వృద్ధాప్యఛాయలు కనిపించకుండా ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశంతో కాలిఫోర్నియాకు చెందిన బ్రియాన్ జాన్సన్ అనే వ్యాపారవేత్త ఎన్ని కోట్లు ఖర్చుచేస్తున్నాడో తెలిసిందే. ఇప్పటి వరకు ఎన్నో చికిత్సలు, అనుక్షణం హెల్త్ ట్రాకింగ్‌లు, చుట్టూ వందలాది డాక్టర్లను మెయింటైన్ చేస్తూ వార్తల్లో నిలిచాడు. అదీగాక ఇటీవల త్వరలో వృద్ధాప్యాన్ని, చావుని జయిస్తానిని చాలా నమ్మకంగా ప్రకటించేశాడు కూడా.
ఇది ఎంత వరకు సాధ్యం అన్న సందేహాలు వెల్లువెత్తున్న తరుణంలో ఒక భారత యువకుడు తాను కూడా బ్రయన్ జాన్సన్‌లా కావాలనుకుంటున్నా అంటూ షాంకింగ్ ప్రకటన చేశాడు. ఆయన బాటలోనే నడుస్తున్నానంటూ..తప వ్యక్తిగత ఆరోగ్య ప్రయోగం గురించి పూసగుచ్చినట్లు వివరించి నోరెళ్లబెట్టేలా చేశాడు. యవ్వనంపై ఇంత వ్యామోహమా అని నెటిజన్లు ఆ యువకుడిని ఏకీపారేస్తున్నారు నెటిజన్లు..ఇంతకీ ఆ యువకుడి ఏవిధంగా తనపై ప్రయోగాలు చేసుకుంటున్నాడంటే..
బెంగళూరు సెడోనా హెల్త్ స్టార్టప్ వ్యవస్థాపకుడు 23 ఏళ్ల పునర్వ్ దినకర్ భారత్ బ్రయన్ జాన్సన్‌గా అవతరించాలని కోరుకుంటున్నా అని సోషల్ మీడియా ఎక్స్‌లో పేర్కొన్నాడు. అందులో భాగంగా తన వ్యక్తిగత ఆరోగ్య ప్రయోగాన్నికూడా మొదలు పెట్టేశానని, ప్రతీ అవయవం పనితీరుపై ఫోకస్ పెట్టేలా ట్రాక్ చేస్తున్నట్లు కూడా వెల్లడించాడు. అంతేకాదండోయ్ ఏకంగా ఇప్పటి వరకు ఏడు వేలకు పైగా రక్తపరీక్షలు కూడా చేయించుకున్నాడట.
ఆఖరికి నిద్ర, ఒత్తిడిని ట్రాక్ చేసేలా WHOOPని కొనుగోలు చేసాను - నా కార్యకలాపాలను ట్రాక్ చేయడానికి స్ట్రావా, నా కేలరీలను ట్రాక్ చేయడానికి Amy, ఈ పరీక్షలన్నింటిని ట్రాక్ చేసేలా Sedona వంటివి అన్నింటిని సెటప్ చేశానని చెబుతున్నాడు. పైగా తన ఆరోగ్యానికి సంబంధించి ప్రతి అణవణువు శోధించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. అయితే ఈ యువకుడి లక్ష్యం బ్రయాన్‌లా వృద్ధాప్యాన్ని తిప్పికొట్టడం కానే కాదట.
ఇతడి ఆశయం అత్యంత భిన్నగా ఉంది. బదులుగా డేటా ఆధారిత ఆప్టిమైజేషన్ ద్వారా జీవితాన్ని పూర్తి స్థాయిలో జీవించడం అనేది అతడి లక్ష్యమట. అలాగే ఇతరులు తన ఆరోగ్యం గురించి తెలసుకునేందుకు మొత్తం డేటాని బహిర్గతం చేసేలా డాక్యుమెంట్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాడట. తన శరీరంలో కొలిచే, ట్రాక్ చేసే, మెరుగుపరిచే ప్రతి విషయాన్ని డాక్యుమెంట్ చేస్తాను కాబట్టి ఇతరులు కూడా సులభంగా తనలా స్వచ్ఛందంగా ముందుకొచ్చేలా ప్రేరణగా ఉంటుదనేది అతడి అభిప్రాయం.
చావుని జయించి దీర్ఘాయువుతో ఉండాలనే దానిపై విపరీతంగా పెరుగుతున్న ఆసక్తి నేపథ్యంలో దినకర్ ప్రకటన రావడం విశేషం. కాగా, దీపిందర్ గోయల్(జోమాటో వ్యవస్థాపకుడు) వంటి ప్రముఖ వ్యక్తులు కూడా మెదడు రక్త ప్రవాహాన్ని ట్రాక్ చేయడానికి ధరించగలిగే కంటిన్యూ', 'టెంపుల్' వంటి ప్రాజెక్టులతో ఈ రంగంలోకి అడుగుపెట్టారు.
అయితే నెటిజన్లు దినకర్ ఇంత చిన్న వయసులోనే ఇలాంటి ప్రయోగాలకు సిద్ధమవ్వడానికి ప్రశంసించినప్పటికీ..ఇలా నిరంతరం ఆరోగ్యాన్ని ట్రాక్ చేస్తే..చిన్న చిన్ని వాటికి ఆందోళన చెందే పరిస్థితికి దారితీస్తుందనేది వారి వాదన. పైగా దీని కారణంగా ఒత్తిడి బారినపడే ప్రమాదం కామెంట్ చేస్తూ పోస్టుల పెట్టారు. అంతేగాదు బ్రో ఎవ్వరూ జీవితాన్నిపూర్తి స్థాయిలో ఆస్వాదించలేరనేది జగమెరిగిన సత్యం అంటూ పోస్టులు పెట్టారు.
To everyone reading this,
Hi, I'm Punarv.
I'm 23 and starting today, I will be the Bryan Johnson of India.
- Got a blood test done worth 7k covering all the imp biomarkers
- Bought a WHOOP last month to track sleep, strain and recovery
- Strava to track my activities, Amy to… pic.twitter.com/h8079K5LHW— punarv (@ycocerious) January 5, 2026
(చదవండి: తండ్రికి చదువు లేదు, తల్లి సూట్లు కుట్టేది....కానీ కూతురు ఐపీఎస్..!)


