breaking news
snowstorm
-
అమెరికా గజగజ
డాలస్: అతి భారీ మంచు తుఫాన్ అమెరికాను వణికిస్తోంది. దేశంలో అధిక ప్రాంతాలు భారీ హిమపాతం, వర్షం, అతి శీతల పరిస్థితులతో అతలాకుతలమవుతున్నాయి. ఆరుబయట ఎటు చూసినా అడుగుల లోతున మంచు పేరుకునిపోయి కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా 20 కోట్ల మందికి పైగా ఈ భీకర తుఫాన్‌తో ప్రభావితులయ్యారు. 18 రాష్ట్రాల్లో జనజీవితం స్తంభించిపోయింది. దాంతో ఆయా రాష్ట్రాల్లో వింటర్ ఎమర్జెన్సీ ప్రకటించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావొద్దంటూ హెచ్చరికలు జారీ అయ్యాయి. చాలా రాష్ట్రాల్లో విమాన తదితర రవాణా సేవలు స్తంభించిపోయాయి. తీవ్ర ప్రతికూల వాతావరణం కారణంగా శని, ఆదివారాల్లో కలిపి ఏకంగా 10 వేలకు పైగా విమాన సర్వీసులను ముందుజాగ్రత్త చర్యగా రద్దు చేశారు. చాలా రాష్ట్రాల్లో స్కూళ్లు, ఇతర విద్యా సంస్థలకు సోమవారం కూడా సెలవు ప్రకటించారు. ఫెర్న్‌గా పేర్కొంటున్న ఈ తుఫాన్‌కు ఆర్కిటిక్ బ్లాస్ట్ వల్ల ఉత్తర ధ్రువం నుంచి వీస్తున్న అతి శీతల గాలులే కారణమని వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే రెండు మూడు రోజుల్లో దాని తీవ్రత మరింత పెరుగుతుందని హెచ్చరించింది. ‘‘ఈ సీజన్‌లోకెల్లా అతి తీవ్రమైన తుఫాన్ ఇదే. బహుశా ఈ దశాబ్దంలోకెల్లా దారుణమైన తుఫాన్‌గా నిలిచినా ఆశ్చర్యం లేదు’’అని పేర్కొంది. నిత్యావసరాల కోసం జనం ఎగబడటంతో చాలా నగరాల్లో దుకాణాలు ఖాళీ అయిపోయాయి. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ అప్రమత్తమైంది. మైనస్‌లో ఉష్ణోగ్రతలు నార్త్ డకోటా మొదలుకుని పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు మైనస్ 20 నుంచి ఏకంగా మైనస్ 40 దాకా పడిపోతున్నాయి. దాంతో వాహనాలు కూడా మొరాయిస్తున్నాయి. ఫలితంగా అత్యవసర సేవలకు అంతరాయం కలుగుతోంది. టెక్సాస్, ఓక్లహామా, కాన్సాస్ తదితర రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. ఓక్లహామా నుంచి బోస్టన్ దాకా 1,500 మైళ్ల మేరకు తీవ్రంగా ప్రభావితమవుతోంది. టెక్సాస్ నుంచి వర్జీనియా దాకా హిమపాతం వణికిస్తోంది. రాజధాని వాషింగ్టన్ డీసీ మొదలుకుని న్యూయార్క్ తదితర మహా నగరాలు మంచు దుప్పట్లో కూరుకుపోయాయి. శనివారం 3,200, ఆదివారం 4,800 దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దయినట్టు ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్సైట్ ఫ్లైట్అవేర్ తొలుత పేర్కొంది. ఒక్క ఆదివారమే 7,600కు పైగా సర్వీసులు రద్దవుతున్నట్టు అనంతరం వెల్లడించింది.కరెంటు కోతలు అతి శీతల గాలుల ధాటికి అమెరికావ్యాప్తంగా చాలాచోట్ల చెట్లు, కరెంటు స్తంభాలు నేలకొరుగుతున్నాయి. దాంతో విద్యుత్‌సరఫరాకు అంతరాయం కలిగింది. దాంతో చలికి తట్టుకోలేక జనం అల్లాడుతున్నారు. దేశవ్యాప్తంగా ఒక్క శుక్రవారమే ఏకంగా 95 వేలకు పైగా కరెంటు కోత ఉదంతాలు నమోదయ్యాయి! వీటిలో 37 వేలకు పైగా టెక్సాస్‌లోనే కావడం గమనార్హం. ఈ సమస్య కనీసం కొద్ది రోజుల పాటు కొనసాగవచ్చని అధికారులు ఇప్పటికే హెచ్చరించారు. టెక్సాస్‌లో ఐదేళ్ల క్రితం ఇలాంటి తుఫాన్ సమయంలో భారీ కరెంటు కోతల వల్ల వందలాది మంది దుర్మరణం పాలవడం తెలిసిందే. అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా అన్ని చర్యలూ తీసుకుంటున్నట్టు గవర్నర్ గ్రెగ్ అబట్ తెలిపారు. ఎయిరిండియా సర్వీసులు రద్దు శని, ఆదివారాల్లో భారత్ నుంచి అమెరికా తూర్పు తీరంలోని న్యూయార్క్, నెవార్క్ నగరాలకు విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్టు ఎయిరిండియా ప్రకటించింది. ప్రయాణికులు, సిబ్బంది భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. న్యూఢిల్లీ, ముంబైల నుంచి ఆ నగరాలకు ఎయిరిండియా రెగ్యులర్‌గా విమాన సర్వీసులు నడుపుతోంది. -
ముంచనున్న మంచు!
ఫక్తు ఎడారి దేశమైన సౌదీ అరేబియాలో మంచు తుఫాన్. ఎవరూ ఊహించని ఈ పరిణామం ఇప్పుడు గుబులు రేపుతోంది. అంతర్జాతీయంగా పర్యావరణవేత్తల్లో ఇది పెద్ద చర్చకే దారితీసింది. భూ వాతావరణ వ్యవస్థలోనే అవాంఛనీయమైన మౌలిక మార్పులు భారీ స్థాయిలో చోటు చేసుకుంటున్నాయని చెప్పేందుకు ఇది ప్రబల సాక్ష్యమని వారు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. దీని నుంచి ముఖ్యంగా భారత్ నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయని స్పష్టం చేస్తున్నారు... సౌదీ అరేబియాలోని ఉత్తరాది ప్రాంతాలు తాజాగా మంచులో తడిసి ముద్దయిపోయాయి. ముఖ్యంగా టాబుక్, దాని సమీప పర్వత ప్రాంతా లు పూర్తిగా మంచు దుప్పటి కప్పుకున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు ఎన్నడూ లేనంతగా పడిపోయాయి. ప్రపంచమంతటికీ ఆశ్చర్యం కలిగించేలా అచ్చం శీతల దేశాల్లో మాదిరి పరిస్థితులు నెలకొన్నాయి. మంచుమయంగా మారిన సౌదీ ఎడారుల ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారా యి. పర్యావరణ మార్పులు ఇంకెంతమాత్రమూ సుదూర, లేదా కాల్పనిక ముప్పు కాదని, అన్ని దేశాలనూ తీవ్రంగా పట్టి పీడించబోతున్న పెను సమస్య అనీ ఈ పరిణామం స్పష్టంగా చాటింది. విపరీత పరిస్థితులు వాతావరణ మార్పులు అనగానే కేవలం ఎండ ప్రచండంగా మండిపోయే రోజుల సంఖ్య పెరుగుతుందని చాలామంది భావిస్తారు. వాస్తవానికి చాలాసార్లు అందుకు విరుద్ధంగా జరుగుతుందని సైంటిస్టుల మాట. భూమి వేడెక్కిన కొద్దీ వాతావరణం మరింత తేమను, శక్తిని సంగ్రహిస్తుంది. వాటి దెబ్బకు చిరకాలం స్థిరంగా కొనసాగుతూ వస్తున్న వాతావరణ ధోరణులు కాస్తా గాడి తప్పుతాయి. ఫలితంగా ఇలా అప్పుడే ప్రచండంగా ఎండ, కొద్దికాలానికే విపరీతమైన కుండపోత వానలు, ఆ వెంటనే వణికించే చలి, ఊహించని ప్రాంతాల్లో హిమపాతం... భారత్ తో సహా ప్రపంచవ్యాప్తంగా కొన్నేళ్లుగా ఈ ధోరణులు పెరిగిపోతున్నాయి. మనకు వారి్నంగ్ బెల్స్ సౌదీ మంచు తుఫాన్ ఉదంతం నుంచి భారత్ తక్షణం నేర్వాల్సిన పాఠాలు ఉన్నాయి. ఎందుకంటే పర్యావరణ మార్పుల తాలూకు దు్రష్పభావం కొన్నేళ్లు మన దేశంపై తీవ్రంగానే ప్రభావం చూపు తూ వస్తోంది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా కనిపించిన విపరీత వాతావరణ ధోరణులే ఇందుకు రుజువు. తొలుత ఉత్తర, మధ్య భారతంలో రికార్డు స్థాయి ఎండలు కాచాయి. ఆ వెంటనే ఉత్తరాఖండ్ మొద లుకుని హిమాచల్ ప్రదేశ్, సిక్కిం దాకా క్లౌడ్ బరస్ట్ విలయమే సృష్టించింది. చాలా రాష్ట్రాల్లో వర్షాకా లం ఆలస్యంగా వస్తే కొన్నింటిలో విపరీతమైన వరదలు అపార నష్టం కలుగజేశాయి. ఇవేవీ యా దృచ్చిక ఘటనలు కాదు. వాతావరణ వ్యవస్థ తీవ్ర ఒత్తిడిలో ఉండనేందుకు స్పష్టమైన సంకేతాలు. తక్షణం మేల్కొనాలి ప్రభుత్వాలు ఇప్పటికీ మేల్కొనకపోతే భారత్‌లో పర్యావరణ వ్యవస్థే పూర్తిగా కుప్పకూలే ప్రమాదం పొంచి ఉంది. ఎందుకంటే సాగు సీజన్లు, నీటి యాజమాన్యం, పట్టణ ప్రణాళికలు మొదలుకుని విద్యుత్ డిమాండ్ దాకా అన్నింటికీ సజావైన వాతావరణ వ్యవస్థే మూలం. అదే దెబ్బ తింటే పంటల వైఫల్యం మొదలుకుని అన్నీ వినాశకర పరిణామాలే తలెత్తుతాయి. దేశవ్యాప్తంగా కాలుష్యాన్ని కట్టడి చేసే చర్యలను చిత్తశుద్ధితో అమలు చేయడం అత్యవసరం. అలాగే వాతావరణానికి తగ్గట్టుగా సాగు పద్ధతులు, ధోరణులను కూడా మార్చుకుంటూ పోవడం ప్రస్తుత అవసరం. లేదంటే పరిస్థితి చూస్తుండగానే చేయి దాటిపోతుంది. అప్పుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా చేతులు కాలాక ఆకులు పట్టుకోవడమే అవుతుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఎవరెస్టుపై అత్యంత భయానక రాత్రి!
ఖట్మాండు: ఎవరెస్ట్ పర్వతంపై భారీ మంచు తుఫాన్ పర్వతంతో(Mount Everest blizzard) ఒక్కసారిగా అలజడి రేగింది. సుమారు 1,000 మంది పర్వతారోహకులు ఈ తుపానులో చిక్కుకునిపోగా.. వారిని రక్షించే ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. టిబెట్ వైపు ఈ పరిణామం చోటు చేసుకోవడంతో చైనా ప్రభుత్వం ఈ సహయక చరయలను పర్యవేక్షిస్తోంది. మౌంట్ ఎవరెస్ట్‌పై టిబెట్(Mount Everest Tibet) వైపు అక్టోబర్ 3న తేదీన భారీ మంచు తుఫాన్ ప్రారంభమైంది. ఈ ప్రభావంతో కర్మా వ్యాలీ, కాంగ్షుంగ్ వైపు ట్రెక్కింగ్ చేస్తున్న వాళ్లు క్యాంప్ సైట్ల వద్ద చిక్కుకునిపోయారు. దీంతో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. స్థానికుల సాయంతో మంచు తొలగిస్తూ దారులను క్లియర్ చేస్తున్నారు. Nearly 1,000 people are trapped on Mount Everest slopes — Rescue operation underway.#MountEverest #Everest pic.twitter.com/hyVSR0ER3a— Shehzad Qureshi (@ShehxadGulHasen) October 5, 2025రెస్యూ బృందాలు ఇప్పటిదాకా 350 మందిని కాపాడినట్లు సమాచారం. వాళ్లందరినీ ఆదివారం నాటికే క్యూదాంగ్ పట్టణానికి తరలించారు. మరో 200 మందిని దశలవారీగా కిందకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. హైపోథర్మియా(Hypothermia.. శరీర ఉష్ణోగ్రత సాధారణం కంటే తక్కువకి పడిపోవడం) కారణంగా పర్వతారోహకులు తీవ్ర భయాందోళనకు గురైనట్లు స్పష్టమవుతోంది. “ఇది తమ జీవితంలోనే అత్యంత భయంకరమైన రాత్రి” అని పలువురు మీడియాకు రోదిస్తూ చెప్పారు. మంచు తుఫాన్ ధాటికి టెంట్లు కుప్పకూలిపోయాయి. దీంతో పర్వతారోహకులు సురక్షిత ప్రాంతాల వైపు తరలిపోతున్న దృశ్యాలతో ఓ వీడియో రికార్డు బయటకు వచ్చింది. అయితే పర్వతారోహకులు అలా తరలిపోతుండడంపై అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దారి తప్పిపోయే అవకాశం ఉండడం, పైగా హైపోథర్మియాతో పాటు ఆక్సిజన్ కొరత వాళ్ల ప్రాణాలకు ముప్పుగా మారే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. తుఫాన్ తీవ్రంగానే..కర్మా లోయ సముద్ర మట్టానికి 4,200 మీటర్ల ఎత్తులో ఉంది. నేపాల్‌లో భారీ వర్షాలు, మెరుపు వరదలు,కొండ చరియలు విరిగిపడి 47 మంది మరణించారు. ఈ ప్రతికూల వాతావరణ ప్రభావంతో.. శుక్రవారం రాత్రి నుంచి శనివారం వరకు ఎవరెస్ట్‌పై మెరుపులు ఉరుములతో కూడిన భారీ వర్షం, ఆపై భారీ మంచు తుపాను సంభవించింది. మరోవైపు.. తుపాను నేపథ్యంలో తింగ్రీ కౌంటీ టూరిజం సంస్థ అన్ని టికెట్ అమ్మకాలు, ప్రవేశాలను శనివారం నుంచే నిలిపివేసింది.గతంలోనూ.. ప్రపంచంలో అత్యంత ఎత్తైన శిఖరం.. మౌంట్ ఎవరెస్ట్. అయితే దీనిని అధిరోహించే క్రమంలో అధికారిక లెక్కల ప్రకారం.. ఇప్పటిదాకా 340 మరణించారు. అలాగే గతంలో ప్రకృతి విపత్తుల కారణంగానూ ఇక్కడ ప్రాణ నష్టం సంభవించింది కూడా. 1996 మే 10-11 తేదీల్లో మౌంట్ ఎవరెస్ట్ తుపాను కారణంగా ఎనిమిది మంది మరణించారు. అలాగే.. 2014 ఏప్రిల్ 18వ తేదీన మంచు శిఖరాలు (ice seracs) కూలిపోవడంతో 16 మంది నేపాలీ గైడ్లు మృతి చెందారు. అయితే భద్రతా లోపాలు, పైగా ఈ ఘటనలో భాదిత కుటుంబాలకు తక్కువ పరిహారం చెల్లించడంతో గైడ్లు సమ్మెకు దిగడం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. 2015 నేపాల్ భూకంపం కారణంగా.. ఎవరెస్ట్ బేస్‌క్యాంప్‌పై మంచు కుప్పలు కూలి 22 మంది మృతి చెందారు. చరిత్రలో అత్యంత ఘోరమైన ఎవరెస్ట్ విపత్తుగా దీనికి గుర్తింపు లభించింది. -
చిత్రకారుడు బాలి తనయుడు మంచు తుపానులో మృతి
సాక్షి, తాటిచెట్లపాలెం (విశాఖ ఉత్తర): రాష్ట్రానికి చెందిన ప్రముఖ రచయిత, చిత్రకారుడు, బొమ్మల శిల్పి బాలి కుమారుడు మేడిశెట్టి గోకుల్ (45) అమెరికాలో మంచు తుపానులో చిక్కుకుని మరణించాడు. అమెరికాలో గుంటూరుకు చెందిన దంపతులను రక్షించబోయి గోకుల్ ప్రమాదంలో చిక్కుకుని మరణించాడు. ఆ సమయంలో గోకుల్ భార్య శ్రీదేవి, కూతురు మహతి ఒడ్డునే ఉన్నారు. వారి కళ్లెదుటే దుర్ఘటన జరగడంతో వారు కుప్పకూలిపోయారు. గోకుల్ కుటుంబం గత 15 ఏళ్లుగా అమెరికాలో స్థిరపడింది. ఈయన అమెరికాలో ఓ ప్రముఖ బీమా కంపెనీలో అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. గోకుల్ మరణ వార్త తెలియడంతో ఇక్కడ బాలి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. బాలికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇద్దరూ అమెరికాలోనే ఉంటున్నారు. చదవండి: (సీపీ టు డీజీపీ.. 36 ఏళ్లలో పని చేసిన 21 మంది) -
హమ్మయ్య.. సూర్యుడు కనిపించాడు
న్యూయార్క్: అమెరికాలో గత కొద్ది రోజులుగా మంచు తుఫాన్‌కు అల్లాడిపోయిన న్యూయార్క్ రాష్ట్రంలోని బఫెలో సిటీలో ఎట్టకేలకు సూర్యరశ్మి కనిపించింది. గురువారం ఉదయం సూర్యుడి రాకతో కాసేపు వాతావరణం వెచ్చగా మారడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రాంతంలో ప్రజల క్షేమ సమాచారాలు తెలుసుకోవడానికి నేషనల్ గార్డ్ అధికారులు ఇంటింటికి వెళ్తున్నారు. విద్యుత్ సౌకర్యం పోయిన ఇళ్లకి వెళ్లి వారు ఎలా ఉన్నారో వాకబు చేస్తున్నారు. తీవ్రమైన మంచు కురుస్తున్నప్పుడు కరెంట్ పోయిన సమయంలో ఆక్సిజన్ వెంటిలేషన్ మీద ఉన్నవారు, వృద్ధులు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అత్యవసర సహాయం అందక కొందరు మృతి చెందిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. రహదారులపై కొన్ని అడుగుల మేర పేరుకుపోయిన మంచు కరిగితే ఇంకా ఎన్ని మృతదేహాలు బయటకు వస్తాయోనన్న ఆందోళనైతే నెలకొంది. బఫెలో నగరంలో రాకపోకల్ని పునరుద్ధరించారు. భారీ యంత్రాల సాయంతో రహదారులపై ముంచెత్తిన మంచుని తొలగించే పని యుద్ధ ప్రాతిపదికన జరుగుతోందని బఫెలో నగర మేయర్ బైరన్ బ్రౌన్ వెల్లించారు. అత్యవసరమైతే తప్ప ఇంకా ఇంటి నుంచి బయటకు రావొద్దని ఆయన నగర ప్రజలను హెచ్చరించారు. అమెరికాలోని మరికొన్ని రాష్ట్రాల్లో మంచు ముంచేయడంతో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వాతావరణం మైనస్ డిగ్రీలకు పడిపోవడంతో నీటి పైపులు పగిలిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొద్ది రోజులుగా కుదిపేసిన మంచు తుఫాన్ కాస్త శాంతించినట్టే కనిపిస్తోంది. -
అమెరికాను వణికిస్తున్న ‘బాంబ్ సైక్లోన్’
చికాగో : అగ్రరాజ్యం అమెరికాను మంచు తుపాను వణికిస్తోంది. రాకీ పర్వతాల నుంచి భారీగా వీస్తున్న చలిగాలుల ధాటికి 25 రాష్ట్రాల్లో జనజీవనం స్తంభించిపోయింది. గంటకు 148 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలుల కారణంగా కొలరాడో, నెబ్రస్కా, డకోటాల్లోని ప్రధాన రహదారుల్లో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. హిమపాతం కారణంగా వేల సంఖ్యలో విమానాలు రద్దయ్యాయి. పాఠశాలలు మూతపడ్డాయి. మరికొన్నిచోట్ల హిమపాతంతోపాటు పిడుగులు కూడా పడుతుండటంతో అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఫలితంగా కొన్ని లక్షల కుటుంబాలు చీకట్లో మగ్గిపోయాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో మంచు తుపానుపై అధికారిక హెచ్చరికలు జారీ అయ్యాయి. తాజా తుపానును ‘బాంబ్ సైక్లోన్’గా వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు. రోడ్లపై మంచు పేరుకుపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్నిచోట్ల వాహనాలు జారిపోవడం, ఒకదానితో మరొకటి ఢీకొన్న ఘటనలు చోటుచేసుకున్నాయి. హిమపాతం కారణంగా కొలరాడోలోని డెన్వర్ ఎయిర్‌పోర్టును తాత్కాలికంగా మూసివేశారు. విమానాల రాకపోకలను నిలిపివేశారు. దీంతో 1,339 విమాన సర్వీసులు రద్దయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో ఇళ్లు కూలిపోవడంతో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల నుంచి ప్రజలను రక్షించి ఆసుపత్రులకు తరలించారు. భారీ వర్షాలు కురిసే అవకాశాలు కూడా ఉండటంతో అధికారులు అప్రమత్తమై తగు చర్యలు తీసుకున్నారు. న్యూమెక్సికోలో వీచిన బలమైన గాలులకు ఒక రైలుకు చెందిన 26 బోగీలు వంతెనపై నుంచి పడిపోయాయి. దీంతో రంగంలోకి దిగిన సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. -
వణికిస్తున్న మంచుతుఫాను


