రయ్‌.. రయ్‌.. విమానంతో పోటీపడే రైలు.. గంటకు 600 కిలోమీటర్లు.. | China Maglev Train Test Achieves 650 Kmh In 7 Seconds, Check Out Video Went Viral | Sakshi
Sakshi News home page

రయ్‌.. రయ్‌.. విమానంతో పోటీపడే రైలు.. గంటకు 600 కిలోమీటర్లు..

Jul 14 2025 9:03 AM | Updated on Jul 14 2025 10:40 AM

China Maglev Train Test achieves 650 kmh in 7 seconds

బీజింగ్‌: డ్రాగన్‌ దేశం చైనా సరికొత్త ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది. గత కొన్నేళ్లుగా హైస్పీడ్‌ రైలు నెట్‌వర్క్‌పై పూర్తి స్థాయిలో ఫోకస్‌ పెట్టిన చైనా.. తాజాగా విమానంతో పోటీపడే రైలును తయారు చేసింది. ఈ రైలు వేగం గంటకు 600 కిలోమీటర్లు అని తెలుస్తోంది. తాజాగా 17వ మోడ్రన్‌ రైల్వే ఎగ్జిబిషన్‌లో మాగ్లెవ్‌ రైలును చైనా ప్రదర్శించింది. దీంతో, ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది.

చైనా విజయవంతంగా మాగ్నెటిక్ లెవిటేషన్ (మాగ్లెవ్) టెక్నాలజీతో సరికొత్త హైస్పీడ్‌ రైలును ఆవిష్కరించింది. విమానంతో పోటీ పడే రైలును ప్రపంచానికి పరిచయం చేసింది. 17వ మోడ్రన్‌ రైల్వే ఎగ్జిబిషన్‌లో మాగ్లెవ్‌ రైలును  చైనా ప్రదర్శించింది. ఇది కేవలం 7 సెకన్లలోనే 600 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని అధికారులు తెలిపారు. ఇక, ఇది అందుబాటులోకి వస్తే.. బీజింగ్ నుంచి షాంఘై మధ్య ఉన్న 1200 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 150 నిమిషాల్లో చేరుకుంటుందని అంచనా. ప్రస్తుతం ఈ రెండు నగరాల మధ్య ప్రయాణానికి 5.30 గంటల సమయం పడుతోంది.

కాగా, డోంఘు లాబొరేటరీలోని ఇంజనీర్లు 2025 చివరి నాటికి తమ హై-స్పీడ్ ట్రాక్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని భావిస్తున్నారు. దీనికి ఏఐ గైడెడ్ సస్పెన్షన్ వ్యవస్థలు.. ఖచ్చితమైన విద్యుదయస్కాంత నియంత్రణకు తోడ్పడనున్నట్టు అధికారులు తెలిపారు. హైస్పీడ్‌ సమయంలో ఇవి ప్రయాణికులకు ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతం చేస్తాయన్నారు.

ఇదిలా ఉండగా.. మ్యాగ్నెటిక్‌ లెవిటేషన్‌ (మాగ్లెవ్) టెక్నాలజీతో ఈ రైలు అధిక వేగంతో దూసుకెళ్లగలదు. ఈ టెక్నాలజీ అయస్కాంత వ్యతిరేక క్షేత్రాలను ఉపయోగించుకొని.. ట్రాక్‌ నుంచి రైలును పైకి లేపడానికి సాయపడుతుంది. అప్పుడు ఫ్రిక్షన్ తగ్గి రైలు నిశ్శబ్దంగా, వేగంగా వెళ్లగలుతుందని బీజింగ్‌ అధికారులు వెల్లడించారు. ఈ రైలు బరువు 1.1 టన్నులుగా ఉండనుంది. ఇక, ఇది వినియోగంలోకి వస్తే ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన రైలుగా చరిత్ర సృష్టించనుంది. ఈ ఏడాది జూన్‌లో చైనా ఇంజినీర్లు దీన్ని పరీక్షించారు. తాజాగా ప్రదర్శించారు. దీంతో, అందరి దృష్టి ఈ రైలు పడింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement