300కు పైగా రైతులకు సాధికారత : తొలి ఏడాదిలోనే రూ. 8.7 కోట్లు | World chocolate day 2025 Manam chocolate Chaitanya Muppala success | Sakshi
Sakshi News home page

300కు పైగా రైతులకు సాధికారత : తొలి ఏడాదిలోనే రూ. 8.7 కోట్లు

Jul 7 2025 5:11 PM | Updated on Jul 7 2025 5:45 PM

World chocolate day 2025 Manam chocolate Chaitanya Muppala success

మనం  తినే ప్రతి మెతుకు వెనుక  ఒక రైతు శ్రమ ఉంటుంది. అలాగే ఎంతో ఆనందంగా ఆస్వాదించే  ప్రతీ చాక్లెట్‌, చాక్లెట్ బార్ వెనుక ఒక రైతు కథ ఉంటుంది. చాక్లెట్లలో చెప్పుకోదగ్గది మన దేశానికి చెందిన, వెరీ వెరీ స్పెషల్‌ ఏంటి అంటే చెప్పుకోవాల్సింది ‘మనం​​’  చాక్లెట్ గురించే. హైదరాబాద్‌లో ఉన్న భారతదేశపు  చాక్లెట్ బ్రాండ్‌. వరల్డ్‌ చాక్లెట్‌ డే సందర్భంగా ఆ  విజయ గాధ ఏంటో తెలుసుకుందాం పదండి.

 ‘మనం’  కథ ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరిలోని కోకో పొలాలలోమొదలువుతుంది. ఈ ఆంధ్రా-ఆధారిత చాక్లెట్ బ్రాండ్ 300+ మంది రైతులకు సాధికారత కల్పించి తొలి ఏడాదిలో సంవత్సరంలో రూ. 8.7 కోట్లు సంపాదిండం విశేషం. అంతేకాద గత ఏడాది ప్రతిష్టాత్మక టైమ్‌ మ్యాగజైన్‌ ‘ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల’ జాబితాలో చోటు సంపాదించుకుంది. స్వదేశీ పదార్థాలకు అంతర్జాతీయ గుర్తింపు  తీసుకొచ్చిందంటూ  ‘మనం చాక్లెట్‌’ను కొనియాడింది. భారత్‌లో పండించే కోకోతో చాక్లెట్ల తయారు చేసి  ‘మనం చాక్లెట్‌’  పాపులర్‌ అయింది. ఈ చాక్లెట్లకు 

అంతర్జాతీయంగా చాలా డిమాండ్‌ ఉంది. 2023 ఆగస్టులో మనం చాక్లెట్‌ కార్ఖానాను ముప్పాల చైతన్య స్థాపించారు.  దీని వెనుక పెద్ద స్టోరీనే ఉంది.  <

 హైదరాబాద్‌లో  పుట్టినా, చైతన్య బాల్యంలో ఎక్కువ భాగం పూణేలో గడించింది. అక్కడ సహ్యాద్రి స్కూల్ KFI (జిడ్డు కృష్ణమూర్తి బోర్డింగ్ స్కూల్)లో పెరిగాడు. కెనడాలోని బ్రిటిష్ కొలంబియా విశ్వవిద్యాలయంలోని సౌడర్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుండి జనరల్ బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ చేశారు.  స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇన్నోవేషన్ ఇన్ డెవలపింగ్ ఎకానమీస్ నుండి స్టాన్‌ఫోర్డ్ సీడ్ ప్రోగ్రామ్‌ను పూర్తి చేసిన తర్వాత తండ్రి అనారోగ్యం కారణంగా ఇండియా తిరిగి వచ్చారు.  తండ్రి  నిర్వహించే ఆల్మండ్‌ హౌజ్‌ మిఠాయి దుకాణం బాధ్యతలు చేపట్టారు.  ఒకే ఒక్క దుకాణంతో  ఉన్న చిన్న వ్యాపారంలోని లోపాలను పరిష్కరించుకుంటూ, తనదైన శైలిలో అభివృద్ది చేశారు. గత 10 సంవత్సరాలలో దానిని చాలా పెద్ద వ్యాపారంగా విస్తరించారు. దాదాపు 200 మందికి ఉపాధి కల్పిస్తున్న ఈ కంపెనీ మొదటి సంవత్సరంలోనే రూ. 8.79 కోట్ల టర్నోవర్‌ను నమోదు చేసింది.  అలాగే 2023-24 ఆర్థిక సంవత్సరంలో కేవలం ఎనిమిది నెలల్లోనే దీన్ని  సాధించడం విశేషం.

బీన్స్ పట్ల ఆయనకున్న మక్కువే తన సొంత బ్రాండ్‌ను రూపొందించేలా చేసింది. చాక్లెట్ వస్తువులు అందుబాటులో లేకపోవడం, ఆ సమయంలో చాక్లెట్ గురించి మాకు ఏమీ తెలియదు ఎందుకంటే చాక్లెట్ ఎల్లప్పుడూ  సరఫరాదారు నుండి కొనుగోలు చేసేవాళ్లమని, అదే  చాక్లెట్ మార్కెట్‌లోకి ప్రవేశించాలనే ఆలోచన అతని ఆసక్తిని రేకెత్తించింది అంటారు. మనం చాక్లెట్‌ను ప్రవేశపెట్టిన సంస్థ డిస్టింక్ట్ ఆరిజిన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (DOPL) CEO చైతన్య ముప్పాల.   తాము సంవత్సరానికి 150శాతం వృద్ధి చెందుతున్నామని, ఇది తమ విజయవంతమైన మార్కెట్ వ్యూహానికి నిదర్శనమన్నారు. కోకో బీన్స్ పొలం నుంచి చాక్లెట్ టాబ్లెట్‌గా రూపాంతరం చెందే ప్రయాణంలో రైతుల అమూల్యమైన మద్దతు లేకుండా తమ  సాధ్యం కాదు అని తెలిపారు.

ఎన్నో వెరైటీలు
డార్క్‌ చాక్లెట్లు, చాక్లెట్‌ ట్యాబ్లెట్స్, స్నాక్స్, ఒకే ప్రదేశంలో పండించినవి, అంతర్జాతీయంగా పండించిన కోకో నుంచి తయారైనవి, పాల మిశ్రమంతో చేసినవి ఇలా ఎన్నో రకాల వెరైటీ చాక్లెట్లు ఈ కార్ఖానాలో లభిస్తుంటాయి. పండ్లు, ప్లేన్, వీగన్‌ వంటి చాక్లెట్ల రకాలు కూడా తయారు చేస్తారు. ఇక్కడ తయారైన పది రకాల చాక్లెట్లను అవార్డులు కూడా వరించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement