ఇరాన్ హిట్‌ లిస్ట్‌లో ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు? | Benjamin Netanyahu, Israel Defence Minister On Iran's Rumoured 'Hit List' | Sakshi
Sakshi News home page

ఇరాన్ హిట్‌ లిస్ట్‌లో ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు?

Oct 3 2024 5:19 PM | Updated on Oct 3 2024 5:41 PM

Benjamin Netanyahu, Israel Defence Minister On Iran's Rumoured 'Hit List'

ఇజ్రాయెల్‌, ఇరాన్‌ దాడులు, ప్రతీకార దాడులతో పశ్చిమాసియాపై నానాటికీ యుద్ధమేఘాలు దట్టంగా కమ్ముకుంటున్నాయి.లెబనాన్‌ను వైమానిక దాడులతో వణికించి హెజ్‌బొల్లా అగ్రనేతలను వరుసబెట్టి మట్టుపెట్టిన ఇజ్రాయెల్‌.. ఇటు గాజాపై క్షిపణుల వర్షం కురిపిస్తూ హమాస్‌ను అంతమొందించే దిశగా దూకుడుగా వ్యవహరిస్తోంది.

అటు ఇరాన్‌ సైతం వెనక్కి తగ్గడం లేదు.  ఇజ్రాయెల్‌పై క్షిపణులు వర్షం కురిపిస్తూ ప్రతీకార దాడులుకు పాల్పడుతోంది. తాజాగా ఇజ్రాయెల్‌ అగ్రనేతలతో  కూడిన ​ఇరాన్‌ హిట్‌ లిస్ట్‌ జాబితా ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ లిస్ట్‌లో ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహుతోసహా రక్షణమంత్రి యోవ్‌ గాలంట్‌, ఇజ్రాయెల్‌ ఆర్మీ, నేవీ, వైమానిక దళ కమాండర్లు కూడా ఉన్నట్లు రూమర్లు వెల్లువెత్తుతున్నాయి.  అయితే వీటిపై అటు ఇజ్రాయెల్‌ కానీ ఇటు ఇరాన్‌ కానీ స్పందించలేదు. 

ఒకవేళ నెతన్యాహు ఈ జాబితాలో లేకపోయినా..సీనియర్‌ ఇజ్రాయెల్‌ నాయకులను లక్ష్యంగా చేసుకొని ఉండవచ్చనే అనుమానాలే ఇరాన్‌ మిలటరీ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. ఉన్నత స్థాయి సైనిక నాయకులైన జనరల్ స్టాఫ్ హెర్జి హలేవి, డిప్యూటీ అమీర్ బారం,ఉత్తర, దక్షిణ, సెంట్రల్ కమాండ్ అధిపతులు మేజర్ జనరల్స్ ఒరి గోర్డిన్, యెహుదా ఫాక్స్, ఎలియేజర్ తోలెడాని. మిలిటరీ ఇంటెలిజెన్స్ చీఫ్ అహరోన్ హలీవా పేరు కూడా ఉన్నట్లు తెలుస్తోంది

ఇక  జాబితా నిజమే అయితే.. ఇరాన్‌ మద్దతుగల హెజ్‌బొల్ల చీఫ్‌ను అంతం చేసిన ఇజ్రాయెల్‌, తమ తదుపరి టార్గెట్‌ ఆదేశ సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనని మట్టుబెట్టడమేనని వస్తున్న వార్తలకు ప్రతిచర్యగా బెంజమిన్‌ నెన్యాహును ఇరాన్‌ లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement