అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌కు ఒక అమెరికన్ మాస్టర్ స్ట్రోక్ ఇచ్చారు. అమెరికా పాత వలస విధానం ఆ దేశ ఆశలను హరిస్తుందని అమెరికన్ల అవకాశాలను వలస కార్మికులు కొట్టేస్తున్నారని వాన్స్ ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. దీనికి రిప్లై ఇచ్చిన ఓ అమెరికన్ నీభార్య పిల్లలు కూడా అమెరికన్లు కాదు వారు కూడా అమెరికన్ల అవకాశాలు దొచుకెళ్తున్నారు అని కౌంటరిచ్చారు. పాటు మరికొందరూ ఆయనకు వ్యతిరేకంగా పోస్టులు చేశారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వలస కార్మికులపై గుర్రుగా ఉన్నారు. విదేశీ కార్మికులు అమెరికన్ల అవకాశాలను లాగేస్తున్నారని వారిని దేశంలోకి రాకుండా నియంత్రించాలనడంతో పాటు ఇమిగ్రేషన్ పాలసీ కఠినతరం చేశారు. అంతేకాకుండా విదేశీయులకు వ్యతిరేకంగా పలు రకాల చర్యలు చేపట్టారు. తాజాగా ఆ దేశ ఉపాధ్యక్షుడు సైతం అదే జాబితాలో చేరారు. అమెరికన్ల అవకాశాలను విదేశీయులు దొచుకెళుతున్నారంటూ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.
"అమెరికా పాత మైగ్రేషన్ విధానం అమెరికా కలలను దొంగిలించింది. దానివల్ల దేశస్థులకు ఉద్యోగాలు లేకుండా పోయాయి. అమెరికన్లు నుంచి వారు ఉద్యోగాలు దొంగిలించి వారు ధనవంతులయ్యారు" అని ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ పోస్టుకు కౌంటర్ గా చాలా మంది రీపోస్టులు చేశారు.
"మీ కుటుంబం విదేశీయులు కాదా అది వలస కుటుంబం కాదా" అని ఒకరు అన్నారు. "మీ భార్య,పిల్లలు కూడా అమెరికన్ల ఉద్యోగాలను లాక్కుంటున్నారు" అని మరో యూజర్ పోస్ట్ చేశారు. "మీఅత్తమామలు ద్వేషిస్తున్నావు" అని ఒక యూజర్ వ్యంగ్యంగా రీపోస్ట్ చేశారు. ఇలా అమెరికా ఉపాధ్యక్షుడు సోషల్ మీడియాలో ట్రోలయ్యారు.
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ 2014లో భారత సంతతికి చెందిన ఉషా చిలుకూరిని వివాహం చేసుకున్నారు. వారికి ముగ్గురు పిల్లలు కాగా వారి కుమారుడికి వివేక్ అని నామకరణం చేశారు. ఉషా వాన్స్ వృత్తి రీత్యా లాయర్.


