శక్తివంతమైన భూకంపం సోమవారం జపాన్‌ను వణికించింది. స్థానిక కాలమానం ప్రకారం.. రాత్రి 9.13గం. ప్రాంతంలో రిక్టర్ స్కేల్‌పై 7.6 తీవ్రతతో(కొన్ని మీడియా సంస్థలు 7.2గా ఇస్తున్నాయ్) భూమి కంపించింది. దీంతో సునామీ హెచ్చరికలు జారీ చేశారు.
భూకంప కేంద్రం హొక్కైడో(జపాన్‌లో రెండవ అతిపెద్ద దీవి) తీరానికి సమీపంలో ఆవోమోరి నగరానికి సమీపంలో.. సముద్ర మట్టానికి సుమారు 50 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం నమోదైంది. భూకంపం ప్రభావంతో.. సముద్రంలో 10 అడుగుల ఎత్తులో అలల ఎగసి పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
జపాన్ ఉత్తర తీరంలో సంభవించిన ఈ భూకంపం వల్ల ప్రజలకు సునామీ ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భారీ భూకంపం.. సునామీ హెచ్చరికల నేపథ్యంతో ఆ ప్రాంతంలోని అణు విద్యుత్ కేంద్రాలు భద్రతా తనిఖీలు ప్రారంభించాయని NHK (జపాన్ పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్) తెలిపింది.
A large earthquake has occurred off the coast of northern Japan. A tsunami warning is in effect for the north coast of Japan right now. pic.twitter.com/tnrZZ22PA3
— Brad Panovich (@wxbrad) December 8, 2025
భూకంపాలతో అత్యంత ప్రభావితమయ్యే దేశాల్లో జపాన్ ఒకటి. పసిఫిక్, యూరేషియన్, ఫిలిప్పైన్ టెక్టానిక్ ప్లేట్లు కలిసే ప్రాంతంలో ఉండటం వల్ల అక్కడ తరచుగా శక్తివంతమైన భూకంపాలు సంభవిస్తాయి. గతంలో.. గ్రేట్ కాంటో (1923), కోబే (1995), టోహోకు (2011) అత్యంత ప్రభావవంతమైనవి. ఇవి దేశానికి పెద్ద నష్టం కలిగించాయి
జపాన్‌లో రిక్టర్ స్కేల్‌పై 7.0 కంటే ఎక్కువ తీవ్రత గల భూకంపాలు 1900–2016 మధ్య 163 సార్లు నమోదయ్యాయి. అలాగే.. 8.0 కంటే ఎక్కువ తీవ్రత భూకంపాలు 14 సార్లు సంభవించాయి. టోహోకు భూకంపం (2011).. 9.0 తీవ్రతతో జపాన్ చరిత్రలోనే అత్యంత శక్తివంతమైన భూకంపంగా నిలిచింది. ఫుకుషిమా అణు విద్యుత్ కేంద్రంలో ప్రమాదం కూడా జరిగింది.భారీ సునామీ కారణంగా 15,000 మందికి పైగా మరణించారు. ఈ ఏడాది జనవరిలో హ్యుగా-నాడా భూకంపం .. 6.9 తీవ్రతతో మియాజాకి ప్రిఫెక్చర్ సమీపంలో సంభవించలేదు. అయితే పెద్ద నష్టం జరగలేదు.


