breaking news
menaka daughter
-
కీర్తి సురేశ్ అక్కలో ఈ టాలెంట్ కూడా ఉందా?
కీర్తి సురేశ్ సౌత్ ఇండియాలో టాప్ హీరోయిన్గా రాణిస్తోంది. ఆమె అక్క రేవతి థాంక్యూ అనే షార్ట్ ఫిలింకి డైరెక్టర్‌గా వ్యవహరించింది. తను భరతనాట్యంలో శిక్షణ తీసుకుంది. అలాగే ఫిలిం కోర్సు కూడా పూర్తి చేసింది. తాజాగా ఆమె వాయిద్య కళాకారిణిగా మారింది. ఈ విషయాన్ని ఆమె తల్లి, నటి మేనక సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.తొలిసారి..అట్టుకల్ దేవి అమ్మవారి గుడిలో నా కూతురు రేవతి తొలిసారి డోలు వాయించింది అంటూ వీడియో షేర్ చేసింది. అందులో రేవతి తెల్ల చీర కట్టుకుని, నెత్తిన పూలు పెట్టుకుని డోలును ఓ భుజానికి తగిలించుకుని తన గ్రూపుతో కలిసి వాయిస్తోంది. గతంలో రేవతిని నాట్యకళాకారిణిగా, దర్శకురాలిగా చూసిన అభిమానులు.. ఇప్పుడిలా డోలు వాయించడం చూసి తనలో ఈ టాలెంట్ కూడా ఉందా? అని ఆశ్చర్యపోతున్నారు.సినిమాకాగా రేవతి.. దర్శకుడు ప్రియదర్శన్ దగ్గర కొన్నేళ్లపాటు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసింది. మరక్కర్, వాశి, బరోజ్ సినిమాల నిర్మాణంలోనూ పాలు పంచుకుంది. కీర్తి సురేశ్ తెరపై హీరోయిన్గా కనిపిస్తే, ఆమె అక్క మాత్రం తెర వెనుకే ఎక్కువ భాగమయ్యేది. వీరి తల్లి మేనక మలయాళ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో హీరోయిన్గా అనేక సినిమాలు చేసింది. తండ్రి సురేశ్ కుమార్ నిర్మాతగా రాణించాడు. View this post on Instagram A post shared by Menaka Suresh (@menaka.suresh) చదవండి: రామ్‌చరణ్‌తో అనిల్ రావిపూడి సినిమా -
నాకు నేనే పోటీ అంటున్న హీరోయిన్
హీరోయిన్లకు ఆత్మవిశ్వాసం చాలా ముఖ్యం. ఈ విషయంలో కొత్త హీరోయిన్ కీర్తిసురేష్ మిగిలిన వాళ్ల కంటే రెండాకులు ఎక్కువే చదివింది. తనను ఎవరితోనూ పోల్చడం తగదని, తనకు తానే పోటీ అని ఆమె చెబుతోంది. ఇదంతా ఇంకా ఒక్క తమిళ సినిమా కూడా విడుదల కాకముందే. ప్రతి ఒక్కరికీ ఏదో ఒక స్పెషాలిటీ ఉంటుందన్నది కీర్తి వాదన. ఇంతకుముందు సినిమా కంటే తాను బాగా చేశానా లేదా అన్న విషయం ఒక్కటే తాను ఆలోచించాలని ఆమె చెప్పింది. తమిళంలో ఆమె చేసిన మొట్టమొదటి సినిమా 'ఇదు ఎన్న మాయం' ఇంకా విడుదల కావాల్సి ఉంది. అయితే ఈలోపే ఆమె చేతిలో ఐదు సినిమాలున్నాయి. రాత్రికి రాత్రే తనకు ఇంత పాపులారిటీ ఎలా వచ్చిందో ఇప్పటికీ నమ్మలేకపోతున్నట్లు కీర్తి చెప్పింది. దాంతో తనకు ఒత్తిడి ఎక్కువగానే ఉంది గానీ, తన మొదటి సినిమా విడుదల కాకముందే చిత్ర పరిశ్రమ ఇంత సాదరంగా ఆహ్వానిస్తున్నందుకు సంతోషంగా ఉందని తెలిపింది. ఒకవైపు సంతోషంగాను, మరోవైపు భయంగా కూడా ఉందని ఆమె చెప్పింది. అలనాటి హీరోయిన్ మేనక, ప్రముఖ మళయాళ నిర్మాత సురేష్ కుమార్ల కూతురైన కీర్తి.. సినిమా పరిశ్రమలోకి రావడం మాత్రం అంత సులభం కాదనే చెబుతోంది. తన తల్లిదండ్రులు పరిశ్రమలో ఉండటంతో రావడం వచ్చినా.. ఇక్కడ నిలదొక్కుకోవడం చాలా కష్టమంటోంది. చిన్నతనంలోనే చైల్డ్ ఆర్టిస్టుగా ఆమె 'పైలట్స్' అనే సినిమాలో నటించింది. తర్వాత 2013లో ప్రియదర్శన్ దర్శకత్వంలో వచ్చిన మళయాళ హర్రర్ కామెడీ సినిమా 'గీతాంజలి'లో హీరోయిన్గా చేసింది. మళయాళంలో చేసిన రెండో సినిమా 'రింగ్ మాస్టర్'లో గుడ్డి అమ్మాయిగా చేసింది. దాంతో అప్పటివరకు సరదాగా, హాబీగానే చేసిన నటనను.. ఇక అప్పటినుంచి సీరియస్‌గా తీసుకున్నట్లు చెప్పింది. ప్రస్తుతం కీర్తిసురేష్ తెలుగులో 'అయినా నువ్వు ఇష్టం', 'హరికథ', తమిళంలో ధనుష్ సరసన ఇంకా పేరుపెట్టని ఓ సినిమాతో పాటు రజనీ మురుగన్, పాంభు సత్తై సినిమాల్లో చేస్తోంది.


