుకొని ఉండవచ్చనే అనుమానాలే ఇరాన్ మిలటరీ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. ఉన్నత స్థాయి సైనిక నాయకులైన జనరల్ స్టాఫ్ హెర్జి హలేవి, డిప్యూటీ అమీర్ బారం,ఉత్తర, దక్షిణ, సెంట్రల్ కమాండ్ అధిపతులు మేజర్ జనరల్స్ ఒరి గోర్డిన్, యెహుదా ఫాక్స్, ఎలియేజర్ తోలెడాని. మిలిటరీ ఇంటెలిజెన్స్ చీఫ్ అహరోన్ హలీవా పేరు కూడా ఉన్నట్లు తెలుస్తోందిఇక జాబితా నిజమే అయితే.. ఇరాన్ మద్దతుగల హెజ్బొల్ల చీఫ్‌ను అంతం చేసిన ఇజ్రాయెల్, తమ తదుపరి టార్గెట్ ఆదేశ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనని మట్టుబెట్టడమేనని వస్తున్న వార్తలకు ప్రతిచర్యగా బెంజమిన్ నెన్యాహును ఇరాన్ లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. -
ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్.. ఏ దేశం ఎటువైపు!
ఇజ్రాయెల్‌పై హమాస్ మిలిటెంట్లు దాడి చేసి.. ఇజ్రాయెల్ పౌరులను బంధీలుగా గాజాకు తీసుకువెళ్లటంతో గతేడాది అక్టోబర్ 7 నుంచి ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ప్రారంభమైంది. హమాస్‌కు మద్దతుగా ఉండే లెబనాన్ దేశంలోని హెజ్బొల్లా గ్రూప్, యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారుల దాడులతో ఈ యుద్ధం కాస్త.. ఇజ్రాయెల్, లెబనాన్, ఇరాన్ దేశాలకు విస్తరించింది. ఇక.. మంగళవారం ఇరాన్.. ఇజ్రాయెల్‌పై చేసిన భీకర మిసైల్స్ దాడితో ఒక్కసారిగా పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు కమ్ముకొని ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది.ఇజ్రాయెల్, ఇరాన్ మిత్రదేశాల మధ్య ఇటీవల కాలంలో దాడుల తీవ్రత విస్తరిస్తూ వస్తోంది. ఇలాగే కొనసాగితే.. ఈ దాడులు అరబ్ దేశాలు, అమెరికాకు విస్తరించే అవకాశం ఉన్నట్లు యుద్ధ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏప్రిల్‌లో ఇరాన్ ఇజ్రాయెల్‌పై మిసైల్స్‌తో మెరుపు దాడిని చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఇరాన్‌కు యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులు, లెబనాన్‌లోని హెజ్బొల్లా గ్రూప్, సిరియన్ సైన్యం నుంచి కూడా మద్దతు లభించింది. మరోవైపు.. ఇజ్రాయెల్ రక్షణకు దాని మిత్రదేశాలు (అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్), అరబ్ దేశాలైన జోర్డాన్, సౌదీ అరేబియా, యూఏఈ మద్దతుగా నిలిచి సహాయం అందించాయి.అయితే ప్రస్తుతం ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య దాడుల నేపథ్యంలో ఏయే దేశాలు ఎవరికి మద్దతుగా నిలుస్తున్నాయనే చర్చ జరుగుతోంది.ఇజ్రాయెల్మిత్ర దేశం అమెరికా సాయం, ఐరన్ డోమ్ రక్షణతో ఇజ్రాయెల్ అక్టోబరు 2023 నుంచి గాజా స్ట్రిప్‌లోని హమాస్, లెబనాన్‌లోని హెజ్బొల్లా, యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులతో పోరాడుతోంది. ఇరాన్, ఇరాన్ మద్దతు మిలిటెంట్ గ్రూప్‌లను దాడులకు ప్రతిదాడులతో హెచ్చరిస్తూ.. గాజాలో హమాస్‌ను తుడిచిపెట్టేవరకు తమ దాడులను ఆపబోమని తేల్చిచెబుతోంది.ఇజ్రాయెల్ మిత్రదేశాలు: అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జోర్డాన్, సౌదీ అరేబియాప్రత్యర్థులు: హౌతీలు, హమాస్, ఇరాన్, హెజ్బొల్లాఇరాన్గతంలో ప్రాక్సీ మిటిటెంట్ల గ్రూప్‌ల ద్వారా ఇరాన్.. ఇజ్రాయెల్‌పై ఎక్కువగా దాడి చేసింది. అనూహ్యంగా ఇటీవల ఏప్రిల్‌లో, మంగళవారం ఇరాన్ ఇజ్రాయెల్పకై ప్రత్యక్ష దాడులను ప్రారంభించింది. హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా హత్య , టెహ్రాన్‌లో హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హనియే హత్యకు ప్రతీకారంగా ఇరాన్ అక్టోబర్ 1(మంగళవారం) ఇజ్రాయెల్‌పై 200లకుపైగా మిసైల్స్‌తో భీకర దాడులు చేసింది. సిరియాలోని ఇరాన్ రాయబార కార్యాలంపై ఇజ్రాయెల్ దాడి చేసింది. అనంతరం ఇరాన్ ప్రతీకార చర్యలు భాగంగా ఇజ్రాయెల్‌పై 17 డ్రోన్లు, 120 బాలిస్టిక్ క్షిపణులను మెరుపు దాడి చేసిన విషయం తెలిసిందే. ఇరాన్ కూడా క్రమంగా ఇజ్రాయెల్‌ను ఇరుకున పెట్టేందుకు పశ్చిమాసియా ప్రాంతంతో తన మిత్రదేశాలను సాయాన్ని మరింతగా సమీకరించుకుంటోంది.ఇరాన్ మిత్రపక్షాలు: యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్, హమాస్ప్రత్యర్థులు: ఇజ్రాయెల్, అమెరికా, సౌదీ అరేబియాసౌదీ అరేబియాఇజ్రాయెల్తో దృఢమైన భద్రతా సంబంధాలను కలిగి ఉంది. కానీ దౌత్యపరంగా మాత్రం కఠినంగా వ్యవహరిస్తుంది. ఒక వైపు ఇజ్రాయెల్ దురాక్రమణను ఖండిస్తూ.. గాజాలో తక్షణ కాల్పుల విరమణ కోసం పిలుపునిస్తుంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఇజ్రాయెల్‌పై దాడి చేయాలనే ఇరాన్ ప్రణాళికలకు సంబంధించిన ఇంటెలిజెన్స్ సమాచారాన్ని ఇజ్రాయెల్‌కు పంపిన దేశాలలో సౌదీ అరెబీయా ఒకటి.ఖతార్ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహించడంలో ఖతార్ కీలక పాత్ర పోషిస్తోంది. అయినప్పటికీ, ఖతార్ హమాస్ నేత ఇస్మాయిల్ హనియెహ్కు ఆశ్రయం ఇచ్చింది. అదేవిధంగా ఇరాన్‌తో సత్సంబంధాలను కలిగి ఉంది. ఈ విషయంలో ఇజ్రాయెల్‌కు చాలా ఇష్టం లేకపోవటం గమనార్హం.జోర్డాన్ఈ ఏడాది జనవరిలో దేశంలోని అమెరికా ఆర్మీ స్థావరంపై ఇరాన్ మద్దతుగల మిలిటెంట్లు దాడి చేసి ముగ్గురు సైనికులను అంతం చేశారు. అనంతరం జోర్డాన్ కూడా తీవ్ర సంఘర్షణలో చిక్కుకుంది. జోర్డాన్ గాజాకు సహాయాన్ని పంపినప్పటికీ.. ఇజ్రాయెల్‌తో దౌత్య సంబంధాలను కూడా కొనసాగించింది. -
ఇరాన్ దాడులు.. బంకర్లోకి ఇజ్రాయెల్ ప్రధాని పరిగెత్తారా?
ఇరాన్ మిసైల్స్‌తో ఇజ్రాయెల్‌పై భీకర దాడి చేసింది. సుమారు 400లకుపైగా బాలిస్టిక్ మిసైల్స్‌ను మంగళవారం ఇజ్రాయెల్‌పై ప్రయోగించినట్లు ఇరాన్ ప్రకటించింది. మరోవైపు.. తాము వెంటనే అప్రమత్తమై ఇరాన్ మిసైల్స్‌ను తిప్పికొట్టినట్టు ఇజ్రాయెల్ పేర్కొంది. ఇక.. ఇరాన్-ఇజ్రాయెల్ దేశాల మధ్య దాడుల నేపథ్యంలో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.అయితే.. మంగళవారం ఇరాన్ ఇజ్రాయెల్‌పై మిసైల్స్ దాడులు చేసిన సమయంలో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు బంకర్లో తలదాచుకోవడానికి పరిగెత్తినట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ వీడియో ముఖ్యంగా ఇరాన్ అనుకూల సోషల్‌మీడియా ఖాతాల్లో వైరల్‌గా మారటం గమనార్హం.La carrera de Netanyahu hacia el búnker tras el lanzamiento de misiles iraníes. Lástima que no le cayera uno en toda la cabeza y lo pulverizara, a él y a toda su estirpe de hdp. pic.twitter.com/DGkRywBNbj— Jaime 🏳️🌈 (@Elpieizquierdo) October 2, 2024 ఇరాన్ మంగళవారం చేసిన దాడులకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పరుగులు పెట్టారని సదరు వీడియోకు కామెంట్లు చేస్తున్నారు ఇరాన్ అనుకూల నెటిజన్లు. అయితే ఆ వీడియో.. ప్రస్తుత వీడియో కాదని.. 2021 నాటికి సంబంధించిన వీడియో అని నిపుణులు తేల్చారు. నెస్సెట్ సెషన్ (చట్టసభకు) హాజరయ్యే క్రమంలో ప్రధాని నెతన్యాహు అలా పరుగులు తీశారని.. అప్పడు తీసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా అవుతోందని వివరణ ఇచ్చారు.చదవండి: ఇరాన్-ఇజ్రాయెల్ వార్.. చిన్నపిల్లల కొట్లాటలా ఉంది: ట్రంప్ -
నెతన్యాహుతో మాట్లాడిన ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూతో ఫోన్లో సంభాషించారు. పశ్చిమాసియాలో ఇటీవలి పరిణామాలపై ఆయన చర్చించారు. ప్రస్తుత ప్రపంచంలోనే ఉగ్రవాదానికి చోటులేదని తేల్చిచెప్పారు. ప్రాంతీయ ఉద్రిక్తతలను నివారించడం ఎంతో అవసరమని నొక్కిచెప్పారు. అదే సమయంలో బందీలందరినీ సురక్షితంగా విడుదలయ్యేలా చూడాలన్నారు. పశ్చిమాసియాలో సాధ్యమైనంత త్వరగా శాంతి, సుస్థిరతలను నెలకొల్పే ప్రయత్నాలకు భారత్ మద్దతుగా నిలుస్తుందని నెతన్యాహూకు హామీ ఇచ్చినట్లు ప్రధాని మోదీ ‘ఎక్స్’లో తెలిపారు. అయితే, ప్రత్యేకంగా ఏ సంఘటననూ ప్రధాని మోదీ ప్రస్తావించలేదు. -
ఉగ్రవాదానికి చోటు లేదు: నెతన్యాహుతో ఫోన్లో ప్రధాని మోదీ
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో సోమవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫోన్లో మాట్లాడారు. పశ్చిమాసియాలో ఇటీవల పరిణామాలతో నెలకొన్న ఉద్రిక్త వాతావరణంపై నెతన్యాహుతో చర్చించారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.‘పశ్చిమాసియాలో చోటుచేసుకున్న ఇటీవలి పరిణామాలపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో మాట్లాడాను. ప్రపంచంలో ఉగ్రవాదానికి చోటులేదు. స్థానికంగా ఉద్రిక్తతలు తీవ్రతరం కాకుండా చర్యలు తీసుకోవడంతోపాటు బందీలందరిని సురక్షితంగా విడుదల చేయడం చాలా ముఖ్యం. వీలైనంత త్వరగా శాంతి, స్థిరత్వాల పునరుద్ధరణ ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడానికి భారత్ కట్టుబడి ఉంది.’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.Spoke to Prime Minister @netanyahu about recent developments in West Asia. Terrorism has no place in our world. It is crucial to prevent regional escalation and ensure the safe release of all hostages. India is committed to supporting efforts for an early restoration of peace and…— Narendra Modi (@narendramodi) September 30, 2024ఇటీవల ఇజ్రాయెల్ లెబనాన్, హమాస్‌ను అంతం చేయడమే లక్ష్యంగా దాడులు తీవ్రతరం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే లెబనాన్ రాజధాని బీరూట్‌పై జరిపిన దాడిలో హెజ్బొల్లా చీఫ్ నస్రల్లా సహా కీలక కమాండర్లను హతమార్చింది.దాంతో హెజ్బొల్లాలో నాయకత్వ సంక్షోభం తలెత్తింది. మూడు దశాబ్దాల పైచిలుకు సారథ్యంలో సంస్థను తిరుగులేని సాయుధ శక్తిగా మార్చిన ఘనత నస్రల్లాది. ఆయన మృతితో ఇప్పుడు ఇజ్రాయెల్ నుంచి ఎదురవుతున్న పెను దాడులను కాచుకుంటూ కష్టకాలంలో సంస్థను ముందుండి నడిపేది ఎవరన్నది పెద్ద ప్రశ్నగా మారింది. కొత్త సారథిగా నస్రల్లాకు వరుసకు సోదరుడయ్యే హషీం సైఫుద్దీన్ పేరు గట్టిగా వినిపిస్తోంది. -
నస్రల్లా మృతిపై బైడెన్ సంచలన కామెంట్స్
బీరుట్: ఇజ్రాయెల్, హిజ్బుల్లా మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్ దాడులు, నస్రల్లా మృతిపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశం కావాలని ఇరాన్‌ను కోరింది. దీంతో, భదత్రా మండలిలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.మరోవైపు.. హిజ్బులా చీఫ్ హనస్ నస్రల్లా హత్యపై తాజాగా అమెరికా స్పందించింది. నస్రల్లా మృతిపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మాట్లాడుతూ..‘గతేడాది మొదలైన యుద్ధ ప్రారంభంలోనే నస్రల్లా హత్యకు ఆపరేషన్ రెడీ అయ్యింది. హిజ్బుల్లా, హమాస్ వంటి ఇరానియన్ మద్దతు గల ఉగ్రవాద గ్రూపులకు వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతు తప్పకుండా ఉంటుంది. నస్రల్లా కారణంగా హిజ్బుల్లాలో వేలాది మంది అమెరికన్లు మృతిచెందారు అని చెప్పుకొచ్చారు.ఇదే సమయంలో బీరుట్లో తలెత్తిన భద్రతా పరిస్థితుల కారణంగా దౌత్యవేత్తల కుటుంబసభ్యులు, అమెరికన్ పౌరులు జాగ్రత్తగా ఉండాలని అమెరికా విదేశాంగ శాఖ సూచించింది. అలాగే, బీరుట్ ప్రాంతాన్ని విడిచి వెళ్లాలని విదేశాంగ శాఖ కోరింది. దీంతో, బీరుట్‌లోని అమెరికన్లు కొందరు స్వదేశం బాటపట్టినట్టు సమాచారం.మరోవైపు.. రాబోయే రోజుల్లో తమ శత్రువులపై దాడులు మరింత పెరుగుతాయని ఇజ్రాయెల్ ప్రధాని హెచ్చరికలు జారీ చేశారు. తాజాగా లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడుల కారణంగా 33 మంది మరణించారు. అలాగే, 195 మంది పౌరులు గాయపడినట్టు లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇజ్రాయెల్ కారణంగా గత రెండు వారాల్లో దాదాపు 1000 మంది మరణించగా.. 6000 మంది గాయపడ్డారు.ఇది కూడా చదవండి: హిజ్బుల్లాపై యుద్ధంలో మా టార్గెట్ అతడే: నెతన్యాహు -
హిజ్బుల్లాపై యుద్ధంలో మా టార్గెట్ అతడే: నెతన్యాహు
బీరుట్: హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లాను పక్కా ప్లాన్ ప్రకారం ఇజ్రాయెల్ హత్య మార్చింది. ఈ నేపథ్యంలో నస్రల్లా మృతిపై ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. నస్రల్లాను అంతమొందించడం తమ యుద్ధ లక్ష్యాలను సాధించడంలో అతి ముఖ్యమైన విషయం అని చెప్పుకొచ్చారు.న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి పర్యటన తర్వాత నెతన్యాహు ఇజ్రాయెల్‌కు వెళ్లారు. హసన్ నస్రల్లా హత్యానంతరం ఈ ఘటనపై నెతన్యాహు మొదటిసారిగా బహిరంగంగా స్పందించారు. ఇజ్రాయెల్‌లో నెతన్యాహు మాట్లాడుతూ.. నస్రల్లాను హతమార్చడం మాతో అతి ముఖ్యమైన విషయం. హిజ్బుల్లాకు చెందిన ఇతర టాప్ కమాండర్లను తాము చంపినా, నస్రల్లాయే మాకు అసలు టార్గెట్. ఇజ్రాయెల్‌ను నాశనం చేయాలన్న ప్రణాళికకు సూత్రధారిగా అతడు వ్యవహరించాడు. అందుకే అతడినే మేము టార్గెట్‌గా పెట్టుకున్నాము. యుద్ధంలో నస్రల్లా హత్య చారిత్రక మలుపు. తన శత్రవులపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తుంది’ అంటూ కామెంట్స్ చేశారు.ఇదిలా ఉండగా.. లెబనాన్ తీవ్రవాద సంస్థ హిజ్బుల్లా అధినేత హసన్ నస్రల్లాను ఐడీఎఫ్ దళాలు మట్టుబెట్టాయి. ఈ నేపథ్యంలో హిజ్బుల్లాలకు కొత్త చీఫ్ ఎవరు అనే చర్చ మొదలైంది. అయితే, ఇరాన్ ఆమోదం ఉన్న వ్యక్తికే పగ్గాలు దక్కే అవకాశాలు ఉన్నాయన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. హిజ్బులా రాజకీయ వ్యవహారాలను పర్యవేక్షించే హషీమ్ సఫీ అల్ దిన్ ప్రస్తుతం రేసులో ఉన్నట్టు తెలుస్తోంది. నస్రల్లాకు హషీమ్ సఫీ అల్ దిన్ బంధువు. అలాగే, హిజ్బుల్లా జిహాద్ కౌన్సిల్లోనూ సభ్యుడుగా ఉన్నాడు.మరోవైపు.. ఇజ్రాయెల్ వైమానిక దాడులు బీరుట్ దక్షిణ శివారు ప్రాంతాలను తాకాయి. ఇజ్రాయెల్ సైన్యం హిజ్బుల్లా బలమైన కోట అయిన దహియేహ్‌లో దాడులు కొనసాగిస్తోంది. తాజాగా ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో తొమ్మిది మంది పౌరులు మృతిచెందారు. అలాగే, 90 మందికి పైగా గాయపడినట్టు లెబనాన్ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఇది కూడా చదవండి: Hassan Nasrallah: అరబ్బుల హీరో -
రెండు మ్యాప్‌లతో ఐరాస వేదికపై నెతన్యాహు.. భారత్ ఎటువైపు అంటే
హెజ్బొల్లాను అంతం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ తీవ్ర స్థాయిలో దాడులు జరుపుతోంది. అటు ఐక్యరాజ్యసమితి సమావేశాల్లోనూ.. లెబనాన్ సరిహద్దులో తమ లక్ష్యాలను సాధించే వరకు హెజ్బొల్లాపై పోరాటం ఆగదని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు. ఇప్పటికే హమాస్ సగం బలగాలను అంతం చేశామన్నారు. వారు లొంగిపోకపోతే పూర్తి విజయం సాధించే వరకు పోరాడతామన్నారు.శుక్రవారం న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమతి జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు మాట్లాడుతూ.. తన చేతుల్లో రెండు మ్యాప్‌లను ప్రదర్శించారు. అతని కుడి చేతిలోఉన్న మ్యాప్‌లో మిడిల్ ఈస్ట్‌తో పాటు ఇరాన్, ఇరాక్, సిరియా, యెమెన్ దేశాలకు నలుపు రంగు పెయింట్ వేశారు. ఆ మ్యాప్‌పై ద కర్స్(శాపం) అని రాసి ఉన్నది.ఇక ఒక ఎడమ చేతిలో ఉన్న మ్యాప్‌లో ఈజిప్ట్, సుడాన్, సౌదీ అరేబియా, ఇండియా దేశాలు ఉన్నాయి. ఈ దేశాలను హైలెట్ చేస్తూ గ్రీన్ కలర్ పెయింట్ వేశారు. ఆ మ్యాప్‌పై ద బ్లెస్సింగ్(దీవెన) అని రాసి ఉన్నది అయితే ఆ రెండు మ్యాపుల్లోనూ .. పాలస్తీనా కనిపిస్తున్న ఆనవాళ్లు లేవు. గ్రీన్ మ్యాప్ లేదా బ్లాక్ కలర్ మ్యాపుల్లో .. పాలస్తీనాను చూపించకపోవడం గమనార్హం.ప్రస్తుతం జరుగుతున్న ఘర్షణకు ఇరాన్ కారణమని నెతన్యాహు ఆరోపించారు. ఇరాన్‌తో పాటు దాని మిత్రదేశాలు యుద్ధానికి ఆజ్యం పోస్తున్నట్లు పేర్కొన్నారు. . ఇక గ్రీన్ మ్యాప్‌లో ఉన్న దేశాలు ఇజ్రాయిల్‌తో సన్నిహిత సంబంధాలు పెట్టుకుని ఉన్నట్లు తెలిపారు. లెబనాన్, సిరియా, యెమెన్ దేశాల్లో జరుగుతున్న హింసకు ఇరాన్ ప్రధాన కారణమని తెలిపారు. లెబనాన్‌లోని హిజ్బొల్లాకు, గాజాలోని హమాస్‌కు, యెమెన్‌లోని హౌతీలకు ఆర్థిక, సైనిక సహకారాన్ని ఇరాన్ అందిస్తున్నట్లు ఆరోపించారు. ఇరాన్ మిత్రదేశాల నుంచి తమ భూభాగాన్ని రక్షించుకుంటున్నట్లు ఇజ్రాయిల్ ప్రధాని పేర్కొన్నారు.ఒకవేళ మీరు దాడి చేస్తే, అప్పుడు మేం తిరిగి దాడి చేస్తామని ఇరాన్‌కు వార్నింగ్ ఇచ్చారు. యూఎన్ జనరల్ అసెంబ్లీలో నెతాన్యహూ మాట్లాడుతున్న సమయంలో కొందరు దౌత్యవేత్తలు నిరసనతో వాకౌట్ చేశారు. ఇరాన్ దూకుడు వల్లే లెబనాన్, గాజాలపై దాడి చేయాల్సి వచ్చిందని చెప్పారు. హిజ్బొల్లా యుద్ధ మార్గాన్ని ఎంచుకున్నంత కాలం.. వారిని అంతం చేయడం తప్ప ఇజ్రాయెల్‌కు వేరే మార్గం లేదని స్పష్టం చేశారునెతాన్యహూ పట్టుకున్న గ్రీన్ మ్యాప్‌లో ఇండియా ఉండడం గమనార్హం. ఇండియాతో తమకు మంచి రిలేషన్స్ ఉన్నాయని చెప్పేందుకు ఆ మ్యాప్‌లో ఇండియాను చూపించినట్లు తెలుస్తోంది. ఇటీవల ఇండియా, ఇజ్రాయిల్ మధ్య సత్సంబంధాలు నెలకొన్నాయి. డిఫెన్స్, టెక్నాలజీ రంగంలో రెండు దేశాలు వాణిజ్యం పెంచుకున్నాయి. పాలస్తీనా స్వయంప్రతిపత్తికి ఇండియా సపోర్టు ఇస్తున్నది. అయితే అదే సమయంలో ఇజ్రాయిల్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొనసాగిస్తున్నది. -
దాడులు కొనసాగించండి!
టెల్ అవీవ్: ఇజ్రాయెల్–హెజ్బొల్లా మధ్య ఉద్రిక్తతలు మరింత ముదిరే ప్రమాదం కనిపిస్తోంది. లెబనాన్‌లో హెజ్బొల్లా స్థావరాలపై దాడులు కొనసాగించాలని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ తమ సైన్యానికి ఆదేశాలు జారీ చేశారు. శత్రువుల భరతం పట్టాలన్నదే తమ లక్ష్యమని అన్నారు. ఆయన తాజాగా అమెరికాకు పయనమయ్యారు. న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి కార్యాలయంలో ప్రసంగిస్తారు. హెజ్బొల్లా్లతో చర్చల ప్రతిపాదన వచి్చన మాట వాస్తమేనని, అయితే దానిపై తాము ఇంకా స్పందించలేదని చెప్పారు. మరోవైపు హెజ్బొల్లా్లకు గట్టిగా బుద్ధి చెప్పాలన్న డిమాండ్లు ఇజ్రాయెల్‌లో వినిపిస్తున్నాయి. చర్చలు అవసరం లేదని నెతన్యాహూ మద్దతుదారులు తేల్చిచెబుతున్నారు. ఇదిలా ఉండగా, దక్షిణ లెబనాన్‌లోని బెకా లోయ రక్తసిక్తంగా మారుతోంది. హెజ్బొల్లా ఆయుధ నిల్వలతోపాటు పలు స్థావరాలపై ఇజ్రాయెల్ సైన్యం బుధవారం అర్ధరాత్రి తర్వాత నిప్పుల వర్షం కురిపించింది. భారీగా క్షిపణులు ప్రయోగించింది. 75 హెజ్బొల్లా లక్ష్యాలపై దాడుల చేశామని ఇజ్రాయెల్ సైన్యం గురువారం వెల్లడించింది. 23 మంది సిరియన్లు మృతి లెబనాన్‌లోని యూనైన్ పట్టణంలో మూడంతస్థుల భవనంపై బుధవారం రాత్రి ఇజ్రాయెల్ సైన్యం జరిపిన దాడుల్లో 23 మంది సిరియన్లు మరణించారు. వీరిలో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులే ఉన్నట్లు తెలిసింది. లెబనాన్‌లో ప్రస్తుతం 15 లక్షల మంది సిరియన్లు తలదాచుకుంటున్నారు. సిరియాలో అంతర్యుద్ధం మొదలైన తర్వాత వీరంతా ప్రాణరక్షణ కోసం లెబనాన్‌కు చేరుకున్నారు. హెజ్బొల్లా విషయంలో కాల్పుల విరమణ ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి కట్జ్ గురువారం స్పష్టంచేశారు. హెజ్బొల్లా డ్రోన్ కమాండర్ మృతి?హెజ్బొల్లా డ్రోన్ విభాగం కమాండర్ లక్ష్యంగా ఇజ్రాయెల్ వైమానిక దళం గురువారం సాయంత్రం లెబనాన్ రాజధాని బీరుట్‌పై మళ్లీ దాడులకు దిగింది. దహియెలోని అపార్టుమెంట్‌పై జరిగిన దాడిలో ఇద్దరు మృతి చెందగా 15 మంది వరకు గాయ పడ్డారని లెబనాన్ వార్తా సంస్థలు తెలిపాయి. ఈ దాడిలో హెజ్బొల్లా డ్రోన్ కమాండర్ మహ్మద్ హుస్సేన్ సరౌర్ చనిపోయినట్లు ఇజ్రాయెల్ ఆర్మీ ప్రకటించుకోగా హెజ్బొల్లా స్పందించలేదు.లెబనాన్ నుంచి వెంటనే వెళ్లిపోండిజెరూసలేం: యుద్ధ వాతావరణం, ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నందున లెబనాన్‌కు భారత పౌరులెవరూ రావొద్దని బీరుట్‌లోని భారత రాయబార కార్యాలయం కోరింది. లెబనాన్‌లో ఉండే భారతీయులు సాధ్యమైనంత త్వరగా దేశాన్ని వీడాలని, ఉండాలనుకునే వారు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని హెచ్చరించింది. ఈ మేరకు బుధవారం ‘ఎక్స్’లో అడ్వైజరీ జారీ చేసింది. -
హిజ్బుల్లాపై దాడుల్ని ఆపలేం.. ఇజ్రాయెల్ ప్రధాని హెచ్చరిక
జెరూసలేం: ఇజ్రాయెల్- హెజ్బొల్లా మధ్య 21 రోజుల కాల్పుల విరమణపై తమ ప్రభుత్వం అంగీకరించడం లేదని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు చెప్పారు. ఈ వ్యాఖ్యలతో నేతన్యాహు పరోక్షంగా 21 రోజుల కాల్పుల విరమణకు తాము ఒప్పుకోవడం లేదనే సంకేతాలిచ్చినట్లయ్యింది.హిజ్బుల్లాపై ఇజ్రాయెల్ భీకర దాడి చేస్తోంది. ఇజ్రాయెల్ వైమానిక దాడులతో హిజ్బుల్లా స్థావరాలపై విరుచుకు పడుతుండడంతో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. లెబనాన్ సరిహద్దులో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 600 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. సుమారు 5 లక్షల మంది నిరాశ్రయులయ్యారు.ఈ తరుణంలో ఇజ్రాయెల్ - హిజ్బుల్లా కాల్పులు విరమించాలని అమెరికా,ఫ్రాన్స్‌తో పాటు యురోపియన్ యూనియన్ దేశాలు విజ్ఞప్తి చేశాయి. అయితే ఆ విజ్ఞప్తిని తిరస్కరించినట్లు ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు కార్యాలయం అధికారింగా ప్రకటించినట్లు జాతీయ మీడియా కథనానలు చెబుతున్ననాయి.కాల్పుల విరమణ ఒప్పందాన్ని ప్రధాని నేతన్యాహు అంగీకరించడం లేదు. మొత్తం సైన్యాన్ని మోహరించి దాడులు విస్తృతం చేయాలని నేతన్యాహు ఆదేశాలు జారీ చేశారని ప్రధాని కార్యాలయం నుంచి ప్రకటన వచ్చినట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి.భూతల దాడులకు సిద్దమైన ఇజ్రాయెల్బుధవారం ఇజ్రాయెల్ ఆర్మీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ హెర్జి హలేవి సైనికులకు కీలక ఆదేశాలు జారీచేశారు. హిజ్బుల్లాపై సాధ్యమైనంత మేరకు భూతల దాడులు చేసేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఈ ఆదేశాలు జారీ చేసిన కొన్ని గంటల్లో అగ్రరాజ్యం అమెరికా తోపాటు, ఫ్రాన్స్‌తో పాటు ఇతర దేశాలు ఇజ్రాయెల్-హిజ్బుల్లాల మధ్య 21 రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదనను తెచ్చాయి. ఆ ప్రతిపాదనని ఇజ్రాయెల్ తిరస్కరించింది. -
బైడెన్ హెచ్చరిక.. ఇజ్రాయెల్ కవ్వింపు చర్యలు!
టెల్ అవీవ్: ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఇజ్రాయెల్ అనూహ్య దాడులతో హిజ్బుల్లా సైనిక బలం సగానికి తగ్గింది. ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హెచ్చరికలు జారీ చేశారు. ఆల్ అవుట్ వార్(అంతటా యుద్ధం సాధ్యమే) అంటూ ఇజ్రాయెల్‌ను ఉద్దేశించి బైడెన్ కామెంట్స్ చేయడంతో.. కవ్వింపు చర్యలకు దిగిన నెతన్యాహు మరిన్ని దాడులకు సన్నద్ధమవుతున్నారు. లెబనాన్‌లో ఇజ్రాయెల్ సైన్యం విధ్వంసం సృష్టిస్తోంది. ప్రస్తుతం హిజ్బుల్లా పరిస్థితి గాజాలోని హమాస్ మాదిరిగానే తయారైంది. కేవలం నాలుగు రోజుల ఆపరేషన్ సమయంలో ఇజ్రాయెల్.. హిజ్బుల్లా 90 శాతం నాయకత్వాన్ని హతమార్చింది. హిజ్బుల్లా సైనిక బలాన్ని సగం నాశనం చేసింది. ఆపరేషన్ నార్తర్న్ యారో కారణంగా.. హిజ్బుల్లా సైనిక మౌలిక సదుపాయాలలో సగం ధ్వంసమైందని ఇజ్రాయెల్, అమెరికా చెబుతున్నాయి. ఐడీఎఫ్ తన నివేదికలో హిజ్బుల్లా అగ్ర నాయకత్వంలో ఇప్పుడు ముగ్గురు వ్యక్తులు మాత్రమే మిగిలి ఉన్నారని చెబుతోంది. వీరు చీఫ్ హసన్ నస్రల్లా, హిజ్బుల్లా దక్షిణ ఫ్రంట్ కమాండర్ అలీ కరాకి, బదర్ యూనిట్ హెడ్ అబూ అలీ. వీరికి కూడా త్వరలోని అంతం చేస్తామని తెలిపింది.ఆర్మీ చీఫ్ సూచన..మరోవైపు ఇజ్రాయెల్ లెబనాన్‌లో భూతల దాడులకు సిద్ధవుతోంది. ఇజ్రాయెల్ ఆర్మీ చీఫ్ ఈ మేరకు సన్నద్ధం కావాలని తమ బలగాలకు సూచించారు. ఇజ్రాయెల్ ఉత్తర సరిహద్దులో ప్రాంతాల్లో పర్యటించిన ఇజ్రాయెల్ ఆర్మీ చీఫ్ సరిహద్దుల్లో వైమానిక దాడులు చేసి ఐడీఎఫ్ బలగాలు లెబనాన్‌లోకి వెళ్లేందుకు మార్గం సుగమం చేస్తామన్నారు. హిజ్బుల్లా లక్ష్యంగా భూతల దాడులకు సిద్ధంగా ఉండాలని సేనలకు సూచించారు.⚡🚨Breaking; Last night on Hezbollah in the attacks of the Israeli Air Forcewas difficult The mistake of the organization was the thought ⚡that he could use the citizens' homes as a human shield to prevent Israel from defending itself. pic.twitter.com/FFmPFJFGfj— tzachi dado צחי דדו 🎗️ (@UsBnnxVURfS4lPJ) September 26, 2024ఇదిలా ఉండగా.. ఇజ్రాయెల్ తక్షణమే కాల్పులు విరమణ పాటించాలని పలు దేశాలు హెచ్చరిస్తున్నాయి. అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, సౌదీ అరేబియా, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కొన్ని ఇతర భాగస్వామ్య దేశాలు ఇజ్రాయెల్ తక్షణమే 21 రోజుల కాల్పుల విరమణ చేపట్టాలని పిలుపునిచ్చాయి. ఇక, హిజ్బుల్లాకు ప్రధాన మద్దతు దేశమైన ఇరాన్.. ఇజ్రాయెల్ దాడులను ఖండించింది. వెంటనే కాల్పులను ఆపివేయాలని డిమాండ్ చేసింది. 51 మంది మృతిఇదిలా ఉండగా బుధవారం లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు కొనసాగించింది. ఈ ఘనటలో 51 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 223 మందికి తీవ్రంగా గాయాలైనట్లు లెబనాన్ ఆరోగ్య శాఖ తెలిపింది. గత రెండు రోజులతో కలిపి మొత్తంగా 564 మంది ప్రాణాలు కోల్పోగా, 1800 మందికి గాయాలైనట్లు వెల్లడించింది. మృతుల్లో 150 మంది మహిళలు, చిన్నారులే ఉన్నట్లు పేర్కొంది.భారత్ అలర్ట్..ఈ పరిణామాల నేపథ్యంలో లెబనాన్‌లో ఉంటున్న తమ పౌరులను భారత్ అప్రమత్తం చేసింది. తక్షణం అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది. లెబనాన్‌కు ఇపుడు ఎవరూ రాకూడదని స్పష్టంచేసింది. Embassy of India in Beirut tweets, "As a reiteration of the Advisory issued on 1 August 2024 and in view of the recent developments and escalations in the region, Indian nationals are strongly advised against travelling to Lebanon till further notice. All Indian nationals already… pic.twitter.com/kpvhiuGN3N— ANI (@ANI) September 25, 2024 ఇది కూడా చదవండి: న్యూక్లియర్ వార్‌కు సిద్ధం.. పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్ -
మా యుద్ధం హెజ్బొల్లాతోనే.. మీతో కాదు!
Israel–Hezbollah Conflict Latest News: ఇజ్రాయెల్ దాడులతో లెబనాన్ రక్తమోడుతోంది. సోమవారం అర్ధరాత్రి దాకా జరిగిన దాడిలో.. వంద మందికి పైగా చిన్నారులు, మహిళలు సహా మొత్తం 500 మంది మరణించారు. రెండు వేల మంది దాకా గాయాలపాలయ్యారు. అక్టోబర్ 7న గాజా సంక్షోభం మొదలయ్యాక.. ఇజ్రాయెల్ జరిపిన అతిపెద్ద దాడి ఇదే కావడం గమనార్హం.ఇరాన్ మద్దతు ఉన్న హెజ్బొల్లా సంస్థ లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకర దాడులకు దిగింది. లెబనాన్‌లోని 300కు పైగా లక్ష్యాలపై దాడులు జరిపినట్లు ఇజ్రాయెల్ ఆర్మీ(IDF) ప్రకటించుకుంది. పైగా ఈ దాడుల గురించి దక్షిణ లెబనాన్ వాసులను ఆర్మీ ముందుగానే హెచ్చరించడం గమనార్హం.‘‘ముప్పు మాదాకా(ఇజ్రాయెల్) చేరడాని కంటే ముందు.. మా సత్తా ఏంటో చూపిస్తాం’’ అని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ప్రకటించారు. లెబనాన్ ప్రజలను ఉద్దేశించి ఈ మేరకు ఆయన ఓ సందేశం విడుదల చేశారు. ‘‘లెబనాన్ ప్రజల్లారా.. మా యుద్ధం మీతో కాదు. మా యుద్ధం హెజ్బొల్లాతో. ఆ సంస్థ చాలాకాలంగా మిమ్మల్ని రక్షణ కవచంలా ఉపయోగించుకుంటోంది. మీరు ఉండే ఆవాసాల్లోనే ఆయుధాలను దాస్తోంది. హెజ్బొల్లా మా నగరాలను, ప్రజలనే లక్షంగా చేసుకుని దాడులు చేస్తోంది. దీనికి ప్రతిగానే మేం వాళ్లపై దాడులు చేస్తూ.. ఆ ఆయుధాలను స్వాధీనం చేసుకుంటున్నాం’’ అని ఓ సందేశం విడుదల చేశారు. Message for the people of Lebanon: pic.twitter.com/gNVNLUlvjm— Benjamin Netanyahu - בנימין נתניהו (@netanyahu) September 23, 2024హెజ్బొల్లా స్థావరాలు, ఆయుధ డిపోలు, ఇతర మౌలిక వసతులకు, భవనాలకు సమీపంలో ఉండే పౌరులు తక్షణమే ఖాళీ చేయాల్సిందిగా నెతన్యాహు కోరారు. ‘‘వచ్చే రోజుల్లో పరిస్థితులు మరింత క్లిష్టతరం కానున్నాయి. సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లి మీరు మీ ప్రాణాలను రక్షించుకోండి. మా ఆపరేషన్ ముగిశాక.. మళ్లీ మీ నివాసాలకు తిరిగి వెళ్లొచ్చు’’ అని లెబనాన్ ప్రజలను ఉద్దేశించి ఆయన పేర్కొన్నారుఇక.. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్, ఇజ్రాయెల్‌కు హెచ్చరికలు జారీ చేశారు. మిడిల్ ఈస్ట్ మొత్తాన్ని యుద్ధంలోకి లాగొద్దని ఆయన నెతన్యాహూను ఉద్దేశించి హితవు పలికారు.ఇజ్రాయెల్ ఆర్మీ, హెజ్బొల్లా మిలిటెంట్ల మధ్య దాడులు, ప్రతిదాడులు కొనసాగుతున్నాయి. ఇవి మరింత ముదిరి తీవ్ర యుద్ధానికి దారి తీసే ప్రమాదముందని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. దక్షిణ లెబనాన్ మరో గాజా అయ్యే ప్రమాదం ఉందని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ హెచ్చరిస్తున్నారు. అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాల జోక్యంతోనైనా పరిస్థితులు చల్లబడాలని ఆయన కోరుకుంటున్నారు. గతేడాదే మొదలైంది..కిందటి ఏడాది జులైలో హెజ్బొల్లా టాప్ కమాండర్ ఫౌద్ షుక్రును ఇజ్రాయెల్ మట్టుబెట్టింది. దానికి ప్రతీకారంగా ఆగష్టు నుంచి వీలు చిక్కినప్పుడల్లా రాకెట్లు, డ్రోన్లతో ఇజ్రాయెల్ సరిహద్దులో హెజ్బొల్లా విరుచుకుపడుతోంది. తాజాగా.. లెబనాన్‌లో పేజర్లు, వాకీటాకీలు పేలిపోయి 37 మంది చనిపోగా.. వేల మంది గాయపడ్డారు. శుక్రవారం లెబనాన్ రాజధాని బీరుట్‌పై ఇజ్రాయెల్ జరిపిన క్షిపణి దాడిలో హెజ్బొల్లా టాప్ కమాండర్లు సహా 45 మంది చనిపోయారు. తమ పౌరులను లక్ష్యంగా చేసుకునే ఇజ్రాయెల్.. ఆ దేశ భద్రతా ఏజెన్సీ మోస్సాద్ ఈ దాడులకు దిగాయని లెబనాన్ ఆరోపించింది. ఈ పరిణామం ప్రతీకారంగా ఆదివారం హెజ్బొల్లా సరిహద్దులకు సుదూరంగా ఉన్న హైఫాలోని రఫేల్ డిఫెన్స్ సంస్థతోపాటు వివిధ లక్ష్యాలపైకి 150 వరకు రాకెట్లను ప్రయోగించింది. కిందటి ఏడాది నుంచి ఇప్పటిదాకా.. హెజ్బొల్లా, ఇజ్రాయెల్ ఆర్మీ మధ్య జరుగుతున్న పోరులో కనీసం 600 మంది చనిపోయారు.హెజ్బొల్లా లక్ష్యంగా ఐడీఎఫ్ ‘ఆపరేషన్ నార్తన్ ఆరోస్’ కొనసాగిస్తోంది. తీవ్ర దాడుల నేపథ్యంలో ప్రజలు పెద్ద సంఖ్యలో మూటాముల్లె సర్దుకుని అందుబాటులో ఉన్న వాహనాల్లో బీరుట్ దిశగా బయలుదేరారు. దీంతో, తీరప్రాంత సిడొన్ నగరంలో ట్రాఫిక్ స్తంభించింది. 2006లో ఇజ్రాయెల్– హెజ్బొల్లా మధ్య యుద్ధంగా జరిగాక ఇంత భారీగా జనం వలసబాట పట్టడం ఇదే మొదటిసారని పరిశీలకులు అంటున్నారు. ఈ పరిస్థితుల్లో కళాశాలలు, పాఠశాలలను తెరిచి ఉంచాల్సిందిగా లెబనాన్ హోం శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఇళ్లు వదిలేసి భారీగా వలస వస్తున్న ప్రజలకు పాఠశాల భవనాల్లో ఆశ్రయం కల్పించాలని కోరింది.దాడులు మరింత తీవ్రంరాకెట్ లాంఛర్లు తదితరాలతో సరిహద్దులకు దగ్గర్లోని దక్షిణ ప్రాంతాన్ని మిలిటరీ స్థావరాలుగా హెజ్బొల్లా మార్చేసిందని ఇజ్రాయెల్ ఆరోపించింది. అందుకే భారీగా బాంబు దాడులు చేయక తప్పడం లేదంది. హెజ్బొల్లాను నిలువరించేందుకు వైమానిక దాడులపై తమ దృష్టంతా ఉందని పేర్కొంది. దక్షిణ లెబనాన్‌లోని 17 గ్రామాలు, పట్టణాల మ్యాప్‌ను విడుదల చేసింది. ఆపరేషన్లను మరింత విస్తరించనున్నట్లు ప్రకటించింది. ఇదీ చదవండి: వీళ్ల వైరం ఏనాటిదంటే..! -
హిజ్బుల్లాకు ఇజ్రాయెల్ ప్రధాని హెచ్చరిక
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు హిజ్బుల్లాకు హెచ్చరించారు. హిజ్బుల్లాకు పట్టున్న ప్రాంతాలుగా పరిగణించే బీకా వ్యాలీ, దక్షిణ లెబనాన్, బీరూట్ దక్షిణ శివారు ప్రాంతాల్లో హిజ్బుల్లా గ్రూప్‌పై ఇజ్రాయెల్ దాడి చేసింది.ఈ దాడిపై నెతన్యాహు మాట్లాడుతూ.. హిజ్బుల్లాను ఊహించలేని విధంగా దెబ్బ కొట్టాం. హిజ్బుల్లాకి ఇప్పటికీ అర్థం గాకపోతే.. త్వరలోనే అర్థం చేసుకుంటుందని అని అన్నారు. శనివారం ఇజ్రాయెల్ 290 హిజ్బుల్లా లక్ష్యాలపై దాడులు చేసింది. అంతకు ముందు శుక్రవారం బీరుట్ శివారులో చేసిన దాడుల్లో పదుల సంఖ్యలో హిజ్బుల్లా కమాండర్లు ప్రాణాలు కోల్పోయారు. కాగా, హిజ్బుల్లా దళాలు వినియోగించే పేజర్లు, వాకీటాకీలు పేలడంతో ఉద్రిక్తతలకు దారి తీసింది. తమ కమ్యూనికేషన్ కోసం వినియోగించే పేజర్లు, వాకీటాకీలను ఇజ్రాయెల్ పేల్చిందని హిజ్బుల్లా ఆరోపిస్తుంది. చదవండి : కిమ్ కర్కశత్వం.. ఇద్దరు మహిళలకు ఉరిశిక్ష -
భగ్గుమన్న ఇజ్రాయెల్.. ప్రధాని నెతన్యాహూ క్షమాపణలు
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తన దేశ ప్రజలకు క్షమాపణ చెప్పారు. గాజాలోని సొరంగంలో లభ్యమైన ఆరుగురు ఇజ్రాయెల్ బందీలను సురక్షితంగా తిరిగి తీసుకురావడంలో విఫలమైనందుకు బెంజమిన్ సోమవారం క్షమాపణలు కోరారు. ‘బందీలను సజీవంగా తిరిగి తీసుకురానందుకు నేను మిమ్మల్ని క్షమించమని అడుగుతున్నాను. మేము ప్రయత్నించాం కానీవిజయం సాధించలేదు. దీనికి హమాస్ చాలా భారీ మూల్యం చెల్లించవలసి ఉంటుంది.’ అని నెతన్యాహు విలేకరుల సమావేశంలో చెప్పారు.కాగా శనివారం గాజాలోని రఫా ప్రాతంలోని భూగర్భ సొరంగంలో ఆరుగురు ఇజ్రాయిల్ బందీల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్టు ఆదేశ సైన్యం ప్రకటించిన విషయం తెలిసిందే.మృతదేహాలు గాజా సరిహద్దు సమీపంలోని కిబ్బట్జ్ కమ్యూనిటీకి చెందిన కార్మెల్ గాట్, ఈడెన్ యెరుషల్మి, అల్మోగ్ సరుసి, ఒరి డానినో, యుఎస్-ఇజ్రాయెలీ హెర్ష్ గోల్డ్బెర్గ్-పోలిన్, రష్యన్-ఇజ్రాయెలీ అలెగ్జాండర్ లోబనోవ్గా గుర్తించారు. వీరిని అక్టోబర్ 7న మ్యూజిక్ ఫెస్టివల్ నుంచి కిడ్నాప్ చేసిన హమాస్ ఉగ్రవాదులు బందీలుగా చేశారు.హమాస్ చెరలోని ఆరుగురు బందీల మృతదేహాలు రఫాలోని ఓ సొరంగంలో లభ్యం కావడంతో నెతన్యాహు ప్రభుత్వంపై ఇజ్రాయెల్ వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం పెల్లుబుకుతోంది. ప్రధానికి వ్యతిరేకంగా సోమవారం ఇజ్రాయెల్‌లో భారీ ప్రదర్శనలు జరిగాయి. కాల్పుల విరమణకు అంగీకరించాలని, హమాస్ చెరలోని బందీలను సురక్షితంగా రప్పించాలని డిమాండ్ చేస్తూ టెల్ అవీవ్ వీధుల్లో ఆందోళనకారులు కదం తొక్కారు. తమ ఆప్తులు 11నెలల నుంచి బందీలుగా ఉన్నప్పటికీ వారిని వెనక్కు తేవడంలో నెతన్యాహు విఫలమయ్యారంటూ ఆరోపించారు.ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్న పాలస్తీనా ఖైదీలకు బదులుగా హమాస్ వద్ద బందీలుగా ఉన్నవారిని విడుదల చేసేలా కాల్పుల విరమణ ఒప్పందం కుదిర్చేందుకు అమెరికా, ఈజిప్ట్, ఖతార్‌కు చెందిన మధ్యవర్తులు ప్రయత్నిస్తున్నారు. అయితే కాల్పుల విరమణ ఒప్పందం కుదరకపోవడానికి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుయే కారణమన్న కోణంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వ్యాఖ్యానించారు. ఆయన మాట్లాడుతూ.. హమాస్‌తో బందీల విడుదల ఒప్పందం, కాల్పుల విరమణ కోసం నెతన్యాహు తగినంతగా పనిచేయడం లేదని అన్నారు. -
ఇజ్రాయెల్‌లో సార్వత్రిక సమ్మె
టెల్ అవీవ్: హమాస్ చెరలో ఉన్న ఆరుగురు బందీల దారుణ హత్యపై ఇజ్రాయెలీలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. బందీలను సురక్షితంగా విడిపించడంలో బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వం విఫలమైందంటూ సోమవారం ఇజ్రాయెల్ వ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరిగింది. కారి్మక సంఘాల పిలుపు మేరకు బ్యాంకులు, ఆరోగ్య విభాగాలు, రవాణా సంస్థలు సహా చాలా వరకు మూతబడ్డాయి. కొన్ని ప్రాంతాల్లోని స్కూళ్లు కొద్దిసేపు మాత్రమే పనిచేశాయి. ప్రధానమైన బెన్ గురియెన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉదయం 8–10 గంటల మధ్య టేకాఫ్ సేవలు నిలిచిపోయాయి. వేలాదిగా పౌరులు వీధుల్లోకి వచ్చారు. టెల్అవీవ్తోపాటు దేశవ్యాప్తంగా జరిగిన ర్యాలీల్లో కనీసం 5 లక్షల మంది పాలుపంచుకున్నారు. హమాస్‌తో ఒప్పందం కుదుర్చుకున్న పక్షంలో వారంతా సురక్షితంగా వెనక్కి వచ్చి ఉండేవారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికీ బందీలుగా ఉన్న 100 మందిని వెనక్కి తీసుకువచ్చేందుకు వెంటనే హమాస్‌తో ఒప్పందం చేసుకోవాలన్నారు. అయితే, సమ్మె రాజకీయ ప్రేరేపితమంటూ ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై కారి్మక న్యాయస్థానం సానుకూలంగా స్పందించింది. సమ్మెను మధ్యాహ్నం 2.30 గంటలకల్లా ముగించాలని స్పష్టం చేసింది. కోర్టు నిర్ణయాన్ని శిరసావహిస్తామని దేశంలోని అతిపెద్ద కారి్మక సంఘం హిస్ట్రాదుట్ నేత అర్నాన్ బ్రార్ డేవిడ్ తెలిపారు. తమ వారిని వెంటనే విధుల్లోకి చేరాలని కోరారు. సమ్మె కారణంగా ప్రధాన సేవలకు అంతరాయం ఏర్పడలేదని వివరించారు. ఒప్పందానికి నెతన్యాహు సానుకూలంగా లేరు: బైడెన్ ఇజ్రాయెల్‌లో పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హమాస్‌తో ఒప్పందం కుదుర్చుకుని, బందీలను సురక్షితంగా వెనక్కి తీసుకువచ్చేందుకు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఆసక్తి చూపడం లేదన్నారు. హమాస్, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంపై సలహాదారులతో వైట్‌హౌస్‌లో జరిగిన సమావేశానికి హాజరైన అధ్యక్షుడు బైడెన్ మీడియాతో మాట్లాడారు. కాల్పుల విరమణ ఒప్పందానికి అతి చేరువలో ఉన్నామన్నారు. -
నెతన్యాహు తగినంత కృషి చేయటం లేదు: బైడెన్
న్యూయార్క్: ఆరుగరు బంధీలను మిలిటెంట్ సంస్థ హమాస్ హత్య చేయటంపై ప్రధాని నెతన్యాహుకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్‌లో దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఎయిర్‌పోర్టులు, ఆస్పత్రులు, బ్యాంకుల్లో సిబ్బంది సమ్మె చేస్తున్నారు. కాల్పులు విరమణకు ప్రధాని నెతన్యాహు ఒప్పుకోవాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా అమెరికా అధ్యక్షడు జో బైడెన్ సైతం నెతన్యాహు వ్యవహిస్తున్న తీరుపై అసహనం వ్యక్తం చేశారు. గాజాలో హమాస్ చెరలో ఉన్న ఇజ్రాయెల్ బందీల విడుదల, కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి తుది ఒప్పందం చాలా దగ్గరలో ఉందని అన్నారు. అయితే ఈ ఒప్పందంలో విషయంలో నెతన్యాహు మాత్రం తగినంత కృషి చేయటం లేదని బైడెన్ ఆరోపణలు చేశారు.చదవండి: గాజా సొరంగంలో ఇజ్రాయెల్ బంధీల మృతదేహాలు -
హెజ్బొల్లా Vs ఇజ్రాయెల్.. తెరపైకి డేంజరస్ ‘కత్యూషా’
జెరూసలేం: పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇజ్రాయెల్, లెబనాన్‌లోని హెజ్బొల్లా మిలిటెంట్ గ్రూపు మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఇక, తాజా పరిణామాల నేపథ్యంలో ఇజ్రాయెల్‌లో 48 గంటల పాటు దేశవ్యాప్త ఎమర్జెన్సీ విధించారు. దాదాపు వందల సంఖ్యలో రాకెట్లు ఇజ్రాయెల్‌వైపు దూసుకెళ్లాయి.కాగా, గత నెలలో తమ టాప్ కమాండర్ హత్యకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ భూభాగంపైకి వందలాది సంఖ్యలో రాకెట్లు, డ్రోన్లను ప్రయోగించినట్టు హెజ్బొల్లా గ్రూపు ప్రకటించింది. ఉత్తర ఇజ్రాయెల్, గోలన్ హైట్స్‌లోని ఆ దేశ సైనిక స్థావరాలు, ఐరన్ డోమ్ లక్ష్యంగా చేసుకొని 320 కత్యూషా రాకెట్లు, భారీ సంఖ్యలో డ్రోన్లను హిజ్బొల్లా ప్రయోగించింది. ఈ సందర్భంగా తమ నేత హత్యకు ప్రతీకారంగా మొదటి దశ దాడులను ముగించినట్టు హిజ్బొల్లా చెప్పుకొచ్చింది. అలాగే, భవిష్యత్ కాలంలో మరిన్ని తీవ్రమైన దాడులు ఉంటాయని హెచ్చరించింది. Today in Tel Aviv we were supposed to wake up to thousands of murdered children in blood soaked sheets. 7.10 Again. Satellite images showed rocket launchers moving into place. So we struck first. 100 IAF planes took to the sky and destroyed the missiles.Never Again is Now. pic.twitter.com/Vq4A3xxwWl— Rachel Gur (@RachelGur) August 25, 2024 మరోవైపు.. హెజ్బొల్లా దాడులను అడ్డుకొనేందుకు దక్షిణ లెబనాన్‌లోని వేలాది రాకెట్ లాంచర్లను లక్ష్యంగా చేసుకొని దాదాపు 100 యుద్ధ విమానాలు వైమానిక దాడులు చేశాయని ఇజ్రాయెల్ పేర్కొన్నది. ఇక, కేవలం సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు చేసినట్టు హెజ్బొల్లా గ్రూపు, ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించాయి. ఇజ్రాయెల్ దాడుల్లో ముగ్గురు మరణించారని, ఇద్దరికి గాయాలయ్యాయని లెబనాన్ అధికారులు పేర్కొనగా, స్వల్ప నష్టం జరిగినట్టు అంచనా వేస్తున్నామని ఇజ్రాయెల్ సైనిక అధికార ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. కాగా, హెజ్బొల్లా వద్ద దాదాపు 1,50,000 రాకెట్లు ఉన్నాయని, ఇజ్రాయెల్‌లోని అన్ని ప్రాంతాలపై దాడులు చేయగల సామర్థ్యం ఆ గ్రూపునకు ఉన్నదని ఒక అంచనా. The Iron Dome in Action — Saving Countless LivesIn parallel, the IDF has launched a series of calculated preemptive strikes, targeting Hezbollah’s long-range missile sites deep within Lebanon. These strikes are not just military maneuvers but a strategic effort to prevent a… pic.twitter.com/6U7zPKVTJC— Ian Ségal ✍🏻 (@segalian) August 25, 2024 హిజ్బొల్లా దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్బంగా నెతన్యాహు మాట్లాడుతూ.. మా దేశాన్ని రక్షించుకొనేందుకు అన్ని చర్యలు తీసుకొంటాం. మాపై ఎవరు దాడి చేస్తారో, వారిపై మేం దాడి చేస్తాం. ఉత్తర ఇజ్రాయెల్‌పైకి ప్రయోగించిన వేలాది రాకెట్లను సైన్యం అడ్డుకొన్నదని ఆయన పేర్కొన్నారు. సైన్యం సూచనలను పాటించాలని పౌరులను కోరారు. హెజ్బొల్లా వద్ద డేంజరస్ ‘కత్యూషా’హెజ్బొల్లా వద్ద రాద్, ఫజర్, జిల్జాల్ మోడల్ రాకెట్లు ఉన్నాయి. వీటిలో శక్తిమంతమైన పేలోడ్లు ఉన్నాయి. ఇవి కత్యూషా క్షిపణుల కన్నా ఎక్కువ దూరం ప్రయాణించగలవు. ఇక, హెజ్బొల్లా గ్రూపు అమ్ములపొదిలో ‘కత్యూషా’ అనేది ప్రధాన ఆయుధంగా ఉన్నది. ఆదివారం నాటి ఘర్షణల్లో వీటికి చెందిన 300 రాకెట్లను ఇజ్రాయెల్‌పైకి ప్రయోగించినట్లు అంచనా.రెండో ప్రపంచ యుద్ధ సమయంలో సోవియట్లు దీన్ని తయారు చేశారు. కత్యూషా రాకెట్లు భారీ వార్హెడ్లను సుదూర లక్ష్యాలపైకి ప్రయోగించగలవు. ఏకకాలంలో వందల సంఖ్యలో వీటిని ప్రయోగించే అవకాశం ఉండటంతో శత్రు లక్ష్యాలను నాశనం చేయగలవు. వీటిని కొన్ని రకాల రహస్య లాంచర్లపై ఉంచి గుర్తు తెలియని ప్రదేశాల నుంచి హెజ్బొల్లా ప్రయోగిస్తుంది. 2006లో లెబనాన్ యుద్ధంలో వీటిని భారీ ఎత్తున వినియోగించారు. -
కాల్పుల విరమణ: బైడెన్ వ్యాఖ్యలను ఖండించిన హమాస్
న్యూయార్క్: ఇజ్రాయెల్-గాజా కాల్పుల విరమణ ఒప్పందం విషయంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చేసిన వ్యాఖ్యలను హమాస్ తీవ్రంగా ఖండించింది. ఆయన చేసిన వ్యాఖ్యలు పూర్తిగా తప్పుదారి పట్టించేలా ఉన్నాయని మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొంది. సోమవారం చికాగోలో జరిగిన డెమొక్రాటిక్ నేషనల్ కన్వెన్షన్ సమావేశం అనంతరం ఎయిర్‌పోర్టులో బైడెన్ మీడియాతో మాట్లాడారు. ‘‘ఇజ్రాయెల్-గాజా కాల్పుల విరమణ ఒప్పందం నుంచి పాలస్తీనా( హమాస్) ఎనక్కి తగ్గుతోంది.కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ ఒప్పుకుంది. ఒప్పందం కోసం సిద్ధంగా ఉంది. అయితే ప్రస్తుతం ఈ ఒప్పందంపై హమాస్ వెనక్కి తగ్గుతున్నట్లు తెలుస్తోంది. ఏం జరగుతుందో చూద్దాం. ఈ కాల్పుల విరమణ కోసం ప్రయత్నాలు చేస్తున్నాం’’ అని అన్నారు. అయితే బైడెన్ చేసిన వ్యాఖ్యలు వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించటం లేదని హమాస్ తెలిపింది. అదేవిధంగా తమకు జూలై 2న సమర్పించిన ఒప్పంద ప్రతిపాదన ఇటీవలి కొత్త ప్రతిపాదనకు చాలా విరుద్దంగా ఉంది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కొత్త షరతులు, గాజా పట్ల నేర ప్రణాళికకు అమెరికా అంగీకరిస్తున్నట్లు తెలుస్తోందని పేర్కొంది. బైడెన్ చేసిన వ్యాఖ్యలు తప్పుదారి పెట్టించేలా ఉన్నాయని తెలిపింది. మరోవైపు.. కాల్పుల విరమణ, బంధీల విడుదలకు సంబంధించి విభేదాలు తలెత్తకుండా అమెరికా విదేశాంగ మంత్రి అంటోని బ్లింకెన్ చర్చల కోసం కసరత్తు చేస్తున్నారు. -
ఇజ్రాయెల్‌పై ఏ క్షణమైనా ఇరాన్ దాడి!
హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియా హత్య అనంతరం మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు తారస్థాయికి చేరుకున్నాయి. లెబనాన్‌కు చెందిన షియా ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ ‘హెజ్బొల్లా’ ఆదివారం ఇజ్రాయెల్‌పై రాకెట్ల వర్షం కురిపించింది. దీంతో మొషావ్ బీట్ హిల్లెల్ ప్రాంతంలో పలువురు పౌరులు గాయపడ్డారు. మరోవైపు ఇరాన్ కూడా ఇవాళ ఇజ్రాయెల్‌పై భీకర దాడులకు దిగొచ్చని అక్కడి స్థానిక మీడియా ఓ నివేదికలో వెల్లడించింది. ఇజ్రాయెల్‌పై ఏ సమయంలోనైనా ఇరాన్ దాడికి దిగనుందని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ జీ-7 దేశాలకు ముందస్తు హెచ్చరికలు ఇచ్చారని పేర్కొంది. ఇక.. ఇజ్రాయెల్‌కు అండగా నిలిచేందుకు అమెరికా సైన్యం ఇప్పటికే రంగంలోకి దిగింది. ఇజ్రాయెల్‌పై దాడిని ఎదుర్కొవడానికి ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇరాన్‌పై ముందస్తు దాడికి సైతం సిద్ధమైనట్లు ఇజ్రాయెల్ మీడియా పేర్కొంది. ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు మొస్సాద్ చిఫ్ డేవిడ్ బర్నియా, రక్షణ మంత్రి యోవ్ గల్లంట్, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ( ఐడీఎఫ్) హెర్జి హలేవిలతో ప్రధాని నెతన్యాహు ఆదివారం సమావేశమై చర్చించినట్లు తెలిపింది. మరోవైపు.. ఇరాన్ చేసే దాడిని ఎదుర్కొవడానికి ఇజ్రాయెల్ సిద్ధంగా ఉందని, తాము తిరిగి గట్టి సమాధానం ఇస్తామని ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆదివారం ప్రకటించారు. జెరూసలేంలోని ప్రధాన మంత్రి కార్యాలయంలో నిర్వహించిన వార్ కేబినెట్ ఆయన మాట్లాడారు. ‘ఇరాన్ దాడికి దిగితే ఎదుర్కొవడానికి సిద్దంగా ఉన్నాం. ఇరాన్ దాడులకు గట్టిగా బదులు ఇస్తాం. మాపై దాడులు చేసే వారు భారీ మూల్యం చెల్లించుకుంటారు’అని హెచ్చరించారు. -
ఇజ్రాయెల్ ప్రధానికి జో బైడెన్ వార్నింగ్!
హమాస్ మిలిటెంట్ గ్రూప్ చీఫ్ ఇస్మాయిల్ హనియేను వైమానిక దాడితో హత్య చేసిన నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. గురువారం జరిగిన ఇరువురి నేతల ఫోన్ సంభాషణలో జో బైడెన్ మాట్లాడుతూ.. ఘాటుగా హెచ్చరించినట్లు ఇజ్రాయెల్‌కు చెందిన స్థానిక ‘చానెల్ 12’వెల్లడించింది. హమాస్‌తో కాల్పుల విరమణ ఒప్పందంపై ఇజ్రాయెల్ చర్చలు జరుపుతోందని, చర్చలను పునఃప్రారంభించడానికి త్వరలో ప్రతినిధి బృందాన్ని పంపుతామని నెతన్యాహు అధ్యక్షుడు బైడెన్‌కు తెలియజేసే సందర్భంలో ఆయన ఘటుగా స్పందించినట్లు సమాచారం. ఇరాన్, హమాస్ విషయంలో దాడులకు తెగబడి తర్వాత తనను అందులో జోక్యం చేయవద్దని బైడెన్ నెతన్యాహును హెచ్చరించారు. అమెరికా అధ్యక్షుడిని తేలికగా తీసుకోవద్దని వార్నింగ్ ఇచ్చినట్లు ‘చానెల్ 12’ నివేదిక పేర్కొంది.అయతే ఈ నివేదికలపై ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కార్యాలయం స్పందించింది. ‘ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు అమెరికా రాజకీయాల్లో జోక్యం చేసుకోరు. అమెరికాలో ఎవరు అధ్యక్షుడిగా ఎన్నికైన వారితో కలిసి పని చేస్తారు. అలాగే ఇజ్రాయెల్ రాజకీయాలలో అమెరికన్లు జోక్యం చేసుకోకూడదని ఆయన ఆశిస్తున్నారు’అని ఒక ప్రకటన విడుదల చేసింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి జోబైడెన్ వైదొలగుతున్నట్లు తీసుకున్న నిర్ణయం అనంతరం ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇరాన్‌పై కఠినమైన చర్యలు తీసుకోవడానికి ధైర్యం చూపిస్త్ననారని ఇజ్రాయెల్ సీనియర్ అధికారి తెలిపారు. మరోవైపు.. హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియె హత్య, అందుకు దీటైన ప్రతీకారం తప్పదన్న ఇరాన్ హెచ్చరికలతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఈ క్రమంలో ఇజ్రాయెల్‌పై ఇరాన్ దూకుడు చర్యలకు దిగితే అడ్డుకునేందుకు అమెరికా అదనపు యుద్ధ నౌకలు, బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ క్రూయిజర్లు, డిస్ట్రాయర్లు, ఎఫ్–22 ఫైటర్ జెట్ స్క్వాడ్రన్‌ను మధ్యప్రాచ్యానికి తరలిస్తోంది. పసిఫిక్ సముద్రంలో ఉన్న విమానవాహక నౌక యూఎస్ఎస్ అబ్రహం లింకన్‌ను కూడా తరలించాల్సిందిగా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ ఆదేశించారు. -
హిజ్బుల్లాకు ఇజ్రాయెల్ ప్రధాని వార్నింగ్
ఇజ్రాయెల్ నియంత్రణలో ఉన్న గోలన్ హైట్స్ ప్రాంతంలో హిజ్బుల్లా మిలిటెంట్లు చేసిన రాకెట్ దాడిపై ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు స్పందిచారు. దాడులు తెగపడినందకు భారీ మూల్యం చెల్లించుకోవల్సి వస్తుందని హిజ్బుల్లా మిలిటెంట్లను హెచ్చరించారు. శనివారం హిజ్బుల్లా చేసిన రాకెట్ దాడిలో 11 మంది యువకులను మృతి చెందారు.‘‘ హిజ్బుల్లా చేసిన ఈ దాడిని ఇజ్రాయెల్ తగిన సమాధానం ఇవ్వకుండా ఉండదు. హిజ్బుల్లా కచ్చితంగా భారీ మూల్యం చెల్లిచుకోక తప్పదు’’ అని ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం నుంచి ఓ ప్రకటన వెలువడింది. అదేవిధంగా ఇజ్రాయెల్ సైన్యం ప్రతిస్పందనకు సిద్ధంగా ఉండాలని ప్రధాని నెతన్యాహు పేర్కొన్నట్లు తెలుస్తోంది.‘‘ శనివారం సాయంత్రం జరిగిన దాడితో హిజ్బుల్లా అసలు రూపం బయటపడింది. హిజ్బుల్లా ఫుడ్‌బాల్ ఆడుతున్న పిల్లలను టార్గెట్ చేసి దారుణంగా దాడి చేశారు’’ అని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్( ఐడీఎఫ్) అధికార ప్రతినిధి రియర్ అడ్మిరల్ డేనియల్ హగారి అన్నారు. ‘‘ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అథ్లెట్లు ఒలింపిక్స్‌లో పోటీ పడుతుండగా.. హిజ్బుల్లా మాత్రం ఇజ్రాయెల్ భవిష్యత్తు తరాల అథ్లెట్లపై దాడులు చేస్తోంది. గోలన్ హైట్స్‌లోని డ్రూజ్ గ్రామంలోని మజ్దాల్ షామ్స్‌లోని మైదానంలో ఫుట్‌బాల్ ఆడుతున్న యువకులపై హిజ్బుల్లా రాకెట్ దాడి చేసింది’ అని ఐడీఎఫ్ ‘ఎక్స్’లో ఆగ్రహం వ్యక్తం చేసింది. -
గాజాపై ఇజ్రాయెల్ దాడులు అనాగరికం: ప్రియాంకా గాంధీ
ఢిల్లీ: గాజాపై యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్‌పై కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా మండిపడ్డారు. గాజా విషయంలో ఇజ్రాయెల్ ప్రభుత్వ తీరును ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండించాలని ఆమె ఎక్స్ వేదికగా శుక్రవారం పిలుపునిచ్చారు.‘ఇజ్రాయెల్ పౌరులు కూడా హింస, ద్వేషాన్ని నమ్మరు. గాజాపై ఇజ్రాయెల్ దాడులను ప్రపంచంలోని అన్ని ప్రభుత్వాలు తీవ్రంగా ఖండించాలి. ఇది ప్రపంచంలోని ప్రతి ఒక్కరి నైతిక బాధ్యత. ఇజ్రాయెల్ చర్యలు ఆమోదించదగినవి కావు. గాజాలో జరుగుతున్న భయంకరమైన మారణహోమం అందరూ ఖండించాలి. గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు అనాగరికం. గాజాపై దాడులను ఇజ్రాయెల్ ప్రధాని అనాగారికత, నాగరికత మధ్య ఘర్షణ అని అంటున్నారు. కానీ, ఆయన, ఆయన ప్రభుత్వమే చాలా అనాగరికమైంది’అని ప్రియాంకా గాంధీ అన్నారు.గత పది నెలల నుంచి హమాస్ మిలిటెంట్లను ఏరివేయటమే లక్ష్యంగా ఇజ్రాయెల్ గాజాపై యుద్దం చేస్తోంది. ఇప్పటివరకు 40 వేల మంది గాజా పౌరులు మృతి చెందారు. ప్రపంచంలోని పలు దేశాలు కాల్పుల విరమణ చేపట్టలాని కోరుతున్నా.. అమెరికా పర్యటనలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మాత్రం గాజాపై యుద్ధాన్ని సమర్ధించుకోవటం గమనార్హం. -
దాడులపై మౌనంగా ఉండలేను.. నెతన్యాహుకు కమలా హారీస్ హెచ్చరిక!
వాషింగ్టన్: అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారీస్, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజిమిన్ నెతన్యాహు మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. నెతన్యాహు గాజాతో శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని కమలా హారీస్ కోరారు. యుద్ధం కారణంగా సాధారణ ప్రజలు మృతిచెందుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.కాగా, ఇజ్రాయెల్ ప్రధాని నిన్న అమెరికాలో పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా అమెరికా కాంగ్రెస్‌ను ఉద్దేశించి క్యాపిటల్ హౌస్‌లో ప్రసంగించారు. ఈ క్రమంలో ఇజ్రాయెల్, అమెరికా మధ్య పరస్పర సహకారం ఉండాలని కోరారు. ఈ నేపథ్యంలో నెతన్యాహుతో కమలా హారీస్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కమలా హారీస్ మాట్లాడుతూ.. ఇజ్రాయెల్ దాడుల్లో భాగంగా గాజాలో జరిగిన ప్రాణనష్టంపై తనకు తీవ్ర ఆందోళన కలుగుతోందన్నారు. ఇదే సమయంలో గాజాతో శాంతి ఒప్పందాన్ని కుదర్చుకోవాలని కోరారు. గత తొమ్మిది నెలలుగా గాజాలో విధ్వంసకర పరిస్థితులు నెలకొన్నాయి. ఎంతో మంది చిన్న పిల్లలు సైతం మృతిచెందారు. సాధారణ పౌరులు ఆకలితో అలమటించిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అమాయక ప్రజలపై దాడులను తాము సీరియస్‌గా తీసుకుంటున్నామని చెప్పారు. దారుణాలకు చూస్తూ సైలెంట్‌గా ఉండబోమని హెచ్చరించారు. ఇక, గాజాకు మానవతాసాయం అందించేందుకు అనుమతించాలని నెతన్యాహును కోరారు. ఇక, అంతుకుముందు.. అమెరికా కాంగ్రెస్‌ను ఉద్దేశించి మాట్లాడిన నెతన్యాహు.. హమాస్‌పై పోరు కొనసాగుతుందని పునరుద్ఘాటించారు. తుది విజయం లభించే వరకు పోరు తప్పదంటూ ఆవేశంతో ప్రసంగించారు. ఈ తరుణంలో తాజా కమలా హారిస్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. Today, I had a frank and constructive meeting with Prime Minister Netanyahu about a wide range of issues, including my commitment to Israel’s security, the importance of addressing the humanitarian crisis in Gaza, and the urgent need to get the ceasefire and hostage deal done. pic.twitter.com/tgiSTPQJdL— Vice President Kamala Harris (@VP) July 26, 2024 అయితే, నెతన్యాహు అమెరికాలో పర్యటిస్తున్న సందర్భంగా పాలస్తీనా మద్దతుదారులు ఆయనకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. క్యాపిటల్ హౌస్ వద్ద ధర్నాలు చేశారు. క్రిమినల్ నెతన్యాహు అంటూ నినాదాలు చేశారు. గాజాపై దాడులు ఆపాలని డిమాండ్ చేశారు. దీంతో, క్యాపిటల్ హౌస్ వద్ద టెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. -
అమెరికాలో నెతన్యాహు పర్యటన.. క్యాపిటల్ హౌస్ వద్ద టెన్షన్!
వాషింగ్టన్: ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు.. అమెరికాలో పర్యటిస్తున్న వేళ నిరసనలు మిన్నంటాయి. నెతన్యాహుకు వ్యతిరేకంగా పాలస్తీనా మద్దతుదారులు నిరసనలకు దిగారు. దీంతో, పలుచోట్ల ఉద్రికత్తలు చోటుచేసుకున్నాయి.కాగా, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అమెరికా పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా అమెరికా కాంగ్రెస్‌ను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా సభలో నెతన్యాహు మాట్లాడుతూ.. ‘మనం కలిసి పనిచేస్తే గెలుస్తాం. వారు ఓడిపోతారు. ఇది జాతుల మధ్య యుద్ధం కాదు. మనం ప్రస్తుతం చరిత్ర నాలుగు రోడ్ల కూడలిలో ఉన్నాం. మన ప్రపంచం ఉపద్రవంలో ఉంది. అందుకే ఇజ్రాయెల్‌వైపు అమెరికా నిలవాలి. పశ్చిమాసియాలో ఇరాన్ ఉగ్రవాద చర్యలు అమెరికా, ఇజ్రాయెల్, అరబ్ స్నేహదేశాలకు ఇబ్బందికరంగా మారాయి. నా దేశాన్ని రక్షించుకునేందుకు, నా దేశ ప్రజల భవిష్యత్తుకు భరోసా ఇచ్చేందుకు ఇక్కడికి వచ్చా’ అని నెతన్యాహు పేర్కొన్నారు. ఇదే సమయంలో నెతన్యాహు పసుపు రంగు పిన్ ధరించి హమాస్ చేతిలో ఉన్న ఇజ్రాయెల్ బంధీలకు సంఘీభావం తెలిపాడు.అయితే, సభలో ఆయనకు తొలుత స్పీకర్ మైక్ జాన్సన్‌తోపాటు రిపబ్లికన్ సభ్యులు స్వాగతం పలికారు. ఆయన ప్రసంగం ప్రారంభించగానే లేచి నిల్చుని చప్పట్లతో అభినందించారు. 50 మంది డెమోక్రాట్లు, స్వత్రంత్ర సభ్యుడు బెర్నీ శాండర్స్.. నెతన్యాహు ప్రసంగాన్ని బహిష్కరించారు. ముందుగా నిర్ణయించిన కార్యక్రమాల కారణంగా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ఈ సమావేశానికి రాలేదు. కొంత మంది సభ్యులు గైర్హాజరయ్యారు. A man bravely removed the American flag from being set aflame by pro-Palestinian protestors. The crowd proceeded to yell “chase him.” pic.twitter.com/3QE4zMKYEy— Eyal Yakoby (@EYakoby) July 24, 2024ఇక, అమెరికాలో నెతన్యాహు పర్యటన సందర్భంగా పాలస్తీనా మద్దతుదారులు నిరసనలు తెలిపారు. క్యాపిటల్ హౌస్ వద్ద నెతన్యాహుకు వ్యతిరేకంగా ఫ్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేస్తూ ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నెతన్యాహు ఓ క్రిమినల్ అంటూ నినదించారు. మరోవైపు.. వాషింగ్టన్ డీసీలోని వాటర్‌గేట్ హోటల్లో నెతన్యాహు, అతడి భార్య, ప్రతినిధి బృందంతో కలిసి బస చేశారు. ఈ సందర్భంగా ఆ హోటల్ వద్దకు పలువురు పాలస్తీనా మద్దతుదారులు చేరుకొని నిరసన వ్యక్తం చేశారు. పలువురు ఎరుపు రంగు టీషర్టులు ధరించి నిరసనలో పాల్గొన్నారు.🚨🇮🇱🇺🇸 Protesters in Washington DC are now BURNING an effigy of Benjamin Netanyahu! pic.twitter.com/0RE8oYYqEm— The Saviour (@stairwayto3dom) July 24, 2024pic.twitter.com/3cOYomr7sj wow pro Palestine anti Americans stormed the capital today. This is why we need trump in the white house so things like this never happen again. Democrats hate us they proved that for 4 years when they helped illegals and Ukraine but never helped us at all— Trump 2024 MAGA 🇺🇲 (@VinnyPhilly) July 23, 2024ఇదే సమయంలో నెతన్యాహుపై కోపంతో వాటర్ గేట్ హోటల్లోని బ్యాంకెట్ టేబుల్, ఇతర అంతస్తుల్లో పాలస్తీనా యూత్ మూమెంట్‌కు చెందిన కొందరు వ్యక్తులు.. పురుగులు, మిడతలు వదిలినట్లు వీడియోలు బయటకు వచ్చాయి. పురుగులు వదిలిన టేబుల్‌పై ఇజ్రాయెల్, అమెరికా జాతీయ జెండాలు కనిపిస్తున్నాయి. దీంతో, ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. Gaza protesters have removed the American flags from Union Station, lit then on fire with a Netanyahu effigy and replaced them with Palestine flags. pic.twitter.com/c8hz90phqL— Andrew Leyden (@PenguinSix) July 24, 2024 The DC Palestinian Youth Movement released maggots and crickets were released throughout the Watergate Hotel where Netanyahu is staying. The protestors also pulled multiple fire alarms throughout the night. This is an utter security failure. pic.twitter.com/3O0XbOvoGx— Eyal Yakoby (@EYakoby) July 24, 2024 -
వెస్ట్ బ్యాంక్ జెనీన్పై ఇజ్రాయెల్ మెరుపు దాడులు..
జెరూసలేం: గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా వెస్ట్ బ్యాంక్ నగరం జెనిన్ ప్రాంతంపై ఇజ్రాయెల్ దాడుల కారణంగా ఏడుగురు పాలస్తీనియన్లు మరణించారు. ఇక, చనిపోయిన వారిలో ఇస్లామిక్ జిహాద్ ఉగ్రవాద సంస్థకు చెందిన వారే నలుగురు ఉన్నట్టు తెలుస్తోంది.కాగా, హమాస్ నిర్మూలనే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ జరిగిన వైమానిక దాడుల్లో ఏడుగురు పాలస్తీనియన్లు మృతిచెందినట్టు పాలస్తీనా అధికారులు వెల్లడించారు. అయితే, ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లోని సెటిల్మెంట్లలో దాదాపు 5,300 భవానాలను నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని ఇజ్రాయెల్ యాంటీ సెటిల్మెంట్ మానిటరింగ్ గ్రూప్ తెలిపిన మరుసటి రోజే ఇలా వైమానిక దాడులు జరిగాయని పాలస్తీనా పేర్కొంది. When one of the injured victims was taken from inside a house in the Al-Zahra`a neighborhood in the city of Jenin after he was shot by a zionist occupation sniper. pic.twitter.com/tfmUig7kc2— Jordan 🇮🇩🇵🇸 (@Mhmmd_Jordan) July 5, 2024ఇదిలా ఉండగా.. గాజాపై ఇజ్రాయెల్ దాడులు ప్రారంభమైన నాటి నుంచి వెస్ట్ బ్యాంక్ సిటీలో హింస చెలరేగింది. వెస్ట్ బ్యాంక్‌లో ఇజ్రాయెల్ కాల్పుల్లో 500 మంది పాలస్తీనియన్లు మరణించారని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇజ్రాయెల్ దాడులు, హింసాత్మక ఘటనల సమయంలో చాలా మంది మరణించారు. చనిపోయిన వారిలో యూదు వలసదారులే ఎక్కువగా ఉన్నట్టు పేర్కొంది. -
ఖాన్ యూనిస్‌ను వెంటనే ఖాళీ చేయండి.. ఇజ్రాయెల్ ఆర్మీ ఆదేశం
గాజాలో ఇజ్రాయెల్ సైన్యం భారీగా దాడులకు పాల్పడటానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దక్షిణ గాజాలోని రెండో అతిపెద్ద నగం అయిన ఖాన్ యూనిస్‌లో దాడుల స్థాయిని పెంచనున్నట్ల సమాచారం. ఈ మేరకు ఖాన్ యూనిస్‌లో ఉండే పాలస్తీనియన్లు వెంటనే ఖాళీ చేయాలని సోమవారం ఇజ్రాయెల్ ఆర్మీ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే చాలా మంది పాస్తీనియన్లు ఇతర ప్రాంతాకు తరలివెళ్తుతున్నారు. దీంతో ఖాన్ యూనిస్‌లోని యూరోపియన్ ఆస్పత్రిలోని పేషెంట్లను సైతం ఇతర ప్రాంతాలకు బలవంతంగా తరలిస్తున్నారు. గతవారం ఉత్తర గాజాలోని షెజాయా నగరంలో ప్రజలకును ఖాళీ చేయమన్న ఇజ్రాయెల్ ఆర్మీ.. ఐదో రోజు కూడా దాడులు కొనసాగిస్తోంది. మరోవైపు.. దక్షిణ రఫా ప్రాంతంలో జరిగన దాడుల్లో ఇజ్రాయెల్ సైనికుడు ఒకరు మృతి చెందాడు.హమాస్‌ను అంతం చేసే దశలో ఇజ్రాయెల్ పురోగతి సాధింస్తోందని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు అన్నాడు. అయితే ఇతర ప్రాంతాల్లో కూడా దాడుల తీవ్రత పెంచాలని ఆర్మీకి సూచించారు. అయితే ఈ నేపథ్యంలోనే ఖాన్ యూనిస్‌లో మళ్లీ దాడులకు ఇజ్రాయెల్ ఆర్మీ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ ఆర్మీ హమాస్ మిలిటెంట్లను అంతం చేయటంలో భాగంగా ఈ ఏడాది మొదట్లో ఖాన్ యూనిస్ నగరంపై ఇజ్రాయెల్ ఆర్మీ భీకర దాడులు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఇక్కడ ఉండే పాలస్తీనా ప్రజలు దక్షిణ గాజా నగరమైన రఫాకు తరలివెళ్లారు.అక్టోబర్ 7న హమాస్ బలగాలు ఇజ్రాయెల్‌పై చేసిన మెరుపు దాడిలో 1200 మృతి చెందగా.. 251 మందిని బంధీలుగా తీసుకువెళ్లారు. అప్పటి నుంచి ఇజ్రాయెల్ హామాస్‌ను అంతం చేయటమే లక్ష్యంగా గాజాపై విరచుకుపడుతూనే ఉంది. ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పవరకు 37,900 మంది పాలస్తీనా పౌరులు మృతి చెందారు.చదవండి: ట్రంప్ విషయంలో కోర్టు తీర్పు ఎంతో ప్రమాదకరం: బైడెన్ -
ఇజ్రాయెల్ Vs హమాస్.. నెతన్యాహు సంచలన ప్రకటన!
టెల్ అవీవ్: హమాస్ అంతమయ్యే వరకు గాజాలో యుద్ధాన్ని ఆపే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే గాజాలో పాక్షిక కాల్పుల విరమణ ఒప్పందానికి మాత్రమే తాము అనుకూలంగా ఉన్నట్టు చెప్పుకొచ్చారు. గాజాలో యుద్ధం దాదాపుగా ముగింపు దశలో ఉందన్నారు.కాగా, నెతన్యాహు తాజాగా ఇజ్రాయెల్ ఓ మీడియా ఛానెల్లో మాట్లాడుతూ.. గాజాలో శాశ్వత యుద్ధాన్ని నివారించే ఏ ప్రతిపాదనను తాము అంగీకరించబోము. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రతిపాదనలో భాగంగా బందీలు విడుదలకు ప్రతిగా పాక్షిక కాల్పులు విరమణ ఒప్పందానికి మాత్రమే కట్టుబడి ఉన్నాం. During a speech at the Knesset, Prime Minister Benjamin Netanyahu said that Israel is “committed to the Israeli proposal that President Biden endorsed” on Monday. pic.twitter.com/NGoVdercZw— Middle East Eye (@MiddleEastEye) June 25, 2024 హమాస్ అంతమయ్యే వరకు గాజాలో యుద్ధాన్ని ఆపే ప్రసక్తే లేదు. గాజాలో హమాస్‌పై యుద్ధం దాదాపు ముగింపునకు చేరుకుంది. త్వరలోనే ఇజ్రాయెల్ విజయం సాధిస్తుందన్నారు. హమాస్ వద్ద బంధీలుగా ఉన్న ఇజ్రాయెల్‌వాసులు సురక్షితంగా తిరిగి వచ్చే వరకు దాడులు జరుగుతూనే ఉంటాయన్నారు. అలాగే, గాజాలో పరిపాలనను కూడా పాలస్తీనా అథారిటీకి అప్పగించబోయేది లేదు. ప్రాంతీయంగా ఉన్న కొన్ని దేశాల సహకారంతో గాజాలో పాలన కొనసాగుతుందని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో మరో కీలక ప్రకటన కూడా చేశారు. ఇకపై తాము ఉత్తర సరిహద్దుల్లో లెబనాన్ మిలిటెంట్ సంస్థ హెజ్బొల్లాపై దృష్టి పెడతామని చెప్పారు. గాజాలో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి హమాస్‌కు మద్దతుగా లెబనాన్ సరిహద్దుల నుంచి ఉత్తర ఇజ్రాయెల్‌పై హెజ్బొల్లా దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల కాలంలో ఆ మిలిటెంట్ సంస్థ దాడులు ఎక్కువయ్యాయి. వాణిజ్యనౌకలపై హూతీల దాడులు ఆగడం లేదు. దీంతో వారిపై ఫోకస్ పెట్టినట్టు చెప్పుకొచ్చారు. -
వీడియో: ఇజ్రాయెల్ టార్గెట్ సక్సెస్.. హమాస్ కమాండర్ మృతి
జెరూసలేం: ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. హమాస్ నేతలను తుదముట్టించడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ సేనలు దాడులు జరుపుతున్నాయి. ఇక, తాజాగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ జరిపిన దాడుల్లో హమాస్ కీలక కమాండర్, స్నిపర్ అహ్మద్ అల్ సౌర్కాను అంతమొందించింది. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.వివరాల ప్రకారం.. హమాస్‌పై దాడుల్లో భాగంగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ మరోసారి పైచేయి సాధించింది. హమాస్ నుఖ్బా ఫోర్సెస్‌లో సీనియర్ నాయకుడు, కమాండర్ అహ్మద్ అల్ సౌర్కా టార్గెట్‌గా ఇజ్రాయెల్ దాడులు జరిపింది. ఈ దాడుల్లో అల్ సౌర్కా మరిణించాడు. ఈ మేరకు ఐడీఎఫ్ ఓ ప్రకటనలో పేర్కొంది. అలాగే, అతడిపై దాడికి సంబంధించిన వీడియోను కూడా విడుదల చేసింది. ఇక, ఐడీఎఫ్‌కు ఇజ్రాయెల్ సెక్యూరిటీ ఏజెన్సీ(ఐఎస్ఏ) నుంచి వచ్చిన ఇంటెలిజెన్స్ ఆధారంగా ఆ ఆపరేషన్ జరిపినట్టు వెల్లడించింది.ఇక, ఈ ఆపరేషన్ సమయంలో పౌరులకు హాని కలుగకుండా ఇజ్రాయెల్ సైన్యం తగు జాగ్రత్తలు తీసుకుంది. ఈ ఆపరేషన్‌లో పాలస్తీనా పౌరులు ఎవరూ మృతిచెందకుండా దాడులు చేసినట్టు చెప్పుకొచ్చింది. మరోవైపు.. ఇజ్రాయెల్ సైన్యం సెంట్రల్ గాజాలో కార్యకలాపాలు కొనసాగిస్తోంది. ఇదిలా ఉండగా.. గతేడాది అక్టోబర్ ఏడో తేదీన ఇజ్రాయెల్‌పై హమాస్ దాడులు చేయడంలో అహ్మద్ అల్ సౌర్కాదే కీలక పాత్ర అని తెలుస్తోంది. దాడులకు అహ్మదే ప్లాన్ చేసినట్టు ఇజ్రాయెల్ చెబుతోంది. Eliminated: Ahmed Hassan Salame Al-Sauarka, a #Hamas terrorist, in the area of Beit Hanoun in northern #Gaza. Alsauarka, a squad commander in the Nukhba Forces, infiltrated Israeli communities and participated in attacks during the #October7Massacre. He led sniper activity in… https://t.co/CUIkhTJQg0 pic.twitter.com/kojwx9uZGW— (((🇺🇸Zemmel🇮🇱))) (@jshayevitz) June 20, 2024 -
వార్ కేబినెట్‌ను రద్దు చేసిన నెతన్యాహూ
టెల్ అవీవ్: యుద్ధక్షేత్రంలో ముందుకు దూసుకెళ్తున్న ఇజ్రాయెల్ సైనిక బలగాలకు సూచనలు చేసే కీలకమైన వార్ కేబినెట్‌ను సోమవారం ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ అనూహ్యంగా రద్దుచేశారు. దీంతో గాజాస్ట్రిప్‌లో సైనికులు అనుసరించాల్సిన వ్యూహాలు, వారికి పూర్తి స్వేచ్ఛనిస్తూ తుది నిర్ణయాలను ఇకపై ఎవరు తీసుకుంటారన్న దానిపై సర్వత్రా చర్చ నెలకొంది. విపక్ష నేతలు ఈ యుద్ధ మండలి నుంచి వైదొలగడమే వార్ కేబినెట్ నిర్వీర్యానికి అసలుకారణమని తెలుస్తోంది. హమాస్ మిలిటెంట్లు మెరుపుదాడి చేసి 1,200 మంది ఇజ్రాయెలీలను పొట్టనబెట్టుకోవడంతో ఇజ్రాయెల్‌లోని విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశాయి. గాజా స్ట్రిప్‌పై దురాక్రమణకు తెగబడిన ఇజ్రాయెల్ సేనలకు బాసటా నిలిచాయి. దేశంపై దాడి నేపథ్యంలో రాజకీయపక్షాల మధ్య ఐక్యత ఉందని చాటుతూ ప్రభుత్వానికి మద్దతుపలుకుతూ నెతన్యాహూ ఏర్పాటుచేసిన వార్ కేబినెట్లో సభ్యులుగా నెతన్యాహూకు బద్దశత్రువులైన విపక్ష నేతలు బెన్నీ గాంట్జ్ తదితరులు చేరారు. గాంట్జ్, నెతన్యాహూ, రక్షణ మంత్రి మొఆవ్ గాలంట్‌లు వార్ కేబినెట్లో కీలక సభ్యులుగా ఉండేవారు. అయితే ఇటీవలి కాలంలో యుద్ధంలో ఇజ్రాయెల్ మారణహోమానికి పాల్పడుతోందని వేలాది మంది అమాయక పాలస్తీనియన్లను చంపేస్తోందని ప్రపంచదేశాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమెరికా సైతం పౌరనష్టంలేని సైనిక చర్యకే మొగ్గుచూపింది. బందీలను విడిపించడంపై దృష్టి సారించాల్సింది పోయి హమాస్ అంతం తమ లక్ష్యమన్నట్లు ఇజ్రాయెల్ సేనలు వ్యవహరిస్తున్నారని విపక్ష నేతలు బెన్నీ గాంట్జ్ తదితరులు నెతన్యాహూ ప్రభుత్వంపై తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. కాల్పుల విరమణకు నెతన్యాహూ ససేమిరా అనడంతో యుద్ధరీతులు మారిపోయాయని భావించి బెన్నీ తదితరులు కేబినెట్ నుంచి వైదొలిగారు. -
ఇజ్రాయెల్ ప్రధానికి షాక్.. వార్ కేబినెట్ మంత్రి రాజీనామా
హమాస్‌ను అంతం చేయటమే లక్ష్యంగా గాజాలో ఇజ్రాయెల్ సైన్యం దాడులను తీవ్రం చేస్తోంది. ఈ క్రమంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహకు రాజకీయంగా ఎదురుదెబ్బ తగిలింది. ఇజ్రాయెల్ వార్ కేబినెట్ మంత్రి బెన్నీ గాంట్జ్ ఆదివారం తన పదవికి రాజీనామా చేశారు. గాజాపై యుద్ధం చేయాలని దేశీయంగా వస్తున్న ఒత్తిడి కారణంగానే ఆయన నెతన్యాహు ప్రభుత్వం నుంచి వైదొలిగినట్లు తెలుస్తోంది. యుద్ధం అనంతర ప్రణాళికను ప్రధాని నెతన్యాహు ఆమెదించపోవటం వల్లనే తాను రాజీనామా చేసినట్ల బెన్నీ గాంట్జ్ తెలిపారు. అయితే గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న 8 నెలల యుద్ధ కాలంలో బెన్నీ గాంట్జ్ రాజీనామా ద్వారా నెతన్యాహుకు రాజకీయంగా ఎదురుదెబ్బ తగిలింది. దీంతో నెతన్యాహు రైట్ వింగ్ పార్టీలపై ఎక్కువగా ఆధారపడాల్సి వస్తుందని రాజకీయ ప్రముఖులు పేర్కొంటున్నారు.గాంట్జ్‌కు చెందిన ఇజ్రాయెల్ రెసిలెన్స్ పార్టీలోని మరో నేత గాడి ఐసెన్‌కోట్ వార్ కేబినెట్ నుంచి వైదోలిగారు. దీంలో కీలకమైన వార్ కేబినెట్లో ముగ్గురు సభ్యులు మాత్రమే మిగిలారు. వార్ కేబినెట్.. హమాస్‌పై చేస్తున్న యుద్ధంలో ఇజ్రాయెల్ సైన్యానికి ఆదేశాలు ఇవ్వటంలో కీలకమైన నిర్ణయలు తీసుకుంటున్న విషయం తెలిసిందే.‘ప్రధాని నెతన్యాహు మమ్మల్ని నిజమైన విజయం వైపు వెళ్లనివ్వకుండా అడ్డకుంటున్నారు. అందుకే భరమైన హృదయంలో ఎమర్జెన్సీ కేబినెట్ నుంచి వైదొలుగుతున్నాం’ అని గాంట్జ్ అన్నారు. గాంట్జ్ రాజీనామా చేసిన నిమిషాల వ్యవధిలో ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పందించారు.‘బెన్ని..యుద్ధాన్ని విడిచిపెట్టడానికి ఇది సరైన సమయం కాదు. ఇది బలగాలను ముందుడి నడిపించే సమయం. రాజీనామా చేయోద్దని కోరుతున్నా’అని అన్నారు. కీలకమైన సమయంలో ఇంకా బంధీలను హమాస్ చెరనుంచి విడుదల కాకముందే ఇలా గాంట్జ్ రాజీనామా చేయటంపై నెతన్యాహు రైట్ పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. -
అవును.. తప్పు చేశాం: ఇజ్రాయెల్ ప్రధాని
టెల్ అవీవ్: రఫాపై ఇజ్రాయెల్ బలగాలు జరిపిన మారణహోమం.. అమాయక పాలస్తీనియన్లు చనిపోవడం ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తప్పు చేశామని పార్లమెంటులో ప్రకటన చేశారు.‘‘సాధారణ పౌరులకు ఎలాంటి హాని చేయకూడదని అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నాం. అయినప్పటికీ ఈ విషాదకర ఘటన జరిగింది. దీనిపై దర్యాప్తు చేస్తాం’’ అని పేర్కొన్నారు. అలాగని అంతర్జాతీయ ఒత్తిడికి లొంగే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అంతిమ విజయం సాధించేవరకు యుద్ధం ఆపబోమని తెలిపారు.మరోవైపు హమాస్ కమాండర్లు ఉన్నారన్న సమాచారంతోనే దాడి చేశామని.. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతామని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది.రఫాపై దాడిని తక్షణం నిలిపివేయాలని ఒకవైపు అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) ఆదేశాలిచ్చినా, మరోవైపు అమెరికా సహా ప్రపంచమంతా కోరుకుంటున్నా ఇజ్రాయెల్ పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలో.. సురక్షిత ప్రాంతంగా ఇజ్రాయెలే ప్రకటించిన తల్ అల్ సుల్తాన్ ప్రాంతంలో దాడులు జరిపింది. అప్పటికే అక్కడ గుడారాలు వేసుకుని ఉన్న పాలస్తీనా ప్రజలు మృతి చెందారు. ఆదివారం రాత్రి రఫాపై జరిగిన ఈ భీకర వైమానిక దాడిలో 45 మంది పాలస్తీనా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. 60 మందికి గాయాలయ్యాయి. ప్రాణాలు కోల్పోయిన వారిలో సగం మంది మహిళలు, చిన్నారులే. ఇప్పటివరకు గాజా పోరులో అత్యంత పాశవికమైన దాడుల్లో ఒకటిగా దీన్ని పేర్కొంటున్నారు. ఈ దాడికి సంబంధించి హృదయ విదారక దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ప్రపంచం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది.మిత్రదేశాల ఖండనఇజ్రాయెల్కు అత్యంత సన్నిహిత దేశాలైన అమెరికా, ఫ్రాన్స్ సహా స్పెయిన్, ఇటలీ, ఐర్లాండ్, నార్వే, ఈజిప్టు, ఖతార్, తుర్కీయేలు తీవ్ర స్వరంతో ఖండించాయి. ‘‘ఈ ఆపరేషన్లను ఆపాలి. అంతర్జాతీయ చట్టాలను గౌరవించాలి. తక్షణం కాల్పుల విరమణ పాటించాలి’’ అని ‘ఎక్స్’ వేదికగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మెక్రాన్ పేర్కొన్నారు. Outraged by the Israeli strikes that have killed many displaced persons in Rafah.These operations must stop. There are no safe areas in Rafah for Palestinian civilians.I call for full respect for international law and an immediate ceasefire.— Emmanuel Macron (@EmmanuelMacron) May 27, 2024 మరోవైపు.. ‘‘భూమి మీద ఉన్న నరకం గాజా, గత రాత్రి జరిగిన దాడి ఇందుకు మరో సాక్ష్యం’’ అని పాలస్తీనా శరణార్థులకు సంబంధించిన ఐక్యరాజ్యసమితి సంస్థ యూఎన్ఆర్డబ్ల్యూఏ పేర్కొంది. -
ఇజ్రాయెల్ ప్రధానికి షాక్.. అల్టిమేటం జారీ చేసిన మంత్రి
హమాస్ మిలిటెంట్లను అంతం చేసేవరకు గాజాలో దాడులు కొనసాగిస్తామని ఇజ్రాయెల్ పేర్కొంటోంది. ఈ క్రమంలో ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి నెతన్యాహు ప్రభుత్వానికి కొత్త చిక్కు వచ్చి పడింది. ఇజ్రాయెల్ వార్ కెబినెట్ మంత్రి బెన్నీ గాంట్జ్ మీడియాతో మాట్లాడుతూ.. కొత్త డిమాండ్‌ను తెరపైకి తీసుకువచ్చారు.హమాస్‌తో యుద్ధం ముగిసిన అనంతరం పాలస్తీనాను ఎవరు పాలిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. దాని కోసం ప్రధాన మంత్రి నెతన్యాహుకు ఇజ్రాయెల్ రెసిలెన్స్ పార్టీ చెందిన బెన్నీ గాంట్జ్.. జూన్ 8 వరకు యుద్ధం అనంతరం చేపట్టే 6 అంశాలతో కూడిన ప్రణాళిక రూపొందించాలని అల్టిమెటం జారీ చేశారు. అప్పటివరకు నెతన్యాహు ఏం తేల్చకపోతే.. రాజీనామా చేయటంతో పాటు, ప్రస్తుత ప్రభుత్వానికి తమ పార్టీ మద్దతు ఉపసంహరించుకుంటామని హెచ్చరించారు.‘‘ఇజ్రాయల్ సైనికులు యుద్ధంలో ధైర్య సాహసాలు ప్రదర్శిస్తుంటే.. యుద్ధానికి సైన్యాన్ని పంపిన కొందరు మాత్రం పిరికితనంతో, చాలా బాధ్యతరాహిత్యంగా వ్యవస్తున్నారు’’ అని ప్రరోక్షంగా ప్రధాని బెంజమిన్ నెతన్యాహుపై విమర్శలు చేశారు.ఇక.. ఆక్టోబర్ 7 నుంచి హమాస్ మిలిటెంట్లు దాడి చేసి ఇజ్రాయెల్ పౌరులను బంధీలుగా తీసుకువెళ్లినందుకు ప్రతీకారంగా గాజాపై విరుచుకుపడుతన్న విషయం తెలిసిందే. ఇజ్రాయెల్ సైన్యం దాడుల్లో ఇప్పటివరకు 34,900 మంది పాలస్తీయన్లు ప్రాణాలు కోల్పోయారు. -
ఇజ్రాయెల్‌కు ఇరాన్ అణుబాంబు హెచ్చరికలు!
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ మరోసారి ఇజ్రాయెల్‌కు కీలక హెచ్చరికలు చేసింది. తమ దేశానికి ముప్పు ఉందంటే అణుబాంబలు తయారుచేయడానికైనా తాము వెనకాడబోమని ఇరాన్ పేర్కొంది.‘మేము అణుబాంబులు తయారు చేసేందుకు ఇప్పటికైతే ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే ఇజ్రాయెల్ వంటి దేశంతో.. మా దేశ ఉనికి ముప్పు వాటిల్లే పరిస్థితుల్లో మాత్రం తప్పకుండా మిలిటరీ సిద్ధాంతాలను మార్చుకుంటాం. మా అణు కేంద్రాలపై ఇజ్రయెల్ దాడికి పాల్పడితే.. మా అణు సిద్ధాంతలను కూడా మార్చుకుంటాం’ అని ఇరాన్ సుప్రీ లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ సలహాదారు కమల్ ఖరాజీ తెలిపారు.ఏప్రిల్‌లో సిరియా రాజధాని నగరంలో ఇరాన్ ఎంబసీ కార్యాలయంపై ఇజ్రాయెల్ దాడి చేసింది. దీంతో ప్రతీకారంగా ఇరాన్ ఇజ్రాయెల్‌పై దాడి చేసింది. ఇజ్రాయెల్ సైతం ఇరాన్‌పై దాడులకు తెగపడినట్లు అంతర్జాతీయా మీడియా కథనలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో ఇరు ఇరాన్- ఇజ్రయెల్ దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. గాజాలో పాలస్తీన్లపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను ఇరాన్ మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే.ఇక.. ఇరాన్‌కు సాంకేతికంగా అణు బాంబులను తయారు చేసే సామర్థ్యం ఇప్పటికే ఉంది. కావాలనుకుంటే అణ్వస్త్రాలను తయారు చేయగలం. అయితే ప్రస్తుతానికి అణు బాంబు తయారు చేయాలన్న అంశం మా ఎజెండాలో లేదని గతంలో ఇరాన్ వెల్లడించిన విషయం తెలిసిందే. ఇరాన్ 60 శాతం స్వచ్ఛతతో యురేనియంను శుద్ధి చేసే సామర్థ్యాన్ని సాధించిందని తెలుస్తోంది. కాగా, 90శాతం వరకు స్వచ్ఛతను సాధిస్తే అణు బాంబులను తయారు చేయడానికి వీలుంటుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. -
Rafah: ఇజ్రాయెల్ దుందుడుకు చర్య.. ఐరాస ఆందోళన
టెల్ అవీవ్: ఒకవైపు కాల్పుల విరమణ ప్రతిపాదనకు హమాస్ అంగీకారం తెలిపితే.. మరోవైపు ఇజ్రాయెల్ మాత్రం దాడుల్ని కొనసాగించాలనే నిర్ణయించింది. మంగళవారం ఉదయం ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) యుద్ధ ట్యాంకులు గాజావైపున ఉన్న రఫా క్రాసింగ్‌ను ఆక్రమించాయి. గాజా పోరులో ఈ ఆక్రమణ కీలక ఘట్టమని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు పేర్కొన్న సంగతి తెలిసిందే.ఈ రఫా క్రాసింగ్ నుంచే ఆదివారం రాత్రి హమాస్ దళాలు దక్షిణ ఇజ్రాయెల్‌పై రాకెట్లు ప్రయోగించాయి. ఈ ఘటనలో నలుగురు సైనికులు మృతి చెందడంతో ఐడీఎఫ్ తన ఆపరేషన్‌ను ప్రారంభించింది. రఫా క్రాసింగ్ ఆక్రమణ విషయాన్ని ఇజ్రాయెల్ తమకు తెలియజేసిందని ఈజిప్టు అధికారి ఒకరు తెలిపారు. అయితే ఇజ్రాయెల్ మాత్రం దీనిపై అధికారిక ప్రకటన చేయలేదు. అంతకు ముందు..రఫాపై సోమవారం ఇజ్రాయెల్ దాడులకు సిద్ధమవుతున్న వేళ.. హమాస్ సంస్థ కాల్పుల విరమణకు అంగీకరించిన సంగతి తెలిసిందే. అయితే ఆ విరమణ ఒప్పందం.. తమ కీలక డిమాండ్లకు అనుగుణంగా లేదంటూ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తిరస్కరించారు. మరోవైపు కాల్పుల విరమణ కోసం కైరోలో జరుగుతున్న చర్చల్లో ఇజ్రాయెల్ యథావిధిగా పాల్గొంటోంది. కొసమెరుపు ఏంటంటే.. ఆ చర్చలు కొనసాగుతున్న వేళలోనే ఇజ్రాయెల్ యుద్ధ కేబినెట్ సమావేశమై రఫాపై మిలిటరీ ఆపరేషన్‌కు పచ్చజెండా ఊపింది. మరోవైపు ఇజ్రాయెల్ ఆక్రమణతో రఫా క్రాసింగ్ మీదుగా ఈజిప్టు నుంచి గాజాకు చేరుకుంటున్న మానవతా సాయం ఆగిపోయిందని పాలస్తీనా క్రాసింగ్స్ అథారిటీ ప్రతినిధి వేల్ అబు ఒమర్ తెలిపారు. ఈ పరిణామంపై ఐక్యరాజ్యసమితి కూడా ఆందోళన వ్యక్తం చేసింది. అయితే అమెరికా మాత్రం ఇజ్రాయెల్ చర్యను పరిమితమైన ఆక్రమణగానే పేర్కొంటోంది. -
ఇజ్రాయెల్ ప్రధాని కీలక నిర్ణయం.. అల్ జజీరా ఛానెల్‌పై నిషేధం
హమాస్‌పై దాడులకు తెగపడుతున్న వేళ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఖతర్‌కు చెందిన న్యూస్ నెటవర్క్ అల్ జజీరా ఛానెల్‌పై నిషేధం విధించారు. ఇజ్రాయెల్‌లో అల్ జజీరా ఛానెల్‌ను మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ‘ఖతర్‌కు దేశానికి చెందిన న్యూస్ నెట్వర్క్ అల్ జజీరా ఛానెల్ ప్రసారాలను ఇజ్రాయెల్‌లో నిషేదిస్తున్నాం. ఇజ్రాయెల్ ప్రభుత్వం ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకుంది. ప్రేరేపించే విధంగా ఉన్న అల్ జజీరా ఛానెల్‌ను ఇజ్రాయెల్‌లో మూసివేస్తాం’ అని ప్రధాని బెంజమిన్ ‘ఎక్స్’ వేదికగా ప్రకటించారు. అయితే ఈ నిషేధం ఎప్పటి నుంచి అమలులోకి వస్తుందన్న విషయంపై స్పస్టత లేదు.గాజాలో కాల్పుల విరమణకు సంబంధించి హమాస్ డిమాండ్‌ను ప్రధాని బెంజమిన్ తిరస్కరించారు. హమాస్ తమకు ఎప్పుడూ ప్రమాదకరమైనదేనని అన్నారు. ఇజ్రాయెల్ లొంగిపోదని.. గాజాలో హమాస్‌ను అంతం చేసేవరకు దాడులు కొనసాగిస్తాని తేల్చిచెప్పారు. మరోవైపు.. హమాస్, ఇజ్రాయెల్ మధ్య శాంతి నెలకొల్పడం కోసం ఖతర్, ఈజిప్ట్, అమెరికా ప్రయత్నాలు చేస్తున్నా.. బెంజమిన్ ససేమిరా అంటున్నారు. ఇక.. గాజాపై ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో ఇప్పటివరకు 34,683 మంది పాలస్తీనా ప్రజలు మృతి చెందారు. -
ఇజ్రాయెల్ నెతన్యాహుకు ఊహించని షాక్!
టెల్ అవీవ్: గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. యుద్ధ నేరాలకు సంబంధించి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, ఇతర అగ్రనేతలకు అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ త్వరలో అరెస్ట్ వారెంట్లు జారీ చేయనున్నట్టు సమాచారం. ఈ మేరకు ఇజ్రాయెల్ మీడియా పేర్కొంది. దీంతో, ఈ అంశం హాట్ టాపిక్‌గా మారింది.ఇదిలా ఉండగా.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమెన్ నెతన్యాహు సంచలన ప్రకటన చేశారు. నెతన్యాహు తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. హమాస్‌తో కాల్పుల విరమణ చర్చలు కొనసాగుతున్నాయి. చర్చల్లో భాగంగా ఒప్పందం కుదరినా, కుదరకపోయినా.. హమాస్‌లను అంతం చేయడానికి ఇజ్రాయెల్ దళాలు రఫాలోకి ప్రవేశిస్తాయన్నారు. మా లక్ష్యాలను సాధించకుండా యుద్ధం నిలిపివేసే సమస్యే లేదు. హమాస్ దళాలను పూర్తిగా తుడిచిపెట్టేస్తాం. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ తప్పకుండా విజయం సాధిస్తుందని కామెంట్స్ చేశారు.The International Criminal Court may soon issue arrest warrants for Israeli Prime Minister Benjamin Netanyahu and other top leaders for war crimes. That's according to press reports out of Israel. Capitol Hill Correspondent @ErikRosalesNews reports. pic.twitter.com/lFuboZN6oK— EWTN News Nightly (@EWTNNewsNightly) May 1, 2024 మరోవైపు.. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం కారణంగా వేలాది మంది పాలస్తీనియన్లు రఫా నగరంలో ఆశ్రయం పొందుతున్నారు. ఈ క్రమంలో బందీల విడుదలకు, కొంత ఉపశమనం పొందడానికి రెండు దేశాల మధ్య కాల్పుల ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయి. ఇక.. రఫా నగరంపైకి ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. ఆదివారం అర్ధరాత్రి నుంచి జరిపిన దాడుల్లో మూడు కుటుంబాల్లోని ఆరుగురు మహిళలు, ఐదుగురు చిన్నారులు సహా మొత్తం 22 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఐదు రోజుల వయసున్న పసికందు ఉందని పాలస్తీనా అధికారులు తెలిపారు. -
ఇరాన్‌కు ఎదురుదెబ్బ.. ఇజ్రాయెల్‌కు బైడెన్ వార్నింగ్!
టెల్ అవీవ్: ఇజ్రాయెల్‌పై ఇరాన్ బాంబుల వర్షం కురిపించింది. ఇజ్రాయెల్‌పైకి వందల సంఖ్యలో మిస్సైల్స్, డ్రోన్స్ దూసుకెళ్లాయి. ‘ఆపరేషన్ ట్రూ ప్రామిస్’ పేరుతో విడతల వారీగా డ్రోన్లను ప్రయోగించింది. తర్వాత సైనిక స్థావరాలే లక్ష్యంగా క్రూజ్, బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసింది. కానీ, ఇజ్రాయెల్ రక్షణ కవచం ముందు ఇరాన్ పాచిక పారలేదు. దీంతో, ఇరాన్ దాడులు దాదాపు ఫెయిల్ అయ్యాయి. ఇక, దాడుల అనంతరం ఇరాన్ కీలక ప్రకటన చేసింది. ప్రపంచ శాంతి కోసం ఇరాన్ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుంది. ఇజ్రాయెల్‌పై దాడులు కొనసాగించే ఉద్దేశ్యమేమీ లేదు. ఇజ్రాయెల్ కవ్విస్తే మాత్రం కచ్చితం ఎలాంటి చర్యలు తీసుకోవడానికైనా వెనుకాడమని హెచ్చరించింది. దీంతో, ఇరాన్ ప్రకటనపై ఇజ్రాయెల్ ఘాటుగా స్పందించింది. తాజాగా ఇజ్రాయెల్ మంత్రి బెన్నీ గాంట్జ్ మాట్లాడుతూ.. ఇరాన్‌పై కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటాము. దీని కోసం తగిన సమయం, పద్దతిని ఎంచుకుంటామని సంచలన కామెంట్స్ చేశారు. 3 super power ( USA +UK +France ) helped Isreal to repel 300 drones and missiles attack by Iran. By doing so they sided with the Israeli act of bombing Embassy bldg of Iran in Syria !! Does it means no Embassy is safe in any country and it can be bombed just like that ? 🤔 pic.twitter.com/U5YUaSm7Fh — S K Mehta (@kooky_skm) April 15, 2024 ఇదిలా ఉండగా.. ఇరాన్‌పై ప్రతీకారం తీర్చుకోవాలనే ఆలోచనను విరమించుకోవాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సూచించారు. ఈ క్రమంలో ఇరాన్‌పై ఇజ్రాయెల్ నేరుగా దాడులు చేస్తే అమెరికా సహకరించబోదని బైడెన్ స్పష్టం చేసినట్టు సమాచారం. ఇజ్రాయెల్ ప్రతిదాడికి పాల్పడితే పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారతాయని అగ్రరాజ్యం ఆందోళన చెందుతోంది. మరోవైపు.. ఇరాన్ దాడుల్లో ఇజ్రాయెల్‌కు పెద్దగా నష్టమేమీ సంభవించలేదు. ఇరాన్ ప్రయోగించిన వాటిలో 99శాతం డ్రోన్లు, క్షిపణులను అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్‌ల సాయంతో ఆ దేశం సమర్థంగా నేలకూల్చింది. తాజా పరిణామంతో ప్రతీకార జ్వాలతో రగిలిపోతున్న ఇజ్రాయెల్ ఎదురుదాడులకు దిగితే ప్రాంతీయంగా పరిస్థితులు చేయిదాటేపోయే ముప్పు మాత్రం ఉంది. More and more videos coming out of Iran revealing that a lot of drones and missiles malfunctioned and fell down on Iranian towns and villages. The Islamic regime is a risk to the lives of all decent Iranians who don’t want the Mullahs to rule their lives pic.twitter.com/sU6BREHfyA — Visegrád 24 (@visegrad24) April 14, 2024 ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ ఇలా.. పేట్రియాట్: చాలా కాలం నుంచి ఇజ్రాయెల్ ఈ క్షిపణి రక్షణ వ్యవస్థను వినియోగిస్తోంది. 1991లో జరిగిన గల్ఫ్ యుద్ధంలో వీటి పేరు ప్రముఖంగా వినిపించింది. ఇరాక్ ప్రయోగించిన స్కడ్ క్షిపణులను ఇవి విజయవంతంగా అడ్డుకున్నాయి. ఇప్పుడు వీటిని విమానాలను, డ్రోన్లు కూల్చడానికి ఇజ్రాయెల్ వినియోగిస్తోంది. ది యారో: దీన్ని అమెరికా రూపొందించింది. ఇది గగనతల రక్షణ వ్యవస్థ. బాలిస్టిక్ సహా ఏ తరహా దీర్ఘ శ్రేణి క్షిపణులనైనా అడ్డుకోగలదు. భూవాతావరణం వెలుపలా పనిచేసే సామర్థ్యం దీనికి ఉంది. హమాస్‌తో జరుగుతున్న యుద్ధంలో యెమెన్ నుంచి హూతీ వేర్పాటువాదులు ప్రయోగించిన క్షిపణులను ఈ యారో వ్యవస్థతోనే ఇజ్రాయెల్ అడ్డుకుంటోంది. డేవిడ్ స్లింగ్: ఇది కూడా అమెరికా తయారుచేసిందే. మధ్య శ్రేణి క్షిపణులను అడ్డుకోవడానికి ఉపయోగపడుతుంది. లెబనాన్ నుంచి హెజ్బొల్లా ప్రయోగించే మిసైళ్లను అడ్డుకోవడానికి ఈ వ్యవస్థనే ఇజ్రాయెల్ ఎక్కువగా వినియోగిస్తోంది. ఐరన్ బీమ్: ఇజ్రాయెల్ కొత్తగా దీన్ని అభివృద్ధి చేసింది. లేజర్ సాంకేతికతతో పనిచేస్తుంది. మిగతా గగన రక్షణ వ్యవస్థలతో పోలిస్తే దీనికి తక్కువ ధర ఉంటుంది. ఇరాన్ శనివారం చేసిన దాడిలోనూ ఈ లేజర్ వ్యవస్థను వాడినట్లు తెలుస్తోంది. ఐరన్ డోమ్: అమెరికా సహకారంతో ఇజ్రాయెల్ తయారుచేసిన వ్యవస్థ. తక్కువ దూరం నుంచి ప్రయోగించే రాకెట్లను ఇది అడ్డుకుంటుంది. లెబనాన్ హెజ్బొల్లా, గాజా నుంచి హమాస్ ప్రయోగించే రాకెట్లను గత కొన్ని సంవత్సరాలుగా ఐరన్ డోమ్ వ్యవస్థ అడ్డుకుంటోంది. ఏ దేశమైనా రాకెట్లను ప్రయోగించగానే ఆటోమెటిక్‌గా ఈ టెక్నాలజీ పనిచేస్తుంది. క్షిపణులను అడ్డుకుంటుంది. Who are you supporting in this war? RT for Iran 🇮🇷 LIKE for Israel 🇮🇱 Israel-Iran might spark World War III USA, NATO, UK, ISRAEL Vs IRAN, RUSSIA, CHINA, NORTH KOREA#WorldWar3 #IranAttack #Israel #IranAttackIsrael #WWIII#IsraelUnderAttack pic.twitter.com/j9oStfqh2n — 𝓶𝓮𝓜𝓮𝓻𝓪𝓳 (@_meMeraj) April 15, 2024 -
ఇజ్రాయెల్‌కు టెన్షన్.. ఇరాన్ సంచలన ప్రకటన!
జెరూసలెం: గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్న వేళ మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ఏ క్షణంలోనైనా ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడి చేసే అవకాశం ఉందనే వార్తలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. ఈ మేరకు అమెరికా కూడా ఇజ్రాయెల్‌ను హెచ్చరిండంతో ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అలర్ట్ అయ్యారు. కాగా, పశ్చిమాసియాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రస్తుత పరిస్థితిల్లో ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తప్పదేమోనన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇజ్రాయెల్‌ను శిక్షించే సమయం ఆసన్నమైందంటూ గురువారం ఇరాన్ అధికారిక న్యూస్ ఏజెన్సీ ఐఆర్ఎన్ఏ పేర్కొంది. దాడి ఎలా చేయాలన్న విషయంలోనే ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని తెలిపింది. దీంతో, ఇజ్రాయెల్‌పై ఏ క్షణంలోనైనా ఇరాన్ దాడులు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో ఇరాన్ దాడులు గురించి అమెరికా కూడా హెచ్చరించింది. అయితే, ఏప్రిల్ ఒకటో తేదీన సిరియాలోని కాన్సులేట్‌పై ఇజ్రాయెల్ వాయుసేన దాడులు జరిపింది. ఈ దాడుల్లో ఇరాన్‌కు చెందిన టాప్ మిలటరీ జనరల్‌తో పాటు ఆరుగురు అధికారులు మరణించారు. దీంతో రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అనంతరం, ఇరాన్ సుప్రీం అధినేత అయతుల్లా అలీ ఖొమేనీ సహా సైనిక జనరళ్లు కూడా ఇజ్రాయెల్‌ను శిక్షిస్తామని బహిరంగ ప్రకటనలిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో సమయం కోసం ఇరాన్ వేచిచూస్తున్నట్టు సమాచారం. అయితే, ఇజ్రాయల్‌పై నేరుగా ఇరాన్ దాడి చేయకపోవచ్చని, లెబనాన్ లేదా సిరియా నుంచి తన మద్దతుదారులైన హెజ్బొల్లా, ఇతర మిలిటెంట్ సంస్థలతో దాడులు చేయించొచ్చని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక, ఈ యుద్ధ భయంతో టెహ్రాన్‌కు ఈ నెల 13 వరకు విమాన సర్వీసులు నిలిపివేస్తున్నట్టు జర్మనీ ఎయిర్‌లైన్స్ లుఫ్తాన్సా ప్రకటించింది. ఇజ్రాయెల్, లెబనాన్, పాలస్తీనియన్ వంటి పశ్చిమాసియా ప్రాంతాలకు ప్రయాణించవద్దంటూ రష్యా విదేశాంగ శాఖ తన పౌరులకు సూచించింది. బైడెన్ కీలక ప్రకటన.. ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడులు చేసే అవకాశమున్న నేపథ్యంలో అమెరికా స్పందించింది. ఇజ్రాయెల్‌కు తాము పూర్తిస్థాయిలో అండగా నిలుస్తామని అమెరికా అధ్యక్షుడు బైడెన్ స్పష్టం చేశారు. ఆ దేశ రక్షణకు, భద్రతకు తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని అన్నారు. మరోవైపు ఇజ్రాయెల్‌తో యుద్ధంలో అమెరికా భాగస్వామ్యమైతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇరాన్ హెచ్చరించింది. -
నెతన్యాహు పెద్ద తప్పు చేస్తున్నావ్.. బైడెన్ సీరియస్ వార్నింగ్
గాజాగాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తున్న వేళ ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సీరియస్ అయ్యారు. నెతన్యాహు తప్పు చేస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు. ఆయన వైఖరి మారకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. గాజాలో గత వారం జరిగిన డ్రోన్ దాడిలో వరల్డ్ కిచెన్ సెంటర్ (డబ్ల్యూకేసీ) స్వచ్ఛంద సంస్థలో పనిచేస్తున్న ఏడుగురు మరణించారు. ఈ ఘటనపై అగ్రరాజ్యం తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటన నేపథ్యంలోనే బైడెన్ స్పందించారు. తాజాగా ఓ టీవీ కార్యక్రమంలో బైడెన్ మాట్లాడుతూ.. గాజాలో నెతన్యాహు తప్పు చేస్తున్నారు. ఆయన వైఖరిని అంగీకరించను. ఆరు లేదా ఎనిమిది వారాలపాటు తక్షణమే కాల్పుల విరమణ ప్రకటించాలని నేను ఇజ్రాయెల్ సైన్యాన్ని కోరుతున్నాను. ఈ సమయంలో శరణార్థులకు ఆహారం, ఔషధాలను సరఫరా చేయవచ్చు అని అన్నారు. ఇదే సమయంలో బైడెన్.. జోర్డాన్, సౌదీ, ఈజిప్ట్ దేశాలు కూడా సహాయం, ఆహారం పంపేలా నిత్యం వారితో సంప్రదింపులు జరుపుతున్నట్లు స్పష్టం చేశారు. వారు కూడా దీనికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. గాజాలోని ప్రజలకు ఔషధాలు, ఆహార సరఫరాలో ఎటువంటి రాజీ ఉండదని చెప్పారు. మరోవైపు శ్వేతసౌధం స్పందిస్తూ సంధి కోసం ఇజ్రాయెల్ కొన్ని చర్యలు తీసుకొందని వెల్లడించింది. కానీ, హమాస్ వైపు స్పందన మాత్రం అంత ప్రోత్సాహకరంగా లేదని పేర్కొంది. ఇక, ఇజ్రాయెల్ ప్రభుత్వం దీనిపై స్పందిస్తూ అమెరికా, ఐరాస డిమాండ్ చేసిన విధంగానే గాజాలోకి సరఫరాలను పెంచామని వివరించింది. తాము వీటికి ఎటువంటి ఆటంకాలను సృష్టించడం లేదని తెలిపింది. సోమవారం 468 ట్రక్కులు, మంగళవారం 419 ట్రక్కుల సామగ్రిని తరలించినట్లు చెప్పింది. యుద్ధం మొదలైన నాటికి ఇదే అత్యధికమని వెల్లడించింది. ఇదిలా ఉండగా.. ఇజ్రాయెల్ దాడుల కారణంగా గాజాలో ప్రాణ నష్టం భారీగా జరిగింది. ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో హమాస్ ముఖ్యనేత ఇస్మాయిల్ హనియేహ్ కుమారులు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఖతర్ వంటి దేశాలు సంధి ప్రయత్నాలు చేస్తున్న వేళ హమాస్ కీలక నేత కుమారులు మరణించడంతో సయోధ్యపై మరోమారు నీలినీడలు కమ్ముకున్నాయి. ‘జెరూసలేం, అల్–అఖ్సా మసీదుకు విముక్తి కల్పించే పోరాటంలో నా కుమారులు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు’ అని ఇస్మాయిల్ వెల్లడించారు. ఇస్మాయిల్ ప్రస్తుతం ఖతార్‌లో ప్రవాసజీవితం గడుపుతున్నారు. కుమారులు మాత్రం గాజాలోని శరణార్థి శిబిరంలో ఉంటున్నారు. షాటీ శరణార్ధి శిబిరంపై జరిపిన దాడిలోనే ఆయన కుమారులు హజీమ్, అమీర్, మొహమ్మద్‌లు మరణించారని అల్–అఖ్సా టీవీ ప్రకటించింది. ముగ్గురూ తమ కుటుంబసభ్యులతో కలిసి ఒకే వాహనంలో వెళ్తుండగా ఇజ్రాయెల్ డ్రోన్ దాడి చేసింది. ఈ దాడిలో ముగ్గురితోపాటు హజీమ్ కుమారులు, కుమార్తె, అమీర్ కుమార్తె సైతం ప్రాణాలు కోల్పోయారు. -
అడుగు దూరంలో ఉన్నాం.. ఇజ్రాయెల్ ప్రధాని వార్నింగ్
జెరూసలేం: గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్న వేళ ఆ దేశ ప్రధాన మంత్రి బెంజిమిన్ నెతన్యాహు సంచలన ప్రకటన చేశారు. గాజాతో జరుగుతున్న పోరులో తాము విజయం సాధించడానికి అడుగు దూరంలో ఉన్నామని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో హమాస్ వద్ద ఉన్న బంధీలను విడిచిపెట్టే వరకు సంధి ప్రసక్తే ఉండదని కుండబద్దలు కొట్టారు. కాగా, గాజాలో ఇజ్రాయెల్ యుద్ధం మొదలై ఆరు నెలలు పూర్తైన నేపథ్యంలో ప్రధాని నెతన్యాహు నేతృత్వంలో కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్బంగా నెతన్యాహు మాట్లాడుతూ.. గాజాతో యుద్ధంలో విజయానికి అడుగు దూరంలోనే ఉన్నాం. ఇప్పటివరకు మనం చెల్లించిన మూల్యం ఎంతో బాధాకరమైంది, విచారకరం. ఒప్పందానికి సిద్ధమే, లొంగిపోవడానికి కాదు. అంతర్జాతీయంగా వస్తోన్న ఈ ఒత్తిడి ఇజ్రాయెల్‌పై చేసే బదులు.. దీనిని హమాస్ వైపు మళ్లించాలి. తద్వారా బందీలు త్వరగా విడుదలయ్యే అవకాశం ఉంటుంది. తమపై ఎవరు దాడి చేసినా, చేయాలని ప్రయత్నించినా.. వారిపై ప్రతిదాడులు తప్పవన్నారు. ప్రస్తుతం ఇదే కొనసాగుతోందని.. అన్ని వేళలా ఇదే సూత్రాన్ని ఆచరణలో పెడతామని అన్నారు. ఇదిలాఉంటే, హమాస్ నిర్మూలనే లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్ దాడుల కారణంగా గాజాలో ఇప్పటికే వరకు దాదాపు 33వేల మంది మరణించినట్టు సమాచారం. యుద్ధం కారణంగా గాజాలో విపత్కర పరిస్థితుల నెలకొన్నాయి. ప్రస్తుతం ఇజ్రాయెల్-హమాస్ వరకు పరిమితమైన ఈ యుద్ధం.. ఇరాన్ జోక్యంతో మొత్తం పశ్చిమాసియాకు విస్తరించే ప్రమాదం ఉందని అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు.. కాల్పుల విమరణ ఒప్పందానికి సంబంధించిన చర్చలు అంతర్జాతీయ మధ్యవర్తుల సహకారంతో కైరోలో తిరిగి మొదలవుతాయని భావిస్తోన్న తరుణంలో నెతన్యాహు ఇలా కామెంట్స్ చేయడం ఆందోళన కలిగిస్తోంది. -
పద్దతి మార్చుకో.. ఇజ్రాయెల్ నెతన్యాహును హెచ్చరించిన బైడెన్
వాషింగ్టన్:గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. గాజాలో సాధారణ పౌరులే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం బాంబుల వర్షం కురిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని హెచ్చరించారు. కాగా, గాజాపై ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో జో బైడెన్ తాజాగా స్పందించారు. ఈ సందర్భంగా బైడెన్.. ఇజ్రాయెల్‌పై అమెరికా విధానం గాజాలోని పౌరుల రక్షణపై ఆధారపడి ఉంటుంది. సాధారణ పౌరులే లక్ష్యంగా జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాము. గాజాలో వెంటనే కాల్పుల విరమణను పాటించాలి. లేని పక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బైడెన్.. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు వార్నింగ్ ఇచ్చారు. ఇదిలా ఉండగా.. స్వచ్ఛంద సంస్థ ‘వరల్డ్ సెంట్రల్ కిచెన్’కు చెందిన ఏడుగురు సహాయకులను తాజాగా ఇజ్రాయెల్ చంపివేయడంపై అమెరికా సీరియస్ అయ్యింది. ఈ క్రమంలో యుద్ధం అన్నాక ఇటువంటివి సహజమేనని నెతన్యాహూ కామెంట్స్ చేయడంపై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉద్దేశపూర్వకంగానే ఇజ్రాయెల్ రక్షణ దళాలు (ఐడీఎఫ్) తమ వాహనం మీద దాడిచేశాయని ఈ చారిటీ సంస్థ అధినేత ఆరోపిస్తున్నారు. ఆ వాహనం ఒక సహాయక సంస్థదని తెలియచెప్పే గుర్తులు దాని మీద స్పష్టంగా ఉన్నాయి. పైగా ఐడీఎఫ్తో సమన్వయం చేసుకుంటూ ఘర్షణలేని ప్రాంతం గుండా అది ప్రయాణిస్తున్నప్పుడు ఈ దాడి జరిగింది. మూడుసార్లు కాల్పులు జరపడం, కొందరు చనిపోగా, పారిపోతున్న మిగతా సహాయకసిబ్బందిని కూడా వదిలిపెట్టకుండా హతమార్చడం త్రీవ పరిణామంగా మారింది. JUST IN: President Biden warns PM Netanyahu that future U.S. support for Israel depends on actions taken to shield civilians in Gaza. #Israel #Gaza #USA — The Reportify (@TheReportify) April 4, 2024 ఇక, హమాస్‌తో పోరులో ఇజ్రాయెల్ అనేక విధాలుగా అతిక్రమణలకు పాల్పడుతోంది. అత్యంత అమానవీయంగా వ్యవహరిస్తోంది. గాజాలో ఆపన్నులకు కాస్తంత సాయాన్ని అందిస్తున్న ఏడుగురు వర్కర్లను ఇజ్రాయెల్ దళాలు కాల్చివేయడం, మిగిలివున్న ఆ ఒక్క ప్రధాన ఆస్పత్రిని కుప్పకూల్చడం, పొరుగుదేశంలోని మరోదేశం కాన్సులేట్ మీద దాడిచేసి కీలకమైన వ్యక్తులను చంపివేయడం వంటి చర్యలకు ఇజ్రాయెల్ పాల్పడుతోంది. -
‘వెనక్కి తగ్గేది లేదు.. గాజాపై దాడులు కొనసాగిస్తాం’
గాజాపై ఇజ్రాయెల్ సైన్యం చేస్తున్న దాడులకు సంబంధించి ప్రపంచ దేశాల ఒత్తిడిని ప్రధానమంత్రి బెంజమిన్ నెతాన్యహు తోసిపుచ్చారు. ఆదివారం ఆయన కేబినెట్ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఎలాంటి అంతర్జాతీయ ఒత్తిళ్లు తలొగ్గి మేము యుద్ధంలో మా లక్ష్యాన్ని మధ్యలో ఆపలేము. హమాస్‌ను అంతం చేయటం, బంధీలను విడిపించుకోవటం, గాజాలోని హమాస్‌కు వ్యతిరేకంగా పోరాటం విషయంలో ప్రపంచ దేశాల ఒత్తిడిని పట్టించుకోం. రఫా నుంచి దాడులు కొనసాగిస్తాం. మరికొన్ని వారాల పాటు దాడులు జరుపుతాం’ అని అన్నారు. ప్రపంచ దేశాల ఒత్తిడిపై కూడా బెంజమిన్ నెతాన్యహు స్పందించారు. ‘మీకు జ్ఞపకశక్తి తక్కువగా ఉందా? అక్టోబర్7న ఇజ్రాయెల్‌పై హమాస్ చేసిన భీకరమైన దాడులు అంత త్వరగా మర్చిపోయారా? హమాస్ వ్యతిరేకంగా పోరాడుతున్న ఇజ్రాయెల్‌ను ఇంత త్వరగా వ్యతిరేకిస్తారా?’ అని తీవ్రంగా మండిపడ్డారు. దాడుల సమయంలో రఫా నగరం నుంచి పౌరులను ఖాళీ చేయాలనే ప్రణాళికతో ఉన్నామని తెలిపారు. అయితే ఈ విషయంలో మిత్రదేశాలు ఇజ్రాయెల్‌పై సందేహం వ్యక్తం చేస్తున్నాయని అన్నారు. ఇప్పటివరకు ఇజ్రాయెల్ చేసిన దాడిలో 31,600 మంది పాలస్తీనా పౌరులు మృతి చెందారు. అక్టోబర్ 7న హమాస్ చేసిన మెరుపుదాడిలో 1200 మంది ఇజ్రాయెల్పౌరులు మృతి చెందారు. 253 మంది ఇజ్రాయెల్ పౌరులను హమాస్ బలగాలు బంధీలుగా తరలించుకుపోయిన విషయం తెలిసిందే. -
నెతన్యాహూతో ఇజ్రాయెల్‌కు నష్టమే: బైడెన్
విలి్మంగ్టన్: గాజాలో హమాస్‌పై యుద్ధం పేరిట ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ తన సొంత దేశానికి తీవ్ర నష్టం కలిగిస్తున్నారని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ విమర్శించారు. నెతన్యాహూ అనాలోచిత చర్యల వల్ల ఇజ్రాయెల్‌కు లాభం కంటే నష్టమే ఎక్కువగా జరుగుతోందని అన్నారు. గాజాలో సాధారణ పౌరుల మరణాలను నియంత్రించడంలో నెతన్యాహూ దారుణంగా విఫలమవుతున్నారని ఆక్షేపించారు. బైడెన్ శనివారం మీడియాతో మాట్లాడారు. తిరుగుబాటుతో సంబంధం లేని పాలస్తీనియన్ల ప్రాణాలు కాపాడాలని, ఈ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని ఇజ్రాయెల్‌కు సూచించారు. గత ఏడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ మిలిటెంట్లు చేసిన దాడిని తాము ఖండిస్తున్నామని స్పష్టం చేశారు. హమాస్‌ను వేటాడే హక్కు ఇజ్రాయెల్‌కు ఉందని వెల్లడించారు. కానీ, సాధారణ ప్రజలపై దాడి చేయడం సరైంది కాదని తేల్చిచెప్పారు. గాజాలో మరణాల సంఖ్య ఇజ్రాయెల్ చెబుతున్నదానికంటే ఎక్కువగానే ఉన్నట్లు తాము భావిస్తున్నామని పేర్కొన్నారు. గాజాలో అమాయకుల మరణాలు ఇంకా పెరిగితే ఇజ్రాయెల్ అంతర్జాతీయ మద్దతును కోల్పోతుందని బైడెన్ కొన్ని రోజుల క్రితం హెచ్చరించిన సంగతి తెలిసిందే. -
ఇజ్రాయెల్ అమానుషం.. నెతన్యాహుపై జో బైడెన్ సీరియస్
వాషింగ్టన్: గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ వైఖరిపై అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గాజాలో విషయంలో ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహు తీరుపై బైడెన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కాగా, గాజాలో కాల్పుల విరమణ విషయంలో ఇజ్రాయెల్ వైఖరిపై అసంతృప్తిగా ఉన్న జో బైడెన్.. బెంజమిన్ నెతన్యాహుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం కాంగ్రెస్ ఉభయ సభలను ఉద్దేశించి చేసిన వార్షిక ప్రసంగం తర్వాత సెనెటర్ మైకెల్ బెన్నెట్, విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ తదితరులతో బైడెన్ మాట్లాడారు. ఈ సందర్భంగా గాజాలో మానవ సంక్షోభంపై బెన్నెట్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇందుకు బైడెన్ సమాధానమిస్తూ.. గాజా విషయంలో నెతన్యాహుతో ముందుగానే చెప్పినట్టు తెలిపారు. అలాగే, గాజాలో మానవ సంక్షోభాన్ని నివారించడానికి నెతన్యాహు చేయాల్సినంత చేయడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. నెతన్యాహు తీరు ఇజ్రాయెల్‌కు సహాయం చేసే దాని కన్నా ఆదేశ ప్రజలను బాధపెట్టేలా ఉందన్నారు. నెతన్యాహుకు ఇజ్రాయెల్‌ను కాపాడే హక్కు ఉంది. ఇదే సమయంలో ఆయన తీసుకుంటున్న చర్యల కారణంగా ప్రజలకు ఎలాంటి హానీ కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేశారు. Latest: Benjamin Netanyahu 'hurting Israel more than helping Israel' with Gaza war approach - Joe Biden — Totlani Krishan🇮🇳 (Modi Ka Parivar) (@kktotlani) March 10, 2024 ఇదిలాఉండగా.. కొన్ని నెలలుగా గాజాపై ఇజ్రాయెల్ దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. ఇజ్రాయెల్ దాడుల్లో అధికారిక లెక్కల ప్రకారం దాదాపు 30వేలకుపైగా ప్రజలు మరణించారు. వీరిలో ఎక్కువగా మహిళలు, చిన్నారులే ఉన్నారు. మరోవైపు.. హమాస్ దాడుల కారణంగా ఇజ్రాయెల్‌లో 1200 మంది చనిపోయినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నారు. ఇక, ఇజ్రాయెల్ నుంచి హమాస్ దాదాపు 250 మందిని బందీలుగా చేసుకుంది. వీరిలో 99 మంది గాజాలో సజీవంగా ఉన్నట్టు ఇజ్రాయెల్ అధికారులు చెబుతున్నారు. -
జో బైడెన్ వ్యాఖ్యలపై మండిపడ్డ హమాస్
Israel-Hamas War: హమాస్‌ను అంతం చేయటమే లక్ష్యంగా గాజాలో ఇజ్రాయెల్ సైన్యం దాడులు చేస్తునే ఉంది. గాజాపై దాడులును నిలిపివేసి పాలస్తీనాను స్వతంత్ర దేశంగా అంగీకరించాలంటూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతాన్యహును కోరిన విషయం తెలిసిందే. బైడెన్.. ఇజ్రాయెల్ ప్రధానితో ఫొన్లో మాట్లాడారు. బైడెన్.. ఇజ్రాయెల్ ప్రధానితో ఫోన్ సంభాషణ అనంతరం నెతాన్యహు పాలస్తీనాను స్వంతత్ర దేశంగా అంగీకరించడానికి అవకాశం ఉందని పేర్కొన్నారు. బైడెన్ వ్యాఖ్యలపై హమాస్ పొలిటికల్ బ్యూరో సభ్యుడు ఇజ్జత్ అల్-రిష్క్ స్పందించారు. పాలస్తీనా విషయంలో ఇజ్రాయల్ ప్రధానిపై బైడెన్ చేసిన వ్యాఖ్యలను ఇజ్జత్ తోసిపుచ్చారు. గాజాలో జరుగుతున్న మారణహోమం వెనుక ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలిచిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పాత్ర ఉందని మండిపడ్డారు. ఇక పాలస్తీనా ప్రజలకు ఎప్పటికీ ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలిచిన బైడెన్‌పై సదభిప్రాయం కలిగి ఉండరని చెప్పారు. బైడెన్ మాటలతో తమకు మంచి జరుగుతుందన్న నమ్మకం పాలస్తీనా ప్రజల్లో లేదని పేర్కొన్నారు. బైడెన్.. నెతన్యహుతో ఫోన్లో మాట్లాడిన తర్వాత మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలకు ముగింపు పలకడానికి రెండు దేశాల విధానాన్ని ఇజ్రాయెల్ ప్రధాని తీసుకువచ్చే అవకాశం ఉందని అన్నారు. రెండు దేశాల విధానం ద్వారా చాలా దేశాలు ఉన్నాయని.. అటువంటి దేశాలు కూడా యూఎన్‌ఏలో భాగమై ఉన్నాయని తెలిపారు. ఇక.. ఇజ్రాయెల్ ప్రధాని మాత్రం పాలస్తీనాను స్వతంత్ర దేశంగా అంగీకరించమని తేల్చి చెప్పారు. పాలస్తీనాకు స్వతంత్ర దేశ హోదా ఇచ్చినా హమాస్ వల్ల ఇజ్రాయెల్‌కు ముప్పు తప్పదని అన్నారు. ఇక హమాస్‌ను అంతం చేసేవరకు దాడులు ఆపమని తెలిపారు. గాజాపై ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో ఇప్పటివరకు 24, 927 మంది పాలస్తీనా ప్రజలు మృతిచెందారు. చదవండి: న్యూ జెర్సీలో మంచు తుఫాను బీభత్సం -
Israel: మమ్మల్ని ఎవరూ ఆపలేరు.. నెతన్యాహు సంచలన కామెంట్స్
టెల్ అవీవ్: గాజా సిటీలపై ఇజ్రాయెల్ సేనల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక, ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం నేటికి 100 రోజులకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. యుద్థం గెలిచే వరకు ఆగే ప్రసక్తేలేదని వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మాట్లాడుతూ హమాస్ మిలిటెంట్లకు వ్యతిరేకంగా చేస్తున్న యుద్ధంలో విజయం సాధించే వరకు తమను ఎవరూ ఆపలేరని అన్నారు. యుద్ధాన్ని ఆపే ప్రసక్తే లేదు. అదే మా లక్ష్యం. హేగ్, ఈవిల్ మమ్మల్ని ఏం చేయలేవు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అలాగే, గాజా భూభాగంలో ఇప్పటికే అనేక హమాస్ బెటాలియన్లను అంతమొందించామని చెప్పారు. ఉత్తర గాజాలో నిర్వాసితులైన వారు తమ ఇళ్లకు తిరిగి రాలేరని తెలిపారు. అయితే, ఐక్యరాజ్యసమితిలోని అత్యున్నత న్యాయస్థానం ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్‌లో.. ఇజ్రాయెల్ దాడి యూఎన్ఓ జెనోసైడ్ కన్వెన్షన్‌ను ఉల్లంఘిస్తోందని ఇరాన్ మద్దతుగల సాయుధ గ్రూపుల కూటమి ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే నెతన్యాహు ఇలా కామెంట్స్ చేశారు. Israeli Prime Minister Benjamin Netanyahu announced that the Israeli army will continue its massacres in Gaza despite the genocide case at the International Court of Justice (ICJ). Netanyahu: We will continue the war in Gaza until all our goals are achieved. Neither the ICJ nor… pic.twitter.com/zcCzamWeFC — Readean (@readeancom) January 14, 2024 మరోవైపు, ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో భారీగా ప్రాణనష్టం జరుగుతున్న విషయం తెలిసిందే. యుద్ధంలో భీకర దాడుల కారణంగా ఆకలి కేకలు.. 23వేలకుపైగా మరణాలు.. లక్షల మంది నిరాశ్రయులయ్యారు. వీటన్నింటికీ ఎప్పుడు తెరపడుతుందో తెలియని దుస్థితి నెలకొంది. ఇదిలా ఉండగా.. టెల్ అవీవ్‌లో వందలాది మంది యుద్ధ బాధితులను గుర్తుచేసుకోవడానికి ప్రజలు శాంతి ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా మరణించిన వారి కోసం కొవ్వొత్తులను వెలిగించారు. ఇక, బంధీలను విడుదల చేయాలని కోరుతూ బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. On the 100th day of the #Israel-Hamas conflict, hundreds in Tel Aviv lit candles to remember the war's victims. They protested against Prime Minister Benjamin Netanyahu and the current Israeli government, urging the release of hostages. 📸: AA pic.twitter.com/195vs1n2Ka — Zoom News (@zoomnewskrd) January 14, 2024 -
పార్లమెంట్లో నెతన్యాహుకి చేదు అనుభవం!
ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజిమన్ నెతన్యాహూకి పార్లమెంట్ సాక్షిగా చేదు అనుభవం ఎదురైంది. నెతన్యాహూ ప్రసంగిస్తున్న వేళ.. గాజాలో హమాస్ బందీలుగా ఉన్న వాళ్ల కుటుంబీకులు తమ నిరసన గళాలతో పార్లమెంట్‌ను హోరెత్తించారు. తమ వాళ్లను భద్రంగా తీసుకొస్తామని ఇచ్చిన వాగ్దానం ఏమైందని నిలదీశారు వాళ్లు. సోమవారం ఇజ్రాయెల్ పార్లమెంట్ ప్రత్యేక సమావేశం జరిగింది. ప్రధాని నెతన్యాహు ప్రసంగం జరుగుతున్న టైంలో.. కుటుంబ సభ్యులు ఫ్లకార్డులపై బందీల ఫొటోలు, పేర్లను చూపిస్తూ నినాదాలు చేశారు. గాజా నుంచి ఇజ్రాయెల్ బలగాలను వెనక్కి రప్పించిన నెతన్యాహూ నిర్ణయంపై నిరసన వ్యక్తం చేశారు వాళ్లు. నెతన్యాహు ప్రసంగిస్తూ సమయంలో నెస్సెట్ గ్యాలరీలో కూర్చున్న బందీల కుటుంబీకులు లేని నిలబడ్డారు .. ‘‘ సమయం లేదు.. ఇప్పుడే, ఇప్పుడే.. అంటూ గట్టిగా గట్టిగా నినాదాలు చేశారు. అయితే నెతన్యాహూ వాళ్లకు సున్నితంగా సర్దిచెప్పే యత్నం చేశారు. మన బిడ్డలు ఊరికనే చనిపోవడం లేదు. మన దేశ నాశనం కోరుకుంటున్న శత్రువులపై విజయం సాధించేంతవరకు ఈ ప్రయత్నం ఆపకూడదంటూ వ్యాఖ్యానించారు. الأمور مولعة خالص داخل كيان العدو الصهيوني.. - عائلات الأسرى الإسرائيليين تقاطع نتنياهو خلال جلسة الكنيست صارخة "لا وقت.. الآن الآن" - إقالة قائد الكتيبة 51 من لواء غولاني بعد تعريضه جنودا للخطر في الشجاعية. - وأخر شي وأسخن شي.. نتنياهو يمنع غالانت من إجراء مباحثات فردية مع… pic.twitter.com/MeQoH3d8Xt — أجيج (@1b2_r) December 25, 2023 అయితే అప్పటికీ బందీల కుటుంబ సభ్యులు వెనక్కి తగ్గలేదు. ఇంకా గట్టిగా నినాదాలు చేశారు. మా వాళ్లను సురక్షితంగా వెనక్కి మీరు తీసుకొస్తారని నమ్మాం. 80 రోజులు.. ప్రతీ క్షణం నరకంగా గడిపాం. ఇదే మీ కూతురో, కొడుకుకో అయి ఉంటే ఇలాగే ఉంటారా? అంటూ ప్రశ్నించారు. దానికి ప్రధాని నెతన్యాహూ స్పందిస్తూ.. బందీల విడుదల కోసమంటూ చేయని ప్రయత్నమేదీ లేదని వివరించే యత్నం చేశారు. యుద్ధం మొదలైనప్పటి నుంచి బందీల కుటుంబాలతో తాను వ్యక్తిగతంగా మాట్లాడనంటూ గుర్తు చేశారాయన. అందరినీ సురక్షితంగా విడిపించేంతవరకు సంయమనం పాటించాలని కోరారాయన. ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం గాజాలో హమాస్ చెరలో 129 మంది బందీలుగా ఉన్నారు. ఇందులో 22 మంది మరణించగా.. వాళ్ల మృతదేహాలు కూడా బంధువుల్ని చేరలేదు. అక్టోబర్ 7వ తేదీన ఇరు దేశాల మధ్య మొదలైన యుద్ధం.. వేల మందిని బలి తీసుకుంది. ఇజ్రాయెల్ తరఫున 1,200 మంది మరణించగా, హమాస్ ఆధీనంలో ఉన్న గాజాలో 20 వేల మంది దాకా మరణించినట్లు తెలుస్తోంది. -
హమాస్‌కు ఇజ్రాయెల్ ప్రధాని అల్టిమేటం
టెల్ అవీవ్: గాజాపై ఇజ్రాయెల్ సేనలు విరుచుకుపడుతున్నాయి. హమాస్‌ను అంతం చేయడమే ధ్యేయంగా ముందుకు కదులుతున్నాయి. కాల్పుల విరమణకు అంగీకరించడం లేదు. బందీల విడుదలపై ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఈ క్రమంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమెన్ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. హమాస్ ఉగ్రవాదులకు లొంగిపోవడం లేదా చనిపోవడం మాత్రమే దారి ఉందని హెచ్చరికలు జారీ చేశారు. హమాస్‌ను అంతం చేయడానికి వారు తలదాచుకున్న సొరంగాలను సముద్ర నీటితో నింపుతున్న విషయం తెలిసిందే. యుద్ధంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమెన్ నెతన్యాహు ఇప్పటికే స్పష్టం చేశారు. హమాస్‌ను అంతం చేసిన తర్వాతే కాల్పుల విరమణ ఉంటుందని తెలిపారు. బందీలను సురక్షితంగా పరిరక్షిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్‌కు గాజా నుంచి ఎప్పటికీ ముప్పు లేకుండా అయ్యే వరకు పోరాటం సాగుతుందని చెప్పారు. ఇజ్రాయెల్-హమాస్ మధ్య ఇటీవల కాల్పుల విరమణ వారంపాటు కొనసాగింది. ఈ క్రమంలో హమాస్ 105 మంది ఇజ్రాయెలీ బందీలను విడుదల చేసింది. ఇజ్రాయెల్ కూడా 240 మంది పాలస్తీనా బందీలను బయటకు వదిలివేసింది. ఇరుపక్షాల మధ్య కాల్పుల విరమణ శాశ్వతంగా కొనసాగుతుందని ప్రపంచ దేశాలు అభ్యర్థించాయి. కానీ పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి చేసింది. ఆకస్మిక దాడి నుంచి తేరుకున్న ఇజ్రాయెల్ ప్రతిదాడిని ప్రారంభించింది. అధునాతన ఆయుధాలతో గాజాపై విరుచుకుపడుతోంది. ఇప్పటికే ఇజ్రాయెల్ సైన్యం గాజాలో కొంత భాగాన్ని ఆక్రమించింది. హమాస్ వైపు దాదాపు 18వేల పైగా మంది మరణించారు. ఇజ్రాయెల్ వైపు 1100 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదీ చదవండి: చెక్ రిపబ్లిక్లో కాల్పులు.. 15 మంది మృతి -
Israel-Hamas war: ఇజ్రాయెల్‌పై బైడెన్ అసంతృప్తి!
వాషింగ్టన్: గాజాలో పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న దండయాత్రను అమెరికా అధ్యక్షుడు బైడెన్ తొలిసారిగా తప్పుబట్టారు. బుధవారం వాషింగ్టన్లో నిధుల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఇజ్రాయెల్ యుద్ధరీతిపై బైడెన్ మాట్లాడారు. ‘‘ ఇజ్రాయెల్ భద్రత అనేది అమెరికాతో ముడిపడి ఉంది. ఇన్నాళ్లూ ఐరోపా సమాఖ్య, యూరప్ దేశాలూ ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలబడ్డాయి. కానీ ఇప్పుడా పరిస్థితి నెమ్మదిగా మారుతోంది. గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న విచక్షణారహిత బాంబుదాడులే ఇందుకు ప్రధాన కారణం. మరి ఈ విషయం ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు తెలుసో తెలీదో. గాజావ్యాప్తంగా ఇళ్లలో ఉన్న సాధారణ ప్రజానీకాన్ని చిదిమేస్తూ భవనాలపై దారుణ బాంబింగ్ కొనసాగుతోంది. ఈ దాడుల పర్వం మరికొన్ని వారాలు, నెలలపాటు కొనసాగుతుందని ఇజ్రాయెల్ సైన్యాధికారులే చెబుతున్నారు. అమా యక పాలస్తీనియన్ల భద్రత ఇప్పుడు ప్రమాదంలో పడింది’’ అని ఇజ్రాయెల్ భీకర గగనతల, భూతల దాడులను బైడెన్ ఆక్షేపించారు. ఈ విషయమై అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలీవాన్ ఈ వారమే ఇజ్రాయెల్‌లో పర్యటించి భారీ దాడులకు ఎప్పుడు చరమగీతం పాడుతారనే దానిపై ఒక హామీ తీసుకోనున్నారు. ‘‘ 2001 సెప్టెంబర్ 11 దాడుల తర్వాత అమెరికా అఫ్గాని స్తాన్‌లో యుద్ధానికి దిగింది. అమెరికా చేసిన ఇలాంటి అతి ‘స్పందన’ తప్పిదాల నుంచి ఇజ్రాయెల్ ఏమీ నేర్చుకున్నట్లు కనిపించట్లేదు. ఇది ఇలాగే కొనసాగితే అంతర్జాతీయ మద్దతును ఇజ్రాయెల్ కోల్పోతుంది’’ అని బైడెన్ హెచ్చరించారు. బైడెన్ వ్యాఖ్యలపై హమాస్ సాయుధసంస్థ ప్రతినిధి బీరుట్ నగరంలో మాట్లాడారు. ‘‘ఈ యుద్ధ విపరి ణామాలు ఇజ్రాయెల్‌లో త్వరలోనే కనిపిస్తాయి. అమెరికాలో అధ్యక్ష ఎన్నికల తర్వాత శ్వేతసౌధంలో బైడెన్ సీటు గల్లంతవుతుంది’’ అని హమాస్ రాజకీయవిభాగం నేత ఒసామా హమ్దాన్ వ్యాఖ్యానించారు. -
దాడులతో చెలరేగిన ఇజ్రాయెల్
డెయిర్ అల్–బాలాహ్(గాజా స్ట్రిప్): హమాస్ మెరుపుదాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ మొదలుపెట్టిన దాడులు భీకర రూపం దాలుస్తున్నాయి. గాజాలో కాల్పుల విరమణ కోరుతూ ఐక్యరాజ్యసమితి తెచ్చిన తీర్మానాన్ని అమెరికా తన వీటో అధికారంతో కాలదన్నిన దరిమిలా ఇజ్రాయెల్ ఆదివారం మరింత రెచ్చిపోయింది. అమెరికా నుంచి తాజాగా మరింతగా ఆయుధ సంపత్తి అందుతుండటంతో ఇజ్రాయెల్ భీకర గగనతల దాడులతో చెలరేగిపోతోంది. 23 లక్షల గాజా జనాభాలో దాదాపు 85 శాతం మంది బతుకుజీవుడా అంటూ స్వస్థలాలను వదిలిపోయినా సరే ఆదివారం ఇజ్రాయెల్ దాడుల తీవ్రతను తగ్గించకపోవడం గమనార్హం. దాదాపు రూ.834 కోట్ల విలువైన యుద్ధట్యాంక్ ఆయుధాలను ఇజ్రాయెల్‌కు అమ్మేందుకు అమెరికా అంగీకరించడం చూస్తుంటే ఇజ్రాయెల్ సేనల దూకుడు ఇప్పట్లో ఆగేట్లు కనిపించడం లేదు. ‘ఐరాస భద్రతా మండలిలో మాకు బాసటగా అమెరికా నిర్ణయాలు తీసుకుంటోంది. యుద్ధం కొనసాగింపునకు వీలుగా కీలక ఆయుధాలు అందేందుకు సహకరిస్తున్న అమెరికాకు నా కృతజ్ఞతలు’ అని ఆదివారం ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు వ్యాఖ్యానించారు. యుద్ధం ఆగదు: ఇజ్రాయెల్ ‘హమాస్‌ను ఈలోపే అంతంచేయాలని అమెరికా మాకు ఎలాంటి గడువు విధించలేదు. హమాస్ నిర్మూలన దాకా యుద్ధం కొనసాగుతుంది. హమాస్ అంతానికి వారాలు కాదు నెలలు పట్టొచ్చు. బం«దీలందర్నీ విడిపిస్తాం’’ అని ఇజ్రాయెల్ జాతీయ భద్రతా సలహాదారు టజాచీ హెనెగ్బీ శనివారం అర్ధరాత్రి తేలి్చచెప్పారు. ‘‘ గాజాలో సరైన సాయం అందక సరిదిద్దుకోలేని స్థాయిలో అక్కడ మానవ విపత్తు తీవ్రతరమవుతోంది. ఇది పశ్చిమాసియా శాంతికి విఘాతకరం’’ అని ఖతార్‌లో ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ఆందోళన వ్యక్తంచేశారు. షిజాయాహ్, జబాలియా శరణార్థి శిబిరాల వద్ద నిరంతరం దాడుల కొనసాగుతున్నాయి. ‘‘కదిలే ప్రతి వాహనంపైనా దాడి జరుగుతోంది. శిథిలాలతో నిండిన మా ప్రాంతాలకు అంబులెన్స్‌లు రాలేకపోతున్నాయి’’ అని జబాలియా ప్రాంత స్థానికురాలు ఒకరు ఏడుస్తూ చెప్పారు. ఖాన్ యూనిస్ పట్టణ చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ హమాస్, ఇజ్రాయెల్ సేనల మధ్య పరస్పర దాడులు జరుగుతున్నాయి. గంటలు నిలబడినా పిండి దొరకట్లేదు సెంట్రల్ గాజాలో ఆహార సంక్షోభం నెలకొంది. ‘‘ ఇంట్లో ఏడుగురం ఉన్నాం. ఐరాస ఆహార కేంద్రానికి రోజూ వస్తున్నా. ఆరేడు గంటలు నిలబడ్డా రొట్టెల పిండి దొరకట్లేదు. రెండు వారాలుగా ఇదే పరిస్థితి. పిండి కరువై ఉట్టిచేతుల్తో ఇంటికెళ్తున్నా’’ అని అబ్దుల్లాసలాం అల్–మజ్దాలా వాలా చెప్పారు. ఇప్పటిదాకా 17,700 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. -
హమాస్ నుంచి బందీల విడుదల.. నెతన్యాహు షాకింగ్ కామెంట్స్
జెరూసలేం: ఇజ్రాయెల్-హమాస్ మధ్య బందీల విడుదల కొనసాగుతోంది. రెండు వర్గాల మధ్య ఈ కార్యక్రమం శని, ఆదివారాల్లో సాఫీగా సాగింది. ఇక, తాజాగా 17 మంది బంధీలను విడుదల చేసింది. దానికి ప్రతీగా ఇజ్రాయెల్.. దాదాపు 75 మంది పాలస్తీనా ఖైదీలను వదిలిపెట్టింది. వివరాల ప్రకారం.. ఇజ్రాయెల్, హమాస్ మధ్య రెండు, మూడు విడతల బందీల విడుదల కొనసాగింది. మూడో విడతలో భాగంగా ఆదివారం 14 మంది ఇజ్రాయెలీలతోపాటు ముగ్గురు విదేశీయులను హమాస్ విడిచిపెట్టింది. వీరిలోనూ కొంత మంది ఈజిప్టునకు వెళ్లిపోయారు. మిగిలిన వారిని ఇజ్రాయెల్‌కు రెడ్‌క్రాస్ అప్పగించింది. ప్రతిగా 39 మంది పాలస్తీనీయులను ఇజ్రాయెల్ విడుదల చేస్తోంది. ఆదివారం నాటికి మొత్తం 63 మందిని హమాస్, 114 మందిని ఇజ్రాయెల్ విడిచిపెట్టినట్లయింది. ఇక, బంధీల తరలింపు ప్రకియ నాలుగు రోజలు పాటు కొనసాగనుంది. İsrail'in Serbest Bıraktığı, Filistinli Mahkumlar, Aileleri İle Buluşmaya Devam Ediyor. Gazze Bursa Tevfik Göksu Osman Gökçek Ankara Yeşim #ikizlerdolunayı Deniz Binali Yıldırım Murat Kurum Hamas #koraypehlivanoğlututuklansın Filistin pic.twitter.com/aC7mevApCx — 🇹🇷 Abdulhamid Denge 🇹🇷 (@AbdulhamidDenge) November 27, 2023 More and more children are being released from Israeli prisons Yes, you read that right, KIDS. For years, Israel has kept children in prisons as adults. 8, 10, 16 years doesn't matter. They are imprisoned, mistreated and beaten for years. Why are they accused? As… pic.twitter.com/s8df6SStes — Megatron (@Megatron_ron) November 26, 2023 ఇదిలా ఉండగా.. గాజా స్ట్రిప్‌పై పట్టుబిగించేందుకు ఇజ్రాయెల్ ప్రయత్నిస్తోందన్న వాదనకు బలం చేకూరుస్తూ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆదివారం గాజాలో అడుగుపెట్టారు. యుద్ధంలో మునిగి తేలుతున్న తమ సైనికుల్లో నైతిక స్థైర్యం పెంచేందుకే వచ్చానని చెప్పారు. ఇజ్రాయెల్ బయట పెట్టిన హమాస్ సొరంగం వద్ద తమ కమాండర్లు, సైనికులతో మాట్లాడారు. ఈ సందర్భంగా నెతన్యాహు..‘మనవి మూడే లక్ష్యాలు. హమాస్ అంతం. బందీలందరినీ క్షేమంగా విడిపించడం. భవిష్యత్తులో మరెన్నడూ ఇజ్రాయెల్‌కు ముప్పుగా మారకుండా గాజాను సరిచేయడం’ అని అన్నారు. మరోవైపు.. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి, చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఉత్తర గాజాలో పర్యటించారు. היום בסיור בעזה: נמשיך עד הסוף - עד לניצחון. pic.twitter.com/e2aEA7Gfa4 — Benjamin Netanyahu - בנימין נתניהו (@netanyahu) November 26, 2023 -
Israel-Hamas war: గాజాలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు
జెరూసలేం: గాజా స్ట్రిప్‌పై పట్టుబిగించేందుకు ఇజ్రాయెల్ ప్రయతి్నస్తోందన్న వాదనకు బలం చేకూరుస్తూ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆదివారం అక్కడ అడుగుపెట్టారు. యుద్ధంలో మునిగి తేలుతున్న తమ సైనికుల్లో నైతిక స్థైర్యం పెంచేందుకే వచ్చానని చెప్పారు. ఇజ్రాయెల్ బయట పెట్టిన హమాస్ సొరంగం వద్ద తమ కమాండర్లు, సైనికులతో మాట్లాడారు. ‘‘మనవి మూడే లక్ష్యాలు. హమాస్ అంతం. బందీలందరినీ క్షేమంగా విడిపించడం. భవిష్యత్తులో మరెన్నడూ ఇజ్రాయెల్‌కు ముప్పుగా మారకుండా గాజాను ‘సరిచేయడం’’ అని అన్నారు. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి, చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఉత్తర గాజాలో పర్యటించారు. -
జస్టిన్ ట్రూడో Vs నెతన్యాహు.. ఇజ్రాయెల్ దాడులపై కౌంటర్లు..
జెరూసలేం: ఇజ్రాయెల్ సేనల దాటికి గాజా విలవిల్లాడుతోంది. హమాస్ ఉగ్రవాదులే లక్ష్యంగా సైన్యం జరుపుతున్న దాడుల్లో ఎన్నో అమానవీయ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇజ్రాయెల్ దాడులో పిల్లలు, మహిళలు భారీగా సంఖ్యలో చనిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ దాడులపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ కార్యక్రమంలో ట్రూడో మాట్లాడుతూ.. ఇజ్రాయెల్ ప్రభుత్వం సంయమనం పాటించాలని నేను కోరుతున్నాను. గాజాపై ఇజ్రాయెల్ దాడులను ప్రపంచమంతా చూస్తోంది. ఇజ్రాయెల్ దాడుల్లో మృతిచెందిన వైద్యులు, కుటుంబాలను కోల్పోయిన వారిని, ప్రాణాలతో బయటపడినవారిని, తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలను చూస్తున్నాము. మహిళలు, పిల్లలను టార్గెట్ చేస్తూ కూడా ఇజ్రాయెల్ దాడులకు తెగబడుతోంది. ఇప్పటికైనా వారి విషయంలో మానవత్వం చూపించాలని కోరారు. ఇదే సమయంలో హమాస్‌ను ఉద్దేశించి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధంలో సామాన్య పాలస్తీనియన్లను అడ్డుపెట్టుకోవడం సరికాదన్నారు. హమాస్ వద్ద బంధీలుగా ఉన్న ఇజ్రాయెల్ పౌరులను వెంటనే విడిచిపెట్టారని కామెంట్స్ చేశారు. ఇక, కెనడా ప్రధాని ట్రూడో వ్యాఖ్యలపై ఇజ్రాయెల్ పీఎం బెంజిమిన్ నెతన్యాహు కౌంటరిచ్చారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన నెతన్యాహు.. అక్టోబర్ ఏడో తేదీన హమాస్ దాడుల గురించి ప్రస్తావించారు. వారి దాడుల్లో 1200 మంది ఇజ్రాయెల్ పౌరులు మృత్యవాపడ్డారని అన్నారు. ఉద్దేశపూర్వకంగా పౌరులను లక్ష్యంగా చేసుకున్నది ఇజ్రాయెల్ కాదు. హోలోకాస్ట్ నుండి యూదులపై జరిగిన దాడుల్లో హమాస్ ఎంతో దారుణంగా వ్యవహరించింది. సామాన్య పౌరులను ఊచకోత కోసింది. ఇజ్రాయెల్.. గాజా పౌరుల కోసం సేఫ్ జోన్లు, మానవతా కారిడార్లను అందిస్తోంది. కానీ, హమాస్ వాటిని కూడా అడ్డుపెట్టుకుని నేరాలకే పాల్పడుతోంది. వారి వెనుక దాక్కోని కాల్పులకు తెగబడుతోందన్నారు. హమాస్ అనాగరిక చర్యలను ఓడించేందుకు అన్ని దేశాలు ఇజ్రాయెల్‌కు మద్దతివ్వాలని కోరారు. .@JustinTrudeau It is not Israel that is deliberately targeting civilians but Hamas that beheaded, burned and massacred civilians in the worst horrors perpetrated on Jews since the Holocaust. While Israel is doing everything to keep civilians out of harm’s way, Hamas is doing… — Benjamin Netanyahu - בנימין נתניהו (@netanyahu) November 15, 2023 -
గాజాలో కాల్పుల విరమణ పిలుపుపై ఇజ్రాయెల్ స్పందన
టెల్ అవీవ్: గాజాలో కాల్పుల విరమణ పిలుపుపై ఇజ్రాయెల్ స్పందించింది. అది ఎట్టి పరిస్థితుల్లో జరగదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహూ ప్రకటించారు. కాల్పుల విరమణ పాటిస్తేనే.. మానవతా సాయం గాజాకు అందుతుందని, లేకుంటే అక్కడి పరిస్థితులు మానవతా సంక్షోభానికి దారి తీస్తాయని ఐక్యరాజ్య సమితి హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలోనే నెతన్యాహూ స్పందించారు. ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధంలో కాల్పలు విరమణ ఉండదు. ఎందుకంటే అది హమాస్‌కు లొంగిపోవడమే అవుతుంది గనుక అని అన్నారాయన. ‘‘కాల్పుల విరమణ కోసం ఇస్తున్న పిలుపు.. ఇజ్రాయెల్ హమాస్‌కు లొంగిపోవాలని, ఉగ్రవాదానికి లొంగిపోవాలని పిలుపు ఇవ్వడమే అవుతుంది. కాబట్టి అది జరగదు. యుద్ధంలో గెలిచే వరకు ఇజ్రాయెల్ పోరాడుతుంది అని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ సోమవారం ప్రకటించారు. మరోవైపు ఇజ్రాయెల్ మిత్రదేశమైన అమెరికా కూడా కాల్పుల విరమణపై అభ్యంతరం వ్యక్తం చేసింది.‘‘ప్రస్తుత ఉద్రిక్తతలకు కాల్పుల విరమణ సరైన సమాధానం అని మేము భావించం అని అమెరికా జాతీయ భద్రతా మండలి ప్రతినిధి జాన్ కిర్బీ అన్నారు. అయితే గాజాలో సాయం అందాలంటే.. యుద్ధ విరమణల సమయం కేటాయిస్తే సరిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు. -
మేం యుద్ధ భూమిలో.. ఆయన కొడుకు అలానా?
‘మేం కుటుంబాన్ని వదిలేశాం. యుద్ధ భూమిలో ముందు నిలబడ్డాం. కానీ, ఆయన దేశ ప్రధానికి కొడుకు. ఆయన మాత్రం మియామీ బీచ్‌లో జీవితాన్ని ఆస్వాదిస్తున్నాడు’ అని ఒకరు.. ‘నేను నా జీవితనం, నా కుటుంబం, ఉన్న ఊరిని వదిలేసి వచ్చా.. క్లిష్ట సమయంలో నా దేశాన్ని వదిలేయలేదు. మరి ప్రధాని తనయుడు ఎక్కడ?’.. ఇంత పెద్ద యుద్ధం జరుగుతుంటే ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహూ 32 ఏళ్ల తనయుడు ఎక్కడ? అనే ప్రశ్న సర్వత్రా వినిపిస్తోంది. ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజిమన్ నెతన్యాహూ తీరుపై సొంత దేశాల ప్రజలే తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ఆడామగా, యువకులు, ముసలి తేడా లేకుండా హమాస్‌తో జరుగుతున్న పోరులో ఇజ్రాయెల్ పౌరులు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. విదేశాల నుంచి వచ్చిన వలంటీర్లు సైతం కదన రంగంలోకి దిగారు. కానీ, ప్రధాని తనయుడు మాత్రం అమెరికాలో సెలవుల్ని ఆస్వాదిస్తున్నాడు. నెతన్యాహూ తనయుడు యైర్(32) ఈ ఏడాది ఆరంభంలో ఫ్లోరిడాకు వెళ్లారు. అక్కడ బీచ్‌లో యైర్ రిలాక్స్‌గా గడుపుతున్న ఫొటోలు నెట్లో వైరల్ అవుతున్నాయి. ఈ మధ్యే 32వ పుట్టినరోజు వేడుకగా చేసుకున్నాడు. ఆ ఫొటోలు స్వయంగా యైర్ పోస్ట్ చేయడంతో విమర్శలు ఉవ్వెత్తున వచ్చిపడుతున్నాయి. యైర్.. బెంజిమిన్ నెతన్యాహూ మూడో భార్య కొడుకు. ఇస్లామిక్ వ్యతిరేక పోస్టులతో గతంలో వార్తల్లోకి ఎక్కాడు. ఇజ్రాయెల్ నుంచి ముస్లింలంతా వెళ్లిపోతేనే శాంతి అంటూ పోస్ట్ చేసి.. తాత్కాలికంగా బ్యాన్‌ను ఎదుర్కొన్నాడు. Israeli PM #BenjaminNetanyahu’s son, Yair Netanyahu’s is facing fire from Israeli soldiers. #Watch to know why pic.twitter.com/I5VFC2hhMO — Hindustan Times (@HindustanTimes) October 25, 2023 Video Credits: Hindustan Times -
ఇజ్రాయెల్‌కు పూర్తి మద్ధతు: రిషి సునాక్
టెల్ అవివ్: బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ గురువారం యుద్ధ ప్రభావిత ప్రాంతం ఇజ్రాయెల్‌లో పర్యటిస్తున్నారు. హమాస్‌తో పోరాడుతున్న ఇజ్రాయెల్‌కు తాము పూర్తి మద్దతు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. ఇప్పుడూ, ఎప్పుడూ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఈ దేశం పక్షాన నిలబడతామని పేర్కొన్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఇజ్రాయెల్‌లో అడుగుపెట్టిన రిషి సునాక్‌కు.. ఆ దేశ అధ్యక్షుడు బెంజమిన్ ఘన స్వాగతం పలికారు. అనంతరం ఇరు దేశాల అగ్రనేతలు ఉమ్మడి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రిషి సునాక్ మీడియాతో మాట్లాడారు. హమాస్లా కాకుండా తమ పౌరులకు ఏ హానీ జరగకుండా ఇజ్రాయెల్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న విషయం తమకు తెలుసన్నారు. యుద్ధ ప్రాంతం నుంచి బ్రిటిష్ పౌరులను తరలించినందుకు నెతన్యాహుకి ధన్యవాదాలు తెలిపారు. ఇజ్రాయెల్ పౌరులే కాక పాలస్తీనియన్లు కూడా హమాస్ బాధితులని తాము గుర్తించినట్లు పేర్కొన్నారు. To have a child taken from you is a parent’s worst nightmare. This morning I heard from families going through this unbearable agony. Working with our partners, we’re determined to secure the release of the hostages taken by Hamas terrorists. pic.twitter.com/F7AV021o9x— Rishi Sunak (@RishiSunak) October 19, 2023 మానవతా సహాయం కోసం సరిహద్దులను తెరిచినందుకు సంతోషంగా ఉందన్నారు. అన్నింటికంటే మించి ఇజ్రాయెల్ ప్రజలకు సంఘీభావాన్ని తెలియజేయడానికి ఇక్కడకు వచ్చినట్లు చెప్పారు. ఇజ్రాయెల్ మాటల్లో చెప్పలేని భయంకరమైన తీవ్రవాద చర్యను ఎదుర్కొంటుందని, యునైటెడ్ కింగ్డమ్, తాను ఆ దేశానికి అండగా ఉన్నామని భరోసా ఇస్తున్నట్లు తెలిపారు. చదవండి: పాలస్తీనాకు మద్దతుగా అమెరికాలో ఆందోళనలు British PM Rishi Sunak arrives in Tel Aviv, Israel, according to Reuters. (Photo source: Reuters) pic.twitter.com/V2plUYLe2p — ANI (@ANI) October 19, 2023 కాగా పాలస్తీనా ఉగ్ర సంస్ధ హమాస్ దాడులు, ఇజ్రాయెల్ ప్రతిదాడులతో మిడిల్ ఈస్ట్ అట్టుడుకుతోంది. మరింత ప్రాంతాలకు వ్యాపించకుండా యుద్ధంవెంటనే ఆపాలని ప్రపంచ నేతలు కోరుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇజ్రాయెల్‌లో పర్యటించారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, అధ్యక్షుడితో సమావేశమై యుద్ధ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. హమాస్‌కు వ్యతిరేకంగా చేస్తోన్న పోరులో ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతుగా నిలుస్తుందని చెప్పారు. యుద్ధం నేపథ్యంలో తర్వాత చేపట్టాల్సిన చర్యలపైనా చర్చించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఆ వెంటనే నేడు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ యుద్ధ భూమిలో అడుగుపెట్టారు.


