ఇజ్రాయెల్ మరోసారి యుద్ధానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇరాన్, హిజ్బూల్లాతో పూర్తిస్థాయిలో యుద్ధం చేసేలా ప్రణాళికలు రచించినట్లు తెలుస్తోంది. ఇంతకాలం పాటు యుద్ధంతో ఆర్థికంగా, ఆయుధ సామాగ్రి పరంగా కొంత కొరత ఉండగా ప్రస్తుతం మందుగుండు సామాగ్రితో పాటు ఆయుధాలు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్నట్లు సమాచారం. అంతేకాకుండా ఈ యుద్ధం కోసం ఆధునాతన సాంకేతిక వాడుతున్నట్లు తెలుస్తోంది.
కాగా కొద్ది నెలల క్రితమే ఇజ్రాయిల్, పాలస్తీనా గాజాలోని హమాస్ తో సీజ్ ఫైర్ ఒప్పందం చేసుకొంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్యవర్తిత్వంతో పాటు ఇతర దేశాలు యుద్ధ విరమణకు ఎంతగానో కృషి చేశాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయిల్ మారోసారి యుద్ధ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.


