మహారాష్ట్రలో పేలుడు.. 15 మంది మృతి | Nagpur SBL Energy Limited Explosion, 15 Dead And Multiple Injured In Maharashtra Blast | Sakshi
Sakshi News home page

మహారాష్ట్రలో పేలుడు.. 15 మంది మృతి

Mar 1 2026 11:01 AM | Updated on Mar 1 2026 11:58 AM

Blast at explosives factory Maharashtra Nagpur

ముంబై: మహారాష్ట్రలో భారీ పేలుడు ఘటన చోటుచేసుకుంది. నాగపూర్‌లోని పేలుడు పదార్థాల తయారీ పరిశ్రమ ఎస్‌బీఎల్‌ (SBL) ఎనర్జీ లిమిటెడ్‌లో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదం కారణంగా దాదాపు 15 మంది చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడినట్టు సమాచారం.

ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నాగపూర్‌లోని కటోల్‌లో ఎస్‌బీఎల్‌ (SBL) ఎనర్జీ లిమిటెడ్‌లో ఆదివారం తెల్లవారుజామున పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 15 మంది మృతిచెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ మేరకు స్థానిక అధికారులు వెల్లడించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీయడానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి తెలిపారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు.

అయితే, ప్రమాదం జరిగిన పరిశ్రమలో డిటోనేటర్లు, కాస్ట్ బూస్టర్లు, భూకంప పేలుడు పదార్థాలు తయారు చేస్తారని స్థానికులు వెల్లడించారు. ఉదయం ఇందులోని ఒక యూనిట్‌లో అకస్మాత్తుగా పేలుడు సంభవించిందని, ఆ సమయంలో, 30 మందికి పైగా ఉద్యోగులు వివిధ యూనిట్లలో పనిచేస్తున్నారని తెలిపారు. దీంతో, మరణాల సంఖ్యలో పెరిగే అవకాశం ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement