
బిగ్ బాస్ సీజన్ 9లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చిన తర్వాత షో పరుగులు పెడుతుంది. ఈ వారం హౌస్ నుంచి ఎవరూ ఊహించని వ్యక్తి వెళ్లిపోనున్నారు. ఇప్పటికే గతవారంలో ప్రేక్షకుల ఓటింగ్‌తో ప్రమేయం లేకుండానే షాకింగ్ ఎలిమినేషన్‌తో శ్రీజ దమ్ము బయటకు వచ్చేసింది. ఈ వారం నామినేషన్ లిస్ట్‌లో ఉన్న భరణి, దివ్య, తనూజ, పవన్, రాము, సుమన్‌లలో టాప్ కంటెస్టెంట్ ఎలిమినేట్ కానున్నారు. అందరూ దివ్య, రాములలో ఎవరైనా ఒకరు ఎలిమినేట్ అవుతారని అనుకున్నారు. కానీ, బిగ్‌బాస్ అతిపెద్ద సర్‌ప్రైజ్ ఇచ్చేశాడు. ఒక టాప్ కంటెస్టెంట్‌ను హౌస్ నుంచి పంపించేశాడు.
ఈ వారం భరణి ఎలిమినేట్ అయిపోయారు. అధికారికంగా ప్రకటన రాకపోయినప్పటికీ ఈ అదివారం బిగ్‌బాస్ నుంచి బయటకు రానున్నారు. కేవలం ఎక్కువ బాండిగ్స్ పెట్టుకోవడం వల్లే భరణి ఎలిమినేట్ అయ్యారని తెలుస్తోంది. ఆపై ఈ వారంలో సంజన మీద ఆయన ఫైర్ తీరు ప్రేక్షకులకు నచ్చలేదు. ఆపై అతని గేమ్ స్ట్రాటజీని కూడా సరిగ్గా అంచనా వేయలేకపోయారు. టాప్‌లో తనే ఉన్నాననే భ్రమలో భరణి ఉండటంతో గేమ్‌పై పట్టు కోల్పోయారు.
ముఖ్యంగా దివ్య వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన సమయంలో భరణిని టాప్ 2లో ఉన్నారని చెప్పింది. ఆపై అతనితోనే దివ్య ఉండటంతో నమ్మేశాడు. దీంతో ఆయనలో ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది. ఏకంగా తనను నామినేట్ చేసిన వారందరూ హౌస్ నుంచి వెళ్లిపోయారని కూడా కామెంట్ చేశారు. అంతలా తనపై తాను అతి నమ్మకం పెట్టుకున్నారు. ఓవర్ కాన్ఫిడెన్స్‌లో ఉన్న భరణి ఆట చూసి ఇంట్లోకి వెళ్లిన దివ్య కూడా సలహాలు ఇవ్వలేదు. దీంతో ఆయన ఆట పతనానికి దారి తీసింది. కేవలం తన స్వయం కృతాపరాధం వల్లే భరణ ఎలిమినేట్ అయ్యారని చెప్పవచ్చు. అయితే, ఎలాంటి నెగటివిటి లేకుండా బిగ్‌బాస్ నుంచి వచ్చేశారు.