హీరోయిన్ సమంత రీసెంట్‌గానే మరో పెళ్లి చేసుకుంది. 'ద ఫ్యామిలీ మ్యాన్' సిరీస్ దర్శకుల్లో ఒకరైన రాజ్ నిడిమోరుతో కొత్త జీవితం ప్రారంభించింది. కోయంబత్తూరులోని ఈశా ఫౌండేషన్‌లో లింగభైరవి సన్నిధిలో చాలా సింపుల్‌గా ఈ వివాహ వేడుక జరిగింది. అయితే పెళ్లికి ముందే సమంతకు రాజ్ ఓ ఖరీదైన గిఫ్ట్ ఇచ్చాడని అంటున్నారు. ఇంతకీ ఏంటి విషయం?
దర్శకుడు రాజ్‌తో సమంతకు గత నాలుగైదేళ్లుగా పరిచయం. 'ఫ్యామిలీ మ్యాన్' సిరీస్ రెండో సీజన్ చేసే టైంలో ఏర్పడిన పరిచయం కాస్త తర్వాత ప్రేమగా మారింది. ఇన్నాళ్లకు పెళ్లితో ఒక్కటయ్యారు. అయితే ఇద్దరికీ ఇది రెండో పెళ్లినే. నాగచైతన్యకు సమంత విడాకులు ఇవ్వగా.. రాజ్ కూడా తన తొలి భార్య శ్యామోలికి 2022లో విడాకులు ఇచ్చేశారు.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి పోలీస్ థ్రిల్లర్.. ట్రైలర్ రిలీజ్)
ప్రస్తుతం రాజ్.. దర్శకుడు, నిర్మాతగా ఉన్నారు. సమంత కూడా ప్రస్తుతం తన నిర్మాణ సంస్థలోనే 'మా ఇంటి బంగారం' అనే మూవీ చేస్తోంది. ఈ సంస్థలోనే సమంతతో పాటు రాజ్ కూడా భాగస్వామిగా ఉన్నాడు. కొన్ని రోజుల క్రితమే ఈ చిత్ర షూటింగ్ మొదలైంది. అయితే అక్టోబరులో సమంత.. కొన్ని ఫొటోలని పోస్ట్ చేసింది. వాటిలో కొత్త ఇంటికి సంబంధించిన ఫొటోలు కూడా కొన్ని ఉన్నాయి. ఈ లగ్జరీ హౌస్‌ని రాజ్.. సమంతకు పెళ్లి గిఫ్ట్‌గా ముందే ఇచ్చాడని అంటున్నారు. పెళ్లిరోజు సామ్ వేలికి ఉన్న రింగ్ కూడా రాజ్ బహుమతిగా ఇచ్చాడని అంటున్నారు. దీని విలువ కూడా లక్షల్లోనే ఉంటుందట.
ప్రస్తుతం సమంత-రాజ్.. గోవాకు హనీమూన్‌కి వెళ్లారని, తిరిగి వచ్చిన తర్వాత ఎవరి ప్రాజెక్ట్‌లతో వారు బిజీ కానున్నారని తెలుస్తోంది. రాజ్ కూడా 'ద ఫ్యామిలీ మ్యాన్' నాలుగో సీజన్ తీయాల్సి ఉంది.
(ఇదీ చదవండి: రోజుకు 500 కాల్స్.. తలనొప్పిపడలేక వీడియో చేశా: హేమ)


