యుద్ధంపై ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు | US and israel Attacks on Iran 2nd March Live Updates | Sakshi
Sakshi News home page

Live Updates

Cricker

యుద్ధంపై ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు

ఇరాన్‌ దాడులపై గల్ఫ్‌ దేశాల ప్రకటన

  •  మాపై ఇరాన్‌ దాడులు తగదు
  • తక్షణమే ఇరాన్‌ దాడులు ఆపాలి
  • ఇరాన్‌ రక్షణమంత్రిగా మజీద్‌ ఎబ్‌నల్‌రజా నియామకం
  • ప్రస్తుతం రివల్యూషనరీ గార్డ్స్‌ జనరల్‌గా ఉన్న ఎబ్‌నల్‌రజా
  • ఇటీవల ఇజ్రాయిల్‌- అమెరికా దాడుల్లో ఇరాన్‌ రక్షణమంత్రి మృతి

 

2026-03-02 21:47:29

ఢిల్లీ :

  • మిడిల్ ఈస్ట్ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్న కేంద్ర పౌర విమానయాన శాఖ
  • యుద్ధం నేపథ్యంలో షెడ్యూల్ చేసిన 357 విమానాలు రద్దు
  • ప్రయాణికులకు సహాయంగా Passenger Assistance Control Room  ద్వారా ఫిర్యాదుల పరిష్కారం
  • ఇవాళ 559 ఫిర్యాదులు పరిష్కారం
  • ఎయిర్‌లైన్స్, సంబంధిత సంస్థలతో సమన్వయం
  • AirSewa, సోషల్ మీడియా, ప్రత్యేక హెల్ప్‌లైన్ ద్వారా ఫిర్యాదుల స్వీకరణ
  • ప్రయాణికులు విమాన రద్దు, రీషెడ్యూల్ వివరాల కోసం అధికారిక ఎయిర్‌లైన్ ను సంప్రదించండి

PACR హెల్ప్‌లైన్ నంబర్లు:011-24604283 / 011-24632987

2026-03-02 21:13:57

యుద్ధంపై ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు

  • మేం ఇంకా యుద్ధాన్ని ఉధృతం చేయలేదు
  • త్వరలోనే దాడులను ఉధృతం చేస్తాం
  • మా జోలికి వచ్చినవారిని వదిలిపెట్టం
  • ఇరాన్‌పై మరింత భీకర దాడులు చేస్తాం
  • ఇరాన్‌ ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దు
     
2026-03-02 21:11:52

యుఎస్‌కు షాకిచ్చిన స్పెయిన్

  • యుఎస్‌ను మా దేశం నుంచి దాడి చేసేందుకు అనుమతించం
  • ఇరాన్‌పై దాడికి మా దేశాన్ని వాడనివ్వం 
  • స్పెయిన్ ఆదేశాలతో వెనుతిరిగిన యుఎస్ 
2026-03-02 20:45:35

దుబాయి కీలక ప్రకటన

  • విమాన సర్వీసులు పునః ప్రారంభిస్తున్నట్లు ప్రకటన
  • సాయంత్రం నుంచి విమాన సర్వీసులు ప్రారంభం 
2026-03-02 20:13:45

యుఎస్‌ స్థావరాలపై ఇరాన్ మిసైల్స్ దాడులు

  • దోహాలోని యుఎస్‌ స్థావరాలపై ఇరాన్‌ మిసైల్స్ దాడి
  • ఖతార్‌లోని యుఎస్‌ స్థావరాలపై ఇరాన్‌ మిసైల్స్ దాడి 
  • లెబనాన్‌లో అమెరికన్లను అప్రమత్తం చేసిన యుఎస్ 
  • లెబనాన్ వదిలి వెళ్లిపోవాలని యుఎస్ ఎంబసీ ఆదేశం 
2026-03-02 20:07:56

అమెరికా బేస్‌లకు భారీగా యుద్ధ విమానాలు

  • ఇరాన్‌తో యుద్ధం నేపథ్యంలో సైనిక శక్తిని మరింతగా పెంపు 
  • మధ్య ప్రాచ్యానికి మరిన్ని అదనపు అమెరికా బలగాలు జనరల్ డాన్‌ కైన్
  • కువైట్, సౌదీ అరేబియా బేస్‌లకు భారీగా యుద్ధవిమానాలు, క్షిపణులు
  • యుద్దంలో ఇరుపక్షాలకు నష్టం కలగుతుంది
  • కేవలం అణ్వాయుధాలను అంతం చేసేందుకు యుద్దం 
  • గల్ఫ్ తీరంలో ఇప్పటికే సిద్ధంగా ఉన్న రెండు యుద్ధ నౌకలు 
  • ప్రతీకార దాడుల నుంచి మిత్రదేశాలను కాపాడటమే లక్షం 
  • పోరాటానికి సిద్ధంగా ఉండాలని  సైన్యానికి పిలుపునిచ్చిన జనరల్
     
2026-03-02 19:40:36

రష్యా,తుర్కియే మధ్యవర్తిత్వం వహించాలి

  • రేపు రష్యాతో చర్చలు జరుపుతామన్న ఇరాన్ ఆర్థిక మంత్రి 
  • రేపు పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడుతామని వెల్లడి 
  • ఇదివరకే తుర్కియే అధ్యక్షుడితో మాట్లాడాం:ఇరాన్ 
  • రష్యా, తుర్కియే మధ్యవర్తిత్వం వహించాలని కోరాం
  • ఇజ్రాయెల్ దాడులు అంతర్జాతీయ న్యాయసూత్రాలకు విరుద్ధం 
  • మా దేశ సౌర్వభౌమత్వం, సమగ్రత కాపాడుకుంటాం: ఇరాన్
2026-03-02 19:32:55

ఇరాన్ సుప్రీం ఖమేనీ భార్య మృతి

  • ఇజ్రాయెల్ దాడుల్లో తీవ్రంగా గాయపడ్డ ఖమేనీ భార్య
  • చికిత్స పొందుతూ మృతి చెందిన ఖమేనీ భార్య 
  • ఇజ్రాయెల్, అమెరికా జరిపిన దాడుల్లో ఖమేనీ మృతి
2026-03-02 19:23:26

యుద్ధంపై అమెరికా రక్షణశాఖ కీలక ప్రకటన

  • యుద్ధం మేం ప్రారంభించలేదు.. మేము ముగిస్తాం
  • మేం ఎన్నిసార్లు హెచ్చరించినా ఇరాన్‌ అణ్వాయుధాల తయారీ కొనసాగించింది
  • అమెరికా, ఇజ్రాయెల్‌కు చావేనని ఖమేనీ అన్నారు
  • కానీ యుద్ధంలో ఖమేనీ చనిపోయారు
  •  మేము ఇరాన్‌ పాలకులను మార్చడానికి యుద్ధం చేయడం లేదు
  • ఆ దేశంలో  అణ్వాయుధాలను అంతం చేయడానికే యుద్ధం
  • మాతో పెట్టుకుంటే ఎంతటి వారినైనా వదిలిపెట్టం
  • వేటాడి మరి మట్టుబెడతాం
2026-03-02 19:01:10

ఇరాన్‌పై దాడి చేస్తాం..సౌదీ అరేబియా

  •  సౌదీ చమురు నిల్వలపై ఇరాన్ దాడి జరిపితే..టెహ్రాన్‌లోని చమురు నిల్వలపై సౌదీ దాడి చేస్తుంది.
  • దాడికి ప్రతిదాడి ఉంటుందని ప్రకటించిన సౌదీ అరేబియా
2026-03-02 18:45:48

2,500 పేలుడు పదార్థాలతో ఇరాన్‌పై దాడి

  • మూడోరోజు యుద్ధంలో ఇరాన్‌పై భారీ దాడులు 
  • భారీ సంఖ్యలో డ్రోన్లు, మిసైల్స్‌తో ఇరాన్‌పై దాడి
  • 600 టెర్రరిస్టు స్థావరాలు ధ్వంసం 
  • దాడుల వివరాలు ప్రకటించిన ఇజ్రాయెల్ 
2026-03-02 18:38:45

గల్ఫ్‌ దేశాల నేతలతో ప్రధాని మోదీ ఫోన్ కాల్

  • గల్ఫ్‌ దేశాల్లో భారతీయుల భద్రతపై చర్చ
  • గల్ఫ్‌ దేశాధినేతలకు ప్రధాని మోదీ ఫోన్‌
     
2026-03-02 18:35:48

దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫాపై క్షిపణి ప్రయోగించిన వార్త నిజమైతే అది చాలా దారుణం: తేజస్వీ యాదవ్‌

తేజస్వీ యాదవ్‌

 

  

 

 

 

 

2026-03-02 18:32:09

ఇరాన్ రక్షణ మంత్రిగా మజీద్ ఎబ్‌నల్‌రజా

  • ఇరాన్ రక్షణ మంత్రిగా మజీద్ ఎబ్‌నల్‌రజా నియామకం        
  • ప్రస్తుతం రివల్యూషనరీ గార్డ్స్ జనరల్‌గా ఉన్న ఎబ్‌నల్‌రజా
2026-03-02 17:55:57

దాడుల్లో భారతీయుడు మృతి

  • ఒమన్ ట్యాంకర్ తీరంపై జరిపిన దాడిలో భారతీయుడు మృతి 
  • మన్ తీరంలో ట్యాంకర్‌పై జరిగిన దాడిలో భారతీయుడు మృతి
  •  భారతీయుడు చనిపోయినట్లు ప్రకటించిన తీరగస్తీ దళం 
     
2026-03-02 17:47:23

ఇరాన్ కీలక అధికారులను చంపాం.. ఇజ్రాయెల్ ట్వీట్

  • ఇరాన్ నిఘా శాఖలో ఇద్దరు సీనియర్ అధికారుల మృతి
  • ఇద్దరు అధికారులను చంపినట్లు ఇజ్రాయెల్ రక్షణదళం ట్వీట్
  • ఇరాన్ నిఘాశాఖ సహాయ మంత్రి యాహ్యా హమీద్ మృతి 
  • ఇరాన్ గూఢచర్య అధిపతి జలాల్ పోర్ హుస్సేన్ మృతి 
     
2026-03-02 17:47:23

టూరిస్ట్ వీసాపై వెళ్లిన వారి గడువు పెంపు

  • విజిటింగ్ వీసాపై వెళ్లిన వారు UAEలో ఉండొచ్చని ‍ప్రకటన
  • ప్రశాంత పరిస్థితులు నెలకొనే వరకూ UAEలో ఉండొచ్చని ప్రకటన
  • యుద్ధపరిస్థితుల నేపథ్యంలో నిబంధనలు సడలింపు   
     
2026-03-02 16:31:11

నెతన్యాహు ఆఫీసుపై ఇరాన్ దాడి

  • ఇజ్రాయిల్ ప్రధాని ఆఫీసుపై ఇరాన్ దాడి
  • నెతన్యాహు ఆఫీసుపై దాడి చేశామని ‍ప్రకటించిన ఇరాన్
  • నెతన్యాహు ఆఫీసుపై మిస్సైల్స్ దాడి చేశాం 
  • నెతన్యాహూ ఎక్కడున్నారో స్పష్టత లేదు 
     
2026-03-02 15:47:42

ఇరాన్ ఘర్షణల నిలిచిపోయిన వాణిజ్య నౌకలు

  •  హర్మూజ్ జలసంధి మీదుగా నిలిచిపోయిన వాణిజ్య నౌకలు
  • ఐరోపాకు ప్రధానంగా గ్యాస్ అందించే నౌకలు 
  • ఖతార్ నుంచి వచ్చే LNG నౌకలు నిలిపివేత 
  • చలికాలం కారణంగా ఇప్పటికే ఐరోపాలో తగ్గిన గ్యాస్ నిల్వలు 
  • గ్యాస్ పెరుగుదల వల్ల ఐరోపాలో ద్రవ్యోల్బణం 
  • ద్రవ్యోల్బణం కారణంగా పరిశ్రమలు మూతపడే అవకాశం
2026-03-02 15:38:34

యుద్ధం ఎఫెక్ట్.. పెరిగిన చమురు వాయువు ధరలు

  • యూరప్‌లో ఒక్కసారిగా పెరిగిన సహజవాయువు ధరలు
  • ధరల ప్రభావం ఇతర దేశాలపై చూపే అవకాశం
  • ఒక్కసారిగా 25శాతం పెరిగిన చమురువాయువు ధరలు
     
2026-03-02 15:25:03

అమెరికా రక్షణ మంత్రి కీలక ప్రెస్‌మీట్

  • ఈ రోజు రాత్రి మీడియా ముందుకు రానున్న రక్షమమంత్రి హెగ్‌సెత్
  • భారత కాలమానం ప్రకారం రాత్రి 9.30 గంటలకు ప్రెస్‌మీట్ 
2026-03-02 15:22:49

ఇజ్రాయెల్ దాడులలో లెబనాన్‌లో భారీగా మృతులు

  • లెబనాన్‌లో 31 మంది మృతి, 140 మందికి గాయాలు 
  • మృతుల వివరాలు విడుదల చేసిన లెబనాన్ ఆరోగ్యశాఖ 
  • బీరుట్ ప్రాంతంలోని సహియే ప్రాంతంపై దాడులు 
2026-03-02 15:22:49

ఇరాన్‌ అణుకేంద్రాల వద్ద యురేనియం లీక్‌ అయ్యే ప్రమాదం

  • తీవ్రంగా హెచ్చరించిన ఐఏఈఏ
  • కీలకమైన నటాంజ్‌ అణు కేంద్రంపై దాడుల తర్వాత ఉద్రిక్తత
  • రేడియేషన్‌ విడుదలైతే భారీ స్థాయిలో జనాభాను తరలించాల్సి వస్తుందని ఆందోళన
  • అణు కేంద్రాల వద్ద ఐఏఈఏ తనిఖీలకు ఇరాన్‌ అనుమతించకపోవడంతో అస్పష్టత
  • అణు విపత్తు సంభవిస్తే అది మధ్యప్రాచ్యం దాటి ఇతరదేశాలపై కూడా ప్రభావం చూపే అవకాశం
     
2026-03-02 15:09:07

గల్ఫ్ దేశాలకు మద్దతుగా ఫ్రాన్స్

  • గల్ఫ్ దేశాలకు మద్ధతుగా ఉంటామని ప్రకటించిన ఫ్రాన్స్ 
  • గల్ఫ్ దేశాలపై దాడులు చేస్తున్న ఇరాన్
  • ఈ నేపథ్యంలో మద్దతు ప్రకటించిన ఫ్రాన్స్   
2026-03-02 14:45:25

ఇరాన్‌లో 555 మంది మృతి

  • ఇరాన్‌లో 555 మంది మృతి చెందినట్లు ఇరాన్‌ రెడ్ క్రాసెంట్ వెల్లడి
  • అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో  555 మంది మృతి చెందినట్లు ప్రకటన   
  • 131 నగరాలపై దాడులు జరిగాయన్న ఇరాన్
     
2026-03-02 14:33:47

అమెరికాతో ఇక చర్చలుండవు: ఇరాన్

  • అమెరికాతో చర్చల ప్రసక్తే లేదు: ఇరాన్
  • చర్చలకై అమెరికా మమ్మల్ని ఆహ్వానించలేదు
  • ట్రంప్ వ్యాఖ్యలను కొట్టిపడేసిన ఇరాన్ 
2026-03-02 14:23:59

పశ్చిమాసియా యుద్ధంపై మోదీ కీలక ప్రకటన

  • భారత్ ఎప్పుడూ శాంతి కోసం కృషి చేస్తుంది: మోదీ
  • పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది
  • చర్చలతోనే సమస్యకు పరిష్కారం:మోదీ
2026-03-02 14:19:21

కువైట్‌ రక్షణ శాఖ కీలక ప్రకటన.

  • కువైట్‌లోని అమెరికా ఎంబసీలపై దాడులు 
  • ఎంబీసీ నుంచి భారీ ఎగిసిపడుతున్న మంటలు. 
  • కువైట్‌ రక్షణ శాఖ కీలక ప్రకటన. 
  • అమెరికా యుద్ధ విమానాలు చాలా కూలిపోయాయి: కువైట్‌
  • అమెరికా యుద్ధ విమానాలను తామే కూల్చామని ఇరాన్‌ వెల్లడి.
  • టర్కీలోని యూఎస్‌ సైనిక స్థావరాలపై ఇరాన్‌ దాడులు.
  • క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతున్న ఇరాన్‌.
  • ఎప్పుడేం జరుగుతోందనన్న ఆందోళనలో ప్రవాస భారతీయులు. 
2026-03-02 13:41:09

ఇరాన్‌ డ్రోన్ల విధ్వంసం.. భారీ మంటలు..

  • ఆయిల్‌ రిఫైనరీలపై ఇరాన్‌ డ్రోన్‌ దాడులు
  •  ఆరామ్‌కో ఆయిల్‌ రిఫైనరీపై ఇరాన్‌ దాడి.
  • డ్రోన్లతో భారీ విధ్వంసం.
  • రోజుకు 5.5లక్షల బ్యారెళ్ల చమురు ఉత్పత్తికి ఆటంకం. 
  • ఎగిసిపడుతున్న మంటలు. 

 

 

2026-03-02 13:41:09

ఇరాన్‌ మళ్లీ దాడులు

  • అబుదాబి, ఖతార్‌, దుబాయ్‌, బహ్రెయిన్‌ ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ మళ్లీ దాడులు
  • తాజాగా సోమవారం ఇరాన్‌ క్షిపణులు ప్రయోగించినట్లు వెల్లడించిన ఐడీఎఫ్‌
  • దుబాయ్‌, అబుదాబీ, ఖతార్‌లో పేలుళ్ల శబ్దాలు.. 
2026-03-02 13:32:34

లెబనాన్‌లో 31 మంది మృతి

  • ఇజ్రాయెల్‌ దాడులతో లెబనాన్‌లో 31 మంది మృతి
  • లెబనాన్‌లో ఇరాన్ మద్దతు హెజ్‌బొల్లా నాయకులే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ దాడులు
  • హెజ్‌బొల్లా మిలిటెంట్‌ సంస్థ దాడులకు ప్రతిదాడులు చేసిన ఇజ్రాయెల్
  • తమ గగనతలంలోకి వచ్చిన క్షిపణిని కూడా నేలకూల్చామన్న ఇజ్రాయెల్
2026-03-02 13:30:20

ప్లాన్‌ మార్పు.. ఇరాన్‌ క్షిపణుల దాడి..

  • ఇజ్రాయెల్‌ సహా అమెరికా మిత్రదేశాలపై ఇరాన్‌ క్షిపణుల దాడి
  • కువైట్‌లోని అమెరికా ఎంబసీ లక్ష్యంగా మిస్సైల్స్‌ ప్రయోగించిన ఇరాన్‌
  • అమెరికన్లు బయటకు రావొద్దని అప్రమత్తం చేసిన కార్యాలయం సిబ్బంది
  • కువైట్‌లో మినా అల్ అహ్మది చమురు శుద్ధి కర్మాగారంపై దాడి
  • ఖతార్ రాజధాని దోహా, అబుదాబిలో పేలుళ్ల శబ్దాలు
  • మరోసారి బహ్రెయిన్‌లోని యూఎస్‌ బేస్‌ను దెబ్బతీసిన ఇరాన్‌ క్షిపణి
2026-03-02 13:30:20

ఆరామ్‌కో ఆయిల్‌ రిఫైనరీపై ఇరాన్‌ భీభత్సం

  • సౌదీ అరేబియాపై విరుచుకుపడ్డ ఇరాన్‌ డ్రోన్లు

  • అతిపెద్ద ఆయిల్‌ రిఫైనరీని టార్గెట్‌ చేసిన ఇరాన్‌   

  • తస్‌ తనారాలోని ఆరామ్‌కో ఆయిల్‌ రిఫైనరీపై దాడులు

  • డ్రోన్‌లతో ఆయిల్‌ రిఫైనరీపై భారీ విధ్వంసం సృష్టించిన ఇరాన్‌ 

  • భారీగా ఎగిసి పడుతున్న మంటలు   

  • 5.5లక్షల బ్యారెళ్ల  చమురు ఉత్పత్తికి ఆటంకం

  • గల్ఫ్‌ ఆదాయ మూలాలను టార్గెట్‌ చేసిన ఇరాన్‌ 

2026-03-02 12:59:21

అమెరికాతో చర్చలపై ఇరాన్‌ యూటర్న్‌.

  • అమెరికాతో చర్చలపై ఇరాన్‌ యూటర్న్‌.
  • ఒమన్‌ మధ్యవర్తిత్వం వహిస్తే చర్చలకు సిద్దమని ఉదయం ప్రకటించిన ఇరాన్‌ విదేశాంగ మంత్రి.
  • తాజాగా అమెరికాతో చర్చించాలనుకోవడం లేదన్న ఇరాన్‌ నేషనల్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ కార్యదర్శి అలీ లరిజానీ
  • తప్పుడు ఆశలతో ట్రంప్‌ ఈ ప్రాంతాన్ని సంక్షోభంలోకి నెట్టారని ఆగ్రహం
  • అమెరికాతో ఎటువంటి చర్చలు జరపే ప్రసక్తే లేదన్నారు.
  • దౌత్యపరమైన వ్యవహారాల్లో అమెరికాది చెత్త రికార్డు అంటూ ఆగ్రహం.
  • ట్రంప్‌ భ్రమలు, ఊహాల్లో ఉన్నారంటై సెటైర్లు. 
     
2026-03-02 10:30:39

చమురు నౌకలపై ఇరాన్‌ దాడి..

  • మూడో రోజుకు చేరుకున్న ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయిల్ యుద్ధం  
  • యుద్ధంతో అట్టుడుకుతున్న పశ్చిమాసియా
  • లెబనాన్‌లోని హెజ్‌బొల్లా ఉగ్రవాద శిబిరాలపై దాడికి దిగిన ఇజ్రాయిల్  
  • గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడుల నేపథ్యంలో టెహ్రాన్‌లోని దౌత్య కార్యాలయాన్ని మూసేసిన అరబ్ ఎమిరేట్స్.
  • హార్మోజ్‌ జల సంధి మూసివేత నేపథ్యంలో పెరగనున్న ముడి చమురు ధరలు
  • నిన్న హర్మోజ్‌ జలసంధిలో నుంచి వెళ్తున్న చమురు నౌకలపై దాడి చేసిన ఇరాన్  
     
2026-03-02 10:03:10

అమెజాన్‌ డేటా సెంటర్‌లో అగ్నికీలలు

  • అమెజాన్‌ డేటా సెంటర్‌లో అగ్నికీలలు
  • యూఏఈలోని అమెజాన్‌ డేటా సెంటర్‌లో అగ్నికీలలు
  • ప్రకటించిన అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌
  • ఆదివారం డేటా సెంటర్‌పై దాడి జరిగినట్లు అనుమానాలు
  • తాత్కాలికంగా విద్యుత్తు సరఫరా నిలిపివేత 
2026-03-02 09:20:09

సైన్యానికి ట్రంప్‌ ఆఫర్‌

  • ఇరాన్‌ ఐఆర్‌జీసీ, మిలిటరీ దళాలకు ట్రంప్‌ ఆఫర్‌
  • ఆయుధాలు వదిలేసిన వారికి ఇమ్యూనిటీని ఇస్తామన్న ట్రంప్‌
  • ఆయుధాలు వదలకపోతే చావు తప్పదని హెచ్చరిక
  • ప్రస్తుత అవకాశాన్ని వాడుకొని ఇరాన్‌ ప్రజలు స్వాతంత్ర్యం పొందాలని ట్రంప్‌ పిలుపు
2026-03-02 09:20:09

అమెరికా స్థావరాలపై ఇరాన్‌ దాడి

  • అమెరికా స్థావరాలపై ఇరాన్‌ దాడి
  • 390 క్షిపణులు.. 830 డ్రోన్లతో పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలపై ఇరాన్‌ దాడి
  • వెల్లడించిన అమెరికా సెంట్రల్‌ కమాండ్‌
  • యూఏఈపై 541 డ్రోన్లు, 165 బాలిస్టిక్‌ క్షిపణులను ప్రయోగించిన ఇరాన్‌..
  • వీటిల్లో 506 డ్రోన్లు, 152 క్షిపణులను కూల్చేసినట్లు వెల్లడించిన అమెరికా రక్షణశాఖ
  • కువైట్‌పై 97 బాలిస్టిక్‌ క్షిపణులు, 283 డ్రోన్లు ప్రయోగించిన టెహ్రాన్‌..
  • ఈ దాడుల్లో ఒకరు మృతి, 30 మందికి గాయాలు
  • 45 క్షిపణులు, తొమ్మిది డ్రోన్లను కూల్చిన బహ్రెయిన్‌
  • ఖతార్‌పై శనివారం 66 క్షిపణులు ప్రయోగించిన ఇరాన్‌
2026-03-02 09:16:20

ఇజ్రాయెల్‌లో సైరన్ల మోత..

  • ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ దాడులు
  • ఇరాన్‌ దాడుల నేపథ్యంలో టెలీ అవీవ్‌లో సైరన్ల మోత.
  • అర్ధరాత్రి ఇజ్రాయెల్‌పై విరుచుకుపడిన ఇరాన్‌ డ్రోన్లు. 
2026-03-02 09:14:01

హెజ్‌బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్‌ దాడులు

  • లెబనాన్‌ రాజధాని బీరుట్‌లోని హెజ్‌బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్‌ దాడులు
  • ఇజ్రాయెల్‌పై దాడికి బాధ్యత తీసుకొంటూ హెజ్‌బొల్లాకు చెందిన అల్‌ మనార్‌ నెట్‌వర్క్‌ ప్రకటన
  • మరోవైపు లెబనాన్‌లోని హెజ్‌బొల్లాపై దాడులను ధ్రువీకరించిన ఐడీఎఫ్‌
  • రాత్రి హెజ్‌బొల్లా తమపై దాడులు మొదలుపెట్టిందని వెల్లడించిన ఐడీఎఫ్‌ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ ఎయాల్‌ జమీర్‌
2026-03-02 09:10:21

యుద్ధం నాలుగు వారాలపాటు జరగొచ్చు: ట్రంప్‌

  • ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ దాడులు కొనసాగుతున్నాయి. 
  • వాషింగ్టన్‌కు బయలదేరే ముందు న్యూయార్క్‌ టైమ్స్‌ ఇంటర్వ్యూలో ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు
  • యుద్ధం నాలుగు వారాలపాటు జరగొచ్చు
  • ఇరాన్‌లో పాలన బదిలీపై విభిన్న వ్యూహాలను వెల్లడించిన ట్రంప్‌
2026-03-02 09:09:20
Advertisement
 
Advertisement
Advertisement