బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్ ఇంట గత నెలలో శుభకార్యం జరిగింది. కార్తీక్ చెల్లెలు కృతిక తివారీ వివాహం జరిగింది. పైలట్ తేజస్వి కుమార్ సింగ్‌తో ఆమె ఏడడుగులు వేసింది. తాజాగా ఈ పెళ్లి విశేషాలను కార్తీక్ పంచుకున్నాడు. కార్తీక్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం తూ మేరీ మైన్.. తేరా మైన్ తేరీ తు మేరీ. అనన్య పాండే హీరోయిన్‌గా యాక్ట్ చేసింది.
పెళ్లిలో ఫ్రీగా డ్యాన్స్
ఈ సినిమా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా కార్తీక్, అనన్య పాండే 'ద గ్రేట్ ఇండియన్ కపిల్ షో'కి హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్తీక్ మాట్లాడుతూ.. గత నెలలో చెల్లి పెళ్లి జరిగింది. పనులన్నీ అమ్మ, చెల్లియే చూసుకున్నారు. నా ఇంట్లో శుభకార్యానికి నేనే అతిథిగా వెళ్లాను. పెళ్లిలో ఉచితంగా డ్యాన్స్ చేశాను. నా సోదరి నాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు అని సరదాగా చెప్పుకొచ్చాడు.
సినిమా
కార్తీక్ ఆర్యన్ విషయానికి వస్తే.. ప్యార్ కా పంచనామా, లూకా చుప్పీ, పతీ పత్నీ ఔర్ ఓ, భూల్ భులయ్యా 2, భూల్ భులయ్యా 3, షెహజాదా(అల వైకుంఠపురములో హిందీ రీమేక్), లూకా చుప్పి, ధమాకా.. ఇలా అనేక సినిమాలతో టాప్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఇటీవల కార్తీక్ 'తూ మేరీ మైన్.. తేరా మైన్ తేరా తు మేరీ' మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే బాక్సాఫీస్ వద్ద ధురంధర్ హవా కారణంగా ఈ సినిమా నిలదొక్కుకోలేకపోయింది.


