బాలీవుడ్‌ టు కార్పొరెట్‌ వరల్డ్‌ | Mayuri Kango left the film industry and embarked on corporate career | Sakshi
Sakshi News home page

బాలీవుడ్‌ టు కార్పొరెట్‌ వరల్డ్‌

Nov 20 2025 10:24 AM | Updated on Nov 20 2025 11:29 AM

Mayuri Kango left the film industry and embarked on corporate career

బాలీవుడ్‌లో ఒక వెలుగు వెలుగుతున్న కాలంలోనే కార్పొరెట్‌ వరల్డ్‌లోకి అడుగుపెట్టిన మయూరి కాంగో ఒక్కో మెట్టు ఎక్కుతూ కార్పొరెట్‌ ప్రపంచంలో గెలుపు జెండా ఎగరేసింది. ఐఐటీ, కాన్పూర్‌ స్టూడెంట్‌ అయిన మయూరి సినిమాల మీద పాషన్‌తో బాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. పాప కెహ్తే హై, హోగీ ప్యార్‌ కీ జీత్‌లాంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఎంబీఏ పూర్తిచేసిన తరువాత కార్పొరెట్‌ జర్నీ ప్రారంభించింది. 

అమెరికన్‌ డిజిటల్‌ ఏజెన్సీ ‘360ఐ’లో అసోసియెట్‌ మీడియా మెనేజర్‌గా చేరింది. ఆ తరువాత న్యూయార్క్‌లోని అడ్వర్‌టైజింగ్‌ సంస్థ ‘రిజల్యూషన్‌ మీడియా’లో చేరింది. కొద్దికాలం తరువాత బోస్టన్‌లోని ‘డిజిటాస్‌’లో అసోసియేట్‌ డైరెక్టర్‌(మీడియా), ఆ తరువాత పెర్‌ఫార్మమెన్స్‌ మార్కెటింగ్‌ ఏజెన్సీ ‘పెర్‌ఫార్మిక్స్‌’లో చేరిన మయూరి 2019లో గూగుల్‌లో చేరింది. ప్రస్తుతం ‘పబ్లిసిస్‌ గ్లోబల్‌ డెలివరీ’ కంపెనీ’ సీయీవోగా బాధ్యతలు నిర్వహిస్తోంది.

(చదవండి: జరగబోయేవన్నీ చెప్పగలనంటాడు!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement