
సాక్షి, తిరుమల: తిరుమలలో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా తిరుమల రెండో ఘాట్ రోడ్డులో కొండ చరియలు విరిగి పడ్డాయి. బండ రాళ్లు రోడ్డుపై పడటంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. టీటీడీ ఇంజనీరింగ్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
వివరాల ప్రకారం.. తిరుమలలో గత నాలుగు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా రెండో ఘాట్ రోడ్డులో తొమ్మిదో కిలోమీటర్ వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. భారీ బండరాళ్లు రోడ్డు మీద పడిపోవడంతో వాహనాలు వెళ్లడానికి తీవ్ర ఇబ్బంది కలిగింది. దీంతో, ఘటనా స్థలానికి చేరుకున్న టీటీడీ ఇంజనీరింగ్ అధికారులు విరిగిపడిన కొండ చరియలను తొలగిస్తున్నారు. ఘాట్ రోడ్‌లో ట్రాఫిక్‌కి అంతరాయం లేకుండా జేసీబీలతో బండరాలను తొలగిస్తున్నారు.