హైదరాబాద్: బేగంపేటలోని ఓ ఏవియేషన్ సంస్థలో విమాన పైలట్‌గా పనిచేస్తున్న యువతిపై అదే సంస్థలో పైలట్ అయిన 60 ఏళ్ల వయసున్న వ్యక్తి బెంగుళూరులో లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన బేగంపేట పోలీసులు బెంగుళూరు హలసూరు పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేశారు. ఇన్‌స్పెక్టర్ సైదులు తెలిపిన మేరకు బేగంపేటలో ఓ ఏవియేషన్ సంస్థలో యువతి (26)తో పాటు రోహిత్ శరణ్ (60) అనే వ్యక్తి కమర్షియల్ పైలట్లుగా పనిచేస్తున్నారు.
ఇటీవల సంస్థకు చెందిన పని నిమిత్తం యువతితో పాటు రోహిత్‌శరణ్ బెంగుళూరుకు వెళ్లారు. అక్కడి హోటల్ గదిలో యువతితో అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో అతన్ని ప్రతిఘటించిన యువతి అక్కడి నుంచి పారిపోయి నగరానికి చేరుకుంది. రోహిత్‌శరణ్ తనతో వ్యవహరించిన తీరు పట్ల బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు రోహిత్ శరణ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు కేసును బెంగళూరుకు బదిలీ చేశారు.


