‘బాయిలోనే బల్లి పలికే’ సాంగ్ నెట్టింట ట్రెండింగ్లో ఉంది. జానపద ప్రముఖ సింగర్ మంగ్లీ (Mangli) పాడిన ఈ కొత్త పాట యూట్యూబ్లో ఇప్పటికీ టాప్-3లో కొనసాగుతుంది. అయితే, సోషల్మీడియాలో మంగ్లీపై విమర్శలు వస్తున్నాయి. మరాఠీ నుంచి ఈ సాంగ్ను కాపీ కొట్టారంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అయితే, అసలు విషయం మరోలా ఉంది. మరాఠీకి చెందిన సింగర్స్ యతిన్ వధన్, కాజల్ రావత్యనే మంగ్లీ సాంగ్ను కాపీ కొట్టారు. ఇదే విషయాన్ని వారు చెబుతూ ఒక వీడియో పోస్ట్ చేశారు. ఆపై వారు విడుదల చేసిన యూట్యూబ్ ఛానల్లో కూడా మంగ్లీ అనుమతితో ఈ సాంగ్ను తీసుకున్నట్లు క్రెడిట్ కూడా ఇచ్చారు. అయితే, అసలు విషయం తెలియని కొందరు సింగర్ మంగ్లీపై విమర్శలు చేయడం విశేషం.
‘బాయిలోనే బల్లిపలికే’ పాటను రాసింది జగిత్యాల జిల్లాకు చెందిన పోలీస్ కానిస్టేబుల్ కమల్ ఇస్లావత్.. ఆయన సొంత గ్రామం మల్లాపూర్ మండలం వీవీరావుపేట.. 2009లో కానిస్టేబుల్ ఉద్యోగం సాధించి కమల్ ఇస్లావత్.. పోలీస్ కళాబృందంలో ప్రజలను చైతన్య పరిచేందుకు చాలా ప్రదర్శనలు ఇచ్చారు. సుమారు వెయ్యికిపైగా కళా ప్రదర్శనలు ఇచ్చి రికార్డ్ క్రియేట్ చేశారు. ఇప్పటివరకు సుమారు 80 పాటలకుపైగానే లిరిక్స్ అందించారు.


