ఫ్యామిలీ మ్యాన్-3.. ఒక్కొక్కరి రెమ్యునరేషన్ ఎన్ని కోట్లో తెలుసా?
ఓటీటీ వెబ్ సిరీస్‌లతో ‘ఫ్యామిలీ మ్యాన్’ క్రియేట్ చేసిన రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దర్శకద్వయం రాజ్-డీకే తీసిన ఈ సిరీస్ తొలి భాగం 2019లో రిలీజై..బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఇండియన్ వెబ్ సిరీస్ చరిత్రలో అత్యంత ఆదరణ పొందిన సిరీస్‌గా రికార్డుకెక్కింది. 2021లో రెండో సీజన్ రాగా..అది కూడా సూపర్ హిట్ అయింది. ఇక ఇప్పుడు మూడో సీజన్(The Family Man 3 ) కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. (చదవండి: ‘ద ఫ్యామిలీ మ్యాన్ 3’ రివ్యూ)ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్‌లో పాకిస్థాన్-మయన్మార్‌తో కలిసి భారత్‌పై చైనా చేస్తున్న కుట్రలు, భారత్ -మయన్మార్ సరిహద్దుల్లోని ఉద్రిక్త పరిస్థితులను చూపించారు. సీజన్ 3 ఇంకెన్ని రికార్డులను బద్దలు కొడుతుందో చూడాలి.ఇదిలా ఉంటే.. ఈ సిరీస్ రిలీజ్ తర్వాత మనోజ్ బాజ్‌పేయి తో పాటు ప్రధాన పాత్రల్లో నటించిన వారి పారితోషికంపై నెట్టింట్లో చర్చ మొదలైంది. ఎవరెంత పుచ్చుకున్నరనేదానిపై రకరకాల పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. బాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం.. సీజన్ 3కి గాను శ్రీకాంత్ తివారి పాత్ర పోషించిన మనోజ్ బాజ్‌పేయి రూ. 20-22కోట్ల మేరకు పారితోషికం పుచ్చుకున్నారట. ఇక ఈ సిరీస్‌లో విలన్ పాత్ర చేసిన జైదీప్ అహ్లావత్ రూ.9 కోట్లు తీసుకున్నాడట. మనోజ్ బాజ్‌పేయికి జోడీగా నటించిన ప్రియమణి ఈ సీజన్‌కి రూ. 7 కోట్ల వరకు అదించినట్లు సమాచారం.మీరా పాత్ర పోషించిన నిమ్రత్ కౌర్ కూడా రూ. 8-9 కోట్ల వరకు తీసుకున్నారట. నిడివి తక్కువే అయినప్పటికీ దర్శన్ కుమార్ కూడా దాదాపు 8 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారు. కీలక పాత్రలో నటించిన సీనియర్ నటి సీమా బిస్వాస్, విపిన్ శర్మ రూ. 1-2 కోట్ల వరకు పారితోషికంగా పుచ్చుకున్నట్లు తెలుస్తోంది. మొత్తం రెమ్యునరేషన్లకు దాదాపు రూ. 100 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.