
ప్రకటించిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ
డెయిర్ అల్ బాలాహ్ (గాజా స్ట్రిప్): గాజాలో హమాస్‌కు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. హమాస్ సాయుధ సంస్థ సీనియర్ నాయకుడు మొహమ్మద్ సిన్వార్ ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో హతమయ్యారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ బుధవారం పార్లమెంట్‌లో ఈ మేరకు ప్రకటించారు. హమాస్‌కు గతంలో అత్యంత కీలక నేతగా నిలిచిన యాహ్యా సిన్వార్ తమ్ముడే మొహమ్మద్. యాహ్యా గతేడాది ఇజ్రాయెల్ వైమానిక దాడిలో మరణించారు.
🚨 | JUST IN: Israeli PM Benjamin Netanyahu CONFIRMS the elimination of 3 top Hamas leaders -- Mohammed Deif, Yahya Sinwar, and Mohammed Sinwar.
Terrorism isn't managed it’s erased.
This is what real leadership looks like when evil shows its face. 🇮🇱🔥 pic.twitter.com/h1PsuLBarY— Hank™ (@HANKonX) May 28, 2025
2023 అక్టోబర్ ఏడున ఇజ్రాయెల్ శివారు గ్రామాలపై హమాస్ మెరుపుదాడి ఘటన సూత్రధారుల్లో యాహ్యా ఒకరని ఇజ్రాయెల్ ఆరోపించడం తెల్సిందే. యాహ్యా అనంతరం ఆయన బాధ్యతలను మొహమ్మదే చూసుకుంటున్నారు. సిన్వార్ సొంతపట్టణమైన ఖాన్ యూనిస్‌పై మే 13న ఇజ్రాయెల్ భారీగా బాంబు దాడులు చేసింది. ‘‘వాటి ధాటికి స్థానిక యూరోపియన్ ఆస్పత్రి భూగర్భంలోని హమాస్ కమాండ్ సెంటర్ నాశనమైంది. అందులో ఉన్న సిన్వార్ చనిపోయాడు’’ అని సైన్యం చెబుతోంది. సిన్వార్ మరణాన్ని హమాస్ ధ్రువీకరించలేదు. అయితే మే 13 నాటి దాడిలో ఆరుగురు చనిపోయారని, 40 మంది గాయపడ్డారని గాజా ప్రభుత్వం అప్పుడే ప్రకటించింది.