
ఆయన ఇజ్రాయెల్‌కు ద్రోహం చేశారు
ఆస్ట్రేలియా ప్రధానిపై నెతన్యాహు ఆగ్రహం
వ్యక్తిగతంగా తీసుకోనన్న అల్బనీస్
పాలస్తీనాకు ఆస్ట్రేలియా మద్దతివ్వడంతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు
జెరూసలేం: ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంతోనీ అల్బనీస్ ఇజ్రాయెల్‌కు ద్రోహం చేశారని ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆరోపించారు. ఆ్రస్టేలియాలోని యూదు సమాజాన్ని ఆ దేశం వదిలేసిందన్నారు. బలహీనమైన రాజకీయ నాయకుడిగా ఆయనను చరిత్ర గుర్తుంచుకుంటుందని విమర్శించారు. ఆ్రస్టేలియన్ యూదు సంఘం (ఏజేఏ) నిర్వహించిన కార్యక్రమానికి హాజరవ్వాలన్సిన ఇజ్రాయెల్ నేత సిమ్చా రోత్‌మన్ వీసాను ఆస్ట్రేలియా రద్దు చేసింది.
విభజన రాజకీయాలు చేస్తున్నవారిపై తమ ప్రభుత్వం కఠినమైన వైఖరి తీసుకుంటుందని ఆ దేశ ఇమ్మిగ్రేషన్ మంత్రి టోనీ బర్క్ ప్రకటించారు. ‘మీరు ద్వేషం, విభజన సందేశాన్ని వ్యాప్తి చేయడానికి ఆస్ట్రేలియాకు వస్తున్నట్లయితే.. మీరు ఇక్కడికి రావడం మాకు ఇష్టం లేదు’అని బర్క్ స్పష్టం చేశారు. దీంతో రోత్‌మన్ సమావేశంలో వర్చువల్‌గా పాల్గొని, ప్రసంగిస్తారని ఏజేఏ తెలిపింది. యూదు సమాజం టోనీ బర్క్‌కు, విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్‌కు తలవంచదని ప్రకటించింది. ఈ పరిణామాల పట్ల నెతన్యాహు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
వ్యక్తిగతంగా తీసుకోను
అయితే.. నెతన్యాహు వ్యాఖ్యలపై బర్క్ బుధవారం స్పందించారు. పాలస్తీనాను దేశంగా గుర్తిస్తున్నట్లు ఆ్రస్టేలియా ప్రకటించినందుకే ఆయనకు ఆగ్రహం వస్తోందన్నారు. ఇక.. బలమైన నాయకుడంటే.. ఇతర దేశాలపై దాడులు చేసేవారు, ఇతర దేశాల్లో ప్రజలను ఆకలితో చంపేవారు కాదని, దాడులు, హత్యలతో ఒక దేశాధ్యక్షుడి బలాన్ని అంచనా వేయలేమని ఎద్దేవా చేశారు. నెతన్యాహు వ్యాఖ్యలపై ప్రధాని అల్బనీస్ సైతం స్పందించారు. వాటిని వ్యక్తిగతంగా తీసుకోనన్నారు. తాను ఇతర దేశాల నాయకులను గౌరవంగా చూస్తానని, దౌత్యపరంగా వారితో సంభాíÙస్తానని హుందాగా చెప్పుకొచ్చారు. అయితే ఇజ్రాయెల్ మితవాద నేతల వీసాలను ఆ్రస్టేలియా రద్దు చేయడం ఇదే మొదటిసారి కాదు. 2022లో పార్లమెంటును విడిచిపెట్టిన నాయకురాలు, ఇజ్రాయెల్ మాజీ న్యాయ మంత్రి అయెలెట్ షేక్డ్‌కు కూడా వీసా నిరాకరించారు.
నెతన్యాహుతో ఘర్షణ పడేవారే అసలైన నాయకుడు
నెతన్యాహు వ్యాఖ్యలను ఇజ్రాయెల్ ప్రతిపక్ష నాయకుడు యైర్ లాపిడ్ విమర్శించారు. అంతేకాదు.. ఆయన వ్యాఖ్యలను ఆ్రస్టేలియా నాయకునికి బహుమతిగా అభివరి్ణంచారు. ‘రాజకీయంగా అత్యంత విషపూరిత నాయకుడైన నెతన్యాహుతో ఘర్షణ పడేవారే ప్రస్తుతం ప్రజాస్వామ్య ప్రపంచంలో అసలైన నాయకుడు. ఆ్రస్టేలియా ప్రధానమంత్రికి ఈ బహుమతిని ఇచ్చారు’అని ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
పాలస్తీనాకు మద్దతు ఇవ్వడంతో..
పాలస్తీనా దేశాన్ని యూఎన్‌లో ఉన్న 193 సభ్య దేశాల్లో 147 దేశాలు గుర్తించాయి. యూకే, ఫ్రాన్స్, కెనడాలు కూడా ఆ దేశాల జాబితాలో చేరాయి. ఆ తర్వాత ఆ్రస్టేలియా సైతం పాలస్తీనాకు మద్దతు ఇచి్చంది. ఆ సమయంలో ప్రధాని అల్బనీస్ మాట్లాడుతూ ‘అమాయక ప్రజలపై యుద్ధ చూపుతున్న ప్రభావాన్ని నెతన్యాహు పట్టించుకోవడం లేదు. సహాయ పంపిణీ కేంద్రాల చుట్టూ ప్రజలు ఆహారం, నీటి కోసం క్యూలో నిలబడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇది ఆమోదయోగ్యం కాదు’అన్నారు. అప్పటినుంచి ఆయా దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు మొదలయ్యాయి. ప్రతిస్పందనగా, నెతన్యాహు మూడు దేశాల నాయకులపై దాడిని ప్రారంభించారు. కెయిర్ స్టార్మర్, ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, మార్క్ కారీ్నలు.. సామూహిక హంతకులు, రేపిస్టులు, శిశువుల హంతకులు, కిడ్నాపర్ల పక్షాన నిలుస్తున్నారని ఆరోపించారు.