breaking news
dinakar
-
బంగారు బుల్లోడు
పేద కుటుంబం..తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రం..సర్కార్ బడిలోనే చదివాడు. అందుబాటులోని అవకాశాలనే అందిపుచ్చుకున్నాడు. చదువుతోపాటు క్రీడల్లోనూ రాణిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. బేస్‌బాల్, లాంగ్‌జంప్, ట్రిపుల్‌జంప్, జావెలింగ్‌త్రో, పరుగుపందెం పోటీల్లో ప్రతిభా పాటవాలు ప్రదర్శించి రాష్ట్ర, జాతీయస్థాయిలో పతకాల మోత మోగిస్తున్నాడు. ఈ కుర్రాడే వెదురుకుప్పం మండలం బొమ్మసముద్రం దినకర్. ఆయన విజయబాటను మనమూ చూసొద్దాం.. అడుగుపెడితే స్వర్ణ పతకమే... అథ్లెటిక్స్‌లో రాటుదేలిన దినకర్ తొమ్మిదో తరగతి నుంచే బంగారు పతకాలు సాధిస్తూ వచ్చాడు. ఎక్కడ ఏ మైదానంలో అడుగుపెట్టినా తన సత్తా చూపించి తనేంటో నిరూపిస్తూ ఓప్రత్యేకతను చాటుకున్నాడు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతూ వివిధ రకాల క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభను కనబరుస్తూ పతకాల పంట పండిస్తున్నాడు. రూర్కెలా ఎన్ఐటీ డైరెక్టర్ సంగల్ నుంచి బంగారు పతకం అందుకుంటున్న దినకర్ క్రీడలపై మక్కువ పెంచుకుని గ్రామీణ స్థాయి నుంచి జాతీయ స్థాయిలో అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొని తన సత్తా ఏంటో నిరూస్తున్నాడు వెదురుకుప్పం మండలం నల్లవెంగనపల్లె గ్రామానికి చెందిన బొమ్మసముద్రం శివాజీ, పుష్ప దంపతుల కుమారుడు దినకర్(23). శివాజీకి దినకర్, దయాకర్ కుమారులు. శివాజీ గోపాలమిత్ర సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. పుష్ప కూలీ పనులు చేస్తోంది. పేదరికంలో ఉన్నా పిల్లలను ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనే తపన వారికి ఉండేది. పెద్ద కొడుకు దినకర్ 5వ తరగతి వరకు అదే గ్రామంలో విద్యనభ్యసించాడు. ఆతరువాత 2005లో నవోదయ ప్రవేశ పరీక్ష రాయడంతో అర్హత సాధించి మదనపల్లెలో ఆరవ తరగతిలో చేరాడు. చదువుతో పాటు క్రీడల పట్ల ఆసక్తి ఉండేది. ప్రధానంగా బేస్‌బాల్‌పై మక్కువ చూపేవాడు. 6,7 తరగతులు చదివే రోజుల్లో బేస్‌బాల్‌తోపాటు అన్ని క్రీడల్లో పట్టుసాధించి ప్రతిభను కనపరిచేవాడు. పాఠశాల స్థాయిలో జరిగిన గేమ్స్‌లో ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించి ప్రసంశలు పొందేవాడు. ఆత్మస్థైర్యమే అండ.. దినకర్ క్రీడల్లో చూపుతున్న ప్రతిభను ఫిజికల్ డైరెక్టర్ సురేంద్రరెడ్డి గుర్తించారు. ‘బేస్‌బాల్ ఆటేకాదు..నువ్వు అథ్లెటిక్స్ పోటీలకు వెళ్లాలి.. బాగా రాణిస్తావు..నీలో ఆత్మసైర్థ్యం ఉంది..నేను అండగా ఉంటా’ అని వెన్నుతట్టాడు. పీడీ ప్రోత్సాహంతో లాంగ్‌జంప్, ట్రిపుల్‌జంప్, జావెలింగ్‌త్రో, పరుగుపందెం క్రీడల్లో శిక్షణ పొందాడు. పీడీ చెప్పిన మెలకువలు, సూచనలను వంటబట్టించుకున్న దినకర్ అథ్లెటిక్స్‌పై పట్టుబిగించాడు. ఒక పక్క చదువులో రాణిస్తూ క్రీడల్లో కూడా తన ప్రతిభా పాటవాలను ప్రదర్శిస్తూ వచ్చాడు. గ్రామీణ, మండల, జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొని తన సత్తాను చాటాడు. ఈక్రమంలో మొట్టమొదటిసారి కర్ణాటకలో జరిగిన రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొని విఫలమై వెనుదిరిగాడు. అయినా మొక్కవోని పట్టుదల, ఆత్మవిశ్వాసంతో పూర్తి స్థాయిలో క్రీడా విద్యలో ఆరితేరాడు. పతకాల పంట ♦ 2008లో కర్ణాటకలో జరిగిన అథ్లెటిక్స్ లాంగ్‌జంప్‌లో ప్రథమస్థానంలో నిలిచి బంగారు పతకం ♦ 2009లో కర్నూలు నవోదయ విద్యాలయలో జరిగిన రాష్ట్ర స్థాయి పరుగు పందెం(100మీటర్లు)లో ప్రథమస్థానం, పరుగుపందెం (200మీటర్లు)లో ద్వితీయ స్థానం ♦ 2010లో ఢిల్లీలో జరిగిన ఆల్ఇండియా జావెలిన్ త్రో పోటీలో ప్రథమ బహుమతి. ♦ ఇంటర్‌గేమ్స్‌లో ప్రథమ స్థానం సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక జాతీయ స్థాయిలో ♦ 2012లో జార్ఖండ్‌లో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో ట్రిపుల్ జంప్‌లో ప్రథమ స్థానం సాధించి బంగారు పతకం ♦ 2014లో ఒడిస్సాలో జరిగిన ఆల్ ఇండియా ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్ పోటీల్లో లాంగ్ జంప్‌లో గోల్డ్‌మెడల్ ♦ 2015లో ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఇంటర్ కాలేజ్ పోటీల్లో ట్రిపుల్ జంప్‌లో ద్వితీయ స్థానం సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్నా మానసిక ప్రశాంతతకు క్రీడలు చాలా అవసరం. ఆరోగ్యం..శారీరక దారుఢ్యం క్రీడలతోనే సాధ్యం. ఆటల వల్ల అనేక రుగ్మతల నుంచి దూరం కావచ్చు. మెదడు చురుకుగా పనిచేస్తుంది. దీంతో మంచి ఆలోచనలు వస్తాయి. ఐఏఎస్, ఐపీఎస్ కావాలన్నదే నా కోరిక. సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్నా. ఉన్నత స్థానానికి ఎదిగితే గ్రామీణ స్థాయి నుంచి క్రీడాకారులను పోత్సహించేందుకు కృషి చేస్తా. జాతీయ స్థాయి క్రీడాకారుడిగా గుర్తింపు వచ్చేందుకు నా వెన్నంటి ఉండి ప్రోత్సహించిన పీడీ సురేంద్రరెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు. – దినకర్, అథ్లెటిక్స్ క్రీడాకారుడు -
ఆకు రాలు కాలం !
-
ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయుడిపై దాడి
హిందూపురం అర్బన్ : ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయుడిపై బుధవారం నలుగురు వ్యక్తులు దాడిచేశారు. బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయుడు దినకర్(30) ఇదే పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న యువతితో ప్రేమ వ్యవహారం కొనసాగించాడు. ఇటీవల ఆమెకు పెళ్లి నిశ్చయమైంది. అయినా దినకర్ వెంట పడుతున్నాడని అమ్మాయి కుటుంబ సభ్యులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో బుధవారం దినకర్ బైపాస్‌రోడ్డులో ఉండగా నలుగురు వ్యక్తులు కారులో వచ్చి బలవంతంగా వాహనంలోకి ఎక్కించుకుని పట్టణ శివారుల్లోకి తీసుకెళ్లి దాడి చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. -
తర్పణ
కథ ‘‘హృదయ విదారకమైన దుర్ఘటన! నిశ్చేష్టుడయ్యాడు! కానిదెవరు చెప్పు. కాలేదు అంటే మనసు లేనట్లే! మనిషి కానట్లే! వాడే కోలుకుంటాడు. మృత ప్రాణాల్ని విద్యావస్తువులుగా చూసినవాడు. యింకో రెండేళ్లలో డాక్టర్ దినకర్ అవుతాడు. నీ ఆలోచనకు దూరమైన దాన్నేదో చిత్రించుకుని కలవరపడకు.’’ సుమరశ్మి మనసులో ప్రశాంతత చేకూరడానికి ముందుగా ఆ మాటలు అన్నాడు భర్త భేషజంతో ఉదయార్క. ‘‘కాలేజీకి వెళ్లడం లేదు. ముఖంలో తేజస్సు మారింది. పరిస్థితి చేయి దాటకుండా చూడండి. మీ తెలివితో నా నోరు ఇప్పుడు మాత్రం మూసేయకండి’’ వేదనలో కూడా భర్త నైజానికి ఓ చురక వేసి, ఉపశమనంగా భర్త భుజాన్ని తలతో నిమిరింది సుమరశ్మి. భార్య పరిశీలనే తనూ గమనించాడు కొడుకులో. సంగతేంటని కొడుకునే అడగొచ్చు. కొడుకుతో స్నేహితుడిలా మాట్లాడిన సందర్భాలున్నాయి. పూర్తి స్నేహ వాతావరణానికి మానసిక అసౌకర్యం తావివ్వలేదు. దినకర్ కూడా గీతదాటి చనువు తీసుకోలేదు. జనన సున్నితత్వాలను ఇద్దరూ గౌరవించారు, సహజ ప్రేమ పలచబడకుండా. ఆలోచన, ఆచరణ, లక్ష్యంపై దృష్టి వంటి అంశాల్లో దినకర్ ఓ సంపూర్ణతకు చేరాడనే తృప్తి తనకు ఎప్పుడో కలిగింది, జన్మనిచ్చినందుకు సాఫల్యతగా! ‘‘అదీగాక వాడి మనసుకేమన్నా గాయమైందా?’’ ఆలోచన ఆపి అన్నాడు. ‘‘అవకాశం లేదండీ. తీర్థ విషయంలో వాడి ఇష్టాన్నే సమ్మతించాం. తీర్థ తండ్రి మనల్ని అవమానించిన సంఘటనని మీరే చిరునవ్వుతో తుడి చేశారు...’’ ఓ పద్ధతిలో మాట్లాడుతున్నానో లేదో అని క్షణ మౌనాన్ని ఆశ్రయించింది సుమరశ్మి. ‘‘అప్పుడు కుంభకోణం బడి మంటల్లో చిన్నపిల్లలు బూడిదయ్యారని కన్నీళ్లు పెట్టుకున్నాడు. వాడి కళ్లు వాడే తుడుచుకున్నాడు. చదువుపై ఏకాగ్రతను సడలనివ్వలేదు. అంతకుముందు, ఆ తర్వాత! ఎన్ని ఘోరాలు వినలేదు మనం, ఏవో ఎక్కడో జరిగాయి అని ఎప్పుడూ అనుకోలేదు. వాడి అనుభవంలో వాడే ఎన్నో చూశాడు. నీ అభిమాన నటి సౌందర్య జీవితం అలా ముగిసిపోయినప్పుడు వాడే కదా నిన్ను ఓదార్చింది. అంతగా మనసెదిగినవాడు ఈ విషాదానికి అంత తీవ్రమైన ఉద్వేగానికి ఎందుకు లోనయ్యాడో అర్థం కావట్లేదు. అవునూ, వాడి గురించి స్నేహితులేమంటున్నారు...’’ శూన్యంలో దినకర్ స్నేహితుల పలకరింపులు ఊహిస్తూ ఆగిపోయాడు ఉదయార్క. స్నేహం మాట వచ్చేసరికి - ‘‘అదే! ఓ విధంగా ఆ జలహంతకితో చేయి కలిపిందేమోనండి. చావు పరుగులెత్తుతూ మీద పడబోతున్నా వాళ్లకు చూపు లేకుండా చేసింది, స్నేహం ఇచ్చిన మూర్ఖ ధైర్యం, ఆ క్షణంలో! దానికి ముందు, బస్సులో ఆ స్నేహం ఆనందాల్ని చూడండి, ఆ పాటల్ని చూడండి, ఆ కేరింతల్ని చూడండి’’ అంటూ సెల్లులో వీడియో నొక్కింది. పెల్లుబికి వస్తున్న కన్నీళ్లను అసంకల్పితంగా కూడా ఆపడానికి ప్రయత్నించకుండా, సంస్కారానికి రవంత కూడా మచ్చ పడకుండా - తనే తట్టుకోలేకపోతున్నది... ఆ కన్నతల్లులు, తండ్రులు ఎలా ఉన్నారో అని తలుచుకుని విలపిస్తూ. ఉచ్ఛ్వాస, నిశ్వాసలతో తప్ప శరీరంలో ఏ కదలికలు లేని మానసిక స్థితిలో ఉన్నట్లుగా ఉన్నాడు దినకర్. స్నేహితులొచ్చి బయటికి తీసుకెళ్లారు. వాళ్లూ కాబోయే డాక్టర్లే. ఏ విషయాన్ని ప్రస్తావించినా నిస్పందనగా ఉన్నాడు. దినకర్ మనసుని మాటగా మార్చడానికి వాళ్లు మాటలు వెతుకుతున్నారు. దినకర్ కోసం వస్తున్న తీర్థ దార్లో వాళ్లని చూసి కారాపింది. తీర్థ పలకరించినప్పుడు దినకర్ని నిశితంగా చూశారు స్నేహితులు. దినకర్ ప్రవర్తనపై తమకు సరైన అవగాహన కలగాలనే ఉద్దేశంతో. ‘‘తీర్థా! వాడికి జన జీవన వేగాన్ని చూపించి నోరు పెగిలేట్లు చేయి. మనిషికీ జంతువుకీ మాటే తేడా అన్నారు. మాట పోతే వీడేమవుతాడో. ఆరిజిన్ ఆఫ్ స్పీసిస్ని వెనక్కు తిప్పి రాయాల్సి వస్తుందేమో’’ అన్నాడో స్నేహితుడు నవ్వుతూ, నవ్వుని ఆశిస్తూ. తీర్థ కూడా నవ్వింది. దినకర్ ముఖంలో ఏ కణమూ చలించలేదు. లిప్తపాటు కలవరపడింది తీర్థ. తీర్థ పక్కన దినకర్ని ఓ బొమ్మలా కూర్చోబెట్టారు స్నేహితులు. సముద్రపు ఒడ్డు. అంతా అణుమయమని సందేశాన్నిస్తున్నది సైకతం! వెన్నెల వెలుగులలో మెరిసిపోతూ ఎగిసిపడుతున్న అలల్ని చూస్తున్నారు. ‘‘మూడు వంతుల నీళ్లతో గుండ్రంగా అనంత విశ్వ శూన్యంలో భూమి ఎలా ఉంటున్నదో ఇప్పటికే నాకు అంతుపట్టని అద్భుతమే దినకర్’’ అంది తీర్థ. సముద్రపు హోరులో కూడా నిశ్శబ్దాన్ని చూస్తూ నిశ్శబ్దాన్ని వినిపిస్తున్నట్లు ఉన్నాడు దినకర్. ‘‘దినకర్! నీ ప్రేమ నీడలో నడుస్తున్నాను నేను. బతుకుతున్నాను నేను. ఏమైంది నీకు. దినకర్! విజ్ఞత ఉన్నచోటే పరిస్థితి ఇలా ఉంటే లేని చోట మాటేంటి?’’ ‘‘..................’’ ‘‘నీవిలా అయ్యావంటే ఎవరూ నమ్మట్లేదు. నమ్మాల్సివస్తే మిగిలేది నవ్వే. నవ్వుల పాలవుతావు దినకర్.’’ ‘‘..................’’ ‘‘నీ సంగతి చెబితే మా నాన్న ఏమన్నాడో తెలుసా? ఇంత సున్నితమైన మనసున్నవాడు రేపు కార్పొరేట్ ఆసుపత్రిలో ఏం పని చేస్తాడో అని!’’ ‘‘..................’’ ‘‘అది డబ్బెక్కువై మనసు రాయైన మనిషి మాటనుకో!’’ ‘‘..................’’ ‘‘ఇటువంటి సంఘటనల్లో నువు రోజంతా మౌనంగా, నిరాహారంగా ఆత్మల శాంతి కోరేవాడివి. ఇప్పుడూ అదే అనుకున్నా, కానీ ఇదేంటి?’’ ‘‘..................’’ ‘‘మానవాళి గుండె కన్నీటితో తడిసింది! అరెరే! పూర్ణ, ఆనంద్‌లు సాక్షాత్కరించిన విజయానందాన్ని సంపూర్ణంగా ఆస్వాదించకుండానే తెలుగు కంటిలో శోకధారలు! ఆ కంట ఆ నీరు, ఈ కంట ఈ నీరు, ముక్కంటి హిమాచల ప్రదేశంలోనే! తన నెత్తిమీద కాలు పెట్టారన్న కోపం అనుకోడానికి వీల్లేదు, తనే భుజం మీదకి ఎత్తుకున్నాడు! మరి ఇదేంటో, శివ లయ లీల!’’ ‘‘..................’’ ‘‘మారణ హోమంలో మనిషి దేవుడితో పోటీ పడుతున్నాడు, యుగాలుగా. అది నీవన్న మాటే!’’ ‘‘..................’’ ‘‘ఈ వీడియో మా ప్రత్యేకం అంటూ ఆయిల్ మార్కులు వేసుకుంటున్నారు కొందరు, అదేంటో. ఏ గుర్తింపు కోసమో!’’ ‘‘..................’’ ‘‘ప్రకృతి విలయాలు, జల ప్రళయాలు, అగ్ని ప్రమాదాలు, తుఫాను బీభత్సాలు... ఎన్నో. ఎన్నో. మనిషి జీవితం ఎంత అల్పమో చెబుతున్నా అహంభావాలు, అహంకారాలు, స్వార్థ చింతనలు సమసిపోవడం లేదు.’’ ‘‘..................’’ ‘‘బియాస్ నదీ తీరంలో సుందర దృశ్యాలు మనమెంతో ఆస్వాదించాం, ఆనందించాం. గులకరాళ్లను పలకరిస్తూ, పరవళ్లు తొక్కే ఆ నీళ్లలో మనం ఆడుకున్నాం. ఆ నీళ్లు చల్లుకున్నాం.’’ ‘‘..................’’ ‘‘ఆల్బర్ట్ స్కీవిట్జర్ డాక్టర్ వృత్తిని త్యాగం చేసి ఫిలాసఫర్ అయ్యాడు అంటుంటావు. ఒకవేళ నువ్విలా అయినా నేను నీ దాన్నే దినకర్!’’ ‘‘..................’’ ఓడిపోతున్నానేమో అని భయం కలిగింది తీర్థ మనసులో! గెలుపు ఓటములేంటి! దినకర్ని కాపాడుకోవాలి! కాపాడుకోవడమేంటి నా పిచ్చిగాని, తనకు తనే సమన్వయ పడింది, రేపు ఇలాగే ఎందుకుంటుంది అన్న ఆలోచనతో. అంతులేని కాలగమనంలో రేపు అనే ఆశతో కోట్లాది హృదయాలు కాలం గడుపుతున్నాయి. దినకర్‌కి ఇష్టమైన ఓ పుస్తకాన్ని గుర్తు చేయాలనుకుంది. ‘‘బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్ - తెలుగులో వచ్చింది చూశావా?’’ ‘‘..................’’ ‘‘సరే! సమయానికి మించి ఉండలేం కదా, వెళ్దాం’’ అంటూ లేచింది. దినకర్ కూడా లేచి నించున్నాడు. దినకర్ వీపు మీద ఇసుకను దులిపింది. కారులో కూర్చోబోతుంటే - ‘‘ఇంకా శవాల కోసం గాలిస్తూనే ఉన్నారట!’’ పక్కనే వెళ్లే ఎవరో మాటలు వినిపించాయి. కారు కదిలింది. ‘‘ఆ పిల్లలకు అమ్మా, నాన్నలు ఉన్నారు అనే విషయం గుర్తుండుంటే ఇంతటి ఘోరం జరిగి ఉండేది కాదేమో దినకర్’’ అంది, అప్పటికప్పుడు అనిపించిన భావంగా. ఏకీభావంగా ఔనంటున్న ముఖ ప్రకటనను ప్రస్ఫుటంగా చూసింది దినకర్ కదలికలో! ఆ కదలికతో తీర్థ మనసు కుదుటపడింది. *** ఈసారి దినకర్ పుట్టినరోజు ఎప్పటిలా జరిగేట్లు లేదు. అదే మాట స్నేహితులతో చెప్పి ఇంటికి వచ్చింది తీర్థ. టీవీ పెట్టే ఉంది. ఎవరూ చూడటం లేదు, చూసి తట్టుకోలేక! గ్యాస్ లీక్ ప్రమాదం! మంటలలో అంటుకుపోయిన తల్లీ పిల్ల! బూడిదైన దేహాలు! బొగ్గయిన కొబ్బరి తోటలు!... నీరలా..! నిప్పిలా..! విషాదాలు విషాదాల్లో కొట్టుకుపోవాల్సిందేనా! కన్నీళ్లెండిన కళ్లను - పంచభూతాలు పగబట్టి ఒక్కటై ఒకేసారి విరుచుకుపడినా ఏం చేస్తాయిలే... ‘‘అమ్మా...!!!’’