ట్రోనా (యూఎస్): అమెరికా వైమానికి దళానికి చెందిన అత్యాధునిక యుద్ధ విమానం కాలిఫోర్నియా ఎడారిలో కూలిపోయింది. పైలట్ ముందుచూపుతో విమానం కుప్పకూలడానికి ముందే పారాచూట్ సహాయంతో సురక్షితంగా బయటపడ్డారు. యుద్ధ విన్యాసాల ప్రదర్శన స్క్వాడ్రన్ (థండర్‌బడ్స్)కు చెందిన యుద్ధ విమానం దక్షిణ కాలిఫోరనియాలోని ట్రోనా ఎయిర్‌పోర్ట్ సమీపంలో కూలిపోయిందనీ సైన్యం తెలిపింది.
కానీ.. పైలట్ స్వల్ప గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని వెల్లడించింది. బుధవారం ఉదయం 10:45 గంటల ప్రాంతంలో శిక్షణలో ఉండగా ఎఫ్–16ఇ ఫైటర్ ఫాల్కన్ కూలిపోయిందని తెలిపింది. ఈ ప్రమాదంపై దర్యాప్తు నిర్వహిస్తున్నామని ఎయిర్‌ఫోర్స్ ఒక ప్రకటనలో తెలిపింది. నేవీకి చెందిన థండర్‌బడ్స్, బ్లూ ఏంజిల్స్ స్క్వాడ్రన్‌లోని ఫైటర్ జñ ట్స్ యుద్ధ విన్యాసాలకు ప్రసిద్ధి. అతి సమీపంగా ఎగరడంలో శిక్షణ పొందినవి. దశాబ్దాలుగా ఉపయోగిస్తున్న విమానాలు పదుల సంఖ్యలో ప్రమాదాలకు గురయ్యాయి.


