వామ్మో ఇదేం విచిత్రం..జుట్టు ఆరోగ్యం కోసం ఆలయమా..?! | Mikami Shrine To Pray For A Hair Loss Cure | Sakshi
Sakshi News home page

వామ్మో ఇదేం విచిత్రం..జుట్టు ఆరోగ్యం కోసం ఆలయమా..?!

Jan 6 2026 11:48 AM | Updated on Jan 6 2026 1:41 PM

Mikami Shrine To Pray For A Hair Loss Cure

ప్రస్తుతం ఉన్న కాలుష్యం, ఉరుకుల పరుగుల జీవన విధానం వంటి కారణాలతో చాలామంది జుట్టు రాలు సమస్యను ఫేస్‌ చేస్తున్నారు. దానికి తోడు సరైన జీవనశైలి కూడా లేకపోవడంతో ఈ సమస్య ఇటీవల కాలంలో ఎక్కువగా ఉంది. ఇది అందరికీ తెలిసిందే కదా..! మళ్లా ఇదంతా ఎందుకనుకుంటున్నారా..?. ఏం లేదండి ఏకంగా జుట్టు ఆరోగ్యం కోసం ఆలయమే ఉంది ఆ దేశంలో. కురులు మంచి ఒత్తుగా, దృఢంగా ఉండాలంటే  ఆ ఆలయానికి వెళ్లి దేవుడిని దర్శిస్తే చాలట. అంతేకాదండోయ్‌ ఏటా వేలాది మంది ప్రజలు ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి తరలి వస్తుంటారట.

వినడానికి ఇది..ఇదేం విచిత్రం రా బాబు అనిపిస్తోంది కదూ..!. ఎక్కడైన జుట్లు రాలకుండా లేదా ఆరోగ్యం కోసం ఆలయం ఉంటుందా?..నమ్మశక్యంగా అనిపించడం లేదు కదా..!. అయితే వెంటనే జపాన్‌లోని క్యోటోలో ఉన్న మికామి పుణ్యక్షేత్రానికి వచ్చేయండి. ఇది జుట్టు కోసం అంకితం చేయబడిన ఆలయమట. జుట్టు పెరుగుదల, ఆరోగ్యం, జుట్టు రాలడం వంటి ఆందోళనలు నివారించుకోవాలనుకుంటే తక్షణమే ఈ ఆయానికి వెళ్లి ప్రార్థిస్తే చాలట. 

అంతేకాదు కొత్త హెయిర్‌ స్టైలిస్టులుగా బ్యూటీషియన్‌ రంగంలోకి అడుపెట్టే విద్యార్థులు సైతం ముందుగా ఈ ఆలయానికి వచ్చి ప్రార్థించాక..తమ కోర్సుని నేర్చుకుంటారట. అంతేకాదండోయ్‌ ఇక్కడ ప్రార్థన అత్యంత విచిత్రంగా ఉంటుంది. అక్కడ మసాయుకి ఫుజివారా అనే దేవుడు కొలువై ఉంటాడు. ముందుగా ఆ ఆలయానికి చేరుకునే మునుపే ఒక ప్రార్థన కవర్‌ని కొనుగోలు చేయాలట. 

అక్కడ ఆలయ పూజారులు మన జుట్టులో కొంత జుట్టుని కత్తిరించి ఆ కవర్‌లో వేస్తారట. ఆ తర్వాత మనం దాన్నితీసుకుని ఆ ఆలయంలో ఉన్న మసాయుకి ఫుజివారా దేవుడి వద్ద పెట్టి ప్రార్థించి అక్కడ ఉండే పూజారికి ఇవ్వాలట ఆ కవర్‌ని. అలా చేస్తే వారి జీవితంలో జుట్టుకి సంబంధించిన సమస్యలు రావు, పైగా ఒత్తుగా పెరుగుతుందనేది అక్కడి ప్రజల ప్రగాఢ నమ్మకం. అంతేకాదండోయ్‌ ఆ ఆలయం వెనుక ఓ ఆసక్తికర కథ కూడా ఉంది. అదేంటంటే..

ఓ క్షరకుడి నైపుణ్యానికి ప్రతీక..
మికామి మందిరం జపాన్‌లోని మొట్టమొదటి కౌరశాల అట. ఫుటివారా ఉనెమెనోసుకే మసాయుకి అనే క్షరకుడు తన వృత్తిని దైవంగా భావించి పనిచేసేవాడట. తన కుటుంబాన్ని పోషించుకునేందుకు ఎంతో అద్భుతంగా జుట్టుని కత్తిరించడం, స్టైలింగ్‌ చేయడం వంటివి చేశాడట. అలా తన జీవితం మొత్తం ఆ వృత్తికి అంకితం చేసి..మంచి పునాది వేశాడట. అంతలా ఆ రంగంలో తన నైపుణ్యాన్ని ప్రదర్శించందుకు గుర్తుగా అత్యున్నతంగా గౌరవించాలని అక్కడి ప్రజలు నిర్ణయించి.. ఇలా ఒక ఆలయాన్ని నిర్మించి పూజించుకుంటున్నారట. 

అంతేగాదు అతడి గౌరవార్థం చనిపోయిన 17వ తేదీన ప్రతినెల జపాన్‌ అంతటా క్షరకులు సెలూన్ల నిర్వాహకులు నివాళులర్పిస్తూ..దుకాణాలు కూడా మూసివేస్తారట. అలాగే ఈ ఆలయానికి వచ్చిన భక్తులకు ఆ మసాయుకి దేవుడిని ప్రార్థించాక.. జుట్టుకి సంబంధిత సమస్యలు తగ్గుముఖం పట్టడంతో..ఈ దేవాలయానికి మరింత పేరుప్రఖ్యాతలు వచ్చి.. జుట్టు ఆరోగ్యానికి సంబంధించిన ఆలయంగా స్థిరపడిందట. అంతేగాదు ఇక్కడకు పర్యాటకుల తాకిడి కూడా ఎక్కువగానే ఉంటుందట. 

 

(చదవండి: బ్రయాన్‌ జాన్సన్‌లా భారత్‌ యువకుడు..! ఏకంగా ఏడువేల..)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement