ప్రైవేట్‌ పాఠశాల ఉపాధ్యాయుడిపై దాడి | attacks on private teacher | Sakshi
Sakshi News home page

ప్రైవేట్‌ పాఠశాల ఉపాధ్యాయుడిపై దాడి

Jan 18 2017 11:28 PM | Updated on Sep 5 2017 1:32 AM

ప్రైవేట్‌ పాఠశాల ఉపాధ్యాయుడిపై బుధవారం నలుగురు వ్యక్తులు దాడిచేశారు.

హిందూపురం అర్బన్‌ : ప్రైవేట్‌ పాఠశాల ఉపాధ్యాయుడిపై బుధవారం నలుగురు వ్యక్తులు దాడిచేశారు. బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని ఓ ప్రైవేట్‌ పాఠశాల ఉపాధ్యాయుడు దినకర్‌(30) ఇదే పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న యువతితో ప్రేమ వ్యవహారం కొనసాగించాడు. ఇటీవల ఆమెకు పెళ్లి నిశ్చయమైంది.

అయినా దినకర్‌ వెంట పడుతున్నాడని అమ్మాయి కుటుంబ సభ్యులు హెచ్చరించారు.  ఈ నేపథ్యంలో బుధవారం దినకర్‌ బైపాస్‌రోడ్డులో ఉండగా నలుగురు వ్యక్తులు కారులో వచ్చి బలవంతంగా వాహనంలోకి ఎక్కించుకుని పట్టణ శివారుల్లోకి తీసుకెళ్లి దాడి చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement