చరణ్‌తో సినిమా.. ‘మన శంకర వరప్రసాద్’ పునాది | Anil Ravipudi Comments On Movie With Ram Charan | Sakshi
Sakshi News home page

చరణ్‌తో సినిమా.. ‘మన శంకర వరప్రసాద్’ పునాది

Jan 4 2026 10:51 PM | Updated on Jan 5 2026 8:29 AM

Anil Ravipudi Comments On Movie With Ram Charan

మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తోన్న లేటేస్ట్‌ ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌ మనశంకర వరప్రసాద్ గారు. తొలిసారి అనిల్ రావిపూడి- చిరు కాంబోలో వస్తోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ఏడాది సంక్రాంతి పోటీలో నిలిచిన ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రిలీజ్‌కు కొద్ది  రోజుల సమయం మాత్రమే ఉండడంతో మేకర్స్ ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీ అయిపోయారు.

ఈ నేపథ్యంలో దర్శకుడు అనీల్ రావిపూడి తన తదుపరి లక్ష్యాన్ని స్పష్టంగా బయటపెట్టాడు. రామ్ చరణ్‌తో సినిమా చేయాలనే కోరికను ఆయన తాజాగా వెల్లడించారు. మన శంకర వరప్రసాద్ గారు ట్రైలర్‌ లాంచ్ కార్యక్రమంలో అనీల్ రావిపూడి మాట్లాడుతూ.. చిరంజీవి సినిమా పెద్ద హిట్ కావాలని కోరారు. ఆ సినిమా విజయం సాధిస్తే ఆటోమేటిగ్గా రామ్ చరణ్‌తో సినిమా చేసే అవకాశం వస్తుందని ప్రకటించారు. అదే వేదికపై శంకర వరప్రసాద్ పాట స్టెప్‌ను రావిపూడి రీ క్రియేట్ చేశారు. ట్రయిలర్‌ను మొదటగా రామ్ చరణ్‌కే చూపించిన విషయాన్ని బయటపెట్టారు. మా యూనిట్ కాకుండా ట్రయిలర్ చూసిన తొలి వ్యక్తి రామ్ చరణ్. చిరంజీవి గారి ఇంట్లో చరణ్‌కు చూపించాం. చూసి అద్భుతంగా ఉందన్నారని ఆయన తెలిపారు.  

రామ్ చరణ్‌తో సినిమా చేయాలంటే అది పాన్ ఇండియా స్థాయిలో ఉండాలని అనీల్ స్పష్టం చేశారు. ఇప్పటివరకు ఆయన పాన్ ఇండియా స్థాయిలో ఒక్క సినిమా కూడా చేయకపోయినా హీరో, కథ అన్నీ సెట్ అయితే ఆటోమేటిగ్గా పాన్ ఇండియా అప్పీల్ వస్తుందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన అన్నారు. తన నుంచి రాబోయే రోజుల్లో కచ్చితంగా పెద్ద స్పాన్ ఉన్న పాన్ ఇండియా సినిమా వస్తుంది. ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టు అనీల్ రావిపూడి వెల్లడించారు. రామ్ చరణ్‌తో సినిమా ఓకే చేసుకోవడం ద్వారా తనపై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టడంతో పాటు, పాన్ ఇండియా డైరెక్టర్ హోదాను అందుకోవాలని ఆయన ప్రయత్నిస్తున్నారని సినీ విశ్లేషకులు అంటున్నారు.  మొత్తానికి రామ్ చరణ్‌తో అనీల్ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకుంటే తెలుగు సినీ పరిశ్రమలో మరో భారీ ప్రాజెక్ట్‌కు నాంది పలికినట్టే.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement