నాగ్‌పుర్‌లో భారీ పేలుడు.. 15 మంది మృతి | Nagpur Blast, SBL Explosives Factory Explosion Kills 15 And Many Injured In Maharashtra | Sakshi
Sakshi News home page

నాగ్‌పుర్‌లో భారీ పేలుడు.. 15 మంది మృతి

Mar 1 2026 11:07 AM | Updated on Mar 1 2026 11:52 AM

Nagpur Explosion: Deadly Blast At Explosives Unit Claims

నాగ్‌పుర్‌: మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌లో భారీ పేలుడు సంభవించింది. కటోల్‌లోని పేలుడు పదార్థాల తయారీ పరిశ్రమ ఎస్‌బీఎల్‌ (SBL) కంపెనీలో ఇవాళ(ఆదివారం) తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో 15 మంది మృతిచెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను నాగ్‌పూర్‌లోని ఆరెంజ్ సిటీ ఆసుపత్రికి తరలించారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీయడానికి సహాయక చర్యలు జరుగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాముందని అధికారులు భావిస్తున్నారు.

ఈ పరిశ్రమలో డిటోనేటర్లతో పాటు భూకంప పేలుడు పదార్థాలు తయారు చేస్తారని స్థానికులు తెలిపారు. పేలుడు సంభవించిన సమయంలో, 30 మందికి పైగా పరిశ్రమలో పని చేస్తున్నారని తెలిపారు. ఈ పేలుడు ధాటికి చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.  సమాచారం అందిన వెంటనే జిల్లా అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ బృందాలు మంటలను అదుపు చేస్తున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement