బాలీవుడ్ నటుడు మనోజ్ భాజ్పాయ్ కీలక పాత్రలో వచ్చిన సక్సెస్ఫుల్ వెబ్ సిరీస్ ఫ్యామిలీ మ్యాన్. ఇప్పటికే వచ్చిన రెండు సీజన్స్ సూపర్ హిట్‌గా నిలిచాయి. దీంతో తాజాగా మూడో సీజన్ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్-3 అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది.
తాజాగా ఈ సిరీస్ క్రేజీ రికార్డ్‌ను సొంతం చేసుకుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో అత్యధికమంది వీక్షించిన వెబ్‌సిరీస్‌గా నిలిచింది. ఈ క్రమంలో గత రెండు సీజన్ల వ్యూస్‌ను అధిగమించింది. అంతే కాకుండా భారత్ సహా 35 దేశాల్లో టాప్-5లో ట్రెండింగ్‌లో ఉంది. యూకే, కెనడా, ఆస్ట్రేలియా, యూఏఈ, సింగపూర్, మలేషియా దేశాల్లోనూ ఆదరణ దక్కించుకుంది.
రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో రూపొందించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ నవంబర్ 21 నుంచి ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. హిందీతో పాటు దక్షిణాది భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ వెబ్ సిరీస్లో జైదీప్ అహ్లావత్, ప్రియమణి కీలక పాత్రల్లో నటించారు.


