breaking news
destroied
-
రెండు ఫైటర్ జెట్ల కూల్చివేత
దుబాయ్: పశ్చిమాసియా యుద్ధంలో అమెరికాకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. శుక్రవారం ఒక్క రోజే రెండు అత్యాధునిక యుద్ధ విమానాలను కోల్పోయింది. ఇరాక్‌లో ఒక బ్లాక్‌హాక్ హెలికాప్టర్‌ను కూడా కోల్పోయినట్టు సమాచారం! అత్యాధునిక ఎఫ్–35, ఎఫ్–15ఇ యుద్ధ విమానాలను తమ గగనతలంపై కూల్చేసినట్టు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ (ఐఆర్జీసీ) ప్రకటించింది. ఎఫ్–35 పైలట్ ప్రాణాలతో బయటపడే అవకాశం లేనట్టేనని పేర్కొంది. ఎఫ్–15ఇ పైలట్‌తో పాటు గన్నర్ ప్రాణాలతో బయటపడ్డట్టు సమాచారం. వారు ఇరాన్ భూభాగంపై సురక్షితంగా దిగినట్టు పలు వార్తా కథనాలు పేర్కొన్నాయి. దాంతో వారిని కాపాడేందుకు అమెరికా ప్రత్యేక కమాండో దళాలు, బంధించేందుకు ఇరాన్ సైన్యాలు ముమ్మరంగా గాలింపు చర్యలకు దిగాయి. వారిలో ఒకరిని అమెరికా దళాలు సురక్షితంగా కాపాడి ఇరాన్ బయటికి తరలించినట్టు ఇజ్రాయెల్‌కు చెందిన చానల్ 12 పేర్కొంది. రెండో వ్యక్తి విషయమై గందరగోళం నెలకొంది. అతను ఇప్పటికే ఐఆర్‌జీసీకి చిక్కినట్టు ఇరాన్‌కు చెందిన టాస్నిమ్ వార్తా సంస్థ పేర్కొంది. అదేమీ లేదని, అతన్ని కూడా కాపాడేందుకు అమెరికా ప్రత్యేక దళాలు ఇంకా ప్రయత్నిస్తున్నాయని న్యూయార్క్ టైమ్స్ తదితర వార్తా సంస్థలు పేర్కొన్నాయి. ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ ఐఆర్ఐబీ కూడా సదరు ‘అమెరికా సైనికుడు’కనిపించిన వెంటనే కాల్చేయాల్సిందిగా స్థానిక ప్రజలకు పిలుపునిచ్చింది. కాసేపటికే, ‘‘అతన్ని ప్రాణాలతో పోలీసులకు పట్టించండి. అందుకు భారీ బహుమానం కూడా ఉంటుంది’’అంటూ ప్రకటించింది! రెస్క్యూ ఆపరేషన్‌లో బాగంగా ఘటనా స్థలిపై అమెరికా విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లు చక్కర్లు కొడుతున్న ఫొటోలు, వీడియోలను కూడా ప్రసారం చేసింది. అమెరికా యుద్ధ విమానం తాలూకు శకలాలను ఇరాన్ సైన్యం ట్రక్కుల్లో తరలిస్తున్న దృశ్యాలు ఇరాన్ వార్తా చానళ్లతో పాటు సోషల్ మీడియాలోనూ దర్శనమిచ్చాయి. మరోవైపు అమెరికాకు చెందిన యూహెచ్–60 బ్లాక్‌హాక్ హెలికాప్టర్‌ను కూడా ఇరాక్‌లో నేలకూల్చినట్టు ఇరాన్ పేర్కొంది. ఇరాక్ వర్గాలను ఉటంకిస్తూ టాస్నిం వార్తా సంస్థ ఈ మేరకు ప్రకటన చేసింది. ఎఫ్–15ఇ యుద్ధ విమానం కూల్చివేత గురించి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు నివేదించినట్టు వైట్‌హౌస్ ప్రెస్ సెక్రెటరీ కరోలినా లెవిట్ సీఎన్ఎన్ వార్తా సంస్థకు తెలిపారు. ఎఫ్–35, బ్లాక్‌హాక్ హెలికాప్టర్‌ను కూడా కోల్పోయామన్న వార్తలపై మాత్రం అమెరికా అధికారికంగా స్పందించలేదు. ఒక్కో విమానం రూ. 940 కోట్లు! ఎఫ్–35, ఎఫ్–15ఇ యుద్ధ విమానాలను కోల్పోవడం అమెరికాకు సైనికంగానే గాక ఆర్థికంగా కూడా ఎదురు దెబ్బే. ఇవి ఐదో తరానికి చెందిన అత్యాధునిక యుద్ధ విమానాలు. ఒక్కదాని ఖరీదు 10 కోట్ల డాలర్ల (రూ.940 కోట్ల) దాకా ఉంటుంది! ఎఫ్–35 యుద్ధ విమానాన్ని శుక్రవారం ఉదయమే సెంట్రల్ ఇరాన్లో కూల్చేసినట్టు ఐఆర్జీసీ ప్రకటించింది. తమ అధునాతన డిఫెన్స్ సిస్టం దన్నుతో అత్యంత కచ్చితత్వంతో పని పూర్తి చేసినట్టు పేర్కొంది. సదరు విమానం లాకెన్‌హీత్ స్క్వాడ్రన్‌కు చెందినదని కూడా తెలిపింది. ‘‘మా దాడిలో విమానం పూర్తిగా దెబ్బ తిని కుప్పకూలింది. పైలట్ సురక్షితంగా బయట పడే అవకాశం లేనట్టే’’అని చెప్పుకొచ్చింది. మార్చి 19న కూడా ఒక అమెరికా ఎఫ్–35 యుద్ధ విమానాన్ని ఇరాన్ కూల్చేయడం తెలిసిందే. దాంతో ఈ యుద్ధంలో అమెరికా ఇప్పటికే రెండు ఎఫ్–35లను నష్టపోయింది. ఇక ఎఫ్–15ఇ యుద్ధ విమానం దక్షిణ ఇరాన్‌లోని పర్వతమయ కోహ్కిలోయే, బోయర్–అహ్మద్ ప్రాంతంలో నేలకూలినట్టు సమాచారం. ఇది రాజదాని టెహ్రాన్‌కు 500 కి.మీ. దూరంలో ఉంటుంది. పొరుగునున్న చహర్మహల్, భక్తియారీ ప్రావిన్స్‌లో కూడా శత్రు పైలట్ కోసం వెదకాల్సిందిగా ఇరాన్ ప్రభుత్వ వర్గాలు ప్రజలకు పిలుపునిచ్చాయి. యుద్ధంలోకి ఇరానీ బాలలు బాలలను కూడా ఇరాన్ యుద్ధ రంగంలోకి పంపుతోందని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ‘‘12 ఏళ్ల పసివాళ్లకు కూడా రివల్యూషనరీ గార్డ్, బసిజ్ ఫోర్స్ తదితర విభాగాల్లో చేర్చుకుంది. వారి చేతికి ఆయుధాన్నిచ్చి కీలక ప్రాంతాల్లో పహారా విధుల్లో నియమించింది’’ అని పేర్కొంది.మొసాద్ భవనం ధ్వంసంఇజ్రాయెల్ నిఘా విభాగమైన మొసాద్ ప్రధాన కార్యాలయాన్ని శుక్రవారం నాటి దాడుల్లో నేలమట్టం చేసినట్టు ఇరాన్ పేర్కొంది. టెల్ అవీవ్‌లో మంటల్లో కాలిపోతున్న భవనం తాలూకు ఫుటేజీని ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ విడుదల చేసింది. దానిపై ఇరాన్ సైన్యం అత్యంత కచ్చితత్వంతో కూడిన దాడి జరిపినట్టు పేర్కొంది. అయితే ఇజ్రాయెల్ మాత్రం ఈ వార్తలను ధ్రువీకరించలేదు.జోర్డాన్‌లోనూ అమెరికా యుద్ధ విమానాలపై దాడిజోర్డాన్లోని అల్ అజ్రాక్ వైమానిక స్థావరంలో ఉన్న అమెరికా యుద్ధ విమానాలపై భారీగా దాడులు జరిపినట్టు ఇరాన్ ప్రకటించింది. గురువారం రాత్రి వాటిపై డ్రోన్లతో విరుచుకుపడ్డట్టు పేర్కొంది. ఈ దాడిలో విమానాలకు ఏ మేరకు నష్టం జరిగిందీ వెల్లడించలేదు. అమెరికా నుంచి కూడా దీనిపై ఎలాంటి ప్రకటనా వెలువడలేదు. యూఎస్ రాడార్ ధ్వంసం! ఇరాన్ దాడుల్లో అత్యంత ఖరీదైన ఏఎన్/టీపీవై–2 రాడార్‌ను అమెరికా నష్టపోయినట్టు తెలుస్తోంది. గత నెలలో సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ వైమానిక స్థావరంపై ఇరాన్ జరిపిన దాడుల్లో ఇ–3 విమానం, మరో రీ ఫ్యూయలింగ్ విమానంతో పాటు ఈ రాడార్ కూడా ధ్వంసమైనట్టు సమాచారం. ఈ రాడార్ అభివృద్ధికి అమెరికా 13 కోట్ల డాలర్లు (సుమారు రూ.1,200 కోట్లు) వెచ్చించింది. భారతీయులకు గాయాలు అబుదాబిలోని అజ్బాన్ ప్రాంతంలో సహజవాయు క్షేత్రంపై ఇరాన్ భారీ స్థాయిలో డ్రోన్ దాడులకు దిగింది. వాటి శకలాలు తగిలి ఐదుగురు భారతీయులు, ఆరుగురు నేపాలీలు స్వల్పంగా గాయపడ్డారు. మరో నేపాలీ వ్యక్తికి తీవ్ర గాయాలైనట్టు అబుదాబి మీడియా ఎక్స్ పోస్టులో వెల్లడించింది. రంగంలోకి జెరాల్డ్ ఫోర్డ్ అమెరికా విమానవాహక యుద్ధ నౌక జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ మళ్లీ యుద్ధ విధుల్లో చేరినట్టు యూఎస్ సెంట్రల్ కమాండ్ పేర్కొంది. మార్చిలో జరిగిన అగ్నిప్రమాదంలో నౌక పాక్షికంగా దెబ్బ తినడం తెలిసిందే. దాంతో మరమ్మతుల నిమిత్తం దాన్ని గ్రీస్‌కు తరలించారు. హార్మూజ్ దాటిన ఫ్రెంచి నౌక ఫ్రాన్స్‌కు చెందిన ఒక కంటైనర్ నౌక శుక్రవారం హార్మూజ్ జలసంధిని దాటింది! యుద్ధం మొదలైనప్పటి నుంచి ఈ జలసంధిని దాటిన తొలి యూరప్ నౌకగా ఇది నిలిచింది. ఇరాన్లో బ్రిడ్జి పేల్చివేత ఉత్తర ఇరాన్లో అల్బోర్జ్ ప్రావిన్స్‌లోని కరాజ్‌లో నిర్మాణంలో ఉన్న భారీ బ్రిడ్జిపై అమెరికా, ఇజ్రాయెల్ రెండు దఫాలుగా దాడులు జరిపాయి. దాంతో బ్రిడ్జి తీవ్రంగా దెబ్బ తింది. ఎనిమిది మంది మరణించారు. ఇందుకు ప్రతీకారంగా గల్ఫ్ దేశాల్లోని కీలక బ్రిడ్జిలను నేలమట్టం చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. ఇప్పటికే 8 బ్రిడ్జిలను హిట్‌లిస్ట్‌లో చేర్చినట్టు ప్రకటించింది. వీటిలో షేక్ జబార్ అల్ అహ్మద్ సీ బ్రిడ్జి (కువైట్), కింగ్ ఫాద్ కాజ్వే (సౌదీ–బహ్రెయిన్ లింక్), షేక్ జాయేద్ బ్రిడ్జ్, షేక్ ఖలీఫా, బ్రిడ్జి (యూఏఈ); కింగ్ హుసేన్ బ్రిడ్జ్, దామియా బ్రిడ్జ్, అబ్దౌన్ బ్రిడ్జ్ (జోర్డాన్) ఉన్నాయి. బ్రిడ్జిపై దాడి తాలూకు వీడియోను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్రూత్ సోషల్‌లో షేర్ చేశారు. ‘‘సమయం మించిపోకముందే తమతో ఒప్పందానికి రండి. లేదంటే ఇలాంటి భారీ దాడులను మరింతగా చవిచూడాల్సి ఉంటుంది’’ అంటూ ఇరాన్‌ను హెచ్చరించారు. -
ఎడారిలో కూలిన అమెరికా యుద్ధ విమానం
ట్రోనా (యూఎస్): అమెరికా వైమానికి దళానికి చెందిన అత్యాధునిక యుద్ధ విమానం కాలిఫోర్నియా ఎడారిలో కూలిపోయింది. పైలట్ ముందుచూపుతో విమానం కుప్పకూలడానికి ముందే పారాచూట్ సహాయంతో సురక్షితంగా బయటపడ్డారు. యుద్ధ విన్యాసాల ప్రదర్శన స్క్వాడ్రన్ (థండర్‌బడ్స్)కు చెందిన యుద్ధ విమానం దక్షిణ కాలిఫోరనియాలోని ట్రోనా ఎయిర్పోర్ట్ సమీపంలో కూలిపోయిందనీ సైన్యం తెలిపింది. కానీ.. పైలట్ స్వల్ప గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని వెల్లడించింది. బుధవారం ఉదయం 10:45 గంటల ప్రాంతంలో శిక్షణలో ఉండగా ఎఫ్–16ఇ ఫైటర్ ఫాల్కన్ కూలిపోయిందని తెలిపింది. ఈ ప్రమాదంపై దర్యాప్తు నిర్వహిస్తున్నామని ఎయిర్‌ఫోర్స్ ఒక ప్రకటనలో తెలిపింది. నేవీకి చెందిన థండర్‌బడ్స్, బ్లూ ఏంజిల్స్ స్క్వాడ్రన్‌లోని ఫైటర్ జñ ట్స్ యుద్ధ విన్యాసాలకు ప్రసిద్ధి. అతి సమీపంగా ఎగరడంలో శిక్షణ పొందినవి. దశాబ్దాలుగా ఉపయోగిస్తున్న విమానాలు పదుల సంఖ్యలో ప్రమాదాలకు గురయ్యాయి. -
టీడీపీ నేతల అరాచకం.. వైఎస్సార్ విగ్రహానికి..
సాక్షి, బాపట్ల: ఏపీలో టీడీపీ దమనకాండకు, అరాచకాలకు తెరపడటం లేదు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి టీడీపీ నేతలు, కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు, సానుభూతిపరులపై దాడులకు తెగబడుతున్నారు. పలు చోట్ల గత ప్రభుతానికి సంబంధించిన శిలాఫలకాలు, వైఎస్సార్ విగ్రహాలు ధ్వంసం చేస్తున్నారు. తాజాగా బాపట్ల జిల్లాలో టీడీపీ నేతలు అరాచకం సృష్టించారు. జిల్లాలోని వేమూరు నియోజకవర్గంలో టీడీపీ నేతలు బరితెగించారు. దివంగత నేత వైఎస్సార్ విగ్రహానికి టీడీపీ నాయుకులు నిప్పంటించారు. ఈ ఘటన భట్టిప్రోలు మండలం అద్దేపల్లి దళితవాడలో చోటు చేసుకుంది. రోజురోజుకు పెరుగుతున్న టీడీపీ నేతల అరాచకాలపై వైఎస్సార్సీపీ నాయకులు తీవ్రంగా మండిపడితున్నారు. -
గుర్తుతెలియని వ్యక్తి అలజడి
భామిని : మండలంలోని చిన్నదిమిలి వద్ద గుర్తు తెలియని వ్యక్తి వీరంగం సృష్టించి మాయమయ్యాడు. కనిపించిన ప్రతి వస్తువును ధ్వంసం చేశాడు. పొలంలోని మేకలు, గొర్రె పిల్లల గూడుపై చెత్తను పోసి తగలబెట్టాడు. మేకల పెంపకందారుల బస వద్ద గల వంట సామాన్లు నాశనం చేశాడు. బియ్యం, ఇతర వస్తువుల్లో మందులు కలిపేశాడు. పొలంలోని జలసిరి బోరును ధ్వంసం చేసి పైపులను విరిసివేశాడు. వ్యవసాయ మోటార్‌ను వరద కాలువలో పడేశాడు. చిన్నదిమిలికి చెందిన కిల్లారి బుడ్డు, పిసిని ఆనంద్, కోరాడ బూసయ్యకు చెందిన తొమ్మిది మేక, గొర్రె పిల్లలు చనిపోయాయి. మేకల మంద నుంచి వచ్చిన పెంపకందారులు చచ్చిపడి వీటిని చూసి విలపించారు. హుటాహుటిన పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదుచేశారు. బత్తిలి పోలీస్‌లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మరో ఆలయం కూల్చివేత
గుంటూరు రూరల్ : భక్తుల మనోభావాలతో సర్కారు ఇంకా ఆటలాడుకుంటూనే ఉంది. ఆలయాల తొలగింపు ప్రక్రియ కొనసాగిస్తోంది. మొన్నటివరకు విజయవాడలో కొనసాగిన ప్రక్రియ ఇప్పుడు గుంటూరులో జరుగుతోంది. గోరంట్ల గ్రామంలో దాదాపు 21 సంవత్సరాలుగా భక్తుల పూజలు అందుకుంటున్న కనకదుర్గమ్మ ఆలయాన్ని గురువారం మున్సిపల్ అధికారులు తొలగించారు. అమరావతి రోడ్డు విస్తరణ పనులకు అడ్డుగా ఉందంటూ ఆలయాన్ని కూల్చివేశారు. నగరంలోని లాడ్జి సెంటర్ నుంచి ఈ రోడ్డు విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. సర్వే సందర్భంగా ఆలయ ముందుభాగాన్ని మాత్రమే తొలగిస్తామని చెప్పిన అధికారులు ఆ తర్వాత మొత్తం తొలగించారని నిర్వాహకులు తురకా భూపతి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నోటీసులు కూడా ఇవ్వకుండా ఆలయాన్ని తొలగించారని ఆలయ కమిటీ సభ్యులు విమర్శిస్తున్నారు. గ్రామస్తులందరితో పూజలందుకుంటున్న తల్లికి అధికారుల నిర్లక్ష్యం కారణంగా నేడు నిలువ నీడ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆలయాన్ని కూల్చివేయటంతో ఒక విగ్రహం ధ్వంసమైందని, మిగిలిన విగ్రహాలను గ్రామంలోని చిన్న రేకుల షెడ్డులో ఏర్పాటు చేశామని వారు వివరించారు. పనుల్లో భాగంగానే తొలగించాం... రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగానే ఆలయాన్ని తొలగించాల్సి వచ్చిందని నగరపాలక సంస్థ డీసీపీ సుబ్బారెడ్డి తెలిపారు. ఆలయం రోడ్డుకు మధ్యలో అడ్డుగా ఉండటంతో ముందే నిర్వాహకులకు తెలిపామన్నారు.


