కీర్తి సురేశ్ సౌత్ ఇండియాలో టాప్ హీరోయిన్‌గా రాణిస్తోంది. ఆమె అక్క రేవతి థాంక్యూ అనే షార్ట్ ఫిలింకి డైరెక్టర్‌గా వ్యవహరించింది. తను భరతనాట్యంలో శిక్షణ తీసుకుంది. అలాగే ఫిలిం కోర్సు కూడా పూర్తి చేసింది. తాజాగా ఆమె వాయిద్య కళాకారిణిగా మారింది. ఈ విషయాన్ని ఆమె తల్లి, నటి మేనక సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.
తొలిసారి..
అట్టుకల్ దేవి అమ్మవారి గుడిలో నా కూతురు రేవతి తొలిసారి డోలు వాయించింది అంటూ వీడియో షేర్ చేసింది. అందులో రేవతి తెల్ల చీర కట్టుకుని, నెత్తిన పూలు పెట్టుకుని డోలును ఓ భుజానికి తగిలించుకుని తన గ్రూపుతో కలిసి వాయిస్తోంది. గతంలో రేవతిని నాట్యకళాకారిణిగా, దర్శకురాలిగా చూసిన అభిమానులు.. ఇప్పుడిలా డోలు వాయించడం చూసి తనలో ఈ టాలెంట్ కూడా ఉందా? అని ఆశ్చర్యపోతున్నారు.
సినిమా
కాగా రేవతి.. దర్శకుడు ప్రియదర్శన్ దగ్గర కొన్నేళ్లపాటు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసింది. మరక్కర్, వాశి, బరోజ్ సినిమాల నిర్మాణంలోనూ పాలు పంచుకుంది. కీర్తి సురేశ్ తెరపై హీరోయిన్‌గా కనిపిస్తే, ఆమె అక్క మాత్రం తెర వెనుకే ఎక్కువ భాగమయ్యేది. వీరి తల్లి మేనక మలయాళ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో హీరోయిన్‌గా అనేక సినిమాలు చేసింది. తండ్రి సురేశ్ కుమార్ నిర్మాతగా రాణించాడు.


