కుటుంబ నేపథ్యం ఆర్థిక సమస్యలకు నిలయం. ఆ నేపథ్యం నుంచి చదువుపై మనసు లగ్నం చేయడం గ్రేట్ అంటే..అందులోనూ..ఏకంగా సివిల్ లాంటి ప్రతిష్టాత్మకమైన ఎగ్జామ్‌పై గురిపెట్టడం అంటే మాటలు కాదు. అయినా..ఆ అనితరసాధ్యమైన ఆ పరీక్షను ఎలగైనా గెలవాలన్నదే ఆమె ధ్యేయం. అదొక్కటి అజేయంగా ఎదురునిలబడేలా చేసి..గెలుపుని పాదాక్రాంతం చేసుకుని స్ఫూర్తిగా నిలిచారామె. అంతటితో ఆగలేదు..విధుల పరంగానూ వార్తల్లో నిలిస్తూ..అధికారి అంటే ఇలా ఉండాలి అని ప్రశంసలు సైతం అందుకుని పేరు తెచ్చుకున్నారు. అంతేగాదు ఆమె అందంలోనూ మేటీ. అంతా ఆమెనూ మేథస్సుతో కూడిన అందాల రాశిగా పిలుచుకుంటారు. ఎవరామె..? అంటే..
ఆ అందాల సరస్వతే అను బెనివాల్. ఢిల్లీలోని పితాంపురా ప్రాంతంలో ఏప్రిల్ 26, 1992న జన్మించిన అను బెనివాల్ కుటుంబం అత్యంత పేదరికంతో అల్లాడుతూ ఉండేది. తండ్రి సంజయ్ కుమార్ ఓ చిన్న బటన్ తయారీ యూనిట్‌ని నడిపేవాడు, తల్లి కుటుంబ పోషణ కోసం తనవంతుగా సూట్లు కుట్టేది. అయితే తండ్రి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా అంతగా చదువుకోలేదు. అయినా తన పిల్లలు బాగా చదువుకోవాలని ఆరాటపడేవాడు. అతడి ఆశయానికి అనుగుణంగానే ఇద్దరు పిల్లలు చదువులో బాగా రాణించారు.
అంతేగాదు ఆమె యూపీఎస్‌సీకి సన్నద్ధమైన తరుణంలో ఆమె తల్లిదండ్రులిద్దరూ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. తండ్రి గుండె జబ్బు వినికిడి లోపంతో బాధపడుతుంటే..ఆమె తల్లి, నాడీ సంబంధిత రోగి, రెండు శస్త్రచికిత్సలు కూడా చేయించుకుందామె. ఇన్ని సవాళ్లు ఇంట్లో ఉన్నా చదువులో ఎప్పుడూ రాజీపడలేదు.. అను.
ఇక ఆమె సోదరుడు ఢిల్లీలో ఐఐటీ ఇంజనీరింగ్ వైపుకి వెళ్లగా, అను ఢిల్లీలోనే పాఠశాల విద్య, BSc డిగ్రీ, ఎమ్మెస్సీ పూర్తి చేసింది. కొన్నాళ్లు నానోసైన్స్ పరిశోధన రంగంలో పనిచేసింది. తన విద్యా, పరిశోధన పని పూర్తి చేసిన తర్వాత సివిల్ సర్వీసెస్ పరీక్షపై దృష్టి సారించి.. భౌగోళిక శాస్త్రాన్ని ఆప్షనల్ సబ్జెక్టుగా ఎంచుకుంది.
సివిల్ ఎగ్జామ్‌లో అను జర్నీ..
అను 2018లో తొలిసారి సివిల్ సర్వీసెస్ పరీక్షకు హాజరైంది కానీ ప్రాథమిక దశలోనే ఉత్తీర్ణురాలైంది. ఇక రెండో ప్రయత్నంలో మెయిన్స్‌కు చేరినా.. తుది జాబితాలో చోటు దక్కించుకోలేకపోయింది. అయితే అను పట్టుదటతో మూడో ప్రయత్నంలో ఆల్ ఇండియా ర్యాంక్ 638 ర్యాంక్ సాధించినా..అనుకున్న రంగంలో విధులు నిర్వర్తించే అకాశం రాకపోవడంతో మరోసారి సివిల్స్ ఎగ్జామ్‌కి సన్నద్ధమై మరి నాల్గోప్రయత్నంలో 2022లో 217 ఆల్ ఇండియా ర్యాంక్‌ను సాధించి.. ఇండియన్ పోలీస్ సర్వీస్(ఐపీఎస్)కు ఎంపికైంది.
అలా ఆమె మధ్యప్రదేశ్ కేడర్‌లో ఐపీఎస్ అధికారిణిగా విధులు నిర్వర్తించేవారామె. అంతేగాదు ఆమె ఇటీవల మధ్యప్రదేశ్‌లో గాల్వియర్‌లో వాహన తనిఖీల నిమిత్తం ఓ అనూహ్య ఘటనతో వార్తల్లో నిలిచి ప్రజల దృష్టిని అమితంగా ఆకర్షించారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవ్వడంతో దటీజ ఐపీఎస్ అను అంటూ అంత కీర్తించారు ఆమెను. ఆ వీడియోలో ఒక డ్రైవర్‌తో మీ మామ రాష్ట్రపతి అయిన చలానా జారీచేస్తాం అని చెప్పిన డెలాగ్ శెభాష్ మేడమ్ అంటూ సలాం కొట్టారు ఆమెకు. పాలనలో తనకు సాటిలేరెవ్వరూ అనిపించుకుంది ఐపీఎస్ అను బెనివాల్.
వ్యక్తిగత జీవితం..
ఇక ఈ అధికారిణి అను మధ్యప్రదేశ్ కేడర్‌లో పనిచేస్తున్న IPS అధికారి డాక్టర్ ఆయుష్ జఖర్‌ను వివాహం చేసుకున్నారు. ఇక ఆమె భర్త రిటైర్డ్ ఐపీఎస్ అధికారి దిలీప్ జఖర్ కుమారుడు. ఇక అను సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటూ..నెటిజన్లతో పిట్‌నెస్‌కి సంబంధించిన టిప్స్ షేర్స్ చేస్తుంటుంటారామె.
(చదవండి: జస్ట్ రెండేళ్లకే ఏడాదికి రూ. 12 లక్షల నుంచి రూ. 24 లక్షల అధిక వేతనం..! కానీ..)


