బోస్టన్‌లో కార్లను కప్పేసిన మంచును తొలగిస్తున్న యజమానులు
వేలాది విమాన సర్వీసులు రద్దు
విద్యుత్ సరఫరా అంతరాయంతో అంధకారంలో మగ్గిపోతున్న లక్షలాది కుటుంబాలు
మంచు సంబంధ ఘటనల్లో 35 మంది మృతి
కెనుసా(యూఎస్): అమెరికాలోని పలు రాష్ట్రాలను మంచు తుపాను కమ్మేసింది. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు తోడవడంతో లక్షలాది కుటుంబాలు అంధకారంలో, చలిలో ఉండిపోయాయి. 8 లక్షల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఒక్క నాష్‌విల్లే పరిధిలోనే 1,50,000 ఇళ్లకు కరెంట్ సరఫరాలేక చలికి జనం అవస్థలుపడ్డారు. మిసిసిప్పీలోనూ ఇదే దారుణ పరిస్థితిని జనం చవిచూశారు. చాలా నగరాల్లో మంచు అర మీటర్‌కంటే ఎక్కువ ఎత్తులో పేరుకుపోయింది. దీంతో రహదారులపై వాహనాల ప్రయాణాలు ప్రాణాంతకంగా మారాయి.
మంచు సంబంధ ఘటనల్లో ఇప్పటిదాకా 35 మంది ప్రాణాలు కోల్పోయారు. కన్సాస్‌లో ఒకావిడ కోటు ధరించకుండా బార్ నుంచి బయటికొచ్చి శీతలగాలులకు బలై మంచులో కూరుకుపోయారని అధికారులు తెలిపారు. జనం ఇళ్లకు పరిమితం కావాలని ప్రయాణాలు పెట్టుకోవద్దని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరించాయి. టెక్సాస్ రాష్ట్రం మొదలు మెనే రాష్ట్రం దాకా గల్ఫ్ ఆఫ్ మెక్సికో పరిధిలోని అమెరికా రాష్ట్రాల్లో మంచు విపరీతంగా కురుస్తూ జనజీవనాన్ని అస్తవ్యస్థం చేసింది. విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. ఇళ్లను వేడిగా ఉంచే వ్యవస్థలు విఫలమవడంతో అమెరికా పౌరుల చలి కష్టాలు మరింత తీవ్రతరమయ్యాయి. ‘‘ మంచు తుపాను ధాటికి మా ప్రాంతంలో
మూగబోయిన ఫోన్లు..
మసాచుసెట్స్‌లోని స్టెర్లింగ్‌లో ఏకంగా 56.2 సెంటీమీటర్ల ఎత్తు వరకు మంచు కురిసింది. నాష్ విల్లేలో గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిచిపో వడంతో చార్జింగ్ అయిపోయి మొబైల్‌ఫోన్లు సైతం మూగబోయాయి. చివరకు అగ్నిమాపక, పోలీస్ స్టేషన్‌లలోనూ ఇదే పరిస్థితి కన్పించింది. ‘‘ మా ప్రాంతంలో చెట్లు నేలకూలాయి. ట్రాన్స్‌ఫార్మర్లు పేలిపోయాయి. ఉరుములు మెరుపులతో జనం బయపడిపోయారు’’అని మిసిసిప్పీలోని ఆక్స్‌ఫర్డ్‌కు చెందిన మార్షల్ రామ్సే చెప్పారు. అర్కాన్సాస్ మొదలు న్యూ ఇంగ్లాండ్ రీజియన్‌దాకా నగరాలను మంచు దుప్పటి కప్పేసింది.
దీంతో ఎయిర్‌పోర్ట్‌ల నుంచి విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. వేలాది విమాన సర్వీసులు రద్దయ్యాయి. వేల సంఖ్యలో విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. పాఠశాలలను మూసేశారు. పిట్స్‌బర్గ్‌లో 20 అంగుళాల మేర మంచు కురిసింది. ఇక్కడ మైనస్ 25 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మిసిసిప్పీలో 1994 ఏడాది తర్వాత తొలిసారిగా భారీస్థాయిలో మంచు కురిసింది. తుపాను భాధితులను ఆదుకునేందుకు సహాయక బృందాలు రంగంలోకి దిగి దుప్పట్లు, తాగునీరు, జనరేటర్లను సరఫరా చేశారు. టోర్నడో(ప్రచండగాలి) మాదిరి తమ నగరంలో ప్రతి వీధిలో మంచు తుపాను వినాశనం సృష్టించిందని ఆక్స్‌ఫర్డ్ నగర మహిళా మేయర్ రాబిన్ తన్హాహిల్ ఆవేదన వ్యక్తంచేశారు.


