వాకింగూ కాదు, రన్నింగూ కాదు అరవైలో ఇరవైలా ఫిట్‌గా : ఇవిగో టిప్స్‌ | Harvard study reveals benefits of martial arts keep people over 60 fit | Sakshi
Sakshi News home page

వాకింగూ కాదు, రన్నింగూ కాదు అరవైలో ఇరవైలా ఫిట్‌గా : ఇవిగో టిప్స్‌

Jul 8 2025 11:00 AM | Updated on Jul 8 2025 11:54 AM

Harvard study reveals benefits of martial arts keep people over 60 fit

మార్షల్‌ ఆర్ట్స్‌ మంత్రం

షష్టిపూర్తి తర్వాతా చురుగ్గాఉండేందుకు సాయం..

నడక లేదా స్వల్ప వ్యాయామం కంటే వీటితో మేలు

తై చీ, ఐకిడో, వింగ్‌ చున్‌ వంటి వాటితో మనసుకూ ఉత్తేజం..

హార్వర్డ్‌ మెడికల్‌ స్కూల్‌ తాజా అధ్యయనంలో వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: వయసు పెరిగే కొద్దీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే అధిక శాతం మంది నడక లేదా స్వల్ప శరీర వ్యాయామమే సరిపోతుందనుకుంటారు. అయితే.. తాజాగా హార్వర్డ్‌ మెడికల్‌ స్కూల్‌ అధ్య యనం ప్రకారం చూస్తే.. వయసు పైబడినవారు ఆరో గ్యంగా, ఉల్లాసంగా ఉండాలంటే కేవలం నడక సరిపో దని.. మొత్తంగా వారి ఆలోచనల్లో మార్పు రావడానికి శారీరకంగా చైతన్యంగా ఉండేందుకు కదలికలు అవసరమని వెల్లడైంది. ఈ ప్రయోగంలో శరీరానికి మాత్రమే కాక, మనసుకు కూడా ఉత్తేజం కలిగించే వ్యాయామాల ప్రాధాన్యాన్ని వివరించారు. తై చీ, ఐకిడో, వింగ్‌ చున్‌.. వంటి మార్షల్‌ ఆర్ట్స్‌ పద్ధతులు వృద్ధుల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ఈ అధ్యయ నంలో పేర్కొన్నారు.

ఏమిటీ అధ్యయనం..?
హార్వర్డ్‌ మెడికల్‌ స్కూల్‌కు చెందిన డాక్టర్‌ పీటర్‌ ఎం.వె యిన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పరిశీలనలో తై చీ వంటి నెమ్మదిగా, స్వల్ప కదలి కలతో సాగే మార్షల్‌ ఆర్ట్స్‌ మనుషుల శరీరంలో ‘ఫిజి యొలాజికల్‌ కాంప్లెక్సిటీ’ ను పెంచుతాయని వెల్లడైంది. అంటే.. వృద్ధాప్యంలో ఎదురయ్యే అడ్డంకులకు మెరుగ్గా స్పందించే సామర్థ్యం శరీరానికి పెరుగుతుందని తేలింది.

ఇవి కేవలం శారీరక ఆరోగ్య ప్రయోజనాలు మాత్రమే కాక, జీవన నాణ్యత  మెరుగుదలకు తోడ్పడుతున్నట్టు స్పష్ట మైంది. ఇప్పటిదాకా మన దగ్గర పెద్దల ఆరోగ్యంపై దృష్టి చికిత్సాపరంగా ఉండేది. కానీ తాజా అధ్యయనం సూచిస్తున్న మార్గం ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు, పునరావాస కేంద్రాలు, సామాజిక కార్యక్రమాల రూపంలో మార్షల్‌ ఆర్ట్స్‌ వంటి చురుకైన లేదా  మృదువైన కదలికలతో కూడిన వ్యాయామాలను ప్రవే  శపెట్టాల్సిన అవసరం ఉందని స్పష్టం చేస్తోంది.

నడకతో పోలిస్తే ?
నడక.. కేవలం కాలి కదలికలతో పరిమితమైన వ్యాయామం. తైచీ.. శరీరం, శ్వాస, మేధస్సు.. మూడింటినీ ఒకే సమయంలో సమతుల్యంగా ఉత్తేజపరిచే ప్రక్రియ. వృద్ధులకు.. మరీ ముఖ్యంగా 60 ఏళ్లు దాటిన వారికి సులభ, స్వల్ప తరహా మార్షల్‌ ఆర్ట్స్‌ ఎంతో ఉపయోగపడతాయి.

ఇది వృద్ధుల్లో.. 
తూలిపడిపోవడం వంటి వాటిని తగ్గిస్తుంది
నిద్ర నాణ్యత మెరుగవుతుంది
మానసిక స్థైర్యం పెరుగుతుంది

తెలుగు రాష్ట్రాల్లో వృద్ధుల పరిస్థితి మార్పు ఆవశ్యకత..
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో వృద్ధుల జనాభా అనేది 13 శాతానికి పైగా ఉందని 2011 జనగణన ద్వారా వెల్లడైంది. 2036 నాటికి ఇది 20 శాతం దాటే అవకాశం ఉంది. ఈ వయోధిక వర్గానికి సరిపడే ఆరోగ్య విధానాలు, శారీరక దృఢత్వం కలిగించే వ్యాయామాలను అందుబాటులోకి తేవడం అత్యవసరం.

వృద్ధులకు ఎలాంటి మార్షల్‌ ఆర్ట్స్‌ తగినవి.. ఉపయోగాలు..
తై చీ: నెమ్మదిగా జరిగే ప్రవాహ రూప కదలికలు, శ్వాస నియంత్రణ, శరీర సమతుల్యత, మానసిక ప్రశాంతత
ఐకిడో: శక్తిని మళ్లించే శక్తివంతమైన కాన్సెప్ట్, కణజాలానికి మెరుగైన కదలికలు
వింగ్‌ చున్‌: ఓ మోస్తరు  క్లిష్టమైన కదలికలు, మెరుగైన ప్రతిస్పందన సామర్థ్యం, స్వీయ రక్షణ

ఇదీ చదవండి: జిమ్‌కు వెళ్లకుండానే 30 కిలోలు తగ్గింది

వృద్ధాప్యం ఓ ప్రతిబంధకం కాదు. అది మనం కొత్త విషయాలు నేర్చుకోవాలనే సంకల్పానికి తెరలేపే అవకాశంగా భావించాల్సి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ఈ అంశంపై వృద్ధుల్లోనే కాకుండా అందరి ఆలోచనా ధోరణిలోనూ మార్పు వచ్చి అవగాహన పెరిగితే సమాజానికి మంచి ప్రయోజనా లు చేకూరుతాయని స్పష్టం చేస్తున్నా రు. వృద్ధుల్లో ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడడంతో పాటు.. 60 ఏళ్ల తర్వాత జీవితానికి సంబంధించి కచ్చితమైన అవగాహన, చైతన్యం ఏర్పడతాయని వారు పేర్కొంటున్నారు.

చదవండి: 300కు పైగా రైతులకు సాధికారత : తొలి ఏడాదిలోనే రూ. 8.7 కోట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement