గిగ్ వర్కర్‌గా పనిచేస్తున్న ఒక ఉద్యోగి ఎవరైనా మెరుగైన ఉద్యోగం కావాలని కోరుకుంటాడు. నెలకు లక్షల్లో ఆదాయం వచ్చే కార్పొరేట్ ఉద్యోగం వస్తే ఎగిరి గంతేస్తాడు కదా. కానీ ఏడాదికి 25 లక్షల రూపాయల వేతనం ఇచ్చే ఉద్యగాన్ని వదిలిపెట్టేశాడు. విచిత్రంగా ఫుడ్ డెలివరీ రైడర్‌గా పని చేయడానికి నిర్ణయించుకున్నాడు. అయితే సాహసోపేత నిర్ణయం వెనుక ఉన్న లక్ష్యం ఆసక్తిని రేకెత్తిస్తోంది. అదేమిటీ అంటే..
బెంగళూరులో ఒక వ్యక్తి తన సంవత్సరానికి రూ.25 లక్షల కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలేసి, సొంతంగా వ్యాపారం మొదలు పెట్టాలనే కల సాకారం కోసం ఫుడ్ డెలివరీ బాయ్ అవతార మెత్తాడు. ఎంజి వి (@original_ngv) అనే ఎక్స్ యూజర్ పోస్ట్‌తో ఈ వైనం వెలుగులోకి వచ్చింది. ఆయన కథనం ప్రకారం తన స్నేహితుడి ఆకస్మిక కెరీర్ మార్పు వ్యూహం అతని కుటుంబాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. త్వరలో పెళ్లి చేసుకోబోతుండటం, కొత్తగా కారు కొనడంతో వారంతా ఆందోళన వ్యక్తం చేశారు. కుటుంబం, స్నేహితుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. కొందరు స్నేహితులు అతణ్ని ఎగతాళి చేశారు. డెలివరీ బాయ్‌గా అనేక అవమానాలను కూడా ఎదుర్కొన్నాడు. అయినా వెనక్కి తగ్గలే. కుటుంబం, సన్నిహితుల నుంచి వ్యతిరేకత ఉన్నప్పటికీ, తన కలను కొనసాగించాలని నిశ్చయించుకున్నాడు
A friend of mine left his 25 lpa+ job to become a Swiggy / Rapido driver. And no I'm not joking.
His parents called me asking me to talk sense into him, crying literally. He was going to get married next year. And just bought a car.
I spoke with him, and the reason shocked me.…— enji vi (@original_ngv) December 3, 2025
సొంత క్లౌడ్‌కిచెన్‌ను ప్రారంభించాలని యోచిస్తున్నాడు. కస్టమర్ ప్రాధాన్యతలను స్వయంగా అర్థం చేసుకోవాలనేది అతని ప్లాన్. విశ్వవిద్యాలయం పక్కనే ఉన్న ప్రాంతంలో ఏ మెనూ ఐటెమ్స్‌కు డిమాండ్ ఉంది. అత్యంత ప్రాచుర్యం పొందిన ఆహారం ఏంటి? ఏ ధరలకు, , ఏ ప్రదేశాలు అధిక-వాల్యూమ్ ప్రాంతాలు అనే దాని గురించి తెలుసుకోవాలనుకున్నాడు.
చదవండి: అందంగా ఉన్నారని నలుగుర్ని..చివరికి కన్నకొడుకుని కూడా
ఏం సాధించాడు
తను అనుకున్నది సాధించడంకోసం మార్కెట్‌ను బాగా పరిశీలించాడు. తన అనుభవం ద్వారా, తక్కువ ధరకే కానీ అధిక పరిమాణంలో విక్రయించగల 12 సంభావ్య స్టాక్ కీపింగ్ యూనిట్లను (SKUలు) అతను గుర్తించాడు, వీటిని అతను తన క్లౌడ్ కిచెన్‌లో ప్రదర్శించాలని యోచిస్తున్నాడు.ఈ మోడల్‌తో 3-4 నెలల్లోనే లాభాలు సాధించగలనని అతను ధీమాగా ఉన్నాడు. డెలివరీ బాయ్ అనేచులకన భావంతో, వాచ్‌మెన్ కూడా తనపై ఎలా అరుస్తారో స్నేహితుడు కథలు కథలుగా చెబుతాడని, అయినా కానీ, వ్యాపారంలో విజయం సాధించాలని పట్టుదలగా ఉన్నాడని తన పోస్ట్‌లో చెప్పుకొచ్చాడు. అతనికి తన సపోర్ట్ వంత శాతం ఉంటుందని, అంతా మంచే జరుగుతందని ఆశిస్తున్నానని తన ట్వీట్‌లో పేర్కొన్నాడు. దీంతో ఆల్ ది బెస్ట్ బ్రో అంటున్నారు నెటిజన్లు.
ఇదీ చదవండి: నా వల్ల కాదు బ్రో..ఎన్ని కష్టాలున్నా ఇల్లు ఇల్లే, వచ్చేస్తున్నా!


