బెంగళూరు: బెంగళూరులో గుంతలమయమైన రోడ్లు మరోసారి వార్తల్లో నిలిచాయి. బెంగళూరులో పని చేస్తున్న ఉత్తర భారతదేశానికి చెందిన సౌరభ్ పాండే బైక్‌పై వెళ్తూ పెద్ద గుంత కారణంగా కిందపడి తీవ్ర గాయాల పాలయ్యాడు. ఆస్పత్రిలో బెడ్‌పై ఉండగా అతని స్నేహితురాలు సెల్ఫీ వీడియో తీసి బెంగళూరు రోడ్లపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ‘నా స్నేహితుడు ఈరోజు గాయాలతో ఆస్పత్రిలో ఉండడానికి కారణం బెంగళూరులో అధ్వానంగా ఉన్న రోడ్లే. తృటిలో ప్రాణాపాయం తప్పింది’ తెలిపింది. బెంగళూరులో ద్విచక్ర వాహనాలను నిషేధించండి అంటూ క్యాప్షన్ పెట్టి ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసింది.


