చావు చులకనగా మారడం అంటే ఇదేనేమో. మనిషి జీవిత విలువను తక్కువగా చూడటం, మరణాన్ని సాధారణ సంఘటనగా భావిస్తే అది మానవతా ప్రశ్నలను రేకెత్తిస్తుంది.
సమాజం వ్యక్తి జీవితాన్ని గౌరవించకపోతే, చావు ఒక సాధారణ శిక్షగా మారుతుంది. ఇది మానవ హక్కుల ఉల్లంఘనకు దారితీస్తుంది. అన్యాయపు శిక్షలు: వేగంగా, విచారణ లేకుండా అమలు చేసే ఉరిశిక్షలు చావును చులకనగా మార్చే ఉదాహరణలు.
ప్రజలలో భయాన్ని చాటేందుకు చావును సాధారణంగా చూస్తుంది నేటి అధికార వ్యవస్థ. నేటి అధికార వ్యవస్థలకు చావు అనేది వ్యూహంగా మారుతుందంటే అతిశయోక్తి కాదేమో.
తాజాగా ఒక భయంకరమైన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇరాన్‌లో ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 74 మృతదేహాలను అతి దారుణంగా ఓ ఆనకట్టలో పడేశారనేది ఆ వార్త సారాంశం. ఆ ఆనకట్ట వర్షాలు లేక ఎండిపోవడంతో ఆ మృతదేహాలు బయటపడ్డాయట. వారిందరికీ చేతులు, కాళ్లు కట్టేసి ఉన్నాయి. వారిని దుప్పట్లో చుట్టేసి మరీ పడేశారనేది సమాచారం.
అంటే వారికి ఉరి శిక్షను అమలు చేసి, ఇలా ఆనకట్టలో పడేశారనేది తాజా పరిస్థితిని బట్టి అర్థమవుతుంది. ఇరాన్‌లో ఉరిశిక్షలు చాలా వేగంగా అమలు చేస్తారు. అందులోనూ రాజ(దేశ) ద్రోహం కింద అయితే మరో అడుగు ముందుకేసి మరీ ఉరిని అమలు చేస్తారు.
వారు దేశ ద్రోహానికి పాల్పడ్డారో లేదో మనకు తెలీదు కానీ, ఉరిశిక్షను చాలా వేగవంతంగా అమలు చేసినట్లు మృతదేహాల పరిస్థితి ని బట్టి తెలుస్తోంది. వారిని దేశ ద్రోహులుగా నిర్ధారించిన ప్రభుత్వం.. ఇలా పడేసినా ఎవరూ గుర్తించరని భావించి ఇలా చేసే ఉంటారనే సోషల్ మీడియా ద్వారా మనకు తెలుస్తున్న వైనం. అయితే ఈ వార్త ప్రచురించిన ఇరాన్ ప్రభుత్వ మద్దతు మీడియా తర్వాత దానిని తొలగించడం కూడా చకచకా జరిగిపోయిందనే వార్త కూడా మరొకటి వచ్చింది. అసలు ఏం జరిగిందనేది కొన్ని రోజుల వ్యవధిలో తెలిసే అవకాశం ఉంది.
🔴 Horrifying:
Reports that at least 74 bodies have been found in the Karaj Dam in Iran, all thought to be executed anti-regime dissidents.
Because of the drought and lack of rain, this dam has dried up almost completely and revealed a MASS GRAVE.
The victims had their hands… pic.twitter.com/7tz4m2PjYq— 𝐍𝐢𝐨𝐡 𝐁𝐞𝐫𝐠 ♛ ✡︎ (@NiohBerg) November 11, 2025


