ఢాకా: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియాను మెరుగైన చికిత్సకోసం లండన్ తరలిస్తున్నారు. బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ (బీఎన్‌పీ) అధినేత్రి అయిన జియా ఊపిరితిత్తులు, గుండెలో ఇన్ఫెక్షన్ల కారణంగా నవంబర్ చివరి వారంలో ఆస్పత్రిలో చేరారు. వారంరోజుల్లో ఆమె ఆరోగ్యం మరింత విషమంగా మారింది. ప్రభుత్వ తాత్కాలిక చీఫ్ మహమ్మద్ యూనస్ బుధవారం ఆస్పత్రిని సందర్శించారు.
ఆమె ఆరోగ్య గురించి ఆరా తీశారు. జియా కుమారుడు బీఎన్‌పీ తాత్కాలిక చైర్ పర్సన్ తారిక్ రెహమాన్ 2008 నుంచి లండన్‌లో ఉంటున్నారు. తల్లి అనారోగ్యం గురించి ఆయన సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. అవామీ లీగ్ పాలనలో అప్పటి సైనిక మద్దతుతో మాజీ ప్రధాని షేక్ హసీనా అవినీతి, క్రిమినల్ కేసుల్లో ఆయనను దోషిగా తేల్చడంతో తాను, తన దేశానికి వెళ్లలేకపోతున్నానని పేర్కొన్నారు.


