భార్య కేన్సర్‌ చికిత్సకు నిధులుగా..50 టన్నుల చిలగడ దుంపలు! | China Man Receives 50 Tonnes Of Sweet Potatoes for his wifes cancer treatment | Sakshi
Sakshi News home page

భార్య కేన్సర్‌ చికిత్సకు నిధులుగా..50 టన్నుల చిలగడ దుంపలు!

Jan 7 2026 11:23 AM | Updated on Jan 7 2026 11:51 AM

China Man Receives 50 Tonnes Of Sweet Potatoes  for his wifes cancer treatment

సాయం అంటే ఏదో మనకు తోచింది, చేతనైనది చేస్తాం. కానీ ఈ వ్యక్తి ఎంత గొప్పగా సాయం చేశాడంటే..ఆ సాయ ఫలితం తానొక్కడే అనుభవించకూడదు అనుకున్నాడో ఏమో..! గానీ అదర్నీ భాగమయ్యేలా చేసి గొప్ప సందేశం అందించాడు. అందరం తల ఓ చేయి వేస్తే ఎంత కష్టమైన పరార్‌ అనే గొప్ప విషయాన్ని గొంతెత్తి చెప్పినట్లుగా ఉంది నిశబ్దంగా చేసిన అతడి సహాయం. ఈ వింత ఘటన ఎక్కడ జరిగిందంటే..

ఇది చైనాలో చోటు చేసుకుంది. చైనాకు చెందిన జియా చాంగ్లాంగ్‌ అనే 35 ఏళ్ల వ్యక్తికి అందిన ఉదార సహాయం అందర్నీ ఆలోచింపచేసేలా ఉంది. సోషల్‌ మీడియాలో ఈ ఘటన అందరి హృదయాలను తాకింది. జియా భార్య లీకి జూలైలో అక్యూట్ మైలోయిడ్ లుకేమియా ఉన్నట్లు నిర్ధారణ అయింది. ప్రారంభ చికిత్స తదనంతరం ఇంట్లోనే ఆమె కోలుకుంటోంది. జియా ఇప్పటికే ఆమె చికిత్స కోసం దగ్గర దగ్గర రూ. 45 లక్షలు పైనే ఖర్చు చేశాడు. 

ఇప్పుడు ఆమెకు బోన్‌మ్యారో(ఎముక మజ్జ మార్పిడి) చేయాల్సి ఉంది. అయితే ఇందుకు సుమారు రూ. 51 లక్షలు పైనే ఖర్చు అవుతుందట. ఈ దంపతులిద్దరు సెకండరీ స్కూల్లో సహా విద్యారులు. ఆ తర్వాత పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ప్రస్తుతం వాళ్లు చైనాలోని పాన్‌డాంగ్‌ ప్రావిన్స్‌లోని యాంటాయ్‌లో నివశిస్తున్నారు. వారికి ఎనమిదేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. ఆ కుమారుడుని తామిద్దరం కలిసి అల్లారు ముద్దుగా పెంచుకోవాలని ఆశపడుతున్నారు. 

అందుకు విధి సహకరిస్తుందో లేదో అనే బెంగతో ఉన్నారా ఆ దంపతులు. తమకు వచ్చిన ఈ గండం గట్టేక్కేందుకు చేయవల్సిన ప్రయత్నాలన్ని చేశారు. తమ బంధువుల, స్నేహితులు, పొదుపు ద్వారా పోగు చేసిన సొమ్ము అంతా ఖర్చు అయిపోయింది. దాంతో చేసేది లేక తన భార్య ట్రీట్‌మెంట్‌ ఖర్చుల కోసం నిధులు సేకరించే పనిలో పడ్డాడు జియా. తన వద్ద ఉన్న ఒక్క కంప్యూటర్‌ని కూడా అమ్మేశాడు. ఇక అమ్మేందుకు ఏమి మిగలేదు జియా వద్ద. 

దాంతో ఇలా నిధులు ఆఫ్‌లైన్‌లో, సోషల్‌ మీడియా వేదికగా తనవంతు ప్రయత్నాలన్నీ చేస్తున్నాడు. ఇంతలో అనూహ్యంగా ఓ మిరాకిల్‌ జరిగింది. ఫాంగ్ అనే ఇంటిపేరు గల ఒక అజ్ఞాత దాత మెసేజింగ్ యాప్ ద్వారా జియాను సంప్రదించి, చిలగడదుంపలను అందివ్వడంతో అతని జీవితంలో ఒక అద్భుతం జరిగింది. ఆ అజ్ఞాత దాత జియాకి సుమారు 50 టన్నుల చిలగడ దుంపలు అందించి తన వంతు చేస్తున్న సాయం అని పోస్ట్‌ పెట్టాడు. 

నిజానికి ఫాంగ్‌ అని ఇంటిపేరున్న వ్యక్తి స్వయంగా చిలగడ దుంపలు పండిస్తాడట. అయితే జియా తన భార్య పట్ల ఎంతో భాధ్యతగా వ్యవహరించిన తీరు అతడిని కదిలించిందట. అందుకే ఇలా సాయం చేస్తున్నట్లు పోస్ట్‌లో పేర్కొన్నాడు. ఇప్పుడ జియా ఆ చిలగడదుపంలను 'కృతజ‍తా ఛారిటీ అమ్మకం' అనే లేబుల్‌ పెట్టి అమ్ముతుండటం విశేషం. దాని ద్వారా వచ్చిన సొమ్మును తన భార్య వైద్య ఖర్చుల కోసం వినియోగిస్తున్నాడు. 

ఆ అజ్ఞాత వ్యక్తి సాయం అనే పదానికి అద్భుతమైన అర్థం ఇచ్చాడు. అతను కాయకష్టం చేసుకునే రైతుల నుంచి చిలగడదుపంలు కొని జియాకు అందజేశాడు. అటు రైతులకు ఫలం అందింది. అలాగే జియా కూడా సులభంగా డబ్బు పొందితే విలువ తెలుసుకోలేడనే ఉద్దేశ్యంతో ఆ ఆజ్ఞాత వ్యక్తి ఇలా డబ్బుని కాకుండా ఆ చిలగడదుంపలనే అందించాడు. అంటే శ్రమతో కష్టపడి అమ్మి విరాళం పొందేలా చేసి..ఈ సాయంలో సాధారణ ప్రజలు కూడా భాగమయ్యేలా చేశాడు. 

అంతేగాదు కష్టకాలంలోని ఉన్న వ్యక్తికి ఎలాంటి అండదండ ఇవ్వొచ్చో అందరికి అవగతమయ్యేలా చేశాడు. దీంతో ఆ అజ్ఞాత వ్యక్తిని అంతా హ్యాట్సాప్‌ బ్రో అని నెటిజనులంతా ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. పైగా ఇది అలాంటి ఇలాంటి సహాయం కాదు..మాటల్లేవ్‌ అంతే అని కీర్తిస్తున్నారు కూడా.

(చదవండి: మురికి వాడలో పెరిగిన ఆ అబ్బాయ్‌ ..ఎన్నో జీవితాలను అద్భుతంగా మార్చాడు!)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement