breaking news
Harward
-
వాకింగూ కాదు, రన్నింగూ కాదు అరవైలో ఇరవైలా ఫిట్‌గా : ఇవిగో టిప్స్
సాక్షి, హైదరాబాద్: వయసు పెరిగే కొద్దీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే అధిక శాతం మంది నడక లేదా స్వల్ప శరీర వ్యాయామమే సరిపోతుందనుకుంటారు. అయితే.. తాజాగా హార్వర్డ్ మెడికల్ స్కూల్ అధ్య యనం ప్రకారం చూస్తే.. వయసు పైబడినవారు ఆరో గ్యంగా, ఉల్లాసంగా ఉండాలంటే కేవలం నడక సరిపో దని.. మొత్తంగా వారి ఆలోచనల్లో మార్పు రావడానికి శారీరకంగా చైతన్యంగా ఉండేందుకు కదలికలు అవసరమని వెల్లడైంది. ఈ ప్రయోగంలో శరీరానికి మాత్రమే కాక, మనసుకు కూడా ఉత్తేజం కలిగించే వ్యాయామాల ప్రాధాన్యాన్ని వివరించారు. తై చీ, ఐకిడో, వింగ్ చున్.. వంటి మార్షల్ ఆర్ట్స్ పద్ధతులు వృద్ధుల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ఈ అధ్యయ నంలో పేర్కొన్నారు.ఏమిటీ అధ్యయనం..?హార్వర్డ్ మెడికల్ స్కూల్‌కు చెందిన డాక్టర్ పీటర్ ఎం.వె యిన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పరిశీలనలో తై చీ వంటి నెమ్మదిగా, స్వల్ప కదలి కలతో సాగే మార్షల్ ఆర్ట్స్ మనుషుల శరీరంలో ‘ఫిజి యొలాజికల్ కాంప్లెక్సిటీ’ ను పెంచుతాయని వెల్లడైంది. అంటే.. వృద్ధాప్యంలో ఎదురయ్యే అడ్డంకులకు మెరుగ్గా స్పందించే సామర్థ్యం శరీరానికి పెరుగుతుందని తేలింది.ఇవి కేవలం శారీరక ఆరోగ్య ప్రయోజనాలు మాత్రమే కాక, జీవన నాణ్యత మెరుగుదలకు తోడ్పడుతున్నట్టు స్పష్ట మైంది. ఇప్పటిదాకా మన దగ్గర పెద్దల ఆరోగ్యంపై దృష్టి చికిత్సాపరంగా ఉండేది. కానీ తాజా అధ్యయనం సూచిస్తున్న మార్గం ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు, పునరావాస కేంద్రాలు, సామాజిక కార్యక్రమాల రూపంలో మార్షల్ ఆర్ట్స్ వంటి చురుకైన లేదా మృదువైన కదలికలతో కూడిన వ్యాయామాలను ప్రవే శపెట్టాల్సిన అవసరం ఉందని స్పష్టం చేస్తోంది.నడకతో పోలిస్తే ?నడక.. కేవలం కాలి కదలికలతో పరిమితమైన వ్యాయామం. తైచీ.. శరీరం, శ్వాస, మేధస్సు.. మూడింటినీ ఒకే సమయంలో సమతుల్యంగా ఉత్తేజపరిచే ప్రక్రియ. వృద్ధులకు.. మరీ ముఖ్యంగా 60 ఏళ్లు దాటిన వారికి సులభ, స్వల్ప తరహా మార్షల్ ఆర్ట్స్ ఎంతో ఉపయోగపడతాయి.ఇది వృద్ధుల్లో.. తూలిపడిపోవడం వంటి వాటిని తగ్గిస్తుందినిద్ర నాణ్యత మెరుగవుతుందిమానసిక స్థైర్యం పెరుగుతుందితెలుగు రాష్ట్రాల్లో వృద్ధుల పరిస్థితి మార్పు ఆవశ్యకత..తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వృద్ధుల జనాభా అనేది 13 శాతానికి పైగా ఉందని 2011 జనగణన ద్వారా వెల్లడైంది. 2036 నాటికి ఇది 20 శాతం దాటే అవకాశం ఉంది. ఈ వయోధిక వర్గానికి సరిపడే ఆరోగ్య విధానాలు, శారీరక దృఢత్వం కలిగించే వ్యాయామాలను అందుబాటులోకి తేవడం అత్యవసరం.వృద్ధులకు ఎలాంటి మార్షల్ ఆర్ట్స్ తగినవి.. ఉపయోగాలు..తై చీ: నెమ్మదిగా జరిగే ప్రవాహ రూప కదలికలు, శ్వాస నియంత్రణ, శరీర సమతుల్యత, మానసిక ప్రశాంతతఐకిడో: శక్తిని మళ్లించే శక్తివంతమైన కాన్సెప్ట్, కణజాలానికి మెరుగైన కదలికలువింగ్ చున్: ఓ మోస్తరు క్లిష్టమైన కదలికలు, మెరుగైన ప్రతిస్పందన సామర్థ్యం, స్వీయ రక్షణఇదీ చదవండి: జిమ్‌కు వెళ్లకుండానే 30 కిలోలు తగ్గిందివృద్ధాప్యం ఓ ప్రతిబంధకం కాదు. అది మనం కొత్త విషయాలు నేర్చుకోవాలనే సంకల్పానికి తెరలేపే అవకాశంగా భావించాల్సి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ఈ అంశంపై వృద్ధుల్లోనే కాకుండా అందరి ఆలోచనా ధోరణిలోనూ మార్పు వచ్చి అవగాహన పెరిగితే సమాజానికి మంచి ప్రయోజనా లు చేకూరుతాయని స్పష్టం చేస్తున్నా రు. వృద్ధుల్లో ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడడంతో పాటు.. 60 ఏళ్ల తర్వాత జీవితానికి సంబంధించి కచ్చితమైన అవగాహన, చైతన్యం ఏర్పడతాయని వారు పేర్కొంటున్నారు.చదవండి: 300కు పైగా రైతులకు సాధికారత : తొలి ఏడాదిలోనే రూ. 8.7 కోట్లు -
బరువు తగ్గడానికి 12-12 రూల్ ..!
బరువు తగ్గడానికి అడపదడపా ఉపవాసం ఒక ప్రసిద్ధమైన పద్ధతిగా మారింది. దీంతో అయితేనే ఈజీగా బరువు తగ్గుతామని చాలామంది ఈ పద్ధతి వైపుకే మొగ్గు చూపుతున్నారు. అయితే తాజాగా హార్వర్డ్ స్టాన్ఫోర్డ్ చెందిన ప్రఖ్యాత గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ సౌరబ్ సేథి ఈ అడదడప ఉపవాసం ది బెస్ట్ అని కితాబిచ్చారు. ఇది బరువు నిర్వహణ తోపాటు మొత్త ఆరోగ్యానికే మంచి ప్రయోజనాలను అందిస్తుందని చెప్పారు. ముఖ్యంగా కొవ్వుని కరిగించడానికి మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో ప్రభావవంతంగా ఉంటుందని అన్నారు. దీన్ని గనుక ఈ సింపుల్ టెక్నిక్‌లలో చేస్తే తక్షణమే ఫలితాన్ని అందుకోగలుగుతారని అన్నారు. అదెలాగో చేసేద్దామా..!.డాక్టర్ సేథి బరువు తగ్గడం కోసం మూడు కీలక చిట్కాలను ఫాలోమని చెప్పారు. అవేంటంటే..నిర్మాణాత్మక ఉపవాస షెడ్యూల్, మంచి డిటాక్స్ పానీయాలు, సమతుల్య ఆహారం తదితరాలు. ఈ మూడింటిని ఎలా చేయాలో డాక్టర్ సేథి చాలా వివరంగా చెప్పారు. 12:12 ఉపవాస షెడ్యూల్:డాక్టర్ సేథి 12:12 అడపాదడపా ఉపవాస షెడ్యూల్‌నే నిర్మాణాత్మక ఉపవాసమని అన్నారు. ఇది అత్యంత తేలికగా నిర్వహించదగిన ప్రక్రియని చెప్పారు. ఈ ప్రక్రియలో భాగంగా 12 గంటలు ఉపవాసం ఉంటారు, మిగతా 12 గంటలు తినడం వంటివి చేస్తారు. ఈ విధానం అనేక ప్రయోజనాలను కలిగి ఉంది. ముఖ్యంగా నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుందని చెప్పారు. ఈ ప్రక్రియ వల్ల నిద్రలేమి తాలుక సమస్యలు దూరం అవుతాయని అన్నారు. ఇది అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లను నివారస్తుందని చెప్పారు. అలాగే ఇంత విరామం కారణంగా జీర్ణక్రియ పునరుద్ధరించడానికి తగినంత సమయం ఉంటుంది. ఉపవాస సమయంలో తీసుకోవాల్సినవి..ఈ పన్నెండు గంటల ఉపవాస సమయంలో కొవ్వుని కరిగించే జ్యూస్‌లు వంటివి తీసుకోవాలి. అంతేతప్ప కూల్‌డ్రింక్‌లు, ఫ్యాట్‌తో కూడిన జ్యూస్‌ల జోలికి వెళ్లకూడదని చెప్పారు. ముఖ్యంగా బ్లాక్ కాఫీ, గ్రీన్ టీ, బ్లాక్ టీ, నీరు, ఆపిల్ సైడర్ వెనిగర్, నిమ్మకాయ నీరు, ఫెన్నెల్ లేదా తులసి నీరు, చమోమిలే టీ లేదా అల్లం టీ వంటివి తీసుకోవడం మంచిదని చెప్పారు సేథి. ఇవి ఆకలిని అరికట్టడంలో సహాయపడటమే కాకుండా జీవక్రియను పెంచడంలో సహాయపడతాయి. వివిధ మార్గాల్లో శరీరానికి మద్దుతుని ఇస్తాయి.మిగతా 12 గంటలు తినే భోజనం ఎలా ఉండాలంటే..ఈ సమయంలో సమతుల్యమైన ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలి. కొవ్వు తగ్గేందుకు ప్రోత్సహించేలా అధిక ప్రోటీన్లు, ఫైబర్ అధికంగా ఉండే ఆహారంపై దృష్టిపెట్టాలి. పనీర్, టోపు, చిక్పీస్, చికెన్, టర్కీ, చేపలు వంటి ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలు, ఫైబర్ అధికంగా ఉండే పండ్లు, కూరగాయాలు తీసుకోవడం మంచిదని సూచించారు. ఇవి కడుపు నిండిన అనుభూతిని ఇవ్వడం తోపాటు అతిగా తినకుండా నిరోధించడంలో సహాయపడతాయి. ప్రోటీన్, ఫైబర్ కలయిక కొవ్వుని తగ్గించడానికి మద్దతు ఇవ్వడమే కాకుండా శరీరానికి ఇంధనంగా మంచి పోషకాలను అందిస్తుంది. చివరగా బరువు తగ్గడంలో ఈ అడపాదడపా ఉపవాసం ప్రభావంతంగా ఉంటుందని క్లినికల్‌గా నిరూపితమైందని నొక్కి చెప్పారు. అయితే ఇక్కడ సరైన విధంగా చేయడంపైనే ఫలితం అనేది ఆధారపడి ఉంటుందని చెప్పారు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. మరిన్ని వివరాల కోసం వ్యక్తిగత నిపుణులు లేదా వైద్యులను సంప్రదించి అనుసరించడం ఉత్తమం(చదవండి: కొంబర శ్రీకృష్ణ స్వామి ఆలయానికి యాంత్రిక ఏనుగు సేవలు..!) -
నీతా అంబానీకి మరో అరుదైన గౌరవం
రిలయన్స్‌ఫౌండేషన్ చైర్ పర్సన్ నీతా అంబానీ మరో అరుదైన గౌరవాన్ని దక్కించు కున్నారు. ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న హార్వర్డ్ ఇండియా కాన్ఫరెన్స్ (ఐసిహెచ్)లో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. అమెరికాలోని బోస్టన్‌లో జరగనున్న హార్వర్డ్(ICH)లో ప్రధాన వక్తగా పాల్గొంటారని ఇండియా కాన్ఫరెన్స్ ఆదివారం ప్రకటించింది. హార్వర్డ్ విశ్వవిద్యాలయం గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ పాఠశాలల్లోని విద్యార్థుల ఆధ్వర్యంలో నిర్వహించే అతి పెద్ద ఈవెంట్లలో ఇది కూడా ఒకటి. ఈ సంవత్సరం కాన్ఫరెన్స్ "భారతదేశం నుండి ప్రపంచానికి" అనే థీమ్‌తో ఈ ఏడాది కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఈ కాన్ఫరెన్స్‌లో రెండు రోజుల పాటు విభిన్న రంగాలకు చెందిన 80 మంది ప్రముఖ వక్తలు పాల్గొంటారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయం వివిధ గ్రాడ్యుయేట్ , అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల ఆధ్వర్యంలో నిర్వహించే అతిపెద్ద ఈవెంట్లలో ఇది ఒకటి. దాతృత్వం, విద్య ,సంస్కృతి రంగాల్లో విశేష సేవలందిస్తున్న నీతా అంబానీ తమ వార్షిక సదస్సులో కీలక ప్రసంగం చేస్తారని హార్వర్డ్ (ఐసిహెచ్)లోని ఇండియా కాన్ఫరెన్స్ ప్రకటించింది. శాంతి, శ్రేయస్సు, నూతన ఆవిష్కరణల్లో ప్రపంచ నాయకుడిగా భారతదేశం ఎదిగినతీరును ‘భారతదేశం నుండి ప్రపంచానికి' పేరుతో నీతా వివరిస్తారని ఐసీహెచ్ తెలిపింది. ఈవెంట్ 2025 ఫిబ్రవరి 15-16 తేదీల్లో బోస్టన్‌లో జరగనుంది. నీతా అంబానీ తన సామాజిక సేవల ద్వారా కోట్లాది మంది జీవితాలను ప్రభావితం చేసిన ఘనతను దక్కించున్నారు. అలాగే నాలుగు దశాబ్దాల తరువాత ఇండియాలో ఒలింపిక్ సెషన్ నిర్వహించడంతోపాటు, 2036 ఒలింపిక్ క్రీడా వేదికగా భారత్నునిలపడం కీలక పాత్ర పోషించారు. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC)ఎంపికైన తొలి భారత మహిళ కూడా.ఇదీ చదవండి: కీర్తి సురేష్ పెళ్లి చీర : స్పెషల్‌గా కీర్తి ఏం చేసిందో తెలుసా? -
టాప్ టెన్ యూనివర్శిటీల్లో అమెరికాదే హవా
బీజింగ్: ప్రపంచ టాప్ యూనివర్శిటీల్లో ఈ ఏడాది కూడా అమెరికా యూనివర్శిటీలదే హవా. వరుసగా పదమూడవ సంవత్సరం కూడా హార్వర్డ్ యూనివర్శిటీ టాప్ ర్యాంక్‌లో నిలిచింది. స్టాన్‌ఫర్డ్, మసాచుసెట్స్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) ద్వితీయ, తృతీయ స్థానాల్లో, బెర్కిలీలోని కాలిఫోర్నియా యూనివర్శిటీ, ప్రిన్సిటన్ యూనివర్శిటీ, కాలిఫోర్నియా యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ యూనివర్శిటీలు ఈసారి కూడా నాలుగు, ఆరు, ఏడు స్థానాల్లో నిలిచాయి. కొలంబియా యూనివర్శిటీ, షికాగో యూనివర్శిటీ ఎనిమిది, తొమ్మిదవ స్థానాలను సాధించాయి. మొత్తం టాప్ టెన్ యూనివర్శిటీల్లో ఎనిమిది యూనివర్శిటీ అమెరికావే కావడం విశేషం. అమెరికేతర యూనివర్శిటీలైన యూనివర్శిటీ ఆఫ్ కేంబ్రిడ్జి, ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీలు వరుసగా ఐదు, పదవ స్థానాలను ఆక్రమించాయి. షాంగ్ జియాటాంగ్ యూనివర్శిటీ పర్యవేక్షణలో చైనీస్ రిసెర్చ్ సెంటర్ ఈ ర్యాంకులను విడుదల చేసింది. ఈ సారి ఫ్రెంచ్ యూనివర్శిటీలు బాగా వెనకపడి పోయాయి. టాప్ వంద యూనివర్శిటీల్లో ఫ్రెంచ్ యూనివర్శిటీలకు మూడు స్థానాలు మాత్రమే లభించాయి. ఫ్రాన్స్‌లోని పియరీ అండ్ మేరి క్యూరి యూనివర్శిటీకి 39వ స్థానం, పారిస్ సూద్‌కు 46, ఎకోల్ నార్మేల్ సుపీరియర్‌కు 87వ స్థానం లభించాయి. ఒక్క మాథమేటిక్స్ విభాగంలోనే ఫ్రెంచ్ యూనివర్శిటీలకు ఎక్కువ మార్కులు వచ్చాయి. అయితే యూనివర్శిటీ ర్యాంకులను నిర్ణయించేందుకు చైనా అనుసరించిన ప్రమాణాలే పూర్తిగా తప్పని, వారు కేవలం సైన్స్ విభాగాలకే ప్రాధాన్యత ఇచ్చారని ఫ్రాన్స్ విద్యాశాఖ మంత్రి తియరీ మాండన్ విమర్శించారు. తమ విద్యానాన్నే చైనా తప్పుగా అర్థం చేసుకొందని, ప్రపంచంలో నెంబర్ ర్యాంకును సాధించడం తమ విద్యావిధానం లక్ష్యం కాదని ఆయన చెప్పారు. అయితే తాము అనేక విద్యా ప్రమాణాలను పరిగణలోకి తీసుకొనే ర్యాంకులు నిర్ణయించామని, పైగా మూడవ పార్టీ అధ్యయనంతోనే ర్యాంకులను శాస్త్రీయ ప్రమాణాలతో ఖరారు చేశామని చైనా యూనివర్శిటీ తెలిపింది. పూర్వ విద్యార్థుల రాణింపును, యూనివర్శిటీ సిబ్బందికి వచ్చే నోబెల్ బహుమతులను, ఫీల్డ్ మెడళ్లను కూడా పరిగణలోకి తీసుకుని ర్యాంకులు నిర్ణయించామని తెలిపింది. మొత్తం ప్రపంచవ్యాప్తంగా 1200 యూనివర్శిటీలను అధ్యయనం చేసి ప్రతి ఏట 500 టాప్ యూనివర్శిటీల ర్యాంకులను నిర్ణయిస్తామని, ఈసారి కూడా అలాగే చేశామని చైనా యూనివర్శిటీ వివరించింది. ర్యాంకింగ్‌ల కోసం అధ్యయనం నిర్వహించిన చైనా జియాటాంగ్ యూనివర్శిటీకి 118వ స్థానం లభించింది. గత ఏడాదికన్నా నాలుగు స్థానాలు ముందుకు జరిగింది. -
బ్రెస్ట్ క్యాన్సర్ ను ముందే గుర్తించవచ్చు
న్యూయార్క్: ప్రపంచంలో క్యాన్సర్ర్ తో ఏటా చనిపోతున్న స్త్రీలలో ఎక్కువ కనిపించే బ్రెస్ట్ క్యాన్సర్ ను గుర్తించే మాలిక్యులర్ మార్కర్ ను పరిశోధకులు కనుగొన్నారు. సాధారణంగా స్త్రీలలో ఉండే పునరుత్పాదక కణాలను గుర్తించడం ద్వారా క్యాన్సర్ రాకను ముందే గుర్తించే అవకాశం ఉంటుందని తెలిపారు. 302 మంది మహిళల బయాప్సీలను చేసిన పరిశోధనల ఫలితాల్లో 'కి 67' లెవల్స్ ఎక్కువగా ఉన్న మహిళలకు క్యాన్సర్ ముప్పు ఐదు రెట్లు ఎక్కువగా ఉంటుందని తేలింది. వీరిలో 63 మందికి క్యాన్సర్ వచ్చినట్లు తర్వాతి పరిశోధనలతో తెలిసింది. 'కి67' కణాలు 'కి 67' మమ్మరీ ఎపీథెలియమ్ కణాలని అంటారు. స్త్రీ జీవితంలోని వివిధ దశల్లో ఈ కణాలు భిన్న మార్పులు చెందడం వల్ల ఈ కణాల్లో కాన్సర్ కణుతులు తయారవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుందని తెలిపారు. 'మీకు బ్రెస్ట్ క్యాన్సర్ లేదని మహిళలకు ఊరికే చెప్పేబదులు బయాప్సీ చేయించడం వల్ల భవిష్యత్ అవకాశాలను పూర్తిగా తెలుసుకోవచ్చు' హార్వాడ్ యూనివర్సిటీ పరిశోధకుల్లో ఒకరైన కొర్నెలియా పొల్యాక్ అన్నారు. క్యాన్సర్ చివరి స్టేజ్ లో ఉన్న మహిళలను ముందే గుర్తించడం వల్ల ప్రత్యేకమైన మార్గాలను అనుసరించి రిస్క్ ను తగ్గించవచ్చని హార్వాడ్ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ రుల్లా తమిమి తెలిపారు. కి67 లెవల్స్ ను గుర్తించే క్రమంలో సాధారణంగా ఉపయోగించే పరికరాల కంటే మాలిక్యులర్ బేస్డ్ టెస్టింగ్ లో రేడియేషన్ తక్కువగా ఉంటుందని వివరించారు. బ్రెస్ట్ క్యాన్సర్ కు సంబంధించిన ఈ వివరాలను ఆన్ లైన్ జర్నల్ క్యాన్సర్ రిసెర్చ్ లో ప్రచురించారు.